Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఎనుబదియెనిమిదవ అధ్యాయము - ప్రాతః కృతము

పుష్కర:- నిద్రాం జహ్యాద్గృహీ రామ నిత్యమే వారుణోదయే | వేగోత్సర్గం తతః కృత్వా దంతధావనపూర్వకమ్‌||

స్నానం సమాచరేత్‌ ప్రాతః సర్వకల్మషనాశనమ్‌ | వేగోత్సర్గం న కుర్వీతః ఫాలకృష్టేతథా శుచౌ ||

గోష్ఠే న చాగ్నౌ న తటే ద్రుమచ్ఛాయాసు శాద్వలే | పథి భస్మని తోయే చ నాంగణ న చ గోపథే ||

నాగ్న్యర్క నాగ తోయేషు ప్రతివాతే తధైవ చ | న వేగితో న కార్యస్థో వేగోత్సర్గం సమాచరేత్‌ ||

ఉదజ్ముఖస్తు సంధ్యాసు దివా చ భృగునందన | దక్షిణాభిముఖో రాత్రౌ నాకాశేతు కథంచ న ||

కర్ణస్థ బ్రహ్మసూత్ర స్తు వస్త్రాచ్ఛాదితమ స్తకః | అభ్యుద్ధృతాభి రద్భి స్తు మృద్భిఃశౌచం సమాచ || 6

కృతశౌచః శుచౌ దేశే ప్రాజ్ముఖః సుసమాహితః | ఉదజ్ముఖో వా ధర్మజ్ఞ తధాంతర్జాను రేవచరేత్‌ 7

ఉపస్పృశే చ్చ ధర్మజ్ఞ| శుద్ధ పాదకర స్తదా | ఏకహస్తార్పితెనా7థ ఫేన బుద్బుదినా తథా ||

అగ్నిపక్వేన తోయేన నను నోపస్పృశే ద్బుధః | అంగుళ్యగ్రే భ##వే ద్దైవ్యం, బ్రహ్మ మంగుళి మూలకే ||

పైత్ర్యం తర్జనిమూలే స్యాత్‌ కనిష్ఠాయా శ్చ మానుషమ్‌ | బ్రాహ్మేణ త్రిః పిబే దాపః ప్రమృజ్యాత్తు తతో ముఖమ్‌ ||

ఖా న్యద్భిః సంస్పృశేత్‌ పశ్చాత్‌ మూర్ధానం నాభి మేవ చ | ఉపస్పృశ్య తతః పశ్చాత్‌ భక్షయే తాద్ధంత కాష్ఠకం||

భుక్త్వా చ నిక్షిపే ద్రామ! నిత్య మేవ సమాహితః | ఉధఙ్‌ ముఖః ప్రాజ్ముఖోవా నయామ్యాశా పరాజ్ముఖః ||

మాంసం న భక్షయే చ్చైవ నో7ర్ధ శుష్కం న పిచ్ఛిలమ్‌ | సుశిరం మధురం చావ్లుం విత్వంచం పత్ర సంయుతమ్‌ ||

సమపూర్వ మతిస్థూలం కుబ్జం కీటవినాశితమ్‌ | శాల్మల్యశ్వత్థ భవ్యానాం ధవకింశుకయో రపి ||

కోవిదార శమీ పీలు శ్లేష్మాతక విభీతకాన్‌ | వర్జయే ద్దంతకాష్ఠేషు గుగ్గులం క్రముకం తథా ||

వటాసనార్క ఖదిర కరవీరాం శ్చ భక్షయేత్‌ | జాత్యశ్వ ఖిల్వ బదరం మూలం చ కకుభస్య చ ||

అరిమేదం ప్రియంగుంచ కంటకిన్యా శ్చ భార్గవః | ప్రక్షాళ్య భక్షయే త్పూర్వం ప్రక్షాళ్యైవ చ సంత్యజేత్‌ ||

పతితే7భిముఖం శస్తం శాన్తా శాభిముభే దినమ్‌ | సౌభాగ్యకామో వామేన భక్షయేత్‌ ప్రాక్‌ సుసంయుతః ||

ముఖభాగేన ధర్మజ్ఞ! వాగ్యత శ్చైవ భక్షయేత్‌ | మల శౌచం తతః కృత్వా సమ్యక్‌ స్నాన మధా చరేత్‌ || 19

గృహస్థు అరుణోదయ కాలమున నిదురలేవవలెను. అటుపై దంతధావనము సేసికొని వేగోత్సర్గ మొనరింపవలెను. వేగములు ఏడురకాలు ముఖ్యమయినవి మూత్ర పురీషోత్సర్గములు. నాగలితోదున్నినక్షేత్రమందు శుచియైన చోట నవి చేయరాదు, గోశాలయందు అగ్నియందు నదీతీరమందుచెట్లనీడలందు పచ్చికలందు దారిలో బూదడిదలో నీటిలో ఇంటి వాకిటను గోవులు నడచు దారిలో అగ్నిలో సూర్య ప్రసారమున కొండలనుండి పడునీళ్ళలో ప్రతివాతమందు (ఎదురుగాలిలో) తొందరలోనున్నప్పుడు ఏదేని పనిలోనున్నప్పుడు వేగోత్సర్గము సేయరాదు. సంధ్యవేళపగలు నుత్తరముగా దిరిగియు రాత్రి దక్షిణముఖుడునై యీపని చేయవలెను. అకాశమున నెప్పుడుం గూడదు. జందెము కుడీచెవిందగిలించికొని బట్టతోతలగప్పికొని, మీదనుండిపోసికొని నీళ్ళతో మట్టితో శౌచముగా వింపవలెను. శౌచమయిన తర్వాత శుచియైన చొట కాళ్ళుచేతులు కడిగికొని తూర్పుమొగమై లేక ఉత్తరాభిముఖుడై కూర్చుండి మోకాళ్ళలోపున చేతులుంచుకొని ఉపస్పర్శ ఆచమనము చేయవలెను. ఒక్కచేతితో నెత్తినది నురుగుబుడగలుకలది వేడిదియగు నీటితో నుపస్పర్శనము సేయరాదు. వేళ్ళ చివర దైవతీర్థము వేళ్ళ మూలమందు బ్రాహ్మతీర్థము తర్జని (చూపుడువేలు మొదట) పితృతీర్థము చిటికినవేలి మొదట మనుష్య తీర్థము నని యెఱుంగనగును. బ్రాహ్మతీర్థముతో మూడు మారులుదకము త్రావి ముఖము తుడిచికొనవలెను. ఉదకముతో కండ్లు ముక్కు చెవులునను నింద్రియములను స్పృశించి యవ్వల నడినెత్తిని నాభిని తాకవలెను. ఇట్లుపస్పర్శచేసి యామీద దంతకాష్ఠము నమలవలెను. నమిలి దానిని పారవేయవలెను. ఉత్తరాభిముఖుడై కాని తూర్పుగా దిరిగి కానిపండ్లు తోముకొనరాదు దక్షిణముగా దిరిగి చేయవలెను. మాంసము తినరాదు. సగమెండినది పిచ్చిలము = రసముకారునది పనికిరాదు. ఎక్కువ ఈసెలుగలది తియ్యనిది పుల్లనిది బెరడులేనిది ఆకులతోడిది మొదలు సమముగానున్నది ఎక్కువలావుది చిన్నది పురుగు కొరికినది బూరుగు రావి ధవ = చండ్ర కింశుక = మోదుగు కోవిదార కాంచనవృక్షము జిమ్మి పీలు = గోగుశ్లేష్మాతకము = ఉద్దాలము విభీతకము = తాండ్రచెట్టు గుగ్గులు క్రముకము = పోక మఱ్ఱి అనన = వేగిన అర్క = జిల్లేడు ఖదిర = కవీరములు మంచివి. జాజి అశ్వ = పెన్నేరు మారెడు రెగుగి కకుభమువేరు = మద్దివేరు అరిమేదము = తుమ్మ ప్రియంగువు = ఆరెపుల్ల కంటకిని = వాకడుపుల్ల కూడ పలుదోముపల్లగావాడవచ్చును. మొదట కడిగి కడుగుకొని తిరిగి కడిగియే పారవేయవలెను. అది యెదురుగా బడిన మంచిది. సౌభాగ్యకాముడు తొలుత నోటి కెడమ వైపున నమలవలెను. ముఖము వైపు పండ్లు తోముకొనవలెను. ఆమీద మలశౌచము సేసి స్నానము సేయవలెను.

న స్నాన మాచరే ద్భుక్త్వా నావిజ్ఞాతే జలాశ##యే | నా తురో నారుణకరై రనాక్రాన్తే నభస్థతే ||

అప్రశస్తం నిశి స్నానం రాహో రన్యత్ర దర్శనాత్‌ | పరాంభసి తధైవాల్పే నాశిరస్కః కధంచ న ||

నిత్యం నైమిత్తికం కామ్యం క్రియాంగం మలకర్షణమ్‌ | క్రియాస్నానం తథా షష్ఠం షోఢా స్నానం ప్రకీర్తితమ్‌ ||

ఖాని రాత్రౌ శయానస్య స్రవన్తి పురుషస్య చ | తస్మా త్సర్వప్రయత్నేన ప్రాత స్స్నానం సమాచరేత్‌ ||

ప్రాతస్స్నాయీ సదా రామ| నరకం నచ పశ్యతి | యః కరోతి సదా రామ! స్నానం తు సవనద్వయమ్‌ ||

సతు స్వర్గ మనుప్రాప్య త్రిదశై రపి పూజ్యతే | తథా త్రిషవణస్నాయీ స్వర్గలోకే మహీయతే ||

మానుష్యం ప్రాప్య భవతి రూప¸°వససంయుతః | ధనధాన్యవతి స్ఫీతే కులేచైవ ప్రసూయతే ||

రూపౌదార్యగుణోపేతాః స్త్రియ శ్చాప్నోత్యనిందితాః | ధర్మే మతి శ్చాస్య భ##వే ద్యశసా చ విరాజతే ||

తస్మా త్సధా ధర్మపరేణ రామ తీర్థేషు ముఖ్యేషు సరస్సు చైవ |

స్నానం చ కార్యం సుమలాపహర్తృ నాకప్రదం కామకరం సుఖాయ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ప్రాతఃకృత్య నిరూపణం స్నానప్రశంసా వర్ణనం నామఅష్టా7శీతితమో7ధ్యాయః.

భుజించి స్నానము సేయరాదు. తెలియని నీటిలో జేయరాదు. ఆతరుడై (రోగాదిపీడితుడై) చేయరాదు. అరుణోదయ కిరణములు దిక్కుల గ్రమ్మకుండ స్నానము సేయరాదు. రాహుగ్రహణమందుదప్ప రాత్రి స్నానము అప్రశస్తము. ఇతరుల నీట కొలదిగానున్న నీటను తల మునగకుండను స్నానము సేయరాదు. నిత్యము నైమిత్తికము కామ్యము క్రియాంగము మలకర్షణము క్రియాస్నానమునని స్నానమారు విధములు. రాత్రి పండుకొన్న వానియింద్రియములు స్రవించునుగావున ప్రాతస్నానము తప్పక చేయవలెను. నిత్య ప్రాత స్నాయి నరకమును జూడదు. సవనద్వయ స్నానము అనగా ప్రాతస్సవనమథ్యాహ్న సవనమలందు స్నానము చేసినవాడు స్వర్గమంది దేవతలచే గూడ పూజింపబడును. అట్లే త్రిషవణ (మూడువేళల) స్నానము చేసినవాడును మరియు నాతడు మరల ధనధన్యా సమృద్ధిగల కుటుంబమందు మనుష్యుడై పుట్టి రూప¸°వన సంయుతుడగును. రూపౌదార్యాది గుణవంతులైన శీలవంతులైన స్త్రీలనుగూడ బొందును. ఇతనికి ధర్మమందు బుద్ధికల్గును. మంచికీర్తిశాలియునై విరాజిల్లును. అందుచే పరశరామ! ముఖ్యములయినతీర్ధములందు సరస్సులందును ధర్మపరుడు నిశ్శేషమలాపహరము, స్వర్గ ప్రదము కామ ప్రదమునైన స్నానమును సుఖము కొఱకు గావింపవలెను. 28

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ప్రాతఃకృత్య నిరూపణము-స్నానప్రశంస యను నెనుబదియెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters