Sri Devi Bagavatham-2    Chapters   

అథసప్తమోద్యాయః

సూత ఉవాచ ః ఇతి వాక్యం సమాకర్ణ్య విబుధానాంద్వి జోత్తమః |కరిష్యే కార్యమే తద్వః ప్రత్యువాచ తతో మునిః. 1

అంగీకృతే తదా కార్యే మునినా కుంభ జన్మనా | దేవాః ప్రముదితాః సర్వే బభూవుర్ద్విజసత్తమాః. 2

తే దేవాం స్వాని ధిష్ణ్యాని భేజిరే మునివాక్యతః | పత్నీం మునివరః శ్రీమానువాచ నృపకన్యకామ్‌. 3

ఆయే నృపసుతే ప్రాప్తో విఘ్నోనర్థస్య కారకః | భానుమార్గనిరోధేన కృతో వింధ్యమహీభృతా. 4

అజ్ఞాతం కారణం తచ్చ స్మృతం వాక్యం పురాతనమ్‌ | కాశీ ముద్దిశ్య యద్గీతం మునభిస్తత్త్వ దర్శిభిః 5

అవిముక్తం న మోక్తవ్యం సర్వథైవ ముముక్షుభిః | కీంతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నిసతాం సతామ్‌. 6

సోంతరాయో మయా ప్రాప్తః కాశ్యాం నివసతా ప్రియే | ఇత్యేవ ముక్త్వా భార్యాంతాం మునిః పరమతాపసః 7

మణికర్ణ్యాం సమాప్లుత్య దృష్ట్వా విశ్వేశ్వరం విభుమ్‌. | దండపాణిం సమభ్యర్చ్య కాలరాజసమాగతః. 8

కాలరాజ మహాభాహో భక్తానాం భయహారక | కథం దూరయసే పుర్యాః కాశాపుర్యా స్త్వమీశ్వరః 9

త్వం కాశీవాస విఘ్నానాం నాశకో భక్త రక్షకః | మాం కిం దూరయసే స్వామిన్‌ భక్తారి%్‌త వినివారక 10

పరాపవాదో నోక్తో మే నపైశున్యం న చా నృతమ్‌ | కేన కర్మవిపాకేన కాశ్యా దూరం కరోషి మామ్‌. 11

ఏవం ప్రార్థ్య చ తం కాలనాథం కుంభోద్బవో మునిః | జగామ సాక్షివిఘ్నేశం సర్వవిఘ్ననివారణమ్‌. 12

తం దృష్ట్యాభ్యర్చ్య సంప్రార్థ్య తతః పుర్యా వినిర్గతః | లోపాముద్రాపతిః శ్రీమా నగస్త్యో దక్షిణాం దిశమ్‌. 13

ఏడవ అధ్యాయము

శ్రీదేవీ చరితము

సూతుడిట్లనెను. ః అను దేవతల వచనములు విని మీపని తప్పక నెఱవేర్చగలనని ఆగస్త్యమహాముని మాట యిచ్చెను. ద్విజులారా! ఈ విధముగ ఆగస్త్యముని దేవ కార్యమున కొప్పుకొనగ దేవతలెల్లరును ప్రమోదమొందిరి. ముని వాక్కులు విశ్వసించి దేవతలు తమ తమ నెలవుల కరిగిరి. శ్రీమంతుడైన మునీశ్వరుడు రాకుమార్తె యగు తన పత్నితోనిట్లు పలికెను. రాకుమారీ! ఇప్పుడనర్థమైన యొక యాటంకము వచ్చి పడినది. వింధ్యగిరి సూర్యమండలమున కడ్డుగ నిలచినది. తత్త్వ దర్శనులైన మునులు కాశిని గూర్చి పల్కిన పురాణమైన నానుడు గలదు. దాని కారణ మేమో తెలియకున్నది. అదేమన- ముక్తికాముమ లెన్నడును గాశి వదలి వెళ్ళగూడదు. కాని కాశివాసులకు మాత్రమెన్ని యో విఘ్నము లెదురగుచునే యున్నవి. ప్రేయసీ ! అటులే కాశిలో నివసించునాకును నేడు విఘ్నమెదురైనది. అని పరమ తాపసుడగు ముని తన పత్నితోననెను. అపుడు ముని మణికర్ణికలో స్నానము చేసి కాశీ విశ్వనాథుని సందర్శించెను. దండపాణినర్చించి పిదప కాల భైరవుని దర్శించి యిట్లనెను. మహాబాహూ ! కాలభైరవా! భక్తుల భయముబాపు స్వామి ! ఈకాశీపురి కధీశ్వరుడవయ్యు నీవు నన్ను కాశీనుండియేల దూరము చేయుచున్నావు? నేనెవరిని నిందింపలేదు. నాలో లోభము లేదు. అసత్యమాడి యెఱుగను. మఱినన్నే కర్మవిపాకమచే దూరము చేయుచున్నావు. ఆగస్త్యముని యిట్లు కాలభైరవుని ప్రార్థిం సర్వ విఘ్నహరుడగు సాక్షి గణపతి సన్నిధికేగెను. తర్వాత లోపాముద్రాపతి - శ్రీ మంతుడగు అగస్త్యముని గణపతిని దర్శించి కొలిచి ప్రార్థించి దక్షిణ దిక్కుగ బయలుదేరెను.

కాశీవిరహ సంతప్తో మహాభాగ్య నిధిర్మునిః | సంస్మృత్యాను క్షణం జగామ సహభార్యయా. 14

తపోయాన మివారు హ్య నిమిషార్ధేన వై మునిః | అగ్రే దదర్శ తం వింధ్యం రుద్ధాంబరమథోన్నతమ్‌. 15

చకంపే చాచల స్తూర్ణం దృష్ట్వై వాగ్రే స్థితం మునిమ్‌ | గిరిః ఖర్వతరో భూత్వా వివక్షు రచనీ మివ. 16

దండవత్పతితో భూమౌ సాష్టాంగం భక్తి భావితః | తం దృష్ట్వా నమ్రశిఖరం వింధ్యం నామ మహాగిరిమ్‌. 17

ప్రసన్నవదనో7గస్త్యో ముని ర్వింధ్య మథాబ్రవీత్‌ | వత్సైవం తిష్ఠ తావత్త్వం యావదాగమ్యతే మయా. 18

అశక్తోహం గుండశైలారోహనే తవ పుత్రక | ఏవముక్త్వా ముని ర్యామ్యది శంప్రతి గమోత్సుకః 19

ఆరుహ్య తస్య శిఖరా ణ్యవారుహదను క్రమాత్‌ | గతోయామ్యదిశం చాపి శ్రీశైలం ప్రేక్ష్యవర్త్మని. 20

మలయాచ ల మాసాద్య తత్రా೭೭శ్రమపరోభ##వేత్‌ | సాపి దేవీ త్రత వింధ్య మాగతా మనుపూజితా. 21

లోకేషు ప్రథితా వింధ్యవాసినీతి చ శౌనక | సూత ఉవాచః ఏతచ్చరిత్రం పరమం శత్రునాశన ముత్తమమ్‌. 22

అగస్త్యవింధ్యనగయో రాఖ్యానం పాపనాశనమ్‌ | రాజ్ఞాం విజయదం తచ్చ ద్విజానాం జ్ఞానవర్ధనమ్‌. 23

వైశ్యానాం ధాన్యధనదం శూద్రాణాం సుఖదం తథా | ధర్మార్థీ ధర్మమాప్నోతి ధనార్తీ ధన మాప్నుయాత్‌. 24

కామా నవాప్నుయత్కా మీ భక్తా చాస్య సకృచ్చ్రవాత్‌ | ఏవం స్వాయంభువమను ద్ధేవీ మారాధ్య భక్తితః 25

లేఖే రాజ్యం ధరాయా శ్చ నిజమన్వంతరాశ్రయమ్‌. 26

ఇత్యేత ద్వర్ణితం సౌమ్య మయా మన్వం తరా శ్రితమ్‌ | ఆద్యం చరిత్రం శ్రీదేవ్యాః కిం పునః కథ యామి తే. 27

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కధే సప్తమోధ్యాయః

కాశిను వదలుచున్నందులకు బాధపడి మహోభాగ్య నిధియగు ముని కాశి-కాశి-కాశి యని స్మరించుచు తన భార్యతో తరలెను. తపోయానము నెక్కి పోయినట్లు-ముని సగము నిమిషంలోనే సూర్యునడ్డగించిన వింధ్యమును జేరెను. తన యెదుట నిలుచున్న మునిని గాంచి వెంటనే వింధ్యగిరి వణికి నేలను తాకునట్టు చిన్నదిగ నయ్యెను. ఆది భక్తిభావముతో మునికి దండ ప్రణామముచేసెను. శిఖరములను వంచుకొనిన వింధ్య మహాగిరిని ముని చూచెను. ఆగస్త్యముని ప్రసన్నవదలముతో వింధ్యమునకిట్లనెను. వత్సా ! నేను మఱల తిరిగి వచ్చు వఱకు నీవిటులే యుండును నీ యత్తైన గుండశిలలు నే నెక్కలేదు. అని ముని దక్షిణదిశగ కేగుట కుత్సహించెను. వింధ్య శిఖరము లెక్కి వరుసగ దిగి ముని దక్షిణ దిశగ వెళ్ళి త్రోవలో శ్రీశైలమును దర్శించెను. తర్వాత మలయాచల మేగి యచట నాశ్రమ మేర్పఱచుకొనెను. పూర్వము స్వాయంభువ మనుపు పూజించిన దేవియును వింధ్యగిరిపై నెలవై యుండెను. శౌనకా ! ఆమె వింధ్యవాసిని యని లోకమున ప్రసిద్ధిగాంచను. సూతు డిట్లనెను. ఈ దేవి చరితము పరమోత్తరమము. శత్రు నాశనము. ఆగస్త్య వింధ్యగిరుల పాపాన చరిత్రము-పాపహరము. ఇది ద్విజులకు జ్ఞానమును రాజులకు విజయమును వైశ్యులకు ధనధాన్యములును శూద్రులకు సుఖములును కలిగించును. దీనివలన ధర్మార్థి- ధర్మమును ధనార్థి -ధనమును బడయగలడు. దీని నొక్కసారియైన కడు భక్తితో విన్నవాడు. తన కోరిన కోర్కె లన్నియు బడయగలడు. ఈ ప్రకారముగ స్వాయంభున మనువు మునుపు భక్తితో శ్రీదేవి నారాధించెను. అతడు తన మన్వంతర కాలమంతయును సామ్రాజ్యము చక్కగ నేలనె. సౌమ్యుడా! ఈ విధముగ తొలి మన్వంతరము సంబంధించిన చరిత్రము నీకు వర్ణించితిని. ఇది దేవి దివ్యకథ. ఇంకేమి వినదలతువో తెలుపుము.

ఇది శ్రీదేవవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున సప్తమాధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters