Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదినాల్గవ అధ్యాయము-ఆచారకథనము

పుష్కర ఉవాచ || శూన్యాలయే శ్మశానేవా7నేకవృక్షే చతుష్పధే | మహాదేవ గృహేవాపిమాతృ వేశ్మని వాస్వపేత్‌ ||

న యక్షనాగాయతనే స్కందస్యాయతనే తథా | కూల చ్ఛాయాసు చ తధా శర్కరా లోష్టపాంసుషు ||

ప్రస్వ పేచ్చ తథా దర్భే వినా దీక్షాం ప్రతం నచ | ధాన్యగోదేవ వివ్రాణాం గురుణాం చ తథోపరి ||

న చాపి భిన్నవిషయే నాశుచౌ నశుచి స్తథా | నార్ద్రపాద శ్చ నగ్న శ్చ నోత్తరాపర మస్తకః ||

నాకోశే సర్వతః శూన్యే నచ చైత్యద్రుమే తథా | నగచ్ఛే ద్గుర్వీణీం నారీం నగచ్ఛే త్సితమూర్థజామ్‌ ||

రజస్వలాం రోగవతీం నాయోనౌ న బుభుక్షితః | నాభ్యక్తోన తథా భ్యక్తాం నచ పర్వణి భార్గవ ||

శుక్రమోక్ష మధాకాశే తిర్యగ్యౌనౌ చ వర్జయేత్‌ ||

ఏవంసదాయః కురుతే నృవీర! సమ్యగ్య థోక్తం సుమనాస్తరస్వీ |

తస్యాశు పాపం విలయం ప్రయాతి శ్రియం చ ముఖ్యాంలభ##తే సుఖంచ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామంప్రతి పుష్కరో పాఖ్యానే ప్రాఖ్యానే ఆచారకథనన్నామ చతుర్నవతితమో7ధ్యాయః. ||94

పుష్కరుడనియె :- ఏదేని దీక్షవ్రతము లేకుండ పాడువడిన గృహమందు శ్మశానమందు పెక్కు చెట్లుగల నాల్గుదారులు గలిసిన కూడలియందు శివాలయములో అమ్మవారి గుడిలో యక్షగృహమందు నాగుల (సుబ్రహ్మణ్య) గృహమందు. కుమారస్వామి గుడిలో నదీతీరమందలి చెట్లు నీడలందు ఇసుక మట్టి బెడ్డలు దుమ్ము గ్రమ్మిన నేలలందు దర్భలమీదను బరుండగూడదు. ధాన్యము గోవులు దేవతలు బ్రాహ్మణులు గురువులు దిగువనుండగా మీదను (మేడలమీదను డాబాలమీదను) భిన్న విషయమందు=అసమ ప్రదేశమందు అశుచియైనచోట నిద్రవోరాదు. తానశుచియై తడికాళ్ళతోను దిగంబరిగను ఉత్తరకదిక్కు తలంపుగాని నలుగడల శూన్యమైన అరుబయటను చైత్యద్రుమము=రచ్చచెట్టు క్రిందను పరుండరాదు, గర్భిణిని తల నెరిసినదానిని ముట్టుతను రోగిణిని అన్యకులము దానిని బొందరాదు, ఆకలితో నుండి, తలంటుకొనిన దానిని పర్వకాలంమందు స్త్రీని గవయరాదు, శుక్రమును ఆకాశమందు (శూన్యస్థానమందు) పశు పక్ష్యాది యోనులందును విడువరాదు, ఎల్లపుడు నెవ్వడల్టు నా తెలిపినట్లు పరిశుద్ధ మనస్కుడై నడచుకొనునో వాని పాపము సర్వము నాక్షణమున పోవును. పరమోత్తమైశ్వర్యమును సుఖమును బొందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు ఆచారకథనము తొంబగినాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters