Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశోధ్యాయః

వ్యాసః : ఏవం ప్రబోధితః పిత్రా త్రిశంకుః ప్రణతో నృపః | తథే తి పితరం ప్రాహ ప్రేమగద్గదయా గిరా. 1

విప్రా నాహూయ మంత్రజ్ఞా న్వేదశాస్త్ర విశారదాన్‌ | అభిషేకాయ సంభారా న్కారయామాస సత్వరమ్‌. 2

సలిలం సర్వతీర్థానాం సమానాయ్య విశాంపతిః | ప్రకృతీ శ్చ సమాహూయ సామంతా న్బూపతీం స్తదా. 3

పుణ్యహ్ని విధివత్తసై#్మ దదావాసన ముత్తమమ్‌ | అభిషచ్య సుతం రాజ్యే త్రిశంకుం విధివ త్పితా. 4

తృతీయ మాశ్రమం పుణ్యం జగ్రాహ భార్యయా యుతః | వనే త్రిపథగా కూలే చచార దుశ్చరం తపః. 5

కాలే ప్రాప్తే య¸° స్వర్గం పూజిత స్త్రిదశైరపి | ఇంద్రాసనసమీపస్థో రరాజ రవివత్సదా. 6

రాజోవాచ : పూర్వం భగవతా ప్రోక్తం కథాయోగేన సాంప్రతమ్‌ | సత్యవ్రతో వసిష్ఠేన శప్తో దోగ్ద్రీవ ధాత్కిల. 7

కుపితేన పిశాచత్వం ప్రాప్తితో గురుణా తతః | కథం ముక్తః పిశాచత్వా దిత్యేతత్సంశయః ప్రభో. 8

న సింహాసనయోగ్యో హి భ##వే చ్ఛాపసమన్వితః | మునినా మోచితః శాపా త్కేనాన్యేన చ కర్మణా. 9

ఏత న్మే బ్రూహి విప్రర్షే శాపమోక్షణ కారణమ్‌ | అనీత స్తు కథం పిత్రా స్వగృహే తాదృశకృతిః. 10

వసిష్ఠేనచ శప్తోసౌసద్యః పైశాచతాం గతః | దుర్వేష శ్చాతిదుర్దర్షః సర్వలోకభయంకరః. 11

పండ్రెండవ అధ్యాయము

త్రిశంకు వృత్తాంతము

తన తండ్రి ఇట్లు ప్రబోధింపగ త్రిశంకుడు విని ప్రేమతో గద్గదమయిన వాక్కుతో నట్లేయని పలికెను. అపుడు రాజు వేదశాస్త్రవిశారదులు మంత్రవిదులునైన బ్రాహ్మణులను రావించి వెంటనే యభిషేకసామగ్రి సమకూర్చెను. అతడు సర్వతీర్థముల జలములు తెప్పించి రాజులను మంత్రులను ప్రజలనందఱ నాహ్వానించెను. రాజొక పుణ్యశుభముహూర్తమున విధివిధానమున తనత్రిశంకు కుమారుని రాజ్యమందభిషేకించి యాసన మప్పగించెను. ఆతడు పిదప తన భార్యతో వనములకేగి వానప్రస్థాశ్రమము స్వీకరించి గంగాతీరమునందు తీవ్ర తప మొనరించెను. మరణకాలము సమీపించగనే యరుణుడు స్వర్గమేగి సురపూజితుడై యింద్రాసనము సమీపమున సూర్యునివలె వెల్గుచుండెను.

రాజిట్లనెను : మున్ను గోవును చంపుటవలన వసిష్ఠుడు సత్యవ్రతుని శపించెనని కథాసందర్బమున నీవు చెప్పితివి. ప్రభూ! గురువు కోపించగా సత్యవ్రతుడు పిశాచత్యము పొంది తిరిగి పిశాచత్వమునుండి యెట్లు ముక్తుడయ్యెనను సంశయము గల్గుచున్నది. శాపగ్రస్తుడు సింహాసన మెక్కుటకు తగడు కదా. ముని యేకర్మమువలన నతనిని పిశాచత్వముక్తిని జేసెనో తెల్పుము. విప్రర్షీ! నా కీతని శాపమోక్షణమగూర్చి తెలుపుము. అట్టి పిశాచాకారము గలవాని నతని తండ్రి యొట్లు రప్పించెను. సత్యవ్రతుడు వసిష్ఠుని శాపమును వెంటనే పిశాచత్వమొంది కుచ్చితుడు-దుస్సహుడు-క్రూరుడు-లోక భయంకరుడు నయ్యెను.

యదైవోపాసితా దేవీ భక్త్యా సత్య వ్రతేన హ | తయా ప్రసన్నయా రాజ న్దివ్యదేహః కృతః క్షణాత్‌. 12

పిశాచత్వం గతం తస్యం పాపం చైవక్షయం గతమ్‌ | విపాప్మా చాతితే జస్వీ సంభూత స్తత్కృపామృతాత్‌. 13

వసిష్ఠోపి ప్రసన్నాత్మా జాతః శక్తిప్రసాదతః | పితాపి చ బభూవాస్య ప్రేమయుక్త స్త్వనుగ్రహాత్‌. 14

రాజ్యం శశాస ధర్మాత్మా మృతే పితరి పార్దివః | ఈజే చ వివిదై ర్యజ్ఞై ర్దేవదేవీం సనాతనీమ్‌. 15

తస్య పుత్రో బభూవాధ హరిశ్ఛంద్రః సుశోభనః | లక్షణౖః శాస్త్రనిర్దిష్టైః సంయుత శ్చాతి సుందరః. 16

యువరాజం సుతం కృత్వా త్రిశంకుః పృధివీవతిః | మానుషేణ శరీరేణ స్వర్గం భోక్తుం మనోదధే. 17

వసిష్ఠస్యా೭೭శ్రమం గత్వా ప్రణమ్య విధివ న్నృపః | ఉవాచ వచనం ప్రీతః కృతాంజలి పుట స్తదా. 18

బ్రహ్మ పుత్ర మహాభాగ సర్వమంత్రవిశారద | విజ్ఞప్తిం మే సుమనసా శ్రోతు మర్హసి తాపస. 19

ఇచ్ఛా మేద్య సముత్పన్నా స్వర్గలోకసుఖాయ త | అనేనైవ శరీరేణ భోగా న్బోక్తు మమానుషాన్‌. 20

అప్సరోభిశ్చ సంవాసః క్రీడితుం నందనేవనే | దేవగంధర్వగానం చ శ్రోతవ్వం మధురం కిల. 21

యాజయ త్వం మఖేనా೭೭శు తాదృశేన మహామునే | యథానేన శరీరేణ వసేలోకం త్రివిష్ఠవమ్‌. 22

సమర్థోసి మునిశ్రేష్ఠ కురు కార్యం మమాధునా | ప్రాపయా೭೭శు మఖం కృక్వా దేవలోకే దురాసదమ్‌. 23

సత్యవ్రతుడు శ్రీదేవిని భక్తప్రపత్తులతో నుపాసింపగ దేవి సుప్రసన్నయై క్షణములో నతనికి దివ్యదేహము ప్రసాదించెను. శ్రీత్రిభువనేశ్వరీదేవి దయామృతమున నతని పిశాచత్వము తొలగెను. పాపములు పటాపంచయ్యెను. అతడు పాపరహితుడు తేజస్వి యయ్యెను. దేవి దయవలన వసిష్ఠుడును ప్రన్నుడయైను. సత్యన్రతుని తండ్రియును కొడుకు నెడల ప్రేమగలవాడయ్యెను. తన తండ్రి మరణించగ త్రిశంకుడు సనాతనియగు దేవదేవిని గూర్చి ధర్మమతితో పెక్కులు దేవీ మహాయజ్ఞము లొనరించెను.

త్రిశంకునకు హరిశ్చంద్రుడుదయించెను. అతడందగాడు. శాస్త్రమున చెప్పిన శుభలక్షణములు గలవాడు. త్రిశంకుడు అట్టి తన కుమారుని రాజుగజేసి యీ మానవశరీరముతోడ స్వర్గ మనుభవింప మది దలంతెను. అతడు వసిష్ఠు నాశ్రమమేగి విధివిధానమున నమస్కరించి చేతులు ముకుళించి నెమ్మదితో ముని కిట్లనెను. ఓ తాపసోత్తమా! బ్రహ్మపుత్రా! మహానుభావా! సర్వమంత్ర విశారదా! మంచి మనస్సుతో నా విన్నప మాలింపుము. ఈ మానవ శరీరముతో స్వరలోక సుఖములు భోగించవలయునని నాకు కోరిక గల్గినది. నందనవనమందు దేవకన్యలతో నల్లిబిల్లిగగూడి యుండుటకు మధుర మైన దేవగంధర్వగానము వినుటకు కోర్కి గల్గినది. ఓ మహామునీ! ఈ శరీరముతోడ స్వర్గమేగ గల్గునట్టి యజ్ఞము చేయించుము. మునివర్యా! ఇపుడ నాతో యాగము చేయించుటకు నీవే సమర్థుడవు. వేగమే యజ్ఞముచేసి నన్ను స్వర్గము జేర్పుము.

వసిష్ఠః రాజన్మానుష దేహేన స్వర్గేవాసః సుదుర్లభః | మృతస్య హి ధ్రువః స్వర్గః కధితః వుణ్యకర్మణా. 24

తస్మా ద్బిభేమి సర్వజ్ఞ దుర్లభాచ్చ మనోరథాత్‌ | అప్సరోభిశ్ఛ సంవాసో జీవమానస్య దుర్లభః. 25

కురు యజ్ఞా న్మహాభాగ మృతః స్వర్గమవాప్స్యసి | ఇత్యాకర్ణ్య వచస్తస్య రాజా పరమ దుర్మనాః. 26

ఉవాచ వచనం భూయో వసిష్ఠం పూర్వరోషితమ్‌ | న త్వం యాజయసే బ్రహ్మ న్గర్వావేశాచ్చ మాం యది. 27

ఆన్యం పురోహితం కృత్వా యక్ష్యేహం కిల సాంప్రతమ్‌ | తచ్చ్రుత్వా వచనం తస్య వసిష్ఠః కోపసంయుతః 28

శశాపభూపతిం చేతి చాండాలో భవదుర్మతే | అనేన త్వం శరీరేణ శ్వపచో భవ సత్వరమ్‌. 29

స్వర్గ కృంతన పాపిష్ఠ సురభీవధ దూషిత | బ్రహ్మపత్నీహరో చ్ఛిన్న ధర్మమార్గవిదూషక. 30

న తే స్వర్గగతిః పాప మృతస్యాపి కధంచన | ఇత్యుక్తో గురుణా రాజం స్త్రిశంకు స్తతదపి. 31

తత్ర తేన శరీరేణ బభూవ శ్వపచాకృతిః | కుండలేశ్మమయే వాపిజాతేతస్య చతతక్షణాత్‌. 32

వసిష్ఠు గిట్లనెయెను : రాజా ! ఈ మానవ శరీరముతో స్వర్గవాసము సాధ్యముకాదు. చచ్చినవాడు తన పుణ్యకర్మ బలముమ స్నర్గమేగును. సర్వజ్ఞా! నీ కోరిక దుర్లభమగుట వలన నాకు భయమగుచున్నది. బ్రతికినవాడచ్చరతో నుంట దుర్లభము కనుక మహాత్మా! మొదట యజ్ఞము చేయుచు. చచ్చి స్నర్గమేగగలవు. అను మునివాక్కులు విని రాజు మది కలత జెందెము. త్రిశంకుడు వసిష్ఠునితోమరల నిట్లనెను. ఓ బ్రాహ్మణుడా! వెనుకటి కోపముతో గర్వావేశముతో నీవు నన్ను యజ్ఞము చేయించుటలేదు. కనుక నేనిపుడువేరొకపురోహితునితో యజ్ఞము జరిపింతును. రాజుమాటలువినగానే వసిష్ఠునకు కోపము వచ్చెను. ఓరిదుర్మతీ! నీవిపుడే త్వరితముగా నిదే శరీరముతో చండాలుడవు గమ్మని వసిష్ఠుడు రాజును శపించెను. ఓరి! నీవు స్వర్గమార్గము చెడగొట్టికొంటివి. గోవధ చేసి నిందితుడవైతివి. బ్రహ్మణ పత్నిని హరించిన నీచుడవు. ధర్మ మార్గమును దూలనాడితివి ఓరి పాపీ! నీవు చచ్చిన పిమ్మట నైనను స్వర్గమునకు వెళ్ళవురా! అను గురు వాక్కులను త్రిశంకుడు విని అదే క్షణమున నదే శరీరముతో చండాలుడయ్యెను. అదే క్షణమున నతని బంగారు కుండలములు రాళ్ళుగా మారెను.

దేహే చందమ గంధశ్ఛ విగంధో హ్యభవత్తదా | నీలవర్ణేచ సంజాతే దివ్యే పీతాంహరే తనౌ. 33

గజనర్ణోభవద్దేహః శాపాత్తస్య మహాత్మనః | శక్త్యుపాసకరోషేణ ఫలమేతదభూన్నృప. 34

తస్మాచ్ఛ్రీ శక్తిభక్తోహి నావమాన్యః కదా చన | గాయత్రీ జపనీష్ఠో హి వశిష్ఠో మునిసత్తమః 35

దృష్ట్వానింద్వం నిజం దేహం రాజా దుఃఖమవాప్తవాన్‌ | న జగామ గృహే దీనో వనమే వాభితో య¸°.

చింత యామాస దుఃఖార్త స్త్రిశంకుః శోకవిహ్యలః | కిం కరోమి క్వ గచ్చామి దేహో మేతీవ నిందితః. 37

కర్తవ్యం నైవ పశ్వామి యేన మే దుఃఖసంక్షయః | గృహే గచ్ఛామి చేత్పుత్రః పీడితోద్య భవిష్యతి. 38

భార్యాపి శ్వవచం దృష్ట్వా నాంగీకారం కరిష్యతి | సచివా నాదరిష్యంతి వీక్ష్య మా మీదృశం పునః 39

జ్ఞాతయో బంధువర్గ శ్ఛ సంగతో భజిష్యతి | సర్యై స్త్యక్తస్య మే నూనం జీవితా న్మరణం వరమ్‌. 40

విషం వా భక్షయిత్వాద్య జలాశ##యే | కృత్వా వా కంఠపాశం త దేహత్యాగం కరోమ్యహమ్‌. 41

అగ్నౌవా జ్వలితే దేహం జుహోమివిధివద్బలాత్‌ | కృత్వా వానశనం ప్రాణాం స్త్యజామి దూషితాన్బృశమ్‌. 42

ఆత్మహత్మా భ##వేన్మూనం పునర్జన్మని జన్మని | శ్వపచత్వం చ శాపశ్చ హత్యాదోషాద్బవేదపి. 43

పునర్విచార్య భూపాల శ్చేతసా సమచింతయత్‌ | ఆత్మహత్యా న కర్తవ్యా సర్వధైవ మయాధునా. 44

ఒకప్పుడు మంచి గంధములు పరిమళించిన దేహమున నిపుడు భరింపరాని దుర్వాసనలు పుట్టెను. మేనిపై దివ్వపీతాంబరములు నల్ల రంగుగ మారెను. మహాత్ముడగు వసిష్ఠుని శాపము కారణము రాజు శరీర మేనుగు శరీరము వలె నల్లగా మారెను. రాజా ! మహా శక్తి నుపాసించు వారి కోపమునకు ఫలిత మిట్లుండును. కనుక శ్రీశక్తి భక్తుల నెన్నడు నవమానింపరాదు. వసిష్ఠుడు విరంతరముగ శ్రీ గాయత్రి జప నిష్ఠాగరిష్ఠుడై బ్రహతేజము మూర్తిభవించియుండెను. తన దేహము చండాల దేహముగ నిందింప-శపింప-బడుట వలన త్రిశంకువు తీపని దుఃఖము జెంది దైన్వముతో తన యింటి కేగక వనములకు వెళ్ళెను. త్రిశంకుడంత దుఃఖర్తితో శోకించుచు మనసు చెడి యిపుడేమిచేతును? ఎక్కడికేగుదును? నా దేహము మిక్కిలి నిందిపబడినది. ఇపుడు నా యిశోకము నశించు నుపాయము లేదు. నేనొకవేళ నా యింటి కేగినచో నా కొడుకే మనోవ్వధ నందును. నన్ను చండాలునిగ జూచి నా భార్యయు నన్ను కన్నెత్తి చూడదు. నా యీ కురూపము చూచి నా మంత్రులు నన్నాదరింపరు. ఇక దాయాదులు చుట్ట పక్కములు నన్ను చేరరానేరురు. కొలువరు. ఇందఱిచేత విడువలసిన నేను బ్రతుకుట కన్న చచ్చుటమేలు కనుక నేను విషము మ్రింగియె నీటిలో దుమికియె మెడకుకురిపోసికొనియె ప్రాణములు వదులను. బలము కొలదితప్పక మండు నిప్పులతో దేహము వేల్తును. కూడు నీరు మాని యి ప్రాణాలు వదలగలను. వీనిలో నేను చేసికొన్నను జన్మ జన్మముల కాత్మహత్మా పాతకము నన్ను వెంటాడును. ఈ యాత్మహత్మ వలన చండాలత్వము తీరని శాపముగ నన్ను వెంబడించగలదు. అని పెక్కు రీతుల రాజు తన మనస్సులో నాలోచించుకొని ఆత్మహత్య చేసికొనుట తగదని తలంచెను.

భోక్తవ్వం స్వకృతం కర్మ దేహే నానేన కాననే | భోగే నాస్వ విపాకస్య భవితా సర్వధా క్షయః 45

ప్రారబ్ద కర్మణాం భోగా దన్యధా న క్షయో భ##వేత్‌ | తస్మా న్మయాత్ర భోక్తవ్వం కృతం కర్మ శుభాశుభమ్‌.

కుర్వ న్పుణ్యాశ్రమాభ్యాశే తీర్ధానాం సేవనం తథా | స్మరణం చాంబికాయాస్తు సాధూనాం నేవనం తధా. 47

ఏవం కర్మక్షయం నూనం కరిష్యామి వనే వసన్‌ | భాగ్యభోగా త్క దాచిత్తు భ##వే త్సాధుసమాగమః. 48

ఇతి సంచింత్య మనసా త్యక్త్వా స్వనగరం నృపః | గంగాతీరే గతః కామం శోచం స్తత్రైవ సంస్థితః 49

హరిశ్చంద్ర స్తదా జ్ఞాత్వా పితుః శాపస్య కారణమ్‌ | దుఃఖితః సచివాం స్తత్ర ప్రేషయామాస పార్దివః. 50

సచివా స్తత్ర గత్వా೭೭శు తమూచుః ప్రశ్రయాన్వితాః | ప్రణమ శ్వపచాకారం నిఃశ్వసంతం ముహుర్ముహుః.

రాజ న్పుత్రేణ తేనూనం ప్రేషితా న్సముపాగతాన్‌ | అవేహి సిచివాం స్త్వం నో హరిశ్చంద్రాజ్ఞయా స్ధితాన్‌. 52

యువరాజ సుతః ప్రాహ యత్త చ్చృణు నరాధిప | ఆనయధ్వం నృపం యూయం సమ్మాని పితరం మమ. 53

తస్మా ద్రాజ న్సమాగచ్ఛ రాజ్యం ప్రతి గతవ్యధః | సేవాం సర్వే కరిష్యంతి సచివాశ్చ ప్రజా స్తథా. 54

గురుం ప్రసాదయిష్యామః స యధాతు దయేతవై | ప్రసన్నోసౌ మహాతేజా దుఃఖస్వాంతం కరిష్యతి. 55

ఇతి పుత్రేణ తే రాజ న్కధితం బహుధా కిల | తస్మాద్గమన మేవా೭೭శు రోచతాం నిజ సద్మని. 56

ఇతి తేషాం నృపః శ్రుత్వా భాషితం శ్వపచాకృతిః | స్వగృహం గమనాయాసౌ న మతిం కృతవానదః. 57

తానువాచ తదా వాక్వనమ్‌ వ్రజంతు సచివాః పురమ్‌ | గత్వాపురం మహాభాగా బ్రువంతు వచనవాచ్చమే. 58

ఈ యడవిలోనే నీ దేహముతో స్వయంకృతాపరాధ మనుభవించుట మంచిది. దీని నిపుడే యనుభవించుటవలన నది యిక్కడనే నశించును. ప్రాకబ్ధకర్మము లనుభవింపకున్న నెన్నటికిని తీరవు. నేను చేసిన మంచిగాని చెడుగాని నేనే యనుభవించవలయును. కనుక నేనిపుడు పావనపుణ్యతీర్దములు సేవించుచు పుణ్యాశ్రమములందు వసించుచు సాధుల సేవించుచు జగదంబను స్మరింపగలను. ఇట్లు వనములు దిరుగుచు కర్మములు బాపుకొనగలను. నా యదృష్టము పండినచో నొకవేళ నాకు సత్పురుషుల సంగమము గలుగవచ్చును. ఇట్లు తలపోసి రాజు తన నగరమున కేగక గంగాతీరమేగి యచట పశ్ఛాత్తాముతో కాలము గడపుచుండెను. అంత హరిశ్ఛంద్రరాజు తన తండ్రి శాపగ్రస్తుడగు టెఱింగి దుఃఖించి మంత్రులను తండ్రివి వెదుక పంపించెను. వారు చండాలరూపముతో పల్మారు నిట్టూర్పుచున్న త్రిశంకునిగని వినయముతో మ్రొక్కి యిట్లనిరి. ఓ రాజా! మేము మంత్రులము. నీ కొడుకగు హరిశ్చంద్ర మహారాజు పంపగ నతని యాజ్ఞ తలదాల్చి వచ్చితిమని మమ్మేఱుంగుము. యువరాజకుమారుడు మాతో పల్కినపలుకులు వినుము. మీరు నాతండ్రిని గౌరవించి కొనితెండు. కనుక రాజా! దిగులుమాని రాజ్యమునకు రమ్ము. నీ ప్రజలు మంత్రు లెల్లరును నీకు పరిచర్యలు చేయగలరు. గురుని ప్రసన్నుని చేయుదుము. అతడు ప్రసన్నుడైనచో నీ దుఃఖముతొలగిపోవును. గురుడు మహాతేజస్వి. రాజా! ఇట్లు నీ కొడుకు మాతో నెంతగనో చెప్పెను. కనుక నీ విపుడు నీ యింటికి త్వరగ బయలుదేరుము. అను వారి మాటలు వినియు చండాలాకృతిగల రాజు తన యింటి కేగుటకు నిశ్చయుంచుకొనలేదు. రాజు మంత్రుల కిట్లనెను: ఓ మంత్రులాలా! మీరు నగరమునకు వెళ్ళుడు. మహాత్ములారా! మీరు నామాటగ నిట్లు చెప్పుడు.

నాగమిష్యా మ్యహం పుత్ర కురురాజ్యం మతం ద్రితః | మానయ న్ర్బాహ్మణా న్ధేవాన్యజన్యజ్ఞై రనేకశః 59

నాహం శ్వపచవేషేణ గర్హితేన మహాత్మభిః | ఆగమిష్యా మ్యయోధ్యాయాం సర్వేగచ్ఛంతూ మా చిరమ్‌. 60

పుత్రం సింహాసనే స్ధాప్య హరిశ్ఛంద్రం మహాబలమ్‌ | కుర్వంతు రాజకర్మాణి యూయం తత్ర మమాజ్ఞయా.

ఇత్యాదిష్టా స్తతస్తేతు రురుదు శ్చాతురా భృశమ్‌ | సచివా నిర్యయుస్తూర్ణం నత్వాతంచ వనాశ్రమాత్‌. 62

అయెధ్యాయా ముపాగత్య పుణహ్ని విధిపూర్వకమ్‌ | అభిషేకం తథా తక్రుర్హరిశ్చంద్రస్య మూర్ద్నితే. 63

అభిషిక్తస్తు తేజస్వీ సచివైశ్చ నృపాజ్ఞయా | రాజ్యం చకార ధర్మిష్ఠః పితరం చింతయన్‌ భృశమ్‌. 65

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ సప్తమస్కంధే ద్వాదశోధ్యాయః.

పుత్రా! నేను రాను. రాజ్యమును వివేకముతో పాలించుము. బ్రాహ్మణులను సమ్మానింపుము. దేవతలను పూజింపుము. యజ్ఞము లాచరింపుము. మహాత్ములు నిందించు ఈ చండాల వేషముతోనయెధ్యానగరములోనడుగు పెట్టజాలను. మంత్రలారా! మీరువెళ్ళుడు. మహాబలుడగుతు నాహరిశ్చంద్ర కుమారుని గద్దెపై నెక్కించి మీరెల్లరు నా యాజ్ఞతో రాజకార్యములు నిర్వహింపుడు. అని త్రిశంకు డాదేశింపగ మంత్రులు మిక్కిలి యేడ్చి రాజునకు వనమునుండి వేగనగరు వైపు నడచిరి. వారయోధ్యజేరి యొక శుభమూహర్తమునందు విధి ప్రకారముగ హరిశ్చంద్రు నభిషేకించిరి. అట్లు రాజాజ్ఞచే మంత్రులు తన్నభిషేకించగ హరిశ్చందుడు తన తండ్రిని దలంచుచు తేజము వెలుగులు చిమ్మగ రాజ్యము చక్కగ పాలించెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున పండ్రెండన యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters