Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోదశోధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ : అధాతః శ్రూయతాం శేష మనూనాం చిత్ర ముద్బవమ్‌ | యస్య స్మరణమాత్రేణ దేవీభక్తిః వ్రజాయతే. 1

ఆసన్వైవస్వత మనోః పుత్రాః షడ్విమలోదయాః | కరూష శ్చ పృశధ్రశ్చ నాభాగో దిష్టఏవచ. 2

శర్యాతిశ్చ త్రిశంకుశ్చ సర్వఏవ మహాబలాః | తతః షడేవ తే గత్వా కాళం ద్యాస్త ర ముత్తమమ్‌. 3

నిరాహారాజితశ్వాసాః పూజాం చక్రుస్తతః స్థితాః | దేవ్యా మహీమయీం మూర్తిం వినిర్మాయ పృథ క్పృధక్‌. 4

వివిధై రుపచారైస్తాం పూజయామాసు రాదృతాః | తతశ్చ సర్వ ఏవైతే తపః సారా మహాబలాః. 5

జీర్ణపరా శనా వాయు భక్షణాస్తోయ జీవనాః | ధూమ్రపానారశ్మిపానాః క్రమశశ్చ బహుశ్రమాః. 6

తత స్తేషామాదరేణా೭೭రాధనం కుర్వతాం సదా | విమలా మతిరుత్పన్నా సర్వమోహ వినాశినీ. 7

బభూవుర్మను పుత్రాస్తే దేవీపాదైక చింతనాః | మత్యా విమలయా తేషా మాత్మన్యేవాఖిలం జగత్‌. 8

దర్శనంసంగామాశు తదద్బుత మివా భవత్‌ | ఏవం ద్వాదశవర్షాంతే తపసా జగదీ శ్వరీ. 9

ప్రాదుర్బభూవ దేవేశీ సహస్రార్క సమద్యుతిః | తాందృష్ట్వా విమలాత్మానో రాజపుత్రాః షదేవతే. 10

తుష్టువు ర్బక్తి నమ్రాంతఃకరణా బావసం యుతాః |

రాజపుత్రా ఊచుః: మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే. 11

వాగ్బవారాధన ప్రీతే వాగ్బవ ప్రతిపాదితే | క్లీంకార విగ్రబే దేవి క్లీంకారప్రీతి దాయిని. 12

కామరాజ మనోమోద దాయినీశ్వర తోషిణి | మహామాయే మోదపరే మగాసామ్రా జ్యదాయిని. 13

విష్ణ్వర్క హరిశక్రాది స్వరూపే భోగ వర్ధిని | ఏవం స్తుతాభగవతీ రాజపుత్రైర్మ హార్మభిః. 14

పదుమూడవ అధ్యాయము

శ్రీదేవిచరితము - మన్వంతర కధనము

శ్రీనారాయణు డిట్లనెను : ఇంక మిగిలిన మనువు యద్బుతమైన పుట్టుకలు వినుము. వానిని వినిన మాత్రమున దేవీభక్తి తప్పక గలుగును. శ్రీవైవస్వత మనువున కార్గురు పుత్రు లుదయించిరి. వారు కరూషుడు పృష ధ్రుడు నాభాగుడు దిష్టుడు శర్యాతి త్రిశంకుడు ననువారు మహాబలశాలురు. వీరార్గురు కాళిందీ తీరమున కేగిరి. వారచట నిరాహారులై గాలిని బంధించి దేవీమూర్తి నిర్మంచుకొని వేర్వేరుగ పూజింపసాగిరి. దేవిని వివిధోపచారములతో భక్తితో పూజించుచుండిరి. వారు తపోబలమున మహావిక్రము లయిరి. ఎండిన యాకు లాహారముగను వాయువు భోజనముగను నీరు జీవనముగను పొగ కాంతి పానముగను చోసికొని వారు పడరాని పాట్లు పడిరి. అట్లు వారు భక్తి గౌరవములతో దేవి నారాధించుచుండగ వారికి మోహనాశకమైన నిర్మలబుద్ధి యేర్పడెను. వారు నిరంతరము దేవీపాదములే చింతించుచు తమ నిర్మల హృదయమం దెల్ల లోకములు గాంచుచు నాచరించిన తీవ్రతపఃఫలముగా వారి కద్బుతమైన దేవీ దర్శన భాగ్యము కలిగెను. ఈ విధముగ పండ్రెండేండ్లు గడచిన పిమ్మట జగదీశ్వరి వేల సూర్యుల కాంతులు మిఱుమిట్లు గొల్పుచు వారికి ప్రతక్షమయ్యెను. ఆర్గురు రాకుమారులు విమలాత్ములై శ్రీదేవిని దర్శించిరి. వారు భక్తి వినయములుగల హృదయములతో దేవి నిట్లు సంస్తుతించిరి. మహేశ్వరి! ఈశాని! పరమా! కరుణాలయా! నీకు జయము వాగ్వ మంత్రము ప్రతిపాదించు దేవీ! వాగ్బవారాధనమున సంతుష్టురాలా! కీంకారమూర్తీ! క్లీంకార ప్రీతిదాయినీ దేవి! ఈశ్వరప్రియా! కామరాజ జపమున నానంద మొసంగు దేవి! మహామాయా! మహాసామ్రాజ్యదాయినీ! అనందమయి హరి హప రవి మహోంద్రస్వరూపిణీ! భోగవర్ధినీ! నీకు జయము అని రాజపుత్రులు భగవతిని నుతించిరి.

ప్రసాదమసుముఖీ దేవీ ప్రోవాచ వచనం శుభమ్‌ |

శ్రీదేవ్యువాచ: రాజపుత్రా మహాత్మానో భవంతు స్తవసా యుతాః. 15

నిష్కల్మషాః శుద్ధధియో జాతావైమదుసాపనాత్‌ | వరం మనోగతం సర్వం యాచధ్వ మవిలంబితమ్‌. 16

ప్రసన్నాహం ప్రదాస్యామి యుష్మాకం మనసి స్థితమ్‌ |

రాజపుత్రాఊచుః: దేవి నిష్కంటం రాజ్యం సంతతిశ్చిర జీవినీ. 17

భోగా అవ్యాహతాః కామం యశ##స్తేజో మతిశ్చహ | అకుంఠితస్త్వం సర్వేషా మేషఏవ వరోహితః. 18

శ్రీదేవ్యువాచ: ఏవ మస్తు చ సర్వేషాం భవతాం యన్మనో గతమ్‌ |

అథా న్యదపి మేవాక్యం శ్రూయతా మాదరాదిదమ్‌. 19

భవంతః సర్వేఏవైతే మన్వం తర పతీశ్వరాః | సంతత్యా దీర్ఘయాభోగై రనేకైరపి సంగమః. 20

అఖండిత బలైశ్వర్యం యశ##స్తేజో విభూతయః | భవితారోమత్ర్పసాదా ద్రాజపుత్రాః క్రమేణతు. 21

శ్రీనారాయణ ఉవాచ: ఏవం తేభ్యోవరాన్దత్వా భ్రామరీ జగదంబికా |

అంతర్ధానం జగామా೭೭శు భక్త్యాతైః సంస్తుతా సతీ. 22

తే రాజపుత్రాః సర్వేపి తస్మిన్‌ జన్మన్యనుత్తమమ్‌ | రాజ్యం మహీగతా న్బోగా న్బుభుజుశ్చమ హౌజసః. 23

సంతతిం చాఖండితాంతే సముత్పాద్య మహీతలే | వంశం సంస్థాప్య సర్వేపి మనూనాం పతయో భవన్‌. 24

భవాంతరే క్రమేణౖవ సావర్ణిదభాగినః | ప్రథమో దక్షసావర్ణి ర్నరమో మను రీరితః. 25

అవ్యాహతబలో దేవ్యాః ప్రసాదా దభవద్విభుః | ద్వితీయో మేరుపావర్ణి ర్దశమో మనురేవ చ. 26

బభూవ మన్వం తరనృపో మహాదేవీ ప్రసాదతః | తృతీయో మనురాఖ్యాతః సూరసావర్ణినామకః. 27

ఏకాదశో మహోత్సాహ స్తపసాస్వేనభావితః | చతుర్థశ్చం ద్రసావర్ణి ర్ద్వాదశో మనురాడ్విభుః. 28

దేవి ప్రసన్నవదనముతో వారి కిట్లు పలికెను. రాజపుత్రులారా! మహాత్ములారా! నా యుపాసనచే మీరుతపో మయులు నిర్మలచిత్తులు మంచిబుద్ధి గలవారు నైతిరి. వేగముగ వరములు కోరుకొనుడు. నేను మీ యెడల ప్రసన్నురాల నైతిని. మీ మదిలోని కోర్కె తెల్పుడు. రాజపుత్రు లిట్లనిరి: దేవీ! మాకు నిష్కంటకమైన రాజ్యము చిరంజీవులగు పుత్రులు గావలయును. మాకు తఱుగని భోగభాగ్యములు యశము-తేజము-మతి గలుగవలయును. ఇదే మేము కోరు వరము. శ్రీదేవి యిట్లనెను : మీ మనస్సులందుగల దంతయు నెఱవేరగలదు అతేకాక శ్రద్ధగ నికొకటియును వినుడు. మీరెల్లరును మన్వంతరములకు పతులు చగాగలరు. చిరంజీవులైన పుత్రులతో భోగభాగ్య సంగమములతో నానందింపగలరు. రాజపుత్రులారా! నా దయవలన మీ కఖండబల సంపదలు యశము తేజము విభూతులు వరుసగ గలుగ గలవు. శ్రీనారాయణు డిట్లు పలికెను : ఇట్లు భ్రామరి జగదంబ వారి చేతభక్తితో సంస్తుతించబడి వారికి వరము లొసగి యంతర్ధాన మందెను. ఆ రాజపుత్ర వీరులందఱు నదే జన్మలోనే భూమిమీదగల యుత్తమమైన సకల రాజ్యభోగము లను భవించిరి. వారు భూతలమున నఖండ సంతానము బడసి తమ నంశవృక్షము పెందించుకొని తుదకు మనువులైరి. వారు తర్వాతి జన్మలందు వరుసగ సావర్ణి మనువులైరి. వారిలో మొదటివాడు దక్షసావర్ణి తొమ్మిదవమను వయ్యెను. అతడు దేవీ దయవలన మొక్కవొని బలశాలి యయ్యెను. తర్వాత మేరుసావర్ణి పదవ మను వయ్యెను. అతడును దేవి దయవలన మన్వంతరపతి యయ్యెను. తర్వాత సూర్యసావర్ణి. ఇతడును తన తపోబల మబిమవలన పదునొక్‌డవ మను వయ్యెను. నాల్గవవాడు చంద్రసావర్ణి యన పండ్రెండవ మను వయ్యెను.

దేవిసమారాధనేన జాతో మన్వం తరేశ్వరః | పంచమో రుద్రసావర్ణి స్త్రయో దశమనుః స్మృతః. 29

మహాబలో మహాసత్త్వో బభూవ జగదీశ్వరః | షష్ఠశ్చ విష్ణుసావర్ణి శ్చ తుర్దశమనుః కృతీ. 30

బభూవ దేవీ వరతో జగతాం ప్రథితః ప్రభుః | చతుర్ధశైతే మనవో మహాతేజో బలైర్యుతాః. 31

దేవ్యారాధనతః పూజ్యా వంద్యాలోకేషు నిత్యశః | మహా ప్రతాపినః సర్వే భ్రామర్యాస్తు ప్రసాదతః. 32

నారద ఉవాచ : కేయం సాభ్రామరీ దేవీ కథం జాతా కిమాత్మికా |

తదాభ్యానం వద ప్రాజ్ఞ విచిత్రం శోకనాశకమ్‌. 33

న తృప్తిమగచ్ఛామి పిబన్దేవీ కథా మృతమ్‌ | అమృతం పిబతాం మృత్యు ర్నాస్య శ్రవణతో యతః. 34

శ్రీనారాయణ ఉవాచ : శృణు నారద వక్ష్యామి జగన్మాతుర్వి చేష్టితమ్‌ |

అచింత్యా వ్యక్తరూపాయా విచిత్రం మోక్షదాయకమ్‌. 35

యద్యచ్చరిత్రం శ్రీదేవ్యాస్తత్సర్వంలోకహేతవే | నిర్వ్యాజయా కరుణాయా పుత్రే మాతుర్యథా తథా. 36

పూర్వం దైత్యో మహావాసీ దురుణాఖ్యో మహాబలః | పాతాళే దైత్య సంస్థానే దేవద్వేషీ మహాఖలః. 37

సదేవాన్‌ జేతు కామశ్చ చకార పరమం తపః | పద్మసంభవ ముద్దిశ్య సనస్త్రాతా భవిష్యతి. 38

గత్వా హిమవతః పార్శ్వే గం గాజలం సుశీతలే | పర్వపర్ణాశనోయోగీ సంనిరుధ్య మరుద్గణమ్‌. 39

గాయత్రీ జప సంసక్తః సకామ స్తమసాయుతః | దశ వర్ష సహస్రాణి తతో వారికణాశనః. 40

దశవర్ష సహస్రాణి తతః పవన భోజనః | దశవర్ష సహస్రాణి నిరాహారో భవత్తతః. 41

ఏం తపస్యత స్తస్య శరీరాదుత్థితోనలః | దదాజాహజగతీం సర్వాం తచదద్బుత మివా భవత్‌. 42

అతడు దేవి నారాధించుటవలన మన్వంతరపతి గాగల్గెను. రుద్రసావర్ణి యైదవవాడు. అతడు పదుమూడవ మనువయ్యెను. అతడును మహాబల-సత్త్వములుగల పుడమిఱడయ్యెను. అరవవాడు విష్ణుసావర్ణి పదునాల్గవ మనువయ్యెను. అతడును దేవి దయవలన జగములకు ప్రభు వయ్యెను. పదునల్గురు మనువులును మహాతేజస్సంపన్నులు - బల యుతులునై విరాజిల్లిరి. వారు భ్రామరీదేవిని గోల్చుట వలన నా దేవియను గ్రహమున లోకవంద్యులు-పూజ్యులు- ప్రతాపవంతులునై వన్నె కెక్కిరి. నారదు డిట్లనెను: ఆ భ్రామరీదేవి యెవరు? ఎట్లవతరించెను? ఆమె యాత్మశక్తి యెట్టిది? శోకనాశకమైన దేవి పవ్రిత చరిత్ర నాకు వినిపింపుము. శ్రీదేవి దివ్యకథ సుధారసము చెవులార నెత క్రోలినను తనివి తీరుటలేదు. దేవి కథామృతము చెవులతో గ్రోలువానికి చావు భయము గలుగదు. శ్రీనారాయణు డిట్లనెను: నారదా! జగన్మాత చేష్టలు-విచిత్రములు-మోక్షదములు. దేవి అచింత్య-అవ్యక్తరూపిణి. దేవి దివ్యచరిత్ర లన్నియు నీలోకము నుద్దరించుటకే యున్నవి. తల్లి పను లన్నియును నిష్కపటముగ దయ జాలువారుచు తనయుని గాపాడుటకే యుండును గదా. మున్ను బలిశాలి-దేవదైరి-పాతాళవాసి-మహాక్రూరుడు-దుష్టాత్ముడెనైన అరుణుడను దానవు డుండిను. అతడమరులను గెల్చుటకును తన రక్షణ కొఱకు బ్రహ్మ నుద్ధేశించి ఘోరముగ తప మొనరించెను. తడు మంచు కౌండ కేగి యెండుటాకులే తినుచు గాలిని బిగబట్టి పావన గంగాతీరమున యోగము బూనెను. అతడు పదివేలేండ్లు నీరు త్రాగుచు గాయత్రిని జపించుచు తప మొనరించెను. పిదప పదివేలేండ్లు గాలిని మాత్రము పీల్చుకొనుచు తపించెను తర్వాత మఱి పదివేలేడు లేదియును గొనక నిరాహారుడై తప మాచరించెను. అటుల నతడు తపమాచరించుచుండగ నతని దేహము నుండి పెనుమంటలు చెలరేగి యచ్చెరువు గొలుప లోకములనే కాల్చి వేయుచుండెను.

కిమిదం కిమిదంచేతి దేవాః సర్వేచకంపిరే | సంత్రస్తాః సకలా లోకా బ్రహ్మాణం శరణం యయుః. 43

విజ్ఞాపితం దేవవరైః శ్రుత్వా తత్ర చతుర్ముఖః | గయత్రీ సహితో హంస సమూరూఢోయ¸°ముదా. 44

ప్రాణమాత్రా వశిష్టంతం ధమనీశత సంకులమ్‌ | శుష్కోదరం క్షామగాత్రం ధ్యానమీలితలో చనమ్‌. 45

దదర్శ తేజసా దీప్తం ద్వితీయమిన పావకమ్‌ | వరం వరయ భద్రం తే వత్సయన్మనసి స్థితమ్‌. 46

శ్రుతిమాత్రేణ సంతోష కారణం వాక్యమూచివాస్‌ | శ్రుత్వా బ్రహ్మముఖాద్వాణీం సుధాధారామి వారుణః. 47

ఉన్మీలితాక్షః పురతో దదర్శ జలజోద్బవమ్‌ | గాయత్రీ సహితం దేవం చతుర్వేద సమన్వితమ్‌. 48

అక్షస్రక్కుండికా హస్తం జపంతం బ్రహ్మశాశ్వతమ్‌ | దృష్ట్వోత్థాయ ననామాధ స్తుత్వాచ వివిధైః స్తవైః. 49

వరం వవ్రే స్వబుద్ధిస్థం మాభ##వేన్నృత్యురిత్యపి | శ్రుత్వా రుణవచో బ్రహ్మ బోధయామాస సాదరమ్‌. 50

బ్రహ్మ విష్ణు మహేశాద్యా మృత్యూనా కభలీకృతాః | తత్ర న్యేషాంతు కావార్తా మరణ దానవోత్తమ. 51

వరం యోగ్యం తతో బ్రూహి దాతుం యః శక్యతే మయా |

నాత్రా೭೭గ్రహం ప్రకుర్వంతి బుద్ధిమంతో జానాః క్వచిత్‌. 52

ఇతి బ్రహ్మ వచః శ్రుత్వా పునః ప్రోవాచ సాదరమ్‌ | న యుద్ధేన చ శస్త్రాస్త్రాన్న పుంభ్యోనా పియోషితః. 53

ద్విపాదృదా చతుష్పాద్బ్యో నోభయాకారత స్తధా | భ##వేన్మే మృత్యురిత్యేవం దేవదేహి వరం ప్రభో. 54

బలం చ విపులం దేహి యేన దేవజయో భ##వేత్‌ | ఇతి తస్య వచః శ్రుత్వా తధస్త్వితి వచోబ్రవీత్‌. 55

దత్వా వరం జగామాశు పద్మజః స్వంనికేతనమ్‌ | తతో రుణాఖ్యో దైత్యస్తు పాతాలాత్స్వా శ్రయస్ధితాన్‌. 56

ఇదేమి ఏమి అని దేవతలు భయకంపితులై బ్రహ్మను శరణు వేడిరి. లోకము లట్టుడికినట్లుడికిపోయెను. దేవతల విన్నప మాలకించి గాయత్రితో హంస నెక్కి బ్రహ్మ యోతెచెను. ప్రాణము మాత్రమే మిగిలి యెముకల గూటితో బక్క చిక్కని యరుణుడు ధ్యానములో కనులు మోడ్చి యుండెను. రెండవ యగ్నివలె తేజరిల్లుచున్న యరుణుని బ్రహ్మ చూచి యిట్లనెను. వత్సా! నీ మదిలోని కోర్కి తెల్పుము. నీకు మేలగుగాక! ఇట్లతని చెవులకు విందు చేయుచు బ్రహ్మ పలికెను. బ్రహ్మ నోట నమృతము జాలువారినట్లు వెడలిన వాక్కుల నరుణుడు వినెను. అరుణుడు కన్నులు తెఱచి గాయత్రితో నాల్గు పేదములతో తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మను గాంచెను. అతడు వెంటనే రుద్రాక్షమాల కుండిక గ్రహించి ప్రణవము జపించుచు చేతులు మోడ్చి పెక్కు స్తోత్రములతో బ్రహ్మను స్తుతించెను. తనకు చావు గలుగకుండునట్లు వరమిమ్మని తన బుద్ధిలోని కోర్కి నతడు గోరెను. అరుణుని మాటలు విని బ్రహ్మ యతని కెంతో మెల్లగ నిట్లు పలికెను. దానవోత్తమా! బ్రహ్మ-విష్ణు-మహేశులే కాలధరముము నొందుదురు. ఇక సామాన్యులు చత్తురనుటలో వింత యేమున్నది. నీవు తగిన వర మడుగుము. దాని నీయగలను. దీని కంతగ బుద్ధిమంతులు మొండిపట్టు పట్టరు. అను బ్రహ్మవాక్కులు విని దానవుడు తిరిగి పలికెను. ప్రభు నాకు యుద్దములో శస్త్రాస్త్రములతో స్త్రీ పరుషులతో రెండు కాళ్ల-నాల్గు కాళ్ల జంతువులతో రెండాకారాలుగల ప్రాణులతోను చావు గలుగకుండునట్లు వరమిమ్ము. దేవా! నే నెవ్వనికి నోడిపాని బలమిమ్ము. అను వాని మాటలు విని బ్రహ్మ తథాస్తు అనెను అట్లు బ్రహ్మ వర మొసంగి తనచోటికి తా నరిగెను. పిమ్మట నరుణుడు పాతాళమునుండి తన్ను నమ్ముకోనియున్న దానవుల నెల్లర పిలిపించెను.

దైత్సానాకారయామాస బ్రహ్మణో వరదర్పితః | ఆగత్య తేసురాః సర్వే దైత్యేశం తం ప్రచక్రిరే. 57

దూతం చప్రేషయామాసుర్యుద్ధార్ధ మమరావతీమ్‌ | దూత వాక్యం తదా శ్రుత్వా దేవరాడ్బయ కంపితః. 58

దేవైః సార్ధం జగామా೭೭శు బ్రహ్మణః సదనం ప్రతి | బ్రహ్మవిష్ణూ పురస్కృత్య జగ్ముస్తే శంశరాలయమ్‌. 59

విచారం చక్రిరే తత్ర తేవధార్థం సురద్రుహామ్‌ | ఏతస్మి న్సమయే తత్ర దైత్యసేనా సమావృతః. 60

అరుణాఖ్యోదైత్యరాజో జగామా೭೭శు త్రివిష్టపమ్‌ | సూర్యేందు యమవహ్వీనా మధికారాన్పృథక్పృథక్‌. 61

స్వయం చకార తపాస నారారూపధరోమునే | స్వ స్వస్ధాన చ్యుతాః సర్వే జగ్ముః కౌఐలాస మండలమ్‌. 62

శశం సుః శంశరం దేవాఃస్వ స్వదుఃఖం పృథక్పృథక్‌ | మహాన్వి చారస్తత్రా೭೭సీత్కిం కర్తవ్య మతః పరమ్‌. 63

నయుద్ధే న చ శస్త్రాసై#్రర్న పుంభ్యోనాపియోషితః | ద్విపాద్బ్యోవా చతుష్పా ద్బ్యోనోభయా కారతో పివా. 64

మృత్యుర్బ వేదితి బ్రహ్మా ప్రోవాచ వచనం యతః | ఇతి చింతాతురాః సర్వే కర్తుం కిం చిన్న చక్షమాం. 65

ఏతస్మి న్సమయే తత్ర వాగభూ దశరీరిణీ | భజద్వం భువనేశానీం సా వః కార్యం విధాస్యతి. 66

గాయత్రీ జప సంయుక్తో దైత్యరాడ్యది తాం త్యజేత్‌ | మృత్యుయోగ్య స్తదా భూయాదిత్యుచ్చై స్తోషకారిణీ. 67

శ్రుత్వా దైవీం తథా వాణీం మంత్రయామాసు రాదృతాః | బృహస్పతిం మానాహూయ వచనం ప్రాహ దేవరాట్‌. 68

గురో గచ్ఛ సురాణాంతు కార్యార్ధ మసురం ప్రతి | యథాభ##వే చ్చ గాయత్రీ త్యాగస్త స్యతథా కురు. 69

అస్మాభిః పరమేశానీ సేవ్యతే ధ్యానయోగతః | ప్రస్నా సా భగవతీ సాహాయ్యంతే కరిష్యతి. 70

దానవుడు వారికి తన బ్రహ్మ వరప్రాప్తి గూర్చి యంయు దెల్పెను. అంత రాక్షసు లెల్లరును దైత్యపతిని జేరిరి. అత డింద్రునితో బోరుట కమరావతికి దూతను బంపెను. దూత వాక్కులు విని దేవరాజు భయకంపితు డయ్యెను. అతడు దేవతలను వెంటగొని బ్రహ్మలోక మేగెను. బ్రహ్మ విష్ణువు నెల్లరును కలిసి కైలాస మరిగిరి. వారు సమావేశ##మై దైత్యుని చంపుటకు మంత్రా లోచనలు జరిపిరి. అదే సమయమున నరుణుడు సేనలను గూర్చుకొనెను. అరుణ దైత్యుడు వేగమే స్వర్గమేగెను. తా నొక్కడయ్యు వేర్వేరుగ నతడు సూర్య - చంద్ర - యామాగ్ని రూపములను మఱి నానా రూపములను తన తపోబలమున దాల్చెను. అమరు లెల్లరు నంతకుముందే తమతమ వాసములు విడిచి కైలాస మేగిరి. వారు వేర్వేరుగ శంకరునితో తమ భంగపాట్లు తెల్పుకోనిరి. ఇపుడు మన కర్తవ్య మేమని వారు తమలోతా మాలోచించుకొనిరి. అతనికి యుద్ధములో శస్త్రాస్త్రములతో స్త్రీ పురుషులచే రెండు కాళ్ల - నాలుగ కాల్ల జంతువులచే నుభయాకార జంతువు లచే దేని వలనను చావు గల్గదని బ్రహ్మ వర మిచ్చెను. అని విచారించుచు వా రేమియును చేయజాలకుండిరి. అంతలో వారి కాకాశవాణి యిట్లు విని పించెను. ''మీరు త్రిభువనేశ్వరిని సేవింపుడు. ఆ దేవి మీ కార్యము నెఱవేర్పగలదు. వాడు నిరంతరము గాయత్రిని జపించును. ఆ జప మాగిన వెంచనే వానికి చావు మూడును'' అను సంతోషకరమైన వాణి వారికి వినబడెను. దేవి వాక్కు విని వారు దానిని గూర్చి సాదరముగ నాలోచింపసాగిరి. అంతలో నింద్రుడు గురుని పిలిపించి యిట్లనెను. గురువర్యా! నీ విపుడు దేవకార్యము నిమిత్త మసురుని చెంత కేగుము. వాడు గాయత్రి జపము మానునట్లు చేయము. ఇట మేమును నిశ్చల ధ్యానముతో పరమేశానిని గొల్చుచుందుము. దేవి ప్రసన్నయై నీకును సహాయ మొనర్ప గలదు.

ఇత్యాదిశ్య గురుం సర్వే జగ్ముర్జాంబూన దేశ్వరీం | సాస్త్మాన్దెత్య భయత్రస్తా నాపలయుష్యతి శోభన. 71

తత్ర గత్వా తపశ్చర్యాం చక్రుః సర్వే సునిష్ఠితాః | మాయాబీజ జపాసక్తా దేవీ మఖ పరాయణాః. 72

బృహస్పతి స్తతః శీఘ్రం జగామాసుర సన్నిధౌ | ఆగతం ముని వర్యం తం పప్రచ్ఛాథ సదైత్యరాట్‌. 73

మునే కుత్రాగమః కస్మాత్కిమర్ధమితి మేవద | నాహం యుష్మత్పక్షపాతీ ప్రత్యుతారాతి రేవచ. 74

ఇతితస్య వచః శ్రుత్వా ప్రోవాచమునినాయకః | అస్మ త్సేవ్యాచ యాదేవీ సా త్వయా పూజ్యతే నిశమ్‌. 75

తస్మా దస్మత్పక్షపాతీ నభ##వేస్త్వం కథంవద | ఇతి తస్య వచః శ్రుత్వా మోహితో దేవమాయయా. 76

తత్యాజ పరమం మంత్రమభిమానేన సత్తమ | గాయత్రీ త్యాగతో దైత్యో నిస్తే జస్కోబభూవహ. 77

కృతకార్యో గురుస్తస్మాత్ద్సానాన్ని ర్గత వాన్పునః | తతో వృత్తాంత మఖిలం కధయా మస వజ్రిణ. 78

సంతుష్టాస్తే సురాః సర్వే భేజిరే పరమేశ్వరీమ్‌ | ఏవం బహుగతేకాలే కస్మిం శ్చిత్సమయేమునే. 79

ప్రాదురాసి జ్జగన్మాతా జగన్మంగళకారిణీ | కోటి సూర్య ప్రతీకాశా కోటికందర్ప సుందరా. 80

చిత్రానులేపనాదేవీ చిత్రవా సో యుగాన్వితా | విచిత్ర మాల్యాభరణా చిత్ర భ్రమర ముష్టికా. 81

వరభయకరా శాంతా కరుణామృత సాగరా | నానా భ్రమర సంయుక్త పుష్పమాలావిరాజితా. 82

భ్రమరీభిర్వి చిత్రాభి రసంఖ్యాభిః సమావృతా | భ్రమ రైర్గాయమానైశ్చ హ్రీంకారమను మన్వహమ్‌. 83

సమంతతః పరివృతా కోటికోటి భిరంబికా | సర్వశృంగార వేషాఢ్యా సర్వ వేద ప్రశం సితా. 84

అని గురువును కాధేశించి యింద్రుడు - దేవత లెల్లరును రాక్షసభీతులగు తమ్ము గాపాడుమని జాంబూనదీశ్వరీదేవి సన్నిధి కరిగిరి. వారెల్లరు నచట మాయాబీజము జపించుచు దీక్షతో శ్రీదేవీయాగ పరాయణులై తప మాచరింపసాగిరి. అపుడు బృహస్పతియును వెంటనే రాక్షసుని చెంత కేగెను. ఆ దైత్యరాజు తన చెంతకు వచ్చిన మునివరు నిట్లు ప్రశ్నించెను. మునివర్యా! ఎక్కడ నుండి రాక? ఎక్కడికి! ఏమి పని? నాకు తెల్పుము. నేను నీ పక్షపాతిని గాను. నీకు శత్రువను సుమా! అను దానవుని మాచలు విని ముని నాయకు డిట్లు పలికెను. మేము నిరంతరము జపించు గాయత్రీ దేవినినీవును సేవించుచున్నావు. కనుక నీవు మా పక్షపాతి వెట్లు గావు? అనుగురు వచనములు విని దానవుడు దేవమాయకు మోహితుడయ్యెను. అత డభిమానముకు లొంగి పరమమంత్రముగు గాయత్రిని వదలెను. దానివలన నతడు తేజోహీను డయ్యెను. గురుడును వచ్చిన కార్యము త్వరలో నెఱవేరుటవలన నా చోటు వదలి వెళ్లెను. జరిగిన దంతయు నింద్రునితో చెప్పెను. దేవతలెల్లరును సంతోషించి పరమేశ్వరిని గొల్చిరి మునీ! ఇట్లు చాలకాలము గడచెను. ఒక సమయమున జగన్మంగళ కారిణియగు జగన్మాత ప్రాదుర్బవించెను. ఆమె కోటి సూర్యల ప్రభలతో వెల్గుచు కోటి మన్మథులవలె మేని సొబగులు మీరుచు చిత్రమైన మైపూతలతో చిత్రవస్త్రములతో విచిత్ర మాల్యాభరముతో పిడికిట నున్న విచిత్ర భ్రమరములతో వరాభయముద్రలతో పెక్కు తుమ్మెదలు మూగిన పూలమాల దాల్చి దయామృత ముట్టిపడగ శాంతయై లెక్కకు మిక్కిలియచై చిత్రమైన తుమ్మెదలు తన చుట్టు చేరి హ్రీంకారనాదము నిరంతరముగ గానము చేయుచుండగా కోట్ల తుమ్మెదలు తన చుట్టు చేరి కొల్చుచుండ సకల శృంగార సంపదలతో సర్వ వేదములచే ప్రశంసింపబడుచుండెను.

సర్వాత్మికా సర్వమయీ సర్వ మంగళ రూపిణీ | సర్వజ్ఞా సర్వజననీ సర్వ సర్వేశ్వరీ శివా. 85

దృష్ట్వా తాం తరళాత్మానో దేవా బ్రహ్మ పురోగమాః | తుష్టువ్హురృష్ఠ మనసో విష్టరశ్రవసం శివామ్‌. 86

దేవాఊచః: నమో దేవి మహా విద్యే సృష్టిస్ధిత్యంత కారిణి | నమః కమల పత్రాక్షి సర్వధారే నమోస్తుతే. 87

స విశ్వతైజస ప్రాజ్ఞ విరాట్సూత్మాత్మికే నమః | నమోవ్యాకృత రూపాయై కూటస్ధాయై నమోనమః. 88

దుర్గే సర్గాదిరహితే దుష్టసంరోధ నార్గళే | నిరర్గల ప్రేమగమ్యే భ##ర్గేదేవి నమోస్తుతే. 89

నమః శ్రీకాళికే మాతర్నమో నీల సరస్వతి | ఉగ్రతారే మహోగ్రేతే నిత్యమేవ నమోనమః. 90

నమః పీతాంబరే దేవి నమస్త్రిపుర సుందరి | నమో భైరవి మాతంగి ధూమావతి నమోనమః. 91

ఛిన్నమస్తే మనస్తేస్తు క్షీరసాగర కన్యకే | నమః శాకంభరి శివే నమస్తే రక్తదంతికే. 92

నిశుంభ శుంభదళివి రక్తబీజ వినాశిని | ధూమ్రలోచన నిర్ణాశే వృత్రా సురనిబ్హరిణి. 93

చండముండ ప్రమధిని దానవాంతకరే శివే | నమస్తే విజయే గంగే శారదే వికచాననే. 94

పృధ్వీరూపే దయారూపే తేజోరూపే నమోనమః | ప్రాణరూపే మహారూపే భూతరూపే నమోస్తుతే. 95

విశ్వమూర్తే దయామూర్తే ధర్మమూర్తే నమోనమః | దేవమూర్తే జ్యోతిమూర్తే జ్ఞానమూర్తే నమోస్తుతే. 96

గాయత్రి వరదే దేవి సావిత్రి చ సరస్వతి | నమః స్వాహేస్వధేమాత ర్దక్షిణతే మమోనమః. 97

నేతినేతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః | సర్వ ప్రత్య క్స్వరూపాం తాం భజామః పరదేవతామ్‌. 98

సర్వాత్మిక - సర్వమయి-సర్వమంగళరూపిణి-సర్వజ్ఞ-జర్వజనని-సర్వ- సర్వేశ్వరి - శివ-అగు తల్లిని బ్రహ్మ మొదలగు దేవత లెల్లరును దర్శించి తమ మన్సులు సంతోషింపగ శివాభవాని నిట్లు సంస్తుతించిరి. దేవత లిట్లనిరి : కమలపత్రాక్షి! సర్వాధార! మహావిద్యాదేవి! సృష్టి స్ధిత్యంతకారిణీ! నీకు మా ప్రణామములు తల్లి! విశ్వ-తైజస-ప్రాజ్ఞ-విరట్‌-సూత్రాత్మా వ్యాకృత-కూటస్ధరూపములుగల దేవికి మాప్రణామములు. సర్గాదిరహిత-దుష్టులను చంపుటలో స్వతంత్రురాలా! నిరర్గల ప్రేమగమ్యా! భర్గతేజస్విని! దుర్గా! నీకు మా ప్రణామములు. కాళీమాత! నీలసరస్వతీ! ఉగ్రతార! ఏ మహోగ్రా! నీకు ప్రతి నిత్యము నీవే మా ప్రణామములు. పీతాంబర ధారిణీదేవి! త్రిపురసుందరీ! భైరవి! మాతంగీ! ధూమావతి! నీకు మా హృదయ ప్రణామములు. ఛిన్నమస్తా! పాలకడలి పట్టీ! శాకంభరీ! రక్తదంతికే! శివా! నీకు మా భక్తి ప్రణామములు. శుంభనిశుంభ నాశినీ! రక్తబీజ వినాశినీ! ధూమ్రలోచన సంహారిణీ! వృత్రాసుర నిగాదనీ! చండముండమర్దినీ! దానవాంతకరీ! శివా! విజయా! గంగా! శారదా! వికచవదనా! నీకు మా ప్రణామములు పృధ్వీ-ప్రాణ-భూత-మహా-దయా-తేజో రూపిణీ! నీకు మా ప్రణామములు విశ్వ-దేవ-దయా-ధర్మ-జ్ఞాన-జ్యోతిమూర్తి! నీకు మా సుమాంజలుల ప్రణామములివిగో. దేవీ! గామత్రీ! సావిత్రీ! సరస్వతీ! స్వాహా - స్వధా - దక్షిణా ! వరదాయిని దేవి! నీకు మా కోటి కోటి ప్రణామములు. ఆగమశాస్త్రములు నేతినేతి యను వాక్యములతో నిన్ను వర్ణించును. సర్వ ప్రత్యక్స్వరూపిణివి. పరదేవతవు. అట్టి నీకు మా ప్రణామశతములు!

భమరైర్వేష్టితా యస్మాద్ర్బామరీయా తతః స్మృతా | తసై#్య దేవ్యై నమోనిత్యం నిత్యమేవ నమోనమః. 99

నమస్తే పార్శ్వయోః పృష్ఠే నమస్తే పురతోంబికే నమ ఊర్ధ్వం నమశ్చాదః సర్వత్రైవ నమోనమః. 100

కృపాం కురు మహాదేవీ మణిద్వీపాధివాసని | అనంతకోటి బ్రహ్మాండనాయికే జగదంబికే. 101

జయదేవి జగన్మాత ర్జయదేవి పరాత్పరే | జయశ్రీభువనేశాని జయసర్వోత్తమోత్తమే. 102

కల్యాణ గుణరత్నా నా మాకరే భువనేశ్వరి | ప్రసీద పరమేశాని ప్రసీద జగతో రణ. 103

నారాయణ ఉవాచ : ఇతి దేవవచః శ్రుత్వా ప్రగల్బం మధురం వచః |

ఉవాచ జగదంబాసా మత్తకోకిలభాషిణీ. 104

శ్రీదేవ్యువాచ : ప్రసన్నాహం సదాదేవా పరదేశశిఖామణిః |

బ్రువంతు విబుధాః సర్వే యదేవ స్యాచ్చికీర్షితమ్‌. 105

దేవీవాక్యం సురాః శ్రుత్వా ప్రోచుర్దుఃఖస్య కారణమ్‌ | దుష్టదైత్యస్య చరితం జగద్బాధాకరం పరమ్‌. 106

దేవబ్రాహ్మణవేదానాం హేలనం నాశనం తథా | స్థాన భ్రంశం సురాణాం చ కథయామాసురా దృతాః. 107

బ్రహ్మణో వరదానం చ యథావత్తే సమూచిరే | శ్రుత్వా దేవముఖాద్వాణీం మహాభగవతీ తదా 108

ప్రేరయామాస హస్తస్థా న్ర్బమరాన్‌భ్రామరీ తదా | పార్మ్వస్థానగ్ర భాగస్థా న్నానారూపధరాం స్తదా. 109

జనయామాస బహూశో యైర్వ్యాప్తం భువన త్రయమ్‌ | మటచీయూథ వత్తేషాం సమూదాయస్తునిర్గతః. 110

తదాంతరిక్షం తైర్వ్యప్త మంధకారః క్షితావభూత్‌ | దివి పర్వత శృంగేషు ద్రుమేషు విపినేష్వపి. 111

భ్రమరా ఏవ సంజాతా స్తదద్బుత మివాభవత్‌ | తే సర్వే దైత్యవక్షాంసి దారయామాసు రుద్గతాః. 112

తుమ్మెదలచే కొలువబడుట వలన భ్రామరీదేవి యని ప్రసిద్ధి గాంచిన దేవీ! నీకు ప్తరినిత్యము మా ప్రణామ శతములు. అంబానీ ప్రక్క భాగములకు పూర్వ భాగమునకు నీపై భాగమునకు క్రింది భాగమునకు నెల్లెడల మా ప్రణామములు. అనంతకోటి బ్రహ్మాండనాయికా! జగదంబికా! మణిద్వీప నివాసినీ! మహాదేవీ! మా పై దయ చూపగదవే జననీ! జగన్మాతా! వరాత్పరాదేవీ! శ్రీభువనేశానీ! సర్వోత్తమకల్యాణ గుణరత్నములకు నిలయా భువనేశ్వరీ! పరమేశానీ! విశ్వకారిణీ! మా యెడల ప్రసన్నవు గమ్మా! నారాయణు డిట్లనెను : అను దేవతల తీయని తెలివిగల వచనములు విని మత్తకోకిల కలవరముతో జగదంబ వారి కిట్లు పలికెను. దేవతలారా! మీ యెడల సుప్రన్ననైతిని. మీ కోరికలు తెలుపుడు. మీ కెల్లరికి వరము లీయగలను. అను దేవి వాక్యము విని తమ దుఃఖ కారణమును దుష్టదానవుని చరిత్రనువాడు జగము లను భాదించు తీరును వాడు దేవ బ్రహ్మణవేదములను పరిహసించి నశింపచేయుటను దేవతల స్థానభ్రంశము నంత యును దేవతలు దేవికి విన్నవించిరి. వానికి బ్రహ్మ యిచ్చిన వరము గూర్చియు తేల్పిరి. మహా భగవతీదేవి దేవతలు చెప్పిన దంతయును వినెను. అపుడు భ్రామరీదేవి తన చేతిలో నున్న ప్రక్కలనున్న పలు రూపములుగల తుమ్మెదలను ప్రేరేపించెను. ఇంకను నెక్కువ తుమ్మెదలను సృజించెను. అవన్నియును మిడుతల దండువలె ముల్లోకములు వ్యాపించెను. అవి యంతరిక్షమంతట నిండిపోవుచటే నేలపై చీకట్లు గ్రమ్ముకొనెను. దివిపై - పర్వత శిఖరములందుచెట్లపై - అడవు లందును ఎల్లెడలను తుమ్మెదల దండు మహాద్బుతముగ నిండియుండెను. అవన్నికును జేరి అరుణ దైత్యుటొమ్ము చీల్చి వేసినవి.

నరం మధుహరం యద్వన్మక్షికాః కోప సంయుతాః | ఉపాయోన చ శస్త్రాణాం తథా స్త్రాణాం తదా భవత్‌. 113

నయుద్ధం న చ సంభాషా కేవలం మరణం ఖలు | యస్మిన్యస్మిన్థ్సలేయేయే స్థితాదైత్యా యథా యథా. 114

తత్రైవ చ తథా సర్వే మరణం ప్రాపురుత్స్మయాః | పరస్పరం సమాచారో న కస్యాప్యభవత్తదా. 115

క్షణమాత్రేణతే సర్వే వినష్టా దైత్య పుంగవాః | కృత్వేత్థం భ్రమరాః కార్యం దేవీని కట మాయయుః. 116

ఆశ్చర్య మేతదాశ్చర్యమితి లోకాః సమూచిరే | కిం చిత్రం జగదంబాయా యస్యామాయేయమీదృశీ. 117

తతో దేవగణాః సర్వే బ్రహ్మ విష్ణు పురోగమాః | నిమగ్నా హర్షజలధౌ పూజయా మాసు రంబికామా. 118

నానోపచార వివిధైర్నా నోపాయన పాణయః | జయ శబ్ధం ప్రకుర్వాణా ముముచుః సమనాంసి చ. 119

దివి దుందుభమో ర్ననృతు శ్చాప్సరో గణాః | పేఠుర్వేదాన్ము నిశ్రేష్ఠా గంధర్వాద్యా జగుస్తథా. 120

మృదంగ మురజావీణా ఢక్కాడ మరునిః స్వనైః | ఘంటా శంఖనినాదైశ్చ వ్యాప్త మాసీజ్జగత్త్రయమ్‌. 121

నానాస్తోత్రై స్తదాస్తుత్వా మూర్ద్న్యాధాయాం జలీం స్తదా | జయమాతర్జయే శానీత్యేవం సర్వే సమూ చిరే. 122

తత స్తుష్టా మహాదేవీ వరాన్దత్వా పృథక్పృథక్‌ | స్వస్మిం శ్చ విపులాం భక్తిం ప్రార్థితాతైర్దదౌ చ తామ్‌. 123

పశ్యతామేవదేవానా మంతర్థానం గతా తతః | ఇతి చే సర్మమాఖ్యాతం భ్రామర్యాశ్చరితం మహత్‌. 124

పఠతాం శృణ్వతాం చైవ సర్వ పాపప్రణాశనమ్‌ | శ్రుత మాశ్చర్య జనకం సంసారార్ణవ తారకమ్‌. 125

ఏవం మనూనాం సర్వేశాం చరితం పాపనాశనమ్‌ | దేవీ మాహాత్మ్య సంయుక్తం పఠన్‌ శృణ్వన్‌ శుభప్రదమ్‌. 126

యశ్చైతత్పఠతే నిత్యం శృణుయా ద్యో నిశం నరః | సర్వపాప వినిర్ముక్తో దేవీసాయుజ్య మాప్ను యాత్‌. 127

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ దశమస్కంధే త్రయేదశోధ్యాయః.

దశమస్కంధః సమాప్తః.

సార్ధురుద్రైః పంచశత (5111/2) శ్లోకైర్వ్యాస కృతైః శుభైః | దేవీ భాగవతస్యాస్య ధసమస్కంధ ఈరితః.

తేనెపట్టువానిని తేనెటీగలు కోపముతో పట్టి కుట్టునట్టుల నవన్నియును వానిని మిక్కిలి బాధించెను. అపుడు వాని శస్త్రాస్త్రము లేమియు పని చేయలేకుండెను. సంభాషణలు లేవు - యుద్ధము లేదు. చావు మాత్రము మిగిలినది. ఏయే దానవులేయే చోట్ల నుండిరో అచ్చటచ్చట నున్నవా రక్కడిక్కడనే ఈల్గిరి. ఒకరి సమాచారమింకొకరి కందలేదు. దైత్యవర్యులందఱు క్షణకాలములో నశించిరి. ఇట్లు కాగల పని తుమ్మెదలు నిర్వహించి పిదప నన్నియును మరల దేవిని చేరెను. ఏమి వింత! ఏమి వింత! యనుచు లోకము లచ్చెరు వొందెను. ఇదంతయును జగదంబ మాయవలననే జరిగినది. అప్పుడు బ్రహ్మ - విష్ణువు మొదలగు దేవత లందఱు నానంద సాగరమున నోలలాడి జగదంబికను పూజించిరి. వారు వివిధోపచారము లతో పలు విధముల కానుకలతో మేలైన పూలు సమర్పించి జయ జయ నినాదములు చేసిరి. దినిపై దేవదుందుభులు మ్రోగెను. అచ్చరలు నర్తించిరి. మునివరులు వేదములు చదివిరి గంధర్వులు పాడిరి ముల్లోకములవారును మృదంగ-మురజ-వీణా-ఢక్కా-డమరు-ఘంటా- శంఖ నినాదములు మ్రోగించుచు దేవీ మహోత్సవములు జరిపిరి. ఎల్లరును తమ తలలపై చేతులు జోడించి మ్రొక్కి పలు విధములైన స్తోత్రములతో తల్లీ! జయము! ఈశానీ జయమని పలు విధముల దేవిని నుతించిరి. అంత మహాదేవి సంతోషించి వారి వారికి తగినట్లుగ వేర్వేరుగ వరము లిచ్చెను. కొంధఱు వేడుకొనగ వారికి నిశ్చలభక్తి ప్రసాదించెను. తర్వాత దేవతలు చూచుచుండగనే దేవి యదృశ్య యయ్యెను. ఈ విధముగ నీకు మహాశ్చర్యకరమైన భ్రామరీదేవి చరిత్ర తెల్పితిని. దీనిని చదివిన - వినినవారి పాపరాసులు నశించును. ఈ విధముగ నీకు మహాశ్చర్యకరమైన భ్రామరీదేవి చరిత్ర తెల్పితిని. దీనిని చదివిన - వినినవారి పాపరాసులు నశించును. ఆశ్చర్యకరమైనది సంసార సాగర తారకమైనది యగు దేవి చరితము వినబడినది. ఈ విధముగ మనువు లందఱి పారనాశనమైన దివ్య చరితములును శ్రీదేవి మాహాత్మ్యములును చదివిన - విని శుభములు చేకూరును. దీనిని నిత్యము చదివిన - వినిన మానవుడు తప్పక సర్వపాపముక్తుడై శ్రీదేవి సాయుజ్యము చేరగలడు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున పదుమూడవ యధ్యాయము.

దశమ స్కంధము సంపూర్ణము.

శ్రీదేవి భాగవతములోని పదవ స్కంధము 511 ½ శ్లోకములతో శుఙములు ప్రసాదించుచున్నది.

Sri Devi Bagavatham-2    Chapters