sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

షట్‌ చత్వారింశత్తమోzధ్యాయః - పరశురామగమనైతత్ఖండ శ్రవణ ఫలవర్ణన

నారాయణ ఉవాచ- నారాయణ ముని నారదునితో నిట్లనెను-

స్తుత్వాం తాం పర్శురామోzసౌ హర్షసంపుల్ల మానసః | స్తోత్రేణ హరి ణోక్తేన స తుష్టావ గణాధిపం || 1

పూజాం చకార భక్త్యాచ నైవేద్యై ర్వివిధైరపి | ధూపైర్దీపైశ్చ గంధైశ్చ పుషై#్యశ్చ తులసీం వినా || 2

సంపూజ్య భ్రాతరం భక్త్యా సరామః శంకరాజ్ఞయా| గురుపత్నీం గురుం నత్వా గమనం కర్తుముద్యతః || 3

పరశురాముడు సంతోషముతో దుర్గాదేవిని స్తుతించి అట్లే శ్రీహరి ఉపదేశించిన గణపతి స్తోత్రముచే అతనిని స్తుతించెను. ఇంకను భక్తిపూర్వకముగా ధూప, దీప, గంధ, పుష్ప, నైవేద్యములచే అతనిని పూజ చేసెను. కాని తులసిని మాత్రము గణాధిపతికి సమర్పించలేదు.

ఈ విధముగా పరశురాముడు తన గురువగు శంకరుని యొక్క ఆజ్ఞననుసరించి సోదరతుల్యుడగు గణపతిని పూజించి గురుపత్నియగు దుర్గాదేవికి, గురువైన శంకరునకు నమస్కారములు చేసి తన ఇంటికి వెళ్లపోయెను అని చెప్పెను.

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను-

పూజాం భగవతశ్చక్రే రామో గణపతేర్యదా| నైవేద్యైర్వివిధై పుషై#్పస్తులసీం చ వినా కథం || 4

తలసీ సర్వపుష్పాణాం మాన్యా ధన్యా మనోహరా | కథం పూజాం సారభూతాం న గృహ్ణాతి గణశ్వరః || 5

పరశురాముడు గణాధిపతికి తులసి తప్పమిగిలిన పుష్పములతో నైవేద్యములతో పూజచేసెనంటిరి కదా| సమస్త పుష్పములలో తులసి మిక్కిలి గొప్పనైనది. కదా. అట్టి తులసి లేక చేసిన పూజను గణపతి ఎట్లు స్వీకరించునో తెలుపుడని కోరెను.

నారాయణ ఉవాచ- నారాయణ మహాముని ఇట్లు పలికెను-

శ్రుణు నారద వక్ష్యేzహమితిహాసం పురాతనం | బ్రహ్మ కల్పస్య వృత్తాంతం నిగూఢం చ మనోహరం || 6

ఏకదా తులసీ దేవీ ప్రోద్భిన్న నవ¸°వనా | తీర్థం భ్రమంతీ తపసా నారాయణ పరాయణా || 7

దదర్శ గంగాతీరే సా గణశం ¸°వనాన్వితం | అతీవ సుందరం శుద్ధం సస్మితం పీత వాసనం || 8

చందనోక్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం | ధ్యాయంతం కృష్ణపాదాబ్జం జన్మమృత్యుజరాపహం || 9

జితేంద్రియాణాం ప్రవరం యోగీంద్రాణాం గురోర్గురుం | సురూపహార్యం నిష్కామం సకామా తమువాత హ || 10

ఓ నారదా! బ్రహ్మ కల్పమునకు చెందిన ఒక అందమైన ప్రాచీనేతిహాసమును నీకు చెప్పెదను వినుము.

ఒకప్పుడు నవ¸°వనమునందున్న తులసీదేవి నారాయణుని మనస్సులో తలపోయుచు పుణ్యక్షేత్రములను తిరుగుచుండెను. అచ్చట నొకనాడు గంగానదీతీరమున నవ¸°వనమున నున్న గణపతి కనిపించెను. అతడు తన శరీరమున అంతయు చందనమునద్దుకొని యుండెను. రత్నాలంకార శోభితుడు, చిరునవ్వుతోనున్న గణపతి చాల అందముగా కనిపించెను. కాని ఆ గణపతి జన్మను, మృత్యువును, ముసలితనమును పోగొట్టు శ్రీకృష్ణుని పాదపంకజములను ధ్యానించుచుండెను. అతడు ఇంద్రియముల జయించిన వారిలో శ్రేష్ఠుడు. యోగీంద్రశ్రేష్ఠులలో శ్రేష్ఠుడు. కామములు లేనివాడు అట్టి గణపతిని తులసి కామముతో చూచుచు ఇట్లు పలికెను.

తులస్యు వాచ- తులసీదేవి ఇట్లు పలికెను-

అహోధ్యాయసి కిం దేవ శాంతరూప గజాననం | కథం లంబోదరో దేహో గజవక్త్రం కథం తవ|| 11

ఏకదంతః కథం వక్త్రే వదాzముత్ర చ కారణం | త్యజ ధ్యానం మహాభాగ సాయంకాం ఉపస్థితః || 12

ఇత్యుక్త్వా తులసీదేవీ ప్రజహాస పునః పునః | పరం చేతసి దగ్ధా సా కామబాణౖః సుదారుణౖః || 13

గణశస్య ప్రధానాంగే దత్వా కించిజ్జలం మునే | జఘాన తర్జన్య గ్రేణ నిష్పందం కృష్ణమానసం || 14

బభూవ ధ్యానభగ్నం చ తస్య నారద చేతనం | దుఃఖ చ ధ్యాన భేదేన తద్విచ్ఛేదో హి శోకదః || 15

ధ్యానం త్యక్త్వా హరిం స్మృత్వా చాపశ్యత్కామినీం పురః | నవ¸°వన సంపన్నాం సస్మితాం కామపీడితాం || 16

లంబోదరశ్చ తాం దృష్ట్వా పురే వినయపూర్వకం |ఉవాచ సస్మితః శాంతః శాంతాం కామాతురాం వశీ || 17

శాంత రూపుడవగు గణపతీ !నీవు దేనిని గురించి మనస్సులో ధ్యానించుచున్నావు, నీ ఆకారము వికారముగా నున్నది. గజముయొక్క ముఖము, లంబోదరము, ఏకదంతము నీకెట్లు కలిగినచో వివరింపుము. నీవు నీ ధ్యానము వదలిపెట్టి ప్రపంచములోనికి రమ్ము . అప్పుడే సాయంకాలమైనది అని నర్మ గర్భితముగా మాటి మాటికి నవ్వుచు మన్మథబాణములచే బాధపడుచు అతని శిరస్సు పై కొద్దిగా నీటిని చల్లినది. అట్లే శ్రీకృష్ణుని తన మనస్సులో ధ్యానించు గణపతిని చూపుడు వేలుతో కొట్టినది.

ఓ నారదా! అందువలన గణపతి కి ధ్యానము భగ్నమైనచో దుఃఖము కలుగును కదా !అప్పుడు గణపతి శ్రీహరి మనసులో నొక్కమారు స్మరించుకొని ధ్యానమును వదలిపెట్టి ఎదురుగా అందముగానున్న తులసిదేవిని చూచెను. ఆ దేవి నవ¸°వనమున నున్నది. చిరునవ్వునవ్వుచు కామపీడితయై యుండెను.

లంబోదరుడగు గణపతి ఆత్మనిగ్రహముతో వినయపూర్వకముగా కామాతురయై యున్న తులసీదేవితో ఇట్లు పలికెను.

గణశ్వర ఉవాచ- గణశ్వరుడిట్లు పలికెను-

కత్వం వత్సే కన్యా మాతర్మాం బ్రూహి కిం శుభే | పాపదోzశుభదః శశ్వద్ధ్వానభంగస్తపస్వినాం || 18

కృష్ణః కరోతు కల్యాణం హంతు విఘ్నుం కృపానిధిః | తద్ధ్యాన భంగజాద్ధోషాన్నాశుభం స్యాత్తు తే శుభే || 19

గణశవచనం శ్రుత్వా తమువాచ స్మరాతురా | సస్మితం సకటాక్షం ద దేవం మధురయా గిరా || 20

ఓ తల్లీ నీవెవరవు ?నీ తండ్రి ఎవరు ?అను విషయముల వివరించుము. నీవు నా ధ్యాయమునెదులకు భంగము చేసితివి. తపస్వులు చేయు భంగము చేయుటవలన పాపములు కలుగును. అమంగళము కూడ కలుగును.

అందువలన దయానిధియగు శ్రీకృష్ణుడు నీకు మేలు చేయుగాక !అట్లే విఘ్నములనన్నిటిని తొలగించును గాక !ఆ శ్రీ కృష్ణధ్యానమును భంగము చేసెనను పాపము నీకు కలుగవద్దు. అను గణపతి మాటలు విని మన్మథబాణపీడితయైన తులసీదేవి నవ్వుచు మధురముగా ఇట్లు పలికెను.

తులస్యువాచ- తులసీ దేవి ఇట్లు పలికెను-

ధర్మాత్మజస్య కన్యాహమప్రౌఢా చ తపస్వినీ | తపస్యా మే స్వామినోzర్థే త్వం స్వామీ భవ మే ప్రభో || 21

తులసీ వచనం శ్రుత్వా గణశః శ్రీహరిం స్మరన్‌ | తామువాచ మహాప్రాజ్ఞః ప్రాజ్ఞాం మధురయా గిరా || 22

ధర్ముని పుత్రుడగు ధర్మధ్వజుడు నా తండ్రి . నేను కన్యకను. నేను భర్తకై తపస్సు చేయుచున్నందువలన నీవు నాకు భర్తవు కమ్ము అని పలికిన తులసియొక్క పలుకులు విన్న మహాప్రాజ్ఞుడు గణపతి తులసితో మధురముగా నిట్లు పలికెను.

గణశ ఉవాచ- గణపతి ఇట్లు పలికెను.

హే మాతర్నాస్తి మే వాంఛా ఘోరే దార పరిగ్రహే | దారగ్రహోహి దుఃఖాయ న సుఖాయ కదాచన|| 23

హరిభ##క్తేర్వ్యనాయశ్చ తపస్యానాశకారకః | మోక్షద్వార కపాటశ్చ భవబంధన పాశకః || 24

గర్భవాసకరః శస్వత్తత్వజ్ఞాన నికృంతకః | సంశయానాం సమారంభో యాస్త్యాజ్యో వృషలైరపి || 25

గేహోzయం కారణానాం చ సర్వమాయాకరండకం | సాహసానాం సమూహశ్చ దోషాణాం చ విశేషతః || 26

నివర్తస్వ మహాభాగే పశ్యాన్యం కాముకం పతిం | కాముకేనైవ కాముక్యాః సంగమో గుణవాన్భవేత్‌ || 27

ఓ తల్లీ !నాకు పెండ్లి చేసికొనవలెనను కోరిక లేదు. పెండ్లియనునది ఎల్లప్పుడు దుఃఖమును కలిగించునే కాని ఎన్నడును సుఖమును కలిగించదు. అది శ్రీహరి భక్తిని దూరము చేయును. తపస్సును నాశనము చేయును. మోక్షద్వారమునకు కవాటము వంటిది. సంసార బంధమును కలిగించును. గర్భవాసదుఃఖమును కలిగించును. తత్వజ్ఞానమును ఛేదించును. సంశయములన్నిటికి కారణభూతమైనది. దీనిని శూద్రులు కూడ దరిజేరనీయరు. సమస్త మాయలకు నిలయమైనది. సాహసకార్యములకు కారణమైనది. ముఖ్యముగా తప్పుడు పనులకు నిలయమైనది.

కావున ఓ పూజ్యురాలా !ఇట్టి సంసారము చేయవలెనను బుద్ధిని దూరము చేసికొనుము. లేకపోయినచో కాముకుడగు పురుషుని భర్తగా వరించుము. ఇద్దరు కాముకులు కలిసిననే చక్కగా నుండునని గణపతి పలికెను.

ఇత్యేవం వచనం శ్రుత్వా కోపాత్సా తాం శశాప హ | దారాస్తే భవితాz సాధ్వీ గణశ్వర న సంశయః || 28

ఇత్యాకర్ణ్య సురశ్రేష్ఠస్తాం శశాప శివాత్మజః | దేవి త్వమసురగ్రస్తా భవిష్యసి న సంశయః ||29

తత్పశ్చాన్మహతాం శాపాద్వృక్షస్వం భవితేతి చ | మహాతపస్వీత్యుక్త్వా తాం విరరామ చ నారద || 30

గణపతి పలికిన పలుకులు తులసి మిక్కిలి కోపించి ఓ గణస్వరా నీ భార్య తప్పక అందరి దగ్గరనుండునని శపించెను. గణపతి తులసి యొక్క శాపవచనములను విని తులసికి ప్రతి శాపమిచ్చెను.

ఓ దేవి! నీవు రాక్షసునకు వశమౌదువు. అట్లే ఆశరీరమును పరిత్యజించిన పిదప పెద్దల శాపమువలన వృక్షమై తపస్సు చేసికొనుచు ఉండెదవని ప్రతిశాపమిచ్చి ఊరకుండెను.

శాపం శ్రుత్వాతు తులసీ సా రురోద పునః పునః | తుష్టాన చ సురశ్రేష్ఠం స ప్రసన్న ఉవాచ తాం || 31

గణపతి పెట్టిన శాపమును వినగానే తులసీదేవి దుఃఖముచే ఏడ్వసాగెను. అప్పుడా దేవి గణపతిని స్తుతింపగా ప్రసన్నుడైన గణపతి ఆమెతో ఇట్లు పలికెను.

గణశ్వర ఉవాచ- గణపతి తులసీ దేవితో ఇట్లు పలికెను.

పుష్పాణాం సారభూతాం త్వం భవిష్యసి మనోరమే | కళాంశేన మహాభాగే స్వయం నారాయణ ప్రియా || 32

ప్రియా త్వం తర్వదేవానాం శ్రీకృష్ణస్య విశేశతః | పూజా విముక్తిదా నౄణాం మయా భోగ్యాన నిత్యశః || 33

ఇత్యుక్త్వా తాం సురశ్రేష్ఠో జగామ తపసే పునః | హరేరారాధనవ్యగ్రో బదరీసన్నిధిం య¸° || 34

ఓ తులసీ నీవు పుష్పములకన్నిటికి ప్రధానమైన దానవుగా కీర్తినందెదవు. నీ యొక్క అంశాంశవలన శ్రీమన్నారాయణుని ప్రేమపాత్రురాలవు కాగలవు. సమస్త దేవతలకు ఇంకను ప్రధానముగా శ్రీకృష్ణపరమాత్మకు పరేమ పాత్రురాలవు కాగలవు. నీ చేత చేయబడిన పూజ మానవులకు మోక్షమును కలిగించును. కాని నీచే నన్ను ప్రతిదినము ఆరాధింపకూడదు.

ఈ విధముగా గణపతి తులసితో పలికి తపస్సు చేసికొనుటకై శ్రీహరిని స్మరించుకొనుచు బదరీక్షేత్రమునకు పోయెను.

జగామ తులసీదేవీ హృదయేన విదూయతా | నిరాహారా తపసశ్చక్రే పుష్కరే లక్ష వర్షకం || 35

పశ్చాన్మునీంద్రశాపేన గణశస్య చ నారద | సా ప్రియా శంఖచూడస్య బభూవ సుచిరం మునే || 36

తతః శంకరశూలేన స మమారాసురేశ్వరః | సా కళాంసేన వృక్షత్వం యయో నారాయణప్రియా || 37

కథితశ్చేతిహాసస్తే శ్రుతో ధర్మముఖాత్పురా | మోక్షప్రదశ్చసారశ్చ పురాణన ప్రకీర్తితః || 38

తతః పరశురామోz సౌ జగామ తపసే వనం | ప్రణమ్య శంకరం దుర్గాం సంపూజ్య చ గణశ్వరః || 39

పూజితో వందితః సర్వైః సురేంద్ర మునిపుంగవైః | పార్వతీ శివసాన్నిధ్యే సుఖం తస్థౌ గణశ్వరః || 40

గణపతిచే శపింపబడిన తులసీదేవి బాధాతప్తహృదయముతో అక్కడి నుండి పుష్కరక్షేత్రమునకు పోయి లక్షసంవత్సరములు ఆహారము లేకుండ తపస్సు చేసెను.

తులసీదేవి గణపతి శాపముచే మరియు మహర్షి శాపముచే రాక్షసశ్రేష్ఠుడగు శంఖచూడునకు భార్యయైనది. ఆ శంఖ చూడుడు శంకరుడు ప్రయోగించిన శూలము వలన చనిపోగా తులసీదేవి తనయొక్క అంశాంశ##చే వృక్షముగా శ్రీమన్నారాయణుని ప్రియురాలుగా అయ్యెను.

నారదా !ధర్ముని వలన విన్న ఈ కథను నీకు తెలిసితిని. ఇది మోక్షమును కలిగించునని, సారభూతమైన పురాణమున చెప్పబడినది.

తరువాత పరశురాముడు శంకరునకు, దుర్గాదేవి నమస్కరించి, గణపతిని ఆదరించి తపస్సుచేసికొనుటకై అడవికిపోయెను. అట్లే సమస్త దేవతలు, మహర్షులు పూజించుచుండ గణపతి తన తల్లిదంత్రుల దగ్గరనే ఉండెను.

ఇదం గణపతేః ఖండం యః శ్రుణోతి సమాహితః | స రాజసూయయజ్ఞస్య ఫలమాప్నోతి నిశ్చితం || 41

అపుత్రో లభ##తే పుత్రం శ్రీ గణశ ప్రసాదతః ధీరం వీరం చ ధనినం గుణినం తిరజీవినం || 42

యసస్వినం పుత్రిణం చ విద్వాంసం సుకవీర్యం| జితేంద్రియాణాం ప్రవరం దాతారం సర్వసంపదాం || 43

సుశీలం చ సదాచారం ప్రశంస్యం వైష్ణవం లభేత్‌ | అహింసకం దయాళుం చ తత్వజ్ఞాన విశారదం || 44

ఈ గణపతి ఖండమును శ్రద్ధతో వినువాడు రాజసూయయాగ ఫలమును తప్పక పొందును. శ్రీగణశుని అనుగ్రహమువలన దీరుడు, వీరుడు, ధనవంతుడు, మంచి గుణములు కలవాడు, చిరంజీవి, యశస్వి, విద్వాంసుడు, కవీశ్వరుడు, జితేంద్రియుడు, గొప్పదానగుణము కలవాడు, సుశీలను, సదాచారసంపన్నుడు, మంచికీర్తి కలవాడు, విష్ణుభక్తుడు అహింసకుడు, దయగలవాడు, తత్వజ్ఞానవేత్త అగు పుత్రుని పొందును..

భక్త్యా గణశం సంపూజ్య వస్త్రాలంకార చందనైః | స్రుత్వా గణపతేః ఖండం మహావంధ్యా ప్రసూయతే || 45

మృతవత్సా కాకవంధ్యా బ్రహ్మన్‌ లభేద్ధ్రువం | అదూష్య దూషణ పరా శుద్ధాచైవ లభేత్సుతం || 46

సంపూర్ణం బ్రహ్మవైవర్తం శ్రుత్వా యల్లభ##తే ఫలం | తత్ఫలం లభేత్‌ మర్త్యః శ్రుత్వేదం ఖండముత్తమం || 47

వాంఛాం కృత్వా తు మనసిశ్రుణోతి పరమాస్థితః | తసై#్మ దదాతి సర్వేష్టం సురశ్రేష్ఠో గణశ్వరః || 48

శ్రుత్వా గణపతేః ఖండం విఘ్ననాశాయ యత్నతః | స్వర్ణయజ్ఞోపవీతం చ శ్వేతచ్ఛత్రం చ మాల్యకం || 49

ప్రదీయతే వాచకాయ స్వస్తికాన్‌ తిలలడ్డుకాన్‌ | పరిపక్వ ఫలాన్యేవ దేశకాలోద్భవాని చ || 50

గణపతిని వస్త్రము, అలంకారము, చందనము మొదలగు వానితో భక్తితో పూజించి ఈ గణపతిని ఖండమును వినవలెను. దానివలన సంతానము నశించుచున్న స్త్రీ గొడ్రాలైన స్త్రీ సంతానమును పొందును. దూషించతగని వారిని దూషించు స్త్రీ కూడ చక్కని సంతానమును పొందును.

బ్రహ్మవైవర్త మహాపురాణమునంతయు విన్నచో కలుగు ఫలము ఈ గణపతి కండమును వినినంతనే కలుగును. మనస్సులో ఒక కొరికను పెట్టుకొని శ్రద్ధగా ఈ ఖండమును విన్నచో గణపతి అతని కోరికనంతయు తీర్చును.

విఘ్నములు తొలగిపోవలెనను కోరికతో ఈ ఖండమును చదివించుకొని విన్నచో ఆ పాఠకునకు బంగారు యజ్ఞోపవీతమును, తెల్లని ఛత్రమును, పుష్పమాలము, స్వస్తికము అను వంటకమును నూవుల లడ్డూలను ఆయా దేశకారములందు దొరకు ఫలములను దానము చేయవలెను అని నారాయణ మహాముని నారద మునీంద్రునితో చెప్పెను.

ఇతి శ్రీ బ్రహ్మ మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయమ సంవాదే పరశురామగమనైతత్ఖండ శ్రవణ ఫల వర్ణనం నామ షట్చత్వారింశత్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండములో నారద నారాయణుమునుల సంవాదసమయమున తెల్పబడిన పరశురామగమనము, ఈ గణపతి ఖండమును విన్నచో కలుగు ఫలితములు గల

నలుబది యారవ అధ్యాయము సమాప్తము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండం సమాప్తం .

శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణమున మూడవదగు గణపతి ఖండము సమాప్తమైనది.

---------మంగళం మహత్‌ -------

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters