sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

షట్చత్వారింశత్తమోzధ్యాయః - మనసా దేవి పూజ, స్తోత్రాదులు

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను-

పూజా విధానం స్తోత్రం చ శ్రూయతాం మునిపుంగవ | ధ్యానం చ సామవేదోక్తం దేవీ పూజా విధానకం || 1

శ్వేత చంపకవర్ణాభాం రత్నభూషణ భూషితాం | వహ్నిశుద్ధాంశుకాధానం నాగయజ్ఞోపవీతినీం || 2

మహాజ్ఞానయితాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతాం | సిద్ధాధిష్ఠాతృదేవీ చ సిద్ధాం సిద్ధిప్రదాం భ##జే || 3

నారద! సామవేదమున చెప్పబడిన మనసాదేవియొక్క పూజావిధానమును ధ్యానమును, స్తోత్రమును నీవు వినుము.

మనసా దేవి తెల్లని చంపక పుష్పమువంటి రంగుకలది. రత్నాలంకారములు కలది, సర్పమునే యజ్ఞోపవీతముగా ధరించునది, బంగారువన్నె కల వస్త్రములు ధరించునది, గొప్పనైన జ్ఞానము కలది, సిద్ధస్వరూప సిద్ధాదిష్ఠాన దేవత, ఇతరులకు సిద్ధులను కలిగించునది.

అట్టి మనసాదేవిని నేనెల్లప్పుడు సేవింతును.

ఇతిధ్యాత్వా చ తాం దేవీం మూలేనైవ ప్రపూజయేత్‌ | నైవేద్యైః వివధైః దీపైః పుష్ప ధూపానులైపనైః || 4

మూలమంత్రశ్చ వేదోక్తో భక్తానాం వాంఛితప్రదః | మూలకల్పతరుర్నామ సుసిద్ధో ద్వాదశాక్షరః || 5

ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మనసా దేవ్యై స్వాహేతి కీర్తితః | పంచలక్ష జపేనైవ మంద్రసిద్ధిర్భవేత్‌ నృణాం || 6

మంత్రసిద్ధిర్భవేదస్య ససిద్ధో జగతీ తలే | సుధాసమం విషం తస్య ధన్వంతరి సమో భ##వేత్‌ || 7

బ్రహ్మన్నాషాడ సంక్రాంత్యాం గూడాశాఖాసు యత్నతః | ఆవాహ్య దేవీం మాసాంతం పూజయేద్యో హి భక్తితః || 8

మంచమ్యాం మానసాఖ్యాయాం దేవ్యై దద్యాచ్చయోబలిం | ధనవాన్‌ పుత్రవాంశ్చైవ కీర్తిమాన్‌ సభ##వేత్‌ ధ్రువం || 9

పై విధముగా మనసా దేవిని ధ్యానించి మూలమంత్రముతో పుష్పధూపదీప, అనులేపన, నైవేద్యాది షోడశోపచారములను చేయుచు ఆ దేవిని పూజింపవలెను.

మనసా దేవి మూలమంత్రము వేదములందు చెప్పబడినది. అది కల్పవృక్షము వలె భక్తుల కోరికలనన్నిటిని తీర్చును . ఆ మంత్రము పన్నెండు అక్షరములు కలది.

" ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మనసా దేవ్యై స్వాహా "అను ద్వాదశాక్షరమంత్రము మనసా దేవి మూలమంత్రము. దీనిని ఐదు లక్షల పర్యాయములు జపము చేసినచో మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రమసిద్ధి కలిగినవాడే సిద్ధుడు. అతనికి విషము అమృతముతో సమానమగును. అతడు ధన్వంతరివలె సర్పములవలన ఇతరులకు కలిగిన విషమును పొగొట్టును.

నాదర మహర్షీ ! ఆషాడ సంక్రాంతినాడు పత్తిచెట్టునందు మనసా దేవిని ఆవాహనచేసి

ఆ నెల చివరివరకు ఆమెను . పూజించుచుండవలెను. మానస (నాగ ) పంచమినాడు మనసాదేవికి బలినిచ్చినచో ధనవంతుడగును. పుత్రులు కలిగియుండును. కీర్తివంతుడగును.

పూజావిధానం కథితం. తదాఖ్యానం నిశామయ | కథయామి మహాభాగ యచ్ఛ్రుతం ధర్మవక్త్రతః || 10

పురా నాగభయాక్రాంతా బభూవుర్మానసా భువి | యాన్యాన్‌ ఖాదంతి నాగాశ్చ న తే జీవంతి నారద || 11

మంత్రాంశ్చ ససృజే భీతః కస్యపో బ్రహ్మణాzర్థితః| వేదబీజానుసారేణ చోపదేశేన వేధసః || 12

మంత్రాధిష్ఠాతృ దేవీం తాం మనసాం ససృజే తతః | తపసా మనసా తేన మానసా సా బభూవ హ || 13

కుమారీ సా చ సంభూయ చాగమచ్ఛంకరాలయం | భక్త్యా సంపూజ్య కైలాసే తుష్టువే చంద్రశేఖరం || 14

దివ్యం వర్ష సహస్రం చ తం సిషేవే మునేః సుతా | ఆశుతోషో మహేశశ్చ తాం చతుష్టో బభూవహ || 15

మహాజ్ఞానం దదౌ తసై#్య పాఠయామాస సామ చ | కృష్ణమంత్రం కల్పతరుం దదావష్టాక్షరం మునే || 16

నారద మహర్షీ ! ఇంతవరకు నీకు మనసాదేవి యొక్క పూజాపద్ధతిని చెప్పితిని . ఇక ఆ దేవి చరిత్రను వినుము.

పూర్వము మానవులు సర్పములవలన బాధపడసాగిరి. అవి కరచినవారెల్ల చనిపోసాగిరి. అప్పుడ బ్రహ్మదేవుడు వేడుకొనగా కశ్యపమహర్షి సర్పభయమును తొలగించి మంత్రములను సృష్టించెను. అట్లే బ్రహ్మదేవుని ఆజ్ఞపై వెదమునందలి బీజాక్షరములననుసరించి నాగమంత్రములకు అధిష్ఠాన దేవతయగు మానసాదేవిని సృష్టించెను.

కశ్యప ప్రజాపతియొక్క తపోబలమువలన మనస్సంకల్పముతో పుట్టినందువలన ఆమెను మనసాదేవియనిరి. ఆ కన్య పుట్టగనే కైలాసపర్వతమునకేగి శంకరుని భక్తితో పూజించి స్తుతించెను. దివ్యములైన నూరు సంవత్సరములు ఆ మహాదేవుని పూజింపగా అతడు సంతోషించి ఆమెకు మిక్కిలి జ్ఞానమును ప్రసాదించి. సామవేదమును నేర్పెను. అట్లే ఆ దేవికి కల్పతరువువంటి అష్టాక్షరాత్మకమైన కృష్ణమంత్రమునుపదేశించెను.

లక్ష్మీ మాయా కామబీజం జేంతం కృష్ణపదం తథా | ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ (నమః)

త్రైలోక్య మంగళం నామ కవచం పూజనక్రమం || 17

స్తవనం సర్వపూజ్యం చ ధ్యానం భువన పావనం | పురశ్చర్యాక్రమం చాపి వేదోక్తం సర్వసమ్మతం || 18

ప్రాప్య మృత్యుంజయాత్‌ జ్ఞానం పరం మృత్యుంజయం సతీ | జగామ తపసే సాధ్వీ పుష్కరం శంకరాజ్ఞయా || 19

త్రియుగం చ తపస్తప్త్యా కృష్ణస్య పరమాత్మనః | సిద్ధా బభూవ సా దేవీ దదర్శపురతః ప్రభుం || 20

దృష్ట్వా కృశాంగీం బాలం త కృపయా చ కృపాం నిధిః | పూజాం చ కారయామాస చకార చ హరిః స్వయం || 21

వరం చ ప్రరదౌ తసై#్య పూజితా త్వం భ##వే భవ | వరం దత్వా చ కల్యాణ్యౖ సద్యశ్చాంతర్ధధే విభుః || 22

ప్రథమే పూజితా సా చ కృష్ణేన పరమాత్మనా | ద్వితీయే శంకరేణౖవ కశ్యపేన సురేణ చ || 23

మమనా మునినా చైవ హ్యహినా మానవాదినా |బభూవ పూజితా సా చ త్రిషులోకేషు సుశ్రుతా || 24

జరత్కారుమునీంద్రాయ కశ్యపస్తాం దదౌ పురా | అయాచితో మునిశ్రేష్ఠో జగ్రాహ బ్రాహ్మణాజ్ఞయా || 25

లక్ష్మీ బీజమగు "శ్రీం" మాయా బీజమగు "హ్రీం", కామబీజమగు "క్లీం" అనువాటితో చతుర్థీ విభక్త్యంతమైన కృష్ణశబ్దముతో ఉన్నది (నమస్కార పదము అంతమున గలది ) శ్రీకృష్ణమంత్రము.

ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ (నమః) అనునది కృష్ణాష్ణాక్షరీ మంత్రము. ఆ మంత్రముతో పాటు ముల్లోకములకు మేలును కలిగించు శ్రీకృష్ణ కవచమును పూజాక్రమమును, స్తోత్రమును, ధ్యానమును వేదములందు చెప్పబడినది శ్రీకృష్ణమంత్ర పురశ్చరణను శంకరునివల్ల మనసాదేవి పొందినది. అట్లే ఆమెకు పరమశివుడు మృత్యువును జయించు జ్ఞానమును కూడ ప్రసాదించెను.

అటు పిమ్మట మానసాదేవి శంకరుని ఆజ్ఞననుసరించి పుష్కర క్షేత్రమునకు పోయి, అచ్చట శ్రీకృష్ణుని గురించి మూడు యుదములవరకు తపస్సుచేసి మంత్రసిద్ధిని పొంది కృష్ణ పరమాత్మ దర్శనము చేసికొన్నది.

శ్రీకృష్ణుడు తనముందు తపస్సు చేయుచు కృశించిపోయిన అవయవముల కల బాలికయగు మానసాదేవిని చూచి దయాసముద్రుడైన నారాయణుడు తానే స్వయముగా ఆ మానసాదేవిని పూజించెను. తరువాత నీవు భూలోకమున పూజింపబడుదవని ఆమెకు వరమునిచ్చి అంతర్ధానము చెందెను.

ఆ మానసా దేవి తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు పూజించగా. తరువాత శంకరుడు, ఆ తరువాత కశ్యపుడు, దేవతలు, మనువు , మునులు, సర్పములు, మానవులు మొదలగువారందరు పూజించిరి. ఈ విధముగా ఆ దేవి మూడు లోకములందు పూజలు పొందినది.

కశ్యప మహర్షి తన కన్యయగు మానసాదేవిని జరత్కారు మునీంద్రునకు యాచింపక పూర్వనే భార్యగా నివ్వగా ఆ ముని జరత్కారు దేవిని కశ్యప మహర్షి ఆజ్ఞననుసరించి స్వీకరించెను.

కృత్వోద్వాహం మహాయోగీ విశ్రాంతస్తపసా చిరం | సుష్వాప దేవ్యా జఘనే వటమూలే చ పుష్కరే || 26

నిద్రాం జగామ సమునిః స్మృత్వా నిద్రేశమీశ్వరం | జగామాస్తం దినకరః సాయంకాల ఉపస్థితః || 27

సంచిత్య మనసా తత్ర మనసా చ పతివ్రతా | ధర్మ లోపభ##యేనైన చకారాలోచనం సతీ || 28

అకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాం చైవ ద్విజన్మనాం | బ్రహ్మహత్యాదికం పాపం లభిష్యతి పతిర్మమ || 29

నోపతిష్ఠతి యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం | స సర్వదాzశుచిర్నిత్యం బ్రహ్మహత్యాదికం లభేత్‌ || 30

వేదోక్తమితి సంచింత్య బోధయామాస తం మునిం | స చ బుధ్వా మునిశ్రేష్ఠస్తాం చు కోప భృశం కిల || 31

జరత్కారుమహర్షి జరత్కారువును వివాహము చేసికొని చాలా కాలము తపస్సుని వదలివేసి పుష్కర క్షేత్రమున ఒకనాడు తన భార్య ఒడిలో పండుకొనెను. అప్పుడు నిద్రవచ్చుటచే నిద్రకు ఈశ్వరుడైన పరమాత్మను తలచుకొని నిద్రపోయెను.

అప్పుడు సాయంకాలమయ్యెను. ఆసమయమున పతివ్రతయైన మనసాదేవి ఇట్లు ఆలోచించెను. బ్రాహ్మణుడు నిత్యకృత్యమైన సాయం సంద్యను మరువరాదు. ఆవిధముగా చేసిన బ్రహ్మహత్యాపాతకమతనికంటును. ఉదయసంధ్యను సాయంసంధ్యను చేయని ద్విజుడు ఎల్లప్పుడు అశుచికాగలడు. అట్లే అతడు బ్రహ్మహత్యాది పాపములను పొందును. ఇది వేదములలో చెప్పబడినది కావున ధర్మలోపము కలుగువని భయపడి జరత్కారుమునిని నిద్రలేపెను.

జరత్కారుముని లేచి నిద్రాభంగమునకు చాలా కోపగించెను.

జరత్కారురువాచ- జరత్కారుముని ఇట్లు పలికెను-

కథం మే సువ్రతే సాధ్వి నిద్రాభంగః కృతస్త్వయా | వ్యర్థం వ్రతాదికం తస్యా యా భర్తుశ్చాపకారిణీ || 32

పరశ్చానశం చైవ వ్రతం దానాదికం చయత్‌ | భర్తురప్రియకారిణ్యాః సర్వం భవతి నిష్పలం || 33

యయాపతి పూజితశ్చ శ్రీకృష్ణః పూజితస్తయా | పరివ్రతా వ్రతార్థం చ పతిరూపీ జనార్దనః || 34

సర్వదానం సర్వయజ్ఞః సర్వతీర్థ నిషేవణం | సర్వం వ్రతం తపః సర్వం ఉపవాసాదికం చ యత్‌ || 35

సర్వధర్మశ్చ సత్యం చ సర్వదేవప్రపూజనం | తత్సర్వం స్వామిసేవాయాః కలాం నార్హంతి షోడశీం || 36

సుపుణ్య భారతేవర్షే పతిసేవాం కరోతి యా | వైకుంఠం స్వామినాసార్థం సాయాతి బ్రాహ్మణః పదం ||37

విప్రియం కురతే భర్తుః విప్రియం వదతి ప్రియం | అసత్కుల ప్రజాతా యా తత్ఫలం శ్రూయతాం సతి || 38

కుంభీపాకం వ్రజేత్సా చ యావచ్చంద్రదివాకరౌ | తతోభవతి చాండాలీ పతిపుత్ర వివర్జితా || 39

ఇత్యుక్త్యా చ మునిశ్రేష్ఠో బభూవ స్ఫురితాధరః | చ కంపే మనసా సాధ్వీ భ##యేనోవాచ తం పతిం || 40

భర్తను కష్టపెట్టు స్త్రీ చేయు వ్రతములు, తపము, దానము మొదలగునవన్నియు వ్యర్థమగును. భర్తము పూజించినచో శ్రీకృష్ణుని పూజించినట్లగును. పతివ్రతలయొక్క వ్రతములు చక్కగా పూర్తియగుటకు భగవంతుడగు శ్రీహరి పతిరూపమున ఉండును. సమస్తదానములు, సమస్త యజ్ఞములు, సమస్తతీర్థ సేవనము, సమస్త వ్రతములు, సమస్త ఉపవాసములు, సమస్త ధర్మములు, సమస్త దేవతలను పూజించుటలు. ఇవన్నియు భర్తృ శుశ్రూషా ఫలితమున పదహారవ వంతు కాజాలవు.

పవిత్రమాన ఈ భారతవర్షమున భర్తసేవను చక్కగా చేయు స్త్రీ భర్తతో కలసి శ్రీకృష్ణ పరబ్రహ్మను చేరుకోగలదు.

భర్తను కష్టపెట్టు దుష్టస్త్రీ కుంభీపాకనరకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. ఆ తరువాత పుత్రులు లేక భర్త చనిపోయి బాధపడును.

జరత్కారుమహర్షి ఇట్లు కోపముతో పలుకుచుండగా సాధ్వియగు జరత్కారు (మనసాదేవి ) భయపడి ఇట్లు పలికెను.

మనసోవాచ- మనసాదేవి ఇట్లు పలికెను-

సంద్యాలోపభ##యేనైవ నిద్రాభంగః కృతస్తవ | కురుశాంతిం మహాభాగ దుష్టాయా మమ సవ్రత || 41

శృంగాహార నిద్రాణాం యశ్చభంగం కరోతి చ | సవ్రజేత్కాలసూత్రం చ స్వామినశ్చ విశేషతః || 42

ఇత్యుక్త్యా మనసా దేవి స్వామినశ్చరణాంబుజే | పపాత భక్త్యా భీతా చ రురోద చ పునః పునః ||43

చక్కగా వ్రతములను పరిపాలించు ఓ నాథా! నీ యొక్క సంధ్యావందనమునకు లోపము కలుగునని నీకు నిద్రాభంగము కలిగించితిని. దుష్టురాలైన నా ద్వితీయ ఖండము- 46 అధ్యాయముపై శాంతింపుము. శృంగారమునకు, ఆహారమునకు, నిద్రకు భంగము చేయువాడు, ఇంకను భర్తకు సంబంధించిన ఈ విషయములలో భంగము కలిగించు వ్యక్తి కాలసూత్రమనే నరకమునకు పోవును.

మనసా దేవి ఇట్లని తన భర్తయొక్క కాళ్ళపై భక్తితో ఏడ్చుచు పడెను.

కుపితం చ మునిం దృష్ట్యా శ్రీసూర్యం శప్తుముద్యతం | తత్రాజగామ భగవాన్‌ సంధ్యయా సహ నారద || 44

తత్రాగత్య మునిశ్రోష్ఠమవోచద్భాస్కరః స్వయం | వినయేన వినీతశ్చ తయాసహ యథోచితం || 45

జరత్కారుముని మనసాదేవి మాటలు విని ఆమెపై కోపమును వదిలి సూర్యుని శపింపబోయెను. అప్పుడు సూర్యుడు సంద్యాదేవితో కలిసి అచ్చటకు స్వయముగా వచ్చి వినయముతో ఇట్లనెను.

శ్రీ సూర్య ఉవాచ- శ్రీసూర్య భగవానుడిట్లనెను-

సూర్యస్తమయం దృష్ట్యా ధర్మలోపభ##యేన చ | త్వాం బోధయామాస నాహమస్తంగతస్తదా || 46

క్షమస్వ భగవన్‌ బ్రహ్మన్‌ మాం శప్తుం నోచితం మునే | బ్రాహ్మణానాం చ హృదయం నవనీత సమం సదా || 47

తేషాం క్షణార్ధం కోపశ్చ తతోభస్మ భ##వేజ్జగత్‌ | పునః స్రస్టుం ద్విజః శక్తో న తేజస్వీ ద్విజాత్పరః || 48

బ్రహ్మణోవంశసంభూతః ప్రజ్వలన్‌ బ్రహ్మతేజసా | శ్రీకృష్ణం భావయేన్నిత్యం బ్రహ్మజ్యోతిః సనాతనం || 49

సూర్యస్య వచనం శ్రుత్వా ద్విజస్తుష్టోబభూవహ | సూర్యోజగామ స్వస్థానం గృహీత్వా బ్రాహ్మణాశిషం || 50

ఓ మహర్షి! నేను అస్తమించితిని భావించి బ్రాహ్మణధర్మము లోపించునను భయముచే నీ భార్య నిన్ను లేపినది. కాని నిజముగా నేనస్తమింపలేదు. అందువలన ఓమహర్షీ నీవు నన్ను క్షమింపుము, నన్ను శపించుట నీకు తగదు. బ్రాహ్మణుల హృదయము వెన్నవలెనుండును. వారికి కోపము వచ్చినను అరక్షణము మాత్రమే ఉండును. లేనిచో ఈ ప్రపంచమే భస్మమగును. ద్విజుడు ఈ లోకమును భస్మము చేసి తిరిగి సృష్టింపగలడు. అట్టి తేజస్వి ఎవ్వరు కారు. బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుని వంశమున పుట్టి బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు ప్రతిదినము సనాతనుడు పరంజ్యోతియగు శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించును.

సూర్యదేవుని మాటలకు జరత్కారు మహర్షి సంతృప్తి చెందినందువలన సూర్యుడు సంధ్యాదేవితో కలిసి స్వస్థానమునకు వెళ్ళిపోయెను.

తత్యాజ మనసాం విప్రః ప్రతిజ్ఞా పాలనాయ చ | రుదంతీం శోకయుక్తాం చ హృదయేన విదూయతా || 51

సా సస్మార గురం శంభుం ఇష్టదేవం హరిం విధిం | కశ్యపం జన్మదాతారం విపత్తౌ భయకర్శితా || 52

తత్రాజగామ భగవాన్‌ గోపీశః శంభురేవ చ | విధిశ్చ కశ్యపశ్చైవ మనసాం పరిచింతయన్‌ ||53

స చ దృష్ట్యాzభీష్ట దేవం నిర్గుణం ప్రకృతేః పరం | తుష్టావ పరయా భక్త్యా ప్రణనామ ముహూర్ముహుః || 54

నమశ్చకార శంభుం చ బ్రహ్మణం కశ్యపం తథా | కథమాగమనం త్వత్రేత్యేవం ప్రశ్నం చకార సః || 55

బ్రహ్మా తద్వచనం శ్రుత్వా సహనా సమయోచితం | తమువాచ నమస్కృత్య హృషీకేశ పదాంబుజం || 56

యది త్యక్తా ధర్మపత్నీ ధర్మిష్ఠా మనసా సతీ | కురుష్వాస్యాం సుతోత్పత్తిం ధర్మ సంస్థాపనాయ వై || 57

యతిర్వా బ్రహ్మచారీ వా భిక్షుర్వనచరోzపి వా | జాయాయాం చ సుతోత్పత్తిం కృత్వా పశ్చాద్భవేన్మునిః || 58

ఆకృత్వా తు సుతోత్రత్తిం విరాగీ యస్త్యజేత్ప్రియాం | స్రవేత్తపస్తత్పుణ్యం చ చాలిన్యాం చ యథా జలం || 59

జరత్కారు మహర్షి తమ మనస్సు బాధపడుచున్నను తన మాట నిలబెట్టు కొనుటకై దుఃఖముతో ఏడ్చుచున్న తన భార్యయగు మనసాదేవిని వదిలిపెట్టెను.

మనసా దేవి ఈ ఆపత్సమయమున భయపడి తన గురువగు శంకరుని, ఇష్టదేవతయగు శ్రీహరిని, బ్రహ్మదేవుని, తండ్రియగు కశ్యపుని స్మరించుకొనగానే వారందరు మనసాదేవిని గూర్చి చింతించుచు అచ్చటకు వచ్చిరి.

వారిని చూచి జరత్కారుమహర్షీ అందరకు భక్తితో మనస్కరించి ఆగమన కారణమడుగెను. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కరించి సమయోచితముగా ఇట్లు పలికెను.

జరత్కారు మహర్షీ నీవు ధర్మముగా నడుచుచున్న నీ ధర్మపత్నియగు మనసాదేవిని పదలిపెట్ట దవచినచో ధర్మమును రక్షించుటకై ఆమె యందు పుత్రుని కనుము. యతియైనను, బ్రహ్మచారియైనను, భిక్షుకుడైనను, చివరకు వానప్రస్థాశ్రమమునున్నను తన భార్యయందు కొడుకును కన్న తరువాతనే సన్యాసమును స్వీకరింపవలెను.

తన భార్య యందు సంతానమును పొందక వైరాగ్యముతో భార్యను వదలిపెట్టినచో కాలువలోపడిపోవు నీటివలె అతని తపస్సు, పుణ్యము తొలగిపోవును.

బ్రహ్మణో వచనం శ్రుత్వా జరత్కారుర్మునీశ్వరః | చక్రే తన్నాభి సంస్పర్శం యోగాద్వై మంత్రపూర్వకం || 60

తసై#్య శుభాశిషం దత్వా యయుర్దేవాః ముదాన్వితాః | ముదాన్వితా చ మనసా జరత్కారుర్ముదాన్వితః || 61

బ్రహ్మదేవుని మాటలు విని జరత్కారుమహర్షి యోగబలముతో మంత్రములు జపించుచు జరత్కారుదేవియొక్క నాభిని ముట్టుకొనెను. అప్పుడు దేవతలందరు ఆ జరత్కారుదేవికి (మనసాదేవికి) శుభాశీస్సుల నొసగి సంతోషముతో వెళ్ళిపోయిరి. అందువలన మనసాదేవి సంతోషపడెను. జరత్కారు మహర్షి కూడ సంతోషించెను.

మునేః కరస్పర్శమాత్రాత్సద్యోగర్భో బభూవ హ | మనసాయా మునిశ్రేష్ఠ మునిశ్రేష్ఠ ఉవాచ తాం || 62

నారదమునీ జరత్కారు మహర్షి యొక్క చేయి తగులగనే మనసాదేవికి సద్యోగర్భమాయెను. అప్పుడు ఆ ముని ఆమెతో ఇట్లు పలికెను.

జరత్కారురువాచ - జరత్కారు మహర్షి ఇట్లు పలికెను.

గర్భేణానేన మనసే తవపుత్రో భవిష్యతి | జితేంద్రియాణాం ప్రవరో ధర్మిష్ఠో వైష్ణవాగ్రణీః || 63

తేజస్వీ చ తపస్వీ చ యశస్వీ చ గుణాన్వితః | వరో వేదవిదాం చైవ యోగినాం జ్ఞానినాం తథా || 64

స చ పుత్రో విష్ణుభక్తో ధార్మికః కులముద్ధరేత్‌ | నృత్యంతి పితరః సర్వే జన్మమాత్రేణ వై ముదా || 65

పతివ్రతా సుశీలా యా సుప్రియా ప్రియవాదినీ | ధర్మిష్ఠా పుత్రమాతా చ కులజా కులపాలికా || 66

హరిభక్తి ప్రదోబంధుః తదిష్టం యత్సుఖప్రదం | యోబంధచ్ఛిత్స చ పితా హరేర్వర్త్మ ప్రదర్శకః || 67

సాగర్భదారిణీ యాచ గర్భవాసవిమోచినీ | విష్ణుమంత్రప్రదాతా చ సగురుర్విష్ణు భక్తిదః || 68

గురుశ్చ జ్ఞానదాతా చ తత్‌ జ్ఞానం కృష్ణభావనం | ఆబ్రహ్మస్తంబ పర్యంతం యతోవిశ్వం చరాచరం || 69

ఆవిర్భూతం తిరోభూతం కి వా జ్ఞానం తదన్యతః | వేదజం యోగజం యద్యత్తత్సారం హరిసేవనం || 70

తత్వానాం సారభూతం చ హరేరన్యద్విడంబనం | దత్తం జ్ఞానం మయా తుభ్యం సస్వామి జ్ఞానదో హియః || 71

జ్ఞానాత్ప్రముచ్యతే బంధాత్‌ స రిపుర్యో హి బంధదః | విష్ణుభక్తి యుతం జ్ఞానం యోదదాతి సవై గురుః || 72

సరిపుః శిష్యఘాతీ చ యాతో బంధాన్నమోచయేత్‌ | జననీ గర్భాజాత్‌ క్లేశాత్‌ యమతాడనజాత్తథా || 73

న మోచయేద్యః స కథం గురుః తాతో హి భాంధవః | పరమానందరూపం చ కృష్ణమార్గమనశ్వరం || 74

న దర్శయేద్యః స కథం కీదృశో బాంధవో నృణాం | భజ సాధ్వి పరం బ్రహ్మచ్యుతం కృష్ణం చ నిర్గుణం||

నిర్మూలం చ పురాకర్మ భ##వేద్యత్సేవయా ధ్రువం || 75

మయా ఛలేన త్వం త్యక్తా దోషం మే క్షమ్యతాం ప్రియే | క్షమాయుతానాం సాధ్వీ నాం సత్వాత్‌ క్రోధో నవిద్యతే ||76

పుష్కరే తపసే యామి గచ్ఛ దేవి యథాసుఖం | శ్రీకృష్ణచరణాంభోజే ధ్యా నవిచ్ఛేదకాతరః || 77

ధనాదిషుస్త్రియాం ప్రీతిః ప్రవృత్తి పథగామినాం | శ్రీకృష్ణ చరణాంభోజే నిస్పృహాణాం మనోరథాః || 78

ఓ మనసాదేవి !నీకు కలుగబోవు పుత్రుడు జితేంద్రియులలో శ్రేష్ఠుడు, ధర్మిష్ఠుడు, వైష్ణవులలో గొప్పవాడు, తేజస్వీ, యశస్వి, తపస్వి సుగుణములఖని, వేదజ్ఞానముకలవారిలో శ్రేష్ఠుడు కాగలడు. అతడు విష్ణుభక్తుడై పరమధార్మికుడై నీ వంశమును ఉద్ధరించును. ఆ శిశువు పుట్టగనే పితృదేవతలు సంతోషములో నృత్యము చేయుదురు.

ఆ శిశువు యొక్క తల్లివగు నీవు పతివ్రతవు. మంచి శీలముకలదానవు. ప్రియురాలవు, ప్రియముగా మాట్లాడు దానవు. అట్లే నీవు ధర్మమార్గమున నడుచుచున్నదానివి. కులమును రక్షించుదానవు.

హరిభక్తిని కలిగించు వాడే బంధువు. ఆ హరిభక్తి సుఖమును కలిగించునది. అందరకు ఇష్టమైనది. సంసార బంధమును ఛేదించువాడు. హరిభక్తిని కలిగించువాడే తండ్రియగును. గర్భవాసమను దుఃఖమును తొలగించునదే తల్లియగును. విష్ణుభక్తిని కలిగించువాడు శ్రీహరి మంత్రమును ఉపదేశించువాడే గురువు కాగలడు. జ్ఞానమును కల్గించువాడే గురువు. జ్ఞానమనగా శ్రీకృష్ణుని ద్యానముచేయుటయే. బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబమువరకున్న ఈ చరాచర జగత్తు ఆశ్రీకృష్ణుని వలననే పుట్టుచున్నది. నశించుచున్నది. అందువలన ఆ శ్రీకృష్ణునకు సంబంధించిన జ్ఞానము. ఇతరమైనది జ్ఞానము కాజాలదు. శ్రీహరి సేవనమే పరమార్థమైన జ్ఞానము. అది వేదసారమై, యోగసారమైయున్నది. అన్ని తత్వములకు అది సారముగా కన్పించును.

ఇట్టి శ్రీహరి సేవనమనే జ్ఞానమును నీకు ఇచ్చితిని. భర్తయైనవాడు పరమాత్మ జ్ఞానమును కలిగించవలెను. సంసార బంధమును కలిగించివాడు శత్రువు. విష్ణుభక్తిని కలిగించు జ్ఞానమిచ్చువాడే గురువు. అట్లే సంసారబంధమునుండి విముక్తి కలిగించని గురువు శిష్యులకు అపకారముచేసిన వాడగును. అట్లే అతడు శత్రుతుల్యుడగుచున్నాడు. తల్లియొక్క గర్భవాసక్లేశమునుండి, నరకవాసమునుండి తప్పింపనివాడు పరమానందరూపమైనది, శాశ్వతమైనది అగు శ్రీకృష్ణ మార్గమును చూపించనివాడు గురువు కాజాలడు. తండ్రి కాజాలడు ,అట్లే బంధువు కాజాలడు.

అందువలన నీవు, బ్రహ్మ శ్రీహరులకంటె మిన్నయైనవాడు నిర్గుణరూపుడు అగు శ్రీకృష్ణపరమాత్మను సేవింపుము. ఆతనిని సేవించినచో నీ పూర్వకర్మలన్నియు నిర్మూలనమగును.

ఓ ప్రియురాలా ! నేను నిన్ను ఈ వ్యాజముతో వదిలి పెట్టితినే తప్ప నీపై ప్రేమలేకకాదు, అందువలన నీవు నాతప్పును క్షమింపవలెను.

ఓర్పుకల స్త్రీలకు సత్వగుణమున్నందువలన వారికి కోపము సంభవింపదు. నేను పుష్కర క్షేత్రమున తపస్సుచేయుటకై పోవుచున్నాను. ఇచ్చట నున్నచో శ్రీకృష్ణ చరణాంభోజముననున్న నాధ్యానము సడలిపోవచ్చును.

సాధారణముగా ప్రవృత్తి మార్గమున పోవు స్త్రీలకు ధనాదులపై ప్రేమ ఎక్కువగా నుండును. కాని నిస్పృహులైన వారికి శ్రీకృష్ణునిపైననే భక్తియుండగలదు.

జరత్కారు వచః శ్రుత్వా మనసా శోకకాతురా | సా సాశ్రునేత్రా వినయాదువాచ ప్రాణవల్లభం || 79

జరత్కారుమహర్షి మాటలు విని మనసాదేవి దుఃఖముతో కన్నీళ్ళురాలగా వినయముతో అతనితో ఇట్లనెను.

మనసోవాచ- మనసాదేవి ఇట్లు పలికెను.

దోషేణాహం త్వయాత్యక్తా నిద్రాభంగేన తే ప్రభో | యత్ర స్మరామి త్వాం బంధో తత్ర మామాగమిష్యసి || 80

బంధు భేదః క్లేశతమః పుత్రభేదస్తతః పరః | ప్రాణశ భేదః ప్రాణానాం విచ్ఛేదాత్సర్వతః పరః 11 81

పతిః పతివ్రతానాంచ శతపుత్రాధికః ప్రియః | సర్వస్మాచ్చ ప్రియః స్త్రీణాం ప్రియస్తేనోచ్యతే బుధైః || 82

పుత్రే యథైక పుత్రాణాం వైష్ణవానాం యథాహరౌ | నేత్రే యథైక నేత్రాణాం తృషితానాం యథాజలే || 83

క్షుధితానాం యథాన్నేచ కాముకానాం యథా స్త్రియాం | యథా పరస్వే చోరాణాం యథాజారే కుయోషితాం || 84

విదుషాం చ యథా శాస్త్రే వణిజ్యే వణిజాం యథా | తథా శశ్వన్మనః కాంతే సాధ్వీనాం యోషితాం ప్రబో || 85

ఇత్యుక్త్వా మనసా దేవీ పపాత స్వామినః పదే | క్షణం చకార క్రోడే తాం కృపయా చ కృపానిధిః || 86

హే నాథ! నేను నిద్రాభంగము చేసితినన్న దోషముతో నన్ను వదలిపెట్టితివి. అయినను నేను నిన్నెప్పుడు తలచుకొనిన అప్పుడు నీవు తప్పక రావలెను.

బంధువియోగముకన్న పుత్రవియోగము, దానికంటె పతివియోగము ప్రాణములు పోవు దానికంటెను బాధకలిగించును. పతివ్రతలగు స్త్రీలకు భర్త నూరుగురు కొడుకులకంటె ప్రియమైన వాడగుటచే అతనిని ప్రియుడందురు.

ఒకే పుత్రుడు కలవారికి ఆ పుత్రునివలె, విష్ణుభక్తులకు శంకరునివలె, దప్పికగొన్నవారికి నీటివలె, ఆకలిగొన్నవారికి అన్నమువలె, కాముకులకు స్త్రీలవలె , దొంగలకు ఇతరులకు ధనమువలె, విద్వాంసులకు శాస్త్రమువలె, పరమ సాధ్వీమణులకు భర్తపైన ప్రేమయుండును.

ఈ విధముగా అని మనసాదేవి భర్త పాదములపై పడగా దయానిధియగు జరత్కారు మహర్షి ఆమెను క్షణకాలము తన ఒడిలోనికి తీసుకొనెను.

నేత్రోదకేన మనసాం స్నాపయామాస తాం మునిః | సాZశ్రుణా చ మునేః క్రోడం సిషేవే ఖేదకాతరా || 87

తదాజ్ఞానేన తౌ ద్వౌ చ విశోకౌ చ బభూవతుః | స్మారం స్మారం పదాంభోజం కృష్ణస్య పరమాత్మనః || 88

జగామ తపసే విప్రః స కాంతాం సుప్రబోధ్య చ | జగామ మనసా శంభోః కైలాసం మందిరం గురోః || 89

పార్వతీ బోధయామాస మనసాం శోకకర్శితాం | శివశ్చాతీవ బోధేన శివేన చ శివాలయే || 90

జరత్కారుమహర్షి తన భార్యయగు మనసాదేవిని ఒడిలోకి తీసికొని కన్నీరు కార్చెను. మనసాదేవి సైతము భర్తృవియోగమునకు భయపడుచు ఏడ్చుచు భర్త ఒడిలోనికి చేరినది.

కొంతకాలము వారిద్దరు శ్రీకృష్ణపరమాత్మను మాటిమాటికి జ్ఞాపకము చేసికొనుచు శోకమును వదలిపెట్టిరి. జరత్కారుముని భార్యను చక్కగా ఓదార్చి తపస్సుచేసికొనుటకు వెళ్ళెను. మనసా దేవి తన గురువైన శంకరుడుండు కైలాసమునకు వెళ్ళినది. అచ్చట పార్వతీ పరమేశ్వరులిద్దరు భర్తృవియోగదుఃఖముతో కృశించి పోవుచున్న మనసాదేవిని ఊరడించిరి.

సుప్రశ##స్తే దినే సాధ్వీ సుషువే మంగళే క్షణ | నారాయణాంశం పుత్రం చ జ్ఞానినాం యోగినాం గురుం || 91

గర్భస్ఠితో మహాజ్ఞానం శ్రుత్వా సంకరవక్త్రతః | స బభూవ మహాయోగీ యోగినాం జ్ఞానినాం గురుః || 92

జాతకం కారయామాస వాచయామస మంగళం | వేదాంశ్చ పాఠయామాస శివాయ చ శివః శిశోః || 93

రత్నత్రికోటి లక్షం చ బ్రహ్మణభ్యో దదౌ శివః | పార్వతీ చ గవాం లక్షం రత్నాని వివిధాని చ || 94

శంభుశ్చ చతురో వేదాన్‌ వేదాంగనితరాంస్తథా | బాలకం పాఠయామాస జ్ఞానం మృత్యుంజయం పరం || 95

భక్తిరాస్తే స్వకాంతే చాభీష్టే దేవే హరౌ గురౌ | యస్యాస్తే చ తత్పుత్రో బభూవాస్తీక ఏవ చ || 96

మనసాదేవి మంచిదినమున, మంచిముహుర్తమున నారాయణాంశ సంభూతుడు, జ్ఞానులకు యోగులకు గురువైన కుమారుని ప్రసవించెను. ఆ శిశివు తల్లి గర్భములో ఉండగానే పరమయోగియైన శంకరుని వలన మహాజ్ఞానమును పొంది తరువాత అతడు మహాయోగిగా, యోగులలో జ్ఞానవంతులలో శ్రేష్ఠుడుగా మారెను.

శంకరుడా శిశువునకు జాతక కర్మాది విధులను చేసి పుణ్యాహ మంగళమును చేసెను. అట్లే శిశువునకు శుభము కలుగవలెనని వేదములు చదివించెను, బ్రాహ్మణులకు అనేక రత్నములను దానముచేసెను. పార్వతీ దేవి సహితము అనేక గోవులను, రత్నములను బ్రాహ్మణులకు దానము చేసెను. దినదిన ప్రవర్ధమానుడగుచున్న ఆ కుమారునకు శివుడు వేదములను, వేదాంగములను, ఇతరవిషయములను, మృత్యువును జయించు తత్వజ్ఞానమును ఉపదేశించెను.

మనసా దేవి భర్త ఆమెను వదలిపెట్టినను అతనిపైన, ఆమెకభీష్ట దేవతయగు శ్రీహరిపైన, ఆమె గురువగు శంకరునిపైన అపారమైన భక్తియున్నందువలన ఆమె పుత్రునకు ఆస్తీకుడను పేరు వచ్చినది.

జగామ తపసే విష్ణోః పుష్కరం శంకరాజ్ఞయా | సంప్రాప్య చ మహామంత్రం తపశ్చ పరమాత్మనః || 97

దివ్యం వర్షత్రిలక్షం చ తపస్తప్త్వా తపోదనః | అజాగామ మహాయోగీ నమస్కర్తుం శివం ప్రభుం || 98

శంకరం చ మనస్కృత్య పురః కృత్వా చ బాలకం | సా చాజగామ మనసా కశ్యపస్యాశ్రమం పితుః || 99

తాం సపుత్రాం సుతాం దృష్ట్వా ముదం ప్రాప ప్రజాపతిః | శతలక్షం చ రత్నానాం బ్రాహ్మణభ్యో దదౌ మునే || 100

బ్రాహ్మణాన్భోజయామాస త్వసంఖ్యాన్‌ శ్రేయసే శిశోః | అదితిశ్చ దితిశ్చాన్యా ముదం ప్రాపుః పరం తథా || 101

సాసపుత్రా చ సుచిరం తస్థౌ తాతాలయే ముదా | తదీయం పునరాఖ్యానం వక్ష్యే త్వం తన్నిశామయ || 102

ఆ బాలుడు శంకరుని ఆజ్ఞపై విష్ణువునుగూర్చి తపస్సు చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మూడు లక్షల దివ్య సంవత్సరములు శ్రీమన్మహావిష్ణువును గూర్చి తపమాచరించి మహాయోగియై కైలాసమునకు వచ్చి శివుని నమస్కరించెను.

మనసాదేవి శంకరుని వద్ద అనుజ్ఞతీసికొని తన పుత్రునివెంట పెట్టుకొని తండ్రియగు కశ్యప ప్రజాపతి ఆశ్రమమునకు వచ్చినది. కశ్యప ప్రజాపతి తన కూతురును, మనుమని చూచి అమితానందమునొంది బ్రాహ్మణులకు అంతులేని దానములు చేసెను. అట్లే ఆ బాలునికి శుభము కలుగుటకై బ్రాహ్మణుల కందరికి అన్నదానము చేసెను. మనసా దేవి, ఆమె పుత్రుడైన ఆస్తీకమునిని చూచి దితి, అదితి మొదలగు కశ్యపుని భార్యలందరు సంతోషపడిరి. ఈ విధముగా మనసాదేవి తండ్రి దగ్గర తనపుత్రునితో కాలము గడుపుచుండెను.

నారద మహర్షీ! మనసాదేవి కథను నీకు తరువాత వినిపించెదను. ప్రస్తుతము నేను చెప్పుదానిని వినుము.

అథాభిమన్యుతనయే బ్రహ్మశాపః పరీక్షీతే | బభూవ సహసా బ్రహ్మన్‌ దైవదోషేణ కర్మణా || 103

సప్తాహే సమతీతేతు తక్షకస్త్యాం చ దక్ష్యంతి | శశాప శృంగీ కౌశిక్యా జలం సంస్పృశ్య చేతిసః || 104

రాజాశ్రుత్వా తత్ప్రవృత్తిం గంగాద్వారం జగామ సః | తత్ర తస్థౌ చ సప్తాహం శుశ్రువే ధర్మసంహితాం || 105

సప్తాహే సమతీతేతు గచ్ఛంతం తక్షకం పథి | ధన్వంతరిర్మోచయితుమపశ్యద్గంతుకో నృపం || 106

తయోర్భభూవ సంవాదః సుప్రీతిశ్చ పరస్పరం | ధన్వంతరేః మణిం శ్రేష్ఠం తక్షకః స్వే చ్ఛయా దదౌ ||107

సయ¸° తం గృహాత్వా తు తుష్ట సంహృష్ట మానసః | అపశ్యత్తక్షకస్తూర్ణం నృపం మంచక సంస్థితం || 108

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము

రాజా జగామ వైకుంఠం స్మారం స్మారం హరింగురుం | సంస్కారం కారయామాస పితుర్వై జనమేజయః || 109

ఒకప్పుడు కౌరవ వంశమున పుట్టిన అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తునకు దురదృష్టము వలన శమీకముని పుత్రుడైన శృంగిముని ఏడు దినములలో నిన్ను తక్షకుడు చంపునని శాపమునిచ్చెను. పరీక్ష్మిన్మహారాజా విషయమును తెలుసుకొని గంగానదీ తీరమునకు పోయి, ఆ ఏడు దినములలో ధర్మసంహితయగు భాగవతమును వినుచుండెను.

ఏడు దినములు గడిచిన పిమ్మట ఆ పరీక్షిత్తును కాటువేయదలచి తక్షకుడు పోవుచుండగా వైద్యులలో మిక్కిలి శ్రేష్ఠుడైన ధన్వంతరి మహారాజును తక్షక విషమునుండి కాపాడుటకు పోవుచుండెను. మార్గమధ్యమున తక్షకునకు ధన్వంతరికి మధ్యమాటలు స్నేహపూర్వకముగా జరిగినవి, అప్పుడు తక్షకుడు ధన్వంతరికి అమూల్యమైన మణిని ఇచ్చి పంపించెను. ఆ తరువాత తక్షకుడు మంచెపైనున్న మహారాజును కాటువేసెను. అందువలన పరీక్షిన్మహారాజు శ్రీహరిని మాటిమాటికి స్మరించుచు చనిపోయెను. అతని పుత్రుడగు జనమేజయుడు తండ్రికి పితృ సంస్కారములనన్నిటిని కావించెను.

రాజా చకార యజ్ఞం చ సర్పసత్రాభిధం మునే | ప్రాణాంస్తత్యాజ సర్పాణాం సమూహో బ్రహ్మ తేజసా || 110

న తక్షకశ్చ భీతశ్చ మహేంద్రం శరణం య¸° | సేంద్రం చ తక్షకం హంతుం విప్రవర్గః సముద్యతః || 111

అథదేవాశ్చమునయశ్చాయయు ర్మనసాంతికం | తాం తుష్టావ మహేంద్రశ్చ సమక్షం భయ కాతరః || 112

తత్ర ఆస్తీక ఆగత్య మాతుర్యజ్ఞమథాజ్ఞయా | మహేంద్ర తక్షక ప్రాణాన్యయాచే భూమిపం వరం || 113

దదౌ వరం నృపశ్రేష్ఠః కృపయా బ్రాహ్మణాజ్ఞయా | యజ్ఞం సమాప్య విప్రేభ్యో దక్షిణాం చ దదౌ ముదా || 114

విప్రాశ్చ మునయో దేవా గత్వా చ మనసాంతికం | మనసాం పూజయామాసుస్తుష్టువుశ్చ పృథక్‌ పృథక్‌ || 115

శక్రః సంభృత సంభారోభక్తి యుక్తః సదాశుచిః | మనసాం పూజయామాస తుష్టావ పరమాదరాత్‌ || 116

ఉపచారైః షోడశభిర్బలిం దత్వా ప్రియం తదా | ప్రదదౌ పరితుష్టశ్చ బ్రహ్మవిష్ణు సురాజ్ఞయా || 117

సంపూజ్య మనసాదేవీం ప్రయయుః స్వాలయం చ తే | ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్చసి || 118

జనమేజయ మహారాజు సర్పములపైగల కోపముచే సర్పయజ్ఞమును తలపెట్టెను. ఆ యజ్జమున సర్పములన్నియు తండోపతండములుగా వచ్చి చనిపోవుచుండెను.

అందువలన తక్షకుడుభయముతో మహేంద్రుని శరణువేడగా దానిని గమనించిన బ్రాహ్మణవర్గము మహేంద్రునితో కలిపి తక్షకుని యాగమున సంహరించుటకు ప్రయత్నించింది. అందువలన దేవతలు మునులు భయపడి మనసాదేవి దగ్గరకు వచ్చి ఆమెను స్తుతించిరి. అప్పుడు మనసాదేవి పుత్రుడైన ఆస్తీకుడు తల్లి ఆజ్ఞననుసరించి యజ్ఞవాటికకు వచ్చి మహారాజగు జనమేజయుని తక్షకుడు, మహేంద్రుల ప్రాణములను కాపాడుమని అడిగెను.

జనమేజయుడు తన యజ్ఞ నిర్వాహుకులైన ఋత్విక్కుల అనుజ్ఞపై ఆస్తీకుడు కోరిన వరమునిచ్చెను. ఆ తరువాత యజ్ఞమును పూర్తిచేసి బ్రాహ్మణులందరకు దక్షిణలొసగెను.

మనసాదేవి చేసిన సహాయమునకు సంతుష్టులైన దేవతలు, మునులు, మానవులందరు మనసాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెను మిక్కిలి గౌరవముతో పూజించిరి. దేవేంద్రుడు ఆదరముతో షోడశోపచారములతో మనసాదేవిని స్తోత్రము చేసి పూజించెను అటు పిమ్మట వారందరు తమతమ ఇండ్లకు పోయిరి.

నారదమునీ! ఇంతవరకు మనసాదేవి చరిత్రను నీకు చెప్పితిని, ఇంకను నీవు వినదలచినదేదైన ఉన్నచో అడుగుమని నారాయణుడనెను.

నాద ఉవా - నారదుడిట్లు పలికెను-

కేన స్తోత్రేణ తుష్టావ మహేంద్రో మనసాం సతీం | పూజావిధిక్రమం తస్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః || 119

నారాయణమునీ! దేవేంద్రుడు మనసాదేవిని ఏ స్తోత్రముచే స్తుతించెనో ఏ విధముగా పూజించెనో నాకు వివరముగా తెలుపుడు.

ద్వితీయఖండము - 46వ అధ్యాయము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

సుస్నాతః శుచిరాచాంతో ధృత్వా ధౌతే చ వాససీ | రత్నాసింహాసనే దేవీం వాస

యామాస భక్తితః || 120

స్వర్గగంగాజలేనైన రత్నకుంభస్థితేన చ | స్నాపయామాస మనసాం మహేంద్రో వేదమంత్రతః || 121

వాససీ వాసయామాస వహ్నిశుద్ధే మనోరమే | సర్వాంగే చందనం లిప్త్వా పాద్యార్ఘ్యం భక్తిసంయుతః || 122

గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం | సంపూజ్య దేవషట్కం చ పూజయామాస తాం సతీం || 123

ఓం హ్రీం శ్రీం మనసా దేవ్యై స్వాహేత్యేవం చ మంత్రతః | దశాక్షరేణ మంత్రేణ దదౌసర్వాన్యథోచితం || 124

ఉపచారాన్‌ షోడశకాన్‌ భక్తితో దుర్లభాన్‌ హరిః | పూజయామాస భక్త్యా చ బ్రహ్మణా ప్రేరితో ముదా || 125

వాద్యం నానాప్రకారం చ వాదయామాస తత్ర వై | బభూవ పుష్పవృష్టిశ్చ నభసో మనసోపరి || 126

దేవో విప్రాజ్ఞయా తత్ర బ్రహ్మవిష్ణు శివాజ్ఞయా | తుష్టావ సాశ్రునేత్రశ్చ పులకాంచిత విగ్రహః || 127

దేవేంద్రుడు చక్కగా స్నానముచేసి శుచియై ఉదికిన వస్త్రములు దరించి భక్తితో మనసాదేవిని పూజించెను. ఆమెను రత్నసింహానమున ఉంచి రత్నకుంభమున నున్న ఆకాశగంగ యొక్క జలముచే ఆ దేవిని మంత్రపూర్వకముగా అభిషేకించెను. తరువాత పరిశుద్ధమైన వస్త్రముల నా దేవికి అతడు సమర్పించుకొనెను. ఆ దేవి శరీరం మంతట చందనమునద్ది భక్తితో అర్ఘ్య పాద్యాదికములనిచ్చెను.

తొలుత గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గను, ఈ ఆరుగురు దేవతలను పూజించి ఓం హ్రీం శ్రీం మనసా దేవ్యై స్వాహా యను దశాక్షరమంత్రముతో షోడశోపచారములను సమర్పించెను. తరువాత అనేక విధములైన వాద్యములను మ్రోగించెను. అప్పుడు మనసాదేవిపై పుష్పవర్షము కురిసినది. ఆ తరువాత బ్రాహ్మణులు త్రిమూర్తుల ఆజ్ఞ గైకొని కన్నీళ్లు స్రవించగా మనసాదేవిని ఇట్లు స్తుతించెను.

మహేంద్ర ఉవాచ - మహేంద్రుడిట్లనెను-

దేవిత్వాం స్తోతుమిచ్ఛామి సాధ్వీనాం ప్రవరాం వరాం | పరాత్పరాం చ పరమాం నహిస్తోతుం క్షమోధునా|| 128

స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరం | నక్షమః ప్రకృతిం వక్తుం గుణానాం తవ సువ్రతే || 129

శుద్ధ సత్వస్వరూపాత్వం కోపహింసా వివర్జితా | న చ శప్తోమునిస్తేన త్యక్తయా చ త్వయాయతః ||

త్వం మయా పూజితాసాధ్వి జననీ చ యథాదితిః || 130

దయారూపా చ భగినీ క్షమారూపాయథా ప్రసూః | త్వయా మే రక్షితాః ప్రాణాః పుత్రదారా ః సురేశ్వరి || 131

అహం కరోమి త్వాం పూజ్యాం మమప్రీతిశ్చ వర్ధతే | నిత్యం యద్యసి పూజ్యా త్వం భ##వేబత్ర జగదంబికే || 132

తథాపి తవపూజాం వైవరధయామి పునః పునః | యే త్వామాషాఢ సంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః || 133

పంచమ్యాం మనసాభ్యాయో మాసాంతేవా దినేదినే | పుత్రపౌత్రాదయః తేషాం వర్ధంతే చ ధనాని చ || 134

యశస్వినః కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితాః | యే త్వాం న పూజయిష్యంతి నిందంత్యజ్ఞానతో జనాః || 135

లక్ష్మీ హీనా భవిష్యంతి తేషాం నాగభయం సదా | త్వం స్వర్గలక్ష్మీః స్వర్గే చ వైకుంఠే కమలా కళా || 136

నారాయణాంశో భగవాన్‌ జరత్కారురః | తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా || 137

అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా | మనసా దేవితుం శక్తా చాత్మనా సిద్ధయోగినీ || 138

తేన త్వం మనసాదేవీ పూజితా వందితా భ##వే | యాం భక్త్యా మనసా దేవా పూజయంత్యనిశం భృశం || 139

తేన త్వాం మనసాం దేవీం ప్రవదంతి పురావిదః | సత్వరూపా చ దేవీ త్వం శశ్వత్సత్య నిషేనయా || 140

యో హి యద్భావయేన్నిత్యం శతం ప్రాప్నోతి తత్సమం |

ఓ మనసాదేవి ! పతివ్రతలలో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపవలెనని అనుకొనుచున్నాను. పరాత్పరపు పరమస్వరూపవగు నిన్ను ఇప్పుడు స్తుతింపలేను.

వేదములలో స్తోత్రలక్షణము స్వభావమును తెలుపుట అని వివరించబడినది. కాని ఓ దేవి నీ గుణములను నేను చెప్పలేను. నీవు శుద్ధ సత్వ గుణస్వరూపవు. హింస, కోపాది దుర్గుణములు లేని దానవు. అందువలననే జరత్కారుముని నిన్ను ఆకారణముగ వదలిపెట్టినప్పుడు అతనని శపింపక వదలిపెట్టితివి.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము

నేను నా తల్లియగు అదితీదేది వలె నిన్ను పూజింతును. దయారూపిణివైన సోదరివలె క్షమారూపయగు తల్లివలె నీవు నా ప్రాణములను, నా భార్యా పిల్లలను రక్షించితివి. నీవు ఈ లోకములన అందరిచే పూజలనందుకొనుచున్నను నిన్ను పూజించవలెనను కోరక నాలో పెరుగుచున్నది. నిన్న అందరు పూజించునట్లు ప్రచారము చేయుదును.

నిన్ను ఆషాఢ సంక్రాంతినాడు, మనసా పంచమినాడు (నాగపంచమి) లేక అమావాస్యనాడు కాక ప్రతిదినము భక్తితో నిన్ను పూజించువారికి పుత్ర పౌత్రాభివృద్ధి, ధనాభివృద్ధి జరుగును. నిన్ను పూజించువారు యశస్సు, విద్య, గుణములు కల్గియుందురు.

నిన్ను పూజింపకపోయినను, అజ్ఞానమున నిందించినను వారు లక్ష్మీహీనులగుదురు. వారికెల్లప్పుడు సర్పభయము కలుగును.

నీవు స్వర్గమున స్వర్గలక్ష్మీగా, వైకుంఠమున లక్ష్మీదేవిగా పేరు పొందినావు.

జరత్కారు మునీశ్వరుడు నారాయణాంశుడు కావున లక్ష్మీదేవి అంశమగునీవు అతని భార్యవైతివి.

నీతండ్రి మమ్ము రక్షించుటకై తన తపస్సును తేజస్సును వెచ్చించి తన మనస్పంకల్పముచేతనే నిన్ను సృష్టించెను. అందువలన నీవు మనసాదేవి వైతివి. సిద్ధయోగినివను నీవు నీ మనోబలముచే అంతట తిరుగుశక్తి కలదానవగుటవలన నిన్ను మనసాదేవియనిరి. లేక దేవతలెల్లప్పుడు నిన్ను మనస్సులో ధ్యానింతురు. కావున మనసాదేవివైతివి. నీవెల్లప్పుడు సత్వగుణమును సేవించుటవలన సత్వ స్వరూపవైతివి.

ఇంద్రశ్చ మనసాంస్తుత్వా గృహీత్వా భగినీం చ తాం || 141

నిర్జగామ స్వభవనం భూషావాసపరిచ్ఛదాం | పుత్రేణసార్థం సా దేవీ చిరం తస్థౌపితుర్గృహే || 142

భ్రాతృభిః పూజితా శశ్వన్మాన్యా వంద్యా చ సర్వతః | గోలోకాత్సురభీ బ్రహ్మన్‌ తత్రాగత్య సుపూజితా || 143

తాం స్నాపయిత్వా క్షీరేణ పూజయామాస సాదరం | జ్ఞానస్య కథయామాస స్వరూపం సర్వదుర్లభం || తదా దేవైః పూజితా సా స్వర్గలోకం పునర్య¸° ||

ఇంద్రుడు మనసాదేవిని స్తుతించి సోదరియగు ఆమెను స్వర్గలోకముననున్న తన గృహమునకు తీసికొని వెళ్లెను. ఆదేవి తండ్రిదగ్గర తన కుమారునితో కలిసి చాలాకాలముండెను. అచ్చట ఆమె సోదరులచే మన్ననలను పొందుచుండెను. అప్పుడు గోలోకమునుండి సురభి అచ్చటికి వచ్చి తన క్షీరములచే ఆ దేవికి స్నానముచేసి పూజించెను. ఆమె అచ్చట అందరకు సహజముగా లభించని జ్ఞానమును ఉపదేశించెను.

అందువలన దేవతలా మనసాదేవిని పూజించుచు మరల స్వర్గలోకమునకు తీసికొనిపోయిరి.

ఇదం స్తోత్రం పుణ్యబీజం తాం సంపూజ్యచ యః పఠేత్‌ | తన్య నాగభయం నాస్తి తస్య వంశే భ##వేచ్చ యః || 145

విషం భ##వేత్సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదా పఠేత్‌ | పంచలక్షజపేనైవ సిద్ధస్తోత్రో భ##వేన్నరః || 146

సర్పశాయీ భ##వేత్సోపి నిశ్చితం సర్పవాహనః || 147

పుణ్యమునకు కారణమైన ఈ స్తోత్రమును పూజించి చదువువారికి, వారి వంశపువారికి నాగభయమనునది ఉండదు. ఈ స్తోత్రమును ఐదు లక్షల పర్యాయములు జపిచినచో స్తోత్రము సిద్ధిపొందును. అప్పుడతనికి విషము అమృతము వలెనగును. అతడు సర్పములపై పడుకొన్నను, సర్పవాహనుడైనను నిశ్చింతగా ఉండవచ్చును.

ఇతి శ్రీ బ్రహ్మనైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే మనసోపాఖ్యానే తదుత్పత్తి పూజాస్తోత్రాది కథనం నామ షట్చత్వారింశత్తమోధ్యాయఃః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున తెల్పబడిన మనోసాఖ్యానమున మనసాదేవి పుట్టుక, ఆమె పూజాస్తోత్రాదులు గల

నలభైయారవ అధ్యాయము సమాప్తము

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters