Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబది ఒకటవ అధ్యాయము

పూజకుతగినవి తగనివియునగు పువ్వులు మొదలగువాని వివరణ

పుష్కరః- నక్తం గృహీత ముదకం దేవ కర్మణి వర్జయేత్‌ | చందనాగరుకర్పూరం మృగదర్పం తథైవ చ ||

జాతీఫలం తథా దద్యాత్‌ అనులేపస్య కారణాత్‌ | ఆతోన్యం నైవ దాతవ్యం కించి దేవా నులేపనమ్‌ ||

దారిద్ర్యం పద్మకః కుర్యాత్‌ అస్వాస్థ్యం రక్త చందనమ్‌ | ఉశీరశ్చ తు విభ్రంశ మన్యే కుర్యు రుపద్రవమ్‌ ||

న వస్త్రం మలినం దేయం నీలం రక్తం తు యద్భవేత్‌ | తౌ దత్త్వా దేవదేవాయ శోక మాప్నోత్య సంశయమ్‌ ||

కృత్రిమం తు న దాతవ్యం తధైవ భరణం ద్విజ! | ప్రతిరూప కృతం దత్వా క్షిప్రం పుష్జ్యా వియుజ్యతే ||

పుష్పం కంటకి సంజాతం తథా గంధ వివర్జితం || ఉగ్ర గంధం న దాతవ్యం త్వన్య దేవ గృహో ద్భవమ్‌ ||

శ్మశాన చైత్య ద్రుమజం భూమా వశని పాతితమ్‌ | కాలికా న తు దాతవ్యా దేవ దేవస్య చక్రిణః ||

శుక్లాన్య వర్ణం కుసుమం న దేయం చ తథా భేవేత్‌ | సుగంధి శుక్లం దేయం స్యా జ్ఞాతం కంటకితే ద్రుమే ||

దత్వా కంటకి సంభూతం కుసుమం పరిభూయతే | శుక్లాన్య వర్ణం దాతవ్యం కుసుమం కుంకుమస్య యత్‌ ||

పద్మోత్పలే చ ధర్మజ్ఞ ! తధావై పీత యూధికామ్‌ | తథా చ వన్యకం దద్యా చ్చూతకేతకిజం చయత్‌ ||

రక్తా శోకస్య కుసుమ మసీకుసుమం తథా | వృక్షా యు ర్వేద విద్భి శ్చ శుక్తం రక్తీ కృతం చ యత్‌ ||

తద్రక్త మపి దాతవ్యం, బిల్వపత్రం తధైవ చ | దూర్వాగ్రం చ తథా దేయం పత్రం భృంగిరజస్య తు ||

పత్రాణి చ సుగంధీని తథా దేయాని చక్రిణిః | మధ్యోన్య వర్ణో యస్యస్యా చ్ఛుక్లస్య కుసుమస్య చ ||

పుష్పం శుక్లం తు తద్విద్యాత్‌ మనోజ్ఞం కేశవ ప్రియమ్‌ | బంధు జీవక పుష్పాణి రక్తా న్యపి చ దాపయేత్‌ ||

ఆనుక్త రక్త కుసుమ దానా ద్ధౌర్భాగ్య మాప్నుయాత్‌ | సుగంధి దత్వా నాప్నోతి శుభం వా యది వాశుభమ్‌ ||

మృగ దర్పం వినా కించి దథచే జ్జీవ సంభవమ్‌ | దేవదేవస్య దాతవ్యం దీపే మజ్జాన మేవ వా ||

నీలాం రక్తాం దశాం దీపే ప్రయత్నేన వివర్జయేత్‌ | అన్యాం చ దీప మాత్రే తు తథా వర్జ్యం ప్రయత్నతః ||

కృష్ణాగరు స్తథా దేవ ధూపం దేవస్య యత్నతః | అభక్షం చా ప్యహృద్యం చ నైవేద్యం న నివేదయేత్‌||

కేశ కీటావపసన్నం చ నఖాంశ విహితం చ యాత్‌ | మూషికా లాంగలోపేత మవధూత మవక్షతమ్‌ ||

న భక్ష్య మన్న మక్షీరం మహిషం క్షీర మేవ చ | వరాహ మత్స్య మాంసం చ మాంసం పంచనఖస్య చ ||

దురామోదో తధా వర్జ్యో దేవ కర్మణి పండితైః ||

నివేశ్య చిత్తం పురషోత్తమస్య భక్తిం పమాస్థాయ తథా విశుద్ధామ్‌ ||

కరోతి శ్రద్ధాం సతతం యధోక్తం సయాతి లోకం మధు సూదనస్య ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే పుష్పాది దేయాదేయ కథనం నామ ఏకనపతి తమోధ్యాయః || 91

పుష్కరుడనియె. రాత్రి తెచ్చిన నీరు దేవతార్ఛనకుపనికిరావు, దేవతా పూజకుపయోగించు మైపూతకై చందనము అగురు పచ్చకర్పూరము కస్తూరి జాతిఫలమును ప్రశస్తములు. ఇవిగాక మఱి యేవియును మైపూతకు నుపయోగింపరాదు. పద్మకము గంధముగా నుపయోగించిన దారిద్ర్యము, రక్త చందన రోగమును, వట్టి వేరు విభ్రంశమును, (హానిని) జేయును. మఱియి నితరములుపద్రవమును చేయగలవు. మాసినది నల్లనిది యెఱ్ఱనిదియు నగు వస్త్రమీయరాదు, విష్ణువునకది యిచ్చినవాడు నిస్సంశయముగ శోకమందును. అనువైన ఆఛరణముగాక కృత్రిమము నకిలీ బంగారము మొదలయిన వానితో జేసిన నగయిచ్చినవాడు వెంటనే పుష్టి గోల్పోడును. ముళ్ల చెట్టునందూసినది, నిర్గంధము, ఉగ్రగంధము, తీవ్రవాసనగలది, ఇంకోక దేవాలయములో బూచినదియు నైన దేవతార్చనకుపయోగించరాదు. శ్మశానమందు చైత్యములందున్న చెట్లకు పూచిన పువ్వులు పిడుగుపడి భూమిపై పడిన చెట్టుపూలును, నిషిద్ధమలు, మొగ్గలు వారిపూజకు నిషిద్ధమలు. తెల్లనివిగాక మరియే పూవులనుం బనికిరావు. ముండ్లుగల చెట్టులకు బూచినదైనను సుగంధభరితమైన తెల్లనిపూవు పూజకుచితము. కంటకిత తరువునందు (ముళ్ళచెట్టనండు) పూచిన పువ్వు పూజసేసిన వాడు పరాభవము పాలదును, కుంకుమపువ్వు తెల్లనిది గాకున్నను బ్రశస్తమే, పద్మము కలువ పసుపు డౌలుగల బొడ్డుమల్లి పువ్వు అడవిమామిడి మొగలిపువ్వులు శ్రేష్ఠములే.

రక్తాశోకపుష్పము, అతసీకుసుమము(అవిసిపువ్వు)వృక్షాయుర్వేదము తెలిసివారు తెల్లనిపువ్వును ఎఱుపు చేసినపుడదియెఱు పైనదియు మారెడుదళము గరికపోచలు భృంగిరజపత్రము పూజార్హమలె. పరిమళించు నాకులు (పత్రములు) హరిపూజ కర్హములు. తెల్లని పువ్వునకు నడుమ మఱదేనిరంగు పనుపు, ఎఱపు మొదలైన వున్న యెడల నది తెల్లని పువ్వుగా నెఱుంగ దగినది. చక్కగ నున్న యా పువ్వు విష్ణు ప్రీతికరము. బంధుజీవక పుష్పముల (మంతెనపూలు) ఎఱ్ఱని వైనను హరికి సమర్పింప నయినవే. చెప్పబడిని ఎఱ్ఱనిపూవులను విష్ణుపూజకుపయోగించిన దౌర్భాగ్యమందును. ఈపనికిరాదన్నదియు సువాసనగల దైనచోదానిచే పూజించినవాడు శుభమును బొందడు. అశుభమును బొందడు. కస్తూరి తప్ప మరియే జంతు సంభవమైన పరిమళము వస్తువు నైన దీపమున కూపయోగింప వచ్చును. స్నానమునకునుపయోగింప వచ్చును. నలుపు ఎరుపు వత్తి యెంత మాత్రము పనికిరాదు. నల్ల అగరు దేవ ధూపము విష్ణువునకు తప్పక మానివేయ వలెను. తిన గూడనిది రుచి లేనిదియు నగు దానిని నై వేద్యము పెట్టగూడదు. వెంట్రుకలు పురుగులు పడినది గోళ్లతో గిల్లినది గీరినదియు ఎలుకలు మూచూచినది నాగేటికి తగినలిది ఎగురవేసినది - త్రుంచ బడినది పాలులేని అన్నము గేదెపాలు, పంది చేప మాంసము పంచనఖముగల జంతువుయొక్క మాంసము) పంచనఖములు అయిదు గోళ్ళుగల జంతువులు 1 ఉడుము 2 కుందేలు 3 తాబేలు 4 ఏదుపంది 5 ఖడ్గమృగము) దురాఆమోదము (దుర్గంధము) గలది. దేవతా నివేదన మందు నిషిద్ధములు. మనసు నిలిపి విష్ణువు నెడ పరిశుద్ధ భక్తి పూని యీ చెప్పబడిన రీతి నాయా పూజాసామాగ్రితో శ్రద్ధగొని విష్ణుని నిత్యార్చనము సేసిన పుణ్యుడు విష్ణులోకమున కేగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున పుష్పాది దేవాదేయకథనమను తొంబదియెకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters