Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశస్కంధః

అథ ప్రథమోధ్యాయః.

నారద ఉవాచ : భగవన్బూతభ##వ్యేశ నారాయణ సనాతన | ఆఖ్యాతం పరమా శ్చ ర్యం దేవీ చరిత ముత్తమమ్‌. 1

ప్రాదుర్బావః పరోమాతుః కర్యార్థ మసురద్రుహామ్‌ | అదికరాప్తి రుక్తాత్ర దేవీ పూర్ణ కృపా వశాత్‌. 2

అధునా శోతు మిచ్ఛామి యేన ప్రీణాతి సర్వదా | స్వభక్తా న్పరిపుష్ణాతి తమాచారం వద ప్రభో. 3

నారాయణ ఉవాచ : శృణునారద తత్త్వజ్ఞ సదాచారవిధి క్రమమ్‌ |

యదనుష్టాన మాత్రేణ దేవీ ప్రీణాతి సర్వదా. 4

ప్రాతరుత్ధాయ కర్తవ్యం యద్ధ్విజేన దినేదినే | తదహం సంప్ర వక్ష్యామి ద్విజానాముపకారకమ్‌. 5

ఉదయాస్తమయంయావద్ద్విజః సత్కర్మ కృద్బవేత్‌ | నిత్యనైమిత్తికై ర్యుక్తః కామ్యై శ్చాన్యై రగ్హరితైః. 6

ఆత్మైన న సహాయార్థం పతామాతా చ తిష్ఠతి | న పుత్రదారా నజ్ఞాత ర్దర్మ స్తిష్ఠతి కేవలమ్‌. 7

తస్మాద్ధర్మం సహాయార్థం నిత్యసంచిను సాధనైః | ధర్మేణౖవ సహాయాత్తు తమ స్తరతి దు స్తరమ్‌. 8

ఆచారః ప్రధమోధర్మః శ్రుత్యుక్తః స్మార్త ఏవ చ | తస్మా దస్మి న్స మాయుక్తో నిత్యం స్యా దాత్మనోద్విజః. 9

ఆచారాల్లభ##తే చాయురాచారాల్లభ##తే ప్రజాః | ఆచారా దన్నమక్షయ్య మాచారో హంతి పాతకమ్‌. 10

ఆచారః ప్రథమోధర్మోనృణాం కల్యాణకారకః | ఇహలోరూ సుఖీభూత్వా పరత్రలభ##తే సుఖమ్‌. 11

ఆజ్ఞానాంధ జనానాం తు మోహితైర్బ్రా మితాత్మనామ్‌ | ధర్మరూపో మహాద్వీపో ముక్తి మార్గ ప్రదర్శకః. 12

మొదటి అధ్యాయము

ప్రాతశ్చింతనము

నారదు డిట్లనియెను : భగవానుడా! భూతభవ్యభవత్ర్పభూ! సనాతనా! నారాయణ! నాకు పరమోత్తమమైన శ్రీదేవీ చరిత్రము వినిపంచితివి. దేవకార్యర్థము శ్రీమాతృమూర్తి యవతరించుటయు దేవి దయవలన మనువుల కధికారములు ప్రాప్తించుటయు తేలిపితివి. ప్రభూ! ఇపుడే విధమైన సదాచారమువలన దేవి సంతుష్టి జెంది తన్ను సేవించు పరమభక్తులను బ్రోచునో యట్టి సదాచారము గూర్చి వినదలచుచున్నాను. నారయణు డిట్లనెను : తత్వజ్ఞా నారదా! నీకిపుడు సదాచారమును విధివిదానమున తేటపఱతును. దాని ననుష్ఠించుట వలన దేవి ప్రసన్నరాలు గాగలదు. ద్విజుడైనవాడు వెకువ వెల్గులో మేల్కాంచి ప్రతినిత్యమును జరుపవలసిన యవశ్య కర్తమ్యములు గలవు. వానిని ద్విజులమీది దయతో తెలుపు చున్నాను. ఉదయమునుండి యస్తమయమువఱకును ద్విజుడు శాస్త్రక్తములైన నిత్య - నైమిత్తిక - సత్కర్ములు దేనికొఱ కాచరించునో ఆత్మకు పరలోకమందు తల్లిదండ్రులు భార్య-పిల్లలు జ్ఞాతి - బందువులును తోడుగ నుండక యేది తోడుగ నుండునో యదేపరమధర్మ మనబడును. అందువలన మానవుడు తన యాత్మను తా నుద్ధరించుకొనుటకు పవిత్ర సాధనములతో పరమ ధర్మము సంపాదించుకొనవలయును. అట్టి ధర్మ సహాయమున దాటరాని యంధతమస్సును పటాపంచలు చేయవచ్చును. శ్రుతిస్మృతులందును మొట్టమొదటి ముఖ్యమైన ధర్మము సదాచామని చెప్పబడెను. కనుక ద్విజుడు నిత్యము సదాచార సంపన్నుడు గావలయును. సదచారము వలననే చిరాయువు చిరంజీవమగు సంతతి పుష్కలమైన యన్నమును గల్గును. పాపరాసులు నశించును. మనుజులకు సదాచారమే శుభకరము. పరమధర్మము. దాని వలన నిహపరములందును. సుఖసంపదలు గల్గును. మోహభ్రాంతులచేత నజ్ఞానాంధకారమున కొట్టుమిట్టాడు వారికి సదాచార ధర్మము వెల్గు మార్గము చూపు దీపకాంతి.

ఆచారత్ర్పా ప్యతేశ్రైష్ఠ్య మాచారాత్కర్మల భ్యతే | కర్మణో జాయతే జ్ఞానమితి వాక్యం మనోః స్మృతమ్‌. 13

సర్వధర్మ వరిష్టోయ మాచారః పరమం తపః | తదేవ జ్ఞానము ద్దిష్టం తేన సర్వంప్రసాధ్యతే. 14

యస్త్వాచార విహీనోత్ర వర్తతే ద్విజసత్తమః | సశూద్రవ ద్బ హిష్కార్యో యథాశుద్ర స్తథైవసః. 15

ఆచారో ద్వివిధః ప్రోక్తః శాస్త్రీయోలౌకికస్తథా | ఉభావపి ప్రకర్తవ్యౌ నత్యాజౌ శుభమిచ్చతా. 16

గ్రామధర్మా జాతిధర్మా దేశధర్మాః కలోద్బవాః | పరిగ్రాహ్యానృభిః సర్వేనైవతాంల్లఘయే న్మునే. 17

దురాచారోహి పురుషోలోకేభవతి నిందితః | దుఃఖబాగీ చ సతతం వ్యాధినా న్యాప్త ఏవచ. 18

పరిత్యజే దర్థకామౌ ¸°స్యాతాం ధర్మవర్జితా | ధర్మమప్య సుఖోదర్కంలో కవిద్విష్టమేవ చ. 19

నారద ఉవాచ : శ్రుతిస్మృతీ ఉభే నేత్రే పురాణం హృదయం స్మృతమ్‌ | 20

ఏతత్త్ర యోక్త ఏవస్యాద్ధర్మో నాన్యత్మర కుత్ర చిత్‌. 21

విరోధో యత్రకు భ##వేత్త్రయాణాం చ పరస్పరమ్‌ | శ్రుతి స్త త్ర ప్రమాణం స్యాద్ద్వ యోర్ద్వోధేస్మృతిర్వరా. 22

శ్రుతిద్వైధం భ##వే ధ్యత్ర తత్ర ధర్మావు భౌస్మృతౌ | స్మృతి ద్వైధంతు యత్రస్యా ద్విషయః కల్ప్యతాం పృథక్‌. 23

పురాణషు క్వ చిచ్చైవ తంత్ర దృష్టం యథాతథమ్‌ | ధర్మ వదంతి తం ధర్మం గృహ్ణీయాన్న కథంచన. 24

సదాచారము వలననే శ్రేశ్ఠత్వము-సత్కర్మము చేకూరును. సత్కర్మమువలన జ్డానము గల్గును. దానిచే ముక్తి గల్గునని మనువు చెప్పెను. సదాచార మెల్ల ధర్మములలో ముఖ్యము శ్రేష్ఠమునైనది. అదియే పరమతపము. అదేయాత్మ విచారము. దానివలన నన్నియును సమకూరుము. ద్విజోత్తమా! సదాచారము లేనివాడు భ్రష్టుడగుట వలన శూద్రునివలె వెలి వేయదగినవా డగును. ఆచారము రెండు విధములు శాస్త్రీయము-లౌకికము. తనకు మేలు గోరుకొనువాడీ రెంటి నాచరింపవలయుపను, దేనిని వదలరాదు. నారదా! నరులు గ్రామధర్మము-జాతిధర్మము-దేశధర్మము-కులధర్మము మున్నగు వాని నన్నిటి నాచరింపవలయును. దేనిని వదలరాదు. దురాచారియగు వాడు లోకమం దెల్లెడల నిందితు డగును. దుఃఖభాజను డగును. వ్యాధిపీడితు డగును. మానవుడు ధర్మనవిరుద్ధములైన యర్థకామములు వదలవలయును ప్రాణులకు సుఖ కరముగాని ధర్మము ధర్మముగాదు. నారడు డిట్లనియెను : భగవానుడా! శాస్త్రములనంతములు గదా! ధర్మమార్గము నిర్ణ యించుటలో ప్రమాణమైన దేది? నారాయణు డిట్లనియెను : పరమాత్మకు శ్రుతి - స్మృతులు నేత్రముల వంటివి. పూరాణము హృదయము వంటిది. ఈ మూటిలో చెప్పబడినదే ధర్మము. ఇతరములం దున్నది ధర్మముగాదు. ఈ మూటిలో పరస్పర విరోధము చూపట్టినపుడు శ్రుతిని ప్రమాణముగ గ్రహించవలయును. స్మృతి పూరాణముల మధ్య విరోధము చూపట్టినపుడు స్మృతిని ప్రమాణముగ నంగీకరింపవలయును. శ్రితిలో నెక్కడనైన రెండు విధము లున్నచో రెండును ప్రమాణముగ గ్రహించవలయును. స్మృతులలో పరస్పరము విరోధము గనిపించినచో భిన్న విషయములసరిగ తెలిసికొని శాస్త్ర వ్యవస్థచే నిర్ణయించవలయును. పురాణతంత్రములం దక్కడక్కడ శ్రుతి స్మృతులకు విరోధము చెప్పబడెను. అట్టి విరోధమును ధర్మ ముగ నంగీకరింపకూడదు.

వేదావిరోధిచేత్తంత్రం తత్పృమాణం న సంశయః | ప్రత్యక్ష శ్రుతిరుద్ధం యత్తత్ర్పమాణం భ##వేన్న చ. 25

సర్వథావేద ఏవాసౌ ధర్మమార్గ ప్రమాణకః | తేనావిరుద్ధం యత్కించిత్తత్ర్ప మాణం న చాన్యథా. 26

యోవేద ధర్మముజ్ఘిత్య వర్తతేన్య ప్రమాణతః | కుండాని తస్య శిక్షార్థం యమలోకే వసంతి హి. 27

తస్మాత్సర్వ ప్రయత్నేన వేదోక్తం ధర్మ మాశ్రయేత్‌ | స్మృతిః పురాణ మన్యద్వా తంత్రంవా శాస్త్రమేవచ. 28

తన్మూలత్వే ప్రమాణం స్యాన్నాన్య థాతు కదాచన | యేతుశాస్త్రాభియోగేన వర్తయంతీహ మానవాన్‌. 29

అథోముఖోర్ద్వ పాదాస్తే యస్యంతి నరకార్ణవమ్‌ | కామాచారః పాశుపతా స్తథా వైలింగ ధారిణః. 30

తప్త ముద్రాంకితా యేచ వైఖానసమతానుగాః | తే సర్వే నిరయం యాంతి వేదమార్గ బహిష్కృతాః. 31

వేదోక్తమేవ సద్దర్మం తస్మాత్కుర్యాన్నరః సదా | ఉత్థాయోత్థాయ బోద్ధవ్యం కిం మయాద్య కృతం కృతమ్‌. 32

దత్తం వా దాపితం వాపి వాక్యేనాపి చ భాషితమ్‌ | ఉపపాపేషు సర్వేషు పాతకేషు మహత్స్వపి. 33

అవాప్య రజనీ యామం బ్రహ్మధ్యానం సమాచరేత్‌ | ఊరుస్థోత్తాన చరణః సవ్యేచోరౌ తథోత్తరమ్‌. 34

ఉత్తానం కించి దుత్తానం ముఖం వష్టభ్యచోర సా | నిమీలితాక్షః సత్త్వస్థో దంతైర్దంతాన్న సంప్పృశేత్‌. 35

తాలుస్థాచలజిహ్వ శ్చసంవృతాస్యః సునిశ్చలః | సన్నిరుద్ధ్యేంద్రియ గ్రామో నాతినిమ్న స్థిరాసనః. 36

వేదములను విరోధించని తంత్రములను ప్రమాణముగ గొనవచ్చును. సంశయములో పనిలేదు. కాని శ్రుతికి ప్రత్యక్షముగ విరోధమైన దానిని మాత్ర మంగీకరింపరాదు. అన్ని విధముల వేదమే ధర్మమార్గమునకు ప్రమాణమైనది - ఇతర మునుగాదు. వేదధర్మమును బాటింపక యితర ప్రమాణములు నమ్మువానికి బుద్ధి చెప్పుటకే యమలోకమున నరక కుండములు గలవు. కనుక మానవు డెల్ల విధముల వేదోక్తమైన ధర్మమునే యాశ్రయింపవలయును. స్మృతి పురాణములును ఇతర తంత్ర శాస్త్రములును వేదమూలము నంగీకరింఛుట వలన నవియును ప్రమాణములే. ఇతరములు గావు. విపరీత శాస్త్రములతో జనులను మభ్యపెట్టి మోసగించువాడు నరకకూపములందు తలక్రిందికి కాళ్లుపైకి పెట్టుకొని పడిపోయి తీవ్రవేదనలు పడును. కామాచారులు - పాశుపతులు - లింగధారులు శంఖచక్రము ద్రాంకితులును - వైఖానసమతాను యాయులు - వీరెల్లరును వేదవిరుద్ధముగ నడచువారు. వీరు నరకమున గూలుదురు. వేదోక్తమైనదే సద్ధరమ్ము. మానవుడు దానినే యాచరింపవలయును. క్షణక్షణము జాగ్రత్తగ తెల్వితో మేలుకొనువా డీనాడు నేనే మేమి తప్పులు చేసితినని యాత్మవిమర్శనము చేసికొనవలయును. ఒకని కిచ్చి నది ఇప్పించినదినోట బల్కినది ఆనాడు చేసిన మహా పాతకములు ఉపపాతకములు నన్నిటి నాత్మవిమర్శతో తెలిసి కొనవలయును. జామురేయి యుండగనే లేచి బ్రహ్మ ధ్యానము చేయవలయును. అపుడు తన యెడమ తొడపై కుడి పాదమును కుడి తొడపై నెడమ పాదము నుంచవలయును. తలకొద్దిగ ముందునకుజాపి గడ్డము ఱొమ్మునకు తాకించి లోచూపులో సత్యభావము నిలిపి పండ్లకు పండ్లు దగిలించక నాలుకను రెండు దౌడల నడుమ స్థిరముగా నిలిపి ఇంద్రియ ప్రవృత్తులనణచిపట్టి నోరు మూసుకొని నిశ్చలముగ సమప్రదేశమున దర్బాసనముపై కూర్చుండవలయును.

ద్విగుణం త్రిగుణం వాపి ప్రాణాయామముపక్రమేత్‌ | తతోధ్యేయః స్థితో యో సౌ హృదయే దీపవత్ర్పభుః. 37

ధారయేత్తత్రచా೭೭త్మానం ధారణాంధారయే ద్బుధః | సధూమశ్చ విధూమశ్చ సగర్బశ్చాప్యగర్బకః. 38

సలక్ష్య శ్చా ప్యలక్ష్యశ్చ ప్రాణాయామస్తు షడ్విధః | ప్రాణాయామ సమోయోగః ప్రాణాయామ ఇతీరితః. 39

ప్రాణాయామ ఇతి ప్రోక్తో రేచ పూరక కుంభ##కైః | వర్ణత్రయాత్మకాహ్యేతే రేచపూరక కుంభకాః. 40

స ఏవ ప్రణవః ప్రోక్తః ప్రాణాయామశ్చ తన్మయః | ఇడయా వాయు మారోప్య పూరయిత్వోదరే స్థితమ్‌. 41

శ##నైః షోడశమాత్రాభి రన్యయా తం విరేచయేత్‌ | ఏవం సధూమః ప్రాణానామాయామః కథితో మునే. 42

ఆధారే లింగనాభి ప్రకటిత హృదయే తాలు మూలే లలాటే | ద్వే పత్రే షోడశారే ద్విదశ దశదళద్వాదశార్ధేచతుష్కే!

వాసాం తే బాలమధ్యే డఫకఠసహితే కంఠదేశే స్వరాణాం |

హంక్షం తత్త్వార్థ యుక్తం సకలదళగతం వర్ణరూపం నమామి. 43

అరుణ కమల సంస్ణా తద్రజః పుంజవర్ణా | హరనియమితచిహ్నా పద్మతంతు స్వరూపా |

రవిహుతవహరాకానాయకాస్యస్తనాఢ్యా | సకృదపి యది చిత్తే సంవసే త్య్సాత్స ముక్తః. 44

స్థితిః సైవ గతిర్యాత్రా మతిశ్చింతా స్తుతిర్వచః | అహం సర్వాత్మకో దేవః స్తుతిః సర్వం త్వదర్చనమ్‌. 45

అహం దేవీ న చాన్యో స్మి బ్రహైవా హం నశోకభాక్‌ |

సచ్చిదానంద రూపో హం స్వాత్మాన మితి చింతయేత్‌. 46

ప్రకాశమానాం ప్రథమే ప్రయాణ ప్రతి ప్రయాణప్య మృతాయ మానామ్‌ |

అంతః పదవ్యా మను సంచరంతీ మానంద రూపా మమలాం ప్రపద్యే. 47

తతో నిజ బ్రహ్మరంధ్రే ధ్యాయోత్తం గురు మీశ్వరమ్‌ | ఉపచారై ర్మానసైశ్చ పూజయేత్తు యథావిధి. 48

స్తువీతానేన మంత్రేణ సాధకో నియతాత్మవాన్‌ | గురుర్ర్బహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః.

గురు రేవ పరంబ్రహ్మ తసై#్మ శ్రీగురవే నమః. 49

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ప్రాతశ్చింతనం నామ ప్రథమోధ్యాయః.

ప్రాణాయామము రెండు లేక మూడుసార్లు చేయవలయును. పిదప హృదయశిఖలమధ్య వెల్గు జ్ఞాన విజ్యోతిని ధ్యానించవలయును. అంత పండితుడు తనలో తన్ను ధారణ చేసికొనవలయును. ప్రాణాయామము సధూమము - అధూమము సగర్బము ఆగర్బము సలక్ష్యము అలక్ష్యము అని యారు విధములుగ నుండును. ప్రాణాయామమునకు సాటియైన యోగము ప్రాణాయామమే. ప్రాణాయామము మరల రేచక - పూరక - కుంభకములను మూడు విధములుగ నుండును. ఓంకారము లోని మూడు వర్ణములందు ప్రాణాయామము రేచకపూరకకుంభకములుగ నుండును. ప్రాణాయామము ప్రణవాత్మకము. పరమాత్మ ప్రణవ స్వరూపుడు కనుక ప్రాణాయామమును పసరమాత్మరూపమే. మొదట నిడానాడితో పదారుసార్లు ఆకారముతో పూరించి ఉకారముతో పదారుమాత్రల కాలము వాయువును కుంభించ వలయును. తర్వాత పదారు మాత్రలలో మకారముతో వాయువును రేచింపవలయును. ఇది సధూమ ప్రాణాయామ మనబడును. తర్వాత దేహములోని యారుచక్రము లకు నమస్కరింపవలయును. గుదము-లింగము-నాభి-హృదయము- కంఠము-భ్రమధ్యము ఇవి ఆరు చక్రము లుండుచోటులు. భ్రూ మధ్య మందలిరెండు కమలదళములలోహ - క్షవర్ణములు కంఠమందలి పదారు దళములలో అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ బుూ ........... ఏ ఐ ఓ ఔ అం అః స్వరము లుండును. హృదయములో పండ్రెండు దళములందు క ఖ గ ఘ చ ఛ జ ఘ ఞ ట ఠ వర్ణములును నాభియందలి పది దళములలో డ ఢ ణ త థ ద ధ న ప ఫ వర్ణములును లింగ మూలమున నారు దళము లలో బ భ మ య ర ల వర్ణములును గుద మూలమున నాల్గు దళాలలో వ శ ష స వర్ణములు నుండునని నెఱింగి కమలములకు వర్ణములకు నమస్కరించవలయును. వానిలో గుదస్థానమునం దున్న అరుణ కమలమున నీలకమల తంతువువలె సూక్ష్మరూప మున విలసిల్లి రజోమయి రక్తవర్ణ కులకుండలిని హ్రీంకార మంత్రోజ్వల మాయాదేవి విరాజిల్లుచుండును. సూర్యుడామె ముఖము. అగ్ని - చంద్రులు స్తనములు. కుండలిని ఆ దేవి స్వరూపము. అటిట దేవి నొక్కమారైన ధ్యానించినవాడు ముక్తుడుగా గలడు. ఆ కుండలినీ శక్తియే విశ్వమునకు స్థితి-గతి-యాత్ర-మతి-చింత-స్తుతి-వాక్కు. ఆమె అహంశబ్ద ప్రతిపాద్యయై చెన్నొందును. నేను సర్వాత్మకుడను. నా స్తుతియంతయు దేవి దివ్యార్చనయే యని భావింపవలయును. ఆ దేవిని నేనే. ఇంకేదియును గాను. నేను శోకరహిత పరబ్రహ్మనును - సచ్చిదానంద స్వరూపమను అని తన యంతర్వృత్తి నీ విధముగ తలంచ వలయును. అంత నానందముతో నెద పులకరింపగ కుండలనీశక్తి సహస్రారమునకు చేరునపుడు జ్యోతిర్మయియై మరల మూలాధారము చేరునపు డమృతవర్షిణియై వెలుగుల వెలుగై సర్వాంతరయై యొప్పును. అట్టి కుండలినీ శక్తిని శరణొందు చున్నానని తలంచవలయును. పిమ్మట తన కీశ్వరుడైన సద్గురువును బ్రహ్మరంధ్రమున యథావిధిగ మానసికముగ నుపచారుము లతో నర్చించి ధ్యానించవలయును. అటుపిమ్మట సాధకుడు నియతాత్ముడై మనసార ఈ మంత్రమును జపించవలయును.

గురుర్బృహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః |

గురురేవ పరంబ్రహ్మ తసై#్మ శ్రీగురవే నమః.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున ప్రాతశ్చింతనమను మొదటి యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters