Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదియారవ అధ్యాయము-కృత్తికాస్నానవర్ణనము

రామఉవాచ || కర్మాణి శ్రోతుమిచ్ఛామి కామ్యాని గృహిణా మహమ్‌ | త్వత్తః సమస్త ధర్మజ్ఞ యాదోగణ నృపాత్మజ ||

పుష్కర ఉవాచ || కృతోపవాసో యామ్యరేక్ష సోపవాసస్య భార్గవః | పురోథాః స్నపనంకుర్యా త్కృత్తికాసు యధావిధి ||

అకాలమూలైః కలశైర్మృణ్మ యై రథ కాంచనైః | ఉజ్వలైర్లక్షణౖః పుర్ణై స్తథా తీర్థో దకైః శుభైః ||

అగ్నిమంథ శిరీషాణాం న్యగ్రోధా శ్వ త్థయోరపి | పత్రపూర్ణై స్తథా యుకై స్తిలైః ద్ద్విజోత్తమ! ||

వహ్నిం కుమారం శశినం ఖడ్గం మరుణమేవ చ | పూజయేత్కృత్తికాశ్చైవ గంధమాల్యాన్న సంపదా ||

పీతరక్తై స్తథా వర్ణైః ఘృతదీపైస్తధై వ చ | దధ్నా గవ్యేన లాజాభిరగ్ని మంధేన చాప్యధ ||

కృసరోల్లోపికాభి శ్చ అవూపై శ్చ పృథగ్విధైః | దేవతానాం యథోక్తానాం ప్రియంగుంజుహుయాత్తతః ||

చందనంచ మయూరాణాం లోమాని మనుజోత్తమ! | అగ్నిమంథ గృహాద్ధూమం కృత్వా రుక్మాంగదం మణిమ్‌ ||

ధారయే ధ్దక్షిణాం దద్యా చ్ఛ క్త్యా కనకమేవ చ | శ్వేతవాసా స్తతః పశ్చా త్పూజయే న్మధుసూదనమ్‌ ||

కర్మైతత్స తతం కృత్వా వహ్న్యాధాన మథాప్ను యాత్‌ | కర్మైతదుక్తం రిపునాశకారి సర్వాగ్ని కర్మప్రనమృద్ధిదిం చ ||

ధన్యం యశస్యం చ తథైవ కామ్యం నిత్యం కృతం ధర్మ విదాంవరిష్ఠ! ||10||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామంప్రతి

పుష్కరో పాఖ్యానే కృత్తికాస్నాన వర్ణనంనామ షణ్ణవతి తమో7ధ్యాయః || 96 పరశురాముడు పలికెను:- ఓవరుణకుమార! సర్వధర్మజ్ఞ! నీవలన గృహస్థుల కామ్యకర్మలను గూర్చి వినగోరెదనన పుష్కరుండిట్లనియె. పురోహితుడు భరణి నక్షత్రమందుపవాసముసేసి ఉపవాసము సేసిన వానికి కృత్తికా నక్షత్రమందు స్నవనము (స్నానము) సేయింపవలెను. అకాలమూలములు. జక్కనైనవి సలక్షణములైనవి. మృణ్మయములును లేక సువర్ణమయములయిన పూర్ణకుంభముల తీర్థోదకములతో నా స్నానము చేయింపవలెను. ఆశుభ తీర్థములందు నెల్లి దిరిసెన మఱ్ఱి రావి యాకులు వేసి నల్లనువ్వులు గూడ నుంచవలెను. దాన అగ్నిని కుమారుని చంద్రుని ఖడ్గమును ( ఇది వృత్తికా నక్షత్రరూపము గావున) కృత్తికలను గంధ మాల్యాన్నాదులచే బూజింపవలెను. ఆ పువ్వులు పసుపుపచ్చనివి ఎఱ్ఱనివియుం గావలెను. ధూప దీపములతో నర్పించి ఆవు పెరుగు పేలాలు అగ్నిమంథము=నెల్లి కృసరోల్లోపికలు=పులగవిశేషము అప్పమలు రకరకాలు నివేదింపవలెను. ఆమీద శాస్త్రోక్త దేవతలనుద్దేశించి ప్రియంగుపు (నల్లావాల)తో హోమము సేయవలెను., చందనము నెమలి యీకలు అగ్నిమంధ గృహమునుండి ధూపమువేసి రుక్మాంగదమను (బంగారు బానపు పురిని) మణిని యజమానిచే ధరింపజేయవలెను. దక్షీణగా యధాశక్తి బంగారము నీయవలెను. అటుపా తెల్లని వలువలందాల్చి విష్ణుని బూజింపవలెను, ఇదంతయు నెల్లపుడు జేసినవాడు అగ్న్యాధానము ఫలమందును. ఈ విధానము శత్రునాశనముసేయును. సర్వాగ్ని కర్మ సమృద్ధి నొసంగును. నిత్యమిదిసేసిన ధన్యము యశస్యము కామ్యముగూడ నగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున కృత్తికా స్నాన వర్ణనమను తొంబదియారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters