sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

పంచవింశో Zధ్యాయః- సావిత్రి యముని ప్రశ్నించుట

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

యమస్య వచనం శ్రుత్వా సావిత్రీ చ పతివ్రతా | తుష్టావ పరయా భక్త్యా తమువాచ మనస్వినీ || 1

యముని మాటలు విని పతివ్రతయగు సావిత్రి యమధర్మరాజును అధికమైన భక్తిచే స్తుతించి ఇట్లనెను.

సావిత్య్రువాచ- సావిత్రి ఇట్లు అనెను-

కిం కర్మ వా ధర్మరాజ శుభం కిం వాZశుభం నృణాం | కర్మ నిర్మూలయంత్యేవ కేన వా సాధవో జనాః || 2

కర్మణా బీజరూపః కః కోవా కర్మఫల ప్రదః | కిం కర్మ తద్భవేత్కేన కోవా తద్ధేతురేవ చ ||3

కోవా కర్మ ఫలం భుం క్తే కోవా నిర్లిప్త ఏవచ | కో వా దేహీ కశ్చ దేహః కోవా వై కర్మకారకః ||4

కిం విజ్ఞానం మనోబుద్ధిః కేవా ప్రాణాః శరీరిణాం | కానీంద్రియాణి కిం తేషాం లక్షణం దేవతాశ్చ కాః || 5

భోక్తా భోజయితా కోవా కో భోగః కాచ నిష్కృతిః కోజీవః పరమాత్మా వ్యాఖ్యాతుమర్హసి || 6

యమధర్మరాజ ! కర్మయనునదెట్లుండును? శుభాశుభకర్మలే విధముగా నుండును. సాధుపురుషులు ఏవిధంగా కర్మను నిర్మూలించుచున్నారు. కర్మలకు బీజరూపమైనది ఏది ? కర్మఫలితమునిచ్చువాడెవడు ? కర్మ ఫలమనుభవించువాడెవడు ? నిర్లిప్తుడుగా ఎవరుందురు?కర్మఫలమనుభవించువాడెవడు? నిర్లిప్తుడుగా ఎవరుందురు ? దేహము, దేహి, కర్మచేయువాడు ఎవరు? విజ్ఞానము, మనస్సు, బుద్ధి ప్రాణములు ఇంద్రియములు, దేవతలు భోక్త, భోజయిత, భోగము, నిష్కృతి అనగా ఏవిధముగా నుండును. జీవుడు పరమాత్మ ఎట్లుందురు? ఈ విషయములనన్నిటిని నాకు వివరించి తెల్పుమని సావిత్రి అడిగెను.

యమ ఉవాచ- యమ ధర్మరాజు ఇట్లనెను-

వేదేన విహితం కర్మ తన్మయే మంగళం పరం | అవైదికం తు యత్కర్మ తదేవాశుభ##మేవచ || 7

అహైతుకీ విష్ణుసేవా సంకల్పరహితా సతాం | కర్మ నిర్మూలనాత్మా వైసా చైవ హరిభక్తిదా || 8

హరిభక్తో లరో యశ్చ సచ ముక్తః శ్రుతౌ శ్రుతం | జన్మమృత్యు జరావ్యాధి శోక భీతి వివర్జితః || 9

ముక్తిశ్చ ద్వివిధా సాధ్వి శ్రుత్యుక్తా సర్వసమ్మతా | నిర్వాణపదదాత్రీ చ హరిభక్తిప్రదా నృణాం || 10

హరిభక్తి స్వరూపాం చ ముక్తిం వాంఛంతి వైష్ణవాః | అన్యే నిర్వాణ రూపాం చ ముక్తి మిచ్ఛంతి సాధనః || 11

వేదములందు విధించబడిన కర్మ మంగళ ప్రదమైనది. అట్లే వేదవిరుద్ధమైన కర్మ అమంగళకరము. సజ్జనులు సంకల్పరహితము, కారణము లేక చేయు విష్ణుసేవను కోరుకొందురు. అట్టి శ్రీహరి సేవ కర్మఫలితములము సంపూర్ణముగా నిర్మూలించును. అందువలన శ్రీహరి భక్తి కలుగును. హరి భక్తుడైన మానవుడే ముక్తుడని వేదములందు తెలుపబడినది. అతనికి పుట్టుక, చావు, ముసలితనము, రోగములవలన కలుగు దుఖఃము మొదలగునవి కలుగవు.

వేదములలో ముక్తి రెండు విధములుగా పేర్కొనబడినది. ఒకటి నిర్వాణ మార్గమును చూపించగా రెండవది శ్రీహరి భక్తిని కలిగించును. వైష్ణవులు శ్రీహరి భక్తి స్వరూపమైన ముక్తిని మాత్రమే కోరెదరు. ఇతర సజ్జనులు నిర్వాణరూపమైన ముక్తిని అభిలషింతురు.

కర్మణో బీజ రూపశ్చ సంతతం తత్ఫల ప్రదః | కర్మ రూపశ్చ భగవాన్‌ శ్రీకృష్ణః ప్రకృతేః పరః || 12

సోZపి తద్ధేతు రూపశ్చ కర్మ తేన భ##వేత్సతి | జీవ కర్మఫలం భుంక్తే ఆత్మా నిర్లిప్త ఏవచ || 13

ఆత్మనః ప్రతిబింబిం చ దేహీ జీవః స ఏవచ | పాంచభౌతికరూపశ్చ దేహో నశ్వర ఏవచ14

పృథివీవాయురాకాశో జలం తేజస్తథైవ చ | ఏతాని సూత్రరూపాణి సృష్టిః సృష్టివిధౌ హరేః || 15

కర్తా భోక్తా చ దేహీ చ స్వాత్మా భోజయితా సదా | భోగో విభవ భేదశ్చ నిష్కృతిర్ముక్తి రేవచ || 16

సదసద్భేద బీజం చ జ్ఞానం నానావిధం భ##వేత్‌ | విషయాణాం విభాగానాం భేదబీజం చ కీర్తితం || 17

బుద్ధిర్వివేచనా రూపా జ్ఞాన సందీపినీ శ్రుతౌ | వాయుభేదాశ్చ వై ప్రాణాః బలరూపాశ్చ దేహినాం || 18

కర్మల కన్నిటికి మూలభుతుడు, కర్మ స్వరూపి, కర్మ ఫలితములనిచ్చువాడు ప్రకృతి కంటె భిన్నుడైనవాడు శ్రీకృశ్ణుడు. అతడే కర్మకారకుడు . కర్మ ఫలితమును జీవుడు అనుభవించుచున్నాడు. ఆత్మ నిర్లిప్తమైనది. దాని ప్రతిబింబమే దేహి లేక జీవుడు , శరీరము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము పంచ భూతములచే నిండినది. ఇది అశాశ్వతమైనది. శ్రీహరి లోకముల సృష్టింపదలచినప్పుడు ఈ పంచభూతములు సృష్టికి కారణమైనవి. దేహి రూపి యగు జీవుడు కర్త మరియు కర్మఫలములననుభవించుచున్నాడు. ఆ ఆత్మయే భోజయిత (కర్మఫలములననుభవింపజేయునది) సుఖ దుఖఃస్వరూపమైన విభవమునకు మారుపేరే భోగము. నిష్కృతి యనగా ముక్తియే.

మంచి చెడుల యొక్క విచక్షణకు కారణమైన జ్ఞానము అనేక ప్రకారములుగా నున్నది. ఘటము, పటము ఇత్యాది విషయములయొక్క జ్ఞానము జ్ఞాన భేదముగా పేర్కొనబడుచున్నది. వివేకమును కలిగించు బుద్ధియే జ్ఞామసందీపిని యని వేదములలో పేర్కొనబడినది. జీవుల శరీరములలో ఉండే ప్రాణములు ప్రాణాపాన వ్యానోదాన సమానమను పేర్లుగల వాయువులే. ఇవి బలరూపమైనవి.

ఇంద్రియానాం వై ప్రవరం ఈశ్వరాణాం సమూహకం | ప్రేరకం కర్మణాం చైవ దుర్నివార్యం చ దేహినాం || 19

అనిరూప్యమదృశ్యం చ జ్ఞానభేదం మనః స్మృతం | లోచనం శ్రవణం ఘ్రాణం త్వగ్జిహ్వాదికమింద్రియం || 20

అంగినామంగరూపం చ ప్రేరకం సర్వ కర్మణాం | రిపురూపం మిత్రరూపం సుఖదం దుఃఖదం సదా || 21

జీవులు చేయు కర్మలను ప్రేరేపించునది, నివారింపలేనిది, ఇంద్రియములలో శ్రేష్ఠమైనది మనస్సు. ఇది ఇదమిత్థముగా నిరసించుటకు వీలుకానిది. కంటికి కనిపించనిది. అట్లే కళ్ళు, చెవులు, ముక్కు, త్వగింద్రియము నాలుక మొదలగు జ్ఞాన కర్మేంద్రియములు కలవు. ఇవి జీవులకు అవయవరూపముగా నుండి సమస్త కర్మలు చేయుటకు ప్రేరణనిచ్చుచున్నవి. ఇవి జీవునకు స్నేహితునివలె సుఖమునిచ్చును. శత్రువువలె దుఃఖమును కూడ కలిగించును.

సూర్యోవాయుశ్చ పృథివీ వాణ్యాద్యా దేవతాః స్మృతాః | ప్రాణ దేహాదిభృద్యోహి స జీవః పరికీర్తితః || 22

పరమాత్మా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | కారణం కారణానాం చ శ్రీకృష్ణో భగవాన్‌ స్వయం || 23

ఇత్యేవం కథితం సర్వం మయా పృష్టం యథాగమం | జ్ఞానాం జ్ఞానరూపం చ గచ్ఛ వత్సే యథాసుఖం || 24

సూర్యుడు, వాయువు, పృథివీ, సరస్వతి మొదలగువారు దేవతలు, ప్రాణములను దేహమును కలిగినవాడే దేహి లేక జీవుడు , పరమాత్మ, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతి కంటె భిన్నమైనవాడు, సృష్టికర్తలను సృష్టించువాడు శ్రీకృష్ణభగవానుడు మాత్రమే.

ఓ సావిత్రి ! నీవు అడిగిన సందేదహములకన్నిటికి సమాధానమును శాస్త్రబద్ధముగా తెల్పినాను. అందువలన నీవు సుఖముగా నీ ఇంటికి తరలి పొమ్మని యమధర్మరాజు పలికెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లు పలికెను.

త్యక్త్యాక్వ యామి కాంతం వా త్వాం వా జ్ఞానార్ణవం బుధం | ప్రశ్నం యద్యత్కరోమి త్వాం తద్భవాన్‌ వక్తుమర్హతి || 25

కాం కాం యోనిం యాతి జీవః కర్మణా కేన వా యమ | కేన వా కర్మణా స్వర్గం కేన వా నరకం పితః || 26

కేనవా కర్మణా ముక్తిః కేన భక్తిః భ##వేత్‌ హరేః | కేనవా కర్మణా రోగీ చారోగీ కేన కర్మణా ||27

కేన వా దీర్ఘ జీవీ చ కేనాల్పాయుశ్చ కర్మణా | కేన వా కర్మణా దుఃఖీ కేన వా కర్మణా సుఖీ || 28

అంగహీనశ్చ కాణశ్చ బదిరః కేన కర్మణా | అంధో వా కృపణో వాZపి ప్రమత్తః కేన కర్మణా || 29

క్షిప్తోzతిలుబ్ధకశ్చైవ కేన వా నరఘాతకః | కేన సిద్ధిమవాప్నోతి సాలోక్యాది చతుష్టయం ||30

కేన వా బ్రాహ్మణత్వం చ తపస్విత్వం చ కేనవా | స్వర్గభోగాదికం కేన వైకుంఠం కేన కర్మణా || 31

వైకుంఠం కేన వా బ్రహ్మన్‌ సర్కోత్కృష్టం నిరామయం | నరకం వా కతివిధం కిం సంఖ్యం నామ కిం తథా || 32

కోవా కం నరకం యాతి కియంతం తేషు తిష్ఠతి | పాపినాం కర్మణా కేన కోవా వ్యాధిః ప్రజాయతే || 33

యద్యస్తి చ మయాపృష్టం తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 34

ఓ యమధర్మరాజా ! నా భర్తము వదలి జ్ఞానసాగరుడవైన నిన్ను వదలిపెట్టి నేను ఎక్కడికి పోదును. అందువలన నేనడిగిన ప్రశ్నలకన్నిటికి సరియైన సమాధానములను మీరు చెప్పవలెను.

ఏయే కర్మలు చేసి ఏయే జన్మలు జీవుడెత్తును. ఓ తండ్రీ ఎట్టి కర్మ చేసిన స్వర్గమును లేక నరకమును జీవుడు పొందును. ఎట్టి కర్మలు చేసిన ముక్తి లేక శ్రీహరి పదపంకజములపై భక్తి కలుగును. ఎట్టి కర్మలాచరించిన జీవి రోగిగనో ఆరోగ్యవంతుడుగనో జీవించుచున్నాడు. ఏ కర్మలవలన జీవి దీర్ఘజీవిగనో అల్పాయుష్కుడుగనో దుఃఖవంతుడుగనో, సుఖవంతుడుగనో చెవిటి, గుడ్డి మొదలగు అవయవహీనుడుగనో, మిక్కిలి పిసినారిగనో, హంతకుడుగనో ఆగుచున్నాడు. అట్లే ఏ కర్మలవలన మానవుడు సాలోక్యాది చతుర్విధముక్తులను స్వర్గలోక భోగములను, జరావ్యాధిరహితమైన వైకుంఠమును పొందుచున్నాడు.

నరకములు ఎన్ని విధములుగా నున్నవి. వాటి పేర్లేమి? ఎవరు ఎట్టి నరకమును పొందుదురు ? అచ్చట ఎంతకాలముందురు? ఎట్టి పాపకర్మవలన ఎట్టి వ్యాధులు పుట్టుచున్నవి? మొదలగు విషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే కర్మవిపాకే యమోక్త్యనంతరం

సావిత్రీ ప్రశ్నో నామ పంచవింశోZధ్యాయః|

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున

తెల్పబడిన కర్మ విపాకమున యముని మాటల తరువాత సావిత్రి వేసిన ప్రశ్నలనే

ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters