Sri Devi Bagavatham-2    Chapters   

అథా ష్టాదశో7ధ్యాయః.

శ్రీనారాద ఉవాచ : పూజావిశేషం శ్రీదేవ్యాః శ్రోతు మిచ్చామిమానద | యేనా శ్రితేన మనుజః కృతకృత్యత్వ మావహేత్‌. 1

శ్రీనారాయణ ఉవాచః దేవర్షే శృణు వక్ష్యామి శ్రీమాతుః పూజన క్రమమ్‌ |

భుక్తి ముక్తి ప్రద్‌ సాక్షా త్సమస్తాన్నివారణమ్‌. 2

ఆచమ్య మౌనీ సంకల్ప్య భూతశుద్ధ్యాదికం చరేత్‌ |

మాతృకాన్యాసపూర్వం తు షడంగన్యాసమాచరేత్‌. 3

శంఖస్య స్థాపనం కృత్వా సామాన్యార్ఘ్యం విధాయ చ | పూజాద్రవ్యాణి చాస్త్రణ ప్రోక్షయే న్మతిమాన్నరః. 4

గురోరనుజ్ఞా మాదాయతతః పూజాం సమారభేత్‌ | పీఠపూజాం పూరా కృత్వా దేవీం ధ్యాయే త్తతః పరమ్‌. 5

ఆసనాద్యుపచారై శ్చ భక్తి ప్రేమయతైః సదా | స్వాపయేత్పర దేవీం తాం పంచామృతరసాదిభిః. 6

పౌండ్రేక్షురసపూర్ణైస్తు కలశైః శతసంఖ్యకైః | స్వాపయేద్యో మహేశానీం న స భూయో7భిజాయతే. 7

యశ్చ చూతరసై రేవం స్వా పయేజ్జగదంబికామ్‌ | వేచపారాయణం కృతా రసేనేక్షూద్బవేనవా. 8

తద్గేహం న త్యజే న్నిత్యం రమా చైవ సరస్వతీ | యస్తు ద్రాక్షరాసేనైవ వేదపారాయణం చరన్‌. 9

అభిషించే న్మహేశానీం సకుటుంబో నరోత్తమః | రసరేణు ప్రమాణంచ దేవీలోకే మహీయతే. 10

కర్పూరాగురు కాశ్మీర కస్తూరీ పంకపంకిలైః | సలిలైః స్నాపయే ద్దేవీం వేదపారాయణం చరన్‌. 11

భస్మీభవంతి పాపానీ శతజన్మార్జితామి చ | యే దుగ్దకలశైర్దేవీం స్నాపయే ద్వేదపాఠతః. 12

పదునెనమిమిదవ అధ్యాయము

శ్రీదేవీ పూజా విశేష నిరూపణము

శ్రీనారదు డిట్లనియెను : మహాత్మా! ఏ పూజా విశేషము నాశ్రయించి నరుడు ధన్యజీవు డగునో యట్టి శ్రీదేవీ పూజా విశేషముల వినవేడు కగుచున్నది. శ్రీనారాయణు డిట్టు లనియెను: దేవఋషీ! తెలుపుచున్నాను సావధానముగ వినుము. శ్రీదేవీ పూజా విశేషము భుక్తిముక్తిప్రదము. ఎల్ల యాపదలు పాపును. మొదట మౌనముగ నాచమనము చేసి సంకల్పము చేయవలయును. తర్వాత భూతశుద్ధి - మాతృకాన్యాసము - అంగన్యాసము చేయవలయును. శంఖమును స్థాపించి సామాన్యార్ఘ్య మొసంగి హ్రీం - హ్రూం - ఫట్‌ అను మంత్రములతో పూజా ద్రవ్యములను ప్రోక్షించవలయును. పిదప గురు నాజ్ఞతో పూజ ప్రారంభించవలయును. తొలుత పీఠపూజ చేసి తర్వాత శ్రీదేవిని ధ్యానించవలయును. శ్రీదేవికి శ్రద్దా భక్తులతో ఆసనాద్యుపచారములు సమర్పించవలయును. పరదేవతకు పంచామృతములతో స్నాన మొనరించవలయును మంచి చేఱకు రసముతోనిండిన నూఱ కలశములతో మహేశాని నభిషేకించినవాడు తిరిగి జన్మించడు. జగదంబికను మంచి మామిడిపండ్ల రసముతో స్నానము చేయించినను వేదపారాయణము చేయుచు చెఱకు చరసముతో స్నానము చేయించినను నట్టి భక్తుని యింటినిలక్ష్మీ సరస్వతు లెన్నడును వదలి పెట్టరు. ఎవడు వేదపారాయణము చేయుచు ద్రాక్షరసముతో సకుటుంబముగ మహేశ్వరి నభిషేకించునో యతడు మహారా జగును. ఆ రసమం దేన్ని బిందువులు గలవో యన్ని యేడులతడు దేవీలోకమందు వైభవము లందుచుండును. అగురు - కుంకుమ పువ్వు - కస్తూరి కప్పురములు కలిసిన నీటితో వేద పారాయణ చేయుచు దేవి నభిషేకించినచో అతని నూఱు జన్మల పాపరాసుల భస్మరాసు లగును. ఎవడు వేదపారాయణ చేయుచు పాలకలశములతో దేవి నభిషేకించిచునో.

ఆ కల్పం స వసే న్నిత్యం తస్మిన్‌ వై క్షీరసాగరే | యస్తు దధ్నాభిషించే త్తాం తధికుల్యాపతిర్బవేత్‌. 13

మధూనా చ ఘృతేనైవ తథా శర్కరయా7పి చ | స్నాపయే న్మదుకుల్యాదిదీనాం స పతిరభ##వేత్‌. 14

సహప్రకలషై ర్దేవీం స్నాపయే ర్బక్తితత్పరః | ఇహలోకే సుఖీ భూత్వా ప్యన్యలోకే సుకీ భ##వేత్‌. 15

క్షౌమం వస్త్రద్వయం దత్త్వా వాయులోకం స గచ్చతి | రత్న నిర్మితభూషాణాం దాతా నిధిపతి ర్బవేత్‌. 16

కాశ్మీరచందనం దత్త్వా కస్తూరీబిందుభూషితమ్‌ | తథా సీమంతసిందూరం చరణ7లక్తపత్రకమ్‌. 17

ఇంద్రాసనే సమారూఢో భ##వే ద్దేవవతిః పరః | పుష్పాణీ వివిధా న్యాహుః పూజాకర్మణి సాధవః. 18

తాని దత్త్వా యథాలాభం కైలాసం లభ##తే స్వయమ్‌ | బిల్వపత్రా ణ్యమోఘాని యో దద్యాత్పరశక్తయే. 19

తస్య దుఃఖం కదాచిచ్చ క్వచిచ్చ న భవిష్యతి | బిల్వపత్రత్రయే రక్తంచందనేన తు సంసిఖేత్‌. 20

మాయాబీజత్రయం యత్నాత్సుస్పుటం చాతిసుందరమ్‌ | మాయాబీజాదికం నామ చతుర్థ్యంతం సముచ్చరేత్‌. 21

నమో7ంతం పరాయా భక్త్యా దేవీచరణపంకజే | సమర్పయే న్మహాదేవ్యై కోమలం తచ్చ పత్రకమ్‌. 22

య ఏవం కురుతే భక్త్యా మనుత్వం లభ##తే హి సః | యస్తు కోటి ధళైరేవ కోమలై రతినిర్మలైః. 23

పూజయే ద్బువనేశానీం బ్రహ్మాండాధిపతిర్బవేత్‌ | కుందపుపై#్ప ర్నవీనై స్తు లులితై రష్టగంధతః. 24

అతడు పాలకడలిలో నొక కల్పమందాక నిత్యము సుఖసంతోషము లనుభవించును. ఎవడు పెరుగుతో దేవి నభిషేకించునో యతడు దేవీలోకమందలి దధికుల్యనది కధిపతి గాగలడు. పట్టుతేనె - ఆవు నెయ్యి - పంచదాలతో దేవిని స్నానము చేయించినవాడు మధుకుల్యానదుల కధిపతి గావచ్చును. ఎవడు పాయనిభక్తితో వేయి కలశములతో దేవిని స్నానము చేయించునో యత డీ లోకమున - పరలోకమునందును సుఖము లొందును. రెండు తెల్లని వస్త్రములు దేవి కర్పించిన వాడు వాయులోకమున చల్లగ సుఖ మొందును. రత్నాల సొమ్ములు దేవి కిచ్చినవాడు నిధిపతి యగును.కుంకుమ పువ్వు - చందనము - కస్తూరి - సింధూరము - పాదముల లత్తుకరంగును దేవి కర్పించినవాడు ఇంద్రాసన మెక్కి యింద్రుడు గాగలడు. శ్రీదేవి కుపయోగించదగిన పలువిధాల పూలను సజ్జనులు తెల్పిరి. వానిని శ్రీదేవి కర్పించినవాడు కైలాస నివాసి గాగలడు. చెడని మారేడు దళములు దేవి కర్పించినవానికి ఎచ్చటగాని యేనాడుగాని దుఃఖము గలుగదు. మూడు మారేడు దళములందు నెఱ్ఱ చందనముతో మూడు మాయా (హ్రీం) బీజములు వ్రాయవలయును. పిదప ''ఓం హ్రీం భువనేశ్వర్యై నమః'' యని యుచ్చరించి పరమభక్తితో మెత్తని మూడు మారేడు దళములను మహాదేవి చరణ కమలములం దర్పించవలయును. ఈ విధముగ పరభక్తితో పూజించినవాడు మనువు గాగలడు. చక్కని - మెత్తని - కోటి మారేడు దళములతో భువనేశానిని పూజించిన వాడు బ్రహ్మాండమున కధిపతి గాగలడు - కొంగ్రొత్త మొల్లపూల కష్టగంధములు చేర్చి పూజించిన తప్పక ప్రజాపతి యగును.

కోటిసంఖ్యైః పూజయే త్తు ప్రాజాపత్యం లభే ద్ద్రువమ్‌ | మల్లికా మాలతీపుషై#్ప రష్టగంధేనలోలితైః. 25

కోటిసంఖ్యైః పూజయా తు జాయతే స చతుర్ముఖః | దశకోటిభి రప్యేవం తై రేవ కుసుమై ర్మునే. 26

విష్ణుత్వం లభ##తే మర్త్యో తత్సురేష్వపి దుర్లభమ్‌ | విష్ణునైత ద్ర్వతం పూర్వం కృతం స్వపదలబ్దయే. 27

శతకోటిభి రప్యేవం సూత్రాత్మత్వం వ్రజే ద్ద్రువమ్‌ | వ్రతమేత త్పురా సమ్య క్కృతం భక్త్యా ప్రయత్నతః. 28

తేన వ్రతప్రభావేన హిరణ్యోదరతాం వ్రజేత్‌ | జపా కుసుమపుష్పస్య బంధూకకుసుమస్య చ. 29

దాడిమీకుసుమస్యాపి విధి రేష ఉదీరితః | ఏవమన్యాని పుష్పాణి శ్రీదేవ్యై విధినా7ర్పయేత్‌. 30

తస్య పుణ్యఫలస్యాంతం న జానాతీశ్వరో7పి సః | తత్తదృతూద్బవైః పుషై#్ప ర్నామసాహస్రసంఖ్యయా. 31

సమర్పయే న్మహాదేవ్యై ప్రతిరవ్ష మతంద్రితః | య ఏవం కురుతే భక్త్యా మహాపాతకసంయుతః. 32

ఉపపాతక యుక్తో7పి ముచ్యతే సర్వపాతకైః | దేహాంతే శ్రీపదాంభోజం దుర్లభం దేవసత్తమైః. 33

ప్రాప్నోతి సాధకవరో మునే నాస్త్యత్ర సంశయః | కృష్ణాగురుం సకర్పూరం చందనేన సమన్వితమ్‌. 34

సిల్హకం చాజ్యసంయుక్తం గుగ్గులేన సమన్వితమ్‌ | ధూపం దద్యా న్మహాదేవ్యై యేన స్యాద్ధూపితం గృహమ్‌. 35

తేన ప్రసన్నా దేవేశీ దదాతి భువనత్రయమ్‌ | దీపం కర్పూరఖండైశ్చ దద్యా ద్దేవ్యై నిరంతరమ్‌. 36

అష్టవిధ గంధములతో మాయాబీజము వ్రాసిన మల్లికా మాలతీ పుష్పములు ఒక కోటి తెచ్చి పూజించినవాడు చతుర్ముఖు డగును. మునీ ! అట్టి పూలు పదికోట్లు సమర్పించినవాడు దేవ దుర్లభ##మైన విష్ణు సాయుజ్య మొందును. మున్ను విష్ణువు తన పదవి కిటులే దేవి నర్చించెను. ఇట్ట పుష్పములు నూఱుకోట్లు దేవి కర్పించినవాడు తప్పక సూత్రాత్ముడు గాగలడు. ఈ వ్రతమును మునుపు ప్రయత్నించి భక్తితో జరిపి దాని ప్రభావమున హిరణ్యగర్బుడు హిరణ్యగర్బత్వ మొందెను. జపాకుసుమములు బంధూకసుమములు దానిమ్మపూలు నిటులే దేవి కర్పించవలయును. ఈ విధముగ నితర పుష్పములను శ్రీదేవికి సమర్పించవలయును. అట్టివాని పుణ్యఫలము నిశ్వరుడు సైతము తెలుపజాలడు. ఆయా ఋతువులలో విరబూచిన మంచి పూవులు దేవీ సహస్రనామములతో ప్రతి సంవత్సరమును తెలివి వెల్గుతో మహాదేవికి సమర్పించవలయును. ఈ విధముగ నెవడు పరమభక్తితో నాచరించునో యతడు మహాపాపి యైనను ఉపాపాతకములు గలవాడైనను వాని అన్నిటి నుండి విముక్తుడగును. అతడు చనిపోయిన పిమ్మట దేవదుర్లభములైన శ్రీదేవి పాదపద్మములను జేరగలడు. ఇందావంతయును సందియము లేదు. మునీ! కాలాగురు కప్పురము చందనము కేసరమునేయిగుగ్గులమువీనితో దేవికి ధూపము సమర్పించవలయును. ఇట్లు భవాని మందిరము నిండ మంచి ధూపము నిండినచో ఆ దేవేశి ప్రసన్నురాలై వానికి ముల్లోకము లొసంగును. దేవికి నిరంతరము దీపము కప్పురపు టారతి వెలిగించు పుణ్యాత్ముడు -

సూర్యలోక మవాప్నోతి నాత్ర కార్యా విచారణా | శతదీపాం స్తథా దద్యా త్సహస్రాన్వా సమాహితః. 37

నైవేద్యం పురతో దేవ్యాః స్థాపయేత్పర్వతా కృతిమ్‌ | లేహ్యైశ్చోషై#్య స్తథాపేయైః షడ్రసై స్తు సమాహితైః. 38

నానాఫలాని దివ్యాని స్వాదూని రసవంతి చ | స్వర్ణ పాత్రస్థితాన్నాని దద్యా ద్దేవ్యై నిరంతరమ్‌. 39

తృప్తాయాం శ్రీమహాదేవ్యాం భ##వేత్తృప్తం జగత్త్రయమ్‌ | యత స్తదాత్మకం సర్వం రజ్జౌ సర్పో యథా తథా 40

తతః పానీయకం దద్యా చ్చుభం గంగాజలం మహత్‌ | కర్పూరవాలాసంయుక్తం శీతలం కలశస్థితమ్‌. 41

తాంబూలం చ తతో దేవ్యై కర్పూరశకలాన్వితమ్‌ | ఏలాలవంగ సంయుక్తం ముఖసౌగంధ్య దాయకమ్‌. 42

దద్వా ద్దేవ్యై మహాభక్త్యా యేన దేవీ ప్రసీదతి | మృదంగవీణామురజ ఢక్కాదుందుభినిస్వనైః. 43

తోషయే జ్జగతాం ధాత్రీం గాయనై రతిమోహనైః | వేదపారాయణౖః స్తోత్రైః పురాణాదిభి రప్యుత. 44

ఛత్రం చ చామరే ద్వే చ దద్యా ద్దేవ్యై సమాహితః | రాజోపచారాన్‌ శ్రీదేవ్యై నిత్యమేవ సమర్పయేత్‌. 45

ప్రదక్షిణాం నమస్కారం కుర్యాద్దేవ్యా అనేక ధా | క్షమాపయే జ్జగద్ధాత్రీం జగదంబాం ముహుర్ముహుః. 46

సకృత్స్మరణమాత్రేణ యత్ర దేవీ ప్రసీదతి | ఎతాదృశోపచారై శ్చ ప్రసీదేదత్ర కః స్మయః. 47

స్వభావతో భ##వేన్మాతా పుత్రే7తి కరుణావతీ | తేన భక్తౌ కృతాయాం తు వక్తవ్యం కింతతఃపరమ్‌. 48

నిక్కముగ సూర్యలోకమందు ప్రభలతో పయనించును. నూఱుగాని వేయిగాని దీపములు వెలిగించి దేవి యెదుట చోష్య - లేహ్య - పేయములుగల షడ్రసముల నైవేద్యము పర్వతాకారముగ నివేదించవలయును. మంచి తియ్యని రసాల ఫలములు బంగరు పాత్రలనుంచి శ్రీదేవికి నైవేద్యము సమర్పించవలయును. అటుల చేసినవానికి దేవి ప్రసన్నురా లగును. జగము లెల్లను తృప్తి జెందును. ఎందులకన జగమంతయును దేవీస్వరూపమే గదా! త్రాడునందు పాము భ్రాంతివలై దేవియంగు జగము భ్రాంతిగ దోచును. ఎవడు కప్పురము గుబాళించునట్టి చల్లని గంగాజలమును కలశమందుంచి దేవికి పానీయముగ నిచ్చునో పిదప నోటి కింపైన యేలకులు -లవంగాలు - కప్పురము గలిపి చేసిన కమ్మని తూంబూలము శ్రీదేవికి మహాభక్తితో సమర్పించునో వానియెడ దేవి ప్రసన్నురా లగును. ఆ తర్వాత వీణియ - మృదంగము - మురజ - ఢక్క - దుందుభి - ధ్వనులతో లితరాగ గానములతో పురాణాది స్తోత్రములతో జగముల నేలు తల్లిని సంతోషపఱచవలయును. దేవికి నిత్యము నియమముగ ఛత్ర చామరములు - సకల రాజోపచారములు సమర్పించవలయును. పెక్కురీతుల దేవికి ప్రదక్షిణ మనస్కారములు చేయవలయును. జగముల తల్లిన మాటిమాటికిని తన తప్పులు క్షమించుమని వేడుకొన వలయును. ఒక్క మారు తలంచినంతనే ప్రసన్నురాలగు దేవి తన కిన్ని యుపచారములు సమర్పించినపుడు ప్రసన్ను రాలగుటలో సందియమేమున్నది. ఏ తల్లియైన న కుమారునిమీద సహజముగనే దయ చూపును గదా! కొడుకు తల్లి యెడల భక్తి చూపినచో నింక చెప్పవలసిన దేమున్నది!

ఆత్ర తే కథయిష్యామి పురావృత్తం సనాతనమ్‌ | బృహద్రథస్య రాజర్షేః ప్రియం భక్తి ప్రదాయకమ్‌. 49

చక్రవాకో7భవత్సక్షీ క్వచిద్దేశే హిమాలయే | భ్రమన్నానావిధాన్దేశాన్య¸° కాశీపురం ప్రతి. 50

అన్నపూర్ణామహాస్థానే ప్రారబ్ధవశతో ద్విజః | జగామ లీలయా తత్ర కణలోభాదనా థవత్‌. 51

కృత్వా ప్రదక్షిణామేకాం జగామ చ విహాయసా | దేశాంతరం విహాయైవ పురీం ముక్తిప్రదాయినీమ్‌. 52

కాలాంతరే మమారాసౌ గతః స్వర్ణపురీం ప్రతి | బుభుజే విషయా న్సర్వాన్‌ దివ్యరూపధరో యువా. 53

కల్పద్వయం తథా భుక్త్వా పునః ప్రాప భువంప్రతి | క్షత్రియాణాం కులే జన్మ ప్రాప సర్వోత్తమోత్తమమ్‌. 54

బృహద్రథేతి నామ్నా7భూ త్ప్రసిద్ధః క్షితిమండలే | మహాయజ్వా ధార్మికశ్చ సత్యవాదీ జితేంద్రియః. 55

త్రికాలజ్ఞః సార్వభౌమో యమీ పరపురంజయః | పూర్వజన్మ స్మృతి స్తస్య వర్తతే దుర్లభా భువి. 56

ఇతి శ్రుత్వా కింవదంతీం మునయః సముపాగతాః | కృతాతిథ్యా నృపేంద్రేణ విష్టరే షూషురేవ తే. 57

పప్రచ్ఛు ర్మునయః సర్వే సంశయో7స్తి మహాన్నృప | కేన పుణ్య ప్రభావేణ పూర్వజన్మస్మృతి స్తవ. 58

త్రికాలజ్ఞాన మేవాపి కేన పుణ్య ప్రభావతః | జ్ఞానం తవేతి తత్‌ జ్ఞాతు మాగతాః స్మ తవాంతికమ్‌. 59

వద నిర్వ్యాజయా వృత్త్యా తదస్మాకం యథాతథమ్‌ |

శ్రీనారాయణ ఉవాచ : ఇతి తేషాం వచః శ్రుత్వా రాజా పరమధార్మికః. 60

ఇపుడు నీకు ప్రాచీనమైన బృహద్రథుడను రాజర్షి చరిత్ర తెలుపుచున్నాను వినుము. అది విన్నవారికి భక్తి ప్రపత్తులు గలుగును. తొల్లి హిమాచలప్రదేశమున నొక చక్రవాక పక్షి యుండెను. అది పెక్కు దేశములు తిరిగి తిరిగి కాశీపురము ప్రవేశించెను. అది తన ప్రారబ్ధవశమున నన్నపూర్ణాదేవి యుండుచోటి కేగెను. అది యనాథమువలె నన్న కణములు పొందు నాశ##చే నచటి కేగెను. అది యన్నపూర్ణాదేవికి ప్రదక్షిణించి నింగి కెగసెను. మరల పలు దేశములు తిరిగి తిరిగి ముక్తిప్రదమగు కాశి చేరెను. అచట కొతకాలమున కది చనిపోయి స్వర్గమేగి దివ్యపురుషుడై పెక్కు స్వర్గభోగము లనుభవించెను. అచట రెండు కల్పములు సుఖములు పొంది తిరిగి యీ భూలోకమున నుత్తమోత్తమమైన రాజకుటుంబము నందు జన్మించెను. అతడే యీ భూమిపై బృహద్రథుడను పేరున ప్రసిద్ధు డయ్యెను. అతడు మహాయజ్వ ధర్మాత్ముడు సత్యవాది జితేంద్రియుడు త్రికాలవేది సార్వభౌముడు సలయమి శత్రుభీకరుడు నయ్యెను. అతని కీ నేలపై దుర్లభ##మైన పూర్వజన్మ స్మృతియును గల్గెను. అది విని మును లెల్లరును రాజును సమీపించిరి. వారు రాజుచేత నాతిథ్యము బడసి దర్బా సనములపై కూరుచుండిరి. మునులు రాజు నిట్లడిగిరి. మహారాజా! నీ కే పుణ్యప్రభావమున పూర్వజన్మ స్మృతి గలిగెనో ఏ పుణ్య విశేషమున త్రికాలజ్ఞానము గలిగెనో యట్టి జ్ఞాన మెఱుంగుటకు మేము నీ చెంతకు వచ్చితిమి. దానిని మా కున్నదున్నట్లు కపటమునవీడి తెలియపఱచుము. శ్రీనారాయణుడు డిట్లనెను : అను మునుల వాక్కులు పరమధార్మికుడైన రాజర్షి వినెను.

ఉవాచ సకలం బ్రహ్మం స్త్రీకాలజ్ఞానకారణమ్‌ | శ్రూయతాం మునయః సర్వే మమ జ్ఞానస్య కారణమ్‌. 61

చక్రవాకః స్థితః పూర్వం నీచయోనిగతో7పి వా | అజ్ఞానతో7పి కృతవా నన్నపూర్ణాం ప్రదక్షిణామ్‌. 62

తేన పుణ్యప్రభావేణ స్వర్గే కల్పద్వయ స్థితిః | త్రికాలజ్ఞానతో7ప్యస్మి న్న భూ జ్జగతి సువ్రతాః. 63

కో వేద జగదంబాయాః పదస్మృతిఫలం కియత్‌ | స్మృత్వా తన్మహిమానం తు పతంత్య శ్రూణిమే7నిశమ్‌. 64

ధిగస్తు జన్మ తేషాం వై కృతఘ్నానాం తు పాపినామ్‌ | యే సర్వే మాతరం దేవీం స్వోపాస్యాం న భజంతి హి. 65

న శివోపాసనా నిత్యా న విష్ణూపాసనా తథా | నిత్యోపాస్తిః పరాదేవ్యా నిత్యా శ్రుత్యైవ చోదితా. 66

కిం మయా బహు వక్తవ్యం స్థానే సంశయవర్జితే | సేవనీయం పదాంభోజం భగవత్యా నిరంతరమ్‌. 67

నాతః పరతరం కించి దధికం జగతీతలే | సేవనీయా పరాదేవీ నిర్గుణా సగుణా7థవా. 68

నారాయణ ఉవాచ : ఇతి తస్య వచః శ్రుత్వా రాజర్షే ర్దార్మికస్య చ |

ప్రసన్నహృదయాః సర్వే గతాః స్వస్వనికేతనమ్‌. 69

ఏవంప్రభావా సా దేవీ తత్పూజాయాః ఫలం కియత్‌ | ఆస్తీతి కేన ప్రష్టవ్యం వక్తవ్యం వా న కేనచిత్‌.70

యేషాం తు జన్మసాఫల్యం తేషాం శ్రద్ధాతు జాయతే | యేషాం తు జన్మసాంకర్యం తేషాం శ్రద్ధా న జాయతే. 71

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే7ష్టాదశో7ధ్యాయః.

రాజు తన త్రికాలజ్ఞానమునకు కారణ మిట్లు చెప్సాగెను. మునులారా! నా జ్ఞానకారణము వినుడు. నేను పూర్వము నీచజన్మమైన చక్రవాక పక్షినై యుంటిని. నే నొకనాడు తెలియకయే యన్నపూర్ణాదేవికి ప్రదక్షిణించితిని. ఆ పుణ్య ఫలమున నేను స్వర్గమున రెండు కల్పములు సుఖించితిని. సువ్రతులారా ! ఇపుడు భూలోకమున త్రికాలజ్ఞానముతో నీ జన్మ గల్గెను. భవాని త్రిభువేశ్వరిఅగుతల్లి పదపద్మములు స్మరించిన దాని ఫలిత మెవ్వ డెఱుగగలడు? ఆ తల్లి మహిమము - దయ - తలంచి తలంచి నా కన్నులానందబాష్పములలో దప్పదోగుచున్నవి. తమ తల్లియైన శ్రీమాత నుపాసించి భుజించని కృతఘ్నులగు పాపాత్ముల జన్ముల వ్యర్థములు. వేదములందు శివవిష్ణుల యుపాసన నిత్యమని విధింపబడిలేదు. పరాదేవి - సంధ్యాదేవి నిత్య ముపాసించదగినదని వేదములందు గలదు. దీనియందెట్టి సంశయమును లేదు. దీనిని నే నెక్కువగ నేమి చెప్పగలను? శ్రీభగవతి పదపద్మములు నిరంతరమును సేవించదగినవే సుమా. ముజ్జగములం దెచ్చటనైనను దీనిని మించిన దేదియును లేదు. కనుక శ్రీపరాభట్టారికను సగుణనుగగాని నిర్గుణనుగగాని నిత్యము సేవించవలయును. శ్రీనారాయణు డిట్లనెను : అను రాజర్షిధార్మికుడు అగు రాజు దివ్య వచనము విని మునులు ప్రసన్నులై తమ నెలవుల కరిగిరి. ఆ భగవతి యింత ప్రభావముకలది! ఆమెను పూజించిన గల్గు ఫల మెంత యుండునో ! ఇంత ఫలము గలుగునని కచ్చితముగ చెప్ప గలవా డెవ్వడు గలడు? ఎవని జన్మము పుణ్య పరిపాకమున ధన్యమో - సఫలమో వానికే దేవియందు శ్రద్ధ భక్తి గల్గును. ఎవ్వని జన్మము సంకరమో వానికి దేవియందు శ్రద్ధ కల్గనే కల్గదు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యేకాదశ స్కంధమున పదునెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters