sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏకాదశోzధ్యాయః - శ##నైశ్చరుని అధోదృష్టికి కారణకథనం

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను.

హరిస్తమాశిషం కృత్వా రత్నసింహాసనే వరే | దేవైశ్చ మునిభిస్సార్థ మవసత్తత్రసంసది || 1

దక్షిమే శంకర స్తస్య వామే బ్రహ్మా ప్రజాపతిః | పురతో జగతాం సాక్షీ ధర్మో ధర్మవతాం వరః || 2

తథా ధర్మసమీపే చ సూర్యః శక్రః కళానిధిః | దేవాశ్చ మునయో బ్రహ్మన్నూషుః శైలాః సుఖాసనే || 3

ననర్త నర్తకశ్రేణీ జగుర్గంధర్వకిన్నరాః | శ్రుతిసారం శ్రుతిసుఖం తుష్టువుః శ్రుతయో హరిం || 4

శ్రీహరి శిశురూపియైన గణపతినాశీర్వదించి, దేవతలు మునులు పరివేష్టింప సభాస్థలమున రత్నసింహాసనముపై ఆసీనుడయ్యెను. ఆ శ్రీహరియొక్క కుడిభాగమున శంకరుడు, ఎడమవైపు బ్రహ్మదేవడు ఆసీనులైరి. అతనిముందు కర్మసాక్షిధర్మవిదులలో శ్రేష్ఠుడైన ధర్మదేవతయుండెను. ధర్మదేవతయొక్క సమీపమున సూర్యుడు, దేవేంద్రుడు, చంద్రుడు, కూర్చొనియుండిరి. దేవతలు, మునులు, శైలములు సుఖముగా కూర్చొనియున్న ఆసభలో నర్తకీమణులు నాట్యముచేయుచుండగా గంధర్వకిన్నరాదులు శ్రీహరిగుణములను చక్కగా పాడసాగిరి. వేదములుకూడ శ్రీహరినిగూర్చి చెవులకింపుగా స్తోత్రము చేయసాగినవి.

ఏతస్మిన్నంతరే తత్ర ద్రుష్టుం శంకరనందనం | ఆజగామ మహాయోగీ సూర్యపుత్రః శ##నైశ్చరః || 5

అత్యంత నమ్రవదన ఈషన్ముద్రితలోచనః | అంతర్బహిః స్మరన్‌ కృష్ణం కృష్ణైకగతమానసః || 6

తపఃఫలాశీ తేజస్వీ జ్వలదగ్ని శిఖోపమః | అతీవసుందరః శ్యామః పీతాంబరధరో వరః || 7

ప్రణమ్య విష్ణుం బ్రహ్మాణం శివం ధర్మం రవిం సురాన్‌ | మునీంద్రాన్‌ బాలకం ద్రుష్టుం జగామ తదనుజ్ఞయా || 8

ఆ సమయమున సూర్యుని కుమారుడగు శ##నైశ్యరుడు శంకరుని పుత్రుడగు గణపతిని చూడవలెనని అచ్చటకు వచ్చెను. అతడు వినయముచే పూర్తిగా శిరస్సువంచుకొని యుండెను. శ్రీకృష్ణుని మనసా వచసా స్మరించుచుండుటచే అరవిరిసిన నేత్రకమలములతో మంచి తేజఃసంపన్నుడై, తాను శ్రీకృష్ణుని గూర్చి చేసిన తపఃఫలితముననుభవించుచుండెను. మండుచున్న అగ్నిశిఖలవంటి కాంతిగల ఆ శనీశ్వరుడు నల్లనిరూపుతో, పీతాంబరమును ధరించి అందముగా కనిపించుచుండెను. అతడు శ్రీహరిని, బ్రహ్మదేవుని, శంకరుని, ఇంకను ఆ సభలోనున్న ధర్మదేవతను, సూర్యుని, దేవతలను, మునులనందరిని నమస్కరించి వారియొక్క అనుమతి తీసికొని శిశురూపముననున్న గణపతిని చూచుటకుపోయెను.

ప్రధానద్వారమాసాద్య శివతుల్యపరాక్రమం | ద్వాఃస్థం వై శూలహస్తం చ విశాలాక్షమువాచ హ || 9

అంతఃపురముయొక్క ప్రధానద్వారమున శూలహస్తుడు సివునితో సమానమైన పరాక్రమము కల విశాలాక్షుడను శివకింకరుని చూచి అతనితో నిట్లనెను.

శ##నైశ్చర ఉవాచ - శనీశ్వరు డిట్లనెను.

శివాజ్ఞయా శిశుం ద్రష్టుం యామి శంకర కింకర | విష్ణుప్రముఖదేవానాం మునీనామనురోధతః || 10

ఆజ్ఞాం దేహి చ మాం గంతుం పార్వతీసన్నిధిం బుధ | పునర్యామి శిశుం దృష్ట్వా విషయాసక్త మానసః || 11

ఓ శంకరునియొక్క కింకరుడా! నేను శివుని ఆజ్ఞగైకొని, విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షుల సమ్మతిని తీసికొని పార్వతీపుత్రుని చూచుటకు పోవుచున్నాను. శిశువును చూచినతరువాత తిరిగివెళ్ళిపోదును కావున పార్వతీదేవి దగ్గరకు పోవుటకు నాకు అనుమతినిమ్మని శ##నైశ్చరుడడిగెను.

విశాలాక్ష ఉవాచ - విశాలాక్షుడిట్లు పలికెను.

ఆజ్ఞావహో న దేవానాం నాzహం శంకరకింకరః | మార్గం దాతుం నశక్తోzహం వినా మన్మాతురాజ్ఞయా || 12

ఇత్యుక్త్వాzభ్యంతరభ్యేత్య ప్రేరితః స శివాజ్ఞాయా | దదౌ మార్గం గ్రహేశాయ విశాలాక్షో ముదా తతః || 13

ఓ శనీశ్వరా! నేను దేవతలయొక్క ఆజ్ఞను శిరసావహించను. అట్లే శంకరుని ఆజ్ఞనుకూడ నేను అనుష్ఠింపను. నాతల్లియగు పంపెను.

శనిరభ్యంతరం గత్వా చానమన్నమ్రకంధరః | రత్నసింహాసనస్థానం చ పార్వతీం సస్మితాం ముదా || 14

సఖీభిః పంచభిః శశ్వత్సేవితాం శ్వేతచామరైః | సఖీదత్తం చ తాంబూలముపభుజ్య సువాసితం || 15

వహ్నిశుద్దాంశుకాధానాం రత్నభూషణ భూషితాం | పశ్యంతీం నర్తకీనృత్యం పుత్రం ధృత్వా చ వక్షసి || 16

నతం సూర్యసుతం దృష్ట్వా దుర్గా సంభాష్య సత్వరం | శుభాశిషం దదౌ తసై#్మ పృష్ట్వా తన్మంగళం శుభం || 17

పార్వతీదేవియొక్క సేవకుడగు విశాలక్షడు శ##నైశ్చరుని అంతఃపురములోనికి పంపగా వినయముచే తలవంచుకొనియున్న శ##నైశ్చరుడు రత్నసింహాసనముపైనున్న పార్వతీదేవిని చూచెను. ఆ దేవి రత్నసింహాసనముపై గూర్చుండి, ఐదుగురు పరిచారికలు తెల్లని చామరములు వీచుచూ సేవింపుచుండగా పరిశుద్ధమైన వస్త్రమును ధరించి, రత్నభూషణములను అలంకరించుకొని తన పుత్రుని రొమ్మునకు హత్తుకొని నర్తకీమణుల నృత్యమును చూచుచుండెను. పార్వతీదేవి తలవంచుకొనియున్న శనీశ్వరుని యోగక్షేమములు విచారించి ఆశీర్వదించి ఇట్లు పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

కథమానమ్రవక్త్రస్యం శ్రోతుమిచ్చామి సాంప్రతం | కిం న పశ్యసి మాం సాధో బాలకం వా గ్రహేశ్వర || 18

ఓ శనీశ్వరా! నీవెందులకు తలవంచుకొని నిలబడినావు. నన్ను కాని, నా పుత్రునికాని నీవెందుకు చూడకున్నావో దానిని నాకు వివరముగా తెలుపుము.

శంకరువాచ - శ##నైశ్చరుడిట్లు పలికెను.

సర్వే స్వకర్మణా సాద్వి భుజంతే తపసః ఫలం | శుభాశుభం చ యత్కర్మ కోటికల్పైర్న లభ్యతే || 19

కర్మణాజాయతే జంతుర్బ్రహ్మేంద్రార్యమమందిరే | కర్మణా నరగేహేషు పశ్వాదిషు చ కర్మణా || 20

కర్మణా నరకం యాతి వైకుంఠం యాతి కర్మణా | స్వకర్మణా చ రాజేంద్రో భృత్యశ్చాపి స్వకర్మణా || 21

కర్మణా సుందరః శశ్వద్వ్యాధియుక్తః స్వకర్మణా | కర్మణా విషయీ మాతర్నిర్లిప్తశ్చ స్వకర్మణా || 22

కర్మణా ధనవాన్‌ లోకో దైన్యయుక్తః స్వకర్మణా | కర్మణఆ సత్కుటుంబీ చ కర్మణా బంధుకంటకః || 23

సుభార్యశ్చ సుపుత్రశ్చ సుఖీ శశ్వత్‌ స్వకర్మణా | అపుత్రకశ్చ కుస్త్రీకో నిస్త్రీకశ్చ స్వకర్మణా || 24

ఓ పార్వతీదేవీ ! ఈలోకముననున్న ప్రాణులన్నియు తాము చేసికొన్న కర్మలననుసరించి శుభాశుభఫలితములను పొందుచున్నారు. కర్మవలననే ప్రాణిబ్రహ్మేంద్రుదుల గృహములలో మానవగృహములలో పశువులు మొదలగువాటియొద్ద జన్మనెత్తుచున్నాడు. కర్మవలననే వైకుంఠమునుగాని నరకమునుగాని ప్రాణులు పొందుచున్నారు. ఆకర్మవలననే ప్రాణి మహారాజుగా, సేవకుడుగా జన్మనెత్తుచున్నాడు. ఆ కర్మవలననే కొందరు వ్యాధులచే బాధపడుచున్నారు. కొందరు ధనవంతులగుచున్నారు. దీనులుగా బ్రతుకుచున్నారు. బంధువులలో మంచిపేరునుగాని చెడుపేరునుగాని పొందుచున్నారు. అట్లే మానవుడు తాను చేయు కర్మప్రభావమువలననే మంచిభార్యను, సత్పుత్రులను, లేక చెడుభార్యును, చెడుపుత్రులను పొందుచున్నాడు. అట్లే కర్మప్రకభావమువలనే భార్యరహితుడుగను, పుత్రరహితుడగును అగుచున్నాడని చెప్పెను.

ఇతిహాసం చాతి గోప్యం శ్రుణు శంకరవల్లభే | అకథ్యం జననీపార్శ్వే లజ్జాజనక కారణం || 25

ఆబాల్యకృష్ణభక్తోzహం కృష్ణధ్యానైక మానసః | తపస్యాసు రతశ్శశ్వత్‌ విషయేzపిరతః సదా || 26

పితా దదౌ వివాహే తు కన్యాం చిత్రరథస్య చ | అతితేజస్వినీ శశ్వత్తపస్యాసు రతా సతీ || 27

ఏకదా సా త్వృతుస్నాతా సువేషం స్వం విధాయ చ | రత్నాలంకారసంయుక్తా మునిమానసమోహినీ || 28

హరేః పదం ధ్యాయమానం పశ్యంతీ మదమోహితా | మత్సమీపం సమాగత్య సుస్మితాలోలలోచనా || 29

శశాప మామపశ్యంతం ఋతునాశాచ్చ కోపతః | బాహ్యజ్ఞాన విహీనం చ ధ్యానసంలగ్నమానసం || 30

న దృష్టాzహం త్వయాహ్యేన న కృతం హ్యృతురక్షణం | త్వయా దృష్టం చ యద్వస్తు మూఢ సర్వం వినశ్యతి || 31

అహం చ విరతో ధ్యానాత్తోషయంస్తాం తదా సతీం | శాపం మోక్తుం న శక్తా సా పశ్చాత్తాపమవాప హ || 32

తేన మాతర్నపశ్యామి కించిద్వస్తు స్వచక్షుషా | తతః ప్రభృతి నమ్రాస్యః ప్రాణిహింసా భయాదహం || 33

ఓ పార్వతీదేవీ నేను ఎల్లప్పుడు తలవంచుకొనియుండుటకుగల కథను వినుము. ఇది మిక్కిలి రహస్యమైనది. మాతృస్వరూపిణివైన నీకు చెప్పతగనిది. సిగ్గుకు కారణమైనది.

నేను చిన్నప్పటినుండియే శ్రీకృష్ణునియందు పరమభక్తికలవాడను. అనేకవిధములైన తపస్సులుచేసికొనెడివాడను. ఐనను విషయవైఛలను వదలుకొనలేదు. అట్టి నాకు మా తండ్రియగు సూర్యుడు చిత్రరథుని పుత్రికనిచ్చి వివాహము చేసెను. ఆమె కూడ ఎల్లప్పుడు తపస్సుచేసికొనెడిది చక్కని తేజస్సంపన్నురాలు.

ఒకదినము నాభార్యఋతుస్నాతయై రత్నాభరణములను ధరించి మునుల మనస్సుల మనస్సులను మోహింపచేయు వేషమును ధరించి నా సమీపమునకు వచ్చెను. ఆ సమయమున నేను శ్రీహరిపదధ్యానము చేసికొనుచు బాహ్యజ్ఞానములేక నా మనస్సునంతయు ధ్యానమునందు మగ్నముచేసియుంటిని. కాని నా భార్య కామమోహితయై చిరునగవుకల కళ్ళతో నన్ను సమీపించి శ్రీహరిపదములను ధ్యానించుచున్న నన్నిట్లు శపించెను.

ఓ శనీశ్వరా! నీవు నాపై కన్నెత్తిచూడక నా ఋతురక్షణమును చేయనందువలన నీవు చూచిన ప్రతివస్తువు నశించిపోవునని శపించెను. నేను ధ్యానము చేసికొని వేచిన తరువాత నాభార్యను సంతోషపెట్టినను ఆమె తన శాపమును మాత్రము ఉపసంహరింపలేకపోయినది. అందువలన నేను ఏవస్తువునైనను నాకంటితో చూడలేకపోవుచున్నాను. నాటినుండి నా దృష్టిసోకి ఏ ప్రాణి హింసకు గురియగునోయని తలవంచుకొని తిరుగుచున్నానని శనీశ్వరుడు చెప్పెను.

శ##నైశ్చరవచః శ్రుత్వా చాహసత్పార్వతీ మునే | ఉచ్చైః ప్రజహసుః సర్వా నర్తకీ కిన్నరీగణాః || 34

శ##నైశ్చరుడు తనగాథను వివరింపగా విని పార్వతీదేవి ఆమె సఖీగణము అచ్చటనున్న నాట్యకత్తెలు, గాయకీగణమంతయు ఫక్కున నవ్విరి.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే శనిపార్వతీసంవాదే శ##నే రధోదృష్టౌకారణకథనం నామ ఏకాదశోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున శనిపార్వతీదేవుల సంభాషణసమయమున చెప్పబడిన శ##నైశ్చరుని అధోదృష్టికి కారణముగల

పదునొకటవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters