sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

పంచదశోzధ్యాయ: - తులసీకి బ్రహ్మదేవుడు వరమునిచ్చుట

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

ధర్మధ్వజస్యపత్నీ చ మాధవీతి చ విశ్రుతా | నృపేణ సార్థం సా రాగాద్రేమే వై గంధమాదనే || 1

శయ్యాం రతికరీం కృత్వా పుష్పచందన చర్చితాం | చందనోక్షిత సర్వాంగీ పుష్ప చందన వాయునా || 2

స్త్రీరత్నమతిచార్వంగీ రత్నభూషణ భూషితా | కాముకీ రసికశ్రేష్ఠా రసికేశేన సంగతా || 3

సురతాద్విరతిర్నాసీత్తయోః సురతవిజ్ఞయోః | గతం వర్షశతం దైవం నాజానీతాం దివానిశం || 4

తతో రజస్వలాం ప్రాప్య సురతాద్విరరామ సః | కాముకీ సుందరీ కించిన్న చ తృప్తిం జగామ సా || 5

దధార గర్భం సా సద్యో దేవాబ్దశతకం సతీ | శ్రీగర్భా శ్రీయుతా సా చ సంబభూవ దినే దినే || 6

శుభక్షణ శుభదినే శుభయోగేన సంయుతే | శుభలగ్నే శుభాంశే చ శుభస్వామి గృహాన్వితే || 7

కార్తికీ పూర్ణిమాయాంచ సితవారే చ పద్మజే | సుషావ సా చ పద్మాంశాం పద్మినీం సుమనోహరాం || 8

ధర్మధ్వజమహారాజు భార్యపెరు మాధవి. వారిద్దరు గంధమాదనపర్వతమున చాలా సంవత్సరములు సుఖముగా నుండిరి. నూరు దేవతా సంవత్సరముల వరకు వారికి రాత్రింబవళ్లు తెలియలేదు. తరువాత ఆమె గర్భమును దరించి కార్తీక పూర్ణిమనాడు మహాలక్ష్మీదేవి అంశకల అందమైన కూతురును ప్రసవించెను.

పాదపద్మయుగే చైవ పద్మరాగవిరాజితాం | రాజరాజేశ్వరీం లక్ష్మీం సర్వావయవసుందరీం || 9

రాజలక్ష్మీ లక్ష్మయుక్తాం రాజలక్ష్మ్యధి దేవతాం | శరత్పార్వణ చంద్రాస్యాం శరత్పంకజలోచనాం || 10

పక్వబింబాధరోష్ఠీం చ పశ్యంతీం సస్మితాం గృహం | హస్తపాద తలారక్తాం నిమ్ననాభిం మనోరమాం || 11

తదధస్త్రివలీయుక్తాం వృత్తవల్గునితంబినీం | శీతే సుఖోష్ణసర్వాంగీం గ్రీష్మే చ సుఖ శీతలాం || 12

శ్యామాం సుకేశీం రుచిరాం న్యగ్రోధపరిమండలాం | శ్వేత చంపకవర్ణాభాం సుందరీష్వేక సుందరీం || 13

నరా నార్యాశ్చ తాం దృష్ట్యా తులనాం దాతుమక్షమాః | తేన నామ్నా చ తులసీం తాం వదంతి పురా విదః || 14

ఆ శిశువు పాదపద్మములు పద్మరాగములవలె ఎఱ్ఱనివి. రాజలక్ష్మీ చిహ్నములతో సర్వాంగసుందరియైన ఆ శిశువు రాజలక్ష్మికి అధిదేవత. ఆమె అందము ఇతరులతో పోల్చరానిది. తులన చేయుటకు వీలులేని అందము కలది కావున ఆ శిశువునకు తులసి యను పేరుపెట్టిరి.

సా చ భూమిష్ఠమాత్రేణ యోగ్యా స్త్రీ ప్రకృతిర్యథా | సర్వైర్నిషిద్ధా తపసే జగామ బదరీవనం || 15

తత్ర దైవాబ్దలక్షం చ చకార పరమం తపః | మమ నారాయణః స్వామీ భవితేతి వినిశ్చితా || 16

గ్రీష్మే పంచతపాః శేతే తోయస్థా సా చ సుందరీ | ప్రకాశస్థా వృష్టిధారాం సహంతీ చ దివానిశం || 17

వింశత్సహస్రవర్షం చ ఫలతోయాశనా చ సా | త్రింశచ్ఛత సహస్రాబ్దం పత్రహారా తపస్వినీ || 18

చత్వారింశత్సహస్రాబ్దం వాయ్వాహారా కృశోదరీ | తతో దశసహస్రాబ్దం నిరాహారా బభూవ సా || 19

నిర్లక్ష్యాం చైకపాదస్థాం దృష్ట్వా కమలోద్భవః | సమాయ¸° వరం దాతుం పరం బదరికాశ్రమం || 20

తులసి పెరిగి పెద్దనై బంధువులందరు వద్దని నిషేధించుచున్నను తనకు నారాయణుడు భర్తగా కావలెనని ఆశించి లక్ష దేవతా వర్సములు తపస్సు చేసినది. గ్రీష్మకాలమున పంచాగ్ని మధ్యనుండి, శీతాకాలమున నీటిలో నిలబడి, వర్షకాలమున బయటనుండి వర్షధారలను సంహించుచు ఇరవై వేల సంవత్సరములు పండ్లు, నీరు మాత్రమే తీసికొని తపస్సు చేసినది. తరువాత ముపై#్పవేల సంవత్సరములు ఆకులు మాత్రమే ఆహారముగా స్వీకరించినది. అటుపిమ్మట పదివేల సంవత్సరములు వాయువును మాత్రము ఆహారముగా స్వీకరించి తపస్సు చేసినది. తరువాత ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేయుచున్న తులసి దగ్గరకు బ్రహ్మ దేవుడు వరమిచ్చుటకై బదరికాశ్రమమునకు వచ్చెను.

చతుర్ముఖం చ సా దృష్ట్వా ప్రాణంసీద్ధంస వాహనం | తామువాచ జగత్కర్తా విధాతా జగతామపి || 21

హంసవాహనుడగు చతుర్ముఖ బ్రహ్మను చూచి తులసి వెంటనే నమస్కరించెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-

వరం వృణుష్వ తులసి యత్తే మనసి వాంఛితం | హరి భక్తించ ముక్తింవాzస్యజరామరతామపి || 22

ఓ తులసి! నీమనస్సులో నున్న కోరికను తెలుపుము. అది శ్రీహరిభక్తియో ముక్తియో, అజరామరత్వమో ఏదైనను వరమును కోరుకొమ్ము అని బ్రహ్మ పలికెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను-

శ్రుణు తాత ప్రక్ష్యామి యన్మే మనసి వాంఛింతం | సర్వజ్ఞస్యాపి పురతః కా లజ్జా మమ సాంప్రతం || 23

అహం చ తులసీ గోపీ గోలోకేzహం స్థితా పురా | కృష్ణప్రియా కింకరీ చ తదంశా తత్సఖీ ప్రియా || 24

గోవిందేన సహాసక్తాం అతృప్తాం మాం చ మూర్ఛితాం | రాసేశ్వరీ సమాగత్య చాపశ్య ద్రాసమండలే || 25

గోవిందం భర్త్సయామాస మాం శశాప రుషాzన్వితా | యాహి త్వం మానవీం యోనిం ఇత్యేవం చ పితామహ|| 26

మామువాచ స గోవిందో మదంశం త్వం చతుర్భుజం | లభిష్యసి తపస్తప్త్వా భారతే బ్రహ్మణో వరాత్‌ || 27

ఇత్యేవముక్త్వా దేవేశోzప్యంతర్ధానమవాప సః | దేవ్యా భియా తనుం త్యక్త్యా లబ్ధం జన్మ మయా భువి || 28

అహం నారాయణం కాంతం శాంతం సుందరవిగ్రహం | సాంప్రతం లబ్ధుమిచ్ఛామి వరమేనం చ దేమి మే || 29

సర్వజ్ఞుడవగు బ్రహ్మదేవుడా నా మనస్సులోని కోరికను నీతో చెప్పుకొనుటకు సిగ్గు-అనవసరము. నేను పూర్వము గోలోకమున తులసియను గోపికగా, రాధాదేవికి సేవకురాలుగా ఆమె అంశస్వరూపనై యుంటిని. ఒకప్పుడు నేను శ్రీకృష్ణునితో కలిసి తృప్తిలేక మూర్ఛపడియున్న సమయమున రాసేశ్వరి యగు రాధాదేవికోపమును పట్టలేక మానవజన్మనెత్తుమని శపించినది. అప్పుడు గోవిందుడు నాతో ఇట్లు చెప్పెను. 'నీవు మానవజన్మనెత్తినను తపస్సు చేసి నా అంశకల చతుర్భుజుడైన నారాయణుని నీవు భర్తగా పొందగలవని చెప్పెను. ఈ మాటలు చెప్పి ఆ గోవిందుడు కూడ అంతర్ధానమయ్యెను.

రాధాదేవియొక్క భయమువలన నేను నా శరీరమును త్యజించి ఈ భూలోకమున జన్మించితిని. నాకు సుందర విగ్రహుడు, శాంతుడైన నారాయణుని వివాహము చేసికొనవలెనని యున్నది. ఇది నా కోరిక. నీవు ఈ వరమును నాకు ప్రసాదింపుము.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

సుదామా నామ గోపశ్చ శ్రీకృష్ణాంగ సముద్భవః | తదంశశ్చాతితేజస్వీ చాలభజ్జన్మ భారతే || 30

సాంప్రతం రాధికా శాపాద్దను వంశ సముద్భవః | శంఖచూడ ఇతిఖ్యాత సై#్త్రలోక్యే న చ తత్పరః || 31

గోలోకే త్వాం పురా దృష్ట్వా కామోన్మథిత మానసః | విలంఘితుం నశక్నోతి రాధికాయాః ప్రభావతః || 32

సచ జాతి స్మరస్తప్త్వా త్వాం లలాభ వరేణ చ | జాతిస్మరా త్వమపి సర్వం జానాసి సుందరి || 33

అధునా తస్యపత్నీం చ బవ భావిని శోభ##నే | పశ్చాన్నారాయణం కాంతం శాంతమేవ లభిష్యసి || 34

శాపాన్నారాయణసై#్యవ కళయా దైవయోగతః | ప్రాప్నోషి వృక్షరూపం తం త్వం పూతా విశ్వపావనీ |7 35

ప్రధానా సర్వపుష్పాణాం విష్ణుప్రాణాధికా భ##వేత్‌ | త్వయా వినా చ సర్వేషాం పూజా చ విఫలా భ##వేత్‌ || 36

బృందావనే వృక్షరూపా నామ్నా బృందావనీతి చ | త్వత్పత్రైః గోపికా గోపాః పూజయిష్యంతి మాధవం || 37

వృక్షాధిదేవీ రూపేణ సార్థం కృష్ణేనం సంతతం | విహరిష్యసి గోపేన స్వచ్ఛందం మద్వరేణచ || 38

ఇత్యేవం వచనం శ్రుత్వా సస్మితా హృష్టమానసా | ప్రణనామ చ ధాతారం తం చ కిం చదువాచహ || 39

భారతదేశమున శ్రీకృష్ణుని యొక్క అంశవలన పుట్టిన సుదాముడను గోపుడు రాధాదేవి యొక్క శాపమువలన దనుజవంశములో ''శంఖచూడు''డను పేరుతో జన్మించెను.

ఆతడొకప్పుడు గోలోకమున నిన్ను చూచి కామబాధకు గురియైనప్పటికీ రాధాదేవి ప్రభావమువలన అతిగా ప్రవర్తించలేకపోయెను. అతడు భూమిపై రాక్షసుడుగా జన్మించినను తన పూర్వజన్మ స్మృతి ఉన్నందువలన చాలాకాలము తపమాచరించి నిన్ను భార్యగా వరము పొందెను. పూర్వజన్మస్మృతి కల నీకు ఈవిషయమంతయు తెలియును. అందువలన ఈ జన్మలో శంఖచూడునకు భార్యవై తరువాతి జన్మలో నారాయణుని భర్తగా పొందగలవు.

దురదృష్టవశమున నారాయణుని శాపమును పొంది ప్రపంచములనన్నిటిని పవిత్రముగా చేయు వృక్షరూపమును పొందుదువు. సమస్త పుష్పములలో ప్రధానమైన దానవు, విష్ణుమూర్తికి ప్రాణములకన్న మిన్నగా నున్న నీవు లేనిచో సమస్తదేవతల పూజ నిష్పలమగును. బృందావనమున వృక్షరూపముతో నున్నందువలన నిన్ను బృందావని యని పిలుతురు. గోపులు గోపికలు నీ ఆకులతోడనే పరమాత్మను పూజింతురు. వృక్షాధిదేవతగా నీవు కృష్ణునితో ఎల్లప్పుడు విహరింతువు. ఇది నేనొసగు వరము. అని బ్రహ్మదేవుడు పలుకగా ఆతని మాటలు విని తులసి సంతోషించి అతనికి నమస్కరించి ఇట్లు పలికెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లు పలికినది-

యథామే ద్విభుజే కృష్ణే వాంఛా చ శ్యామసుందరే | సత్యం బ్రవీమి హే తాత న తథా చ చతుర్భుజే || 40

అతృప్తాzహం చ గోవిందే దైవాత్‌ శృంగారభంగతః | గోవిందసై#్యవ వచనాత్ర్పార్థయామి చతుర్భుజం || 41

తత్ర్పసాదేన గోవిందం పునరేవ సుదుర్లభం | ధ్రువమేవం లభిష్యామి రాధా భీతిం ప్రమోచయ || 42

ఓబ్రహ్మదేవుడా! నీకు శ్యామసుందరుడు ద్విభుజుడైన కృష్ణునిపై నున్న వ్యామోహము చతుర్భుజుడైన నారాయణునిపై లేదు. ఇది నిజము. దురదృష్టవశమున శ్రీకృష్ణునివద్ద తృప్తి పొందలేకపోయితిని. శ్రీకృష్ణుడు తెల్పినట్లే చతుర్భుజుడైన నారాయణుని ప్రార్థించి తప్పకసుదుర్లభుడైన శ్రీకృష్ణునే భర్తగా తప్పక పొందుదును. కాని మీరు రాధాదేవి వలన కలుగు భయమును మాత్రము తొలగింపుడు. అని తులసి పల్కినది.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

గృహాణ రాధికా మంత్రం దద్మి వై. షోడశాక్షరం | తస్యాశ్చ ప్రాణతుల్యా త్వం మద్రేణ భవిష్యసి || 43

శృంగారం యువయోర్గోప్యమాజ్ఞాస్యతి చ రాధికా | రాధా సమా త్వం సుభగా గోవిందస్య భవిష్యసి || 44

ఇత్యేవ ముక్త్వా దత్వాచ దేవ్యై తత్‌ షోడశాక్షరం | మంత్రం తసై#్య జగద్ధాతా స్తోత్రంచ కవచం పరం || 45

సర్వ పూజావిధానం చ పురశ్చర్యావిధి క్రమం | పరం శుభాశిషం కృత్యా సోzతర్థానమవాప సః || 46

ఓ తులసి! షోడశాక్షరమగు రాధామంత్రమబును నీకు ఉపదేశించుచున్నాను. దానివలన, నావరమువలన నీవు రాధాదేవికి ప్రాణములకంటె అధికమైన స్నేహితురాలవగుదువు. ఆ రాధయే నీకు శ్రీకృష్ణుల మధ్య సంగమమేర్పాటు చేయును. నీవు శ్రీకృష్ణునకు రాధాదేవితో సమానమైన ప్రియురాలవగుదువు అని చెప్పి షోడశాక్షరమైన రాధికా మంత్రమును, స్తోత్రమును, కవచమును, పూజావిధిని, పురశ్చర్యాక్రమమునంతయు తెల్పి శుభాశీస్సుల నొసగి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యెను.

సా చ బ్రహ్మోపదేశేన పుణ్య బదరికాశ్రమే | జజాప పరమం మంత్రం యదిష్టం పూర్వజన్మనః || 47

దివ్యం ద్వాదశవర్షం చ పూజాం చైవ చకార సా | బభూవ సిద్ధా సా దేవీ తత్ర్పత్యాదేశమాప చ || 48

సిద్ధే తపసి మంత్రే చ వరం ప్రాప్య యథేప్సితం | బుభ##జే చ మహాభాగం యద్విశ్వేషు సుదుర్లభం || 49

ప్రసన్న మనసా దేవీ తత్యాజ తపసః క్లమం | సిద్ధే ఫలే నరాణాంచ దుఃఖంచ సుఖముత్తమం ||

భుక్త్వా పీత్వా చ సంతుష్టా శయనం చ చకార సా | తల్పే మనోరమే తత్ర పుష్ప చందన చర్చితే || 51

బ్రహ్మదేవుని ఉపదేశముననుసరించి పరమ పుణ్యమైన బదరికా వనములో పరమమంత్రమైన రాధికామంత్రమును జపించెను. ఆమె పన్నెండు దివ్య సంవత్సరములు పూజ చేసి సిద్ధురాలైనది. తపస్సు మంత్రము సిద్ధినొందుటవలన తనకిష్టమైన శ్రీకృష్ణ సమాగమ వరమును పొంది శ్రీకృష్ణునితో సుఖముగానుండసాగినది. మానవులకు ఫలితము దొరికినచో దుఃఖము కూడ సుఖమగును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానే తులసీవర ప్రదానం నామ పంచదశోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున చెప్పబడిన తులసి ఉపాఖ్యానములో తులసీ వర ప్రదానమను

పదునైదవ అధ్యాయము సంపూర్ణము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters