sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రయోదశోzధ్యాయః - గణశపూజాస్తవకవచకథనం

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను.

అథ విష్ణుః శుభే కాలే దేవైశ్చ మునిభిస్సహ | పూజయామాస తం బాలముపహారైరనుత్తమైః || 1

సర్వాగ్రే తవ పూజా చ మయా దత్తా సురోత్తమ | సర్వపూజ్యశ్చ యోగీంద్రో భవ వత్సేత్యువాచ తం || 2

వనమాలాం దదౌ తసై#్మ బ్రహ్మాజ్ఞానం చ ముక్తిదం | సర్వసిద్ధిం ప్రదాయైవ చకారాత్మ సమం హరిః || 3

దదౌ ద్రవ్యాణి చారుణి చోపచారాంశ్చ షోడశ | నామభిస్తవనం చక్రే మునిభిశ్చ సమయం సురైః || 4

విఘ్నేశశ్చ గణశశ్చ హేరంబశ్చ గజాననః | లంబోదరశ్చైకదంతః శూర్పకర్ణో వినాయకః || 5

ఏతాన్యష్టౌ చ నామాని సర్వసిద్ధిప్రదాని చ | ఆశిషం దాపయామాస చానయామాస తాన్‌ మునీన్‌ || 6

తరువాత శ్రీమహావిష్ణువు మంచిముహూర్తమున దేవతలచే మునులచే గొప్పనైన ఉపహారములతో పూజ చేయించెను. అట్లే ఆ బాలునితో నీకు సమస్త దేవతలకంటె ముందు పూజ జరుగునట్లు నేను వరమునిచ్చితిననియు నీవు ప్రాణులందరకు పూజ్యుడవగుదువనియు, యోగీంద్రుడవగుదునని చెప్పి ఆ శిశువు మెడలో తనమెడలోనున్న వనమాలను వేసి ముక్తిని కలిగించు బ్రహ్మజ్ఞానమును, సమస్తసిద్దులను ఇచ్చి తనతో సముడుగా చేసెను. అట్లే మునులు, దేవతలతో కలసి షోడశోపచారములతో అతనిని పూజించి ఆ శిశువుయొక్క నామస్తోత్రమును కూడ చేసెను.

విఘ్నేశుడు, గణశుడు, హేరంబుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, వినాయకుడు అనునవి అతనిపేర్లు. ఈ ఎనిమిది పేర్లు పఠించినచో సమస్తసిద్దులు కలుగును. తరువాత ఆ శ్రీహరి మునులను పిలిపించి వారిచే అతనికి ఆశీస్సులనిప్పించెను.

సిద్దాసనం దదౌ ధర్మస్తసై#్మ బ్రహ్మ కమండలుం | శంకరో యోగపట్టం చ తత్వజ్ఞానం సుదుర్లభం || 7

రత్నసింహాసనం శక్రః సూర్యశ్చ మణికుండలే | మాణిక్యమాలాం చంద్రశ్చ కుబేరశ్చ కిరీటకం || 8

వహ్నిశుద్దం చ వసనం దదౌ తసై#్మ హుతాశనః | రత్నచ్ఛత్రం చ వరుణో వాయూ రత్నాంగుళీయకం || 9

క్షీరోదోద్భవ సద్రత్న రచితం వలయం వరం | మంజీరం చాపి కేయూరం దదౌ పద్మాలయామునే || 10

కంఠభూషాం చ సావిత్రీ భారతీ హారముజ్వలం | క్రమేణ సర్వదేవాశ్చ దేవ్యశ్చ భూషణం దదుః || 11

మునయః పర్వతాశ్చైవ రత్నాని వివిధాని చ | వసుంధరా దదౌ తసై#్మ వాహనాయ చ మూషకం || 12

క్రమేణ దేవా దేవ్యశ్చ మునయః పర్వతాదయః | గంధర్వా కిన్నరా యక్షా మనవో మానవాస్తథా || 13

నానావిధాని ద్రవ్యాణి స్వాదూని మధురాణి చ | పూజాం చక్రుశ్చ తే సర్వే క్రమాద్వై భక్తిపూర్వకం || 14

ధర్మదేవత ఆ శిశువునకు సిద్దాసనమునీయగా బ్రహ్మదేవుడు కమండలమును, శంకరుడు యోగపట్టమును, తత్వజ్ఞానమును, దేవేంద్రుడు రత్నసింహాసనమును, సూర్యుడు మణిమయ కుండలములను, చంద్రుడు మాణిక్యమాలను, కుబేరుడు కిరీటమును, అగ్ని పరిశుద్దమైన వస్త్రములను, వరుణుడు రత్నమయఛత్రమును, వాయువు రత్నాల ఉంగరమును, లక్ష్మీదేవి పాలసముద్రమునుండి ఉద్భవించిన రత్న కంకణమును కాలిఅందెను, దండకడియమును, సావిత్రీదేవి కంఠభూషణును (కంటెను) భారతీదేవి రత్నాలహారమును, ఇచ్చెను. అట్లే సమస్తదేవతలు, సమస్త దేవతాస్త్రీలు నానావిధభూషణములనిచ్చిరి. అదేవిధముగా మునులు, పర్వతములు అనేకవిధములైన రత్నములనిచ్చిరి. భూదేవి గణశునకు వాహనముగా మూషకమును ఇచ్చెను. గంధర్వులు కిన్నరులు, యక్షులు మొదలగువారు నానావిధ ద్రవ్యములతో గణపతికి భక్తిపూర్వకముగా పూజచేసిరి.

పార్వతీ జగతాం మాతా స్మేరానన సరోరుహా | రత్నసింహాసనే పుత్రం వాసయామాస నారద || 15

సర్వతీర్థోదకై రత్నకలశావర్జితైః స్తుతైః | స్నాపయామాస వేదోక్తమంత్రేణ మునిభిస్తదా |

అగ్నిశుద్దే చ వసనే దదౌతసై#్మ సతీముదా || 16

గోదావర్యుదకైః పాద్యమర్ఘ్యం గంగోదకేన చ | దూర్వాభిరక్షతైః పుషై#్పశ్చందనేన సమన్వితం || 17

పుష్కరోదకమానీయ పునరాచమనీయకం | మధుపర్కం రత్నపాత్రైరాసవం శర్కరానిత్వం || 18

స్నానీయం విష్ణుతైలం చ స్వర్వైద్యాభ్యాం వినిర్మితం | అమూల్యరత్నరచితం చారుభూషాకదంబం || 19

పారిజాతవస్రూనానామానేష్యాం శతకాని చ | మాలతీచంపకాదీనాం పుష్పాణి వివిధాని చ | పూజాన్హాణి చ పత్రాణి తులసీహితాని చ|| 20

చందనాగురు కస్తూరీ కుంకుమాని చ సాదరం | రత్నప్రదీపనికరం ధూపం చ పరితో దదౌ || 21

నైవేద్యం తత్ప్రియం చైవ తిలలడ్డుకపర్వతాన్‌ | యవగోధూమచూర్ణానాం లడ్డుకానాం చ పర్వతాన్‌ || 21

పక్వాన్నానాం పర్వతాశ్చ సుస్వాదుసుమనోహరాన్‌ | పర్వతాన్‌ స్వస్తికానాం చ సుస్వాదు శర్కరాన్వితాన్‌ || 22

గుడక్తానాం చ లాజానాం పృథుకానాం చ పర్వతాన్‌ | శాల్యన్నానాం షిష్టకానాం పర్వతాన్‌ వ్యంజపైస్సహ | పయోభృత్కలశానం చ లక్షాణి ప్రదదౌ ముదా || 23

లక్షాణి దధిపూర్ణానాం కలశానాం చ పూజనే | మధుభృత్కలశానాం చ త్రిలక్షాణి చ సుందరీ || 24

సర్పిః సువర్ణకుంభానాం పంచలక్షాణి సాదరం | దాడిమానం శ్రీఫలానామసంఖ్యాని చ ఫలాని చ || 25

ఖర్జూణాం కపిత్థానాం జంబూనాం వివిధాని చ | ఆమ్రాణాం పనసానాం చ కదళీనాం చ నారద| ఫలాని నారికేళానామసంఖ్యాని దదౌముదా || 26

అన్యాని పరిపక్వాని కాలదేశోద్భవాని చ | దదౌ తాని మహాభాగ స్వాదూని మధురాణి చ|| 27

స్వచ్ఛం సునిర్మలం చైవ కర్పూరాది సువాసితం | గంగాజలం చ పానార్థం పునరాచమనీయకం || 28

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదిసువాసితం | సువర్ణపాత్రశతకం భక్ష్యపూర్ణం చ నారద || 30

శైలరాజప్రియామాత్యాః పూపుజుః శైలజాత్మజం || 31

జగన్మాతయగు పార్వతీదేవి చిరునవ్వుతో తన పుత్రుడగు గణశునితర్నసింహాసనముపై కూర్చుండపెట్టి రత్నకలశములతో తెచ్చిన సమస్తతీర్ధములందలి నీటిచే మునులు స్తోత్రములు, వేదమంత్రములు చదువుచుండగా స్నానము చేయించెను. తరువాత ఆ గణపతికి మిక్కిలి పరిశుద్ధమైన రెండు వస్త్రములనిచ్చెను. అటు పిమ్మట దూర్వ, అక్షతలు, పూవులు, చందనము కలిగిన గోదావరినదియొక్క నీటిచే పాద్యమును, గంగానదియొక్క తీర్ధముచే అర్ఘ్యమును, పుష్కరమందలి నీటిచే ఆచమనీయమును ఇచ్చెను. దేవతావైద్యులగు అశ్వినీకుమారులు సిద్ధము చేసిన విష్ణుతైలమును పూసి అమూల్యరత్నములు కల అందమైన అభరణములను వేసినది. అటు పిమ్మట పారిజాత కుసుమములు మాలతి, చంపకము మొదలగు పుష్పములను, ఇంను పూజించుటకు తగిన ఇతరమైన పత్రపుష్పములను, తులసీదళములను చందనము, అగరు, కస్తూరి వంటి సుంగధద్రవ్యములను, కుంకుమను, ధూపమును రత్నదీపములను సమర్పించినది. దూపదీపములు సమర్పించిన పిదప పార్వతీదేవి గణపతికి ఇష్టమైన నైవేద్యమును పెట్టినది. ఆ నైవేద్యములో నూవులలడూటు, యవలు, గోధుమలరవ్వతో చేసిన లడ్డూలు చాలా రుచికల పక్వాన్నములు, మంచి రుచిగల తియ్యని స్వస్తికమను వంటకములు, బెల్లపు పానకమున వేసి కట్టబడిన పేలాలు అటుకుల లడ్డులు, సమస్తమైన కూరగాయలతో కూడిన అన్నము, పిండివంటలు కలవు. అదేవిధముగా పాటు, పెరుగు, తేనె, నేయి వంటి వస్తువులనపారముగా అతనికి నివేదించెను. మరియు దానిమ్మ, మారేడు, పండ్లు, కర్జూరములు, వెలగ, మామిడి, పనస, నారికేళము మొదలగు ఫలములనెన్నిటినో పార్వతీదేవి సమర్పించింది. అటుపిమ్మట కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములచే పరిమళింపబడిన నిర్మలమైన గంగాజలమును త్రాగుటకై ఇచ్చెను. తరువాత కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములు గల తాంబూలమును భక్ష్యములతోనున్న బంగారు పాత్రలను అతనికి ఇచ్చినది.

అదేవిధముగా హిమవంతుని పరిచారకులందరు ఆ గణపతిని భక్తితో పూజచేసిరి.

ఓం శ్రీం హ్రీం క్లీం గణశ్వరాయ బ్రహ్మరూపాయ చారనే | సర్వసిద్ధిప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః || 32

ఇత్యనేనైనమంత్రేణ దత్వా ద్రవ్యాణి భక్తితః | సర్వేప్రముదితాస్తత్ర బ్రహ్మ విష్ణు శివాదయః || 33

''ఓం శ్రీం హ్రీం క్లీం గణశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధిప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః'' అనునది గణపతి మంత్రము. ఈ మత్రమును చదువుచు బ్రహ్మాది దేవతలందరు షోడశోపచారములకు అవసరమైన పూజాద్రవ్యములను గణపతికి నివేదించి సంతోషపడిరి.

ద్రాత్రింశదక్షరో మతామంత్రోzయం సర్వకామధః | ధర్మార్థకామమోక్షాణాం ఫలదః సర్వసిద్ధిదః || 34

పంచలక్షజపేపైవ మంత్రసిద్ధిస్తు మంత్రిణః | మంత్రిసిద్ధిర్భవేదస్య స చ విష్ణుశ్చ భారతే ||35

విఘ్నాని చ పలాయంతే తన్నామస్మరణన చ | మహావాగ్మీ మహాసిద్ధిః సర్వసిద్ధి సమనిత్వః || 36

వాక్పతిర్గురుతాం యాతి తస్య సాక్షాత్సునిశ్చితం | మహాకవీంద్రో గుణవాన్‌ విదుషాం చ గురోర్గురుః || 37

సంపూజ్యానేన మంత్రేణ దేవా ఆనందసంప్లూతాః | నానావిధాని వాద్యాని వాదయామాసురుత్సవే || 38

బ్రాహ్మణ్మాన్భోజయామాసుః కారయామాసురుత్సవం | దుదుర్దానాని తేభ్యశ్చ విశేషితః || 39

పై గణపతి మంత్రమున ముపై#్ఫరెండు అక్షరములున్నవి. ఆ మంత్రము సమస్తమైన కోరికలను తీర్చును. ధర్మార్థకామమోక్షముల యొక్క ఫలితములనిచ్చును. పైగా అన్నివిధములైన సిద్ధులనామంత్రము కలిగించును. ఈ మంత్రరాజమును ఐదుల క్షల పర్యాయములు ఏకాగ్రబుద్ధితో జపించినవానికి మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రసిద్ధినందినవాడు శ్రీమహావిష్ణువుతో సమానుడగును. గణాధిపతియొక్క నామములను స్మరించుటవలన సమస్త విఘ్నములు భయముతో పరుగెత్తిపోవును. అతని నామస్మరణము చేసినవాడు సర్వసిధ్ధిసమనిత్వుడై గొప్ప వక్తయగును. గణపతి మంత్రస్మరణచే గణపతి సంతుష్టుడై ప్రత్యక్షమైనచో ఆ భక్తుడు బృహస్పతితో సమానుడగును. మహాకవులలో మిన్నయగును. విద్వాంసులలో గురువులలో అతడు మిక్కలి శ్రేష్ఠుడుగా పేరుపొందును.

ఈ గణపతి మంత్రమును సర్మించుచు గణపతిని పూజించిన దేవతలు ఆనందసాగరములో ఓలలాడి గొప్ప ఉత్సవమును జరుపుకొని అనేకవిధములైన వాద్యములను మ్రోగించుచుండిరి. వారు ఆ సమయమున బ్రాహ్మణులకందరకు భోజనములు పెట్టి వారికి మరియు భట్రాజులకు విశేషముగా దానములు చేసిరి.

నారాయణ ఉవాచ-నారాయణ ముని నారదునితో నిట్లనెను.

అథ విష్ణుః సభామధ్యే తం సంపూజ్యగణశ్వరం | తుష్టావ పరయా భక్త్వా సర్వవిఘ్న వినాశనం || 40

ఈశ త్వాం స్తోతుమిచ్ఛామి బ్రహ్మజ్యోతిః సనాతనం | నైవ వర్ణయితుం శక్తోzస్మ్యనురూపమనీహకం ||41

ప్రవరం సర్వదేవానాం సిద్ధానాం యోగినాం గురుం | సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశిస్వరూపిణం || 42

అవ్యక్తమక్షరం నిత్యం సత్యమాత్మస్వరూపిణం | వాయుతుల్యం చ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం || 43

సంసారార్ణవపారే చ మయోపేతే సుదర్లభే | కర్ణధారస్వరూపం చ భక్తానుగ్రహకారకం || 44

వరం వరేణ్యం వరదం వరదానామపీశ్వరం | సిద్ధం సిద్ధిస్వరూపం చ సిద్ధిదం సిద్ధిసాధనం|| 45

ధ్యానాతిరిక్తం ధ్యేయం చ ధ్యానాసాధ్యం చ ధార్మికం | ధర్మస్వరూపం ధర్మజ్ఞం ధర్మాధర్మఫలప్రదం || 46

బీజం సంసారవృక్షాణామంకురం చ తదాశ్రయం | స్త్రీపుం నపుంసకానాం చ రూపమేతదతీంద్రియం || 47

సర్వాద్యమగ్రపూజ్యం చ సర్వపూజ్యం గుణార్ణవం | స్వేచ్ఛయా సుగుణం బ్రహ్మ నిర్గుణం స్వేచ్ఛయా పునః || 48

స్వయం ప్రకృతి రూపం చ ప్రాకృతం ప్రకృతేః పరం | త్వాం స్తోతుమక్షమోzనంతః సహస్రవదనైరపి || 49

న క్షమః పంచవక్త్రశ్చ న క్షమశ్చతురాననః | సరస్వతీ న శక్తా చ నశక్తోzహం తవస్తుతౌ | న శక్తాశ్చ చతుర్వేదాః కేవా తే వేదవాదినః || 50

ఇత్యేవం స్తవనం కృత్వా మునీశ సురసంపది పరేశశ్చ సురై స్సార్థం వివరామ రమాపతిః || 51

ఆ సమయమున దేవతలు మునులున్న ఆ సభలో విష్ణుమూర్తి గణపతిని పూజించి సమస్త విఘ్నములను తొలొగించు ఆ గణశుని అమితమైన భక్తితో ఇట్లు స్తుతించెను.

ఓ దేవా నేను నిన్ను స్తుతింపవలెనని భావించుచున్నాను. కాని బ్రహ్మస్వరూపుడవు, జ్యోతిర్మూర్తివి, సనాతనుడవగు నిన్ను యథానురూపముగా వర్ణింపజాలకున్నాను.

ఐనను నీవు సమస్త దేవతలో, సమస్త సిద్ధగణములలో సమస్తయోగులలో మిక్కిలి శ్రేష్ఠమైనవాడవు. నీవు సర్వభూతస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, జ్ఞానరాశిమూర్తీభవించినట్లున్నావాడవు. నీవు అవ్యక్తుడవు, నాశనములేనివాడవు, నిత్యుడవు, సత్యరూపుడవు, ఆత్మరూపుడవు, వాయువువలె సర్వత్ర వ్యాపించియున్నావు. నిర్లిప్తుడవు, అక్షతుడవు, సమస్త జీవులు చేయుచున్న కర్మలకన్నిటికి నీవే సాక్షివి.

మాయతోనున్న ఈ అంతులేని సంసారసాగరమున నీవు నావను చక్కగా పడుపుచూ అవలితీరమును చేర్పగల నావికుడవు. భక్తులను సదా అనుగ్రహించువాడవు. నీవు శ్రేష్ఠుడవు మిక్కిలి గొప్పవాడవు, వరములనిచ్చువాడవు, వరములనొసగు దేవతలందరిలో నీవే శ్రేష్ఠమైనవాడవు, నీవు స్వయముగా సిద్ధుడవు, సిద్ధిస్వరూపుడవు, సమస్తసిద్ధులనొసగువాడవు. సమస్త సిద్ధులను పొందుటకు కారణమైనవాడవు, ధ్యానాతిరిక్తుడవు నీవే. ధ్యానింపదగినవాడవు నీవే. ధ్యానింపశక్యము కానివాడవు నీవే. పరమధార్మికుడవు, ధర్మరూపుడవు, ధర్మములన్నియు తెలిసినవాడవు, ధర్మాధర్మకర్మల యొక్క ఫలితములనిచ్చువాడవు నీవే. సంసారమనే వృక్షమునకు బీజరూపుడవు, అంకురరూపడవు, దానికి ఆశ్రయమైనవాడవు అన్నియునీవే. నీరూపము ఇంద్రియములకన్నిటికి అతీతమైనది. స్త్రీ పుం, నపుంసకరూపములన్నియు నీకు సంబంధించినవే.

నీవు సమస్త దేవతలలో మొదటివాడవు. సమస్త దేవతలకంటె ముందు పూజనందుకొనువాడవు. సమస్తచరాచరసృష్ఠికోటిచే మునీశ్వరులు దేవతాధిపతులందరిచే పూజలనందుకొనుచున్నావు. నీవు నీ ఇచ్ఛామాత్రమున సుగుణరూపుడవు, నిర్గుణరూపుడవుగా ప్రకాశించుచున్నావు. నీవు స్వయముగా ప్రకృతిస్వరూపుడవు, ప్రకీతి నుండి ఉద్భవించినవాడవు. చివరకు ప్రకృతికి అతీతుడవు నీవే.

నిన్ను నీగుణములను వేయి తలలుగల అదిశేషుడు కాని, ఐదు తలలుగల శంకరుడు గాని, నాలుగుముఖములున్న బ్రహ్మదేవుడుగాని, చదువులతల్లియగు సరస్వతిదేవిగాని వర్ణింపలేరు. చివరకు నేను కూడా నీ స్వరూపమును చక్కగా వర్ణింపలేను. అట్లే నిన్ను వేదములన్నియు వేద, వేదార్ధ చర్చలు జరుపుకొను వేదవాదలు సహితము వర్ణింపజాలకున్నాను. అని విష్ణువు గణపతిని స్తుతించెను.

ఈ విధముగా శ్రీమహావిష్ణువు, దేవతలు, మునీశ్వరులందరున్న ఆ సభలో గణపతిని స్తుతించి ఇతర దేవతలందరివలె మిన్నకుండెను.

ఇదం విష్ణుకృతం స్తోత్రం గణశస్య చ యః పఠేత్‌ | సాయం ప్రాతశ్చ మధ్యాహ్నే భక్తియుక్తః సమాహితః || 52

తద్విఘ్ననాశం కరుతే విఘ్నేశః సతతం మునే | వర్ధతే సర్వకల్యాణం కల్యాణజనకః సదా || 53

యత్రాకాలే పఠిత్వా యో యాతి తద్భక్తిపూర్వకం | తస్యసర్వాభీష్టసిద్ధిర్భవత్యేవ న సంశయః || 54

తేన దృష్టం చ దుఃస్వఫ్నం సుస్వప్నముపజాయతే | కదాzపిన భ##వేత్తస్య గ్రహపీడా సుదారుణా || 55

భ##వేద్వినాశః శత్రూణాం బంధూనాం చాపి వర్ధనం | శశ్వద్విఘ్నవినాశశ్చ శశ్వత్సమ్యగ్వివర్ధనం || 56

స్థిరా భ##వేద్గృహే లక్ష్మీః పుత్రపౌత్రవివర్ధనం | సర్వైశ్వర్యమిహ ప్రాస్య హ్యంతే విష్ణుపదం లభేత్‌ || 57

ఫలం చాపి చ తీర్ధానాం యజ్ఞానాం యద్భవేత్‌ ధ్రువం | మహతాం సర్వదానాం తద్గణశ ప్రసాదతః || 58

గణపతి యొక్క ఈ స్తోత్రమును ప్రాతర్మధ్యాహ్న సాయంసంధ్యలందు నియమనిష్ఠలతో భక్తిపూర్వముగా చదివినచో విఘ్నాధిపతి అతని విఘ్నములనన్నిటిని నాశనము చేయును. మంగళకారియగు గణపతి అతనికి సమస్తమంగళములను కలిగించును. పరదేశగమన సమయమున ఈ స్తోత్రమును భక్తితో చదివినచో అతని అభీష్టములన్నీయు తప్పక తీరును. ఈ స్తోత్రమును భక్తితో చదివినవారికి దుఃస్వప్నము కలిగినను సుస్వప్నమువలె సుప్వప్న ఫలితమును గణాధిపతియొసంగును. అతనికి ఎన్నడుకూడ దుష్టగ్రహముల వలన కలుగు బాధయనునది ఉండదు.అతని శత్రువులందరు నశింతురు. బంధువుల సంఖ్య పెరుగును. అతని ఇంట లక్ష్మిదేవి స్థిరముగానుండి అతనికి పుత్ర సౌత్ర సంతతి కలుగును. అతడు సమసై#్తశ్వర్యములను పొందును. మరణాంతరము అతడు వైకుంఠమును చేరును. శ్రీగణశుని అనుగ్రహము వలన అతనికి సమస్త పుణ్యతీర్ధములు సేవించిన ఫలము సమస్త యజ్ఞములాచరించినందువలన కలుగు ఫలితము సమస్త దానము చేసినచో లభించు ఫలమంతయులభించును. అని నారాయణ మునీశ్వరుడు నారుదునితో పలికెను.

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను.

శ్రుతం స్తోత్రం గణశస్య పూజనం చ మనోహరం | కవచం శ్రోతుమిచ్ఛామి సాంప్రతం భవతారణం || 59

ఓ నారాయణమునీ! నీఅనుగ్రహము వలన శ్రీగణశుని పూజను, స్తోత్రమును వింటిని. ప్రస్తుతము నాకు సంసారమనే సాగరమును తరింపజేయు గణపతి కవచమును వినవలెనని కోరిక కలదు. కావున మీరు నాకు దానిని వివరముగా తెలుపుడని కోరెను.

నారాయణ ఉవాచ- నారాయణుడు నారుదునితో ఈవిధముగా పలికెను.

పూజాయం సునివృత్తాయాం సభామధ్యే శ##నైశ్చరః | ఉవాచ విష్ణుం సర్వేషాం తారకం జగతాం విభుం || 60

శ్రీమహావిష్ణువు మొదలగు దేవతాగణము మునిసంఘము గణపతిపూజను చక్కగా నిర్వర్తించిన పిదప శ##నైశ్చరుడు, జగన్నాయకుడు అందరిని తరింపజేయు శ్రీమహావిష్ణువుతో ఈవిధముగా పలికెను.

శ##నైశ్చర ఉవాచ- శని ఈవిధముగా పలికెను.

సర్వదుఃఖవినాశయ పాపప్రశమనాయ చ | కవచం విఘ్ననిఘ్నసై#్య వద వేదవిదాం వర || 61

బభూవ నో వివాదశ్చ శక్త్యా వై మాయయా సహ | తద్విఘ్నప్రశమార్ధం చ కవచం ధారయమ్యాహం || 62

నాకు మాయస్వరూపిణియగు శక్తితో వివాదమేర్పడినది. అందువలన ఏర్పడు విఘ్నములను తొలిగించుకొనుటకు శ్రీ గణపతి యొక్క కవచమును ధరింపవలెనని యున్నది. అందువలన ఓ వేదవేదార్థతత్వజ్ఞా | సమస్త దుఃఖములను సమస్త పాపములను తొలిగించుకొనుటకై విఘ్నరాజు యొక్క కచమును నాకు వినిపింపుమని అడిగెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.

వినాయకస్య కవచం త్రిషు లోకేషు దుర్లభం | సుగోప్యం చ పురాణషు దుర్లభం చాగమేషు చ || 63

ఉక్తం కౌథుమశాఖాయాం సామవేదే మనోహరం | కవచం విఘ్ననాథస్య సర్వవిఘ్నహరం పరం || 64

రాజ్యం దేయం శిరో దేయం ప్రాణా దేయాశ్చ సూర్యజ | ఏవం భూతం చ కవచం న దేయం ప్రాణసంకటే || 65

ఆవిర్భావస్తిరోభావః స్వేచ్ఛయా యస్య మాయయా | నిత్యోzయయేకదంతశ్చ కవచం చాస్య వత్సక || 66

పూజాzస్యనిత్యా స్తోత్రం చ కల్పేzస్తిసంతతం | అస్య వై జన్మనః పూర్వం మునయశ్చ సిషేవిరే || 67

యథా మదవతారేషు జన్మవిగ్రహధారణం | తథా గణశ్వరస్యాzపి జన్మ శైలసుతోదరే || 68

యద్ధృత్వా మునయః సర్వే జీవన్ముక్తాశ్చ భారతే | నిశ్వంకాశ్చసురాస్సర్వే శత్రుపక్ష విమర్దకా || 69

కవచం విభత్రాం మృత్యు ర్న భియా యాతి సన్నిధిం | నాయుర్వ్యయో నాzశుభంచ బ్రహ్మాండే న పరాజయః || 70

దశలక్షజపేనైవ సిద్ధం తు కవచం భ##వేత్‌ | యో భ##వేత్సిద్దకవచో మృత్యుం జేతుం సచ క్షమః || 71

సుసిద్ధకవచో వాగ్మీ చిరంజీవి మహీతలే | సర్వత్ర విజయీ పూజ్యో భ##వేద్గ్రహణమాత్రతః || 72

మూలమంత్రమిమం పుణ్యం కవచం మంగళం శుభం | బిభ్రతాం సర్వపాపాని ప్రణశ్యంతి సునిశ్చితం || 73

భూతప్రేత పిశాశ్చ కుష్మాండా బ్రహ్మరాక్షసాః | డాకినీ యోగినీ యక్ష వేతాలా భైరవాదయః || 74

బాలగ్రహా గ్రహాశ్చైవ క్షేత్రపాలాదయస్తథా | వర్ణః శబ్దమాత్రేణ పలాయంతే చ భీరవః || 75

ఆధయో వ్యాధయశ్చైవ శోకాశ్చైవ భయవహాః | న యాంతి సన్నిధం తేషాం గరుడస్య

యధోరగాః || 76

ఋజవే గురుభక్తాయ స్వశిష్యాయ ప్రకాశ##యేత్‌ | ఖలాయ పరిశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్‌ || 77

ఈ వినాయ కవచము ముల్లోకములయందెచ్చటను లభింపదు. పురాణములలోనిది అతిరహస్యముగా కనిపించును. ఆగమములయందది అసలే కనిపింపదు.

సమస్తవిఘ్నములను తొలిగించునీ విఘ్నరాజు కవచము సామవేదమునకు చెందిన కౌథుమశాఖలో మాత్రము చెప్పబడినది.

ఓ శనీశ్వరా! రాజ్యమునివ్వవచ్చును. తన తలనైనా ఇవ్వవచ్చును. ఈ కవచమును ప్రాణాపాయము సంభవించినపుడైనను ఇతరులకీయరాదు. ఈ కవచము యొక్క మహిమవలన భక్తుడు ప్రత్యక్షము కావచ్చును. మాయమైపోవచ్చును. అట్టి గణపతి కవచము నిత్యమైనది. దానికి అధిదేవతయగు గణపతి నిత్యమైనవాడు.

గణపతిపూజ, స్తోత్రము ప్రతికల్పము కన్పించును. మునులు వీటిని జన్మింపక ముందునుండే సేవించుచుండిరి. అంతటి ప్రాచీనమైన ఈతని పూజాస్తోత్రములు. నేను అవతారములనెత్తి జన్మించి కరచరణాద్యవయవములు కల్గిన శరీరము ధరించినట్లే వినాయకుడు సైతము అవతారరూపియై పార్వతీదేవి గర్భమున జన్మించినవాడు.

గణపతి కవచమును ధరించిన మహర్షులందరు జీవన్ముక్తులైరి. దేవతలు భయపడక శత్రువులనందరను సంహరింపగలిగిరి. ఈ కవచమును ధరించినచో మృత్యువు భయముతో వారిజోలికిపోదు. అతడు నిత్య¸°వనుడై జీవించును. అతనికి ఆశుభములు కాని పరాజయమనునది కాని ఎన్నడు కలుగవు.

ఈ కవచము పదిలక్షలమార్లు ఏకాగ్రచిత్తముతో జపించినచో అతనికి మంత్రసిద్ధి కలుగును. ఈ కవచము సిద్ధించినచో అతడు మృత్యువును సహితము జయింపగలుగును. సిద్ధకవచుడైనవాడు చక్కని వాగ్మియగును చరింజీవియగును. ఈ కవచమును గురుముఖతః విన్నంతమాత్రమున అతడు సర్వత్ర విజయము పొందగలడు. అట్లే అంతట పూజ్యుడై మన్ననలనందుకొనగలడు. ఈ గణపతి కవచము చాలా మంగళప్రదమైనది. దీనిని ధరించినవారికి సమస్తపాపములు నశించును.

ఈ గణాధిపుని కవచమును చదువుచున్నప్పుడు ఆ కవచమంత్రముల యొక్క శబ్దము వినపడినంతమాత్రమున భూత, ప్రేత, పిశాచ, కుష్మాండ, బ్రహ్మరాక్షస, ఢాకినీ, యోగినీ, యక్ష, భేతాళ, భైరవాదులు బాలగ్రహాదులు భయపడి పరుగెత్తిపోవును. అట్లే ఆధివ్యాధులు, శోకాదులు గరుత్మంతుని చూచినపామువలె అతనిని సమీపింపజాలవు.

ఈ కవచమును ఋజుస్వభావము కలవాడును, వినయవిధేయతలు కల తన శిష్యునకు మాత్రమే ఉపదేశించవలెను. అట్లుకాక దుష్టుడైన వానికి దీనిని ఉపదేశించినచో గురువు వెంటనే మృతువాతపడును.

సంసారమోహకస్యాస్య కవచస్య ప్రజాపతిః | ఋషిః ఛందశ్చబృహతీ దేవో లంబోదరః స్వయం || 78

సర్వేషాం కవచానాం చ సారభూతమిదం మునే | ఓం గం హుం శ్రీగణశాయస్వాహా మే పాతుమస్తకం | ద్వాత్రింశదక్షరోమంత్రో లలాటం మే సదాzవతు || 79

ఓం హ్రీంక్లీం శ్రీం గమితి వై సతతం పాతు లోచనం | తాలుకే పాతు విఘ్నేశః సతతం ధరణీతలే || 80

ఓం హ్రీం శ్రీం క్లీమితి పరం సతతం పాతు నాసికాం | ఓం గౌం గం శూర్పకర్ణాయస్వాహా పాత్వధరం మమ | దంతాంశ్చ తాలుకాం జిహ్వాం పాతు మే షోడశాక్షరః || 81

ఓం లం శ్రీం లంబోదరాయేతిస్వాహా గండం సదాzవతు | ఓం క్లీంహ్రీం విఘ్ననాశాయస్వామా కర్ణం సదాzవతు || 82

ఓం శ్రీం గం గజాననాయేతి స్వాహా స్కంధం సదాzవతు | ఓం హ్రీం వినాయకాయేతి స్వాహా పృష్టం సదాzవతు || 83

ఓం క్లీం హ్రీమితి కంకాళం పాతు వక్షఃస్థలం పరం | కరౌ పాదౌ సదా పాతు సర్వాంగం విఘ్ననాశకృత్‌ || 84

ప్రాచ్యాం లంబోదరః పాతు చాగ్నేయ్యాం విఘ్ననాయకః | దక్షిణ పాతు విఘ్నేశో నైఋత్యాం తు గజాననః || 85

పశ్చిమే పార్వతీపుత్రో వాయవ్యాం శంకరాత్మజః | కృష్ణస్యాంశశ్చోత్తరే చ పరిపూర్ణతమస్య చ || 86

ఐశాన్యామేకదం తశ్చ హేరంబః పాతు చోర్ధ్వతః | అధో గణపతిః పాతు సర్వపూజశ్చ్య సర్వతః ||

స్వప్నే జాగరణ చైవ పాతు మాం యోగినాం గురుః || 87

ఓ శనీశ్వరా! ఈ గణపతి కవచమునకు సాక్షాత్‌ విఘ్నరాజే దేవత. అతడే ఋషి, బృహతి దాని ఛందస్సు. ఈ కవచము కవచములన్నిటికి సారభూతమైనది.

''ఓం గం హుం శ్రీ గణశాయస్వాహా'' అను మంత్రము నా శిరస్సును కాపాడుగాక. మపై#్ఫరెండు అక్షరములు కలిగిన గణశమంత్రము నా నొసటిని ఎల్లప్పుడు రక్షించునుగాక! ఓం హ్రీం క్లీం శ్రీం అను మంత్రము నాసికను ఎల్లప్పుడు కాపాడుగాక.

''ఓం గౌం గం శూర్పకర్ణాయస్వాహా'' అను మంత్రము నా పెదవులనెల్లప్పుడు రక్షించుగాక. పదునారు అక్షరముల గణపతి మంత్రము నా దంతములను, దౌడను, నాలుకను ఎల్లప్పుడు రక్షించుకుగాక. ఓం లం శ్రీం లంబోదరాయ స్వాహా అను మంత్రము నా చెక్కిలిని కాపాడుగాక. 'ఓం క్లీం విఘ్ననాశాయ స్వాహా'' అను మంత్రము నా చెవులను రక్షించునుగాక. ఓం శ్రీం గం గజననాయ స్వాహా' అను మంత్రము నా భుజములను రక్షించునుగాక. 'ఓం హ్రీం వినాయకాయ స్వాహా' అనుమంత్రము నా పృష్ఠభాగమును రక్షించునుగాక. 'ఓం క్లీం హ్రీం' అను మంత్రము నా ఎముకలగూడును, రొమ్మును కాపాడుగాక. విఘ్నములను హరించు గణపతి నా చేతులను, పాదములను, సర్వావయవములను రక్షించునుగాక. నా తూర్పు దిశను లంబోదరుడు, ఆగ్నేయదిశను విఘ్ననాయకుడు, దక్షిణదిక్కును విఘ్నేశ్వరుడు, గజాననుడు నైఋతి దిశను, పార్వతీపుత్రుడు పశ్చిమదిశను, శంకరాత్మజుడు వాయవ్యదిశను సర్వపరిపూర్ణుడైన శ్రీ కృష్ణుని అంశయగు గణపతి నా ఉత్తరధిశను, ఏకదంతుడు ఈశాన్యదిగ్భాగమును హేరంబుడు ఊర్ధభాగమును గణపతి అధోభాగమును, సర్వపూజ్యుడు అన్ని దిక్కులను, యోగిశ్రేష్ఠుడు స్వప్నావస్థయందు జాగ్రదవస్థయందు నన్ను కాపాడుగాక.

ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘ విగ్రహం | సంసారమోహనం నామ కవచం పరమాద్భుతం || 88

శ్రీకృష్ణేన పురా దత్తం గోలోకే రాసమండలే | బృందావనే వినీతాయ మహ్యం దినకరాత్మజ || 89

మయా దత్తం తుభ్యం చ యసై#్మ కసై#్మ న దాస్యసి | పరం వరం సర్వపూజ్యం సర్వసంకటతారణం || 90

గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేత్తు యః | కంఠే వా దక్షిణ బాహౌ సోzపి విష్ణుర్న సంశయః || 91

అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ | గ్రహేంద్ర కవచస్యాస్య కళాం నార్హంతి షోడశీం || 92

ఇదం కవచమజ్ఞాత్వా యో భ##జేత్‌ శంకరాత్మజం | శతలక్ష ప్రజప్తోzపి నమంత్రః సిద్ధిదాయకః || 93

ఇతి సంసారమోహనం నామ కవచం | దత్వేదం సూర్యపుత్రాయ విరరామ సురేశ్వరః | పరమానందంసంయుక్తా దేవాస్తస్థుః సమీపతః || 94

ఓ శనీశ్వరా సమస్తమంత్రములకు సారభూతమైనది, మిక్కిలి అద్భుతమైన, సంసారమోహనమను పేరుగల గణపతి కవచమును నీకు చెప్పితిని.

ఈ కవచమును నాకు గోలోకమున రాసమండలమందున్న శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశించును. నేను నీకు ఈ కవచమునుపదేశించితిని. సమస్త బాధలను తొలిగించునది, అందరిచే మన్ననలనందుకొను శ్రేష్ఠమగు ఈ గణపతి కవచమును అర్హతలేనివారికి ఎన్నడును ఉపదేశింపరాదు.

ఈ కవచమును ఉపదేశించిన గురువును శాస్త్రపద్ధతిలో పూజించి దీనిని కంఠమందు లేక కుడిచేతికి కట్టుకొన్నచో అతడు విష్ణుమూర్తితో సమానుడగును. వేలకొలది అశ్వమేధయాగములు వందలకొలది వాజపేయయాగములు ఈ కవచమునకు పదునారవంతైన కాజాలవు.

ఈ కవచము వదిలిపెట్టి శ్రీ మహా గణాధిపతి మంత్రమును కోటీ పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్ధింపదు.

ఇట్లు సంసారమోహనమను పేరుగల ఈ కవచమును శ్రీ మహావిష్ణువు శనీశ్వరునకు ఉపదేశించెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తీతీయ గణపతిఖండే నారద నారాయణసంవాదే గణశపూజాస్తవకవచకథనం నామత్రయోదశోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్తేమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణశుని పూజ, స్తోత్రము కవచము గల

పదమూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters