sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వావింశతితమోzధ్యాయః - బ్రహ్మదేవునకు ఇతర పుత్రుల జననము

సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను-

కతికల్పాంతర్శే తీతే స్రష్టుఃసృష్టివిధౌ పునః | మరీచిమిశ్రైర్మునిభిః సార్థం కంఠాద్బభూవ సః || 1

విధేర్నారదనామ్నశ్చ కంఠదేశాద్భభూవ సః | నారదశ్చేతి విఖ్యాతో మునీంద్రస్తేన హేతునా || 2

యః పుత్రశ్చేతసో ధాతుర్బభూవ మునిపుంగవః | తేన ప్రచేతా ఇతి చ నామ చక్రే పితామహః || 3

బభూవ ధాతుర్యః పుత్రః సహసా దక్షపార్శ్వతః | సర్వకర్మణి దక్షశ్చ తేన దక్షః ప్రకీర్తితః || 4

వేదేషు కర్దమః శబ్దః ఛాయాయాం వర్తతే స్ఫుటః | బభూవ కర్దమాద్బాలః కర్దమస్తేన కీర్తితః || 5

తేజోభేదే మరీచిశ్చ వేదేషు వర్తతే స్ఫుటం | జాతః సద్యోzతితేజస్వీ మరీచిస్తేన కీర్తితః || 6

క్రతుసంఘశ్చ బాలేన కృతో జన్మాంతరేzధునా | బ్రహ్మపుత్రేzపి తన్నామ క్రతురిత్యభిధీయతే || 7

ప్రధానాంగముఖం ధాతుః తతో జాతశ్చ బాలకః | ఇరస్తేజస్వివచనోzప్యంగిరాస్తేన కీర్తితః || 8

అతితేజస్విని భృగుర్వర్తతే నామ్ని శౌనక | జాతః సద్యోzతితేజస్వీ భృగుస్తేన ప్రకీర్తితః || 9

బాలోzప్యరుణవర్ణశ్చ జాతః సద్యోz తితేజసా | ప్రజ్వలన్నూర్ధ్వ తపసా చారుణిస్తేన కీర్తితః || 10

హంసా ఆత్మవశా యస్య యోగేన యోగినో ధ్రువం | బాలః పరమయోగీంద్రః తేన హంసీతి కీర్తితః || 11

వశీభూతశ్చ శిష్యశ్చ జాతః సద్యో హి బాలకః | అతిప్రియశ్చ ధాతుశ్చ వశిష్ఠస్తేన కీర్తితః || 12

సంతతం యస్య యత్నం చ తపస్సుబాలకస్యచ | ప్రకీర్తితో యతిస్తేన సంయుతః సర్వకర్మసు || 13

స్ఫుటస్తపస్సమూహశ్చ పులహస్తేన బాలకః | పులస్తపస్సమూహశ్చ యస్యాస్తి పూర్వజన్మనాం || 14

త్రిగుణాయాం ప్రకృత్యాం త్రిః విష్ణావశ్చ ప్రవర్తతే | తయెర్భక్తిః సమా యస్య తేన బాల్శో త్రిరుచ్యతే || 15

జటా వహ్నిశిఖారూపాః పంచ సంతి చ మస్తకే | తపస్తేజోభవా యస్య స చ పంచశిఖః స్మృతః || 16

అపాంతరతమే దేశే తపస్తేపేzన్య జన్మని | అపాంతరతమా నామ శిశోస్తేన ప్రకీర్తితం || 17

స్వయం తపః సమాప్నోతి వాహయేత్ర్పాపయేత్పరాన్‌ | వోఢుం సమర్థస్తపసి వోఢుస్తేన ప్రకీరితః || 18

తపసస్తేజసా బాలో దీప్తిమాన్‌ సతతం మునే | తపస్సు రోచతే చిత్తం రుచిస్తేన ప్రకీర్తితః || 19

కోపకాలే బభూవుర్యే స్రష్టురేకాదశస్మృతాః | రోదనాదేవ రుద్రాశ్చ కోపితాస్తేన హేతునా || 20

బ్రహ్మదేవుడు సృష్టి చేయదలచినప్పుడు నారదుడు మరీచి మహర్షి మొదలైన ఋషులతో కలసి బ్రహ్మ దేవుని కంఠము నుండి పుట్టెను.

బ్రహ్మ దేవుని యొక్క నారదమనే కంఠ ప్రదేశమునుండి పుట్టినందువలన ఆ మహర్షిని నారదుడని పిలిచిరి.

బ్రహ్మదేవుని దక్షిణపార్శ్వమునుండి పుట్టినందువలన సమస్తకర్మలు ఆచరించుటలో దక్షుడు కావున ఆ మునిని ''దక్షుడ'' నిరి.

వేదములలో కర్దమశబ్దము నీడ అను అర్థమున నున్నది. బ్రహ్మయొక్కకర్దమమునుండి (నీడ) నుండి పుట్టిన ముని ''కర్దముడ'' య్యెను.

వేదములలో మరీచి యనగా కాంతి. అందువలన బ్రహ్మనుండి పుట్టిన అతితేజస్వియైన మహర్షిని ''మరీచి'' అని పిలిచిరి.

క్రతువులెన్నో పూర్వజన్మమున అట్లే ఈ జన్మలోను చేసినందువలన బ్రహ్మపుత్రుడైన ఆ మహర్షిని ''క్రతువ'' ని పిలిచిరి.

ప్రధానమైన అంగము శిరస్సులేక ముఖము. 'ఇర' అనగా తేజస్వి. బ్రహ్మదేవుని ముఖమునుండి ఉద్భవించిన తేజస్వియైన కుమారుని ''అంగిరసు'' డని పిలిచిరి.

భృగువనగా మిక్కలి తేజస్సు కలవాడని అర్థము. బ్రహ్మ దేవుని యొక్క అతి తేజస్వియైన పుత్రుని ''భృగు'' మహర్షి యనిరి.

మంచి తేజస్పుగల బ్రహ్మ పుత్రులలో ఊర్ద్వమైన తపస్సుచే ప్రజ్వలించుచు అరుణ వర్ణముగల పుత్రుని ''అరుణి'' అని పిలిచిరి.

ఏ యోగి తనయోగశక్తిచే హంసలను లేక ప్రాణవాయువులను తనవశములోనికి తెచ్చుకొనెనో ఆ పరమయోగీంద్రుడైన బాలుడు 'హంసి' యని పేరు తెచ్చుకొనెను.

బాలుడు పుట్టగానే బ్రహ్మదేవునకు వశీభూతుడయ్యెను. మిక్కిలి ఇష్టమైన శిష్యుడుగా కూడ ఉండెను. ఆవిధముగా బ్రహ్మదేవునకు వశ##మై ఉన్నందువలన నాతడు వశిష్ఠుడుగా పరిగణింపబడెను.

ఏ బాలుడు ఎల్లప్పుడు తపస్సుపై వాంఛ కలిగియుండెనో సమస్త కర్మలను తన్ను తాను నిగ్రహించుకొని (యమించుకొని) చేయునో ఆ బాలుని 'యతి' అని పిలిచిరి.

పుల అనగా తపస్సముదాయము. పూర్వజన్మలలో చేసిన తపస్సముదాయము ఏబాలకునకు స్పష్టముగా నున్నదో అతనిని ''పులహుడ''నిరి.

త్రిగుణాత్మకమైన ప్రకృతిని 'త్రి' అని విష్ణువును 'అ' అని సంకేతముతో పిలుతురు. బ్రహ్మ పుత్రుడైన ఈ బాలకునకు విష్ణువుపై, ప్రకృతిపై సమానమైన భక్తి భావమున్నందువలన అతనిని అత్రి అని పిలిచిరి.

తపస్తేజమువలన పుట్టిన ఐదు శిఖలు అగ్నిశిఖల వలె ఎవరి శిరస్సుపై ఎల్లప్పుడు కన్పించునో ఆ మహర్షిని ''పంచశిఖుడ'' ని పిలిచిరి.

తనపూర్వజన్మలో అపాంతరతమమను దేశమున తపస్సు చేసినందువలన ఆ బాలునకునకు ''అపాంతరతముడ'' ని పేరుపెట్టిరి.

తాను స్వయముగా తపస్సు చేయుటే కాక ఇతరులకు కూడా తపఃఫలితము వహింపజేయువాడు లేక పొందించువాడు. అట్లే తపస్సును వహించు సామర్థ్యము కలవాడు కావున ఆ బాలకునికి ''వోఢు'' డని పేరు పెట్టిరి.

తన తపస్తేజస్సుతో ఎల్లప్పుడు వెలిగిపోవుచు ఉండును. అట్లే అతని మనస్సు తపస్సుపైననే రుచికలిగియుండును కావున ఆ బాలకుని ''రుచి'' అని పిలిచిరి.

బ్రహ్మదేవుడు రోదించినందువలనను, కోపగించిన సమయమున పుట్టిన కారణముచేతను ఆ పదకొండుమంది బాలురను రుద్రులని పిలిచిరి.

బ్రహ్మదేవుడు రోదించినందువలనను, కోపగించిన సమయమున పుట్టిన కారణముచేతను ఆ పదకొండుమంది బాలురను రుద్రులని పిలిచిరి.

శౌనక ఉవాచ - శౌనకుడిట్లు పలికెను -

రుద్రేష్వేకతమో బాలో మహేశ ఇతి మే భ్రమః | భవాన్‌ పురాణ తత్త్వజ్ఞః సందేహం ఛేత్తు మర్హతి || 21

ఓ సౌతి మహర్షీ! రుద్రులలో ఒకరిని మహేశుడని పిలుతురని భావించుచున్నాను. ఈ మహేశుడు బ్రహ్మదేవుని కంటె గొప్పవాడు కదా. మరి బ్రహ్మ పుత్రులలో ఎట్లు చేరెను? ఈ సందేహమును పురాణ తత్వములన్నీ తెలిసిన మీరు తీర్తురని భావింతును.

సౌతిరువాచ- సౌతి మమర్షి ఇట్లు పలికెను-

విష్ణుః సత్వగుణః పాతా బ్రహ్మా స్రష్టా రజోగుణః | తమోగుణాస్తే రుద్రాశ్చ దుర్నివారా భయంకరాః || 22

కాలాగ్ని రుద్రః సంహార్తా తేష్వేకః శంకరాంశకః | శుద్ధసత్వ స్వరూపశ్చ శివశ్చ శివదః సతాం || 23

అన్యే కృష్ణస్య చ కలాస్తావంశౌ విష్ణుశంకరౌ | సమౌ సత్వ స్వరూపౌ ద్వౌ పరిపూర్ణతమస్య చ || 24

ఉక్తం రుద్రోద్భవేకాలే కథం విస్మరసి ద్విజ | మాయయా మోహితాః సర్వే మునీనాం చ మతిభ్రమః || 25

లోకముల రక్షించు విష్ణువు సత్వగుణ సంపన్నుడు. సృష్టి చేయు బ్రహ్మదేవుడు రజోగుణయుక్తుడు, భయంకరులు దుర్నివారులు ఐన రుద్రులు తమోగుణ సంపన్నులు. ఆ రుద్రులలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు శంకరుని యొక్క అంశస్వరూపుడు. శివుడు శుద్ధమైన సత్వగుణ సంపన్నుడు. అతడు సజ్జనులకు మంగళకరుడు. మిగిలిన దేవతలందరు కృష్ణుని యొక్క అంశాంశస్వరూపులు. విష్ణువు, శంకరుడు అతని అంశరూపులు వారిద్దరు పరిపూర్ణుడైన ఆ కృష్ణపరమాత్మతో సమానులు. వారు సత్వ గుణసంపన్నులు.

ఈ విషయమునంతయు రుద్రోద్భవము గూర్చి చెప్పిన సందర్భమున నీకు చెప్పితిని. దానిని అప్పుడే మరచినట్లున్నావు. అందరు ఆ భగవంతుని మాయచే మోహితులగుచున్నారు. అందువలన మునులకు కూడ మతిభ్రమ జరిగినట్లున్నది.

సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః | సనత్కుమారో భగవాన్‌ చతుర్థో బ్రహ్మణః సుతః || 26

బ్రహ్మా స్రష్టుం పూర్వపుత్రానువాచ తే న సేహిరే | తేన ప్రకోపితో ధాతా రుద్రాః కోపోద్భవాః మునే || 27

సనకశ్చ సనందశ్చ తౌ ద్వావానందవాచకౌ | ఆనందితౌ చ బాలౌ ద్వౌ భక్తిపూర్ణతమౌ సదా || 28

సనాతనశ్చ శ్రీకృష్ణో నిత్యం పూర్ణతమః స్వయం | తద్భక్తః తత్సమః సత్యం తేన బాలః సనాతనః || 29

సనత్తు నిత్యవచనః కుమారః శిశువాచకః | సనత్కుమారం తేనేమం ఉవాచ కమలోద్భవః || 30

బ్రహ్మణో బాలకానాంచ వ్యుత్పత్తిః కధితా మునే | సాంప్రతం నారదాఖ్యానం శ్రూయతాం చ యధాక్రమం || 31

బ్రహ్మదేవునకు సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను నలుగురు పుత్రులు కలరు. బ్రహ్మదేవుడు సృష్టిచేయవలెనని తొలుత తన పుత్రులైన వీరికి చెప్పగా వారు వినిపించుకొనలేదు. అందువలన బ్రహ్మదేవుడు కోపించగా అప్పుడు రుద్రులు పుట్టిరి.

సనక, సనంద అను రెండు పదములు ఆనందార్థకములు. పరిపూర్ణభక్తిగల ఈ బాలురు సదా ఆనందముతో ఉన్నందువలన వారికి సనక, సనందులను పేరు కల్గినది.

నిత్యము పరిపూర్ణుడ్తెన శ్రీకృష్ణుడే సనాతనుడు. ఆ సనాతనుడైన కృష్ణునిపై భక్తిగలిగి ఉండుటేగాక అతనితో సమముగా ఉన్నందువలన ఆ బాలుని సనాతనుడని పిలిచిరి.

సనత్‌ అనగా నిత్యము, కుమారుడనగా శిశువు. ఎల్లప్పుడు కుమారుని వయస్సులోనే ఉండుటవలన ఆ శిశువును సనత్కుమారుడనిరి.

ఓ శౌనక మహర్షీ బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మహర్షి మొదలైన వారి పేర్ల వ్యుత్పత్తిని తెలిపితిని. ఇక ఇప్పుడు నారదుని విషయమును వినవలసినది.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి-శౌనక సంవాదే బ్రహ్మపుత్ర వ్యుత్పత్తి కథనం నామ ద్వావింశతితమః అధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతి శౌనకమహర్షుల సంవాదముగల బ్రహ్మ ఖండమున బ్రహ్మ పుత్రులయొక్క నామవ్యుత్పత్తిని తెలిపే

ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters