Sri Devi Bagavatham-2    Chapters   

అథ దశమో7ద్యాయః.

శ్రీ నారాయణ ఉవాచ: అగ్నేయం గౌణమజ్ఞానధ్వంసకం జ్ఞానసాధకమ్‌ | గౌణం నానావిదం విద్ధి బ్రహ్మన్బ్రహ్మవిదాంవర. 1

అగ్నిహోత్రాగ్నిజం తద్వ ద్విర జానలజం మునే | ఔ పాసనసముత్పన్నం సమిదగ్ని సముద్బవమ్‌. 2

వచనాగ్ని సముత్పన్నం దావానలసముద్బవమ్‌ | త్రైవర్ణికానాం సర్వేషా మగ్నిహో త్రసముద్బవమ్‌.3

విరజానలజంచైవ ధార్యం భస్మ మహామునే | ఔ పాసనసము త్పన్న గృహస్థనాం విశేషతః. 4

సమిదగ్ని సముత్ప్నరం ధార్యం వై బ్రహ్మచారిణా |శుద్రాణాం శ్రోత్రియాగార వచనాగ్రి సముద్బవమ్‌. 5

అన్వేషామపి సర్వేషాం ధార్యం దావానలోద్బవమ్‌ |కాలశ్చిత్రా పౌర్ణమాసీ దేశః స్వీయః పరిగ్రహః. 6

క్షేత్రారామాద్యరణ్యం వాప్రశసః శుభలక్షణః | తత్ర పూర్వత్రయోదశ్యాం సుస్నాతః సుకృతాగ్నికః. 7

అనుజ్ఞాప్య స్వమాచార్యం సంపూజ్య ప్రణిపత్యచ | పూజాంవైశేషికీం కృత్వా శుక్లాంబరధరః స్వయమ్‌.8

శుద్ధ యజ్ఞోపవీతీ చ శుద్దధ మాల్యానులేపనః | దర్బాసనే సమాసీనో దర్బముష్టిం ప్రగృహ్య చ. 9

ప్రాణాయామత్రయం కృత్వా ప్రాజ్ముఖో వాప్యుదజ్ముఖః | ద్యాత్వా దేవం చ దేవీం చ తద్విజ్ఞాపన వర్త్మనా 10

వ్రతమేతత్కరోమీతి భ##వేత్సం కల్పదీక్షితః | యావచ్ఛరీరపాతంవా ద్వాదశాబ్దమథా7

పివా.11

పదవ అధ్యాయము

భస్మధారణ విధానము

శ్రీనారాయణు డిట్లనెను : బ్రహ్మవిద్వరా ! నారదా! అగ్నితో నేర్పడిన గౌణ భస్మము కూడ అజ్ఞానపు తెరలు పోగొట్టును. ఈ గౌణభస్మము పలువిధములుగ నుండునని తెలియుము. మునీ ! అగ్నిహోత్రము- విరజాగ్ని- ఔపాసనాగ్ని- సమిథాగ్ని పాకాగ్ని-దావాగ్ని-యను నీ యగ్నులనుండి చేసిన భస్మము మూడు వర్ణముల వారెల్లరును ధరించవచ్చును. మనీ! విరాజాగ్ని వలని భస్మము ప్రతివాడును ధరింపవచ్చును. ఔపాసాగ్నిలోని భస్మమును విశేషించి గృహస్థులే ధరించవలయను. సమిధాగ్నిలోని భస్మమును ప్రతివాడును ధరించవచ్చును. ఇప్పుడు విరజాగ్ని భస్మము గూర్చి తెలుపుచున్నాను. చైత్ర పూర్ణమనాడు సొంత యింటిలో గాని పాలములోగాని తోటలోగాని అడవులోగాని యేదైన మంచిచోట హోమము చేయవచ్చును. త్రయోదశనాడే శుచిగ స్నానముచేసి సంధ్యావందనము నాచరించవలయును. తన గురుని పూజించి యతని యనుమతి తీసికొని తెల్లని వస్త్రములు ధరించవలయును. క్రొత్త జందెము ధరించి తెల్ల మాలలు ధరించి ధర్భాసనముపై గూర్చించి దర్బలు చేతబట్టుకొని తర్వాత ముమ్మారు ప్రాణాయామ మొనర్చి తూర్పు ముఖముగగాని- ఉత్తర ముఖమాగగాని కూర్చుండి తన కిష్టమైన దేవునినగాని దేవినిని గాని ధ్యానించి వారి యాజ్ఞబడపి ఈ శిరోవ్రతము చేయు చున్నానని సంకల్పంచి దీక్షబూని మొత్తమువఱకు గాని-పండ్రెండు సంవత్సరములు గాని

తదర్ధం వా తదర్థంవా మాసద్వా దశకం తువా| తదర్ధం వా తదర్దంవా మాసమేక మథాపివా. 12

దిన ద్వదశకం వా 7పి దినషట్కమథాపివా | తదర్దం దినమేకంవా వ్రతసంకల్పనావధి. 13

అగ్నిమాధాయ విధివద్విరజాహోమకారణాత్‌ | హుత్వా7 జ్యేన సమిద్బి శ్చ చరుణా చ యథా విధి. 14

పూతాహాత్పురతో భూయస్తత్త్వానా శుద్ధిమద్దిశన్‌ | జుహుయాన్మూల మంత్రేణ తైరేవ సమిదాదిభిః. 15

తత్త్వాన్యేతాని మే దేహే శుధ్యంతా మిత్యనుస్మరన్‌ | పశ్చా ద్బూతాదితన్మాత్రాః పంచకర్మేం ద్రియాణి చ. 16

జ్ఞానకర్మ విభేదేన పంచపంచవిభాగశః| త్వగాదిధా తవః సప్తపంచ ప్రాణా దివాయవః 17

మనోబుద్ధి రహంకారో గుణాః ప్రకృతి పూరుషౌ | రాగో విద్యా కళాచైవ నియతిః కాలఏవ చ. 18

మాయా చశుద్ధ విద్యాచ మహేశ్వరసదాశివౌ | శక్తి శ్చ శివతత్త్వం చ తత్త్వాని క్రమశో విదుః. 19

మంత్త్రెస్తు విరజైర్హుత్వా హోతా7 సౌ విరజాభ##వేత్‌ | అథగోమయ మాదాయ పిండీ కృత్యాభిమంత్ర్య చ. 20

న్యస్యాగ్నౌ తం చ సంరక్ష్య దినే తస్మిన్హ విష్య భుక్‌ | ప్రభాతే చ చతుర్దళ్యాం కృత్వా సర్వం పురోదితమ్‌. 21

తస్మి న్దినే నిరాహారః కాలశేషం సమాపయేత్‌ | ప్రాతః పర్వణి చాప్యేవం కృత్వా హోమావసానతః. 22

ఆరెండ్లుగాని- మూడేండ్లుగాని- యేడాదిగాని- ఆరునెలలు గాని - మూడునెలలుగాని-నెలగాని-పండ్రెండు దినములు గాని- మూన్నాళ్లుగాని -యొకనాడుగాని సంకల్పించి యీ వ్రతము చేయవచ్చును. తన గృహ్య సూత్రవిధిప్రకారముగ విరజా హోమమున కగ్నిని ప్రతిష్ఠించి యందు నేయి- సమిధలు-చరువు వేల్చయవలయును. పున్నమకు ముందునాడు తత్త్వశుద్ధియగు నను నుద్ధేశముతో మూలమంత్రములతో సమిధలు వేల్చవలయును. తన దేహమున తత్త్వములు శుద్ధిచెందునని తలంచ వలయును. పంచభూతములు-తన్మాత్రలు-పంచ కర్మేంద్రియములు పంచజ్ఞానేంద్రియములు సప్తధాతువు ( త్వక్‌- రక్త- మాంస- మేదోస్థిమజ్జా శుక్లములు) పంచప్రాణములు మనస్సు బుద్ధి అహంకారము త్రిగుణములు ప్రకృతి పురుషులు రాగము విద్య కళ నియతి కాలుము మాయ శుద్దవిద్య మహేశ్వర సదాశివులు శక్తి శివతత్త్వము ననునవి నలువది ఆరును తత్త్వములనబడును. ఈతత్త్వములు గల విరజామంత్రములతో వేల్చినవాడు పాపరహితుడగును. మొదట ఆవుపేడ తెచ్చి ముద్దచేసి పంచాక్షరితో నభిమంత్రించవలయును. దాని నగ్నిలో ప్రోదిచేసి యానాడు హవిష్యాన్నయే తినవలయును. చతుర్దశి యుదయున త్రయోదశినాడు చేసినటులే చేయవలయును. ఆనాడు నిరాహరముగ గడుపవలయును. మరల పూర్ణియనాడు నిత్య కృత్యములు దేర్చకొని పంచాక్షరితో వేల్చవలయును. (ధాతు సప్తకమును త్రిగుణములును కాక మిగిలిన ముప్పది ఆరు తత్త్వములను ఒక సంప్రదాయము- పరిష్కర్త.)

ఉపసంహృత్య రుద్రాగ్నిం గృహీత్వా భస్మయత్నతః | తత శ్చ జటిలో ముండః శిఖైకజట ఏవచ. 23

భూత్వాస్నాత్వా పునర్వీత లజ్జ శ్చే త్స్యాద్ధిగంబరః | అన్యః కాషాయవసన శ్చర్మ చీరాం బరో7 థవా. 24

ఏకాంబరో వల్కలవా న్బవేద్దండే చ మేఖలీ | ప్రక్షాళ్య చరణౌ పశ్చా ద్ద్విరాచమ్యా77 త్మన స్తనమ్‌. 25

సంకలీకృత్య తద్బస్మవిరజానల సంభవమ్‌ | అగ్నిరిత్యాదిభిర్మంత్రైష్షడ్బ రాథర్వణౖః క్రమాత్‌.26

విమృజ్యాం గాని మూర్దాది చరణాంతం చతైః స్పృశేత్‌ | తతస్తేన క్రమేణౌవ సముద్ధూల్య చ భస్మనా. 27

సర్వాంగోద్ధూలనం కుర్యాత్ప్రణవేన శివేనవా | తతశ్చపుండ్రాన్ర చ యేత్త్రియా యుషసమాహ్వయమ్‌. 28

శివభావం సమాగమ్య శివభావ మథాచరేత్‌ | కుర్యాత్త్రిసంధ్య మప్యేవ మేతత్పాశుపతం వ్రతమ్‌. 29

భుక్తిముక్తి ప్రదం చైవ పశుత్వం వినివర్తయేత్‌ | తత్పశకుత్వం పరిత్యజ్య వృత్వా పాశుపతం వ్రతమ్‌.30

పూజనీయే మహాదేవో లింగమూర్తిః సదాశివః | భస్మస్నానం మహాపుణ్యమ పర్వసౌఖ్య కరనం పరమ్‌. 31

ఆయుష్యం బలమారోగ్యం శ్రీపుష్టి వర్దనం యతః | రక్షార్ధం మంగళార్థం చయ సర్వసంవత్సమృద్ధయే. 32

భస్మిస్నిగ్ధమనుష్యాణాం మహామారీ భయం నచ | శాంతికం పౌష్టికం భస్మ కామదం చ త్రిధా భ##వేత్‌.33

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే దశమో7 ధ్యాయః.

పిదప రుద్రాగ్నిని విసర్జనముచేసి యు భస్మరును గ్రహింపవలయును. పిదప జడలు దాల్చికాని -ముడిగగాని-పిలకజుట్లుతో గాని- స్నాన మొనర్చి రాగద్వేషములు వీడి దిగంబరుడుగ గాని - కాషాయ వలస్త్రములుగాని లేడితోలుగాని దాల్చి యైనను ఏకవస్త్రముగాని- నారచీరలుగాని గట్టుకొనియైనను మొలత్రాడు దాల్చి దండము పట్టుకొని పాదములు కడిగికొని రెండుమారు లాచమబించి విరజాగ్ని భస్మము ప్రోగుచేయవలయును. ''అగ్నిరితి'' యను నాధర్వణ మంత్రము లారు చదివి తలనుండి పాదములవఱకు విరజాగ్నిఆ భస్మము పూసికొనవలయును. తర్వాత పణవముతో గాని పంచాక్షరితో గాని శరీరమునందు భకస్మధారణ చేయవలయును. పిదప '' త్య్రాయుష ''మను మంత్రముతో త్రిపుండ్రములు దాల్చవలెను. ఇట్లు శివభావము నందవలయును. దీనినే పాశుపతవ్రత మందురు. ఇది భుక్తి-ముక్తి పదము. పశుత్వము పాపును కనుక పశకుత్వము వదలి యీ పాశుపతవ్రతము సమాచరింపవలయును. సదాశివుడు- మహాలింగమూర్తి- మహాదేవుడు -పుష్టి-అభివర్థిల్ల చేయును. దీనిని రక్షార్ధము- మంగళార్ధము-సంపదల సమృద్ధికి ధరించవలయును. ఈ విరజా భస్మమున స్నాన మొనర్చిన వానికి మహారమారి భయము గల్గదు. ఆరోగ్యము-అందము-శుభము పెంపొందును. ఈ భస్మము శాంతకము-పౌష్టికము -కామ్యము నని ముతైఱగుల నలరారును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్వంధమున పదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters