sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

సప్తమోధ్యాయః - యుగములు మన్వంతరములు మొ. కాలవివరణ

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను-

పుణ్యక్షేత్రే హ్యాజగామ భారతే సా సరస్వతీ | గంగాశాపేన కళయా స్వయం తస్థౌ హరేః పదే || 1

భారతీ భారతం గత్వా బ్రహ్నీ చ బ్రహ్మణః ప్రియా | వాగధిష్ఠాతృదేవీ సా తేన వాణీ చ కీర్తితా || 2

సర్వం విశ్వం పరివ్యాప్య స్రోతస్యేవహి దృశ్యతే | హరిః సరస్వతస్యేzయం తేన నామ్నా సరస్వతీ || 3

సరస్వతీ నదీ సాచ తీర్థరూపాzతిపావనీ | పాపిపాపేధ్మ దాహాయ జ్వలదగ్ని స్వరూపిణీ || 4

పశ్చాద్భగీరథానీతా మహీం భాగీరథీ శుభా | సమాజగామ కళయా వాణీశాపేన నారద || 5

తత్రైవ సమయోతాంచ దధార శిరసా శివః | వేగం సోఢు మశక్తా యా భువః ప్రార్థనయా విభుః || 6

గంగాదేవి యొక్క శాపము వలన సరస్వతి హరికి స్థానము పుణ్యక్షేత్రమైన భారత భూమియందు అవతరించెను. భారత భూమిని పొందినందువలన భారతియని, బ్రహ్మదేవునికి ప్రియురాలు కావున బ్రహ్మియని, వాక్కులకు అధిష్ఠాన దేవత కావున వాణియని పిలువబడుచున్నవి.

శ్రీహరి సమస్త విశ్వమునందంతట ఉన్నప్పటికిని సముద్రమునందు శేషతల్పమున ఉన్నందువలన శ్రీహరికి 'సరస్వాన్‌' అని పేరు కలదు. అతనికి సంబంధించినది కావున ఈమెకు ''సరస్వతి'' యను పేరు కలిగినది. ఆ సరస్వతీ నది అతి పవిత్రమైనది. పాపుల యొక్క పాపము లనే కట్టెలను దహించు అగ్నశిఖవంటిది.

గంగాదేవి వాణిదేవియొక్క శాపమున తన అంశ స్వరూపముతో భూమిపై అవతరించినది. భగీరథుని ప్రయత్నము వలన భూమికి వచ్చినందువలన ఆమెను భాగీరథి యని పిలుచుచున్నారు. గంగాదేవి నదీరూపమున భూమిపైకి దిగునప్పుడు ఆమె వేగమును భూమి సహించయలేక పోయినది. అందువలన పరమశివుడామెను తన శిరస్సున నిలుపుకొనెను.

పద్మాజగామ కళయా సా చ పద్మావతి నదీ | భారతే భారతీశాపాత్‌ స్వయం తస్థౌ హరేః పదే || 7

తతోzన్యయా సా కళయా చాలభజ్జన్మ భారతే | ధర్మధ్వజ సుతాలక్ష్మీర్విఖ్యాతా తులసీతి చ || 8

పురా సరస్వతీ శాపాత్‌ తత్పశ్చాత్‌ హరి శాపతః | బభూవ వృక్షరూపా సా కళయా విశ్వపావనీ || 9

కలే పంచ సమస్రంచ వర్షం స్థిత్వా చ భారతే | జగుస్తాశ్చ సరిద్రూపం విహాయ శ్రీహరేః పదం || 10

లక్ష్మీదేవి ఇంకొక అంశముతో ధర్మధ్వజ మహారాజు కుమార్తెగా సరస్వతీ దేవి శాపమున భారతదేశమున అవతరించినది. తరువాత శ్రీహరి శాపము వలన వృక్షరూపముగా మారినది.

ఈగంగా. లక్ష్మీ, సరస్వతులు భాదతదేశమున కలియుగమున ఐదువేల సంవత్సరములవరకుండి తమ నదీ రూపమున వదలి శ్రీహరి పదమును చేరుకొందురు.

యాని సర్వాణి తీర్థాని కాశీం వృందావనం వినా | యాస్యంతి సార్థం తాభిశ్చ హరేర్వైకుంఠమాజ్ఞయా || 11

శాలగ్రామోహరేర్మూర్తిః జగన్నాథశ్చ భారతం | కలేః దశసహస్రాంతే య¸°త్యక్త్వా హరేః పదం || 12

వైష్ణవాశ్చ పురాణాని శంఖాశ్చ శ్రాద్ధ తర్పణం | వేదోక్తాని చ కర్మాణి యయుసై#్తః సార్థమేవచ || 13

హరిపూజా హరేర్నామా తత్కీర్తి గుణకీర్తనం | వేదాంగాని చ శాస్త్రాణి యయుసై#్తః సార్థమేవచ || 14

సత్యం చ సత్యం ధర్మశ్చ వేదాశ్చ గ్రామ్యదేవతాః | వ్రతం తపస్యాzనశనం యయుసై#్తః సార్థమేవచ || 15

కలియుగమున పదివేల సంవత్సరములు గడచిన తరువాత కాశి, బృందావనము తప్ప మిగిలిన సమస్త తీర్థములు, శ్రీహరికి మూర్తి రూపమైన శాలగ్రామము, జగన్నాథుడు, వైష్ణవులు, పురాణములు, వేదోక్తకర్మలు, హరిపూజ, హరినామ సంకీర్తనం, సత్యం, ధర్మం, వేదములు చివరకు గ్రామములలో ఉండు గ్రామ్యదేవతలు సహితము శ్రీహరి ఆజ్ఞననుసరించి వైకుంఠమునకు వెళ్ళుదురు (అనగా వీటిపై ఆదరము తగ్గును.)

వామచారరతాః సర్వే మిథ్యాకాపట్య సంయుతాః | తులసీ వర్జితా పూజా భిష్యతి తతః పరం || 16

ఏకాదశీ విహీనాశ్చ సర్వే ధర్మ వివర్జితాః | హరి ప్రసంగ విముఖా భవిష్యంతి తతః పరం || 17

శఠాః క్రూరా దాంభికాశ్చ మహాహంకార సంయుతాః | చోరశ్చహింసకాః సర్వే భవిష్యంతి తతః పరం || 18

పుంసాంభేదస్థథా స్త్రీణాం వివాహో వాద నిర్ణయః | స్వస్వామిభేదో వస్తూనాం నభివిష్యత్యతః పరం || 19

సర్వే జనాః స్త్రీవశాశ్చ గృహే గృహే | తర్జనైః భర్త్సనైః శశ్వత్‌ స్వామినం తాడయంతి చ || 20

గృహేశ్వరీ చ గృహిణీ గృహీ భృత్యాధికోzధమః | చేటీభృత్యా సమావధ్వః శ్వశ్రూశ్చ శ్వశురసథా || 21

కర్తరో బలినో గేహే యోని సంబంధి బాంధవాః | విద్యా సంబందిభిః సార్థం సంభాషాzపి న విద్యతే || 22

యథాzపరిచితాలోకాః తథా పుంసశ్చ బాంధవాః | సర్వకర్మాక్షమాః పుంసః యోషితామాజ్ఞయా వినా || 23

ఆ సమయమున శ్రీహరిపూజ తులసీపత్రములు లేకుండ జరుగును. అప్పుడు ప్రజలందరు అబద్ధములాడుచు కపటముతో వామాచార పరాయణులై యుందురు. ఏకాదశీవ్రతములు లోపించును. ప్రజలందరు ధర్మదూరులై శ్రీహరి గుణకీర్తమునకు విముఖులగుదురు. క్రూరులు, డాంబికులు, మహాహంకార యుతులు, చోరులు, హింసించువారై యుందురు. స్త్రీ పురుష భేదము కాని స్వామి, భృత్యభేదము కాని కనిపిపందు.

స్త్రీలందరు స్వేచ్ఛగా తిరుగుచు భర్తలను తమ అదుపాజ్ఞలలో ఉంచుకొందురు. తర్జన భర్జనలతో తమ భర్తలను కొట్టుటకైనను వెనుకాడరు. ఇంటి యజమానురాలు సామాన్యవలె ఉండును. ఇంటి యజమాని భృత్యునివలె ఉండును. ఇంటికోడళ్ళు తమ గౌరవమును కోల్పోయి పనివారివలె ప్రవర్తింతురు. బాంధవ్యము కేవలము యోని సంబంధులలో మాత్రముండును. విద్యా సంబంధము కలవారితో పలుకనైనా పలుకరు. అందరు పరస్పర పరిచయము లేనివారివలె మెలగుదురు. పురుషులు తమ భార్యల మాటలను తప్పక విందురు.

బ్రహ్మక్షత్రియ విట్‌ శూద్రా జాత్యాచార వినిర్ణయః | సంధ్యా చ యజ్ఞసూత్రం చ భావలుప్తం న సంశయః || 24

వ్లుెచ్ఛాచారా భవిష్యంతి వర్ణాశ్చత్వార ఏవచ | వ్లుెచ్ఛశాస్త్రం పఠిశ్యంతి స్వశాస్త్రాణి విహాయతే || 25

బ్రహ్మక్షత్ర విశాం వంశాః శూద్రాణాం సేవకాః కలౌ | సూపకారా భవిష్యంతి ధావకా వృషవాహకాః ||

సత్యహీనాః జనాః సర్వే సస్యహీన చ మేదినీ || 26

ఫలహీనాశ్చ తరవోzపత్యహీనాశ్చ యేషితః | క్షీరహీనాస్థథా గావః క్షీరం సర్పివివర్జితం || 27

దంపతీ ప్రీతి హీనౌ చ గృహిణః సుఖ వర్జితాః | ప్రతాపహీనా భూపాశ్చ ప్రజాశ్చ కరపీడితాః || 28

జలహీనా సదానద్యో దీర్ఘికాః కందరాదయః | ధర్మహీనాః పుణ్యహీనా వర్ణాశ్చత్వారా ఏవచ || 29

బ్రహ్మణాది చాతుర్యర్ణ్యముల యొక్క కులాచార పద్ధతులు లోపించిపోవును. జనులందరు తమ ప్రాచీనశాస్త్ర గ్రంథములను వదలి వ్లుెచ్ఛుల శాస్త్రములు పఠించుచు వారి ఆచార వ్యవహారముల స్వీకరింతురు. ఉత్తమ వంశమున జన్మించిన వారందరు తమ తమ ఆచారవ్యవహారములను వదిలిపెట్టి భ్రష్టాచారులగుదురు. జనులందరు సత్యదూరులు కాగలరు. భూమి చక్కగా పండదు. చెట్లకు పండ్లు ఉండవు. స్త్రీలు సంతానరహితలు కాగలరు. ఆవులు పాలనివ్వవు. భార్యాభర్తలు సుఖములేక సంతోషమునకు దూరము కాగలరు. నదీనదములు బావులు మొదలగు వాటిలో నీరుండదు. అందరు ధర్మహీనులు పుణ్యహీనులు కాగలరు.

లక్షేషు పుణ్యవాన్‌కోzపి న తిష్ఠతి తతః పరం | కుత్సితా వికృతాకారా నరా నార్యశ్చ బాలకాః || 30

కువార్తాః కుత్సితపథాః భవిష్యంతి తతః పరం | కేచిత్‌ గ్రామాశ్చ నగరా నరశూన్యా భయానకాః || 31

కేచిత్‌ స్వల్ప కుటీరేణ నరేణ చ సమన్వితాః అరణ్యాని భవిష్యంతి గ్రామేషు నగరేషు చ || 32

అరణ్యవాసినః సర్వే జనాశ్చ కరపీడితాః | సస్యాని చ భవిష్యంతి తడాగేషు నదీషు చ || 33

క్షేత్రాణి సస్యహీనాని ప్రకృష్టాన్యర్థతః పరం | హీనాః ప్రకృష్టా ధనినో బలదర్ప సమన్వితాః || 34

ప్రకృష్ట వంశజాహీనా భవిష్యరతి కలౌ గుయే | అలీకవాదినో ధూర్తాః శఠావై సత్యవాదినః || 35

పాపినః పుణ్యవంతశ్చాప్యశిష్టః శిష్టఏవచ | జితేంద్రియా లంపటాశ్చ పుంశ్చల్యశ్చ పతివ్రతాః || 36

తపస్వినః పాతకినో విష్ణుభక్తా అవైష్ణవాః | హింసకాశ్చ దయాయుక్తాః చౌరశ్చ నరఘాతినః || 37

భిక్షువేషధరా ధూర్తా నిందంత్యుపహసంతి చ | భూతాది సేవా నిపుణాః జనానాం మోదకారిణః || 38

పూజితాస్తే భవిష్యంతి వంచకా జ్ఞాన దుర్బలాః | వామనా వ్యాధియుక్తాశ్చ నరా నార్యశ్చ సర్వతః || 39

అల్పాయుషో జరాయుక్తా ¸°వనేషు కలౌ యుగే | పలితాః షోడశే వర్షే మహావృద్ధాస్తు వింశతౌ || 40

అష్టవర్షా చ యువతీ రజోయుక్తా చ గర్భిణీ | వత్సరాంతే ప్రసూత స్త్రీ షోడశేన జరాన్వితా || 41

ఏతాః కాశ్చిత్‌ సహస్రేషు వంధ్యాశ్చాపి కలౌ యుగే | కన్యా విక్రయిణః సర్వే వర్ణాశ్చాత్వారా ఏవచ || 42

మాతృజాయా వధూనాం చ జారోపార్జన తత్పరాః | కన్యానాం భగినీనాం చ జారోపార్జనజీవినః || 43

హరేర్నామ్నాం విక్రయిణో భవిష్యంతి కలౌ యుగే | స్వయముత్సృజ్య దానం చ కీర్తివర్ధన హేతవే || 44

తత్పశ్చాన్మనసాలోచ్య స్వయముల్లంఘయిష్యతి | దేవవృత్తిం బ్రహ్మవృత్తిం వృత్తింగురుకులస్య చ || 45

స్వదత్తాం పరదత్తాంవా సర్వముల్లంఘయిష్యతి | కన్యకాగామినః కేచిత్‌ కేచిత్‌ శ్వశ్రభిగామినః || 46

ఈ కలియుగమున లక్షలమంది జనులలో ఎవడో ఒకడు పుణ్యవంతుడు కాగలడు. అందరు దుష్టులు, వికృతమైన ఆకారము కలవారు కాగలరు. కొన్ని గ్రామములు, పట్టణములు జనరహితమై భయంకరముగా ఉండును. కొన్ని గ్రామములలో, పట్టణములలో తక్కువ ఇండ్లు మాత్రముండును. అరణ్యములలో నున్న వారి దగ్గర కూడా మిక్కిలిగా పన్నలు తీసికొని పీడింతురు. నీరులేక నదులలో చెరువులలో పంటలు పండితురు. అట్లే చక్కని పంటభూములందు పంటలు పండవు. నికృష్టులు ధనము, బలము, అహంకారము కలవారై గొప్పవారుగా పరిగణింపబడుదురు. అదేవిధముగా ఉన్నత వంశమున పుట్టినవారు నికృష్టులుగా చూడబడుదురు. అబద్ధములు మాటాడు దుష్టులు సత్యము పలుకుచున్నట్లు కన్పింతురు. పాపులు పుణ్యవంతులుగాను, పాతకము చేయువారు తపస్సచేసి కొనువారివలె, అవైష్ణవులు విష్ణుభక్తులవలె కన్పింతురు. అట్లే ఈ కలియుగమున దయ్యములను పూజించువారు, జ్ఞానములేని మోసగాళ్ళు గౌరవింపబడుదురు. స్త్రీ పురుషులందరు పొట్టివారుగానో వ్యాధులతోనో బాధలు పడుదురు. పదునారు సంవత్సరములకే తలంతయు పండి ఇరువది సంవత్సరముల వయసు వచ్చు వరకు ఒడలు ముడుతబడి పూర్తిగా ముసలివారగుదురు. స్త్రీలు ఎనమిది సంవత్సరములకే యువతలగుదురు. పదునారు సంవత్సరముల వరకు ముసలివారగుదురు. డబ్బుకు కక్కుర్తిపడి తమ కూతుళ్లను అమ్ముకొందురు. అట్లే తల్లిని, భార్యను, కోడలిని, చెల్లెలిని జారత్వమునకు ప్రోత్సహించి ఆ ధనముచే బ్రతుకజూతురు. కీర్తికొరకు తాము చేసిన దానమును వెనుకకు తీసికొనెదరు. అట్లే తానిచ్చినవి, పరులిచ్చినవి ఐన దేవ బ్రాహ్మణ గురువృత్తులను వెనుకకు తీసికొందురు.

కేచిద్వధూగామినవ్చ కేచిత్‌ సర్వత్రగామినః | భగినీ గామినః కేచిత్‌ సపత్నీ మాతృగామినః || 47

భ్రాతృజాయాగామినశ్చ భవిష్యంతి కలౌయుగే | అగమ్యాగమనం చైవ కరిష్యంతి గృహే గృహే || 48

ఆత్మయోనింపరిత్యజ్య విహరిష్యంతి సర్వతః | పత్నీనాం నిర్ణయోనాస్తి భర్తౄణాం చ కలౌయుగే || 49

ప్రజానాం చైవ వస్తూనాం గ్రామాణాంచ విశేషతః | అలీకవాదినః సర్వే సర్వే చౌర్యార్థలంపటాః || 50

పరస్పరం హింసకాశ్చ సర్వే చ నరఘాతినః | బ్రహ్మక్షత్రవిశాం వంశా భవిష్యంతి చ పాపినః || 51

లాక్షాలోహ రసానాం చ వ్యాపారం లవణస్య చ | వృషవాహా విప్రవంశాః శూద్రాణాం శవదాహినః || 52

శూద్రాన్నభోజినః సర్వే సర్వే చ వృషలీ రతాః | పంచపర్వపరిత్యక్తా కుహూరాత్రిషు భోజినః || 53

యజ్ఞసూత్రవిహీనాశ్చ సంధ్యాశౌచవిహీనకాః | | 54

పుంశ్చలీ వార్ధుషాzవీరా కుట్టినీ చ రజస్వలా | విప్రాణాం రంధనాగారే భవిష్యంతి చ పాచికాః || 55

అన్నానాం నిర్ణయో నాస్తి యోనీనాం చ విశేషతః | ఆశ్రమానాం జనానాం చ సర్వేవ్లుెచ్ఛాః కలౌయుగే || 56

తన కూతురు, అత్త, కోడలు, చెల్లెలు, సోదరుని భార్య అనే వావివరసలు లేకుండా వ్యభిచరింతురు. ఈ కలియుగమున ఒక పురుషునకు భార్యలెందరో ఒక స్త్రీకి భర్తలెందరో ఒక స్త్రీకి భర్తలెందరో చెప్పలేము. అందరు అసత్యమాడువారే. అన్యాయముగా దొంగతనము చేసి ధనము సంపాదించువారే. ప్రజలందరు ఒకరి నొకరు హింసించుకొందురు. చంపుకొందురు. లత్తుక, లోహము, రసము, ఉప్పును అమ్ముకొని బ్రతుకుదురు. బ్రాహ్మణులు తమ ధర్మములను వదలివేయుదురు. అమావాస్య రాత్రివేళలో భుజింతురు, జందెములను తీసివేసి సంధ్యావందనములాచరింపరు. తమ ఇంటిలోని సదాచారములనన్నిటినీ వదులుకొందురు. అన్ని ఆశ్రమములయందు వర్ణముల యందు సంకరమేర్పడగలదు.

ఏవం కలౌ సంప్రవృత్తే సర్వే వ్లుెచ్ఛమయా భ##వే | హస్త ప్రమాణ వృక్షే వాంగుష్ఠమానే చ మాననే || 57

విప్రస్య విష్ణుయశసః పుత్రః కల్కీ భవిష్యతి | నారాయణ కలాంశశ్చ భగవాన్‌ బలినాం బలీ || 58

దీర్ఘేణ కరవాలేన దీర్ఘఘోటకవాహనః | వ్లుెచ్ఛశూన్యాం చ పృథివీం త్రిరాత్రేణ కరిష్యతి || 59

నిర్ల్మేచ్ఛాం వసుధాం కృత్వా చాంతర్ధానం కరిష్యతి | అరాజకా చ వసుధా దస్యుగ్రస్తా భవిష్యతి || 60

ఈ విధముగా కలియుగమున సమస్తము వ్లుెచ్ఛమయము కాగా వృక్షములు హస్త ప్రమాణముననే ఉండును. మానవులు బోటన వ్రేలియంత ఎత్తు మాత్రముందురు.

అప్పుడు విష్ణుయశుడని బ్రాహ్మణునికి నారాయణుని అంశాశముతో కల్కియను పుత్రుడు కలుగును. అతడు మిక్కిలి బలవంతుడు. ఎత్తైన గుఱ్ఱమునెక్కి పొడవైన కరవాలముతో మూడు దినములలో ఈ భూమిపైనున్న వ్లుెచ్ఛులనందరిని వధించి అందర్ధానమునొందును. అందువలన భూమి అరాజకమై దస్యలు వశము కాగలదు.

స్థూలప్రమాణం షడ్రాత్రం వర్షదారాప్లుతా మహీ | లోక శూన్యా వృక్షశూన్యా గృహశూన్యా భవిష్యతి || 61

తతశ్చ ద్వాదశాదిత్యాః కరిష్యంత్యుదయం మునే | ప్రాప్నోతి శుష్కతాం పృథ్వీ సమా తేషాం చ తేజసా || 62

అప్పుడు ఆరు దినములు రాత్రింబగళ్ళు కుండపోతగా వర్షము కురియును. దానివలన ఇండ్లు, చెట్లు, అన్ని కూడా పూర్తిగా మునిగిపోవును. ఈరువాత ద్వాదశాదిత్యులందరు ఉదయించినందువలన ఆ ఎండచే భూమియంతయు ఎండిపోవును.

కలేగతౌ చ దుర్థర్షే సంప్రవృత్తే కృతే యుగే | తపస్సత్య సమాయుక్తో ధర్మః పూర్ణో భవిష్యతి || 63

తపస్వినశ్చ ధర్మిష్ఠా వేదజ్ఞా బ్రాహ్మణా భువి | పతివ్రతాశ్చ ధర్మిష్ఠా యోషితశ్చ గృహే గృహే || 64

రాజానః క్షత్రియాః సర్వే విప్రభక్తాః స్వధర్మిణః | ప్రతాపవంతో ధర్మిష్ఠాః పుణ్యకర్మరతాః సదా || 65

వైశ్యా వాణిజ్యనిరతాః విప్రభక్తాశ్చ ధార్మికాః | శూద్రాశ్చ పుణ్యశీలాశ్చ ధర్మిష్ఠా విప్రసేవినః || 66

విప్రక్షత్రవిశాం వంశా విష్ణు యజ్ఞపరాయణాః | విష్ణుమంత్రరతాః సర్వే విష్ణుభక్తాశ్చ వైష్ణవాః || 67

శ్రుతిస్మృతి పురాణజ్ఞా దర్మజ్ఞా ఋతుగామినః | లేశో నాస్తి హ్యధర్మాణాం ధర్మపూర్ణే కృతే యుగే || 68

కలియుగము తరువాత కృతయుగము వచ్చును. అప్పుతు తపస్సు, సత్యములతో ధర్మము పరిపూర్ణము కాగలదు. బ్రాహ్మణులు వేదజ్ఞులై ధర్మిష్ఠులై తపస్సు నాచరింతురు. స్త్రీలందరు ధర్మము కలిగి పతివ్రతలై యుందురు రాజులు తమ తమ ధర్మముల నాచరించుచు పుణ్యకర్మలు చేయుచుందురు. వైశ్యులు, శూద్రులు తమ తమ ధర్మములననుసరించి పుణ్యకర్మలు చేయుచుందురు. వైష్ణవులందరు విష్ణుమంత్రమును జపించుచు విష్ణుయజ్ఞములనాచరింతురు. అందరు శ్రుతిస్మృతి పురాణముల చదువుచు ధర్మకార్యముల నాచరింతురు. ధర్మము సంపూర్ణముగానుండి కృతయుగమున అధర్మము లేశమాత్రము కన్పించదు.

ధర్మస్త్రిపాచ్చ త్రేతాయం ద్విపాచ్చ ద్వాపరే స్మృతః | కలౌ ప్రవృత్తే పాదాత్మా సర్వలోపస్తతః పరం || 69

త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతో నుండగా ద్వాపరమున రెండు పాదములతో, కలియుగమున ఒకే పాదమున ఉండును. తరువాత సమస్త ధర్మలోపము జరుగును.

వారాః సప్తయథా విప్ర తిధయః షోడశ స్మృతాః | యథా ద్వాదశ మాసాశ్చ ఋతవశ్చ షడేవ హి || 70

ద్వౌ పక్షౌ చాయనే ద్వేచ చతుర్భిః ప్రహరై ర్దినం | చతుర్భిః ప్రహరై రాత్రిః మాసః త్రింశద్దినైస్తథా || 71

వర్షః పంచవిధో జ్జేయః కాలసంఖ్యాం నిబోధమే | యథా చాయాంతి యాంత్యేవ తథా యుగ చతుష్టయం || 72

వర్షే పూర్ణే నరాణాం చ దేవానాం చ దివానిశం | శతత్రయే షష్ఠ్యధికే నరాణాంచ యుగే గతే ||

దేవానాం చ యుగోజ్ఞేయః కాలసంఖ్యావిదాం మతః || 73

మన్వంతరం తు దివ్యానాం యుగానామేకసప్తతిః | మన్వంతరసమం జ్ఞేయం చేంద్రాయుః పరికీర్తితం || 74

అష్టావింశతిమే చేంద్రేగతే బ్రహ్మం దివానిశం | అష్టోత్తరే వర్షశ##తే గతే పాతో విధేర్భవేత్‌ || 75

కాల ప్రమాణమిట్లున్నది.

వారములు ఆరు కలవు. అట్లే ప్రతిపదాదితిథులు పదహారు కలవు. (ప్రతిపత్‌ నుండి చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అనునవి).

సంవత్సరములో ఉత్తర, దక్షిణాయనములు రెండు, నాలుగుజాములు దినము, నాలుగుజాములు రాత్రి ఎనమిది జాములు గల దినములు ముప్పదియైనచో నెల, నెలలో శుక్ల,కృష్ణపక్షములు రెండు. ఇట్టి సంవత్సరములు గడువగా, గడువగా యుగమగుచున్నది. అట్టి యుగములు నాలుగున్నవి.

మానవుని సంవత్సరము దేవతలకు ఒక దినము. మానవులకు మూడువందల అరువది యుగములు గడిచినచో దేవతలకది ఒక యుగము. దేవయుగములు డెబ్బదిఒకటి గడచినచో అది ఒక మన్వంతరము. ఇంద్రుని వయస్సు ఒక మన్వంతర కాలముండును. ఇరువది ఎనిమిది ఇంద్రుల వయస్సు బ్రహ్మకు ఒక దినమగును. ఆ బ్రహ్మకు నూటెనిమిది సంవత్సరములు పూర్తియైనచో అతని ఆయుర్దాయము పూర్తియగును.

ప్రళయః ప్రకృతోజ్ఞేయః తత్రాzదృష్టా వసుంధరా | జలప్లుతాని విశ్వాని బ్రహ్మవిష్ణుశివాదయః || 76

ఋషయోజీవినః సర్వే లీనా కృష్ణే పరాత్పరే | తత్రైవ ప్రకృతిర్లీనా తేన ప్రాకృతికో లయః || 77

లయే ప్రాకృతికేzతీతే పాతే చ బ్రహ్మణో మునే | నిమేషమాత్రః కాలశ్చ కృష్ణస్య పరమాత్మనః || 78

ఏవం నశ్యంతి సర్వాణి బ్రహ్మాండాన్యఖిలాని చ | స్థితౌ గోలోకవైకుంఠౌ శ్రీకృష్ణశ్చ సపార్షదః || 79

నిమేషమాత్రః ప్రళయో యత్రవిశ్వం జలప్లుతం | నమేషానంతరే కాలే పునః సృష్ఠిః క్రమేణ చ || 80

బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తియైనచో అప్పుడు ప్రాకృతప్రళయము సంభవించును. ఆ ప్రళయమున భూమి కనిపింపదు. లోకములన్నియు జలమున మునిగిపోవును. అప్పుడు బ్రహ్మవిష్ణు, శివాదిదేవతలు, మునులు, జీవులన్నియు పరాత్పరుడైన శ్రీకృష్ణునియందు లీనమగును. ప్రకృతియంతయు పరమాత్మయందు లయము చెందును కావున అది ప్రాకృతిక లయము. బ్రహ్మదేవుని జీవితకాలము లేక ప్రాకృతిక లయ కాలము పరమాత్మయగు శ్రీకృష్ణదేవునకు ఒక నిమేషకాలము.

ఈ విధముగా సమస్తలోకముల సమస్తజీవులు నశించుచుందురు. గోలోకము వైకుంఠము మాత్రము శాశ్వతముగానుండును అచ్చట శ్రీకృష్ణపరమాత్మ తన అనుచరులతో శాశ్వతముగా నుండును.

పరమాత్మయొక్క నిమేషకాలమువరకు ప్రళయముండును. అటుపిమ్మట సృష్టి మరల ప్రారంభమగును.

ఏవం కతివిధా సృష్ఠిః కతివిధోzపివా | కతికృత్వో గతాzయాతః సంఖ్యాం జానాతి కః పుమాన్‌ || 81

సృష్టినాంచ కళానాం చ బ్రహ్మాండానాం చ నాదర | బ్రహ్మాదీనం చ విధ్యండే సంఖ్యాం జానాతి కః పుమాన్‌ || 82

ఈ విధముగా అనేక సృష్టిలయములు జరిగినవి. ఈసృష్టిలయముల సంఖ్య, బ్రహ్మాండముల సంఖ్య బ్రహ్మాది దేవతల సంఖ్య ప్రపంచమున ఎవరికిని తెలియదు.

బ్రహ్మాండానాం చ సర్వేషామీశ్వరశ్చైక ఏవ సః | సర్వేషాం పరమాత్మా చ శ్రీకృష్ణః ప్రకృతేః పరః || 83

బ్రహ్మదయశ్చ తస్యాంశాః తస్యాంశశ్చ మహావిరాట్‌ | తస్యాంశశ్చ విరాట్‌క్షుద్రః తస్యాంశా ప్రకృతిః స్మృతా || 84

స చ కృష్ణో ద్విధాభూతో ద్విభుజశ్చ చతుర్భుజః | చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయం || 85

బ్రహ్మాది తృణపర్యంతం సర్వం ప్రాకృతికం భ##వేత్‌ | యద్యత్ర్పాకృతికం సృష్టం సర్వం నశ్వరమేవ చ || 86

విధ్యేకం సృష్టిమూలం తత్సత్యం నిత్యం సనాతనం | స్వేచ్ఛామయం పరం బ్రహ్మ నిర్లిప్తం నిర్గుణం పరం || 87

బ్రహ్మాండములకు సమస్త జీవులకు ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అతడు ప్రకృతి కంటే అతీతుడు. బ్రహ్మాది దేవతలు ఆ పరమాత్మయొక్క అంశస్వరూపులు. అతని అంశాంశ స్వరూపము మహావిరాణ్మూర్తి. దానియొక్క అంశము విరాట్‌ స్వరూపము. విరాట్‌ స్వరూపము యొక్క అంశస్వరూపమే ఈ ప్రకృతి.

కృష్ణపరమాత్మ గోలోకమున ద్విభుజుడుగాను, వైకుంఠమున చతుర్భుజుడుగాను కనిపించును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు అంతయు ప్రకృతికి సంబంధించినది. ఈ ప్రకృతికి సంబంధించిన ప్రతిది కూడా నశించుచునేయున్నది. అదినశ్వరమైనది. ఈ సృష్టికంతయు మూలస్వరూపమనతగిన పరమాత్మ నిత్యము సనాతనము కూడ.

నిరుపాధిం నిరాకారం భక్తానుగ్రహ విగ్రహం | అతీయ కమనీయం చ నవీన ఘన సన్నిభం || 88

ద్విభుజం మురళీహస్తం గోపవేషం కిశోరకం | సర్వజ్ఞం సర్వసేవ్యంచ పరమాత్మానమీశ్వరం || 89

ఆ పరమాత్మ స్వేచ్ఛామయుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, నిరాకారి, అయినను భక్తులననుగ్రహించుటకై ఆకారమును ధరించినవాడు, మిక్కిలి అందగాడు, మేఘమువలె నల్లనివాడు రెండు భుజములు కలవాడు, మురళిని ధరించిన గొల్లవాడు, సర్వజ్ఞుడు, అందరిచే సేవించబడినవాడు, పరమాత్మ, ఈశ్వరుడు కూడ.

కరోతి ధాతా బ్రహ్మాండం జ్ఞానాత్మ కమలోద్భవః | శివోమృత్యుంజయశ్చైవ సంహార్తా సర్వతత్వవిత్‌ || 90

యస్యజ్ఞానాద్యత్తపసా సర్వేశః తత్సమో మహాన్‌ | మహావిభూతియుక్తశ్చ సర్వజ్ఞః సర్వదా స్వయం || 91

సర్వవ్యాపీ సర్వపాతా సదాతా సర్వసంపదాం | విష్ణుః సర్వేశ్వరః శ్రీమాన్‌ యస్యజ్ఞానాత్‌ జగత్పతిః || 92

మహామాయాచ ప్రకృతిః సర్వశక్తి సర్వశక్తిమతీశ్వరీ | యజ్ఞానాద్యస్య తపసా యద్భక్త్యా యస్య సేవయా || 93

సావిత్రీ వేదమాతా చ వేదాధిష్ఠాతృదేవతా | పూజ్యా ద్విజానాం వేదజ్ఞా యజ్ఞాత్‌ యస్యాశ్చ సేవయా || 94

సర్వ విద్యాధిదేవీ సా పూజ్య చ విదుషాం పురా | యత్సేవయా యత్తపసా యస్య జ్ఞానాత్‌ సరస్వతీ || 95

యత్సేవయా యత్తపసా ప్రదాత్రీ సర్వసంపదాం | ధనసస్యాధి దేవీ సా మహాలక్ష్మీః సనాతనీ || 96

యత్సవయా యత్తపసా సర్వవిశ్వేషు పూజితా | సర్వ గ్రామాధిదేవీ సా సర్వసంపత్ప్రదాయినీ || 97

సర్వేశ్వరీ సర్వవంద్యా సర్వేశం ప్రాప యా పతిం | సర్వస్తుతా చ సర్వజ్ఞా దుర్గా దుర్గతినాశినీ || 98

కృష్ణవామాంశ సంభూతా కృష్ణ ప్రేమాధి దేవతా | కృష్ణ ప్రాణాధికా ప్రేవ్ణూ రాధికా కృష్ణ సేవయా || 99

కమలమునుండి జన్మించిన వాడు. జ్ఞానస్వరూపుడు ఐన బ్రహ్మదేవుడు విశ్వములనన్నిటినీ సృష్టించును. సమస్త తత్వజ్ఞానము నెరిగినవాడు, మృత్యువును జయించినవాడు అగు శివుడు విశ్వసంహారము చేయుచున్నాడు. జ్ఞానమువలన, తపస్సువలన పరమాత్మతో సమానమైనవాడు, మహావిభూతులతోనున్నవాడు, సర్వజ్ఞుడు, విశ్వమంతయు వ్యాపించినవాడు, సమస్తసంపదలను ఇచ్చువాడు, సర్వేశ్వరుడైన విష్ణువు అందరిని రక్షించుచున్నవాడు.

ప్రకృతి సర్వశక్తులు కలది. ఈశ్వరి, మహామాయకూడ బ్రాహ్మణులకు పూజ్యురాలు,వేదలములకు అధిష్ఠానదేవత, వేదమలకు తల్లివంటిది సావిత్రీదేవి. విద్వాంసులందరిచే పూజింపతగిన దేవత సరస్వతి. పరమాత్మను సేవించి తపమాచరించి సర్వసంపదలను ఇవ్వగలిగిన దేవత మహాలక్ష్మి. ఆమె ధనధాన్యములకు అధిదేవత. అట్లే పరమాత్మకు సేవించి తపస్సుచేసి సమస్తలోకములందు పూజ్యురాలైన దుర్గాదేవి సమస్త గ్రామాధిదేవత. సమస్తసంపదలనిచ్చునది. అందరిచే స్తుతింపబడినది, సర్వజ్ఞురాలు దుఃఖములను పొగొట్టునది. శ్రీకృష్ణప్రేమకు అధిదేవత, ఆపరమాత్మ వామభాగమునుండి ఆవిర్భవించిన రాధికాదేవి శ్రీకృష్ణుని సేవించి ప్రేమించి అతని ప్రాణములకన్న మిన్నయైనది.

సర్వాధికం చ రూపం చ సౌభాగ్యం మానగౌరవం | కృష్ణవక్షస్థలస్థానం పత్నీత్వం ప్రాప సేవయా || 100

తపశ్చకార సా పూర్వం శతశృంగే చ పర్వతే | దివ్యం యుగసహస్రం చ నిరాహారాతికర్శితా || 101

కృశాం నిశ్వాసరహితాం దృష్ట్వా చంద్రకళోపమాం | కృష్ణో వక్షస్థలే కృత్వా రురోద కృపయా విభుః || 102

వరం తసై#్య దదౌ సారం సర్వేషామపి దుర్లభం | మమ వక్షస్థలే తిష్ఠ మయి తే భక్తి రస్త్యతి || 103

సౌభాగ్యేన చ మానేన ప్రేవ్ణూ వై గౌరవేణ చ | త్వం మే శ్రేష్ఠా పరం ప్రేవ్ణూ జ్యేష్ఠా త్వం సర్వయోషితాం || 104

వరిష్ఠా చ గరిష్ఠా చ సంస్తుతా పూజితా మయా | సంతతం తవ సాధ్యోzహం బాధ్యశ్చ ప్రాణవల్లభే || 105

రాధ శ్రీకృష్ణపరమాత్మను సేవించి అందరికంటే అందమైన రూపును, సౌభాగ్యమును, గౌరవమును, శ్రీకృష్ణుని వక్షస్థలమున స్థానమును పొందినది. శతశృంగపర్వతమున నిరాహారయై, నిశ్వాసరహితయై పరమాత్మను గురించి తపస్సుచేసి మిక్కిలి కృశించిపోయినందువలన శ్రీకృష్ణుడు ఆ రాధికను తన రొమ్మునకు హత్తుకొని దయతో స్త్రీలందరకు దుర్లభ##మైన వరమును ఆమెకిచ్చెను. ఓ రాధా! నీవెల్లప్పుడు నా వక్షస్థలముననే ఉండుము. నీ సౌభాగ్యము, ప్రేమ, గౌరవముల వలన స్రీలందరిలో నీవు గౌరవింపబడుదువు. నేను నీకెల్లప్పుడు అందుబాటులో ఉందును అనెను.

ఇత్యుక్త్వా జగతీనాథః చక్రే తచ్చేతనాం తతః | సపత్నీరహితం తాం చ చకార ప్రాణవల్లభాం || 106

యేషాం యాయాశ్చ దేవ్యో వై పూజితాస్తస్యసేవయా | తపస్యా యాదృశీ యాసాంతాసాం తాదృక్ఫలం మునే || 107

దివ్యవర్షసహస్రంచ తపస్తప్త్వా హిమాలయే | దుర్గా చ తత్పదం ధ్వాత్వా సర్వపూజ్యా బభూవహ || 108

సరస్వతీ తపస్తప్త్యా పర్వతే గందమాధనే | లక్షవర్షం చ దివ్యం చ సర్వ వంద్యా బభూవ హ || 109

లక్ష్మీర్యుగశతం దివ్యం తపస్తప్త్యా చ పుష్కరే | సర్వ సంపత్ర్పదాత్రీ సా చాzభవత్తస్య సేవయా || 110

సావిత్రీ మలయే తప్త్యా ద్విజపూజ్యా బభూవ సా | షష్టివర్షసహస్రం చ దివ్వం ధ్యాత్వా చ తత్పదం || 111

శతమన్వంతరం తప్తం శంకరేణ పురా విభో | శతమన్వంతరం చైవ బ్రహ్మణా తస్య భక్తితః || 112

శతమన్వంతరం విష్ణస్తస్త్వా పాతా బభూవ హ | శతమన్వంతరం ధర్మస్తప్త్వా పూజ్యో బభూవ హ || 113

మన్వంతరం తపస్తేపే శేషో భక్త్యా చ నారద | మన్వంతరం చ సూర్యశ్చ శక్రశ్చంద్రస్థథా గురుః || 114

దివ్యం శతయుగం చైవ వాయుస్తప్యా చ భక్తితః | సర్వప్రాణః సర్వపూజ్యః సర్వాధారో బభూవ సః || 115

ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు రాధాదేవిని తన ప్రియురాలుగా సపత్నీ రహితగా చేసెను.

ఏయే దేవతలు, పరమాత్మగురించి ఎంత తపస్సు చేసినారో వారి వారి తపస్సుననుసరించి ఫలితమును పొందినారు.

దుర్గాదేవి హిమాలయ పర్వతముపై వేయి దివ్యవర్షములు తపస్సు చేసి అందరికీ పూజనీయురాలైనది. సరస్వతీదేవి గంధమాదన పర్వతముపై లక్ష దివ్య వర్షములు తపస్సు చేసినది. లక్ష్మీదేవి పుష్కర తీర్థమున నూరు దివ్యయుగములు తపస్సు చేయగా, సావిత్రీదేవి మలయ పర్వతమున అరువై వేల దివ్య వర్షములు తపస్సుచేసి పూజనీయురాలైనది.

శంకరుడు, బ్రహ్మ, విష్ణువు, ధర్ముడు శతమన్వంతరములు పరమాత్మను గురించి తపస్సు చేయగా ఆదిశేషుడు ఒక మన్వంతరము, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు కూడా ఒక మన్వంతరము, వాయుము నూరు దివ్యయుగములు తపస్సు చేసి లోక పూజ్యులైరి.

ఏవం కృష్ణస్య తపసా సర్వే దేవాశ్చ పూజితాః| మనయో మనవా భూపా బ్రాహ్మణాశ్చైవ పూజితాః || 116

ఏవం తే కథితం సర్వం పురాణంచ తథాగమం | గురువక్త్రాద్యథా జ్ఞాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 117

ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేసి సమస్త దేవతలు, మునులు, రాజులు బ్రాహ్మణులు తదితరులు గౌరవమును పొందిరి.

నా గురువు వలన విన్న పురాణ విషయమును నాకు తెలిసినంతవరకు నీకు తెల్పితిని.

ఇతి శ్రీబ్రహ్మ వైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే

యుగతన్మాహాత్మ్య మన్మంతరకాలేవ్వరగుణ నిరూపణం నామ సప్తమోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సమయమున యుగము, దాని మహాత్మ్యము, మన్వంతర కాలము, ఈశ్వరుని గుణములను తెలుపు

ఏడవ అధ్యాయము సమాప్తపము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters