sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏకోనచత్వారింశత్తమోZధ్యాయః - పరశురామునకు దుర్గతినాశినీ కవచం

నారదఉవాచ- నారదుడు ఈ విధముగా పలికెను-

కవచం కథితం బ్రహ్మస్పద్మాయాశ్చ మనోహరం | పరం దుర్గతి నాశిన్యాః కవచం కథయ ప్రభో || 1

పద్మాక్ష ప్రాణ తుల్యం చ జీవనం బలకారణం | కవచానాం చ యత్సారం దుర్గాసేవన కారణం || 2

ఓ నారాయణమునీ! మహాలక్ష్మీ కవచమును ఇంతవరకు చెప్పితిరి. ఇక దుర్గతినాశనియగు దుర్గాదేవి కవచమును నాకు చెప్పగలరు. ఇది దర్మాక్షునకు ప్రాణము వంటిది. బలమునకు కారణమైనది కావున నాకు వివరింపుడని కోరెను.

నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-

శ్రుణు నారద వక్ష్యామి దుర్గాయాః కవచం శుభం | శ్రీ కృష్ణేనేవ యద్దత్తం గోలోకే బ్రహ్మణ పురా || 3

బ్రహ్మ త్రిపుర సంగ్రామే శంకరాయ దదౌ పురా | జఘాన త్రిపురం రుద్రో యద్ధృత్వా భక్తిపూర్వకం || 4

హరో దదౌ గౌతమాయ పద్మాక్షాయ చ గౌతమః | యతో బభూవ పద్మాక్షః సప్తద్వీపేశ్వరో జయీ|| 5

యద్ధృత్వా పఠనాద్బ్రహ్మా జ్ఞానవాఞ్ఛక్తిమాన్‌ భువి| శివో బభూవ సర్వజ్ఞో యోగినాం చ గురు ర్యతః ||

శివతుల్యో గౌతమశ్చ బబూవ మునిసత్తమః || 6

నారద ! నీకిపుడు దుర్గాకవచమును చెప్పెదను. ఈకవచమును పూర్వకాలమున శ్రీకృష్ణుడు గోలోకమున బ్రహ్మదేవునకుపదేశించెను. త్రిపురాసుర సంహార సమయమున బ్రహ్మదేవుడు ఈ కవచమును శంకరునకీయగా శంకరుడీ కవచమును ధరించి త్రిపురాసురులను జయించెను. అటు పిమ్మట శంకరుడు దీనిని గౌతమ మహర్షికి ఉపదేశింపగా, గౌతమ మహర్షి పద్మాక్షుడను రాజునకుపదేశించెను. ఈ కవచము వలననే పద్మాక్షుడు సప్తద్వీపాధిపతి కాగలిగెను. అట్లే ఈ కవచము వలననే బ్రహ్మదేవుడు జ్ఞానమును, శక్తిని, సంపాదించికొనెను. అదేవిధముగా శంకరుడు సర్వజ్ఞుడై సమస్తయోగులకు గురువు కాగలిగెను. అట్లే ఈ కవచము వలన గౌతమ మహర్షి శంకరునితో సమానుడయ్యెను అని పలికెను.

బ్రహ్మండ వియస్యాZస్య కవచస్య ప్రజాపతిః | ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవీ దుర్గతి నాశినీ || 7

బ్రహ్మండ విజయే చైవ వినియోగః ప్రకీర్తితః | పుణ్యతీర్థం చ మహతాం కవచం పరమాద్భుతం || 8

ఓం హ్రీం దుర్గతి నాశిన్యై స్వాహా మే పాతు మస్తకం | ఓం హ్రీం మే పాతు కపోలం చాప్యోంహ్రీం శ్రీం పాతు లోచనే || 9

పాతు మే కర్ణయుగ్మం చాప్యోం దుర్గాయై నమః సదా| ఓం హ్రీం శ్రీమితి నాసాం మే సదాపాతు చ సర్వతః || 10

హ్రీం శ్రీం హ్రూమితి దంతాంశ్చ పాతు క్లీ మోష్ఠుగ్మకం | క్లీం క్లీం క్లీం పాతు కంఠంచ దుర్గే రక్షతు గండకే || 11

స్కంధం మహాకాళి దుర్గే స్వాహా పాతునిరంతరం | వక్షోవిపద్వినాశిన్యై స్వాహా మే పాతు సర్వతః || 12

దుర్గే దుర్గే రక్ష పార్శ్వౌ స్వాహా నాబిం సదాZవతు | దుర్గే దుర్గే దైహి రక్షాం పృష్ఠం మే పాతు సర్వతః || 13

ఓం హ్రీం దుర్గాయై స్వాహా చ హస్తౌ పాదౌ సదాZవతు | ఓం హ్రీం దుర్గాయై స్వాహా చ సర్వాంగం మే సదాZవతు || 14

ప్రాచ్యాం పాతు మహామాయా చాగ్నేయాం పాతు కాళికా | దక్షిణ దక్షకన్యా చ నైఋత్యాం శివసుందరీ || 15

పశ్చిమే పార్వతీ పాతు వారాహీ వాయవ్యాం సదా | కుబేరమాతా కౌబేర్యామైశాన్యాంమీశ్వరీ సదా || 16

ఊర్ధ్వం నారాయణీ పాతు త్వంబికా Zధ ః సదాZవతు | జ్ఞానం జ్ఞానప్రదా పాతు స్వప్నం నిద్రా సదాZవతు || 17

బ్రహ్మండ విజయమను పేరుగల ఈ దుర్గాదేవి కవచమునకు ప్రజాపతి ఋషి , గాయత్రీ చందము, ఛందస్సు. దుఃఖములను పోగొట్టు దుర్గాదేవియే దేవత. లోకములందు విజయము సిద్ధించుటకై దీనిని ఉపయోగింపవలెను. అత్యద్భుతమైన మహాత్మ్యముగల ఈ కవచము మహిమలకు నిలయమైనది.

ఓం హ్రీం దుర్గతి నాశిన్యై స్వాహా అనుమంత్రము నా శిరస్సును కాపాడుగాక. ఓం హ్రీం అను మంత్రము నా చెక్కిళ్లను, ఓం హ్రీం శ్రీం అనునది నా కండ్లను రక్షించుగాక !

ఓం దుర్గాయైనమః అను మంత్రము నాకర్ణములనెల్లప్పుడు రక్షించుగాక !

ఓం హ్రీం శ్రీం అను మంత్రము నా నాసికనెల్లప్పుడు రక్షించుగాక !

హ్రీం శ్రీం హ్రూం అను మంత్రము నా దంతములను, క్లీం అనునది నా పెదవులను రక్షించుగాక ! క్లీం క్లీం క్లీం అను మంత్రము నా కంఠమును దుర్గాదేవి నాగండభాగమును రక్షించుగాక !

మహాకాళి దుర్గే స్వాహా అనుమంత్రము నాస్కంధమును రక్షించుగాక!

దుర్గే దుర్గే రక్ష అను మంత్రము నా పార్శ్వ భాగముల ను , దుర్గే దుర్గే స్వాహా అను మంత్రము నా నాభిని ఎల్లప్పుడు రక్షించుగాక !

దుర్గే దుర్గే రక్షాం దేహి అను మంత్రము నా పృష్ఠభాగమును రక్షించుగాక !

ఓం హ్రీం దుర్గాయే స్వాహా అను మంత్రము నా చేతులను పాదముల రక్షించుగాక !

ఓం హ్రీం దుర్గాయే స్వాహా అను మంత్రము నా సమస్తావయవములు రక్షించుగాక!

మహామాయ నా తూర్పుదిగ్భాగమును, కాళిక అగ్నేయ దిగ్భాగమును, దక్షకన్య దక్షిణ దిగ్భాగమును, శివసుందరి నాయొక్క నైఋతి దిగ్భాగమును, పార్వతి పశ్చిమ దిగ్భాగమును, వారాహి వాయవ్య దిగ్భాగమును, కుబేర మాత నాఉత్తర దిగ్భాగమును, ఈశ్వరి నా ఈశాన్య దిగ్భాగమును, నారాయణి నా ఊర్థ్వ భాగమును, అంబిక నాయొక్క అధోభాగమును, ఎల్లప్పుడు కాపాడుగాక అట్లే జ్ఞాన ప్రదయగునాదేవి నాయొక్క జ్ఞానమును, నిద్రా స్వరూపిణి యగు నా జగన్మాత నా స్వప్నమును ఎల్లప్పుడు రక్షించుచుండుగాక |

ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘు విగ్రహం | బ్రహ్మండ విజయం నామ కవచం పరమాద్భుతం || 18

సుస్నాతః సర్వ తీర్థేషు సర్వయజ్ఞేషు యత్ఫలం | సర్వవ్రతోపవాసే చ తత్ఫలం లభ##తే నరః || 19

గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకార చందనైః | కంఠే వా దక్షిణ బాహౌ కవచం దారయేత్తు యః || 20

స చ త్రైలోక్య విజయీ సర్వ శత్రు ప్రమర్దకః |

నారదా ! సమస్త స్వరూపమగు బ్రహ్మండ విజయమను ఈ దుర్గా కవచమును నీకు చెప్పితిని. ఇది చాలా మహిమ గలది.

గురువును శాస్త్ర పద్ధతి ననుసరించి వస్త్రము, అలంకారము, చందనము మొదలగు వానితో పూజించి ఈ కవచమును కంఠమున లేక దక్షిణ భాహువునందైన ధరించినచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలితము, సమస్త యజ్ఞములు చేసినందువలన కలుగు ఫలితము, సమస్త వ్రతములందు ఉపవాసము చేసినచో లబించు ఫలితము లభించును. ఈ కవచమును ధరించువాడు సమస్త శత్రువులను జయించి ముల్లోకముల జయించినవాడగును.

ఇదం కవచ మజ్ఞాత్వా భ##జేద్దుర్గతి నాశినీం || 21

శతలక్షం ప్రజప్తోZపి న మంత్రః సిద్ధి దాయకః || 22

కవచం కాణ్వ శాఖోక్తముక్తం నారద సిద్ధిదం | యసై#్మ కసై#్మ న దాతవ్యం గోపనీయం సుదుర్లభం || 23

దుఃఖములను నాశనము చేయు ఈ దుర్గా కవచమును వదలిపెట్టి దుర్గామంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిధ్దింపదు.

కాణ్వ శాఖయందు చెప్పబడిన ఈ కవచమును సమస్త సిద్ధులనిచ్చును. అత్యంత రహస్యమైన ఈ కవచమును అర్హతలేని వాని కెట్టి పరిస్థితిలోను చెప్పరాదు. అని నారాయణుడు నారదునకు చెప్పెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే దుర్గతి నాశినీ కవచం నామైకోన చత్వారింశత్తమోZధ్యాయః ||

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన దుర్గతి నాశినీ కవచమను

ముప్పయి తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters