sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏకోన పంచాశత్తమోzధ్యాయః - రాధాదేవిని సుధాముడు శపించుట

ryLRi*»R½Vùªy¿RÁ c FyLRi*¼½ BÈýÁ®ƒsƒ«sVc

కథం సుదామ శాపం చ సా దేవీ చ లలాభ హ | కథం శశాప భృత్యో హి స్వాభీష్టాం దేవకామినీం || 1

మహానుభావా! సుదాముడు రాధాదేవికి భృత్యుడుకదా ! అతడు తనకభీష్టదేవత, తన దేవునకు భార్యయగు రాధాదేవికి శాపమెందుకు ఇచ్చెను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు మహదేవుడు పార్వతితో ఇట్లనెను.-

శ్రుణు దేవి ప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతం | గోప్యం సర్వపురాణషు శుభదం భక్తిముక్తిదం || 2

ఏకదారాధికేశశ్చ గోలోకే రాసమండలే | శతశృంగాఖ్య గిర్యేకదేశే బృఃదావనే వనే || 3

గృహీత్వా విరజాం గోపీం సుభాగ్యాం రాధికా సమాం| క్రీడాం చకార భగవాన్రత్న భూషణ భూషితః || 4

రత్నప్రదీప సంయుక్తే రత్ననిర్మాణమండలే | అమూల్య రత్నఖచిత మంచకే పుష్పతల్పకే|| 5

కస్తూరీ కుంకుమారక్తే సుచందనసుధూపితే | సుగంధి మాలతీ మాలా సమూహ పరిమండితే || 6

సురతాద్విరతిర్నాస్తి దంపతీ రతిపడితౌ| తౌ ద్వౌ పరస్పరాక్తౌ చ సుఖంసంభోగ తంత్రితౌ || 7

మన్వంతరాణాం లక్షశ్చ కాలః పరిమితో గతః | గోలోకస్య స్వల్పకాలే జన్మాధిరహితస్య చ || 8

ఓ పార్వతీదేవి ! రహస్యమైనది, సమస్తపురాణములందు రహస్యముగానున్నది, శుభమును, భక్తిని, ముక్తిని కలిగించు పరమాద్భుతమైన రాధాదేవి కథను వినుము.

ఒకప్పుడు రాధాపతియగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలమున శతశృంగ పర్వతమున నున్న బృందావనమున ''విరజ'' అను గోపకన్యను వెంటపెట్టుకొని ఆమెతో క్రీడింపసాగెను. వారు పడుకొన్న మంచము అమూల్యములైన రత్నములతో నున్నది. దానికి సమీపముననున్న దీపములు రత్నములచే నిర్మితమైనవి. వారు పడుకొన్న పుష్పతల్పము కస్తూరీ కుంకుమ, మంచి చందనములతో సువాసితమై ఉన్నది. ఆ మంచముచుట్టు సువాసనగల మాలతీ పుష్పమాలలు కట్టుబడినవి.

రతిపండితులైన వారి రతిక్రీడ లక్షమన్వంతరములవరకు సాగినది. ఆ సమయము జన్మమరణములు లేని గోలోకమున స్వల్పకాలమే. ఆయినను వారిద్దరు సుఖసంభోగమును మునిగియుండిరి.

దూత్యశ్చతస్రో జ్ఞాత్వాథ జగదుస్తాంతు రాధికాం | శ్రుత్వా పరమరుష్టా సా తత్యాజ హరిమీశ్వరీ || 9

ప్రబోధితా చ సఖిభిః కోపరక్తాస్యలోచనా | విహాయ రత్నాలంకారం వహ్నిశుద్దాంశుకే శుభే || 10

క్రీడా పద్మం చ సద్రత్నాముజ్వలం దర్పణముజ్వలం | నిర్మార్జయామాస సతీ సిందూరం చిత్రపత్రకం || 11

ప్రక్షాళ్య తోయాంజలిభిర్ముఖ రాగమలక్తకం | విస్రస్త కబరీభారా ముక్తకేశీ ప్రకంపితా || 12

శుక్ల వస్త్రపరీధానా రూక్షా వేషాదివర్జితా | య¸° యానాంతికం తూర్ణం ప్రియాళీభిర్నివారితా || 13

అజుహావ సఖీసంఘం రోషనిస్ఫురితాధరా | శశ్వత్కంపాన్వితాంగీ సా గోపిభీః పరివారితా || 14

రాధాదేవియొక్క చెలికత్తెలు విరజా శ్రీకృష్ణులు సమాగతులైన విషయమును రాధాదేవికి తెలియజేసిరి. అందువలన రాధాదేవి కోపముతో ఎరుపెక్కిన ముఖముతో రత్నాలంకారములను బంగారువన్నెగల వస్త్రములను క్రీడాపద్మమును, రత్ననిర్మితమైన అద్దమును, సిందూరమును, చెక్కిలిపై చేసికొన్న మకరిపకా పత్రములను తొలగించి నీటితో ముఖమును, పెదవులకున్న లత్తుకను కడుగుకొని కొప్పును విప్పుకొని , తెల్లని వస్త్రములు ధరించి రథము దగ్గరకు పోయెను.

అట్లే ఆమె కోపముతో వణకిపోవుచు తన చెలికత్తెలను, గోపికాస్త్రీలను పిలుచుకొని పోయినది.

తాభిర్భక్త్యాయుతాభివ్చ కాతరాభిశ్చ సంస్తుతా | ఆరురోహ రథం దివ్యమమూల్యం రత్ననిర్మితం ||

దశయోజన విస్తీర్ణం దైర్ఘ్యే తచ్ఛతయోజనం || 15

సహస్రక చక్రయుక్తం చ నానాచిత్రసమన్వితం | నానావిచిత్రవసనైః సూక్ష్మైః క్షోమైర్విరాజితం || 16

అమూల్యరత్న నిర్మాణ దర్పణౖః పరిశోభితం | మణీంద్రజాల మాలాభైః పుష్పమాలా సహస్రకైః 17

సద్రత్న కలశైర్యుక్తం రమ్యైః మందిర కోటిభిః | త్రిలక్ష కోటిభిః సార్థం గోపీభిశ్చ ప్రియాళిభిః || 18

రాధాదేవి తనవెంట రమ్మని తనచెలికత్తెలను అనుచరులను ఆజ్ఞాపించగానే వారిలో కొందరు భక్తితో ఆమె వెంటరాగా వారిని వెంటబెట్టుకొని ఆమె తన రథమునెక్కెను.

రాధాదేవియొక్క రథము దివ్యమైనది, రత్నములతో నిర్మింపబడినది. అది చాలా విశాలమైనది. ఆరథమున అనేక చిత్రములున్నవి. అది చిత్ర విచిత్రములైన గుడ్డలోతనూ, మిక్కిలి పలుచనైన పట్టువస్త్రములతో (పరదాలు) అలంకరించబడినది. అందు అమూల్యమైన రత్నదర్పణములు అమర్చబడినవి. మణులు పుష్పములు మాలలుగా అలంకరింపబడినవి. అమూల్యమైన రత్నకలశములు ఆ రథమున కమర్పబడినవి.

అట్టి రథమునెక్కి తన చెలికత్తెలు, అనుచరులు వెంటరాగా కృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను.

య¸° రతేన తేనైవ సుమనోమాలినా ప్రియే | శ్రుత్వా కోలాహలం గోపః సుదామా కృస్ణపార్షదః || 19

కృష్నం కృత్వా సావధానం గోపైస్సార్థం పలాయితః | భ##యేన కృష్ణః సంత్రస్తో విహాయ విరజాం సతీం || 20

స్వప్రేమమగ్నః కీష్ణోపి తిరోధానం చకార సః | సా సతీ సమయం జ్ఞాత్వా విచార్య స్వహృది కృధా || 21

రాధాప్రకోపభీతా చ ప్రాణాంస్తత్యాజ తక్షణం | విరజాళిగణాస్తత్ర భయవిహ్వల కాతరాః || 22

ప్రయయుః శరణం సాధ్వీం నిరజాం తక్షణంభియా - గోలోకే సా పరిద్రూపా జాతా వై శైలకన్యకే || 23

కోటియోజన విస్తీర్ణా దీర్ఘే శతగుణా తథా | గోలోకాం వేష్టయామాస పరిఖేవ మనోహరా || 24

బభూవుః క్షుద్రనద్యశ్చ తదాన్యా గోప్య ఏవ చ | సర్వా నద్యస్తదంశాశ్చ ప్రతివిశ్వేషు సుందరి || 25

ఇమే సప్త సముద్రాశ్చ విరజానందనా భువి |

రాధాదేవి ఉమనోమాలికయను తన రథమునెక్కి శ్రీకృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను రాధాదేవి చెలికత్తెల కోలాహలమును దూరమునుండే గమనించిన సుదాముడను శ్రీకృష్ణుని అనుచరుడు శ్రీకృష్ణుని హెచ్చరించి తన తోటి గోపకులతో ఆ ప్రదేశమునుండి పరుగెత్తుకొని పోయెను.

శ్రీకృష్ణుడు కూడా రాధాదేవి వచ్చుచున్నదనగానే భయపడి విరజాదేవి ప్రేమలో మగ్నుడైనని వెంటనే ఆమెను వదిలిపెట్టి అంతర్ధానమునొందెను.

విరజాదేవి అప్పటి పరిస్థితిని గమనించి మనస్సులో చేయవలసిన విషయమును చక్కగా ఆలోచించి రాధాదేవి యొక్క కోపమునకు భయపడి గోలోకమున ఆ లోకమునంతయు చుట్టిముట్టియున్న ఆగడ్తవలె నదీరూపమలో చెందినది. విరజాదేవి స్నేహితురాండ్రు సైతము భయముతో విరజాదేవియొక్క చెలికత్తెలైన గోపికలే. అట్లే ఈ భూమిపైనున్న సప్త సముద్రములు విరజాదేవియొక్క సంతానమే. ద్వితీయ ఖండము - 49వ అధ్యాయము.

అథాగత్య మహాభాగా రాధారాసేశ్వరీ పరా || 26

న దృష్ట్యా విరజాం కృష్ణం స్వగృహం చ పునర్య¸° | జగామ కృష్ణస్తాం రాధాం గోపాలైరష్టభిః సహ || 27

గోపీభిః ద్వారియుక్తాభిః వారితోపి పునః పునః | దృష్ట్యా కృష్ణం చ సా దేవీ భర్త్సయామాస తం తదా || 28

సుదామా భర్త్సయామాస తాం తథా కృష్ణసన్నిథౌ | కృద్ధా శశాప సా దేవీ సుదామానం సురేశ్వరీ || 29

గచ్ఛ త్వమాసురీం యోనీం గచ్ఛ దూరమవుతోద్రుతం | శశాప తాం సుదామా చ త్వమితో గచ్చ భారతం || 30

భవ గోపీ గోపకన్యాముఖ్యాభి స్వాభిరేవచ | తత్ర తే కృష్ణవిచ్ఛేదో భవిష్యతి శతం సమాః || 31

తత్ర భారావతరణం భగవాంశ్చ కరిష్యతి | ఇతి శప్త్యా సుదామాzసౌ ప్రణమ్య జననీం హరిం ||

సాశ్రునేత్రో మోహయుక్తస్తతో గంతుం సముధ్యతః

రాసేశ్వరియగు రాధాదేవి అచ్చటకు వచ్చి విరజనుగాని శ్రీకృష్ణునిగాని కనుగొనక తిరిగి తన ఇంటికి పోయెను. అప్పుడు శ్రీకృష్ణుడు తన సహచరులైన ఎనమండుగురు. గోపాలకుతో రాధాదేవి మందిరమునకు వెళ్ళెను, అచ్చట ద్వారముననున్న ద్వారపాలికలు శ్రీకృష్ణుని వెళ్ళవద్దని నివారంచినను వారిమాటలు పట్టించుకొనక తన అనుచరులతో రాధాదేవి మదిరమునకు అతడు పోయెను.

రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే కోపముతో అతనిని నిందింపసాగినది. రాధాదేవియొక్క మాటలు వినలేక శ్రీకృష్ణుని అనుచరుడైన సుదాముడు రాధాదేవిని శ్రీకృష్ణుని సమీపముననే నిందింపసాగెను. అందువలన రాధాదేవి కోపముతో నీవు రాక్షసుడవై భూలోకమున జన్మింతువని, ఇచ్చటినుండి వెంటనే వెళ్ళిపొమ్మని సుదాముని శపించెను.

సుదాముడు సహితము కోపముతో నీవు చెలికత్తెలతో భూలోకమందలి భరతఖండమునకు వెళ్ళుమని, అచ్చట నీకు శ్రీకృష్ణునితో వంద సంవత్సరములవరకు వియోగము ప్రాప్తించుని, శ్రీకృష్ణుడుకూడ భూలోకమున జన్మించి భూమియొక్క భారమును తగ్గించునని శపించెను.

తరువాత సుదాముడు పశ్చాత్తాపముతో తల్లియగు రాధాదేవిని, తండ్రియగు శ్రీకృష్ణుని నమస్కరించి మోహమువలన ఏడ్చుచు గోలోకమునుండి భూలోకమునకు పోవుచుండెను.

రాధా జగామ తత్పశ్చాత్‌ సాశ్రునేత్రాZతివిహ్వలా | వత్స క్వ యాసీత్యుచ్చార్య పుత్రవిచ్ఛేదకాతరా || 33

కృష్ణస్తాం బోధయామాస విద్యయా చ కృపానిధిః | శీఘ్రం సంప్రాప్స్యసి సుతం మా రుదస్త్యం వరాననే || 34

స చాసురః శంఖచూడో బభూవ తులసీపతిః | మచ్ఛూల భిన్నకాయేన గోలోకం వై జగామ సః || 35

రాధాదేవి సుదామునివెంట ఏడ్చుచు, పుత్రవియోగమును సహింపలేక వత్స! నీవెక్కడికి పోవుచున్నావని అనుచు పోయెను. అప్పుడు దయా సముద్రుడగు శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి రాధాదేవి! నీవేడ్వకుము. నీ పుత్రుని నీవు తొందరగా తిరిగి పొందగలవు అని చెప్పెను.

ఆ సుదాముడే శంఖచూడుడను రాక్షస రాజుగా జన్మించి తులసీదేవిని వివాహమాడి నా శూలముయొక్క దెబ్బచే ప్రాణములను కోల్పోయి గోలోకమునకు తిరిగి వెళ్ళెను.

రాధా జగామ వారాహే గోకులంభారతం సతీ | వృషభానోశ్చ వైశ్యస్య సాచ కన్యా బభూవ హ || 36

అయోని సంభవా దేవీ వాయుగర్భా కళావతీ | సుషువే మాయయా వాయుం సా తత్రావిర్భభూవ హ || 37

అతీతే ద్వాదశాబ్దే తు దృష్ట్వా తాం నవ¸°వనాం | సార్ధం రాయాణ వైశ్యేన తత్సంబంధం చకార సః || 38

ఛాయాం సంస్థాప్య తద్గేహే సాzతంర్ధానమవాప హ | బభూవ తస్య వైశ్యస్య వివాహః ఛాయయా సహ || 39

వరాహ కల్పమున రాధాదేవి భారతఖండముననున్న గోకులమునకు వచ్చినది. ఆమె అచ్చట వృషభాను అను వైశ్యునకు పుత్రికగా జన్మించెను. అయోనిజయైన ఆ దేవి వృషభానువుయొక్క భార్యయగు కళావతి కి వాయురూపమున జన్మించినది. ఆ దేవికి పన్నెండు సంవత్సరముల వయసు రాగానే వృషభానుడామెను రాయాణుడను వైశ్యపుత్రునకిచ్చి వివాహము చేసెను.

రాధాదేవి వృషభానునింటిలో తన ఛాయనుఉంచి అదృశ్యమైనందువలన రాయాణుడా ఛాయనే వివాహమాడెను.

గతే చతుర్ధశాబ్దేతు కంస భీతిచ్ఛలేన చ | జగామ గోకులం కృష్ణః శిశురూపే జగత్పతిః || 40

కృష్ణమాతా యశోదా యా రాయణస్తత్సహోదరః | గోలోకే గోప కృష్ణాంశః సంబంధాత్‌ కృష్ణమాతులః || 41

కృష్ణేన సహ రాధాయాః పుణ్య బృందావనే వనే | వివాహం కారయామాస విధినా జగతాం విధిః || 42

స్వప్నే రాధాపదాంభోజం నహి పశ్యంతి బల్లవాః | స్వయం రాధా హరేః క్రోడే ఛాయా రాయాణమందిరే || 43

షష్టివర్ష సహస్రాణి తపస్తేపే పురావిధిః | రాధికా చరణాంభోజదర్శనార్ధీ చ పుష్కరే || 44

భారవతరణభ్భూమేః భారతేనెందగోకులే | దదర్శ తత్పదాంభోజం తపసస్తత్ఫలేన చ || 45

రాధాదేవికి పదునాలుగు సంవత్సరములు గడవగా శ్రీకృష్ణుడు కంసభయమను వ్యాజముతో గోకులమునకు విచ్చేసెను. కృష్ణునకు యశోద తల్లి కాగా రాయాణుడు ఆమెకు గోకులమున సోదరుడుగానుండెను. రాయాణుడు గోలోకమున శ్రీకృష్ణాంశ కల గోపుడు కాగా భూలోకమున యశోదా సంబంధము వలన శ్రీకృష్ణునకు మేనమామ యయ్యెను.

గోపకులు స్వప్నమున సైతము రాధాదేవి పాదపద్మములను దర్శించుకొనలేరు. బ్రాహ్మదేవుడు అరవై వేల సంవత్సరములు ఆ దేవి పదపద్మముల చూడవలెనని తపస్సు చేసెను. అతని తపః ఫలితముగా శ్రీకృష్ణుడు భూభారమును పాపుటకై భూమిపై అవతరించినప్పుడు రాధాదేవియొక్క పాదపద్మములను చూడగల్గెను.

రాధాదేవి రాయణుని దగ్గర ఛాయారూపిగా శ్రీకృష్ణుని వక్షస్ధలమున స్వయముగా నుండినది.

కించిత్కాలం స వై కృష్ణః పుణ్య బృందావనే వనే | రేమే గోలోకనాథశ్ఛ రాధయా సహ భారతే || 46

తతః సుదామ శాపేన విచ్చేదశ్ఛ బభూవ హ | తత్ర భారావతరణం భూమేః కృష్ణశ్ఛకార సః || 47

శతాబ్దే సమతీతే తు తీర్థయాత్రా ప్రసంగతః | దదర్శ కృష్ణం సా రాధా సచ తాం చ పరస్పరం || 48

తతో జగామ గోలోకం రాధయా సహతత్వవిత్‌ | కళావతీ యశోదా చ పర్యగాద్రాధయా సహ || 49

వృషభానుశ్చ నందశ్చ య¸° గోలోకముత్తమం | సర్వే గోపాశ్చ గోప్యశ్చ యయుస్తాః యాః సమాగతాః || 50

ఛాయా గోపాశ్చ గోప్యశ్చ ప్రాపుర్ముక్తిం చ సన్నిధౌ | రేమిరే తాశ్చ తత్రైవ సార్థం కృష్ణేన పార్వతి || 51

గోలోకనాథుడగు శ్రీకృష్ణుడు భారతఖండమందలి బృందావనమున రాధాదేవితో కొంతకాలము గడిపెను. కాని సుదామునియొక్క శాపముననుసరించి తరువాత వీరిద్దరిమధ్య వియోగము కల్గినది.

శ్రీకృష్ణుడు భూమియొక్క భారమును తగ్గించునపుడు నూరుసంత్సరములు గడచిన తరువాత అతడు తీర్థయాత్రలు చేయుచున్నప్పుడు రాధాదేవి శ్రీకృష్ణులు పరస్పరము చూచుకొనిరి.

తరువాత శ్రీకృష్ణుడు రాధాదేవితో కలసి గోలోకమునకు వెళ్ళెను. కళావతి, యశోదలిద్దరు రాధాదేవితో గోలోకమును చేరిరి. అట్లే వృషభానుడు, నందుడు గోలోకమునకు వెళ్ళిరి. వారివెంట గోపికలు గోపాలురందరు గోలోకమును చేరుకొనిరి.

ఆ గోలోకమున గోపాలురు గోపికలందరు కృష్ణునితో కలిసి రమించసాగిరి.

షట్‌ త్రింశత్‌ లక్ష కోట్యశ్చ గోప్యోగోపాశ్చ తత్సమాః | గోలోకం ప్రయయుర్ముక్తాః సార్థం కృష్ణేన రాధయా || 52

ద్రోణః ప్రజాతపిర్నందో యశోదా తత్ర్పియా ధరా | సంప్రాప పూర్వతపసా పరమాత్మనమీశ్వరం || 53

వసుదేవః కశ్యపశ్చ దేవకీ చాదితిః సతీ | దేవమాతా దేవపితా ప్రతికల్పే స్వభావతః || 54

పితౄణాం మానసీకన్యా రాధామాతా కళావతీ | వసుదామాపి గోలోకాత్‌ వృషభానుః సమా య¸° || 55

శ్రీకృష్ణునితో, రాధాదేవితో సమానులైన ముపై#్ఫఆరు లక్షలకోట్ల గోపకులు , గోపికాస్త్రీలు, రాధాశ్రీకృష్ణులతో కలసి గోలోకమునకు వెళ్ళిరి.

నందుడు ద్రోణుడును ప్రజాపతి, నందుని భార్యయగు యశోద భూదేవి, వీరు తాము పూర్వము చేసికొన్న తపస్సువలన శ్రీకృష్ణ పరమాత్మను పుత్రుని పొందిరి. అట్లే వసుదేవుడు కశ్యప ప్రజాపతి కాగా దేవకీదేవి అదితీదేవి. వీరిద్దరు ప్రతికల్పమున పరమాత్మకు తలిదండ్రులుగా ఉందురు. భూలోకమున రాధాదేవికి తల్లియైన కళావతి పూర్వము పితృదేవతలయొక్క మానసీకన్య. ఇక గోలోకముననున్న వసుదాముడను గోపుడు భూలోకమున వృషభానుడయ్యెను.

ఇత్యేవం కథితం దుర్గే రాధికాఖ్యాన ముత్తమం | సంపత్కరం పాపహరం పుత్రపౌత్రవివర్దనం || 56

శ్రీకృష్ణశ్చ ద్విధారుపో ద్విభుజశ్చ చతుర్భుజః | చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయం || 57

చతుర్భుజస్య పత్నీ చ మహాలక్ష్మీః సరస్వతీ | గంగా చ తులసీ చైవ దేవ్యో నారాయణ ప్రియాః || 58

శ్రీకృష్ణపత్నీ సారాధా తదర్దాంగ సముద్భవా | తేజసా వయాసా సాధ్వీ రూపేణ చ గుణన చ || 59

ఆదౌ రాధాం సముచ్చార్య పశ్చాత్‌ కృష్ణం వదేత్‌ బుధః | వ్యతిక్రమే బ్రహ్మహత్యాం లభ##తే నాత్ర సంశయః || 60

ఓ పార్వతీ! ఈ విధముగా నీకు సంపదలను కలిగించునది పాపముల నశింపజేయునది సంతతిని పెంచునదియగు రాధికా ఉపాఖ్యానమును తెలిపితిని.

శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడుగా, చతుర్భుజుడుగా రెండురూపాలతో నున్నాడు. ద్విభుజడు శ్రీకృష్ణపరమాత్మయే, అతడు గోలోకముననుండును. ఇత చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండును.

చతుర్భుజుడగు శ్రీహరికి మహాలక్ష్మి, సరస్వతి , గంగ, తులసి అను నలుగురు భార్యలు, శ్రీకృష్ణుని వామపార్శ్వమునుండి ఆవిర్భవించినది తేజస్సున, యశస్సు, గుణమున, రూపమున అతనితో సమానురాలైన రాధాదేవి మాత్రమే.

విజ్ఞుడు తొలుత రాధాదేవి నామమునుచ్చరించి శ్రీకృష్ణనామమును ఉచ్చరింపవలెను. అట్లుకాక తొలుత శ్రీకృష్ణనామమునుచ్చరించి రాధాదేవి పేరునుచ్చరించినచో బ్రహ్మహత్యాపాము లభించును.

కార్తికా పూర్ణిమాయాం చ గోలోకే రాసమండలే | చకార పూజాం రాధాయాస్తత్సంబంధి మహోత్సవం || 61

సద్రత్నఘటికాయాశ్చ కృత్వా తత్కవచం హరిః | దధార కంఠే బాహౌ చ దక్షిణ సహ గోపకైః || 62

కృత్వా ధ్యానం చ భక్త్యా చ స్తోత్రమేతచ్చకార సః | రాధాచర్విత తాంబూలం చఖాద మధుసూదనః || 63

రాధా పూజ్యా చ కృష్ణస్య తత్రూజ్యో భగవాన్‌ ప్రభుః | పరస్పరాభీష్టదేవే భేదకృన్నరకం వ్రజేత్‌ || 64

ద్వితీయేపూజితా సా చ ధర్మేణ బ్రహ్మణా మయా | అనంత వాసుకిభ్యాం చ రవిణా శశినా పరా || 65

మహేంద్రేణ చ రుద్రైశ్చ మనునా మానవేన చ | సురేంద్రైశ్చ మునీంద్రైశ్చ సర్వవిశ్వైశ్చ పూజితా || 66

తృతీయే పూజితా సా చ సప్తద్వీపేశ్వరేణ చ | భారతే చ సుయజ్ఞేన పుత్రైర్మిత్రైర్ముదాన్వితైః || 67

బ్రహ్మణనాభిశ##ప్తేన దైవదోషేణ భూభృతా | వ్యాధిగ్రస్తేన హస్తేన దుఃఖినా చ విదూయతా || 68

సంప్రాప్య రాజ్యం భ్రష్టశ్రీః స చ రాధావరేణ చ | స్త్రోత్రేణ బ్రహ్మదత్తేన స్తుత్వా చ పరమేశ్వరీం || 69

అభేద్యం కవచం తస్యా: కంఠేబాహౌ దధార స: | ధ్యాత్వా చకార పూజాం చ పుష్కరే శతవత్సరాన్‌ || 70

అంతే జగామ గోలోకం రత్నయానేన భూమిపః |

శ్రీకృష్ణుడు గోలోకమునందలి రాసమండలమున ఒకనాటి కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని పూజించి దానిని మహోత్సవముగా జరిపించెను. రాధాదేవి కవచమును రత్నగుళికలోనుంచి దానిని తన కంఠమున, కుడిభుజమున తాను స్వయముగా ధరించుటమాత్రమే కాక అనుచరులగు గోపకులు కూడ ధరించునట్లు చేసెను. రాధాదేవిని ధ్యానించి ఆమె స్తోత్రమును తాను పఠించెను.

రాధాదేవియన్న శ్రీకృష్ణునకు ఎనలేని గౌరవము కలదు. అట్లే శ్రీకృష్ణునిపై రాధాదేవికి అమితమైన గౌరవము కలదు. ఒకరికొకరు ఇష్టదేవతలు. ఇట్టి రాధాకృష్ణులమధ్య భేదభావమునెరుపువాడు నరకమునకు పోవును.

రాధాదేవిని మొదలు శ్రీకృష్ణపరమాత్మయే పూజించగా తరువాత నేను, బ్రహ్మదేవుడు , ధర్మదేవత, అనంతుడు, వాసుకి, చంద్రసూర్యులు, మహేంద్రుడు, రుద్రులు, మనువు, మానవులు, దేవతలు, మునీంద్రులు ఈవిధముగా అందరు పూజించిరి. ఆ తర్వాత భాతఖండమున సప్తద్వీపములకు ప్రభువైన సుయజ్ఞడు పుత్రులతో, మిత్రులతో కలసి ఆ దేవిని పూజించెను. ఆ రాజు దైవమునకు అపచారముచేసి బ్రాహ్మణునిచే శపింపబడెను. అందువలన అతని చేయి వ్యాధిగ్రస్తమైనది. అందువలన అతడు దుఃఖముతో రాజ్యభ్రష్టుడయ్యెను. అప్పుడతనికి బ్రహ్మదేవుడు చెప్పిన స్తోత్రముచే రాధాదేవిని స్తుతించి, రాధావరుడగు శ్రీకృష్ణుని అనుగ్రమువలన తిరిగి రాజ్యమును పొందెను. తరువాత ఆ దేవియొక్క కవచమును కంఠమున, బాహువున కట్టుకొని పుష్కరమ క్షేత్రమున నూరు సంవత్సరములు ఆ దేవిని పూజించెను. చివరికారాజు రత్నవిమానమునెక్కి గోలోకమును చేరుకొనెను.

ఇతి తే కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 71

ఈ విధముగా రాధాదేవిచరిత్రను నీకు చెప్పితిని. పార్వతీ! ఇంకను నీవు వినవలసినదేమైన ఉన్నచో అడుగుము అని అనెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాంతర్గత హరగౌరీసంవాదే రాధోపాఖ్యానే రాధాయాః సుదామశాపాది కథినం నామ ఏకోన పంచాశత్తమోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీ శంకరుల సంవాదమున తెల్పబడిన రాధాదేవి చరిత్రలో సుదామునకు ఇచ్చిని శాపవృత్తాంతము గల

నలభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters