Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదిఏడవ అధ్యాయము-శత్రునాశకర్మవర్ణనము

రామ ఉవాచ || అగ్న్యధాన మధాప్నోతి శత్రునాశ మథాపివా | స్వేచ్ఛయా కర్మణాకేన సదా యాదోనృపాత్మజ ||

éశత్రునాశకరం కర్మ కధయస్వ తతః పరమ్‌ | తదహం శ్రోతుమిచ్ఛామి తత్రశ్రద్ధా సదామమ||

పుష్కర ఉవాచ || కృతోపవాసో యామ్యరేక్ష కృత్తికాసు సదైవతు | పూజయేద్వాసుదేవం తు కుంకుమేన సుగంధినా ||

రక్తైశ్చ కుసుమైర్హృ ద్యైర్థూపం దద్యా చ్చ గుగ్గులమ్‌ | ఘృతేన దీపం దద్యా చ్చ రక్తవర్ణం తధైవ చ ||

నివేదనీయం దేవాయ తథా సర్వం నివేదయేత్‌ | హోతవ్యం సుసమిద్ధే7గ్నౌ తథైవాత్ర శుభం హవిః ||

ఆయుధాని చ దేయాని బ్రాహ్మణభ్య శ్చ దక్షిణా ||

కర్మైతదుక్తం రిపునాశకారి ధార్యం సదా శత్రుగణ ప్రమాధి |

కృత్వైత దగ్య్రం రిపునాశమాశు ప్రాప్నోతి మర్త్యోనహి సంశ యో7త్ర ||6||

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం రామంప్రతి

పుష్కరోపాఖ్యానే శత్రునాశకర్మ వర్ణనన్నామ సప్తనవతితమో7ధ్యాయః 97

రాముడనెను:- ఓ వరణకుమార! స్వేచ్చగా నొనరించిన యేకర్మచే అగ్నా ధానఫలమును బొందును శత్రునాశనమగును. దానిని వినగోరెదను. ఎరింగిపుంము. అనగా పుష్కరుండనియె - యామ్యర్‌క్షమందు (భరణియందు) ఉపనాసముండి కృత్తికయందు వాసుదేవుని సువాసనగల కుంకుమతో, ఎఱ్ఱని చక్కని పూవులతో బూజించిగుగ్గులు ధూపమువేసి ఆవునేతితో దీపము పెట్టవలెను. ఎఱ్ఱని పదార్థము నివేదింపవలెను. ప్రజ్జ్వలితాగ్నియందు శుభప్రదమైన హవిస్సు హోమము సేయవలెను. ఆయుధములర్పించవలెను. బ్రాహ్మణులకు దక్షిణనీయవలెను, ఇతి శత్రునాశన కర్మ. శత్రుగణ సంహారకము దీనిని తప్పక పూన వలసినది. దీనింగావించిన మానవుడు శత్రునాశనము వెనువెంటనే పొందును. నందియములేదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితియఖండలో శత్రునాశ కర్మ వర్ణనమును తొంబదియేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters