Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదియైదవ అధ్యాయము-గృహస్థధర్మము

పుష్కర ఉవాచ || వైవాహికే7గ్నౌ కుర్వింత కర్మ స్మార్తం సదాగృహీ | దాయకాలహృతే వాపిపితుర్మరణ కాలికే ||

మాతుర్వా భృగుజశ్రేష్ఠ! శ్రౌతం వైతాని కాగ్నిషు | దేవతానాం పితృణాంచ ఋషీణాం చతథానరః ||

ఋణవాన్‌ జాయతే యస్మాత్తన్మోక్షే ప్రయతేత్సదా | దేవనామనృణో జన్తుర్యజ్ఞైర్భవతి మానద! ||

స్వల్ప విత్తశ్చ పూజాభిరుపవాసై ర్వ్ర తై స్తథా | శ్రాథ్థేన పూజాయా చైవ పితౄణామన్నృణోభ##వేత్‌||

ఋషీణాం బ్రహ్మచర్యేణశ్రుతేన తపసా తథా| హుతం చైవాహుతం చైవ నిర్వాప్యం ప్రహుతం తథా||

ఫ్రాశితం చ మహాభాగ! పంచయజ్ఞా న్న హాపయేత్‌ | హుత మగ్నౌ విజానీయా దహుతం బలికర్మ యత్‌ ||

పిండ నిర్వాపణం రామ! నిర్వాప్యం పరికీర్తితమ్‌ | ప్రహుతం చ యధాయజ్ఞం పితృయజ్ఞం తధైవ చ ||

ప్రాశనం చ తథా ప్రోక్తాత్‌ యద్భుక్తం తదనంతరమ్‌ | పంచయ జ్ఞాన్సదా కుర్యాద్‌ గృహీ పాపా పనుత్తయే || 84

దేవయజ్ఞం భూతయజ్ఞం పితృయజ్ఞం తధైవ చ | మానుష్య మృషియజ్ఞం చ కుర్యాన్నిత్య మతంద్రితః || 91

దేవయజ్ఞం హుతం విద్యాద్భూతయజ్ఞం బలిక్రియా! పితృయజ్ఞం తథా పిండైః ఋషియజ్ఞం చ భార్గవ ||

స్వాధ్యాయ సేవా విజ్ఞేయా తథైవా తిథిపూడనమ్‌ | మనుష్యయవిజ్ఞోయః పంచయజ్ఞాన్న హాపయేత్‌ ||

విష్ణుం యజేత్తథా దేవం హవిర్యజ్ఞై శ్చ సప్తభిః | అగ్న్యాధానం మహాభాగ తథాగ్ని హవనక్రియా ||

దర్శం చ పౌర్ణమాసం చ చాతుర్మాస్యం తథైవ చ | ద్విరా గ్రహాయణష్టిశ్చ పాకే చ యవధానయోః ||

నిరూఢ పశుబన్థ శ్చ తధా సౌత్రామణిర్ద్విజః | సప్తభిః సోమసంస్థాభిర్యజేద్దేవం సనాతనమ్‌ ||

అగ్నిష్టోమం మహాభాగ చాత్యగ్నిష్టోనతమ మేవ చ | ఉక్థ్యం చ పావనీం చైవా ప్యతిరాత్రం తధైవచ ||

వాజపేయించ ధర్మజ్ఞై! అప్తోర్యామం తథైవ చ | అన్యై శ్చ వివధై ర్యజ్ఞైః పౌండరీకాదిభిస్తథా ||

గోసవేనాశ్వ మేధేన రాజసూయేన వా పునః | తథా పురుషమేధేన సర్వమేధేన భార్గవ ||

అన్యై శ్చ వివిధైర్యజ్ఞైర్నామ కల్పోచితై స్తథా | యజనం దేవదేవస్య వాసుదేవస్య కారయేత్‌ ||

యజ్ఞోవిష్ణు ర్మహాతతేజా యజమానః స ఎవహి | సఏవ యజ్ఞపాత్రాణి యజద్రవ్యాణి యాని చ ||

తం యజే త్సతతం రామ! సర్వదేవమయం హరమ్‌ | సత్యేన వై యజే ద్దేవం ప్రత్యబ్దం మునిపుంగవ ||

పశుప్రత్యయనం కుర్యాచ్చా తుర్మాసికమేవచ | ఇష్టిం వైశ్వానరీం కుర్యాత్తథా స్వల్పధనో నరః ||

అత్యే వాల్పే ధనే సోమం పిబేద్భార్గవ సత్తమ! | అయుఃపుత్రాన్యశో మేధాం ధనమంత్రగణం తధా ||

హన్త్యల్పదక్షిణో యజ్ఞస్త స్మాన్నాల్పధనో యజేత్‌ | యస్య త్రైవార్షికం భక్తం పర్యాప్తం భృత్యతృప్తయే ||

అధికం వాపి విద్యేత స సోమం పాతుమర్హతి | ప్రాజాపత్యమదత్త్వా చ అగ్న్యాధేయస్య దక్షిణా ||

అనాహితాగ్ని ర్భవతి బ్రాహ్మణో విభ##వే సతి | సర్వదేవమయో విష్ణుః ప్రత్యహం తస్య పూజనమ్‌||

ప్రతి మాయామపి తథా కర్తవ్యం భృగుసత్తమ! విష్ణుమేవాభి జానన్తి సర్వయజ్ఞేషు వైద్వీజాః ||

పాయసైః సుమనోభి శ్చ తస్యాపి యజనం స్మృతమ్‌ | తత్తద్దేవనికాయేషు తధైవ స్వయమేతవ వా ||

పూజాకార్యా బహిర్వేదౌ శ్రద్థయా భృగునందన | నత్వల్ప దక్షిణౖ ర్యజ్ఞైర్యజేతేహ కదా చన ||

విష్ణుం దేవనికాయస్థం యథా శ్రద్ధమరిందమ! | తపసా పూజయే న్నిత్యం తస్మా దల్పధనో నరః ||

సంపూజ్య దేవం పరమాన్నగంధైర్థూపైః సుగంధై శ్చ ఫలైశ్చ ముఖ్త్యెః

తస్మా దవాప్నోతి స సర్వయజ్ఞాం స్తస్మాత్స పూజ్యః సతతం మహాత్మా ||30||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామంప్రతి పుష్కరోపాఖ్యానే

గృహస్థ ధర్మ వర్ణనం నామ పంచనవతితయో అధ్యాయః || 95

పుష్కరునియె. గృహస్థుస్మార్తకర్మనెల్ల వైవాహికాగ్నియందు తండ్రి పోయినప్పుడు తల్లిపోయినపుడు దాయ కాల మందు గొని వచ్చిన యగ్నియందు సేయవలెను. శ్రౌతకర్మము (వేదోక్తమయినదానిని) వైతాని కాగ్నియందు (వితానము=యజ్ఞము-దాన హరించిన మధించి సేకరించి యగ్నియందు) జేయవలెను. దేవర్షి పితరుల ఋణములు మూటింటితో మానవుడు జన్మించును. వీనిని దీర్చుటకు బ్రయత్నింప వలెను. దేవతల ఋణము యజ్ఞముల చేత తీరును. స్వల్ప విత్తము గల వాడు పూజోప వాస వ్రతములచే దేవ ఋణము తీర్చుకొన వలెను. శ్రాద్ధములచే పితౄణము తీరును. ఋషి ఋణము బ్రహ్మచరయము చేత శ్రుతము వలన (పాండిత్యము చేత) తపస్సు చేత దీరును. వేద వేదాంగేతిహాస పురాణాదులు ఋషులను గ్రహించినవి గావున వానిని అధ్యయనము చేయుటచే ఋషిఋణము తీరును. హుతము అహుతము నిర్వాప్యము ప్రహుతము ప్రాశితము ననునవి పంచ యజ్ఞములు వానిని మానరాదు. హుతము అనగా నగ్నియందు దేవతల నుద్దేశించి చేయు హోమ ప్రక్రియ. అహుతము=బలికర్మ. నిర్వాప్యము=పిండ నిర్వాపణము. ప్రహుతము యజ్ఞమట్లుచేయు పితృయజ్ఞము. ప్రాశితము ప్రహుతానంతరము సేయు ప్రాశనము (భోజనము). గృహియీపంచ యజ్ఞములను నిత్యమును పాపము పోవుట కొనరింప వలెను. దేవయజ్ఞము భూతయజ్ఞము పితృయజ్ఞము మానుష్యము ఋషి యజ్ఞమునను పేర నీ మున్ను చెప్పబడిన యజ్ఞము. లైదనివే. హుతమే దేవయజ్ఞము అహుతము బలికర్మ. పితృయజ్ఞము పిండ (నర్వాపణము) ప్రదానము. స్వాధ్మాయ సేవనము ఋషి యజ్ఞము. అతిథి పూడనము మనుష్యయజ్ఞము ఈ పంచ యజ్ఞములను విడువరాదు. ఈ క్రింది సప్తహరవిర్యజ్ఞములచే విష్ణునర్చింపలలెను. 1) అగ్న్యాధానము 2) అగ్నిహవనక్రియ 3)దరేష్టిపౌర్ణమాసేష్టి 4) చాతుర్మాస్యేష్టి 5) యవధాన్యములు ఫలించినపుడు చేయ వలసిన ఆగ్రహోయణష్టులు రెండు 6) నిరూఢపశుబంధేష్టి 7) సౌత్రామణీయేష్టి, ఈ క్రింది సప్త సోమ సంస్థలచేత నాతనిని విష్ణుని యజింపవలెను. 1) అగ్నిష్టోమము 2) అత్యగ్నిష్టోమము 3) ఉక్థ్యము 4) పావనీ (షోడశి) 5) అతిరాత్రము 5)వాజపేయము 7) అప్తోర్యామము ఇవి సప్త సోమ సంస్థలు మరియు పౌండరీకాది యజ్ఞములచేత గోసవము అశ్వమేధము రాజసూయము పురుషమేధము సర్వమేధము మరియు పేరునకు తగిన కల్పము నకు దగిన వానిచేత దేవదేవుడగు వాసుదేవుని యజనముగావింపవలెను.

యజ్ఞమన విష్ణువే, యజమానుడాయనయే అతడే యజ్ఞపాత్రములు యజ్ఞ ద్రవ్యములేవి గలవో యవియు నాతడే-వానిచేత సర్వదేవ మయుడైన హరిని యజింపవలెను. ప్రతి సంవత్సరము సత్యముతో (నమ్మకముతో) నా హరిని యజింపవలెను. అల్పధనియగు నాతడు పశుప్రత్యయనము (నిరూఢ పశుబంధము) చాతుర్మాస్యమును వైశ్వానరేష్టిని జేయవలెను. ఓ భార్గవశ్రేష్ఠ, మిక్కిలి తక్కువ విత్తము గలవాడు సోమపానము సేయవలెను. అల్పధనుడు యజ్ఞము సేయరాదు, అట్లుసేసిన దక్షిణ చాలినంతయీయలేడు. అత్యల్ప దక్షిణమైన యజ్ఞము, ఆయువును పుత్రులను యశస్సును మేధను ధనమును మంత్రగణమును గూడ హత మొనర్చును. మూడేండ్లు భూత తృప్తిచేయుటకు సరిపడిన లేదా మించిన భక్తము (అన్నము) గలవాడు సోమపానము సేయుట కర్హుడు. ఐశ్వర్యము కలిగియునే బ్రాహ్మణుడు అగ్న్యాధేయమునకు దక్షిణనీయక ప్రాబపత్య కృచ్ఛ్రమునీయడో యాతడనాహితాగ్నియే యగును. విష్ణవు సర్వదేవమయుడు. ప్రతిదినమా హరిని ప్రతిమయందేని పూజింపవలెను. ధ్విజులు సర్వయజ్ఞముమలందు విష్ణువునే గుర్తింతురు. పాయసములు పువ్వులతో నేని యావిష్ణువును బూజింపవలెనని స్మృతమైనది (స్మృతులచే జ్ఞాపకము చేయబడినది) ఆపూజ ఆయాదేవనిలయములందు గాని స్వయముగా బహిర్వేదియందుగాని శ్రద్ధతో జేయునగు. కాని అల్పదక్షిణములయిన యజ్ఞములతో మాత్రమేన్వడు యజింపరాదు. దేవనికాయమంతున్న విష్ణువును శ్రద్ధతో తపస్సుతో నిత్యము పూడింపవలెను. అల్పధనియైన వానికిది సముచితము. విష్ణుని సుగంధ ధూపదీప పరామాన్న నివేదనలతో శ్రేష్ఠములగు ఫలములతో పూజించినవాడు సర్వ యజ్ఞములను (వాని ఫలములను) బొందును. గావున నామహాత్ముడు సతతము పూజింపదగినవాడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితియఖండే గృహస్థ ధర్మ వర్ణనమను తొంబదియైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters