sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

సప్తపంచాశత్తమోధ్యాయ - దుర్గోపాఖ్యాన ప్రారంభము

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో ఇట్లనెను-

సర్వాఖ్యానం శ్రుతం బ్రహ్మాన్‌ అతీవ పరమాద్భుతం | అధునా శ్రోతుమిచ్ఛామి దుర్గోపాఖ్యానముత్తమం || 1

దుర్గా నారాయణీశానా విష్ణుమాయా శివా సతీ | నిత్యా సత్యాభగవతీ శర్వాణీ సర్వమంగళా || 2

అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ చ సనాతనీ | నామాని కౌథుమోక్తాని సర్వేషాం శుభదాని చ || 3

అర్థం షోడశనామ్నాం చ సర్వేషా మీప్సితం వరం | బ్రూహివేదవిదాం శ్రేష్ఠ వేదోక్తం సర్వసమ్మతం || 4

కేన వా పూజితా సాzదౌ ద్వితీయే కేన వా పురా | తృతీయే వా చతుర్థే వా కేన సర్వత్ర పూజితా || 5

ఓ నారాయణమునీ! నీవు చెప్పగా పరమాద్భుతమైన కథలనన్నిటిని వింటిని. ఐనను నాకిప్పుడు దుర్గాదేవి ఉపాఖ్యానము వినవలెనని ఉన్నది.

ఆ దేవికి దుర్గ, నారాయణీ, ఈశాని, విష్ణుమాయ, శివ, సతి, నిత్య, సత్య, భగవతి, శర్వాణి, సర్వమంగళా, అంబికా, వైష్ణవీ, గౌరి, పార్వతి, సనాతని అనుపేర్లు కలవు. ఇవన్నియు సామవేదములోని కౌథుమశాఖయందు చెప్పబడినవి. శుభం కరమైనవి కూడా.

ఓ వేదవేదాంగ తత్వవేత్త! పై పదునారుపేర్లకు వేదములందు ఎట్టి అర్థము చెప్పబడినది. ఆ దేవిని తొలుత ఎవరు పూజించిరి? ఆ తరువాత పూజించినదెవరు? ఆ తరువాత దుర్గాదేవిని ఎవరెవ్వరు పూజించిరో తెలుపుమని అడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

అర్థం షోడశ నామ్నాం చ విష్ణుర్వేదే చకార సః | జ్ఞాత్వా పునః పృచ్ఛసి త్వం కథయామి యథాగమం || 6

దుర్గో దైత్యే మహావిఘ్నే భవబంధే చ కర్మణి | శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని || 7

మహాభ##యేzతి రోగే చాప్యాశభ్దో హంతృవాచకః | ఏతాన్‌ హంత్యేవ యా దేవీ సా దుర్గా పరికీర్తితా || 8

యశసా తేజసా రూపై ర్నారాయణ సమా గుణౖః | శక్తిర్నారాయణసై#్యయం తేన నారాయణీ స్మృతా || 9

ఈశానః సర్వసిద్ధ్యర్థే చా శబ్దో దాతృవాచకః | సర్వసిద్ధి ప్రదాత్రీ యా సాzపీశానా ప్రకీర్తితా || 10

దుర్గాదేవి యొక్క షోడశ నామములకు అర్థమును వేదమున విష్ణుమూర్తి చెప్పెను. ఆ విషయము నీకు తెలిసినను నన్నడుగుచున్నావు. ఐనను ఆగమశాస్త్ర పద్ధతిలో ఆ పదముల అర్థమును తెలుపుదును.

'దుర్గ' శబ్దమునకు రాక్షసుడు, గొప్పనైన విఘ్నము, సంసారబంధము, కర్మ, శోకము, దుఃఖము, నరకము, యమదండనము, జన్మ మొదలగు అర్థములున్నవి. అట్లే 'ఆ 'శబ్దమునకు పోగొట్టునది హతమొనర్చునది అను అర్థములున్నవి. దుర్గ శబ్దార్థములైన రాక్షసుడు మొదలగువానిని హతమొనర్చునది కావున ఆ దేవి దుర్గాదేవి యైనది.

ఈదేవీ యశస్సున, తేజస్సున, రూపమున, గుణములయందు నారాయణునితోసమానమైనది. పైగా నారాయణునకీదేవి శక్తి రూపిణి కావున నారాయణీ యైనది.

'ఈశాన' శబ్దమునకు సమస్త సిద్ధులు అను అర్థము కలదు. 'ఆ' శబ్దమునకు దాతయను అర్థము కలదు. ఈ విధముగా సమస్త సిద్ధుల నొసగు దేవతకావున ఈ దేవతను ఈశానా యని యందురు.

సృష్టా మాయా పురాసృష్టౌ విష్ణునా పరమాత్మనా | మోహితం మాయయా విశ్వం విష్ణుమాయా ప్రకీర్తితా || 11

శివే కల్యాణరూపాచ శివదా చ శివప్రియా | ప్రియే దాతరి చాశబ్దః శివా తేన ప్రకీర్తితా || 12

సద్బుద్ధ్యధిష్ఠాతృదేవీ విద్యమానా యుగే యుగే | పతివ్రతా సుశీలా చ సాసతీ పరికీర్తితా || 13

యథా నిత్యో హి భగవన్నిత్యా భగవతీ తథా | స్వమాయయా తిరోభూతా తత్రేశే ప్రాకృతేలయే || 14

ఆబ్రహ్మస్తంబపర్యంతం సర్వం మిథ్యైవ కృత్రిమం | దుర్గా సత్యస్వరూపా సా ప్రకృతిర్భగవాన్యథా || 15

సిద్ధైశ్వర్యాధికం సర్వం యస్యామస్తి యుగే యుగే | సిద్ధాదికే భగోజ్ఞేయః తేన సాభగవతీ స్మృతా || 16

సర్వాన్మోక్షం ప్రాపయతి జన్మమృత్యుజరాదికం | చరాచరాంశ్చ విశ్వస్థాన్‌ శర్వాణీ తేన కీర్తి తా || 17

మంగళం మోక్షవచనం చా శబ్దో దాతృవాచకః | సర్వాన్మోక్షాన్యా దదాతిసైవ స్యాత్సర్వమంగళా || 18

హర్షే సంపది కల్యాణ మంగళం పరికీర్తితం | తాన్‌ దదాతి చ సర్వేభ్యస్తేన సా సర్వమంగళా || 19

అంబేతి మాతృవచనో వందనే పూజనే సదా | పూజితా వందితామాతా జగతాం తేన సాంబికా || 20

విష్ణుభక్తా విష్ణురూపా విష్ణోః శక్తి స్వరూపిణీ | సృష్టౌ చ విష్ణునా సృష్టా వైష్ణవీ తేన కీర్తితా|| 21

గౌరః పీతే చ నిర్లిప్తే పరేబ్రహ్మణి నిర్మలే | తస్యా త్మనః శక్తిరియం గౌరీ తేన ప్రకీర్తితా || 22

గురుః శంభుశ్చ సర్వేషాం తస్య శక్తిశ్చ యాసతీ | గురుః కృష్ణశ్చ తన్మాయా గౌరీ తేన ప్రకీర్తితా || 23

తిథిభేదే పర్వభేదే కల్పభేదేzన్యభేదనే | ఖ్యాతౌ తేషు చ విఖ్యాతా పార్వతీ తేన కీర్తితా || 24

మహోత్సవ విశేష చ పర్వన్నితి సుకీర్తితా | తస్యాధిదేవీ యా సా చ పార్వతీ పరికీర్తితా || 25

పర్వతస్య సుతా దేవీసాzవిర్భూతా చ పర్వతే | పర్వతస్యాధిష్ఠాతృ దేవీ పార్వతీ తేన కీర్తితా || 26

సర్వకాలే సనాప్రోక్తో విస్తృతే చ తనీతి చ | సర్వత్ర సర్వకాలే చ విద్యమానా సనాతనీ || 27

పరమాత్మయగు విష్ణువు చరాచరా ప్రపంచమును సృష్టింపదలచి మాయాదేవిని సృష్టించెను. ఆమెవలన ప్రపంచమంతయు మోహపరవశ##మైనది. విష్ణువుయొక్క మాయకావున ఆ దేవి విష్ణుమాయయైనది.

'శివ' యనగా కల్యాణరూపమైనది. 'ఆ' శబ్దమునకు ప్రియ మరియు దాత యను అర్థములున్నవి. కల్యాణములనిచ్చునది లేక శివునకు ప్రియురాలగు ఆ దేవిని 'శివా' అని అందురు.

సద్బుద్ధికి అధిష్ఠాన దేవత లేక ప్రతియుగమున ఉండునది, పతివ్రత, మంచిశీలము కల ఆ దేవిని 'సతీ' యని అందురు.

భగవంతుడగు పరమాత్మ ఎట్లు నిత్యుడో అట్లే భగవతి కూడా నిత్యస్వరూప, ఆ దేవి తన మాయవలననే ప్రాకృతలయమున భగవంతుని యందు విలీనమగుచున్నది. కాన ఆ దేవిని 'నిత్య'యని యందురు.

బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబమువరకున్న సమస్త చరాచర జంతుకోటి అశాశ్వతమైనది. కానీ భగవంతుడు సత్యస్వరూపుడు. అట్లే దుర్గ, ప్రకృతియగు ఆ దేవి సత్యస్వరూపయగుచున్నది.

'భగ'మనగా సిద్ధము, ఐశ్వర్యము మొదలగు అర్థములున్నవి. ఈ దేవి ప్రతియుగమున ఐశ్వర్యాది సిద్ధిసహిత కావున ''భగవతి'' యను పేరుతో నున్నది.

ఈ ప్రపంచముననున్న చరాచర సృష్టికంతయు జన్మ, మృత్యు, జరాదికములను మోక్షమునిచ్చుచున్నందువలన ఆ దేవి శర్వాణి యను పేరుతో ప్రసిద్ధి చెందినది.

'మంగళ' శబ్దమునకు మోక్షమని 'ఆ' శబ్దమునకు దాతయను అర్థమున్నది, సర్వసృష్టికి మంగళ రూపమైన మోక్షమునిచ్చు దేవిని 'సర్వమంగళా' యని యందురు. 'మంగళ' శబ్దమునకు హర్షము, సంపద, కల్యాణమను అర్థములున్నవి. సర్వులకు హర్షాది మంగళములను ఇచ్చు దేవి కావున సర్వమంగళ##యైనది.

'అంబా' శబ్దమునకు తల్లియనునర్థముకలదు. అట్లే పూజిత, వందిత యను అర్థములు కూడా నున్నవి. సమస్త జగములచే ఈ దేవత పూజ లనందుకొనుచున్నందువలన, నమస్కారములనందుకొనుచున్నందున 'అంబ' యైనది. అట్లే సమస్త విశ్వములకు మాతృరూపిణి కావున 'అంబ' యైనది.

విష్ణుమూర్తికి భక్తురాలు, విష్ణుస్వరూపిణి, విష్ణంశక్తి స్వరూపిణి, సృష్టిప్రారంభమున ఈ దేవిని విష్ణువు సృష్టించినందువలన వైష్ణవిగా ప్రసిద్ధికెక్కినది.

'గౌర' శబ్దమునకు పీతవర్ణమని, నిర్లిప్తమని, పరబ్రహ్మ, నిర్మలము అను అర్థములున్నవి, పరబ్రహ్మయొక్క శక్తిస్వరూపిణి కావున 'గౌరి' గా ఈ దేవి ప్రసిద్ధినందినది. అందరకు గురువు శంకరుడు, అతని శక్తి స్వరూపిణి లేక గురువైన కృష్ణుని మాయ కావున 'గౌరి'యైనది.

తిథి భేదమగు పూర్ణిమకు, పర్వభేదమునకు, ఒకానొక కల్పమునకు, ఇంకను కొన్నిటిని పర్వమని పిలుతురు. 'తీ' యనగా ఖ్యాతి. పై వాటిలో ప్రఖ్యాతినందినందువలన ఆ దేవత పార్వతి యైనది. ఒక మహోత్సవమునకు 'పర్వన్‌' అను పేరుకలదు. ఆ యుత్సవమునకు అధిష్ఠానదేవి కావున పార్వతియైనది. హిమాలయపర్వతమునకు తనయ లేక ఆ పర్వతమునకు అధిష్ఠాన దేవత కావున పార్వతియైనది.

'సనా'యనగా సర్వకాలము. 'తనీ' యనగా విస్తరించి యుండునది. సర్వకాలములందు సర్వత్ర విస్తరించియుండు ఈ దేవతను 'సనాతనీ'యని పిలుతురు.స

అర్థః షోడశ నామ్నాం చ కీర్తితశ్చ మహామునే | యథాగమం త్వం వేదోక్తోపాఖ్యానం చ నిశామయ || 28

నారదమునీ! దుర్గాదేవియొక్క పదునారు పేర్లకు గల అర్థమును ఆగమప్రకారము నీకు విశదపరచితిని. ఇక నీకు వేదోక్తమైన ఆదేవియొక్క ఉపాఖ్యానము తెల్పెదను.

ప్రథమే పూజితా సాచ కృష్ణేన పరమాత్మనా | బృందావనే చ సృష్ట్యాదౌ గోలోకే రాసమండలే || 29

మధుకైటభభీతేన బ్రహ్మణా సా ద్వితీయతః | త్రిపురప్రేరితేనైవ తృతీయే త్రిపురారిణా || 30

భ్రష్టశ్రియా మహేంద్రేణ శాపాద్దుర్వాససః పురా | చతుర్థే పూజితా దేవీ భక్త్యా భగవతీ సతీ || 31

తదా మునీంద్రైః సిద్దేంద్రైః దేవైశ్చ మునిపుంగవైః | పూజితా సర్వవిశ్వేషు సమభూత్సర్వతః సదా || 32

తేజస్సుసర్వభూతానాం సాzవిర్భూతా పురామునే | సర్వే దేవా దదుస్తసై#్య శస్త్రాణ్యాభరణాని చ || 33

దుర్గాదయశ్చ దైత్యాశ్చ నిహతదుర్గయా తయా | దత్తం స్వరాజ్యం దేవేభ్యో వరం చ యదభీప్సితం || 34

కల్పాంతరే పూజితా సా చ సురథేన మహాత్మనా | రాజ్ఞా చ మేద శిష్యేణ మృన్మయ్యాం చ సరిత్తటే || 35

మేషాదిభిశ్చ మహిషైః కృష్ణసారైశ్చ మండకైః | ఛాగైరిక్షు సుకూష్మాండైః పక్షిభిర్బలిభిర్మునే || 36

వేదోక్తాంశ్చైవ దత్వైవముపచారాంశ్చ షోడశ | ధ్యాత్వా చ కవచం ధృత్వా సంపూజ్య చ విధానతః || 37

రాజా కృత్వా పరీహారం వరం ప్రాప యథేప్సితం |

ఆదేవిని తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసవనమున సృష్టిని ప్రారంభించు సమయమున పూజించెను. ఆ తరువాత ముధుకైటభులనే రాక్షసులకు భయపడిన బ్రహ్మదేవుడామె పూజను చేసెను.

ఆ తరువాత త్రిపురాసుర సంహార కాలమున మహేశ్వరుడామెను పూజించెను. తరువాత దుర్వాసమహర్షి శాపమునకు గురియైనందువలన రాజ్యలక్ష్మిని పోగొట్టుకొన్న మహేంద్రుడామెను. పూజించెను. అటుపిమ్మట మునీంద్రులు సిద్ధేంద్రులు దేవతలు మొదలగు వారందరు ఆ దేవిని పూజింపసాగిరి.

ఆదేవి సమస్త ప్రాణులయొక్క తేజస్సుగా ఆవిర్భవించినందువలన సమస్తదేవతలాదేవికి తమ తమ అస్త్రములను ఆభరణములిచ్చిరి. ఆ దేవతలయొక్క ప్రార్థనపై ఆ దేవి దుర్గాది రాక్షసులను సంహరించి వారి రాజ్యములను దేవతలకిచ్చివేసెను. అట్లే ఆ దేవతలయొక్క అభీష్టములను నెరవేర్చినది.

ఇంకొక కల్పమున మేధమహర్షి శిష్యుడైన సురథుడను రాజు నదీతీరమున మృణ్మ యమమైన దుర్గాదేవి యొక్క మూర్తిని నిర్మించి వేదోక్తములైన షోడశోపచారములతో ఆ దేవిని పూజించి ధ్యానించి కవచాదికములను శాస్త్రపద్ధతిలో ధరించెను. అటపిమ్మట పరిహారము అను స్తోత్రమును చేసి ఆ దేవతవలన అభీప్సితమును పొందెను.

ముక్తిం సంప్రాప వైశ్యశ్చ సంపూజ్య చ సరిత్తటే || 38

తుష్టావ రాజా వైశ్యశ్చ సాశ్రునేత్రః కృతాంజలి ః | ససర్జ మృణ్మయీం తాం నై గభీరే నిర్మలే జలే || 39

మృణ్మయీం తామదృష్ట్వా చ జల ధౌతాం నరాధిపః | రురోద చ తదా వైశ్యస్తతః స్థానాంతరం య¸° || 40

త్యక్త్వా దేహం చ వైశ్యస్తు పుష్కరే దుష్కరం తపః || 41

కృత్వా జగామ గోలోకం దుర్గాదేవీ వరేణ సః | రాజాయ¸° స్వరాజ్యం చ పూజ్యోనిష్కంటకం బలీ || 42

భోగం చ బుభ##జే భూపః షష్టివర్ష సహస్రకం | భార్యాం స్వరాజ్యం సన్యస్య పుత్రే వై కాలయోగతః || 43

మనుర్బభూవ సావర్ణిస్తప్త్వా వై పుష్కరే తపః |

సమాధియను ఒక వైశ్యుడు నదీతీరమున మృణ్యయమైన దుర్గామూర్తిని నిర్మించి పూజించి మోక్షమును పొందెను. ఆ వైశ్యుడు, రాజగు సురథుడు కలసి చేతులు జోడించుకొని కండ్లలోనుండి అశ్రువులు రాలగా నిర్మలమైన నీటిలో మృణ్మయమైన దేవీమూర్తిని వదలిపెట్టిరి. అప్పుడా దేవతామూర్తి తిరిగి కన్పించక పోవటచే వైశ్యుడు ఏడ్చుచు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి ఆ దేవినిగూర్చి దుష్కరమైన తపస్సు చేసెను. అప్పుడా దేవియొక్క అనుగ్రహము వలన అతడు గోలోకమును చేరుకొనెను.

సురథుడు తన రాజ్యమునకు వెళ్ళి అరవై వేల సంవత్సరములు రాజ్యసుఖముననుభవించి తన రాజ్యమును, తన భార్యను తన పుత్రుని అధీనముననుంచి పుష్కరక్షేత్రమును తపమాచరించి సావర్ణి మనువయ్యెను.

ఇత్యేవం కథితం వత్స సమాసేన యథాగమం || 44

దుర్గాఖ్యానం మునిశ్రేష్ఠ కిం భూయః శ్రోతుమర్హసి || 45

నారదా! నీకు దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమును ఆగమశాస్త్రములననుసరించి సంక్షేపముగా చెప్పితిని నారాయణముని అనెను.

ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే దుర్గాదినామ వ్యుత్పత్తి కథనం నామ సప్త పంచాశత్తమోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములోని ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదసమయమున తెల్పబడిన దుర్గోపాఖ్యానమున దుర్గాది నామముల వ్యుత్పత్తిని తెల్పు

యాభై ఏడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters