Sri Devi Bagavatham-2    Chapters   

అథ షట్త్రింశోధ్యాయః.

సావిత్య్రువాచ: ధర్మరాజ మహాభాగ వేదవేదాంగ పారగ| నానా పురాణతిహాసే యత్సారం తత్ర్పదర్శయ. 1

సర్వేషు సారభూతం యత్సర్వేష్టం సర్వ సమ్మతమ్‌| కర్మ చ్చేదం బీజరూపం ప్రశస్తం సుఖదం నృణామ్‌. 2

సర్వ ప్రదం చ సర్వేషాం సర్వ మంగళ కారణమ్‌| భయం దుఃఖం న పశ్యంతి యైనవై సర్వ మానవాః. 3

కుండాని తే న పశ్యంతి తేషు నైవ పతంతి చ| న భ##వేద్యేన జన్మాది తత్కర్మ వద సాంప్రతమ్‌. 4

కిమా కారాణి కుండాని కానివా నిర్మితాని చ| కే చ కేనైవ రూపేణ తత్ర తిష్టంతి పాపినః. 5

స్వదేహే భస్మసా ద్బూతే యది లోకాంతరం నరః| కేన దేహేన వాభోగం కరోతి చ శుభాశుభమ్‌. 6

సుచిరం క్లేశభోగేన కథం దేహో న నశ్యతి| దేహో వా కిం విధో బ్రహ్మం స్తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 7

నారాయణ ఉవాచ: సావిత్రీ వచనం శ్రుత్వా ధర్మరాజో హరింస్మరన్‌ | కథాం కథితు మారేభే కర్మ బంధనికృంతనీమ్‌. 8

ధర్మరాజ ఉవాచ : వత్సే చతుర్షు వేదేషు ధర్మేషు సంహితాసు చ| పురాణష్వితి హాసేషు పాంచరాత్రాదికేషు చ. 9

అన్యేషు ధర్మశాస్త్రేషు వేదాంగేషు చ సువ్రతే| సర్వేష్టం సారభూతం చ పంచదేవాను సేవనమ్‌. 10

జన్మమృత్యు జరావ్యాధి శోక సంతాప నాశనమ్‌| సర్వ మంగళరూపం చ పరమానందకారణమ్‌. 11

ముప్పదిఆరవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

సావిత్రి యిట్లనెను: ధర్మరాజ! మాహానుభావా! వేదవేదాంగ పారగా!పెక్కు పురాణతి హాసములందున్న సారము నెఱింగిపుము. ఏది సర్వ సమ్మతమో-సర్వ ప్రియమో- సర్వ రసాయనమో ఎద్ది కర్మచ్చేదకమైన బీజరూపమో ఎయ్యది మానవుల కెల్ల ప్రశస్తము సుఖకరము నైనదో ఏది సర్వప్రదమో సర్వమంగళ మంగళమో దేనివలన మనుజు లెల్లరును భయదుఃఖము లొందరో దేనివలన నరులు నరకకుండములు చూడరో నరకములందు గూలరో దేని నిమిత్తమున చావు-పుట్టు వులు గలవో యట్టి దివ్యమైన నిష్కామకర్మ గూర్చి నా కెఱింగింపుము. ఈ నరకకుండముల యాకారము లెట్లుండును?ఇవెట్లు నిర్మంపబడును? పాపు లేయే రూపములతో నేయే రీతుల నిందు బడియుందురు? ఈ దేహ మిచ్చటనే దహింపబడగ జీవి యే దేహముతో నితర లోకముల కేగి శుభాశుభకర్మ లనుభవించును? పెక్కు లేండ్లు యాతన లనుభవించినను దేహమేల నశింపదు? ఆ తనువు రూ పెట్టిదో దాని నిక్కముగ నెఱింగింప నీవే సమర్ధుడవు. నారాయణు డిట్లనియె: అను సావిత్రి వాక్కులు విని ధర్మరాజు హరిని సంస్మరించి పిమ్మట కర్మ-జన్మ-బంధములు దెగటార్చునట్టి కథ నిట్లు చెప్పసాగెను. ధర్మరాజిట్లనియెను: సుశీలా! నాల్గు వేదము లందును ధర్మసంహితలందును పురాణతిహాసము లందును పాంచ రాత్రాగమము లందును వేదాంగములందు నితర ధర్మశాస్త్రములందును సర్వసమ్మతమైనది సస్వసార రసాయనమైనది పంచదేవతోపాసనము. ఈ యుపాసనము జన్మ జరా మృత్యువులు నశింపించును. వ్యాధి-శోక-సంతాపములను తుడిచి వేయును. ఇది సర్వమంగళరూపము. పరమానంద సంగమము.

కారణం సర్వసిద్ధీనాం నరకార్ణవ తారణమ్‌| భక్తి వృక్షాంకురకరం కర్మ వృక్షనికృంతనమ్‌. 12

విమోక్ష సోపాన మిద మవినాశపదం స్మృతమ్‌| సాలోక్య సార్ఘ్యి సారూప్య సామీప్యాది ప్రదం శుభమ్‌. 13

కుండాని యమ దూతైశ్చ రక్షితాని సదాశుభే| న హి పశ్యంతి స్వప్నే చ పంచ దేవార్చకా నరాః. 14

దేవీభక్తి విహీనా యే తే పశ్యంతి మమాలయమ్‌| యాంతి యే హరి తీర్థం వా శ్రయంతి హరివాసరమ్‌. 15

ప్రణమంతి హరిం నిత్యం హర్యర్బాం కలయంతి చ | న యాంతి తేపి ఘోరం చ మమ సంయమనీం పురీమ్‌. 16

త్రిసంధ్యోపాసకా విప్రాః శుద్దాచారసమన్వితాః | నిర్వృతిం నైవ లప్య్సంతి దేవీసేవాం వినా నరాః 17

స్వధర్మనిరతాచారాః స్వధర్మనిరతా స్తథా | గచ్ఛంతో మృత్యులోకం చ దుర్దృశా మమ కింకరాః 18

భీతాః శివాపాశ##కేభ్యో వైనతేయాది వోరగాః | స్వదూతం పాశహస్తం చ గచ్ఛంతం వారయామ్యహమ్‌. 19

యాస్యంతి తే చ సర్వత్ర హిరిదాసాశ్రయం వినా |కృష్ణమంత్రోపాసకాచ్చ వైనతేయా దివోరగాః 20

దేవీ మంత్రోపాసకానాం నామ్నాం చైవ నికృంతనమ్‌ | కరోతి నభ##లేభిన్యా చిత్రగుప్త శ్చ భీతవత్‌. 21

మధుపర్కాదికం తేషాం కురుతే చ పునః పునః | విలంఘ్య బ్రహ్మలోకంచలోకం గచ్చంతి తే సతి. 22

ఇది సర్వసిద్దులకు మూలకారణము; ఇది నరకార్ణవము దాటించునది; ఇది భక్తి వృక్షమునకు మూలము; ఇది కర్మవృక్షమును ఛేదించునది. ఇది ముక్తికి సోపానము. ఇది శాశ్వత దివ్యధామము. ఇది సాలోక్య-సామీప్య-స్వార్టి - సారూప్యము లొసంగు శుభకర్మము. ఓ శుభాంగీ! నరక కుండములను యమభటులు నిరంతము రక్షించుచుందురు. పంచ దేవతల నుపాసించు పుణ్యాత్ము లెన్నడును నరక కుండములను కలనైన చూడరు. శ్రీదేవీ భక్తులు గానివారలే నా యాల యమును గాంతురు. శ్రీహరి పుణ్యతీర్థము లేగువారును ఏకాదశీ పుణ్యవ్రతము జరుపువారును నిత్యము భగవంతు నర్చించి శరణు జొచ్చువారును. నాఘోర యమపురికి రారు. త్రికాల సంధ్యావందనము చేయుచు సదాచారుడైన విప్రుడైనను సరే దేవీభక్తుడుగాడేని ముక్తిజెందడు. స్వధర్మతాచారులు స్వధర్మనిరతులునైన మానవులకు భూలోకమందు నాకింకరుల దుర్దర్శనము గల్గదు. గరుడుని జూచి పాము భయపడును. అటులే శివభక్తులను గాంచి నా భటులు భయపడి పరుగులు దీతురు. నే నట్టి నా భక్తులను వారించి వారి భయము బాపుదును. హరిదాసుల నాశ్రయింపనివారు యమలోకమేగుదురు. గరుత్మంతుని జూచిన పామువలె కృష్ణమంత్ర ముపాసించు భక్తులను గాంచి నా భటులు పారిపోవుదురు. ఇక శ్రీదేవీమంత్రో పాసకులకు దేవి దివ్యనామము వారి జన్మ-కర్మ-బంధములను తెగద్రెంచును. వారిని గూర్చి తప్పుగ వ్రాయవలసి వచ్చినచో చిత్రగుప్తుడును గడగడలాడుచునే వ్రాయును. దేవి భక్తులు దేవికి మధుపర్కాదులు సమర్పింతురు. అందువలన వా రీ లోకము విడిచి బ్రహ్మలోకము చేరుదురు.

దురుతాని చ నశ్యంతి యేషాం సంస్పర్షమాత్రతః | తే మహాభాగ్యవంతో హి సమస్రకుల పావనాః , 23

యథా చ ప్రజ్వల ద్వహ్నౌ శుష్కాణి చ తృణాని చ | ప్రాప్నోతి మోహః సమ్మోహం తాంశ్చ దృష్ట్వాచ భీతవత్‌. 24

కామశ్చ కామినం యాతి లోభక్రోధౌ తతః సతి | మృత్యుః ప్రలీయతే రోగో జరా శోకో భయంతథా. 25

కాలః శుభాశుభం హర్షోభోగస్తథైవ చ | యే యేనయాంతి తాం పీడాం కథితా స్తేమయాసతి. 26

శృణు దేహ వివరణం కథ యామి యథాగమమ్‌ | పృథివీవాయు రాకాశం తేజస్తో యమితి స్ఫుటమ్‌. 27

దేహినాం దేహబీజం చ స్రష్టృ సృష్టి విధౌ పరమ్‌ | పృథివ్యాది పంచ భూతైర్యో దేహో నిర్మితో భ##వేత్‌. 28

స కృత్రిమో సశ్వరశ్చ భస్మసా చ్చ భ##వేదిహ | బద్దో ంగుష్ఠ ప్రమాణ శ్చ యోజీవః పురుషః కృతః 29

బిభర్తి సూక్ష్మం దేహం తం తద్రూపభోగహేతవే | స దేహోన భ##వేద్బస్మ జ్వల దగ్నౌ మమాలయే. 30

జలేన నష్టో దేహీ వా ప్రహారే సుచిరం కృతే | న శ##స్త్రేణ నవాస్త్రేణ సుతీక్‌ష్ణ కంటకే తథా . 31

తప్త ద్రవే తప్తలోహే తప్త పాషాణ ఏవచ | ప్రతప్త ప్రతిమాశ్లేషే యాత్పూర్వ పతనేపి చ. 32

న దగ్దో న చ భగ్నః స భుం క్తే సంతాప మేవచ | కథితో వృత్తాంతః కారమం చయథా గమమ్‌. 33

కుండానాం లక్షణం సర్వం బోధాయ కథయామి తే.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే షట్త్రింశోధ్యాయః.

అట్టి పుణ్య కోటీశ్వరులు వేయితరాల వారిని తరింపింతురు. వారి మేని స్పర్శ మూత్రముననే దురిత జాలములు తనాతునకు లగును. మంట లెదయు నగ్నిలో నెండుకట్టెలు కాలి భస్మ మగును. అట్లు దేవీ భక్తులను గాంచినంతనే మోహము ద్వేషరాగములు మున్నగునవి భీతిల్లి నశించును. కామము మున్నగునని దేవీ భక్తులను విడిచి కామినులను జేరును. దేవి భక్తులను కామమే లేనపు డింక క్రోధలోభము లెక్కడివి? వారినుండి జరామృత్యువులు రోగశోకములు భయాందోళనలు తొలగి మాయ మగును. కాలపు మంచిచెడ్డలు సుఖసంతోషములు భోగములు వారినివీడిపోవును. ఓ సాధ్వీమణీ ! ఎవరెవగిరీ యమబాధలు పడరో వారిని గూర్చి తెల్పితిని. ఇపుడు శాస్త్రమందు తెల్పబడిన దేహవర్ణనము వినుము. నింగి గాలి నిప్పు నీరు నేల ఇవి పంచభూతములు. బ్రహ్మసృష్టి ప్రారంబించునపు డివి ప్రాణుల దేహ నిర్మాణమునకు బీజములగ నుప కరించును. ఈ తనువు పంచభూతములచే నిర్మితమైనది. తనువు కృత్రిమము-నశ్వరము-బూడిద యగునది; అంగుష్ఠపరిమాణముగల జీవుడీ శరీరమం దుండును. అతడు కర్మబద్దుడు. అతడు భోగము లనుభవించుటకు సూక్ష్మ శరీరము దాల్చును. ఈ సూక్ష్మదహము నా లోకమందలి నరకాగ్నులలో బడినను నశింపదు. ఇది నీటగాని దెబ్బలవలనగాని వాడి శస్త్రాస్త్రములవలనగాని ముండ్లవలనగాని నశింపదు. సూక్ష్మదేహి సలసలమను ద్రవమునుగాని భగభగమను లోహమునుగాని కణకణలాడు బండనుగాని క్రాగుచున్న ప్రతిమనుగాని కౌగిలించుకొన్నను చావడు. అతడు కాలడు భంగ మొందడు. యాతన లనుభవించు దేహపు వివరణము దేహ కారణము తెల్పితిని.

ఇపు డింకను నరకకుండముల గూర్చి వివరింతును. వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున ముప్పదిఆరవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters