Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదితొమ్మిదవ అధ్యాయము - నక్షత్రస్నానము

పుష్కర ఉవాచ || కృత్తికాస్నానముక్తంతే వహ్నికర్మవ్ర సాధనమ్‌ | తథారినాశనం ముఖ్యం వహ్న్యాధేయప్రదం తథా ||

రోహిణీషు తథా స్నానం ప్రోక్తంపుత్రప్రదం తవ | బ్రహ్మవర్చస కామస్య స్నానం సౌమ్యమిదం శృణు ||

పూర్ణమౌదుమ రైః పత్త్రెః క్పత్బారామ! ఘటత్రయమ్‌ | పూర్ణచంద్రాకింతైః శుక్లైః సూత్రమాల్యై రలంకృతమ్‌||

తేన సంస్నాపితః పశ్చా తౌక్షమవాసా యథావిధి | దేవతా పూజనం కృత్వాఘృతం హుత్వా హుతాశ##నే ||

ఓం కారవూతం సోమాయక్షీరం హుత్వా తథా జలే | నివేదనీయం సోమాయ తథా పిష్టమృగ త్రయమ్‌ ||

మృగశృంగేణ ధూపం చ తథా దద్యాదనంతరమ్‌ | సోమేన చ మణిర్ధార్యో జాతరూప పరిష్కృతః ||

దక్షిణా చాత్ర దాతవ్యా శుభ##ధేనుః పయస్వినీ | కృత్వా తన్నిత్యమాప్నోతి బ్రహ్మవర్చస ముత్తమమ్‌||

ఘృతా మ్రమధుపూర్ణేన స్నాతః కుంభేన మానవః | పుట్టిశాలంకృతేనాథ రక్త చందన వారిణా ||

రుద్రాయ మాంసం రుధిరం తథా చ మధు పాయసమ్‌ | కృష్ణాని వాసాంసి తథా ధూపం గుగ్గులుమేవ చ ||

దద్యా ద్ఘృతేన చ తథా హోమో మంత్రైర్విధీయతే | కృష్ణాని వాసాంసి తథా దాతవ్యా దక్షిణా భ##వేత్‌ ||

మేషాశ్వ నరలోమాని గర్దభస్య విశేషతః | ఆయసే తు మణౌ కృత్వా ద్వారి శత్రోర్నిథాపయేత్‌ ||

ఆర్ధ్రా స్నానమిదం రామ! సర్వశత్రు వినాశనమ్‌ | సర్వగంధైః ఫలైర్బీజైః పూర్ణం కృత్వా ఘటత్రయమ్‌ ||

స్నాపనం తేన కర్తవ్యమాదిత్త్యె స్తదనంతరమ్‌ | నవనీతం చ కుల్మాషం మత్స్యాం శ్చైవసురాం తథా ||

నివైదయేచ్చైవ తథా మత్స్యాని సురభీణి చ | ఘృతాక్షతాభ్యాం ధూపేన హోమశ్చైవ విధీయతే ||14||

తద్దినే తు నదీయత్ర యోగే గచ్చతు తాం ముదా | సువర్ణరూప్యగంధ శ్చ ధారణీయ స్తథా మణిః ||15||

దక్షిణా చాత్ర దాతవ్యా రామ! ధేనుః పయస్వినీ | స్నాతః పునర్వసావేవ జ్ఞాతిశ్రైష్ఠ్య మవాప్నుయాత్‌ ||

పుత్రాన్వా సుమహాభాగం యదీఛ్చతి తదాప్నుయాత్‌ | గౌరసర్షపకల్కేన రామో త్సాదిత విగ్రహః ||

గవ్యాజ్య పూర్ణకుంభేన స్నాతః స్నాతస్త థౌషధైః | అహతాంబర సంవీతః పాయసం వినివేదయేత్‌ ||

శుక్లాని చైవ మాల్యాని వాసాంస్య పహతాని చ || హోమైశ్చ పాయసేనాత్ర ధూపం గంధైశ్చ దాపయేత్‌ ||

మణిః శిరసి ధార్య శ్చ దండాగ్రే బ్రహ్మాచారిణః | సువర్ణగర్భం పుష్యేణ స్నానం పుష్టికరం భ##వేత్‌||

దక్షిణా చాత్ర దాతవ్యా ఘృతం కనకసంయుతమ్‌ | షడ్‌ద్వజాన్‌ నీలసూత్రేణ నీలపుషై#్ప శ్చ వేష్టితాన్‌ ||

సర్షపాన్వేష్టయేద్రామ! నాగపుష్పేణ భూరిణా | వల్మీకానాం సహస్తస్య తథైవాగ్రమ్భదా ద్విజః ||

తైః స్నాతః సర్వనాగే భ్యో మధులాజా న్నివేదయేత్‌ | గంధోదకం తథా ధానాః ష్కృత్వాధ పునః పునః ||

క్షీరేణ హోమః కర్తవ్యో ధూపః సర్పత్వచా తధా | సర్పత్వక్‌ నాగపుష్పం చ సువర్ణం చ మణిర్భవేత్‌ ||

దక్షిణా చాత్ర దాతవ్యా శయనీయం మనోహరమ్‌ | స్నానం సార్పేణ తే ప్రోక్తం భోగ్యం సిద్ధికరం భ##దేత్‌ ||

శ్రీ ప్రదం వా మహా భాగ కధితం కామతస్తవ | 26

పుష్కరుడనియె. కృత్తికా నక్షత్రమందు స్నానము జఠరాగ్ని ప్రదీపకము శత్రునాశకము. అగ్న్యాధాన ఫలమొసంగును. రోహిణీ స్నానము పుత్రప్రదము. సోమ (చంద్ర) దేవతాకమయిన మృగశిర యందు స్నానముంగూర్చి వినుము. బ్రహ్మవర్చసకాముడు దీనిని సేయవలెను. మేడియాకులు నిండిన మూడు బిందెలపై పూర్ణ చంద్ర బింబము గుర్తులుపెట్టి తెర్లని గారముపూలమాలలతో నలంకరించి వానితో స్నానము సేయింవలెను. ఆ మీద పట్టుబట్ట ధరించి దేవతార్చన సేసి హోమము సేయవలెను. ఓంకార పూతమైన (ప్రణవముతో సంపుటి చేసిన) మంత్రముతో సోమునికి (చంద్రనికి) నీటిలో పాలు హోమము సేయవలెను. మఱియు పిండితో జేసిన మూడు మృగములను (లేళ్ళను) నైవేద్యము పెట్టవలెను. లేడి కొమ్ముతో ధూపము వేయవలెను. బంగారముతో మణి పొదివి చంద్రునికాభరణముగ నీయవలెను. పాలిచ్చెడి మంచి యావును. దక్షిణగనీయవలెను. ఇట్లు నిరంతరము సేసిన బ్రహ్మ వర్చస్సును బొందును. నెయ్యి మామిడి పండ్ల రసము తేనెయు నింపినది పట్టిసముచే (కత్తిచే) నలంకరింపబడినదియు రక్తచందనోదకముతో గూడిన కుంభముతో స్నానమును సేయవలెను. రుద్రునకు పంది మాంనము తేనె పాయసము నివేదింప వలెను. నల్లని వస్త్రము లీయవలెను. గుగ్గులు ధూపము వేయలెను. ఆజ్యహోమము సమంత్రకముగ జేయవలెను. నల్ల వస్త్రములు దక్షిణగ నీయవలెన. మేక గుఱ్ఱము మనుష్యులయొక్కయు ముఖ్యముగా గాడిదయొక్కయు రోమములను (వెంట్రుకలను) ఇనుప మణిగుండు యందు ఉంచి దానిని శత్రువునింటి గుమ్మమున బడవేయవలెను. ఇది ఆర్ద్రాస్నానము. సర్వ శత్రువినాశకము, ఆమీద పునర్వసు స్నానము. అన్నిరకాల గంధములు పండ్లు ధాన్యాలను నింపిన మూడుఘటముల జలముతో నా దిత్య నక్షత్రస్నానము సేయవలెను. అదితి దేవతాక నక్షత్రము పునర్వసు. ఆవ్వల వెన్న కుల్మాషము=గుగ్గిళ్ళు సురనుచేపలను పరిమళించు చేపలను నివేదన చేయవలెను. నెయ్యితోను అక్షితలతో ధూపముతో హోమము సేయవలెను. ఆనాడు నదికి వెళ్ళవలెను. ఇందు బంగారమువెండి గంధములతో మణినిధరింపవలెను. పాలిచ్చు గోవును దక్షిణగ నీయవలెను. ఇట్లు పునర్వసు స్నానము చేసిన వాడు జ్ఞాతులలో నధికుడైరాణించును. వుత్రవంతుడగును. అభిష్టసద్ధినందును. తెల్ల ఆవాలముద్దతో మేనికి నలుగుపెట్టుకొని ఆవునేతితోడి పూర్ణకుంభమునందలి యుదకముతో నోషధులతో స్నానముచేసి నూతన వస్త్రములు ధరించి పాయసము నివేదింపవలెను. తెల్లని పూలమాలను నూతనవస్త్రములను నక్షత్రదేవతకు సమర్పింపవలెను. పాయసముతో హోమము చేయవలెను. సుగంధ ధూపము వేయవలెను. రత్నమును శిరస్సునందు ధరింపవలెను. బ్రహ్మచారి అమణినిదండాగ్రమున ధరింపవలెను. బంగారము నుంచిననీటితో వుష్యమీ నక్షత్రస్నానము సేయవలెను. అది కర్తకు పుష్టి నిచ్చును. ఇందు దక్షిణగ నెయ్యి సువర్ణము దానమీయవలెను. ఆఱు జెండాలుకట్టి నల్లనిదారముతో నల్లని పూలుసమృద్ధియైన నాగపుష్పములతో ఆవాలు చేర్చి యాకడవలకు చుట్టి పుట్టమీద మన్నుతో స్నానము చేయవలెను. పిదప నాగులందరు తేనె పేలాలు నివేదింపవలెను. గంధోధకము అటుకు నాఱుభాగములు చేసి మరల మరల పాలతోగూడ హోమము సేయవలెను. పాము చర్మముతో ధూపము వేయవలెను. పాము చర్మము నాగపుష్పము బంగారము కలిపి మణి కట్టుకొనవలెను. తాయత్తు అన్నమాట. అందమైన పఱుపు మంచమును దక్షిణగదానమీభ##లెను. ఇది సిద్ధికరము, భోగకరము,లక్ష్మీప్రదరము కూడ. ఇది సార్పనక్షత (ఆశ్లేష) స్నానవిధి.

ప్లక్షపత్త్రెస్తిలైః కృష్ణైర్ఘట షట్కం తు పూరయేత్‌||

వేష్టయేత్కృష్ణ మాల్యై శ్చ తేన స్నాతో7హతాంబరః || దక్షిణాగ్రేషు దర్భేషు సప్తపిండానుపాహరేత్‌ ||

సుభాస్వరో బర్హిషదోహ్య గ్నిష్నాత్తా స్తధైవ చ | క్రవ్యాద శ్చోపహూతా శ్చ ఆజ్యపా శ్చ సుకాలినః ||28||

పితరః కధితాస్తేషాం పిండం దద్యాత్క్రమేణ చ | ధూపం బ్రీహియవైర్దద్యాత్తిలైర్హోమంతు కారయేత్‌ ||

దాతవ్యా దక్షిణా చాత్ర రతిలారజతమేవ చ | వచా చ కోరకం చైవ త్రివృతం ధారయేన్మణిమ్‌ ||

పితృప్రసాదం ప్రాప్నోతి కర్మ సిద్ధిమథాపి చ | మఘాస్నానమిదం కృత్వా నిత్యమేవ సమాహితః

మాక్షికం చ మధూకం చ తథైవ మధుయష్టికామ్‌ | కృత్వా కుంభద్వయం పూర్ణ భగ్నాంగస్నాపయేన్నరమ్‌||

శాలిపిష్టం తతః స్నాతోఘృతేన మధునా యుతమ్‌ | గంధమాల్య బహువిధం బహుకృత్వా భగాయ తు||

నివేదయిత్వా దేయాని చిత్రమాంసాని చాప్యథ | ఘృతేన ధూపోదాతవ్యో హోమః కార్యః ప్రియంగునా||

దక్షిణా చాత్రదాతవ్యా చిత్రవాసాంసి చాప్యథ | పారావతస్య పక్షాణి చక్రవాకస్య మానద ||

త్రివృతాని కథా కృత్వామణిం శిరసి ధారయేత్‌ | సౌభాగ్య మహదాప్నోతి స్నాత్త్వేవం భగదైవతే||

తిలమాక్షిక పూర్ణేన స్నాతః కుంభద్వయేన తు | ఆర్యరేక్షపాయసం దద్యాత్పీతరక్తే చ వాససీ ||

ధూపే శతావరీ దేయా హోమః కార్యన్తధా7 క్షతైః| తేజోవన్తీ ప్రియుగుశ్చ త్రివృత్తం ధారయే న్మణిమ్‌ ||

దక్షిణా చాత్రదాతవ్యా తధా రక్తే చ వాసిసీ | ఉత్తరా ఫల్గునీస్నానం సర్వారంభ ప్రసిద్ధిదమ్‌ || 39

వీర్యస్య వర్ధనం చాపి కర్తవ్యమన సూయునా || గజకామస్యతే స్నానం హస్తే పూర్వం మయోదితమ్‌ ||

పరసైన్య జయార్థాయ స్నానం తదపిశస్యతే | మంజిష్టాం చ సమంగాం చ మిసికాంతాం చ భార్గవ ||

కనకం రజతం చైవ పూర్ణకుంభే వినక్షిపేత్‌ | తేనాభిషిక్త శ్చి త్రాణి మాల్యవాసాం స్యనంతరమ్‌ ||

త్వాష్ట్రే నివేదయే ధ్భక్త్యా హోమం క్షీరేణ కారయేత్‌ | దక్షిణా చాత్ర దాతవ్యా చిత్రవస్త్రాణి మానద||

సర్వగంధై స్తధా ధూపం బలిం చిత్రం తథైవ చ | పృధక్సృతి ప్రసూతానాం పుష్పాణాం కనకైర్వృతమ్‌ ||14||

అష్టాదశానాం చ తథామణిం శిరసి ధి%ారయేత్‌ | ఏవం స్నాతస్తు చిత్రాసు సౌభాగ్యం మహదుశ్నుతే||

సర్వభూతేషు చాధిక్యం యదిఛ్ఛతి తదాప్నుయాత్‌ | రుక్మమశ్వత్థపత్రం చ ఖడ్గశృంగం తథైవ చ||

పూర్ణకుంభే వినిక్షిప్య స్నాతః శీదుసురాసవమ్‌ | వాయవ్యే ప్రయతో దద్యాతీక్షరం సపలలం దధి ||

గంధం ధూపం తధా దద్యో ద్ధోమే కార్యం తథా ఘృతమ్‌ | దక్షిణాచాత్ర దాతవ్యా వాసాంసి వివిధాని చ ||

ఉష్ట్రాశ్వశ్యా మసాహారీతహంస పక్షైః పయోన్వితమ్‌ | థారయే చ్చ మణిం విద్వాన్‌ స్వాతావేవం సమాచరేత్‌ ||

వాణిజ్యే సమ్యగాప్నోతి సిద్ధిం చ మహతీం నరః | విశాఖాసు తథాస్నానం కార్యం కుంభద్వయే నతు || 50

జువ్విఆకులు నల్ల పువ్వులను నాఱుకడవలందు నింపవలెను. నల్లని పూలమాలలు వానికి జుట్టువలెను. వానితో స్నానము సేయవలెను. చించుకున్న నూతనవస్త్రములందాల్చి దక్షిణాగ్రములుగా పరచిన దర్భలమీద నేడు పిండములం బెట్టవలెను. సుభాస్వరుడు బర్హిషదులు అగ్ని ష్వాత్తులు క్రవ్యాదుడు ఉపహూతులు ఆజ్యపులు సుకాలులు అను వారేడ్వురు పితృదేవతలు. వారికి క్రమముగా పిండము వేయవలెను. వడ్లుయవలతో ధూపము వేయవలెను. నువ్వులలో హోమము గావింపనగును. ఇందు నువ్వులు వెండియు దక్షిణగ నీయ వలెను. వచ=వస కోరకము=తక్కోలము మూడు పేటలు పేని మణిని దాల్చవలెను. దీనిచే పిత్రనుగ్రహము కర్మసిద్ధి బొందును. ఇది మఘా నక్షత్రస్నానము. తేనె ఇప్పపువ్వుయష్టిమధుకమును రెండకడవలందువేసి అంగవికలుని స్నానము సేయింపవలెను. బియ్యపు పిండి నెయ్యితేనె కలిపి ముద్దచేసి (చలిమిడన్నమాట) గంధమాల్యాదులతో చిత్ర మాంసమునుకూడ నివేదిపంవలెను. నేతితో ధూపము ప్రియంగువు (ప్రేంకణము)తో హోమము సేయవలెను. చిత్ర వస్త్రములు (రంగురంగుల బట్టలు) దక్షిణ నీయవలెను. పారావతము ప్రాపురము) చక్రవాక పక్షియొక్కయు టెక్కలు ముప్పేటగ బేని శిరస్పుపై మణిధారణము చేయవలెను. (తాయేత్తు కట్టు కొనవలెను.) ఇట్లు ఈ భగదైవత్య (పూర్వఫల్గుని. పుబ్ప) నక్షత్ర స్నాన మొనరించి సౌభాగ్యసమృద్ధి నందును. నువ్వులు తేనెయు నింపిన రెండకడవలతో నుత్తరనక్షత్ర మందు స్నానము చేయనగును, పరమాన్నము పెట్టవలెను. రెండెఱ్ఱని పచ్చని వస్త్రములీయవలెను. శతావరి (పిల్లి తౌగ) ధూపము వేయవలెను. అక్షతలతో హోమము కర్తవ్యము. తేజోవంతిని=(గజపిప్పలి) ప్రియంగువును (తాయెత్తుతోరముగా) ధరింపవలెను. ఇందు రెండెఱ్ఱని వస్త్రములు దక్షీణగా నీయవలెను, ఈ ఉత్తర ఫల్గునీ స్నానము సర్వకార్య సిద్ధి ప్రదము, వీర్యవర్ధనము, హస్తా నక్షత్రమందు గజకాముడై చేయదగిన స్నానమును గూర్చియీవరకే తెల్పితిని. ఆస్నానము పరసైన్యముల జయించుటకు శ్రేష్ఠమైనది. మంజిష్ఠి మంగ=పిండీతకము మిసిక=జటామాంసి బంగారము వెండిని పూర్ణకుంభ మందుంచి దానితో స్నానము చేయవలెను, రంగురంగుల పూలమాలలను వస్త్రములను ధరింపవలెను. పాలునివేదన చేయవలెను. పాలే హోమమును జేయవలెను. త్వాష్ట్రము త్వష్ట్ర ప్రజాపతి దేవతాకమయిన చిత్రా నక్షత్ర స్నాన విధియిది. ఇందు రంగురంగుల (చిత్రములైన) వస్త్రములు దక్షిణగ నీయవలెను. అన్ని గంధములతో ధూపము చిత్రబలి (రంగురంగుల) చిత్రాన్నము నివేదింపవలెను. వేరువేరు పాదులంబూసిన పూవులు బంగారముతో కలిపి పదునెన్మిదింటిచే శిరస్సునందుమణి తాయెత్తుగ ధరింపలెను. చిత్రా నక్షత్ర మందీస్నానము సేయు నతడు మహా సౌభాగ్యవంతుడగును, సర్వ భూతములందు నధికుడగును. ఏదికోరిన నది పొందును, వాయవ్య నక్షత్ర (స్వాతి) మందు పూర్ణకుంభములో బంగారము రావియాకులు ఖఠ్గమృగము కొమ్మునుంచి స్నానము చేసి శీధువును=చెఱుకుకల్లు సుర=సాధారణ మద్యము. ఆసవము=ద్రాక్షమద్యము పాలు మాసంము పెరుగు నివేదింపవలెను. గంధము ధూపమువేయవలెను. నెయ్యి హోమము సేయవలెను. రకరకాల వస్త్రములు దక్షిణగనీయవలెను. ఒంటెగుఱ్ఱము శ్యామ=నల్ల పిచ్చుక హారీత=పచ్చ పిట్ట హంస హంసయొక్క పక్షైః= రెక్కలతో పాలతోగూడ చేర్చి మణి (తోరమ) గట్టుకొనవలెను. దీనివలన వర్తకమునందు గొప్ప లాభమందగల్గును. విద్వాంసుడు శ్వాతినక్షత్రమందు స్నానమిట్లు చేయనగును విశాఖయందు రెండుకడవలతో స్నానము సేయవలెను. ఇది ఇంద్రాగ్ని దేవతాకమయిన నక్షత్రము.

కృత్తికాసు మహాభాగ తతఃశాకం నివేదయేత్‌ | ఇంద్రాగ్నిభ్యాం చ వాసాంసి పీతరక్తాని చాప్యథ ||

మాల్యాని చ మహాభాగ ధూపం చ ఘృతగుగ్గులమ్‌ | హోమర్థే చ ఘృతం కుర్యాద్దక్షిణా కనకంతథా ||

గణాధిపత్త్య మాప్నోతి కృత్వైవం నాత్ర సంశయః | సహస్రవీర్యం చానంతాం మధూకం చ తథా మిసిమ్‌ ||

పూర్ణకుంభత్రయే కృత్వా కృతస్వస్తికు లక్షణ | అహతాంబర సంవీతః సర్వగంధ ఫలాక్షతైః ||

మధునా చ బలిం దద్యా న్మిత్రాయ చ మహాత్మనే | వృశ్చికేన తథా ధూపం యవైర్హోమం చ మానద ||

పురద్వారం కటహాశ్చ చూడాకాష్ఠం కసాంచనమ్‌ | ధారయేద్దక్షిణాం దద్యాత్తాథా చ కనకం ద్విజ ||

ఏవం మైత్రేసదా స్నాతః సర్వభూతైః సమాప్నుయాత్‌ | మైత్రీం మనుజశార్దూల పురం వా కురుతే వశే ||

అగ్నిదైవత్య మయినకృత్తికలో గూడ అకుకూరను నివేదింపవలెను. ఇంద్రాగ్ని దేవతలకు పసుపు పచ్చని యెఱ్ఱని వస్త్రములనర్పించవలెను., పూలమాలలునంతే, నేతితో గుగ్గులతో ధూపము వేయలెను. నేతితో హోమము సేయవలెను, బంగారము దక్షిణయీవలెను. ఇదిసేసి గాణాపత్యము (సంఘాధి పత్యము) ఫలితముగాబడయును, సందేహము లేదు. మూడు పూర్ణకుంభములందు సహస్రవీర్యమును=గరిక మధూకము=ఇప్ప పువ్వును అనంత=ఉసిరిక మిసిని=వాము లేదా సదాపను నింపవలెను, అకుంభమందు స్వస్తిక లక్షణములు (ముద్రలు) వేయవలెను. ఉత్తరించని వస్త్రద్వయము దాల్చి సర్వ గంధములు పండ్లతో నక్షతలతో తేనెతో మంత్ర (అనురాధ నక్షత్ర) దేవతకు బలి నీయవలెను వృశ్చికముతో ధూపమీయవలెను, యవలతో హోమము సేయవలెను. పురద్వార కటాహాశ్చ=పురద్వార, కటాహరూపములను బంగారముతో నెమలి యీకలను తోరణముగా కట్టుకొనవలెను, బంగారము దక్షిణగ నీయనగును, ఈ మైత్ర ( అనూరాధ) నక్షత్ర స్నానము చేసినవాడు సర్వభూతమైత్రి నందును. పురమును జయించును.

తడాగ పద్మినీకూల నదీనద సముద్భవైః | తోయైః పూర్ణ ఘటాన్కృత్వా సర్వబీజ సమన్వితాన్‌ ||

సర్వరత్నౌష ధీపూర్ణాన్‌ త్రిః స్నానం తైః సమాచరేత్‌ | క్షౌమవాసాస్తు రత్నాని మాల్యాని చ ఫలాని చ ||

రత్నాని దద్యా చ్ఛక్రాయ ప్రాజ్‌ముఖః సుసమాహితః | ధూపం దద్యా చ్చ శీర్షేణ

విశాఖావన్మణి ర్భవేత్‌ ||60||

ఛత్రం చ దక్షిణాదేయా జ్యేష్ఠాయాం భృగునందన| స్నానమేవ సదా కృత్వా రాజ్యమాప్నోత్య కంటకమ్‌ ||

é జ్యేష్ఠా నక్షత్ర మందు ( ఇంద్ర దేవతాక మిది) చెఱువు తామరకొలను యొడ్డున నదులు నదముల (తూర్పుగా ప్రవహించు నది నది. పడమటగా బ్రవహించునది నదము నీటిని పూర్ణకుంభములనింపి అగ్నిబీజములు (నవదాన్యాలు) నందుంచి సర్వ రత్నములు సర్వౌషధుల నుంచి ముమ్మారు వానిచే నభిషేకముగావింప వలెను. అటుపై తెల్ల పట్టువస్త్రము దాల్చి రత్నములను మాలలను పండ్లను దీసికొని యింద్రునికి రత్నములను తూర్పు ముఖమై యీయవలెను. ఇద్రాగ్ని దైవత్యమయిన విశాఖకు వలె మణి (తోరము) గట్టకొన వలెను. విశాఖకు మణి చెప్పబడి యుండలేదు. పిప్పిలి వేరుతో ధూపము వేయవలెను. గొడుగు దక్షిణ యీయవలెను. ఇది జ్యేష్ఠా నక్షత్ర (ఇంద్ర దైవత్య) స్నానవిధి, దీని వలన రాజ్య లాభము కల్గును.

కృషికామస్య మూలేన స్నానముక్తం మయాపురా | తథా వాణిజ్య కామస్య ప్రాగషాఢాసు భార్గవ||

అథోత్తరాసు షాఢాసు కుర్యాద్ఘట చతుష్టయమ్‌ | పుష్పబీజ ఫలోపేతం తేన స్నాతస్తు మానవః ||

క్షౌమవాసాః సురాం చైవ పాయసం చ నివేదయేత్‌ | ముద్గమిశ్రం చ ధర్మజ్ఞ! మాల్యవాసాంసి చేచ్ఛయా ||

హోమే చ పాయసం కుర్యాధ్దూపే గో శృంగమేవ చ | ధాత్రీ పుష్పశమీ బిల్వైర్మణిర్ధార్యః సకాంచనైః ||

దక్షిణా చాత్ర దాతవ్యా సువర్ణం రౌప్యమేవ చ | రాజశ్రేష్ఠత్వ మాప్నోతి వివాదేషు జయం తథా ||

బిల్వం చ తగరం చైవ చందనం మధుయష్టికామ్‌ | ప్రియంగుం చ మధూకం చ త్రిషు కుంభేషు నిక్షిపేత్‌||

సంగమాదాహృతం తోయం తన్మ్పదం చ భృగూత్తమ | తేన స్నాతస్తతః స్నానం కుర్యాత్స ర్వౌషధైర్ద్విజ ||

కులుత్థాన్నం సశాల్యన్నం ముఖ్యాని చ ఫలాని రచ | బలించ విష్ణవే దద్యాన్ము ద్గైర్ధూపం తధైవ చ ||

రాజచ్ఛత్రస్య దండాగ్రాత్కాష్ఠం శక్రధ్వజాత్తథా | సింహాదంష్ట్రా మణిశ్చాత్ర సరుక్మః శివద్మస్సృతః ||

దక్షిణా చాత్రదాతవ్యాధేనుః కాంస్యోపదోహినీ | ఏవెం తు శ్రపణస్నాయీ రాజ్యమాప్నోత్య కంటకమ్‌ ||

అన్య దేశాధిపత్యం వా రాజ్యం మప్నోతి భార్గవ |

కృషి(వ్యవసాయము) నందు పూర్ణ ఫలము కోరువాడు మూలానక్షత్ర మందు స్నానము సేయువిధానము అట్లే వర్తక మందు లాభార్థియైన వానికి పూర్వాషాడా నక్షత్ర స్నానము పద్ధితిలోగడనే చెప్పితిమి. ఉత్తరాషాడ యందు (విశ్వదేవ దైవత్యము) నాల్గు కడవలందు పువ్వులు నవధాన్యములు పండ్లు నింపి వానితో స్నానము సేయవలెను. తెల్ల పట్టు బట్టలు ధరించి కల్లును పెసరుతో గూడిన పాయసమును నివేదన చేయవలెను.. పూల మాలలు వస్త్రములు సమర్పింప వలెను. పాయసముతో హోమము సేయవలెను. ఆవుకొమ్ము ధూపము వేయవలెను.ఉసిరి పత్రి పువ్వులు జమ్మి మారేడు నను వానిని గూర్చి బంగారముతో తోరము కట్టుకోనగును.ఇక్కడ బంగారము గాని వెండిగాని దక్షిణ యీయవలెను. దీని వలన రాజులలో దీని వలన రాజులలో శ్రేష్ఠుడగును. వివాదములందు జయమందును. శ్రవణ నక్షత్రమంను (విష్ణుదైవత్యము నందు) మారేడు, తగరము (నంది వర్ధనము), చందనము, యష్టిమధుకము ప్రియంగువు నల్లావాలు ఇప్పపువ్వు మూడు కడవలందు వేయవలెను. రెండునదులు కలిసిన తావున నీరు మన్నుతో నందుంచి యోషధులతో స్నానము సేయవలెను. కుళుత్థాన్నము (ఉలవల అన్నము)బియ్యపుటన్నము శ్రేష్ఠములయిన పండ్లు విష్ణువునకు నివేదనసేయవలెను. పెసలు ధూపము వేయవలెను. చక్రవర్తి శ్వేత్చ్ఛత్ర దండము నుండి ఇంద్రధ్వజము నుండి గైకొన్న కొయ్యను సింహముకోరయు గలిపి గుచ్చిన మణి (తాయెత్తును) ధరింప వలెను. కంచు పాలగిన్నెతో నీనిన ఆవును దక్షిణగ నీయవలెను. ఇట్లు శ్రవణానక్షత్ర స్నానము చేసిన నిష్కంటక రాజ్యముంబొందును. విదేశ రాజ్య పరిపాలనముం గూడ నొందును.

éఅతిముక్తక పత్రాణి బిల్వస్య చ తథా క్షిపేత్‌||

కుంభేషు పంచసు తతః స్నానం తైస్తు సమాచరేత్‌ | వాస్తుభ్యస్తు బలిం దద్యాత్‌ సువర్ణం మాక్షికే తతః ||

ధూవం వాయస పక్షైస్తు హోమః కార్యోఘృతేన తు | బ్రహ్మచారి శిలాలోహ కాకపక్షం తథైవ చ ||

కాకమాచీంరుక్మయుతాం మణిం శిరసి ధారయేత్‌ | రక్షిణా చాత్ర దాతవ్యా థేనుః కాంస్యోపదోహినీ ||75

ధనం ప్రాప్నోతి సుమహద్వి వాహే వాపి కన్యకామ్‌ | ఏవం స్నాతో ధనిష్ఠాసు నిత్యమేవ భృగుత్తమ ||

ధనిష్ఠ నక్షత్ర మందు (వసుదేవతాకము) నైదు పూర్ణ కుంభములందు అతిముక్తక పత్రముల మారేడు దళములు వేసి స్నానము చేయవలెను. వాస్తు దేవతలకు బంగారము తేనెలోవేసి నివేదన దేయవలెను. కాకి ఱక్కల ధూపము నేతితో హోమము విహితము. బ్రహ్మచారి(ణి) వారుణీ వృక్షము కరవీరణీ (కరౌర్‌ ఖరుణి అని కొంకణ దేశమున ప్రసిద్ధమైన పుష్పవృక్షము ఇది గ్రీథ్మఋతువును ఎఱ్ఱని పూలుపూయును) శిలాలోహ కాకనక్షత్ర కాకిఱక్క కాకమాచిని బంగారముతో కలిపిమణిని శిరస్సునందు ధరింపవలెను. ఇందు కంచు కడవతో ధేనువును దక్షిణగ నీయవలెను.

ఇట్లు ధనిష్టా నక్షత్ర స్నానము వల ధన సమృద్ధి గల్గును. వివాహార్థమైతే కన్యకయు లభించును.

ఆరోగ్యకారకం స్నానం పూర్వముక్తం తు వారుణమ్‌ | రత్నోదకేన స్నాతస్తు నరః కుంభద్వయేన తు ||

అజైకపాదాయ బలిం ఛాగం దద్యాత్తు పాయసమ్‌ | శుక్లాని చైవ మాల్యాని ఫలాని వివిధాని చ

ఖట్వాంగం చ తథా ధూపం హోమం చ పయసా తథా | వ్యాఘ్రదంష్ట్రా తథా లోమనఖం కనకమేవ చ

మణిర్ధార్యో భ##వేద్రామ ఛాగోదేయా చ దక్షిణా | అజైకపాదే స్నాతస్తు నిత్యమేవ సమాహితః ||

ఉద్దరేత్తు నిధిం రామ శత్రూన్వా విజయే ద్ద్రువమ్‌ | అహిర్బుద్న్యం తథా స్నానం గోదముక్తం పురాతవ ||

చందనం చ హరిద్రాంచ దర్భమూలం తథైవచ | కృత్వా కుంభే నరః స్నాయా త్కృత్వా పిష్టేన కన్యకామ్‌ ||

స్నానాలంకార వస్త్రాద్యా న్పూష్ణే దద్యాద్బలిం తతః | మధులాజా స్తధైవాత్ర ధూపం దద్యాత్‌ఘృతేన చ ||

హోమం ఘృతేన కర్తవ్యం దక్షిణా కనకం భ##వేత్‌ | బ్రాహ్మీం సువర్చలాం హోమం హోమగర్భో మణిర్భవేత్‌ ||

ఏవం పౌష్ణే సదాస్నాతో యః సదా యుజ్యతే నరః | ఆశ్వినే సుప్రదం స్నానం పూర్వముక్త మయాతవ ||

వై జయంతీం బలాం చైవ సమంగా చ భృగూత్తమ | ఇంద్రహస్తాం మధూకం చ కుర్యాద్రామ ఘటత్రయే ||

తేన స్నాతో యమాయాధ ప్రపద్యా త్తిలతండులమ్‌ | మాల్యాని చైవ చిత్రాణి పీతాని పసనాని చ ||

ఉరభ్ర శృంగం ధూపార్థే హోమార్ధే చ తధా తిలమ్‌ | దక్షిణా చాత్ర దాతవ్యా తిలం కనకమేవ చ ||

దర్భమూలై ర్మణిః కార్యః కనకేన చ వేష్టితః | ఏవం స్నాతోనరోయామ్యేదీర్ఘం జీవిత మాప్నుయాత్‌ ||

స్నానాని ముఖ్యాని తవోదితాని కామ్యాని పాప ప్రశమాయరామ |

ఏతాని కార్యాణి సదా ద్విజేంద్ర ధరాన్వి తేనాధ విచక్షణన ||90||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మా.స. రామంప్రతి పుష్కరోపాఖ్యానే

నక్షత్రస్నాన కథనన్నామ నవనవతితమో7ధ్యాయః ||

ఆరోగ్య కారకమగు వారుణ నక్షత్ర (శతభిష)స్నానమీవరకు చెప్పితిమి. పూర్వాభాద్రయందు (అజైకవాద దేవతాకము) రత్నములు వేసిన ఉదకముతో రెండుపూర్ణ కుంభములతో స్నానము చేయవలెను. మేకను, పరమాన్నమును అజైకపాదునకు నైవేద్యమీయవలెను. తెల్లని పూలమాలలు పలురకముల పండ్లు సమర్పించవలెను. ఖట్వాంగము(మంచపుకోడు) ధూపము వేయవలెను. పాలు హోమము సేయవలెను. పులికోర వెంట్రుక గోరు బంగారమును గూర్చి తాయెత్తును ధరింపవలెను, మేక దక్షిణయీయవలెను. పూర్వాభాద్రయందు స్నానము చేసిన యతడు నిధిని(గనిని)ఉద్ధరించును. శత్రుసంహారముచేయును. అహిర్బుద్న్యమందు ఉత్తరాభాద్రయందు స్నానము గోనంవదనిచ్చునని దీనిని గూర్చిమున్ను చెప్పితిమి-పూషదేవతాక (రేవతి) నక్షత్రమున చందనము పసుపు దర్భల మొదళ్ళు పూర్ణకుంభమందుంచి స్నానము చేయవలెను. పిష్టముతో(పిండితో) కన్యకనుజేసిస్నాన-అలంకార-వస్త్రాద్యుపచారమలు తేనెలాజలు బలినివ్వవలెను. నేతిలో ధూపమును హోమమును కనక దక్షిణను చేయవలెను. సరస్వతియాకు, అవిసెను, భస్మనుమణిగ చేయవలెను. ఇట్లు పౌష్ణస్నానము చేసినవాడు సమాహితచిత్తుడగును. అశ్వనీనక్షత్రస్నానము శుభ ప్రదమనిలోగడనే చెప్పబడినది. భరణి (యమదేవతయందు) వైజయంతిని=కటుకరోహిణికి బలను=ముత్తవ పులగము, మంగను=(శ్వసనము) గాడిద గదపఆను, ఇంద్రహస్తము మధుకము=ఇప్పను మూడు కడవలందువేసి స్నానము చేయవలెను. యమునకు తిలలు బియ్యము విచిత్ర మాల్యములు (రంగురంగుల పూలమాలలు) పసుపు పచ్చ వస్త్రములు ఉరభ్రశృంగము=పొట్టేలు కొమ్ము ధూపము నీయవలెను. నువ్వులతో హోమము చేయవలెను, నువ్వులు బంగారము దక్షిణ గనీయవలెను. దర్భ మొదళ్లకు బంగారము జుట్టి తాయెత్తు గట్టుకొనవలెను, ఇట్లు యమదేవ తాకనక్షత్ర స్నానము సేయునతడు దీర్ఘాయుష్మంతుడగును, ఓ పరుశురామా! కామ్యములు పాపప్రశమములయిన స్నానములు నీ కెఱింగించితిని ఓ ద్విజోత్తమ! వీనిని వివేకముగల రాజు నిరంతరము చేయుచుండవలెను.

ఇదిశ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున నక్షత్రస్నాన కధనమను తొంబదితొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters