sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏక షష్టితమోధ్యాయః - తార తిరిగి బృహస్పతిని చేరుట, బుధోత్పత్తి

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను.

తతః పరం కింరహస్యం బభూవాసురదేవయోః | శ్రోతుమిచ్ఛామి భగవన్‌ పరంకౌతూహలం మమ || 1

బ్రహ్మదేవుడు శుక్రాచార్యుని దగ్గరకు పోవుదునని బయలుదేరిన తరువాత దేవదానవులమధ్య ఏమి జరిగినదో తెలుపుడు. దీనిని తెలుసుకొనవలెనను కౌతూహలము నాకు చాలా కలదు అని నారదుడనెను.

నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను-

బ్రహ్మా జగామ నిలయం శుక్రస్యచ మహాత్మనః | నానాదైత్యగణాకీర్ణం

రత్నమండపభూషితం || 2

పంచాశత్కోటిభిః శిషై#్యః పరీతం బ్రహ్మవాదిభిః | సప్తభిః పరిఖాభిశ్చ వేష్టితం దుర్గమేవచ || 3

రక్షితం రక్షకగణౖర్దైత్యైశ్చ శతకోటిభిః | పద్మరాగైర్విచితైః ప్రావారైః పరిశోభితం || 4

దదర్శ జగతాం ధాతా సభాయాం భృగునందనం | స్తుతం మునిగణౖర్దైత్యైః రత్నసింహాసనస్థితం || 5

జపంతం పరమం బ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం | కోటి సూర్యప్రభం శశ్వత్‌ జ్వలంతం బ్రహ్మతేజసా || 6

దృష్ట్వా పౌత్రం ప్రభాయుక్తం విధాతా హృష్టమానసః | ఆత్మానం కృతినం మేనే పుత్రం పౌత్రం చ నారద || 7

దృష్ట్వా పితామహం శుక్రో ధాతారం జగతాం ప్రభుం | ఉత్థాయ సహసా భీతః ప్రణనామ కృతాంజలిః || 8

బ్రహ్మదేవుడు శుక్రుని ఇంటికి వెళ్ళెను. అతని భవనము చుట్టు అనేక దైత్యులుండిరి. ఆ భవనమున అనేక రత్నమండపములు కలవు. ఆ మహర్షికి బ్రహ్మావాదులగు యాభైవేల శిష్యులుండిరి. అతడుండు భవనము ఏడు అగడ్తలతో సప్తప్రాకార పరివేష్టితమైయుండును. అది మహారాజులుండు దుర్గమువలెనున్నది. ఆ మహర్షి యుండు భవనమును శతకోటి దైత్యులెల్లప్పుడు రక్షించుచుందురు.

బ్రహ్మదేవుడు శుక్రుని సభాభవనమునకు వెళ్ళినసమయమున అతడు దైత్యులు మునులు సేవించుచుండగా రత్నసింహాసనమున కూర్చుండి శ్రీకృష్ణ పరమాత్మమంత్రమును జపించుచుండెను. అతడు బ్రహ్మతేజస్సుచే కోటిసూర్యులవలె వెలిగిపోవుచుండెను.

తన మనుమడు గొప్ప తేజస్సుచే గొప్పవైభవముచే వెలుగొందుచుండగా చూచి బ్రహ్మదేవుడు చాలా పొంగిపోయెను. తాను, తన పుత్రుడగు భృగుమహర్షి, తన పౌత్రుడైన శుక్రుడు ధన్యులైరని తలపోసెను.

అట్లే శుక్రుడు బ్రహ్మదేవుని చూడగానే భయములో లేచి నిలబడి చేతులు జోడించుకొని నమస్కరించెను.

ఆదాయ పూజయామాస చోపచారాంస్తు షోడశ | తుష్టావపరయాభక్త్యా సంభ్రమేణ యథాగమం || 9

విద్యామంత్రప్రదాతారం దాతారం సర్వసంపదా | స్వకర్మణాం చ ఫలదం సర్వేషాం విశ్వతోవరం || 10

శుక్రేస్య స్తవనేనైవ సంతుష్టో జగతాం పతిః | అవరుహ్య రథాత్తూర్ణమవసత్తత్ర సంసది || 11

శుక్రేణ శిరసాదత్త రర్నసింహాసనే వరే | తేజసా జ్వలితే రమ్యే నిర్మితే విశ్వకర్మణా || 12

బ్రహ్మదేవుని వెంటపెట్టుకొని అతనిని షోడశోపచారములతో శాస్త్రవిహితముగా పూజించి స్తోత్రము చేసెను. బ్రహ్మదేవుడు, విద్యను, మంత్రమును ఉపదేశించు గురువు, సర్వసందలనిచ్చువాడు, జీవునికి తాను చేసిన కర్మఫలితము నొసగువాడు, ప్రపంచమున అందరికన్నను శ్రేష్ఠుడైనవాడు ఐన బ్రహ్మదేవుని శుక్రుడు స్తోత్రము చేయగా అతడు మిక్కిలి సంతోషము పొందెను. శుక్రుడు బ్రహ్మదేవునకు విశ్వకర్మ నిర్మించిన ఉజ్వలమైన రత్నసింహాసనమును స్వయముగా తెచ్చివేసెను.

శుక్రః ప్రణమ్య బ్రహ్మాణం కుమారం శకునం క్రతుం | వసిష్ఠం చ మరీచిం చ సనందం చ సనాతనం || 13

కపిలం వై పంచశిఖం వోడు మాంగిరసం మునే | ధర్మం మాం చ నరం భక్త్యా ప్రణనామ కృతాంజలిః || 14

ప్రత్యేకం పూజయామాస సాదరం చ యథోచితం | సింహాసనేషు రత్నేషు వాసయామాస ధార్మికః || 15

ప్రహృష్టవదనాః సర్వే ప్రణముర్దితినందనాః | ఋషిసంఘాశ్చ ధాతారం తుష్టువుశ్చ యథాగమం || 16

సర్వాన్‌ సంస్తూయ స కవిరవోచత్సంపుటాంజలిః | సాశ్రునేత్రః సపులకః ప్రణతో వినయాన్వితః || 17

శుక్రుడు తనదగ్గరకు వచ్చిన బ్రహ్మదేవుని, శకుని, క్రతువు, వసిష్ఠుడు. మరీచి సునందుడు, సనాతనుడు, కపిలుడు, పంచశిఖుడు, వోఢువు, అంగిరసుడు, ధర్ముడు, నేను ( నారాయణుడు), నరుడు అను మునులనందరును భక్తితో నమస్కరించి అందరిని యథోచితముగా పూజించెను. వారినందరిని రత్నసిహాసనములపై కూర్చుండబెట్టెను.

దైత్యులు , అచ్చటనున్న మునులందరు. సంతోషముతో బ్రహ్మదేవుని స్తుతించిరి. శ్రుక్రుడు అందరిని స్తుతించి చేతులు జోడించుకొని వినయముతో నమస్కరించి బ్రహ్మదేవునితో, అతని వెంటవచ్చిన మునులతో నిట్లనెను.

శుత్ర ఉవాచ - శుక్రుడిట్లనెను-

అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితం | స్వయం విధాతా భగవాన్‌ సాక్షాత్‌ దృష్టః స్వమందిరే || 18

సాక్షాత్‌ దృష్టాశ్చ తత్పుత్రాః భగవంతః సనాతనాః | తుష్టఃకృష్ణోzద్య మామేవం పరమాత్మా పరాత్పరః || 19

కృతార్థం కర్తుమీశాం మాం యుష్మాకం స్వాగతం శిశుం | స్వాత్మారామేషు కుశలప్రశ్నమేవం విడంబనం || 20

పవిత్రం కర్తుమీశాం మాం హేతురాగమనేzత్ర వః | అపరం బ్రూథ కింవాzపి శాన్త నః కరవామి కి || 21

నేడు నాజన్మ చరితార్థమైనది . నాజీవితము సఫలమైనది ఎందువలన అనగా సాక్షాత్‌ భగవంతుడు అగు బ్రహ్మదేవుడు స్వయముగా నా ఇంటికి ఏతెంచెను. అట్లే సనాతనులు, భగవత్స్వరూపులగు అతని పుత్రులు స్వయముగా నా ఇంటికి ఏతెంచిరి. పరాత్పరుడైన కృష్ణుడు నాపైన సంతోషము కలిగియున్నట్లు కనిపించును. మీముందు శిశుతుల్యడునైన నన్ను చరితార్థుని చేయుటకు మీరు వచ్చితిరి. మీకందరకు స్వాగతము పలుకుచున్నాను. ఆత్మారాములైన మిమ్ములను కుశల ప్రశ్నవేయుట తగినది కాదు. మీరందరు ఇచ్చటకు వచ్చి నన్ను పవిత్రము చేసితిరి. నేను మీకు చేయదగినదైనా ఉన్నచో నన్ను శాసించి చెప్పుడని బృహస్పతి వారితోననెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఉద్విగ్నశ్చిరవిచ్ఛేదాత్‌ త్వాం పౌత్రం ద్రష్టుమాగతః | విచ్ఛేదః పుత్రపౌత్రాణాం మరణాదతిరిచ్యతే || 22

కుశలం తే మునిశ్రేష్ఠ పుత్రయోశ్చాపి యోషితః | కుశలం తే స్వధర్మాణాం కామ్యానాం తపసామపి || 23

దినే దినేzపరిచ్ఛన్నం శ్రీకృష్ణార్చన మీప్సితం | స్వగురోః సేవనం నిత్యమవిచ్ఛిన్నం భ##వేత్తవ || 24

గుర్విష్టయోః పూజనం చ సర్వమంగళ కారణం | పాపాధిరోగ శోకఘ్నం పుణ్యహర్షప్రదం శుభం || 25

అభీష్టదేవః సంతుష్టో గురౌతుష్టే నృణామిహ | ఇష్టదేవే చ సంతుష్టే సంతుష్టాః సర్వదేవతాః || 26

గురుర్విప్రః సురోరుష్టో యేషాం పాతకినామిహ | తేషాం చ కుశలం నాస్తి విఘ్నస్తస్య పదేపదే || 27

తుష్టశ్చ సతతం వత్స శ్రీకృష్ణః ప్రకృతేః పరః | సర్వాంతరాత్మా భగవాంస్తవ భక్త్యా చ నిర్గుణః || 28

తవ తుష్టో గురురహం విధాతా జగతామసి | మయితుష్టే హరిస్తుష్టో హరౌతుష్టే తు దేవతాః || 29

శుక్రుడా! నీ యొక్క చిరకాలవియోగమునకు దుఃఖితుడనై నిన్ను చాడవలెనని ఇచ్చటకు వచ్చితిని. పుత్రులు, పౌత్రులయొక్క వియోగము మరణముకంటె ఎక్కువ.

ఓ మునిశ్రేష్ఠ! నీవు క్షేమముగా ఉన్నావా? నీ పుత్రులు భార్య అందరు క్షేమమేనా? నీ స్వధర్మములను కామ్యములైన కర్మలను, తపస్సుని చక్కగా చేయుచున్నావా? నీవు ప్రతిదినము చేయు శ్రీకృష్ణార్చనము అవిచ్ఛన్నముగా జరుగుచున్నదా? అట్లే నీవు నీయొక్క గురువును అవిచ్ఛిన్నముగా సేవించుచున్నావా? గురువును, ఇష్టదేవతను పూజించుట సమస్త మంగళములకు కారణమగుచున్నది. అది పాపములను, రోగములను, శోకములను పోగొట్టును, గురువు సంతోషపడినచో అభీష్టదేవత సంతోషించును. ఇష్టదేవత సంతోషపడినచో సమస్తదేవతలు సంతోషపడుదురు. ఏపాపాత్ముని యొక్క గురువు, ఇష్టదేవత కోపింతురో వారికి క్షేమము కలుగదు. వారి పనులకు విఘ్నము ఎల్లప్పుడు జరుగుచుండును. నీ ఇష్టదేవత, ప్రకృతికంటె

విశిష్టుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడు సంతోషపడుచున్నాడు. అట్లే నీ గురువగు నేను కూడ సంతోషపడుచున్నాను. నీ గురువునగు నేను సంతోషపడినచో నీ ఇష్టదేవతయగు శ్రీహరి సంతోషపడును. శ్రీహరి సంతోషించినచో సమస్త దేవతలు. సంతోషపడుదురు. అని బ్రహ్మదేవుడనెను.

సాంప్రతం శ్రుణు మే దీమన్‌ అత్రాగమన కారణం | ప్రేషితస్య సురాణాం చ విశ్వసంహర్తురేవ చ || 30

శివస్య గురుపుత్రస్య సాధ్వీం తారాం బృహస్పతేః | అపహృత్య నిశానాథస్తవైన శరణాగతః || 31

శంభుర్థర్మశ్చ సూర్యశ్చ శక్రోzనంతశ్చ పుత్రక | ఆదిత్యా వసనో రుద్రా దిక్పాలాశ్చ దిగీశ్వరాః || 32

యుద్ధాయాయాంతి సన్నద్ధాస్తిస్రః కోట్యశ్చ దేవతాః | నాగాః కింపురాషాశ్త్చవ యక్షరాక్షస గుహ్యకాః || 33

భూతప్రేతా పిశాచాశ్చ కూష్మాండా బ్రహ్మరాక్షసాః | కిరాతాశ్చైవగంధర్వాః సముద్రపులినేzధునా || 34

తారకామయ సంగ్రామే మద్యస్థోzహం సుతైః సహ| దేహి తారాం రణం కిం వా త్యజ చంద్రం చ కామినం || 35

బుద్ధిమంతుడా! ప్రస్తుతము నారాకకు గల కారణమును వినుము. నేను దేవతలు, విశ్వసంహారకుడైన శంకరుడు పంపగా ఇచ్చటకు వచ్చితిని. శివునకు గురుపుత్రుడగు బృహస్పతియొక్క భార్యయగు తారను చంద్రుడపహరించి నిన్ను శరణుపొందెను.

ఇప్పుడు శంకరుడు, ధర్ముడు, సూర్యుడు, ఇంద్రుడు, అనంతుడు, ఆదిత్యులు, వసుగణము, ఏకాదశరుద్రులు, అష్టదిక్పాలకులు, మూడుకోట్ల దేవతలు, నాగులు, కింపురుషులు, యక్ష, రాక్షస, గుహ్యకులు, భూతప్రేత పిశాచులు, కుష్మాండులు, బ్రహ్మరాక్షసులు, కిరాతులు, గంధర్వులు వీరందరు యుద్ధసన్నద్ధులై సముద్ర తీరముననున్నారు. తారాదేవిని ఆమె భర్తయగు బృహస్పతికి తిరిగి ఇచ్చివేయుము. కాముకుడైన చంద్రునకు శరణమివ్వక అతనిని వదలిపెట్టుము. ఈ విషయమున దేవదానవులు యుద్ధము చేయుట తగనిదని పల్కెను.

శుక్ర ఉవాచ- శుక్రుడిట్లు పలికెను-

ఆగచ్ఛంతు సురాస్సర్వే సన్నద్ధా రణదుర్మదాః | యోత్స్యే వినా మహేశం చ సర్వేషాం చ గురుం పరం || 36

యుద్ధము చేయవలెనను దుర్మదముతోనున్న దేవతలందరు యుద్ధ సన్నద్దులై వచ్చినచో రానిమ్ము. అందరకు గురువగు మహేశ్వరుడు తప్ప మిగిలినవారితో నేనే యుద్ధమును చేయుదును.

దైత్యా ఊచు- దైత్యులిట్లనిరి-

ఉభ##యేషాం గురుః శంభుర్మాన్యో వంద్యశ్చ సర్వదా | ధర్మశ్చ సాక్షీసర్వేషాం త్వమేవ చ పితామహః || 37

అన్యాంశ్చ తృణతుల్యాంశ్చ నహి మన్యామహే వయం | ఆగచ్ఛంతు చ యోత్స్యామే వ్రజ బ్రూహి జగద్గురో || 38

కృపయా గురుపుత్రస్య యద్యాయాతి మహేశ్వరః ఆగ్నేయాస్త్రం ప్రయోక్ష్యామః పశ్చాద్యోత్స్యామ హే ప్రభో || 39

బ్రహ్మదేవుడా! శంకరుడు దేవదానవులిద్దరు గురువు. అతడు ఎల్లప్పుడు గౌరవింపదగినవాడు, నమస్కరింపదగినవాడు. ధర్మదేవత అన్నిటికి సాక్షీభూతుడు. నీవు సర్వలోక పితామహుడు. మీరు తప్పక మిగిలిన దేవతలనందరను గడ్డపోచతో సమానముగా మేము భావింతుము. అందువలన దేవతలందరితో కలసి గురుపుత్రుడనే భావనతో మహేశ్వరుడు యుద్ధమునకు వచ్చినను అతనితో కూడ యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నాము. తొలుత ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి తరువాత యుద్ధము చేయుదుమని దేవతలకు చెప్పుడని దైత్యులనిరి.

బ్రహ్మోzవాచ - బ్రహ్మదేవుడిట్లనెను-

కాలాగ్ని రుద్రః సంహర్తా విశ్వస్య బలినాం వరః | హే వత్సాస్తేన సార్థం చ కోవా యుద్దం కరిష్యతి || 40

భద్రకాళీ జగన్మాతా ఖడ్గఖర్పర ధారిణీ | తయా దుర్ధర్షయా సార్థం కోవాయుద్ధం కరిష్యతి || 41

సా సహస్రభుజా దేవీ రుండమాలావిభూషణా | యోజనాయత వక్త్రా చ దశయోజన విస్తృతా || 42

సప్తతాళ ప్రమాణాశ్చ యస్యా దంతా భయానకాః | క్రోశప్రమాణజిహ్వా చ మోహాలోలా భయంకరీ || 43

అతీవ రౌద్రా సన్నద్దా భీమా శంకరకింకరాః | అతిభీమా భైరవాశ్చ నందీ చరణ కర్కశః || 44

శివస్య. పార్షదాః సర్వే మహాబలపరాక్రమాః | వీరభద్రాదయః శూరా కోటి సూర్యసమప్రభాః || 45

సహస్రమూర్థ్నాః శేషస్య ఫణామండల భూషణం | విశ్వం సర్షపతుల్యం చ కోవాయోద్దా చ తత్సమః || 46

కాలాగ్నిరుద్రః సంహర్తా యస్య శంభోశ్చ కింకరః | శూలిన స్త్రి పురఘ్నస్య జ్వలతో బ్రహ్మతేజసా || 47

యస్య పాశుపతాస్త్రేణ దుర్నివార్యేణ పుత్రకాః | భస్మీ భూతం భ##వేద్విశ్వం దైత్యానాం చైవ కా కధా || 48

యస్య శూలేన భిన్నశ్చ శంఖచూడః ప్రతాపవాన్‌ | సుదామా పార్షదవరః కృష్ణస్య పరమాత్మనః || 49

త్రికోటి సూర్యసదృశ##స్తేజస్వీ పరమాద్భుతః | రాధాకవచ కంఠశ్చ సర్వదైత్య జనేశ్వరః || 50

మధుకైటభయోర్హంతా హిరణ్యకశిపోశ్చ యః | స చ విష్ణుః సమాయాతి శ్వేతద్వీపాత్‌ స్వయం ప్రభుః || 51

బిడ్డలారా !మిక్కిలి బలవంతుడు సమస్త విశ్వమును సంహరించు కాలాగ్ని రుద్రునితో ఎవరు యుద్ధము చేయగలుగుదురు. ఖడ్గము తలపుఱ్ఱను ధరించు భద్రకాళి ఆమె జగత్తుల కన్నిటికి తల్లి, ఆమెకు వేయి భుజములున్నవి. తలలను మాలగా చేసికొని ధరించునది. మిక్కిలి విశాలమైన ముఖముకలది. ఆమె దంతములు ఏడు తాటిచెట్ల పొడవున భయంకరమైయుండును. ఆమె నాలుక క్రోశప్రమాణముననుండును. భయంకరియగు ఆ దేవితో యుద్ధమును ఎవరు చేయగలరు? శంకరుని సేవకులు మహాభయంకరులు అతిరౌద్రులు . భైరవులు చాలా భయంకరులు. నందీశ్వరుడు మిక్కిలి కర్కశ##మైనవాడు. అట్లే శివుని అనుచరులైన వీరభద్రులు మొదలుగ దేవతలు మహాబల పరాక్రములు. కోటి సూర్యులతో సమానమైన కాంతికలవారు. వారితో ఎవరు యుద్ధము చేయుదురు.

వేయి శిరస్సులుగల ఆదిశేషులుగల ఆదిశేషునకు ఈ విశ్వము ఆవగింజవంటిది. అట్టి బలవంతునిచే ఎవరు యుద్ధము చేయగలుగుదురు?

త్రిపురాసులను సంహరించిన శంకరునకు కాలాగ్ని రుద్రుడు కింకరుడు . అతడు వేసిన పాశుపతాస్త్రమువలన ప్రపంచమంతయు భస్మమగును. అతనికి దైత్యులు ఏ లెక్కలోనికి వత్తురు? శ్రీకృష్ణపరమాత్మయొక్క అనుచరులలో ఒకడగు సుదాముని అవతారమైన ఆశంఖచూడుడు కాలాగ్ని రుద్రుని శూలము వలన పడిపోయెను. అతడు మూడుకోట్ల సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు. రాధాకవచమునెల్లప్పుడు కంఠమున ధరించుచుండును.

మధుకౌటభులను, హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రత్యేకముగా యుద్ధమునకై శ్వేతద్వీపమునుండి వచ్చునని బ్రహ్మదేవుడు పలికెను.

ఇత్యుక్త్యా జగతాం ధాతా విరరామ చ సంపది | ప్రహస్యోవాచ దైతేయో దానవానామధీశ్వరః || 52

ఈ విధము బ్రహ్మదేవుడు పలికి యూరకుండగా దానవరాజగు ప్రహ్లాదుడిట్లు పలికెను.

ప్రహ్లాద ఉవాచ - ప్రహ్లాదుడిట్లు బ్రహ్మదేవునితో పలికెను-

నమస్తుభ్యం జగద్ధాతః సర్వేషాం ప్రాక్తనేశ్వరః | సర్వపూజ్యః సర్వనాథః కిం వక్ష్యామి తవాగ్రతః || 53

హిరణ్యకశిపోర్హంతా మధుకైటభయోశ్చ యః | సా కళా యస్య కృష్ణస్య పరిపూర్ణతమస్య చ || 54

సర్వాంతరాత్మనస్తస్య చక్రం నామ సుదర్శనం | అస్మాకం లోకమస్మాంశ్చ తద్రాగ్ధక్ష్యతి దుఃసహం || 55

తతో న బలవాన్‌ శంభుర్న చ పాశుపతం విధే | న చ కాళీ న శేషశ్చ న చ రుద్రాదయః సురాః || 56

యస్యలోమసు విశ్వాని నిఖిలాని జగత్పతే | సర్వాధారస్య చ విభోః స్థూలాత్‌ స్థూలతరస్య చ || 57

షోడశాంశో భగవతః స చైవ హి మహాన్‌ విరాట్‌ | అనంతో నహి తత్‌ స్థూలో న కాళీ బృహతీ తతః || 58

ఆగచ్ఛంతు సురాః సర్వే యుద్ధం కుర్వంతు సాంప్రతం | నభిభేమి శ##రేభ్యశ్చ న చ పాశుపతాద్ధరాత్‌ || 59

నమస్తసై#్మ భగవతే శివాయ శివరూపిణ | నమోzనంతాయ సాధుభ్యో వైష్ణ వేభ్యః ప్రజాపతే || 60

శ్రీకృష్ణస్య ప్రసాదేన నిర్భయోzహం నిరామయః | నమే స్వాత్మబలం బ్రహ్మన్‌ తద్బలం యత్ర్పభోర్బలం || 61

స్వపాపేన మృతస్తాతో పురా వై విష్ణు నిందయా | నిర్బంధాత్‌ శంఖచూడశ్చ దర్పాచ్చ మధుకైటభౌ || 62

త్రిపురః కింకరోzస్మాకం వీరత్వేన నగణ్యతే | తథాzపి ప్రేరితస్తేన సరథస్థో మహేశ్వరః || 63

ఇత్యుక్త్యా దానవశ్రేష్ఠో విరరామ చ సంసది | ఉవాచ జగతాం ధాతా పునరేవ చ నారద || 64

అందరికంటెను పెద్దవాడవగు నీకు నమస్కారము. నీవు అందరిలో పూజ్యుడవు. అందరకు నాథుడవు. అట్టి నీముందు నేనేమి చెప్పగలను.

హిరణ్యకశిపుని, మధుకైటభులను సంహరించినవాడు పరిపూర్ణతముడైన శ్రీకృష్ణుని పదునారవ అంశము. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణుని సుదర్శన చక్రము మాలోకములను మమ్ములను కూడ క్షణములో కాల్చివేయును.

ఆ శ్రీకృష్ణపరమాత్మకంటె నీవు చెప్పిన శంకరుడు, అతని పాశుపతాస్త్రము , కాళికాదేవి, శేషుడు, రుద్రులు ఇతర దేవతలెవ్వరు బలవంతురుకారు. ఆ పరమాత్మయొక్క రోమములందు సమస్త విశ్వములున్నవి. స్థూలమునకంటె మిక్కిలి స్థూలమైనవాడు సమస్తములము ఆదారభూతుడగు భగవంతునకు మహావిరాద్రూపుడు పదునాపవ అంశము. ఆ మహావిరాట్‌ స్వరూపునికంటె అనంతుడు, కాళి గొప్పవారు కారు.

దేవతలందరు వచ్చి యుద్ధము చేసినచో చేయనిమ్ము . నేను వారి శరములకుగాని, హరుని పాశుపతాస్త్రమునకు గాని భయపడరు.

మంగళ స్వరూపుడగు శంకరునకు నమస్కారము. అట్లే అనంతునకు, సాధువులకు వైష్ణవులకు అందరకు నమస్కారము. శ్రీకృష్ణుని అనుగ్రహమువలన నేను నిర్భయుడను. రోగ రహితుడను. నాకు ప్రత్యేకముగా నా బలమునున దేదియులేదు. నా బలమంతయు ఆ కృష్ణపరమాత్మునియొక్క బలమే.

నా తండ్రి విష్ణువును నిందించి. నిందించి చనిపోయెను. అట్లే శంఖచూడుడు నిర్భంధమువలన చనిపోయెను. మధుకైటభులు అతి గర్వము వలన నాశనమైరి. త్రిపురాసురుడు మాకు కింకరుడు. అందువలన అతనిని బలవంతుడుగా మేము పరిగణింపము. ఐనను అతడ రథముననున్న పరమేశ్వరుని యుద్ధమునకు ప్రేరేపించెను.

ఈ విధముగా దానవశ్రేష్ఠుడైన ప్రహ్లాదు డా సభలో పలికి యూరకుండగా బ్రహ్మదేవుడు తిరిగి ఇట్లు పలికను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను-

వినాశకారణం యుద్ధముభయోర్దైత్య దేవయోః | సుప్రీత్యాచరణం వత్స! సర్వమంగళ కారణం|| 65

తారాం భిక్షాం దేహి మహ్యం భిక్షుకాయ చ వేధసే | విముఖే భిక్షుకే రాజన్‌ గృహస్థః సర్వపాపభాక్‌ || 66

దైత్యులు, దేవతలు ఇద్దరు కలసి యుద్ధముచేసినచో వినాశనము తప్పక జరుగును. ప్రేమ కలిగియుండుట సమస్త మంగళములను కలిగించును.

ఓ రాజా! భిక్షకుడనైన నాకు తారను భిక్షగానిమ్ము. భిక్షుకుడు నిరాశతో వెళ్ళిపోయినచో ఆ గృహస్థు సమస్త పాపములను పొందును.

సనత్కుమార ఉవాచ- సమత్కుమారుడిట్లనెను-

స్వకీర్తిం రక్ష రాజేంద్ర! సింహస్త్వం సురదైత్యయోః | యస్య భిక్షుర్జగద్ధాతా తస్య కీర్తే శ్చ కా కధా || 67

ఓ రాజేంద్ర నీ కీర్తిని నీవు రక్షించుకొనుము. నీవు దేవదానవులలో సింహమువంటివాడవు. జగద్ధాతయగు బ్రహ్మ గొప్పతనమును ఆలోచించుకొనుము.

సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను-

న జితస్త్వం సురేంద్రైశ్చ బ్రహ్మేశాన పురోగమైః | రక్షితః కృష్ణతక్రేణ వైష్ణవః పుణ్యవాన్‌ శుచిః || 68

శుక్రుడా నిన్ను దేవేంద్రుడు బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలెవ్వరు జయింపలందు. కృష్ణ భక్తుడవగు నిన్ను అతని చక్రము ఎల్లప్పుడు రక్షించుచున్నందువలన నీవు గొప్ప పుణ్యము సంపాదించుకొంటివి. మరియు పవిత్రుడవైతివని సనాతనుడు యనెను.

సనందన ఉవాచ- సనందునుడుట్లనెను-

యస్యేష్టదేవః సర్వాత్మా శ్రీకృష్ణః ప్రకృతేః పరః గురుశ్చ వైష్ణవః శుక్ర స చ కేన జితోభ##వేత్‌ || 69

శుక్రుడా! ప్రకృతికంటె ఉన్నతుడైన శ్రీకృష్ణపరమాత్మ నీకు అభీష్టదేవత. నీవు వైష్ణవుడవు నీగురువు వైష్ణవుడు. అట్టి నిన్ను ఎవరు జయింతురు అనెను.

సనక ఉవాచ- సనకముని ఇట్లనెను-

పుణ్యవాన్నజితః కేన జితః పాపీ స్వపాతకైః | పుణ్యదీపో న నిర్వాతి పాషండేనైవ వాయునా || 70

పుణ్యవంతుని ఎవ్వరును జయింపరు. పాపాత్ముడు తన పాపములచేతనే జయింపబడుచున్నాడు. అందువలననే పుణ్యదీపమును ఎట్టి దుష్టవాయువు ఆర్పలేదు అని అనెను.

ఋషయ ఊచు- ఋషులందరు ఇట్లనిరి -

దేహి తారాం మహాభాగ చంద్రప్రాణాధికాం గురోః | స్వకీర్తిం రక్ష సుచిరం ప్రార్థయామః పునః పునః || 71

శ్రేష్ఠుడా! గురువగు బృహస్పతికి చంద్రుడు తన ప్రాణములకంటె మిన్నగా చూచుకొనుచున్న తారాదేవిని ఇచ్చి వేయుము. దానివలన నీ కీర్తి స్థిరముగా ఉండగలదు. కావున నిన్ను మాటిమాటికి తారనిమ్మని ప్రార్థింతుమని అనిరి.

ప్రహ్లాద ఉవాచ- ప్రహ్లాదుడిట్లనెను-

స్థితే మదీశ్వరే సాక్షాన్నహిభృత్యో విరాజతే | కర్తారం బ్రూహి మన్నాథం గురుం శుక్రం సతాం వరం || 72

శిష్యాణామాధిపత్యే చ సాధూనాం గురురీశ్వరః | గురౌ సమర్పితం పూర్వం సర్వైశ్వర్యం మునీశ్వరే || 73

వయం భృత్యాశ్చ ప్రోష్యాశ్చ స్వగురోః పరిచారకాః | తే చ శిష్యాః కుశలినో గుర్వాజ్ఞాం పాలయంతి యే || 74

నాకు అధీశ్వరులైన మీరు సాక్షాత్తుగా ఎదురున ఉండగా భృత్యుడు అతనిముందు వినయవిధేయతలతో ఉండవలసినదే. మాకు నాథుడు గురువైన శుక్రుడు మీ పనిని చేయును. శిష్యులు ఎంతపెద్ద పదవిలో ఉన్నను వారు సాధుపురుషులైనచో వారికి గురువే ఈశ్వరుడగుచున్నాడు. మేము మా గురవగు శుక్రునకు మా సమసై#్తశ్వర్యమును పూర్వమే సమర్పించుకొంటిమి. మా గురువునకు మేము భృత్యులము. పరిచారకులము, గురువుయొక్క ఆజ్ఞను పరిపాలించినవారే శిష్యులు కదా అని అనెను.

ప్రహ్లాదస్య వచః శ్రుత్వా చకార ప్రార్థనాం కవిం | దదౌ శుక్రశ్చ తారాం తాం చంద్రం చ మలినం మునే || 75

దత్వాం తారాం విధుం శుక్రః ప్రణనామ విధేః సదే | నమస్కృత్య మునిభ్యశ్చ ప్రణతః స్వపురం య¸° || 76

ప్రహ్లాదః సగణో భక్త్యా నమస్కృత్య విధేః పదే | ప్రత్యేకం మునిగణాన్‌ ప్రణతః స్వగృహం య¸° || 77

ప్రహ్లాదునియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు తిరిగి శుక్రుని తారనిమ్మని ప్రార్థించెను. అందువలన శుక్రుడు తారను బ్రహ్మదేవునకిచ్చి అతని పాదములకు నమస్కరించెను. అట్లే అచ్చటకు వచ్చిన మునులకందరకు ప్రత్యేక ప్రత్యేకముగా నమస్కరించి తన గృహమునకు తిరిగిపోయెను. అట్లే ప్రహ్లాదుడు తన అనుచరులందరతో కలిసి బ్రహ్మదేవుని పాదములకు, మరియు మునులకందరకు నమస్కరించి తమ గృహములకు తిరిగిపోయిరి.

బ్రహ్మా దదర్శ తారాం చ ప్రణతాం స్వపదే సతీం | లజ్జయా నమ్రవక్త్రీం చ రుదతీం గుర్విణీం మునే || 78

చంద్రం చ ప్రణతం ధాతా క్రోడే సంస్థాప్య మాయయా | ఉవాచ మలినాం తారాం కాతరాం చ కృపామయః || 79

తారే త్యజ భయం మత్తః భయం కిం తే మయి స్థితే | సౌభాగ్యయుక్తా స్వపతౌ భవిష్యసి వరేణ మే || 80

దుర్బలా బలినా గ్రస్తా నిష్కామా న చ్యుతా భ##వేత్‌ | ప్రాయశ్చిత్తేన శుద్ధా సా న స్త్రీ జారేణ దుష్యతి || 81

సకామా కామతో జారం భజతే స్వసుఖేన చ | ప్రాయశ్చిత్తాన్న శుద్ధా సా స్వామినా పరివర్జితా || 82

కుంభీపాకే పచ్యతే సా యావచ్చంద్ర దివాకరం | అన్నం విష్ఠా జలం మూత్రం స్పర్శనం సర్వపాపదం || 83

పాపీ యస్యాశ్చ తస్యాశ్చ సాదుభిః పరివర్జితం | కస్య గర్భం వద శుభే గచ్ఛ వత్సే గురోర్గృహం || 84

త్యజ లజ్జాం మహాభాగే సర్వం చ ప్రాక్తనాద్భవేత్‌ | బ్రహ్మణో వచనం శ్రుత్వా తమువాచ సతీ తదా || 85

బ్రహ్మదేవుని పాదములపై సిగ్గుతో తలవంచుకొని తారపడెను. ఆమె అప్పుడు గర్భవతి, అట్లే చంద్రుడు కూడ బ్రహ్మదేవునకు నమస్కరింపగా అతనిని తమ మాయచే దగ్గరకు తీసికొనెను. తరువాత కృపామయుడైన ఆ బ్రహ్మదేవుడు అపవిత్రమైనందువలన భయపడుచున్న తారతో ఇట్లనెను.

తారా! నేనుండగా నీవు భయపడవసిన పనిలేదు. అందువలన భయమును వదలిపెట్టుము, నావరము వలన నీవు నీ భర్త యొక్క అనురాగ సౌభాగ్యములను తిరిగి పొందుదువు. దుర్భలయైన స్త్రీని బలవంతుడైన పురుషుడు బలాత్కారించినచో ఆమెకు కామము లేని పక్షమున పతిత కానేరదు. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన తిరిగి పవిత్రురాలగును. ఆమెకు జార దోషమంటదు.

కాని కామముతో తన సుఖమునభిలషించి వ్యభిచారము చేసినచో ఆమెను భర్త వదిలి పెట్టవలెను. అమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన పవిత్రురాలు కాజాలదు. పైగా ఆమె కుంభీపాక నరకమున సూర్యచంద్రులున్నంతవరకు బాధలు పడుచుండును. అచ్చట ఆ పాపాత్మురాలు మలమునే అన్నముగా మూత్రమునే జలముగా తీసికొని బ్రతుకును.

తల్లీ! నీ గర్భమెవరివలన కలిగినదో చెప్పుము. నీవు సిగ్గును దవలిపెట్టి ఈ విషయము చెప్పుము. సమస్తము ప్రాక్తన కర్మవలన జరుగుచున్నది. దానికి మనము కర్తలము కాజాలమను బ్రహ్మదేవుని మాటలు విని తార ఇట్లు పలికెను.

చంద్రస్య గర్భం హే తాత బిభర్మ్యద్య స్వకర్మణా | సర్వే మే సాక్షిణః సంతి దుర్బలాయాః ప్రజాపతే || 86

యదా జగ్రాహ చంద్రో మాం దయాహీనశ్చ దుర్మతిః | ఇత్యుక్త్వా తారకా దేవీ సుషావ కనక ప్రభం || 87

ఓ తండ్రీ! ఈ గర్భము నాకు చంద్రునివలన కలిగినది. నేను పూర్వము చేసికొనిన పాపకర్మవలన దీనిని మోయుచున్నాను. చెడు భావనతో దయలేకుండ చంద్రుడు నన్ను బలాత్కరించిన విషయమునకు సాక్షులు కూడ కలరు అనెను.

తరువాత తార బంగారువంటికాంతిగల కుమారుని కనెను.

కుమారం సుందరం తత్ర జ్వలంతం బ్రహ్మతేజసా | గృహీత్వా తనయం చంద్రో నత్వా బ్రహ్మాణ మీశ్వరం || 88

జగామ స స్వభవనం బ్రహ్మా సింధు తటం య¸° | సాధ్వీం తారం చ గురవే దేవేభ్యో zప్యభయం దదౌ || 89

ఆశిషం శంభు ధర్మాభ్యాం దత్వా లోకం య¸° విధిః | దేవా యయుః స్వభవనం స్వగృహం చ బృహస్పతిః || 90

బ్రహ్మ తేజో విరాజితుడు సుందరుడగు కుమారుని తీసికొని బ్రహ్మదేవునకు నమస్కరించి చంద్రుడు తన ఇంటికి పోయెను. బ్రహ్మదేవుడు సాధ్వియగు తారను బృహస్పతికిచ్చి తాను సింధూనదీ తీరముననున్న స్వభవనమునకు పోయెను. అతడు అచ్చటనున్న శంకరునకు ధర్మదేవతలకు ఆశీస్సుల నొసగెను. దేవతలకు అభయమునొసగెను.

అటుపిమ్మట దేవతలు, తమ తమ భవనములకు పోయిరి.

భావానురక్తవనితాం ప్రాప్య సంహృష్టమానసః | తారకాగర్భసంభూతః స ఏవ చ బుధః స్వయం || 91

తేజస్వీ సద్గ్రహో బ్రహ్మంశ్చంద్రస్య తనయో మహాన్‌ | స ఏవనందనవనే చిత్రాం సంప్రాప్య నిర్జనే || 92

ఘృతాచ్యా గర్భసంభూతాం కుబేరస్య చ రేతసా | దృష్ట్యా చ నిర్జనే రమ్యాం కన్యాం కమలలోచనాం || 93

అతీవ ¸°వనస్థాం చ బాలాం షోడశ వార్షికీం | దాంధర్వేణ వివాహేన తాం జగ్రాహ విధోః సుతః || 94

దేవగురువగు బృహస్పతి తన మనసెరిగి ప్రవర్తించు భార్యయగు తార లభించినందువలన సంతోషపడి తన భవనమునకు పోయెను.

తారయొక్క గర్భమున పుట్టినవాడే బుధుడు. అతడు మహాజేయస్సంపన్నుడు . గ్రహములలో శ్రేష్ఠుడు. ఆ చంద్రపుత్రుడు నిర్జనమైన నందనవనములో తిరుగుచుండెను. అప్పుడచటికి కుబేరునకు ఘృతాచియను అప్సరకు పుట్టిన చిత్రయను నవ¸°వనాంగి వచ్చెను. పదునారు సంవత్సరముల ప్రాయముగల ఆ చిత్రను బుధుడు గాంధర్వ వివాహమున స్వీకరించెను.

తస్యామాథాయాం రహసి వీర్యాధానం చకారసః | బభూవ రాజా చిత్రాయాం చైత్రో వై మండలేశ్వరః || 95

సప్తద్వీపవతీం పృథ్వీం శాస్తి వై ధార్మికో బలీ | శతం నధ్యో ఘృతానాం చ దధ్నాం నద్యః శతానిచ || 96

శతాని నద్యో దుగ్దానాం మధునద్యశ్చ షోడశః | దశ నద్యశ్చ తైలానాం శర్కరాలక్షరాశయః || 97

మిష్టాన్నానాం స్వస్తికానాం లక్షరాశిశ్చ నిత్యశః | పంచకోటిగవాం మాంసం సాపూపం స్వప్నమేవ చ || 98

ఏతేషాం చ నదీరాశీర్భుంజతే బ్రాహ్మణా మునే | గవాంలక్షం చ రత్నానాం మణీనాం లక్షమేవ చ || 99

శతలక్షం సువర్ణానాం లక్షం వై సూక్ష్మ వాససాం | రత్నానాం భూషణం పాత్రమతీవ సుమనోహరం || 100

దదౌ ద్విజాతయే రాజా నిత్యం వై జీవితావధి |

బుధునకు చిత్రకు చైత్రుడను వాడు పుట్టెను. అతడు చక్రవర్తియై ధార్మికుడై సప్త ద్వీపముల కల భూమినంతయు పరిపాలించెను.

అతడు ప్రతిదినము నదులుగాపారి నెయ్యితో, నదులుగా ప్రవహించు పెరుగుతో, పాలతో, తేనెతో, నూనెతో, చక్కెరరాశులతో, మిష్టాన్నము, స్వస్తికముల రాశులతో, అపూపములతో మంచి అన్నముతో బ్రాహ్మణులకు సంతర్పణలు చేయుచుండెను. వారికి బోజనాంతరము గోవులు, రత్నములు, మణులు, బంగారు నాణములు, సన్నని వస్త్రములు, రత్న భూషణములు, రత్నపాత్రలు తాను జీవించియున్నంతవరకు దానము చేసెను.

తస్య చైత్ర్యస్య పుత్రశ్చ రాజాzధిరథ ఏవ చ || 101

తస్య పుత్రశ్చ సురథశ్చక్రవర్తీ బృహచ్ఛ్రవాః మహాజ్ఞానం చ సంప్రాప్య మేధసో మునిసత్తమాత్‌ || 102

భేజే పురా విష్ణుమాయాం పుణ్యక్షేత్రే చ భారతే | శరత్కాలే మహాపూజాం చకార స సరిత్తటే || 103

వైశ్యేన సార్థం స మహాన్‌ జ్ఞానినాం మునిసత్తమ | రాజా కళింగదేశస్య విరాధశ్చ విశాంవరః || 104

తస్యపుత్రో మహాయోగీ త్రుమిణో జ్ఞానినాం వరః | ద్రుమిణో వైష్ణవః ప్రాజ్ఞః పుష్కరే దుష్కరం తపః || 105

కృత్వా సమాధిం సంప్రాప జ్ఞానినాం వైష్ణవాగ్రణీః | పుత్రైర్దారైర్నిరస్తశ్చ

ధనలోభాద్దురాత్మభిః || 106

స చ కోటిసువర్ణం చ నిత్యం దత్వా జలం పపౌ | ముక్తిం సంప్రాప సంసేవ్య విష్ణుమాయాం సనాతనీం || 107

రాజా లేభే మనుత్వం చ రాజ్యం నిష్కంటకం మునే | ఉవాచ మధురం వాక్యం ధాతా త్రిజగతాం పతిః || 108

ఆ చైత్రమహారాజునకు అధిరథుడనువాడు పుట్టెను. అతనిపుత్రుడు సురథుడు. ఆతడు మేధోమునివలన అదికమైన జ్ఞానమును పొంది శరత్కాలమున దుర్గాదేవి పూజను చేసెను. కళింగదేశమున విరాధుడను వైశ్యశ్రేష్ఠుడుండెను. అతడు పుత్రుడు మహాజ్ఞాని, మహాయోగి, పరమ వైష్ణవుడైన ద్రుమిణుడు. అతడు పుష్కరక్షేత్రమున తపస్సు చేసి మహాజ్ఞాని, వైష్ణవాగ్రణియగు సమాధియను పుత్రునిబడసెను. అతడు ప్రతిదినము బ్రహ్మణులకు కోటి సువర్ణములు దానము చేయుచుండెను. అందువలన దుష్టులైన అతని పుత్రులు ఇంటినుండి వెడలగొట్టిరి. సురధుడను రాజు, సమాధియను వైశ్యుడు కలిసి విష్ణుమాయయగు దుర్గాదేవిని ఆరాధించగా సమాది ముక్తిని పొందెను. సురథుడు సనాతనియగు దుర్గాదేవిని ఆరాధించి రాజ్యమును ముక్తిని పొందెను. చివరకతడు మనువయ్యెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతీఖండే నారద నారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే గురోస్తారా ప్రాప్తి బుధోత్పత్యాది వర్ణనం నామ ఏకషష్టితమోzధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానమున గురువునకు తారాప్రాప్తి, బుధుని జననము మొదలగు విషయములున్న

అరవై ఒకటవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters