Sri Devi Bagavatham-2    Chapters   

అథ చత్వారింశోధ్యాయః.

నారద ఉవాచ : నారాయణ ప్రియసా చ పరావైకుంఠ వాసినీ | వైకుంఠాధిష్ఠాతృ దేవీ మహాలక్ష్మీః సనాతనీ. 1

కథం బభూవ సా దేవీ పృథివ్యాం సింధుకన్యకా | పురా కేన స్తుతా77దౌ సా తన్మేవ్యాఖ్యాతు మర్హసి. 2

శ్రీనారాయణ ఉవాచ : పురా దుర్వా ససఃశాపా ద్ర్బష్ట శ్రీశ్చ పురందరః | బభూవ దేవసంఘ శ్చ మర్త్యలోకే చ నారద. 3

లక్ష్మీః స్వర్గాదికం త్యక్త్యా రుష్టా పరమ దుఃఖితా | గత్వాలీనా చ వైకుంఠే మహాలక్ష్మీ శ్చ నారద. 4

తదా శోకాద్యయుః సర్వే దుఃఖితా బ్రహ్మణఃసభామ్‌ | బ్రహ్మాణం చ పురస్కృత్య యయుర్వైకుంఠ మేవ చ. 5

వైకుంఠే శరణాపన్నా దేవీ నారాయణ పరే | అతీవ దైన్యయుక్తా శ్చ శుష్కకం రోష్ఠతాలుకాః. 6

తదా లక్ష్మీ శ్చ కలయా పురాణ పురుషాజ్ఞయా | బభూవ సింధు కన్యాసా సర్వ సంపత్స్వరూపిణీ. 7

తథా మథిత్వా క్షీరోదం దేవా దైత్య గణౖః సహ | సంప్రాప్తా శ్చ మహాలక్ష్మీం విష్ణుస్తాం చ ద దర్శహ. 8

సురాదిభ్యో వరం దత్వా వనమాలాం చ విష్ణవే | దదౌ ప్రసన్నవదనా తుష్టా క్షీరోద శాయినే. 9

దేవా శ్చా7ప్య సురగ్రస్తం రాజ్యం ప్రాపుశ్చ నారద | తాన్సం పూజ్య చ సంభూయ సర్వత్ర చ నిరాపదః. 10

నారద ఉవాచ : కథం శశాప దుర్వాసా మునిశ్రేష్ఠః కదాచన | కేన దేషేణ వా బ్రహ్మ న్బ్రహ్మిష్ఠ స్తత్వవిత్పురా. 11

మమం థుః కేనరూపేణ జలధిం తే సురాదయః | కేనస్తో త్రేణవా దేవీ శక్రం సాక్షా ద్బ భూవసా. 12

కోవా తయో శ్చ సంవాదో బభూవ తద్వద ప్రభో | శ్రీనారాయణ ఉవాచ : మధు పానప్రమత్త శ్చత్రైలోక్యాధి పతిః పురా. 13

నలువదవ అధ్యాయము

లక్ష్మీ చరిత్రము

నారదు డిట్లనెను : లక్ష్మీదేవి వైకుంఠవాసిని-నారాయణుని ప్రియురాలు-వైకుంఠాధిష్ఠానదేవి-సనాతని. అట్టి లక్ష్మి భూలోకమున సముద్రుని కూతురుగ నేల పిలువబడుచున్నది. సింధు కన్యకను తొలుదొల్త నెవరు గొల్పిరి. ఇవన్నియును నాకు నీవే తెలుపజాలుదువు. శ్రీనారాయణు డిట్లనెను: నారదా! మునుపు దుర్వాసో మహార్షి శాపమువలన దేవేంద్రుడు స్వర్గ లక్ష్మిని గోల్పోయెను. అపుడు దేవత లెల్లరును భారతభూమిపై గుమిగూడిరి. నారదా ! లక్ష్మీదేవి స్వర్గసీమ వదలి కోపముతో దుఃఖితమతియై వైకుంఠమందలి మహాలక్ష్మిలో లీన అయ్యెను. అపు డెల్లరును చింతా క్రాంతులై బ్రహ్మసభ కేగిరి. అచటి నుండి బ్రహ్మతోగూడ వారు వైకుంఠ మేగిరి. దేవత లెల్లరు నెండిపోయిన కంఠములు-పెదవులు-దౌడలతో దీనముగ నారాయణుని శరణు చొచ్చిరి. అపుడు సకల సంపత్స్వరూపిణియగు లక్ష్మీదేవి పురాణ పురుషుడగు విష్ణు నాజ్ఞచే సాగరకన్యకగ నవతరించెను. దేవదానవ గణము లపుడు పాలసంద్రమును మథించి లక్ష్మిని మరల బడసిరి. విష్ణువు లక్ష్మిని దర్శించెను. లక్ష్మీదేవి దేవతలకు వరములు గురిసి ప్రసన్న ముఖముతో పాలకడలి శయనుడగు హరికి వలమాల నొసంగెను. నారదా! అంత దేవతలు అసురులచేత జిక్కిన రాజ్యము మరల బడసిరి. లక్ష్మిని పూజించి వారు సుఖముగ నుండిరి. నారదు డిట్లనెను : ఓ బ్రహ్మవేత్తా ! పూర్వము బ్రహ్మర్షి-తత్త్వవిదుడునైన దుర్వాస మహర్షి యింద్రు నేల శపించెను. ఇంద్రు డేమి తప్పు చేసెను? సురాదులు సంద్రము నెట్లు చిలికిరి. ఓ స్తోత్రముచే ప్రసన్నయై లక్ష్మీదేవి యింద్రునకు సాక్షాత్కరించెను. ఇంద్ర దుర్వాసులకు మధ్య జరిగిన సంవాద మేమి? ఓ ప్రభూ ! నాకు సర్వము తెలుపుము. శ్రీ నారాయణు డిట్లనెను : మున్ను దేవేంద్రుడు మధుపానమున మత్తెక్కి యుండెను.

క్రీడాం చకార రహసి రంభయా సహకాముకః | కృత్వా క్రీడాం తయా సార్దం కాముక్యా హృతమానసః. 14

తస్థౌ తత్ర మహారణ్య కామోన్మథితమానసః | కైలా సశిఖరేయాంతం వైకుంఠా దృషిసత్తమమ్‌. 15

దుర్వాసనం దదర్శేంద్రో జ్వలంతం బ్రహ్మతేజసా | గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర ప్రభమీశ్వరమ్‌. 16

ప్రతప్త కాంచనాకారం జటాభార మహోజ్జ్వలమ్‌ | శుక్లయ జ్ఞోపవీతం చ చీర దండౌ కమం డలుమ్‌. 17

మహోజ్జ్వలం చ తిలకంభిభ్రతం చేందుసన్నిభమ్‌ | స మన్వితం శిష్యలక్షైర్వేద వేదాంగ పారగైః. 18

దృష్ట్వా ననామశిరసా సంప్రమత్తః పురం దరః | శిష్య వర్గం తదా భక్త్యా తుష్టావ చ ముదాన్వితమ్‌. 19

మునినా చ సశిష్వేణ దత్తాస్తసై#్మ శుభాశిషః | విష్ణు దత్తం పారిజాత పుష్పం చ సు మనోహరమ్‌. 20

తజ్జరారోగ మృత్యుఘ్నం శోకఘ్నం మోక్షకారకమ్‌ | శక్రః పుష్పం గృహీత్వా చ ప్రమత్తో రాజ్య సంపదా. 21

పుష్పం స న్యస్తయామాస తదైవ కరిమస్తకే | హస్తీ తత్స్పర్శ మాత్రేణ రూపేణ చ గుణన చ. 22

తేజసా వయసా కస్మా ద్విష్ణుతుల్యో బభూవ హ | త్యక్త్వా శక్రం గజేంద్ర శ్చ జగామ ఘోరకాననమ్‌. 23

న శశాక మహేంద్రస్తం రక్షితుం తేజసా మునే | తత్పుష్పం త్యక్తవంతం చ దృష్ట్వా శక్రం మునీశ్వరః. 24

తమువా చ మహారుష్టః శశాప చ రుషాన్వితః | మునిరువాచ: అరే శ్రియా మ్రపత్తస్త్వం కథం మా మవమన్యసే. 25

మద్దత్త పుష్పం దత్తం చ గర్వేణ కరిమస్తకే | విష్ణోర్నివే దితం చైవ నైవేద్యం వా ఫలం జలమ్‌. 26

అతడు కామావేశముతో రహస్యముగ రంభతో రతిక్రీడలలో మునిగియుండెను. రంభయును మదాతిరేకమున నతనితో గూడియుండెను. వా రటుల కామపరవశులై మహారణ్యమున రతిసుఖమున మునిగిరి. ఆ సమయమున దుర్వాసుడు వైకుంఠమునుండి కైలాస మేగుచుండెను. అపు డింద్రుడు దుర్వాసుని చూచెను. దుర్వాసుడు బ్రహ్మతేజముతో గ్రీష్మ ఋతువునందలి మిట్ట మధ్యాహ్నపు వేవెల్గుల సూర్యునిబోలి వెల్గులు చిమ్ముచుండెను. అతని జడలు కరగిన బంగారమువలె మహోజ్జ్వలముగ నెఱ్ఱగ నుండెను. తెల్లని జన్నిదము దండ కమండలువులు జింక చర్మము దాల్చి మునియొప్పుచుండెను. అతని నెన్నుదట చంద్రునివలె తిలకము శోభిల్లుచుండెను. అతని వెంట వేదవేదాంగపారగులైన శిష్యకోటి గలదు. ఇంద్రుడు మునిని గాంచి తలవంచి నమస్కరించెను. అతని శిష్యులను భక్తిమీర సంతోషపఱచెను. అపుడు ముని యతని శిష్యులు నింద్రు నాశీర్వదించిరి. విష్ణువు తన కొసంగిన పారిజాత పుష్పమును ముని యింద్రున కొసంగెను. ఆ పారిజాత సుమము జరా రోగ-మృత్యువులను తొలగించి ముక్తి గల్గించునది. రాజ్యసంపదచే కన్ను మిన్ను గాననని యింద్రు డా పుష్పమును తీసికొనెను. అతడు దానిని తన యేనుగు తలపై నుంచెను. అది దాల్చినంతనే యేనుగు రూపగుణము లందును తేజము వయస్సునందును విష్ణు సమానముగ చెన్నొందెను. ఆ యేనుగు వెంటనే యింద్రుని వదలి యడవుల కేగెను. నారదా ! ఇంద్రుడును తన శక్తితో దానిని వారింపలేకపోయెను. అటుల పుష్పము నింద్రుడు వదలివేయు టంతయును దుర్వాసుడు చూచెను. దుర్వాసుడు మహారోషముతో నింద్రుని శపించెను. ముని యిట్లనెను : ఓరీ! నావు ధనమదాంధుడవు. నన్న వమానించితివి ! నే నిచ్చిన పుష్పమును గర్వముతో నేనుగు తలపై నుంచితివి. దానిని నాకు విష్ణు వొసంగెను. విష్ణు సంబంధమైన నైవేద్యము-ఫలము-పత్రము-తీర్థము-

ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మహా భ##వేత్‌ | భ్రష్ట శ్రీ ర్బ్రష్ట బుద్ధి శ్చ పుర భ్రష్టో భ##వేత్తుసః. 27

యస్త్యజే ద్విష్ణునైవేద్యం భాగ్యేనో పస్థితం శుభమ్‌ | ప్రాప్తి మాత్రేణ యో భుంక్తే భక్తో విష్ణు నివేదితమ్‌. 28

పుంసా శతం సముద్ధృత్వా జీవన్ముక్తః స్వయం భ##వేత్‌ | నైవేద్యం భోజనం కృత్వా నిత్యం యః ప్రణమే ద్ధరిమ్‌. 29

పూజయే త్త్సౌతి వా భక్త్యా సవిష్ణు సదృశో భ##వేత్‌ | తత్స్పర్శ వాయునా సత్య స్తీర్థౌఘశ్చ విశుధ్యతి. 30

తత్పా దరజసా మూఢ సద్యః పూతా వసుంధరా | పుంశ్చల్యన్న మవీరాన్నం శూద్ర శాద్ధాన్న మేవచ. 31

యుద్ధరే రనివేద్యం చ వృథా మాంసస్య భక్షణమ్‌ | శివలింగ ప్రదాన్నం చ యుద్దత్తం శూద్రయాజినా. 32

చికిత్సక ద్విజాన్నం చ దేవలాన్నం తథైవ చ | కన్యా విక్రయిణా మన్నం యదన్నం యోని జీవినామ్‌. 33

ఉచ్ఛిష్టాన్నం పర్యుషితం సర్వభక్షా వశేషితమ్‌ | శూద్రాపతి ద్విజాతీనాం చ వృషవాహ ద్విజాన్నకమ్‌. 34

అదీక్షిత ద్విజానాం చ యదన్నం శవదాహినామ్‌ | అగమ్యాగామినాం చైవ ద్విజానా మన్నమేవచ. 35

మిత్ర ద్రుహాం కృతఘ్నానా మన్నం విశ్వా సఘాతినామ్‌ | మిథ్యాసాక్ష్య ప్రదాన్నం చ బ్రాహ్మణాన్నం తథైవ చ. 36

ఏతే సర్వే విశుధ్యంతి విష్ణోర్నై వేద్య భక్షణాత్‌ | శ్వప చ శ్చే ద్విష్ణుసేవీ వంశానాం కోటి ముద్ధరేత్‌. 37

హరేరభక్తో మనుజః స్వం చ రక్షితు మక్షమః | అజ్ఞానాం ద్యదిగృహ్ణాతి విష్ణోర్నిర్మాల్య మేవచ. 38

సప్తజన్మార్జితాత్పాపా న్ముచ్యతే నా త్ర సంశయః | జ్ఞాత్వా భక్త్యా చ గృహ్ణాతి విష్ణోర్నై వేద్యమేవచ. 39

ఏదైన లభించినంతనే యనుభవింపవలయును. తరస్కరించిన వానికి బ్రహ్మహత్యా పాపము తగులును. అతడు ధన-మతి-నగరములు కోల్పోవును. అదృష్టము వలన లభించిన విష్ణునైవేద్యమును వదిలిపెట్టనవాడు చెడును. లభించినంతనే విష్ణు నైవేద్య మనుభవించినవాడు విష్ణుభక్తుడు గాగలడు. అట్టి భక్తుడు నూర్గురు పురుషులను తరింపజేసి తానును జీవన్ముక్తుడు గాగలడు. హరినైవేద్య మనుభవించుచు నిత్యము హరికి నమస్కరించువాడును శ్రీహరిని పూజించి స్తుతించు భక్తుడును విష్ణు సమాను డగును. అతని మీది గాలి తాకుట వలన నెల్ల తీర్థములు పవిత్రము లగును. ఓ మూఢమతీ ! అట్టి విష్ణు భక్తుని పాదధూళివలన భూమి పవిత్ర మగును. విధవచేతి యన్నము అవీరాన్నము శూద్రుని శ్రాద్ధాన్నము హరికి నివే దింపని యన్నము మాంసాన్నము శివలింగమునకు నివేదించిన పదార్థము శూద్రయాజిచేతి యన్నము వైద్యుడు బ్రాహ్మణుడు పూజారి కన్య నమ్ముకొనువాడు భోగముది వీరొసగిన యన్నమును ఎంగిలి యన్నము పాసిన యన్నము అందఱు తినగ మిగిలినది శూద్రాపతియగు బ్రాహ్మణు నన్నము వృశవాహకుడగు బ్రాహ్మణు నన్నము దీక్ష పొందని బ్రాహ్మణు నన్నము శవదాహకుడగు బ్రాహ్మణు నన్నము పోరాని చోట్లకు పోవు విప్రు నన్నము మిత్రద్రోహి - విశ్వాస ఘాతకుడు - కృత ఘ్నుడు-మిథ్యాసాక్షియగు బ్రాహ్మణు నన్నము ఇట్టి యన్నము తినువా రందఱును విష్ణు నైవేద్యము తినుటవలన పవిత్రులగుదురు. విష్ణుని సేవించు చండాలుడు తన కోటి వంశముల నుద్ధరింపగలడు. విష్ణు భక్తుడు గానివాడు తన్ను తాను రక్షించుకొనజాలడు. హరి నైవేద్యమును తెలియకనైన తీసికొనినవాడు తన యేడు జన్మల పాపమునుండి తప్పక ముక్తుడగును. విష్ణు నైవేద్యమును తెలిసి పరమభక్తితో గ్రహించినవాడు-

కోటి జన్మార్జితా త్పాపా న్ముచ్యతే నిశ్చితం హరే | యస్మాత్సం స్థాపితం పుష్పం గర్వేణ కరిమస్తకే. 40

తస్మా ద్యుష్మా న్పరిత్యజ్య యాతు లక్ష్మీర్‌ హరేః పదమ్‌ | నారాయణస్య భక్తో7హం న బిభేమి సురాద్విధేః. 41

కాలాన్మృత్యో ర్జరాత శ్చ కా నన్యా న్గణయామి చ | కిం కరిష్యతి తే తాతః కశ్యపశ్చ ప్రజాపతిః. 42

బృహస్పతి ర్గురుశ్చైవ నిఃశంకస్య చ మేహరే | ఇదం పుష్పం యస్య మూర్ధ్ని తసై#్యవ పూజనం పరమ్‌. 43

ఇతి శ్రుత్వా మహేంద్ర శ్చ ధృత్వా స చరణం మునేః | ఉచ్చై రురోద శోకార్తస్తమువా చ భయాకులః. 44

మహేంద్ర ఉవాచ : దత్తః సముచితః శాపో మహ్యం మాయాపహః ప్రభో | హృతాం న యాచే సంపత్తిం కించిత్‌ జ్ఞానం చ దేహిమే. 45

ఐశ్వర్యం విపదాం బీజం జ్ఞాన ప్రచ్ఛన్న కారణమ్‌ | ముక్తి మార్గకుఠార శ్చ భ##క్తేశ్చ వ్యవధాయకమ్‌. 46

మునిరువాచ : జన్మ మృత్యు జరాశోక రాజ బీజాం కురం పరమ్‌ | సంపత్తితిమిరాంధ శ్చ ముక్తి మార్గం న పశ్యతి. 47

సంపన్మత్తో విమూఢ శ్చ సురామత్తః స ఏవ చ | బాంధవై ర్వేష్టితః సో7పి బంధుత్వేనైవ హేహరే. 48

సంపత్తి మదమత్త శ్చ విషయాంధ శ్చ విహ్వలః | మహాకామీ రాజసికః సత్త్వమార్గం న పశ్యతి. 49

ద్వి విధో విషయాంధ శ్చ రాజస స్తామసః స్మృతః | అశాస్రత జ్ఞ స్తా మస శ్చ శాస్త్రజ్ఞో రాజసః స్మృతః. 50

శాస్త్రం చ ద్వి విధం మార్గం దర్శయే త్సుర పుంగవ | ప్రవృత్తి బీజమేకం చ నివృత్తేః కారణం పరమ్‌. 51

చరంతి జీవిన శ్చాదౌ ప్రవృత్తే ర్దుఃఖ వర్త్మని | స్వచ్ఛందం చ ప్రసన్నం చ నిర్విరోధం చ సంతతమ్‌. 52

నిశ్చయముగ తన కోటి జన్మల పాపరాశినుండి విముక్తు డగును. నీవు ధనగర్వముతో నే నిచ్చిన విష్ణు పుష్పము నేనుగు తలపై నుంచితివి. అందువల స్వర్గలక్ష్మి నిన్ను విడనాడి పరమ పదము చేరగలదు. నేను నారాయణుని భక్తుడను. బ్రహ్మకును-దేవతలకును భయపడనివాడను. నేను కాలమృత్యువునకు ముదిమికివెఱవను. నీ తండ్రి కశ్యప ప్రజాపతియు నన్నేమియును చేయజాలడు. నీ గురువగు బృహస్పతికిని జంకను. ఆ విష్ణు పుష్ప మెవరి తలపై నుండునో యతడు పరమ పూజ్యు డగును. అను ముని వాక్కులు విని భయాకులుడై శోకార్తుడై దుర్వాసోముని చరణములు పట్టుకొని గొల్లున ఏడ్చి మహేంద్రు డిట్లనెను : ఓ మాయారహితా ! మునిప్రవరా ! నీవు నాకు తగిన శాప మిచ్చితివి. పోయిన సంపద గోరను కాని జ్ఞానము మాత్రము ప్రసాదింపుము. సంపద లాపదలకు బీజములు; జ్ఞానమును కప్పివేయునవి; ముక్తికి గొడ్డలిపెట్టులు భక్తి కంతరాయములు. ముని యిట్లనెను; సంపదలు జన్మ-మృత్యు-జరా-శోక-రాగములకు బీజాంకు రములు. ధనమదాంధునకు ముక్తికి-దివ్యమార్గము కనిపించదు. ధనమత్తుడు సురామత్తుని కన్న మూఢుడు. ధనవంతుని చుట్టు బందుగులు గుమిగూడుదురు. ఐన నతనిలో బంధుప్రీతి గల్గదు. ధన మదమత్తుడు విషయాంధుడు వ్యాకులచిత్తుడు మహాకామిరాజసికుడు సత్త్వమార్గమును గాంచలేరు. మరల విషయాంధు లిరు తెఱగులుగ నుందురు. వారు తామసులు రాజ సికులు. శాస్త్రమెఱుగనివాడు తామసుడు; శాస్త్ర మెఱింగున విషయాంధుడు రాజసుడు. సురవరా! శాస్త్రమును రెండు విధములుగ నుండును. ఒకటి ప్రవృత్తిమార్గము. రెండవది నివృత్తిమార్గము. ప్రవృత్తిమార్గము దుఃఖహేతువు. మానవుడీ మార్గమున స్వేచ్ఛగ ప్రసన్నముగ నిరాటంకముగ నిత్యము జీవితము సాగించును.

ఆయాతి మధునోలోభా త్కే శేన సుఖమానితః | పరిణామే నాశబీజే జన్మ మృత్యుజరాకరే. 53

అనేక జన్మ పర్యంతం కృత్వా చ భ్రమణం ముదా | స్వ కర్మ విహితాయాం చ నానాయోన్యాం క్రమేణ చ. 54

తతశ్చేశాను గ్రహా చ్చ సత్సంగంలభ##తే చ సః | సహస్రేషు శ##తేష్వేకో భవాబ్ధి పారకారణమ్‌. 55

సాధు స్త త్వ ప్రదీపేన ముక్తి మార్గం ప్రదర్శయేత్‌ | తథా కరోతి యత్నం చ జీవో బంధనఖండనే. 56

అనేక జన్మయోగేన తపసా నశ##నేన చ | తదా లభేన్ము క్తి మార్గం నిర్విఘ్నం సుఖదం పరమ్‌. 57

ఇదం శ్రుదం గురో ర్వ క్త్రా ద్య త్పృ చ్ఛసి పురందర | మునేస్త ద్వచనం శ్రుత్వా వీతరాగోబభూవసః. 58

వైరాగ్యం వర్ధయా మాస తస్య బ్రహ్మ న్దినే దినే | మునేః స్థానా ద్గృహం గత్వా స దదర్శామరావతీమ్‌. 59

దైత్యై రసుర సంఘైశ్చ సమాకీర్ణం భయాకులమ్‌ | విషమోపప్లవాం కుత్ర బంధు హీనాం చ కుత్రచిత్‌. 60

పితృమాతృ కళత్రాది విహీనా మతి చంచలామ్‌ | శత్రు గ్రస్తాం చ తాం దృష్ట్వా జగామ వాకృతిం ప్రతి. 61

శక్రో మందాకినీ తీరే దదర్శ గురు మీశ్వరమ్‌ | ధ్యాయమానం పరం బ్రహ్మ గంగాతోయే స్థితం పరమ్‌. 62

సూర్యాభి సమ్ముఖం పూర్వముఖం చ విశ్వతోముఖమ్‌ | సాశ్రునేత్రం పులకినం పరమానంద సంయుతమ్‌. 63

వరిష్ఠం చ గరిష్ఠం చ ధర్మిష్ఠం శ్రేష్ఠ సేవితం | ప్రేష్ఠం చ బంధువర్గాణా మతి శ్రేష్ఠం చ జ్ఞానినామ్‌. 64

జ్యేష్ఠంచ భ్రాతృ వర్గాణా మనిష్టం సురవైరిణామ్‌ | దృష్ట్వా గురుం జపంతం చ తత్ర తస్థా సురేశ్వరః. 65

అతడు తేనె నాశించి వచ్చి నశించు తుమ్మెదవలె నేదో తెలియని సుఖ మాశించి కష్టాల పాలగును. అతడు తుదకు జన్మ మృత్యు జరలకు బలియై నశించును. అతడు పెక్కు కోట్ల జన్మచక్రముల పరిభ్రమించును. అతడు తన కర్మానుసారముగ దాల్చుచుండును. అతడు పిదప నెప్పుడో యొకప్పుడు హరి దయవలన సజ్జన సంగతి బడయును. అట్టి సత్సంగతి లభించిన వారిలో నూటికి కోటి కేవడో యొకడు సంసార సాగరము దాటగలడు. సాధు సజ్జనుడు తత్త్వదీపము చేత ముక్తి మార్గము చూపించగలడు. అపుడు జీవుడు తన వెనుకటి కర్మ బంధములు త్రెంచుకొనుటకు యత్నింపగలడు. అపు డతడు పెక్కు జన్మల యోగము తపము ఉపవాసముల ఫలితముగపరమ సుఖకారకమైన ముక్తిమార్గము నిర్విఘ్నముగ జెందగలడు. మహేంద్రా! నీ వడిగిన దంతయును నేను మునుపు గురుముఖమున వింటిని. దుర్వాసముని వాక్కులు విని యింద్రుడు విగతరాగు డయ్యెను. నారదా! ఇంద్రునిలో నాటినుండివైరాగ్య తేజము వృద్ధి చెందసాగేను. అతడు మునిని వదలి పయనమై యమరానతి చేరెను. అమరావతి పట్టణము దైత్యులచే నసురులచే భయంకరముగ మహోపద్రములతో బందువులును లేకఘోరముగ నుండెను. అందు కొన్నిచోట్ల తలిదండ్రులు - భార్యలు లేనివారును చంచలముగ తిరుగువారు నుండిరి. పురము శత్రు వశమయ్యెను. ఇదంతయు చూచి యింద్రుడు గురు సన్నిధి కరిగెను. గురుడు పావనగంగా జలములో నిలబడి సూర్య పరబ్రహ్మమును ధ్యానము చేయుచుండగ నింద్రుడు చూచెను. గురుడు తూర్పు మొగముగ సూర్యుని కభిముఖముగనుండి యానందబాష్పములు జాలువాఱ విశ్వతోముఖుని ధ్యానించుచుండెను. గురుడు వరిష్ణుడు-గరిష్ణుడు-ధర్మిష్ఠుడు-శ్రేష్ఠసేవితుడు-ఆప్త బంధువర్గమునకు ప్రియతముడు-జ్ఞానులో మిక్కిలి శ్రేష్ఠుడు. అతడు భ్రాతృవర్గమునకు జ్యేష్ఠుడు-దానవుల కప్రియుడు. అట్టి గురుడు జపధ్యానమున నుండగ నమరపతి చూచి యచట నిలుచుండెను.

ప్రహరాంతే గురుం దృష్ట్వా చోత్థితం ప్రణనామసః | ప్రణమ్య చణాంభోజే రుదోదోచ్చైర్ము హూర్ముహుః. 66

వృత్తాంతం కథయామాస బ్రహ్మాశా పాదికం తథా | పునర్వరో పలబ్ధిం చ జ్ఞాన ప్రాప్తిం సుదుర్లభామ్‌. 67

వైరి గ్రస్తాం చ స్వపురీం క్రమేణౖవ సురేశ్వరః | శిష్యస్య వచనం శ్రుత్వా సుబుద్ధిర్వదతాం వరః. 68

బృహస్పతి రూవాచేదం కోపసం రక్తలోచనః | గురురువాచః శ్రుతం సర్వం సురశ్రేష్ఠమారోదీర్వచనంశృణు. 69

న కాతరా హి నీతిజ్ఞా వివత్తౌ చ కదాచన | సంపత్తి ర్వా విపత్తిర్వా నశ్వరా శ్రమ రూపిణీ. 70

పూర్వస్య కర్మాయత్తా చ స్వయం కర్తాతయోరపి | సర్వేషాం చ భ##వేత్యవ శశ్వ జ్జన్మని జన్మని. 71

చక్రనేమి క్రమేణౖవ తత్ర కా పరిదేవనా | ఉక్తం హి స్వ కృతం కర్మ భుజ్యతేఖిల భారతే. 72

శుభా శుభం చ యత్కించి త్స్వ కర్మఫలభుక్పుమాన్‌ | నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శ##తైరపి. 73

అవశ్య మేవ భోక్తవ్య కృతం కర్మ శుభా శుభమ్‌ | ఇత్యవ ముక్తం వేదే చ కృష్ణేన పరమాత్మనా. 74

సామ వేదోక్త శాఖాయాం సంబోధ కమలోద్బవ | జన్మభోగావశేషే చ సర్వేషాం కృత కర్మణామ్‌. 75

అణురూపం హి తేషాం చ భారతేన్యత్ర చైవహి | కర్మణా బ్రహ్మశాపం చ కర్మణా చ శుభా శిషమ్‌. 76

కర్మణా చ మహీలక్ష్మీం లభేద్దైన్యం చ కర్మణా | కోచి జన్మార్జితం కర్మ జీవినా మనుగచ్చతి. 77

నహి త్యజే ద్వినా భోగం తచ్ఛాయేవ పురందర | కాలభేదే ధేశ##భేదే పాత్రభేదే చ కర్మణామ్‌. 78

ఒక జాము సేపటికి ధ్యానము చాలించిన గురునిగాంచి మ్రెక్కి పదపద్మముల కెఱగి ఇంద్రుడు పెద్దగ నేడ్చెను. అతడు తనకు ముని యిచ్చిన శాపము మరల వరము దుర్లభ##మైన జ్ఞాన ప్రాప్తి యంతయును తన గురువునకు చెప్పెను. అతడు తన పురము శత్రునపాలగుట మున్నగు వృత్తాంతమును క్రమముగ దెల్పెను. తన శిష్యుని మాటలను సుబుద్ధి వాక్యవిశారదుడునగు గురుడు వినెను. అతడు కోపరక్త లోచనములతో నింద్రునితో నిట్లనెను. ఓ యమరవర్యా! అంతయు వింటిని. ఏడ్వకుము. నా మాట వినుము. నీతిగలవాడు కష్టముల దేవుడును భయపడడు. సంపదలు - విపత్తులు స్థిరములు గావు - శ్రమ గల్గించునవి. అవి జీవుల పూర్వ కర్మానుసారము గల్గుచుండును. వానికి జీవుడు-కర్త. అవి యెల్లరిని జన్మ జన్మకును వీడక వెంటాడుచుండును. అట్టి సుఖదుఃఖములు చక్రపు టిరుసువలె క్రమముగ తిరుగుచుండగ వానికై విచార మేల? చేసికొన్న కర్మమునకు తప్పక ఫలమును భవించవలయునని భారతమున చెప్పబడెను. మంచిచెడ్డలలోనే కొంచెమైనను దాని ఫల మనుభవింపవలసినదే. నూఱు కోట్ల కల్పములకైన నుభవింపనిచో కర్మ నశించదు. మంచిచెడ్డలలో నేదైన తప్ప కనుభవింపవలయునని కృష్ణ పరమాత్మయు వేదములును తెల్పినవి. అనుభవింపగ మిగలిన దెల్ల కర్మలకు మూలమని సామవేదమున బ్రహ్మ తెలిపెను. అణురూపమైన కర్మ శేషము ఫలితముగ భారతుమనగాని యింకొక చోటగాని జన్మ మెత్తను. కర్మము వలనే మహలక్ష్మీ ప్రాప్తియును - దీనత్వమును గల్గును. కోటి జన్మలో చేసిన కర్మమే యైనను జీవుల ననుసరించి వెంబడించును. అనుభవింపక కర్ము తీరదు. అది నీడవలె వెంటాడును. కర్మములకు దేశ - కాల - పాత్రబేదము లుండును.

న్యూనతా ధిక భావో పి భ##వే దేవహి కర్మణా | వస్తుదా నేన దస్తూనాం సమం పుణ్యం దినే దినే. 79

దినభేదే కోటిగుణ మసంఖ్యం వా తతోధికమ్‌ | సమ దేశే చ వస్తూనాం దానే పుణ్యం సమంసురః. 80

దేశ##భేదే కోటిగుణ మసంఖ్యావా తతోదికమ్‌ | సమేపాత్ర సమం పుణ్యం వస్తూనాం కర్తురేవ చ. 81

పాత్రభేదే శతగుణ మసంఖ్యం వాతతోధికమ్‌ | యథా ఫలంతి సస్యాని న్యూనాన్య ప్యధికాని చ. 82

కర్షకాణాం క్షేత్ర భేదే పాత్రకభేదే ఫలంతథా | సామాన్య దివసే విప్ర దానం సమ ఫలం భ##వేత్‌. 83

అమాయాం రవిసం క్రాంత్యాం ఫలం శతగుణంభ##వేత్‌ | చాతుర్మాస్యాం పౌర్ణమాస్యా మనంతం పల మేవ చ. 84

గ్రహణ శశినః కోటి గుణం చ ఫలమేవ చ | సూర్య స్య గ్రహణ వాపి తతో దశగుణం భ##వేత్‌. 85

అక్షయాయా మక్షయం తదసంఖ్యం ఫలముచ్యతే | ఏవ మన్యత్ర పుణ్యాహే ఫలాధిక్యం భ##వేదితి. 86

యథా దానే తథా స్నానే జపేన్య పుణ్య కర్మసు | ఏవం సర్వత్ర బోద్ధవ్యం నరాణాం కర్మణాం ఫలమ్‌. 87

యథా దండేన చక్రేణ శరావేణ భ్రమేణ చ | కుంభం నిర్మాతి నిర్మాతా కుంభకారో మృదా భువి. 88

తథైవ కర్మసూత్రేణ ఫలం దాతా దదాతి చ | యస్యాజ్ఞయా సృష్ట మిదం తంచానారయణం భజ. 89

స విధాతా విధాతు శ్చ పాతుః పాతాజగత్త్రయే | స్రష్టుః స్రష్టా చ సంహర్తుః సంహర్తాకాలకాలకః 90

మహా విపత్తౌ సంసారేయః స్మరేన్మధుసూదనమ్‌ | విపత్తౌ తస్య సంపత్తి ర్బవేదిత్యాహ శంకరః. 91

ఇత్యేవ ముక్త్వాతత్త్వ జ్ఞః సమాలింగ్య సురేశ్వరమ్‌ | దత్వా శుభాశిషం చేష్టం బోధయామాస నారద. 92

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే చత్వారి శోధ్యాయః.

ఇట్లు కర్మలకు తక్కువ-యెక్కువ భేదములుండును. ఒక వస్తువును దానము చేయగ కలుగు పుణ్యము ఆయా దినములకు తగినట్లు పెరుగుచుండును. కాలభేదమును బట్టి చేసిన దానమునకు కోటి రెట్లుగ పుణ్యము గల్గును. ఇంద్ర! సమప్రదేశమున చేసిన వస్తువుల పుణ్యము సమముగ నుండును. దేశ భేదము లెఱిగి చేసిన దానమున కోటిరెట్లుగ ఫల మెక్కువగ గల్గును. సమ పాత్రునకు చేసిన దానమువలన పున్నెమును సమముగనే యుండును. పాత్రభే దమెఱిగి యుత్తమును దానము చేయుట వలన నూఱు రెట్లు పుణ్యఫల మబ్బును. పంటలు పొలములను బట్టి యెక్కువ తక్కువలుగ పండును. కర్షకుల పొలముల సారములను బట్టి పంట పండునట్లు పాత్ర మెఱిగి దానము చేయుట వలన గొప్ప ఫలము గల్గును. అయా వాస్య-రవి సంక్రాంతి-నాడు చేసిన దానము నూఱు రెట్లుగ ఫలించును. చతుర్మాస్యములందు - పున్నమినాడు చేసిన దానము వలన ననంతఫలము గల్గును. చంద్రగ్రహణము చేసిన దానము కోటి రెట్లు ఫల మిచ్చును. సూర్యగ్రహణమున చేసిన దానము దానికి పదిరె ట్లెక్కువ ఫల మిచ్చును. అక్షయతిథియందు దాన ఫల మక్షయముగ నసంఖ్యముగ నలరారును. ఈ విధముగ నితర శుభ దినములందలి దానమున నెక్కువ ఫలము గల్గును. దాలములందు వలె స్నాన-జప-పుణ్య కర్మములందును నరులకు కల్మఫలము లెల్లచోట్ల తరతమ భేదములతో గల్గుచుండును. కుమ్మరి మట్టితోక్ఱతో చక్రముతో త్రిప్పుచు కుండ సృష్టి చేయగలడు. అటులే జీవుల కర్మ సూత్రములను బట్టి బ్రహ్మ ఫలము లిచ్చుచుండును. ఎవ్వని యాజ్ఞవలన నీ సృష్టి యంతయును సాగుచుండునో యట్టి నారాయణుని సేవింపుము. నారాయణుడు విధాతకు విధాత; పాలకుల పాలకుడు. సృష్టికర్తలకు సృష్టికర్త; సంహర్తలలో సంహర్త; కాలకాలుడు. ఈ ప్రపంచములో నాపదలందు మధుసూదనుని సంస్మరించిన వాని యాపదలు తొలగును - సంపదలు గల్గునని మున్ను శంకరుడనెను. నారదా! ఈ ప్రకారముగ తత్త్వజ్ఞుడైన గురుడు దేవపతితో పలికి కౌగిలించి శుభాశీస్సు లొసంగి మేలు మార్గము తెలిపెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదవ యాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters