sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏకోనవింశతితమోzధ్యాయః - విఘ్నాధిపతికి విఘ్నకారణ కథనం

నారద ఉవాచ - నారాద మహర్షి నారాయణమునితో ఇట్లనెను.

కిం స్తోత్రం కవచం నాథ బ్రహ్మణా లోకసాక్షిణా| దానవాభ్యాం పురా దత్తం సూర్యస్య పరమాత్మనః || 1

కిం వా పూజావిధానం వా కిం మంత్రం వ్యాధినాశనం | సర్వం చాస్య మహాభాగ తన్మే త్వం వక్తుమర్హసి || 2

ఓ నారాయణమునీ! లోకసాక్షియగు బ్రహ్మదేవుడు రాక్షసులకు తెల్పిన సూర్యదేవుని కవచము, స్తోత్రము ఎట్టివి? అట్లే సూర్యుని పూజించు పద్ధతి, వ్యాధులనన్నిటిని తొలగించు సూర్యమంత్రమెట్టిదో వీటినన్నిటిని నాకు వివరింపగలవు.

సూత ఉవాచ - సూతమహర్షి ఇట్లు పలికెను.

నారదస్య వచః శ్రుత్యా భగవాన్‌ కరుణానిధిః | స్తోత్రంచకవచం మంత్రమూ చేతత్పూజనక్రమం || 3

నారదమహర్షి మాటలు విన్న దయాసముద్రుడైన నారాయణుడు అతనికి సూర్య దేవుని స్తోత్రమును, కవచమును, పూజా విధానమును చెప్పుటకు మొదలిడెను.

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను.

శ్రుణు నారద వక్ష్యామి సూర్యపూజావిధేః క్రమం | స్తోత్రం చ కవచం సర్వం పాపవ్యాధి విమోచకం || 4

సుమాలిమాలినౌ దైత్యౌ వ్యాధిగ్రస్తా బభూవతుః | విధిం సంస్మరతుః స్తోతుం శివమంత్రప్రదాయకం || 5

బ్రహ్మా గత్వా చ వైకుంఠం పప్రచ్ఛ కమలాపతిం | శివం తత్రైవ సంపశ్యన్‌ వసంతం హరిసన్నిధౌ || 6

ఓ నారదమహర్షీ! నీకు సూర్యుని పూజావిధానమును, స్తోత్రమును కవచమును అంతయు తెలిపెదను. సుమాలి, మాలి, యను రాక్షసులిద్దరు సూర్యునియొక్క శాపమువలన వ్యాధిగ్రస్తులైరి. వారిద్దరు తన్నివారణకు శివమంత్రమును ఉపదేశించు బ్రహ్మదేవుని ప్రార్థించిరి. అందువలన బ్రహ్మదేవుడు వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. ఆ సమయమున శివుడు కూడ ఆ శ్రీహరి సన్నిధిలోనే యుండెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడు శ్రీహరితో నిట్లు పలికెను.

సుమాలిమాలినౌ దైత్యౌ వ్యాధిగ్రస్తౌ బభూవతుః | క ఉపాయో వద హరే తయోర్వ్యాధివినాశ##నే || 7

ఓ మహావిష్ణూ! మాలి, సుమాలియను రాక్షసులిద్దరు రోగగ్రస్తులైనారు. అందువలన వారు వ్యాధి వినిర్ముక్తులగుటకు ఉపాయమేమైనా ఉన్నచో తెలుపుడని ప్రార్థించెను.

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు ఇట్లు పలికెను.

కృత్వా సూర్యస్య సేవాం చ పుష్కరే పూర్ణవత్సరం | వ్యాధిహంతుర్మదంశస్య తౌ చ ముక్తౌ భవిష్యతః || 8

సూర్యుడు నా యొక్క అంశస్వరూపుడు. అతనిని సేవించినవారు రోగముక్తులగుదురు. అట్టి సూర్యదేవుని పుష్కరక్షేత్రమున సంవత్సర పర్యంతము సేవించినచో మాలి, సుమాలి దానవులు రోగముక్తులగుదురు అని విష్ణువనెను.

శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.

సూర్యస్తోత్రం చ కవచం మంత్రం కల్పతరుం పరం | దేహి తాభ్యాం జగత్కాంత వ్యాధిహంతుర్మహాత్మనః || 9

ఆవాం సంపత్ప్రదాతారౌ సర్వదాతా హరిః స్వయం | వ్యాధిహంతా దినకరో యస్య యో విషయో విధే || 10

ఓ బ్రహ్మదేవుడా! వ్యాధులను నిర్మూలనము చేయు సూర్యదేవుని స్తోత్రమును అతని కవచమును, కల్పవృక్షమువలె అన్ని కోరికల నీడేర్చు అతని మంత్రమును ఆ రాక్షసులకుపదేశింపుము.

మనమిద్దరము సంపదను మాత్రము అనుగ్రహింతుము. శ్రీమన్నారాయణుడు సమస్త వాంఛలను తీర్చును అట్లే దినకరుడగు సూర్యుడు సమస్త వ్యాధులను పోగొట్టును అని పలికెను.

తాభ్యాం తు మంత్రం సంప్రాప్య య¸° దైత్యగృహం విధిః | తదా ప్రణమ్య తం దృష్ట్యా తసై#్మ దదతురాసనం || 11

తావువాచ స్వయం బ్రహ్మా రోగగ్రస్తౌ దయానిధిః | స్తబ్దావాహారరహితౌ పూయదుర్గంధసంయుతౌ || 12

తరువాత బ్రహ్మదేవుడు శ్రీహరి శంకరులవలన సూర్యమంత్రమును పొంది రాక్షసులగు మాలి సుమాలియను వారి దగ్గరకు వెళ్ళెను. వారు బ్రహ్మదేవుని చూడగనే అతనికి నమస్కరించి కూర్చుండుటకై ఆసనమును సమర్పించిరి. అప్పుడు కరుణాసింధువగు బ్రహ్మదేవుడు రోగగ్రస్తులు, ఆహారమును తీసికొనలేనివారు, దుర్వాసనవచ్చు శరీరముతోనున్నవారగు ఆ దైత్యులను చూచి ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను.

గృహీత్వా కవచం స్తోత్రం మంత్రం పూజావిధిక్రమం | గత్వా హి పుష్కరం వత్సౌ భజతం ప్రణతౌ రవిం || 13

ఓ దానవులారా! మీరిద్దరు సూర్యభగవానుని కవచమును, స్తోత్రమును, మంత్రమును, పూజాపద్ధతిని తెలిసికొని పుష్కరక్షేత్రమునకు పోయి అచట సూర్యుని భక్తిపూర్వకముగా సేవింపుడు అని పలికెను.

తావూచతుః - ఆ రాక్షసులిద్దరిట్లనిరి.

భజావః కేన విధినా కేన మంత్రేణ వా విధే | కిం స్తోత్రం కవచం కిం వా తదావాభ్యాం వదాధునా || 14

ఓ బ్రహ్మదేవుడా! సూర్యభగవానుని ఏ పూజాపద్దతిననుసరించి ఏ మంత్రముతో మేము సేవింపవలెను? అట్లే ఆ సూర్యదేవుని స్తోత్రముగాని కవచముగాని ఏవిధముగానున్నవో వాటిని మాకు విపులముగా తెల్పుము అని పలికిరి.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు పలికెను.

కృత్వా త్రికాలం స్నానం చ మంత్రేణానేన భాస్కరం | సంసేవ్య భాస్కరం భక్త్యా నీరుజౌ చ భవిష్యథః || 15

మీరు ప్రతిదినము త్రిసంధ్యలయందు స్నానముచేసి ఈ క్రింది మంత్రముచే భాస్కరుని భక్తితో సేవించినచో రోగనిర్ముక్తులయ్యెదరని పలికెను.

ఓం హ్రీం నమో భగవతే సూర్యాయ పరమాత్మనే స్వాహా | ఇత్యనేన చ మంత్రేణ సావధానం దివాకరం || 16

సంపూజ్య భక్త్యా దత్వా వై చోపహారాంస్తు షోడశ | ఏవం సంవత్సరం యావద్ధ్రువం ముక్తౌ భవిష్యథః || 17

అపూర్వం కవచం తస్య యువాభ్యాం ప్రదదామ్యహం | యద్దత్తం గురుణా పూర్వమింద్రాయ ప్రీతిపూర్వకం || 18

తత్సహస్రభగాంగాయ శాపేన గౌతమస్య చ | అహల్యా హరణనైవ పాపయుక్తాయ సంకటే || 19

'ఓం హ్రీం నమో భగవతే పరమాత్మనే స్వాహా" అను మంత్రముతో సూర్యుని భక్తితో పూజించుచు షోడషోపచారములను ప్రతిదినము సమర్పింపవలెను. ఇట్లు సంవత్సరకాలమాసూర్యభగవానుని సేవించినచో తప్పక రోగనిర్ముక్తులగుదురని పలికెను.

అట్లే ఇంద్రుడు అహల్యను హరించి గౌతముని శాపమునకు గురియైనప్పుడు బృహస్పతి అతనికి ఆ పాపవిమోచనమునకై సూర్యకవచమునుపదేశించియుండెను. అపూర్వమైన ఆ సూర్యకవచమును మీకు నేనుపదేశింతునని బ్రహ్మదేవుడనెను.

బృహస్పతిరువాచ - బృహస్పతి ఇట్లు పలికెను.

ఇంద్ర శ్రుణు ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతం | యద్దృత్వా మునయః పూతా జీవన్ముక్తాశ్చ భారతే || 20

కవచం బిభ్రతో వ్యాధిర్న భియా యాతిసన్నిధిం | యథా దృష్ట్వా వైనతేయం పలాయంతే భుజంగమాః || 21

శుద్దాయ గురుభక్తాయ స్వశిష్యాయ ప్రకాశ##యేత్‌ | ఖలాయ పరశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్‌ || 22

ఓ ఇంద్రుడా! మిక్కిలి ఆశ్చర్యకమైన సూర్యకవచమును నీకు ఉపదేశించుచున్నాను. ఈ కవచమును ధరించినందువల్లనే మునులందరు పరమపవిత్రులు, జీవన్ముక్తులైనారు.

ఈ కవచమును ధరించినవారిని రోగములు ఎట్టి పరిస్థితిలోను దరిజేరవు. పైగా గరుత్మంతుని చూచి పారిపోవు సర్పములవలె రోగములు ఈ కవచధారిని చూచి పరుగెత్తుకొని పోవును.

ఈ కవచమును పరమపవిత్రుడు, పెద్దవారిపై భక్తిప్రపత్తులుకల తన శిష్యునకు మాత్రముపదేశింపవలెను. లేక దుష్టుడు, ఇతరులకు శిష్యుడగు వానికి దీనిని ఉపదేశించినచో ఆ గురువు మృత్యువునకు గురియగునని పలికెను.

జగద్విలక్షణస్యాస్య కవచస్య ప్రజాపతిః | ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవో దినకరః స్వయం|

వ్యాధిప్రణాశే సౌందర్యే వినియోగః ప్రకీర్తితః || 23

సద్యో రోగహం సారం సర్వపాపప్రణాశనం | ఓం క్లీం హ్రీం శ్రీం శ్రీ సూర్యాయ స్వాహా మే పాతు మస్తకం || 24

అష్టాదశాక్షరో మంత్రః కపాలం మే సదాzవతు| ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం సూర్యాయ స్వాహా మే పాతు నాసికాం || 25

చక్షుర్మే పాతు సూర్యశ్చ తారకాం చ వికర్తనః | భాస్కరో మేzధరం పాతు దంతాన్‌ దినకరస్తథా || 26

ప్రపంచః పాతు గండం మే మార్తండః కర్ణమేవ చ | మిహిరశ్చ సదా స్కంధే జంఘే పూషా సదాzవతు || 27

వక్షః పాతు రవిః శశ్వత్‌ నాభిం సూర్యః స్వయం సదా | కంకాళం మే సదా పాతు సర్వదేవనమస్కృతః || 28

కరౌ పాతు సదా బ్రధ్నః పాతు పాదౌ ప్రభాకరః | విభాకరో మే సర్వాంగం పాతు సంతతమీశ్వరః || 29

ఈ సూర్యకవచమునకు ఋషి ప్రజాపతి. ఛందస్సు గాయత్రీ ఛందస్సు. దేవత సూర్యభగవానుడే. ఈ కవచమువలన వ్యాధులు తొలగిపోవును. అట్లే సౌందర్యసంరక్షణము జరుగును. ఈ కవచము వ్యాధులను వెంటనే రూపుమాపగలదు. అట్లే సమస్తపాపములను వెంటనే తొలగించును.

ఓం క్లీం హ్రీం శ్రీం శ్రీసూర్యాయస్వాహా అను మంత్రము నా శిరస్సు నెల్లప్పుడు రక్షించుగాక. పదునెనిమిది అక్షరముల సూర్యమంత్రము నా కపాలమును రక్షించుగాక. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం సూర్యాయస్వాహా అను మంత్రము నా నాసికను, సూర్యదేవుడు నాకండ్లను, వికర్తనుడు కనుపాపలను, భాస్కరుడు నా పెదవులను, దినకరుడు నా దంతములను, ప్రచండుడు నా చెక్కిళ్ళను, మార్తాండుడు నా చెవులను, మిహిరడు నా భుజములను, పూష నా యొక్క పిక్కలను, రవి నాయొక్క రొమ్మును, సూర్యుడు నా నాభిని, సమస్త దేవతా నమస్కారములనందుకొనుచున్న సూర్యుడు నా ఎముకలగూడును, బ్రధ్నుడు నా చేతులను, ప్రభాకరుడు నా పాదములను, ఈశ్వరుడగు విభాకరుడు నా సమస్తావయవములను ఎల్లప్పుడు రక్షించుచుండునుగాక.

ఇతి తే కథితం వత్స కవచం సమనోహరం | జగద్విలక్షణం నామ త్రిజగత్సు సుదుర్లభం || 30

పురా దత్తం చ మనవే పులస్త్యేన చ పుష్కరే | మయా దత్తం చ తుభ్యం తత్‌ యసై#్మ న దేహి భో ః || 31

వ్యాధితో ముచ్యసే త్వం చ కవిచస్య ప్రసాదతః | భవానరోగీ శ్రీమాంశ్చ భవిష్యతి న సంశయః | 32

లక్షవర్ష హవిష్యేణ యత్ఫలం లభ##తే నరః | తత్ఫలం లభ##తే నూనం కవచస్యాస్య ధారణాత్‌ || 33

ఇదం కవచమజ్జాత్వా యో మూఢో భాస్కరం యజేత్‌ | దశలక్షప్రజప్తోzపి మంత్రసిద్ధిర్న జాయతే || 34

ఇంద్రా! ముల్లోకములలో ఎవరికిని లభింపని జగద్విలక్షణమను పేరుగల ఈ సూర్యకవచమును నీకు తెల్పితిని. ఈ కవచమును పూర్వము పులస్త్య మహర్షి మనువునకు తెల్పగా (మనువునుండి పరిగ్రహించిన) నేను నీకు తెల్పితిని. దీనిని అర్హతలేని వారికి ఉపదేశింపవద్దు.

ఈ కవచముయొక్క ప్రభావమువలన నీవు గౌతమ మహర్షి శాపమువలన కలిగిన వ్యాధినుండి నిర్ముక్తుడవగుదువు. అట్లే లక్ష్మీసంపన్నుడవుకూడ కాగలవు. లక్ష సంవత్సరములు యాగము చేసినవారికి ఎంతఫలము లభించునో ఈ కవచమును ధరించిన వానికంత ఫలము లభించును. అట్లే ఈ సూర్యకవచమును వదలి సూర్యమంత్రమును పదిలక్షలమార్లు జపించినను మంత్రసిద్ధి కలుగజాలదు అని బృహస్పతి పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడు మాలి, సుమాలురతో ఇట్లు పలికెను.

ధృత్వేదం కవచం వత్సౌ కృత్వా చ స్తవనం రవేః | యువాభ్యాం వ్యాధినిర్ముక్తౌ నిశ్చితం తు భవిష్యథః || 35

స్తవనం సామవేదోక్తం సూర్యస్య వ్యాధిమోచనం | సర్వపాపహరం సారం ధనారోగ్యకరం పరం || 36

తం బ్రహ్మ పరమంధామ జ్యోతీరూపం సనాతనం | త్వామహం స్తోతుమిచ్చామి భక్తానుగ్రహ కారకం || 37

త్రైలోక్యలోచనం లోకనాథం పాపవిమోచకం | తపసాం ఫలదాతారం దుఃఖదం పాపినాం సదా || 38

కర్మానురూపఫలదం కర్మబీజం దయానిధిం | కర్మరూపం క్రియారూపమరూపం కర్మబీజం || 39

బ్రహ్మవిష్ణుమహేశామంశం చ త్రిగుణాత్మకం | వ్యాధిదం వ్యాధిహంతారం శోకమోహభయాపహం || 40

సుఖదం మోక్షదం సారం భక్తిదం సర్వకామదం | సర్వేశ్వరం సర్వరూపం సాక్షిణం సర్వకర్మణాం |

ప్రత్యక్షం సర్వలోకానామప్రత్యక్షం మనోహరం || 41

శశ్వద్రసహరం పశ్చాద్రసదం సర్వసిద్ధిదం | సిద్దిస్వరూపం సిద్దేశం సిద్ధానాం పరమం గురుం || 42

ఈ సూర్యకవచమును బాహువుయందు లేక కంఠమందు ధరించి అతనిని స్తుతించినచో మీరిద్దరు తప్పక రోగనిర్ముక్తులగుదురు.

సూర్యస్తోత్రము సామవేదమున చెప్పబడినది. ఇది సమస్తవ్యాధులను, సమస్తపాపములను హరించి ధనసంపదలను, చక్కని ఆరోగ్యమును కలిగించును.

ఆ సూర్యదేవుడు పరబ్రహ్మస్వరూపుడు , పరంధాముడు, జ్యోతిస్స్వరూపుడు, భక్తులనెల్లప్పుడు అనుగ్రహించువాడు, ముల్లోకములకు నేత్రమువంటివాడు, లోకనాథుడు, పాపములను తొలగించువాడు, తపఃఫలితము నొసగువాడు, పాపాత్ములకు కష్టములను కలిగించువాడు, తమతమ కర్మలకు అనురూపమైన ఫలితములనొసగువాడు, కర్మలకు కారణరూపుడు, దయానిధి, కర్మరూపుడు, క్రియారూపుడు, రూపరహితుడు, కర్మకారణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిముర్తుల అంశ స్వరూపుడు, సత్వ, రజస్తమో గుణాత్మకుడు, వ్యాధులను కలిగించువాడు, వ్యాధులను పోగొట్టువాడు, దుఃఖము, మోహము, భయములను తొలగించువాడు, సుఖమును, మోక్షమును, భక్తిని సమస్త కోరికలను ఇచ్చువాడు, సర్వేశ్వరుడు, సమస్తరూపుడు, సర్వకర్మలకు సాక్షీభూతుడు, సర్వలోకములకు ప్రత్యక్షమగువాడు, ప్రత్యక్షము కానివాడు, ఎల్లప్పుడూ నీటిని పీల్చువాడు, పిదప నీటిని ఇచ్చువాడు, సమస్త సిద్ధులను ఇచ్చువాడు, సిద్ధిస్వరూపుడు, సిద్ధులకు ఈశ్వరుడు, సిద్ధులకు పరమ గురువు అగు సూర్యదేవుని స్తోత్రము చేయుచున్నాను అని బ్రహ్మదేవుడు పలికెను.

స్తవరాజమిదం ప్రోక్తం గుహ్యాత్‌ గుహ్యతరం పరమ్‌ | త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం వ్యాధిభ్యస్సప్రముచ్యతే || 43

ఆంధ్య కుష్ఠంచ దారిద్ర్యం రోగశ్శోకో భయం కలిః | తస్య నశ్యతి విశ్వేశ శ్రీసూర్యకృపయా ధ్రువం || 44

మహాకుష్టీ చ గలితః చక్షుర్హీనో మహావ్రణీ | యక్ష్మగ్రస్తో మహాశూలీ నానావ్యాధియుతోZపి వా || 45

మాసం కృత్వా హవిష్యాన్నం శ్రుత్వాZతో ముచ్యతే ధ్రువం | స్నానం చ సర్వతీర్థానాం లభ##తే నాత్ర సంశయః || 46

పుష్కరం గచ్ఛతం శ్రీఘ్రం భాస్కరం భజతం సుతౌ | ఇత్యేవముక్త్వా సవిధిర్జగామ స్వాలయం ముదా || 47

పరమ రహస్యమైన ఈ సూర్యస్తోత్రమును మీకు తెల్పతిని. దీనిని మూడు సంధ్యలయందు ప్రతిదినము చదివినచో గుడ్డితనము, కుష్ఠురోగము, దారిద్య్రము, శోకము, భయము అనునవి శ్రీసూర్యదేవుని అనుగ్రహమువలన దరిచేరవు. అట్లే మహాకుష్ఠుతో బాధపడుచున్ననూ, కండ్లుపోయిననూ, అనేకరకములైన పుండ్లచే బాధలుపడుచున్ననూ, క్షయవ్యాధితో బాధపడుచున్ననూ, విపరీతమైన కడుపునొప్పిచే బాధపడుచున్ననూ, అనేక వ్యాధులు ఉన్ననూ ఈ స్తోత్రమును నెలరోజులు చదివినచో వాటినుండి ముక్తి తప్పకపొందును. అట్లే ఈ స్తోత్రమును విన్నవాడు సహితము సమస్త పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఫలితమును తప్పకపొందును.

అందువలన మీరు వెంటనే పుష్కర క్షేత్రమునకు వెళ్ళి సూర్యదేవుని ఆరాధింపుడని మాలి, సుమాలురకు బ్రహ్మదేవుడు చెప్పి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.

తౌ నిషేవ్య దినేశం తం నీరుజౌ సంబభువతుః | ఇత్యేవం కథితం వత్స కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 48

సర్వ విఘ్నహరం సారం విఘ్నేశం విఘ్ననాశనం | స్తోత్రేణానేన తం స్తుత్వా ముచ్యతే నాత్ర సంశయః || 49

మాలి, సుమాలురను రాక్షసులు సూర్యుని పై స్తోత్రములతో ప్రతిదిను సేవించి రోగ నిర్ముక్తులైరి.

ఈ విధముగా నీకు సూర్యస్తోత్రమును, సూర్యకవచమును చెప్పితిని. ఇది సమస్త విఘ్నములను తొలగించును. ఈ స్తోత్రముచే సూర్యుని స్తుతించినచో తప్పక రోగములు తొలగిపోవును. అని నారాయణముని పలికెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాద విఘ్నకారణ కథనం నామ ఏకోనవింశతి తమోzధ్యాయ

బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదైన గణపతి ఖండమున నారద నారయణ మునుల సంవాద సమయమున చెప్పబడిన మిఘ్నకారణమను

పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters