sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చత్వారింశత్తయోZధ్యాయః - భృగోః కైలాసగమనోపదేశము

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-

తం గృహీత్వా తదా విష్ణౌ వైకుంఠం చ గతే సతి| స పుత్రం చ సహస్రాక్షం జఘాన భృగునందనః || 1

కృత్వా యుద్ధం తు సప్తాహం బ్రహ్మస్త్రేణ ప్రయత్నతః | రాజా కవచ హీనోZయం స పుత్రశ్చ పపాత హ || 2

పతితే తు సహస్రాక్షే కార్తవీర్యార్జునః స్వయం | ఆజగామ మహావీరో ద్విలక్షౌహిణీయుతః || 3

సువర్ణరతమారుహ్య రత్నసార పరిచ్ఛదం | నానావస్త్రం పఠితో కృత్వా తస్థౌ సమరమూర్ధని || 4

సమరే తం పరశు రామో రాజేంద్ర చ దదర్శ హ | రత్నాంలంకార భూషాఢ్యై రాజేంద్రాణాం చ కోటిభిః || 5

రత్నాతపత్ర భూషాఢ్యాం రత్నాలంకార భూషితం | చందనోక్షిత సర్వాంగం సస్మితం సుమనోహరం || 6

రాజాదృష్ట్వా మునీంద్ర తమవరుహ్య రథాదహో | ప్రణమ్య రథమారూహ్య తస్థౌ నృపగణౖః సహా || 7

పుష్కరాక్షభూపతిని అతని పుత్రుని యాచించి మహాలక్ష్మీ కవచమునుగ్రహించి శ్రీమహావిష్ణువు వైకుంఠమునకు పోగా భార్గవనందనుడగు పరశురాముడు పుష్కరాక్షుని పుత్ర సహితముగా వధించెను. ఆ సమయమున భార్గవ రాముడు బ్రహ్మస్త్రముచే ఏడు దినములు యుద్ధము చేయగా కవచములు లేని పుష్కరాక్షుడు పుత్రులతో రణరంగమున పడిపోయెను.

సహస్రాక్షుడైన పుష్కరాక్ష మహారాజు రణరంగమున పడిపోగా కార్తవీర్యార్జునుడు స్వయముగా రెండు లక్షల అక్షౌహిణుల సైన్యముతో యుద్ధమునకు వచ్చెను. అతడు బంగారు రథమునెక్కి అందు వివిధాస్త్రముల నుంచుకొని రణరంగమునకు వచ్చెను. అచ్చట పరశురాముడు రత్నాలంకారములతోనున్న రాజేంద్రులతో కలిసియున్న కార్తవీర్యుని చూచెను.

కార్తవీర్య మహారాజు రత్నములున్న ఆతపత్రము, ఆభరణములు, అవయవములందు చందనమును ధరించెను. అతడు భార్గవరాముని చూచి తన రథమునుండి క్రిందకు దిగి బార్గవ రామునకు నమస్కరించి తన తోటి రాజులతో రథము నెక్కెను.

దదౌశుభాశిషం తసై#్మ రామశ్చ సమయోచితం | ప్రోవాచ చ గతార్థం తం స్వర్గం గచ్ఛేతి సానుగః || 8

ఉభయోః సేనయోర్యుద్ధమభవత్తత్ర నారద| పలాయితా రామశిష్యా బ్రాతరశ్చ మహాబలాః || 9

నృపస్య శరజాలేన రామః శస్త్రభృతాం పరః | న దదర్శ స్వసైన్యం చ రాజసైన్యం తథైవ చ || 10

చిక్షేప రామశ్చాగ్నేయం బభూవాగ్నిమయం రణ | నిర్వాపయామాస రాజా వారుణనైవ లీలయా || 11

చిక్షేపరామో గాంధర్వం శైల సర్పసమన్వితం | వాయవ్యేన మహారాజః ప్రేరయామాస లీలయా || 12

చిక్షేప రామో నాగాస్త్రం దుర్నివార్యం భయంకరం | గారుడేన మహారాజః ప్రేరయామాస లీలయా || 13

మాహేశ్వరం చ భగవాంశ్చిక్షేప భృగునందనః | నిర్వాపయామాస రాజా వైష్ణవాస్త్రేణ లీలయా || 14

బ్రహ్మస్త్రం చిక్షేపే రామో నృపనాశాయ నారద | బ్రహ్మాస్త్రేణ చ శాంతం తత్ప్రాణనిర్వాపణం రణ || 15

భార్గవరాముడు తనకు నమస్కరించిన కార్తవీర్యార్జునకు నీ అనుచరులతో కలసి స్వర్గమునకు పొమ్మని సమయోచితమైన ఆశీస్సులనొసగెను.

తరువాత రెండు సేనల మధ్య యుద్ధము జరిగెను. కార్తవీర్యార్జుడు ప్రయోగించిన బాణములకు తట్టుకొనలేక భార్గవ రాముని శిష్యులు , అతని సోదరుల రణరంగమునుండి పారిపోయిరి. అట్లే శస్త్రధారులలో శ్రేష్ఠుడగు భార్గవరాముడు కూడ కార్తవీర్యార్జునుని శరపరంపరలో మునిగియున్న తన సైన్యమును, కార్తవీర్యుని సైన్యమును చూడలేకపోయెను.

భార్గవ రాముడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించగా రణరంగమంతయు అగ్నిమయమయ్యెను. అప్పుడు కార్తవీర్యుడు వారుణాస్త్రమును ప్రయోగించి ఆగ్నేయాస్త్రముయొక్క మంటలను చల్లార్చెను. అప్పుడు పరశురాముడు గుట్టలు పాములతో నున్న గాంధర్వాస్త్రమును ప్రయోగింపగా కార్తవీర్యుడు దానిని వాయవ్యాస్త్రముచే అవలీలగా శాంతింపజేసెను. ఆ సమయమున పరశురాముడు మహాభయంకరమైన నాగాస్త్రమును ప్రయోగించగా కార్తవీర్యార్జునుడు గరుడాస్త్రముతో దానిని శాంతింపజేసెను. భార్గవరాముడు మహేశ్వరాస్త్రమును ప్రయోగింపగా కార్తవీర్యుడు దానిని వైష్ణవాస్త్రముతో శాంతింపజేసెను. ఆ సమయమున భార్గవ రాముడు కార్తవీర్యుని సంహరించుటకై బ్రహ్మాస్త్రమును వేయగా ఆ మహారాజు బ్రహ్మస్త్రమునే ప్రయోగించి పరశురాముని బ్రహ్మాస్త్రమును శాంతింపజేసెను.

దత్త దత్తం చ యచ్చూలమవ్యర్థం మంత్రపూర్వకం | జగ్రాహ రాజా పరశురామ నాశాయ సంయుగే || 16

శూలం దదర్శ రామశ్చ శతసూర్యం సమప్రభం | ప్రళయాగ్ని శిఖోద్రిక్తం దుర్నివార్యం సురైరపి |. 17

పపాత శూలం సమరే రామస్యోపరి నారద| మూర్చామవాప స భృగుః పపాత చ హరిం స్మరన్‌ || 18

పతితే తు తదా రామే సర్వే దేవా భయాకులా ః| ఆజగ్ము ః సమరం తత్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరాః || 19

శంకరశ్చ మహాజ్ఞానీ మహాజ్ఞానేన లీలయా | బ్రహ్మణం జీవయామాస తూర్ణం నారాయణాజ్ఞాయా || 20

భృగుశ్చ చేతసాం ప్రాప్య దదర్శ పురతః సురాన్‌ | ప్రణనామ పరం భక్త్యా లజ్జానమ్రాత్మ కంధరః || 21

రాజా దృష్ట్వా సురేశాంశ్చ భక్తి నమ్రాత్మకంధరః | ప్రణమ్య శిరసా మూర్ధ్నా తుష్టాత సురేశ్వరాన్‌ || 22

రాజగు కార్తవీర్యుడు తన గురువగు దత్తాత్రేయుడు తనకు ప్రసాదించిన అమోఘమైన శూలమును భార్గవరాముని సంహరించుటకై చెతబట్టెను. శతసూర్యులవంటి కాంతి గలది. ప్రళయ కాలమందలి బడబాగ్ని శిఖలవలె గొప్పనిదియు, దేవతలు కూడ జయించుటకు వీలుకాని ఆ శూలమును కార్తవీర్యార్జునుడు బార్గవరాముని సంహారమునకై మంత్ర పూర్వకముగా ప్రయోగించెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ప్రసాదించిన శూలముచే భార్గవ రాముడు మూర్ఛనొందెను. అప్పుడు బ్రహ్మ విష్ణు శివాది దేవతలు భయముతో అచ్చటకు విచ్చేసిరి. వారిలో మహాజ్ఞానము కల శంకరుడు తన జ్ఞానభోదక వాక్యములచే భార్గవ రాముని పునరుజ్జీవితుని జేసెను.

భార్గవ రాముడు తెలివి తెచ్చుకొనిన తర్వాత తన కెదురుగా నున్న దేవతలను చూచి భక్తితో తలవంచుకొనెను. కార్తవీర్యార్జుడు కూడ తనకెదురుగా నున్న దేవతలను చూచి భక్తితో తలవంచుకొని వారికి నమస్కరించి దేవతలనందరను స్తుతించెను.

తత్రాజగామ భగవాన్‌ దత్తాత్రేయో రణస్థలం | శిష్యరక్షా నిమిత్తేన కృపాళుర్భక్త వత్సలః |. 23

భృగుః పాశుపతాస్త్రం చ సో Zగ్రహీత్కోపసంయుతః | దత్తదత్తేన దృష్టేన బభూవ సంభితో భృగుః || 24

దదర్శ స్తంభితో రామో రాజానం రణ మూర్దని | నానాపార్షద యుక్తేన కృష్ణేనాZరక్షితం రణ || 25

సుదర్శనం ప్రజ్వలంతం భ్రమణం కుర్వతా సదా | సస్మితేన స్తుతేనైవ బ్రహ్మవిష్ణు మహేశ్వరైః || 26

గోపాల శతయుకైన గోపవేష విధారిణా| నవీన జలదాభేన వంశీహస్తేన గాయతా|| 27

ఆ సమయమున భక్తవత్సలుడగు దత్తాత్రేయస్వామి తన శిష్యుని రక్షించుకొనుటకు ఆ రణరంగమునకు వచ్చెను. అప్పుడు భార్గవ రాముడు మిక్కిలి కోపముతో పాసుపతాస్త్రమును బయటకు తీసెను. అందువలన కార్తవీర్యుడు దత్తాత్రేయస్వామి ఇచ్చిన విద్యచే భార్గవ రాముడు స్తంభింపజేసెను. భార్గవ రాముడు అనేక అనుచరులతో అచ్చట నున్న కృష్ణునిచే రక్షింపబడుచున్న రాజును చూచెను. ఆ కృష్ణుడు జ్వలించుచున్న సుదర్శన చక్రమును చేత ధరించి బ్రహ్మాది దేవతలచే నుతుంపబడుచుండెను. ఇంకను అతడు గొల్లవాని వేషమున సహచరులగు గొల్లలు వెంటరాగా నవీన నీరద శ్యాముడై చిరునవ్వుతో మురళిని చేతబట్టుకొని మ్రోగించుచుండెను.

ఏతస్మిన్నంతరే తత్ర వాగ్భభూవాశరీరణీ | దత్తేన దత్తం కృష్ణస్య కవచం పరమాత్మనః || 28

రాజ్ఞోZస్తి దక్షిణ బాహౌ సద్రత్నఘటికాన్వితం | గృహీత కవచే శంభౌ భిక్షయా యోగినాం గురౌ || 29

తదా హంతుం నృపం శక్తో భృగుశ్చేతి చ నారద | శ్రుత్వా Zశరీరిణీం వాణీం శంకరో ద్విజరూపధృక్‌ || 30

భిక్షాం కృత్వాతు కవచమానీయ చ నృపస్య చ | శంభునాభృగవే దత్తం కృష్ణస్య కవచం చ యత్‌ || 31

ఆ సమయమున ఒక శరీరవాణి వినిపించినది.

మహారాజగు కార్తవీర్యుని దక్షిణ భుజమున దత్తాత్రేయ స్వామి ప్రసాదించిన శ్రీకృష్ణకవచమున్నదనియు, దానిని యోగి శ్రేష్ఠుడగు శంకరుడు కార్తవీర్యుని యాచన చేసి తీసికొన్నచో మాత్రమే బార్గరాముడు కార్తవీర్యుని సంహరింపగలడని చెప్పెను. ఆఅశరీరవాణిని విన్న శంకరుడు బ్రహ్మణవేషమున రాజు దగ్గరకు పోయి కవచమును యాచించి ఆ శ్రీకృష్ణకవచమును భార్గరామునకిచ్చెను.

ఏతస్మిన్నంతరే దేవా జగ్ముః స్వస్థానముత్తమం | ప్రత్యువాచాపి పరశురామో సమరే నృపం || 32

అప్పుడు దేవతలందరు తమ తమ స్థలములకు పోగా పరశురాముడు రణరంగముననున్న కార్తవీర్యునితో ఇట్లనెను.

పరశురామఉవాచ- పరశురాముడిట్లు పలికెను-

రాజేంద్రోత్తిష్ఠ సమరం కుర సాహసపూర్వకం | కాలభేదే జయో నౄణాం కాలభేదే పరాజయః || 33

అధీతం విధివద్దత్తం కృత్స్నా పృథీ సుశాసితా| సమ్యక్కృతశ్చ సంగ్రామస్త్వయాZహం మూర్ఛితో Zధునా || 34

జితాః సర్వేచ రాజేంద్రా లీలయా రావణో జితః | జితోZహం దత్తశూలేన శంభువా జివితః పునః || 35

రామస్య వచనం శ్రుత్వా రాజా పరమ ధార్మికః | మూర్ధ్నా ప్రణమ్య తం భక్త్యా యథార్థోక్తిమువాచ హ|| 36

ఓ మహారాజా !సాహసముతో యుద్ధమును చేయుము. మానవులకు అప్పుడప్పుడు జయము కలుగును. పరాజయము కూడ కలుగుచుండును. నీవు చక్కగా వేదములను అధ్యయనము చేసితివి. సమస్త భూమిని పరిపాలించితివి. యుద్దమును కూడ చక్కగా చేసినందువలననే నేను యుద్ధమున మూర్ఛపొందితిని. అట్లే నీవు రాజేంద్రులందరను జయించితివి. నన్ను కూడ దత్తాత్రేయస్వామి నాకు అనుగ్రహించిన శూలముచే మూర్ఛనొందితివి. తరువాత పరమశివుడు నన్ను పురర్జీవితుని చేసెననెను.

అప్పుడు పరమ ధార్మికుడు కార్తవీర్యుడు పరశురాముని మాటలను విని మాహామునికి భక్తితో ప్రణమిల్లి యథార్థవచనముల నిట్లు చెప్పసాగెను.

రాజోవాచ- రాజగు కార్తవీర్యుడు ఇట్లు పలుకసాగెను.

కిమధీతం తథా దత్తం కావా పృథ్వీ సుశాసితా | గతాః కతివిధా భూపా మాదృశా ధరణీతలే || 37

బుద్ధిస్తేజో విక్రమశ్చ వివిధా రణమంత్రణా | శ్రీరైశ్వర్యం తథా జ్ఞానం దానశక్తిశ్చ లౌకికం || 38

ఆచారో వినయో విద్యా ప్రతిష్ఠా పరమం తపః | సర్వం మనోరమా సంగే గతమేవ మమ ప్రభో || 39

సాచ స్త్రీ ప్రాణతుల్యా మేసాధ్వీ పద్మాంశసంభవా | యజ్ఞేషు పత్నీ మాతేవ స్నేహా క్రీడితి సంగినీ || 40

ఆబాల్యాత్సంగినీ శశ్వచ్ఛయనే భోజనే రణ | తాం వినా ప్రాణహీనోZహం విషహీనో యధొరగాః || 41

త్వయా న దృష్టం యుద్ధం మే పురేయం శోచనా స్థితా | ద్వితీయా శోచనా విప్ర హతోZహం బ్రహ్మణన చ || 42

కాలే సింహః సృగాలం చ సృగాలః సింహమేవచ | కాలే వ్యాఘ్రం హంతి మృగో గజేంద్రం హరిణస్తథా || 43

మహిషం మక్షికా కాలే గరుడంచ తథోరగః | కింకరః స్తౌతి రాజేంద్రం కాలే రాజా చ కింకరం || 44

ఇంద్రంచ మానవః కాలే కాలే బ్రహ్మ మరిష్యతి | తిరోభూత్వా సా ప్రకృతిః కాలే శ్రీకృష్ణవిగ్రహే || 45

మరిష్యంతి సురాః సర్వే త్రిలోకస్థాశ్చరాచరాః | సర్వే కాలే లయం యాంతి కాలోహి దురతిక్రమః || 46

ఓ భార్గవ రామా! నేను చేసిన వేదాధ్యయనము గురించి దానము గురించి నేను పరిపాలించిన భూమి గురించి, నేను జయించిన రాజుల గురించి ప్రస్తావించితివి. కాని నాబుద్ధి, తేజస్సు, పరాక్రమము వివిధములైన యుద్ధ తంత్రములు , శ్రీ ఐశ్వర్యము, జ్ఞానము, దానశక్తి, ఆచారము, వినయము, విద్య, ప్రతిష్ఠ, తపస్సు. ఇవన్నియు నాభార్యయగు మనోరమ యున్నంతవరకే యున్నవి. ఆమె గతించిన తరువాత నా సర్వస్వము పోయినది.

ఆ మనోరమ నాకు ప్రాణములతో సమానమైనది. ఆమె పతివ్రత. లక్ష్మీయంశతో జన్మించినది. యజ్ఞములనాచరించునప్పుడు సహధర్మచారిణి, ప్రేమలో తల్లి వంటిది. నా బాల్యమునుండి శయ్యయందును, భోజనమందును, యుద్ధమునందును ఆమె

నన్ను అంటిపెట్టుకొన్నది. అట్టి నాభార్య లేనందు వలన విషములేని సర్పమువలె నేను చైతన్యము లేని వాడనైతిని. నా యుద్ధమును నీవింతవరకు చూడలేదు.

ఐనను సమస్తము కాలమునకు అధీనమైనది. ఒకప్పుడు సింహము నక్కను చంపును. అట్లే ఒకప్పుడు నక్క సింహమును చంపవచ్చును. అదే విధముగా ఒకానొకప్పుడు ఈగ దున్నపోతును చంపవచ్చును. పాము గరుత్మంతుని సంహరింపవచ్చును.

అట్లే భృత్యుడు రాజును పొగడినట్లు ఒక సమయములో రాజు భృత్యును పొగడవచ్చును. మానవుడు ఇంద్రుని స్తుతింపవచ్చును. ఇవన్నియు కాల మునకు అధీనమైనవి.

అదే విధముగా బ్రహ్మదేవుడు చనిపోవచ్చును. ప్రకృతి కూడ శ్రీకృష్ణుని యందు అంతర్ధానము కావచ్చును. దేవతలందరు ముల్లోకములలోనున్న చరాచరప్రపంచమంతయు కాలమందు లీనమై పోవును అందువలన కాలము ఎవరికిని దాటరానిదని నారాయణుడు పలికెను.

కాలస్య కాలః శ్రీకృష్ణః స్రష్టుః స్రష్టా యధేచ్ఛయా | సంహర్తా చైవ సంహర్తు| పాతుః పాతా పరాత్పర ః || 47

మహాస్థూలాత్‌ స్థూలతమః సూక్ష్మాత్‌ సూక్ష్మతమః కృశః | పురాణః పరమః కాలః కాలస్స్యాత్కాల భేదకః || 48

యస్య లోమాని విశ్వాని సపుమాంశ్చ మహావిరాట్‌ | తేజసా |షోడశాంశశ్చ కృష్ణస్య పరమాత్మనః || 49

తతః క్షుద్ర విరాడ్‌ జాతః సర్వేషాం కారణం పరం | యః స్రష్టాః చ స్వయం బ్రహ్మ యన్నాభికమలోద్భవః || 50

నాభేః కమల దండస్య యోZ0తం న ప్రాప యత్నతః | భ్రమణాల్లక్షవర్షం చ తతః స్వస్థాన సంస్థితః || 51

తపశ్చక్రే తతస్తత్ర లక్షవర్షం చ వాయుభుక్‌ | తతో దదర్శ గోలోకం శ్రీకృష్ణం చ సపార్షదం ||52

గోపగోపీ పరివృతం ద్విభుజం మురళీధరం | రత్నసింహాసనస్థంచ రాధావక్షఃస్థల స్థితం || 53

దృష్ట్వా Zనుజ్ఞాం గృహీత్వా చ ప్రణమ్య చ పునః పునః | ఈశ్వరేచ్ఛాం చ విజ్ఞాయ స్రష్టుం సృష్టిం మనోదధే || 54

అట్టి కాలమునకే కాల స్వరూపుడు శ్రీకృష్ణుడు, అతడు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సృష్టించినవాడు. లోక సంహార కారకుడగు రుద్రుని సంహరించువాడు. అట్లే లోక పాలకులను పరిపాలించువాడు పరాత్పరుడు. స్థూలపదార్థముల కంటె స్థూలస్వరూపము కలవాడు. సూక్ష్మ రూపములలో సూక్ష్మరూపుడు . అతడు పురాణమూర్తి. పరమకాలరూపుడు. కాలభేదమును కలిగించువాడు. ఈ విశ్వములన్నియు పరాత్పరుడైన ఆ శ్రీకృష్ణుని యొక్క రోమకూపములందు అణగి మణగి యున్నవి.

మహావిరాడ్రుపము ఆ శ్రీకృష్ణ పరమాత్మయోక్క పదునారవ భాగము. ఆ మహా విరాట్స్వరూపుని నుండి ఈ విశ్వసృష్టి కంతయు మూలరూపుడగు క్షుద్ర విరాట్పురుషుడు (నారాయణుడు) ఉద్భవించెను. అతని యొక్క నాభికమలమునుండి సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఉద్భవించెను. అతడు లక్ష సంవత్సరములు తిరిగి చూచినను, క్షుద్రవిరాట్పురుషుని నాబియందలి కమలదండము యొక్క చివరను మాత్రము చూడలేకపోయెను.

ఆ బ్రహ్మదేవుడు వాయువును మాత్రము ఆహారముగా గొని తపస్సు చేసి శ్రీకృష్ణుని దర్శించుకొనెను.

ఆ పరమాత్మ గోపకులు గోపికాస్త్రీలతో కలసియుండెను. అతడు రెండు చేతులు కలవాడు. మురళిని ధరించెను. రత్న సింహసనమున కూర్చుండి రాదాదేవి వక్షస్థలమున నుండెను.

అట్టి పరమాత్మను బ్రహ్మ దర్శించుకొని అతనికి నమస్కారములు చేసి అతని అనుజ్ఞను పొంది పరమాత్మయొక్క అభిప్రాయము ననుసరించి విశ్వసృష్టి చేయుటకు సంకల్పించెను.

యః శివః సృష్టిసంహర్తా స చ స్రష్టుర్లలాటజః | విష్ణుః పాతా క్షుద్రవిరాట్‌ శ్వేత ద్వీప నివాసకృత్‌ || 55

సృష్టి కారణ భూతాశ్చ బ్రహ్మ విష్ణు మహేశ్వరాః | సంతి విశ్వేషు సర్వేషు శ్రీకృష్ణస్య కళోద్భవాః || 56

తేZపి దేవా ః ప్రాకృతికాః ప్రాకృతశ్చ మహావిరాట్‌ | సర్వ ప్రసూతిః ప్రకృతిః శ్రీకృష్ణః ప్రకృతేః పరః || 57

న శక్తః పరమేశోZపి తాం శక్తిం ప్రకృతిం వినా | సృష్టిం విధాతుం మాయోశో న సృష్టిర్మాయయా వినా || 58

సా చ కృష్ణే తిరోభూయా సృష్టి సంహార కారకే | సా Zవిర్భూతా సృష్టికాలే సా చ నిత్యా మహేశ్వరీ || 59

కులాలశ్చ ఘటం కర్తుం యథాZశక్తో మృదం వినా | స్వర్ణం వినా స్వర్ణకారః కుండలం కర్తుమక్షమః || 60

సా చ శక్తిః సృష్టికాలే పంచధా చేశ్వరేచ్ఛయా | రాధా పద్మా చ సావిత్రీ దుర్గాదేవీ సరస్వతీ || 61

ప్రపంచ సృష్టికారకుడగు పరమాత్మయొక్క నొసటినుండి సృష్టిసంహారకారకుడగు శివుడావిర్భవించెను. క్షుద్రవిరాడ్రూపుడగు విష్ణుమూర్తి శ్వేత ద్వీపమున నివసించు ఈ లోకమును రక్షించును. ఈ విధముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టికి కారణభూతులగుచున్నారు.

ఇట్టి త్రిమార్తులు శ్రీకృష్ణుని యొక్క అంశవలన జన్మనెత్తిరి. వీరు ప్రతి ప్రపంచమున ప్రత్యేకముగానున్నారు. వీరందరు ప్రాకృతుని నుండి ఉద్భవించినారు. ప్రాకృతుడు మహావిరాట్‌ స్వరూపుడు. ప్రకృతి సమస్త సృష్టికి కారణమగుచున్నది. ఇక శ్రీకృష్ణుడు ప్రకృతి కంటె అతీతుడు.

పరమాత్మయైనను ప్రకృతి యొక్క సహాయములేక సృష్టి చేయజాలడు. మాయాపూరిణియగు ప్రకృతి లేక సృష్టియే జరుగదు. ఆ ప్రకృతి సృష్టి స్థితి లయకారకుడగు శ్రీకృష్ణునిలో అంతర్భవించియుండి సృష్టికాలమున కనిపించుచున్నది. మహేశ్వరియగు ప్రకృతి నిత్యమైనది.

కుమ్మరి వాడు మన్ను లేకుండ కుండలనెట్లు చేయజాలడో, సర్ణకారుడు బంగారములేక ఆభరణముల నె¸్లుు చేయలేడో అట్లే పరమాత్మకూడ ప్రకృతిలేకపోయినచో సృష్టిని చేయజాలడు.

ఆ ప్రకృతి సృష్టిసమయమున రాధగా , మహాలక్ష్మీగా, సావిత్రిగా, దుర్గాదేవిగా, సరస్వతిగా ఐదు రూపములతో కనిపించుచున్నది.

ప్రాణాధిష్ఠాదేవీ యా కృష్ణస్య పరమాత్మనః | ప్రాణాధిక ప్రియతమా సారాధా పరికీర్తితా || 62

ఐశ్వర్యాధిష్ఠాతృదేవీ సర్వమంగళ కారిణీ | పరమానంద రూపా చ సా లక్ష్మీ పరికీర్తితా || 63

విద్యాధిష్ఠాతృదేవీ యా పరమేశస్య దుర్లభా | యా మాతా వేదశాస్త్రాణాం సా సావిత్రీ ప్రకీర్తితా || 64

బుద్ధ్యధిష్ఠాదేవీ యా సర్వశక్తి స్వరూపిణీ | సర్వ జ్ఞానాత్మికా సర్వా సా దుర్గా దుర్గనాశినీ || 65

వాగధిష్ఠాతృదేవీ యా శాస్త్రజ్ఞాన ప్రదా సదా| కృష్ణకంఠోద్భవా సాస్యాద్యా చ దేవీ సరస్వతీ || 66

పంచధాZ దౌ స్వయం దేవీ మూల ప్రకృతిరీశ్వరీ| తతః సృష్టిక్రమేణౖవ బహుదా కళయా చ సా || 67

యోషితః ప్రకృతే రంశాః పుమాంసంః పురుషస్యచ | మాయయా సృష్టికాలేచ తద్వినా న భ##వేద్భవః || 68

శ్రీకృష్ణ పరమాత్మయొక్క ప్రాణములకు అధిష్ఠాన దేవత, అతనికి ప్రాణములకంటె ప్రియిరాలైనది రాధా దేవి.

ఐశ్వర్యమునకు అధిష్ఠానదేవత , సమస్త మంగళములను కలిగించునది, పరమానంద స్వరూపయగు దేవి మహాలక్ష్మీ.

విద్యకు అధిష్ఠాన దేవత. పరమేశ్వరునకు కూడ దుర్లభ##మైనది. వేదములకు శాస్త్రములకు తల్లిగా నున్న దేవిని సావిత్రి యని పిలుతురు.

బుద్ధికి అధిష్ఠానదేవత సమస్త శక్తుల యొక్క స్వరూపము, సమస్త జ్ఞాన రూపిణియగు దేవి దుర్గ.

వాక్కులకు అధిష్టాన దేవత శాస్త్రజ్ఞానమునిచ్చినది. శ్రీకృష్ణుని కంఠమునుండి ఉద్భవించిన దేవత సరస్వతి.

పరమేశ్వరియగు మూల ప్రకృతి తొలుత ఐదు విధములుగా మారినది. తరువాత సృష్టిలో ఆ దేవియొక్క అంశలవలన అనేక స్త్రీలు కలిగిరి.

ఈ సృష్టియందున్న స్త్రీలందరు ప్రకృతి యొక్క అంశరూపము గలవారు. అట్లే పురుషులందరు పరమపురుషుని అంశలవలన పుట్టిరి. ఈ విధముగా మాయా రూపిణియగు ప్రకృతిలేనిచో సృష్టి యనునది జరుగదు.

సృష్టిశ్చ ప్రతివిశ్వేషు బ్రహ్మన్‌ బ్రహ్మోద్భవా సదా | పాతా విష్ణుశ్చ సంహర్తా శివః శశ్వచ్ఛివప్రదః || 69

దత్తదత్తం జ్ఞానమిదం రామ మహ్యం చ పుష్కరే | దీక్షాకాలే చ మాఘ్యాంచ ముని ప్రవర సన్నిధౌ || 70

ఇత్యుక్తా కార్తవీర్యశ్చ రామం నత్వా చ సస్మితః | ఆరురోహ రథం శీఘ్రం గృహీత్వా సశరం ధనుః || 71

ఓ నారదా! ప్రతి ప్రపంచమునందున్న బ్రహ్మదేవుడు సృష్టిని చేయగా విష్ణువు రక్షించుచున్నాడు. ఎల్లప్పుడును మంగళముల కలిగించు శివుడు సంహార కార్యము చేయుచున్నాడు. అందువలన శరీరముపై మమత్వమవసరము లేదను ఈ జ్ఞానమును నా గురువగు దత్తాత్రేయుడు పుష్కర క్షేత్రమున మాఘమాసమందు మునుల సన్నిధిలో ఇచ్చెనని కార్తవీర్యుడు పలికెను. తరువాత అతడు భార్గవరామునికి నమస్కరించి తన ధనుర్బాణములను తీసికొని రథమునెక్కెను.

రామస్తతో రాజసైన్యం బ్రహ్మాస్త్రేణ జఘాన యః | నృపం పాశుపతేనైవ లీలయా శ్రీహరింస్మరన్‌ || 72

ఏం త్రిస్సప్త కృత్వశ్చ క్రమేణ చ వసుంధరాం | రామశ్చకార నిర్భూపాం లీలయా చ శివం స్మరన్‌ || 73

గర్భస్థం మాతురంకస్థం శిశుం వృద్ధం చ మధ్యమం | జఘాన క్షత్రియం రామః ప్రతిజ్ఞా పాలనాయవై || 74

కార్తవీర్యశ్చ గోలోకం త్వగమత్కృష్ణ సన్నిధిం | జగామ తోషాత్పరశు రామశ్చ శ్రీహరిం స్మరన్‌ || 75

త్రిస్సప్త కృత్వో నిర్భూపాం మహీందృష్ట్వా మహేశ్వరః | రమణం తేన పరశురామం దృష్ట్వాచ కాతరం || 76

దేవాశ్చ మునయో దేవ్యః సిద్ధగంధర్వ కిన్నరాః | సర్వే చక్రుః పుష్పవృష్టిం రామమూబర్ధ్ని చ నారద || 77

స్వర్గే దుందుభయో నేదుర్హర్ష శబ్దో బభూవ హ | యశసాచైవ పరశురామస్యాపూరితం జగత్‌ || 78

బ్రహ్మా భృగుశ్చ శక్రశ్చ వాల్మీకిశ్చ్యవనస్తథా | జమదగ్నిర్బ్రహ్మలోకాదాజగామ ప్రహర్షితంః || 79

పులకాంచి సర్వాంగాః సానందాశ్చ సమన్వితాః | దూర్వాపుశ్పకరాః సర్వే కుర్వంతో మంగళాశిషః || 80

కార్తవీర్యార్జునుడు తన గురువగు దత్తాత్రేయుడు తెలిపిన జ్ఞానమును గురించి తెలిసిన తరువాత భార్గవరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రాజ సైన్యమును హతమార్చెను. అటుపిమ్మట శ్రీహరిని స్మరించుకొనుచు పాశుపతాస్త్రమును ప్రయోగించి కార్తవీర్యార్జునుని సంహరించెను.

ఈవిధముగా భార్గవరాముడు సంహారకారకుడగు శివుని స్మరించుచు భూమిపై నున్న రాజులందరిని ఇరువది యొక్క మార్లు సంహరించెను. చివరకు మాతృగర్భమున నున్న శిశువు, తల్లి ఒడిలోనున్న శిశువు, వృద్దుడు,మధ్య వయస్సులోనున్నవాడు, అనుభేదములేక క్షత్రియులనందరను తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకై చంపెను.

కార్తవీర్యార్జునుడు గోలోకమున నున్న శ్రీకృష్ణుని సన్నిధికి పోయెను. అప్పుడు పరశురాముడు శ్రీహరిని స్మరించుకొనుచు సంతోషముతో వెళ్ళిపోయెను. మహేశ్వరుడు పరశురాముడు ఇరువది యొక్క మార్లు భూమిపై నున్న రాజుల సంహరించిన గతిని తెలిసికొని సంతోషించెను. అట్లే మునులు, దేవతలు, దేవతాస్త్రీలు, సిద్దులు, గంధర్వులు, కిన్నరులు, అందురు పరశురామునిపై పుష్పవృష్టిని కురిపించిరి. అట్లే స్వర్గమున దుందుభులు మ్రోగినవి. అందరు సంతోషపడిరి. ఈ విధముగా పరశురామునని కీర్తి లోకమంతట ప్రసరించినది.

ఆ సమయమున బ్రహ్మదేవుడు, భృగుమహర్షి, ఇంద్రుడు, వాల్మీకి, చ్యవనమహర్షి, జమదగ్ని సంతోషముతో బ్రహ్మలోకమునుండి వచ్చిరి. వారందరు సంతోషముతో పులకించిన అవయవములు కలవారై చేతిలో దర్భలు, పుష్పములు ధరించి భార్గవరామునకు శుభాశీస్సుల నొసగిరి.

ప్రణనామ చ తాన్నమ్రో దండవత్పతితో భువి | క్రోడే చకార బ్రహ్మాzదౌ క్రమాత్తాతేతి సంవదన్‌ || 81

తమువాచాథ పరశురామం బ్రహ్మా జగద్గురుః | వేదసారం నీతియుతం పరిణామ సుఖావహాం|| 82

పరశురాముడు తన దగ్గరకు వచ్చిన బ్రహ్మాదులను చూచి భూమిపై వారికి సాష్టాంగ నమస్కారము సమర్పింపగా బ్రహ్మదేవుడతనిని తన దరిజేర్చుకొని తొలుత "నాయనా" అని పిలుచుచు వేదములయొక్క సార రూపమైనది, నీతితో కూడుకున్న మాటలనిట్లు పలికేను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-

శ్రుణు రామ ప్రవక్ష్యామి సర్వసంపత్కరం పరం | కాణ్వశాఖోక్తవచనం సత్యం వై సర్వసమ్మతం || 83

పూజ్యానామేవ సర్వేషా మిష్టః పూజ్యతమః పరః | జనకో జన్మదానాచ్చ పాలనాచ్చ పితా స్మృతః || 84

గరీయాన్‌ జన్మదాతుశ్చ సోzన్నదాతా పితా మునే | వినాzన్నం నశ్వరో దేహో నిత్యం చ పితురుద్భవః || 85

తయోః శతగుణం మాతా పూజ్యామాన్యాచ వందితా | గర్భధారణ పోషోభ్యాం సైవ ప్రోక్తా గరీయసీ || 86

తేభ్యః శతగుణం పూజోzభీష్టదేవః శ్రుతౌ శ్రుతః | జ్ఞాన విద్యామంత్రదాతాzభీష్టదేవాత్పరో గురుః || 87

గురువద్గురు పుత్రశ్చ గురుపత్నీ తతోzధికా| దేవే రుష్టే గురూ రక్షేద్గురౌ రుష్టే న కశ్చన || 88

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః | గురురేవ పరం బ్రహ్మ బ్రాహ్మణభ్యః ప్రియః పరః || 89

గురుర్‌ జ్ఞానం దదాత్యేవ జ్ఞానం చ హరిభక్తిదం | హరిభక్తి ప్రదాతా యః కో వా బంధుస్తతః పరః || 90

అజ్ఞాన తిమిరాచ్ఛన్నో జ్ఞానదీపం యతో లభేత్‌ | లబ్ద్వాచ నిర్మలం పశ్యోత్కోవా బంధుస్తతః పరః || 91

గురుదత్తం సుమంత్రం చ జప్త్యా జ్ఞానం తతోలభేత్‌ | సర్వజ్ఞత్వాచ్చ సిద్ధించ కోవా బంధుస్తతోzధికః || 92

సుఖం జయతి సర్వత్ర విద్యయా గురుదత్తయా | యయా పూజ్యోzపి జగతి కోవా బంధుస్తతోzధికః || 93

భార్గవరామా! సమస్త సంపదలనొసగునదియు, అందరకు సమ్మతమైనదియు, సత్యమైనదియు అగు కాణ్యశాఖయందు చెప్పబడిన విషయమును నీకు చెప్పెదను. పూజ్యులందరిలో అందరకు సమ్మతమైన పూజ్యుని గురించి చెప్పెదను.

జన్మ నిచ్చినందువలన తండ్రిని జనకుడందురు. అన్నము, వస్త్రము మొదలగునవి ఇచ్చినందువలన అతనిని పితయని అందురు.

జన్మనిచ్చిన తండ్రి కంటె అన్నమును పెట్టి పోషించిన తండ్రి గొప్పవాడు. ఎందువలనంటే అన్నము లేనిచో తండ్రివలన జన్మంచిన ఈ దేహము నశించిపోవును. జన్మనిచ్చిన తండ్రి, అన్నము పెట్టి పోషించిన తండ్రికంటె తల్లి నూరురెట్లెక్కువగా గౌరవింపదగినది. ఆమె గర్భమున ఉంచుకొని పెంచి పోషించినందువలన మిక్కిలి గౌరవింపదగినది.

తల్లి దండ్రులకంటెను ఇష్టదేవత చాల గొప్పనిది. జ్ఞానము, విద్య మంత్రముల నొసగు గురువు ఇష్టదేవత కంటె గొప్పవాడు. గురువుయొక్క పుత్రుని గురువు వలెనే గౌరవింపవలెను. గురువు యొక్క భార్యను గురుపుజ్ఞుని కంటె ఎక్కువగా గౌరవింపవలెను.

ఇష్టదేవతకు కోపము వచ్చినచో గురువు తన శిష్యుని రక్షించుకొనును. కాని గురువునకు కోపము వచ్చినచో ఆ శిష్యుని ఎవ్వరు కాపాడలేరు. గురువే చతుర్మఖ బ్రహ్మ. అతడే విష్ణుమూర్తి. ఆ గురువే మహేశ్వరుడు అతడు పరబ్రహ్మతో సమానుడు. అతనిని బ్రాహ్మణుల కంటె గొప్పగా మన్నింపవలెను. గురువు జ్ఞానమును, హరిభక్తిని కలిగించు జ్ఞానమును కలిగించును. శ్రీహరి భక్తిని కలిగించు గురువుకంటె గొప్ప బంధువు ఎవరు కాజాలరు. అజ్ఞానమను చీకటిని తొలగించి జ్ఞాన దీపమును ఇచ్చు గురువును మించిన బంధువు ఎవరు కాజాలరు. గురువు ఉపదేశించిన మంత్రమును జపించి జ్ఞానము పొందవచ్చును. అతడు సర్వజ్ఞుడు కాగలడు. సిద్ధులను పొందగలడు. గురువు నేర్పిన విద్య వలన అన్ని స్థలములందు జయమును పొంది గౌరవమును పొందును. అట్లి గురువును మించిన బంధువెవ్వరు ఉండబోరు.

విద్యాంధోవా ధనాంధోవా యోమూఢో న యజేద్గురుం | బ్రహ్మహత్యాదికం పాపం లభ##తే నాzత్ర సంశయః || 94

దరిద్రం పతితం క్షుద్రం నరబుధ్యా భ##జేద్గురం | తీర్థస్నాతోzపి న శుచిర్నాధికారీచ కర్మసు || 95

అభీష్టదేవః శ్రీకృష్ణో గురుస్తే శంకరః స్వయం | శరణం గచ్ఛ హే పుత్ర దేవపూజ్యతమం గురుం || 96

త్రిస్సప్తకృత్వో నిర్భూపా త్వయా పృథ్వీ కృతా యతః | ప్రాప్తా త్వయా హరేర్భక్తిస్తం శివం శరణం వ్రజ || 97

శివాం చ శివరూపం చ శివదం శివకారణం | శివారాధ్యం శివం శాంతం గురుం త్వం శరణం వ్రజ || 98

గోలోకనాథో భగవానంశేన శివరూపధృక్‌ | య ఇష్టదేవః స గురుస్తమేవ శరణం వ్రజ || 99

ఆత్మా కృష్ణః శివో జ్ఞానం మనోzహం సర్వజీవిషు | ప్రాణా విష్ణోస్సా ప్రకృతిస్సర్వ శక్తియుతా సుత || 100

జ్ఞానదం జ్ఞానరూపం చ జ్ఞానబోజం సనాతనం | మృత్యుంజయం కాలకాలం తం గురుం శరణం వ్రజ || 101

బ్రహ్మజ్యోతిస్స్వరూపం తం భక్తానుగ్రహ విగ్రహం | శరణం వ్రజ సర్వజ్ఞం భగవంతం సనాతనం || 102

ప్రకృతిర్లక్ష వర్షం చ తపస్తప్త్యా యమీశ్వరం | కాంతం ప్రియపతిం లేభే తం గురుం శరణం వ్రజ || 103

విద్యామదము కలవాడు లేక ధనమదము కల మూర్ఖుడు గురువును గౌరవింపనిచో అతనికి బ్రహ్మహత్యాది పాపములు తప్పక సంభవించును. గురువు దరిద్రుడైనను, పతితుడైనను, అల్పుడైనను అతడు మానసమాత్రుడని భావించి గౌరవింపనిచో అతడు ఎన్ని పుణ్యతీర్థములందు స్నానము చేసినను పవిత్రుడు కాజాలడు. అట్లే అతనికి పుణ్యకర్మలు చేయునధికారముండదు.

ఓ పరశురామా! నీఇష్టదేవత శ్రీకృష్ణుడు అట్లే నీ గురువు శంకరుడు. అందువలన దేవతలందరు గౌరవించు నీ గురువును నీవు శరణు వేడుము. నీవు ఈ భూమినంతయు తిరిగి ఇరువది యొక్క మార్లు ఇచట రాజులు లేకుండునట్లు చేసితివి. ఇదియంతయు నీ గురువును శరణు జొచ్చినందువలననే జరిగిది. అట్లే నీగురువుయొక్క అనుగ్రహమువలన శ్రీహరి భక్తిని పొందితివి. ఆ విధముగా శ్రీహరియొక్క భక్తిని ప్రసాదించిన నీ గురువగు శివుని శరణు వేడుము.

అతడు మంగళరూపుడు, మంగళమును కలిగించువాడు, మేలు కలిగించువాడు, శాంతరూపుడగు ఆ పరమశివుని సేవింపుము. అట్లే గోలోకనాథుడగు శ్రీకృష్ణుని యొక్క అంశస్వరూపుడు, నీయొక్క ఇష్టదేవత, అట్టి శంకరుని నీవు శరణువేడుము.

శ్రీకృష్ణుడు ఆత్మరూపుడు, శివుడు జ్ఞాన స్వరూపుడు, నేను (బ్రహ్మదేవుడు) మనోరూపుడను, విష్ణువునకు ప్రాణ స్వరూపురాలగు ప్రకృతి సమస్తశక్తులు గలది. వీరిలో జ్ఞానమును కల్గించును. జ్ఞానమును కల్గించును. జ్ఞానస్వరూపుడు, జ్ఞానకారణుడు, సనాతనుడు, కాలమునకు కాలరూపుడు, బ్రహ్మజ్యోతి స్వరూపుడు, భక్తానుగ్రహరూపుడు, ప్రకృతి లక్ష సంవత్సరములు తపస్సు చేసి శంకరుని భర్తగా పడసినది. అట్లి గురు రూపుడగు శంకరుని నీవు శరణువేడుము.

ఇత్యుక్త్వా మునిభిస్సార్థం జగామ కమలోద్భవః | రామశ్చ గంతుం కైలాసం మనశ్చక్రే చ నారద || 104

ఈ విధముగా బ్రహ్మదేవుడు పరశురామునతో పలికి మునులతో కలసి బ్రహ్మలోకమునకు పోయెను. అట్లే పరశురాముడు తన గురువగు శంకరుని దగ్గరకు పోవుటకు నిశ్చయించెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే భృగోః కైలాసగమనోపదేశోనా చత్వారింశత్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండములో నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన భార్గవరాముని కైలాసగమనోపదేశమను

నలుబదియవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters