Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనబదియేడవ అధ్యాయము - ధర్మవర్ణనము

పుష్కరః- విప్ర శ్చతస్రో విందేత భార్యా స్తిస్రస్తు భూమిపః | ద్వేచ వైశ్య స్తధా కామం భార్యైకామపి చాన్త్యజః ||

బ్రాహ్మణీ క్షత్రియా వైశ్యా శూద్రీ విప్రస్యకీర్తితాః | క్రమేణ కామ సక్తస్య వివాహాః పరి కీ ర్తితాః ||

వివాహ ముత్క్రమాత్‌ కృత్వా నరకం ప్రతి పద్యతే | ధర్మ కార్యాణి సర్వాణి న కార్యణ్య సపర్ణయా ||

అసవర్ణా తు యానారీ రత్యర్థే సా ప్రకీర్తితా | అధానం తస్యత్ర ధర్మార్థం న ప్రశం సన్తి సాధవః |

పాణి ర్గ్రాహ్య స్సవర్ణాసు గృహ్ణీయాత్‌ క్షత్రియా శరమ్‌ | వైశ్యా ప్రతోద మాదద్యాత్‌ దశాం చైవాన్త్యజా తథా ||

ఉత్కృష్ట వేదనేప్యేత ద్విధానం పరికీర్తితమ్‌ | సకృ త్కాన్యా ప్రదాతవ్యా హరంస్తాం చౌరదండభాక్‌ ||

న కన్యా విక్రయం కార్యం కదాచి దపి కేన చిత్‌ | కేశ విక్రయిణో యాన్తి నరకా నైక వంశతీన్‌ ||

ఆపత్య విక్ర యాత్తస్య నిష్కృతి ర్న విధీయతే | కన్యా ప్రజీవనాత్‌ కించి న్నోప జీవతి యః పుమాన్‌ ||

న తచ్చుక్లం సముద్దిష్ట మా నృశంస్య హి తత్‌ స్మృతమ్‌ | కన్యా దానం శచీయాగో మీహోధ చతుర్థికా ||

వివాహ మేతత్కథితం రామ! కర్మ చతుష్టయమ్‌ | దత్తా మపి హరే త్కన్యాం వరశ్చేద్ధోష భాగ్భవేత్‌ || 10

నష్టే మృతే ప్రవ్రజితే క్లీభేధ పతితేపతౌ | పంచ స్వాపత్పు నారీణాం పతి రశ్యో విధీయతే ||

మృతే తు దేవరే దేయా తద భావే యదృచ్చయా | పూర్వా త్రితియ మాగ్నేయం వాయువ్యం చోత్త రాత్రయమ్‌ ||

రోహిణీచేతి వరుణః భగణః శస్యతే సదా | నైకగోత్రాం చ వరయే న్నైకార్షేయాం చ భార్గవ! || 13

పితృతః సప్తమా దూర్ధ్వం, మాతృతః పంచమా త్తథా | వరయే ల్లక్షణోపేతాం సదా లోకద్వయేచ్ఛయా ||

బ్రాహ్మో దైవ స్తధై వార్షః ప్రాజాపత్య స్తథాసురః | గాంధర్వో రక్షన శ్చైవ పైశా చ శ్చాష్టమః స్మృతః ||

అహుః ప్రదానం బ్రాహ్మేణ కులశీలయుతాయ తు | తజ్ఞః పునా త్యుభయతః పురుషా నేకవింశతీన్‌ ||

దైవ శ్చ ఋత్విజే దానం సతు యజ్ఞే ప్రకీర్తి తః | తజ్ఞః పునాతి ధర్మజ్ఞ! స్వకులే పురుష త్రయాన్‌ ||

శుల్కేన చాసురం విద్యాత్‌ స తు ధర్మాదృతే మతః | పర స్పరేచ్ఛయా రామ! కన్యకా వరయో స్తథా ||

గాంధర్వో నామ నిర్దిష్టః సతు మన్మథ లక్షణః | రాక్షసో యుద్ధహరణాత్‌ పైశాచః కన్యకాఛలాత్‌ ||

పుష్కరుండునియె. బ్రాహ్మణోత్తమా! విప్రుడు నల్వురను క్షత్రియుడు ముగ్గురిని! వైశ్యుడిద్దరిని శూద్రుడొక్క దానిని పెండ్లి చేసికొనవచ్చును. బ్రాహ్మణునకు కామసక్తునకు బ్రాహ్మణి క్షత్రియవైశ్య శూద్రియు వరుసగా నలుగురు భార్యలు జెప్పబడినారు. వరుస దప్పించి వివాహము సేసికొన్నచో నరకమునందును. ధర్మకార్యములన్నియు నసవర్ణ భార్యతో జేయరాదు. అసవర్ణ స్త్రీ కేవలము రతినిమిత్తమే. భోగవత్నియే యన్నమాట. ఆమెయందు ధర్మనిమిత్తమైన యాధానమును (గర్భాధానమును)సాధువులు ప్రశంసింపరు సవర్ణస్త్రీలను పాణిగ్రహణము చేయవలెను. క్షత్రియస్త్రీ శరము = బాణమును వైశ్యస్త్రీ ప్రతోదమును = కొరడా మునికోల, బట్టుకొనవలెను. శూత్రస్త్రీ దశాం = కండువా అంచుపట్టుకోవలెను. ఉత్కృష్టవేదనమందుగూడ యిదేవిధానము చెప్పబడినది. (పెద్దల పరిచయమపుడు గూడ) కన్య యెకమారే (యొక్కనికే) యీయదగినది. ఆమెను హరించినవాడు చోర దండమును కర్హుడు. ఎన్నడు నెవ్వుడు కన్య నమ్మరాదు, కేశ విక్రయులు (కేశము =యోని -భగము) ఇరువదియొక్కరకాల నరకాల పాలగుదురు. సంతానము నమ్మిన పాపమునకు నిష్కృతి = ప్రాయశ్చిత్తి మేదియు లేనేలేదు. కన్నకూతురు వలన బ్రతుకుటను అల్పముగ నెవ్వడు చేయునో యాబ్రదకు శుల్కము పవిత్రము గాదు అని స్మృతికారు లన్నారు. కన్యాదానము శచీయాగము వివాహము చతుర్థిక. (నాశ బలి మొదలగు నాల్గవరోజు తంతు) అనునివి నాల్గును వావాహమని పిలువబడును. వరునియందు దోషమున్నచో నిచ్చిన కన్యను దిటిగి తెచ్చికొనవచ్చును. దానిచో దోశమునొందుడు. అపతౌ= పతి సదృశుడు (కన్యనిత్తునని వాగ్దానము పొంది వివాహమింకను గాని వాడన్నమాట) నష్టమైనను (కనబడకుండ పోయినను) చనిపోయి నను సన్యాసము పుచ్చుకొన్నను నపుంసకుడైనను పతితుడైను కులభ్రష్టుడైనను నీ యైదువిధములందు (ఆపద్ధర్మముగా) స్త్రీలకు మరియొకభర్త విధింపబడినాడు మృతుడైనచో మరది కాయనగును. లేనిచో మరియొకనికీయ వచ్చును. (పూర్వాత్రియము పుబ్బ పూర్వాషాడ పూర్వాభాద్ర) ఆగ్నేయము = కృత్తిక వాయవ్యము = ఉత్తరాయము = ఉత్తరాషాడ, ఉత్తర-ఉత్తరబాద్రయ రోహిణి-వారుణము, స్వాతి =శతభిష వివాహ యోగ్య నక్షత్రములు. ఏకగోట్రను ఏకార్షేయను వివాహము చేసికొనరాదు తండ్రివంక నేడవతరము. తల్లివంక నయిదవతరము దాటిన సలక్షణయైన కన్యను ఉభయలోక ఖమును గోరినవాడు పెండ్లాడవలెను. 1. బ్రాహ్మము = కులశీలములు గలవానికి కన్యాదానము చేయుట. ఈవివాహజాతుడుభయవంశము నిరువది యొక్కతరముల నుద్దరింపగలదు 2. దైవము =ఋతృక్కునకు కన్యనిచ్చుట: ఇది యజ్ఞమే యనబడును ఆవివాహమున బుట్టినవాడు తన మూడుతరముల నుద్ధరింపగలడు 3. ఆర్షము = వరునివలన గోమిధుసముగొని కన్యనిచ్చి శాస్త్రవిధిననుసరించి చేయువివాహము 4. ప్రాజాపత్యము = మీరిరువుదు ధర్మ మాచరింపుడుని వరునకి చెప్పి చేసిన వివాహాయ. అసురము =డబ్బునిచ్చి కన్యను తీసికొని చేసికొను వివాహము అది ఆ ధర్మము. 6. గాంధర్వము =పరస్పరము కోరిచేసికొన్నది. అది కామప్రధానము 7. రాక్షసము = యుద్దముచేసి కన్యను దెచ్చకొని చేసికొన్న వివాహము 8. పైశాచము = కన్యకయే తల్లి దండ్రులను మోసగించి చేసికొన్నది. ఇట్లు వివాహము లెనిమిదిరకములు

ప్రాజాపత్య స్తథా బ్రాహ్మః సమవర్ణేషు పూజ్యతే | దైవస్తు బ్రాహ్మణసై#్యవ నైవ చాన్యస్య కస్యచిత్‌ || 20

గాంధర్వరాక్షసౌ శ్రేష్ఠౌ క్షత్రియసై#్యవ భార్గవ! | పూర్వం వివాహాత్‌ కర్తవ్యం శచీయాగో భృగూత్తమ! ||

వైవాహికేన్దౌ కుర్వీత కుంభకారమృదా శచీమ్‌ | సర్వ లక్షణసంయుక్తాం కుశ##లేన చ శిల్పినా ||

తాం నయే త్సరస స్తీరం నదీతీర మథాపివా | సర్వభూషణ సంపన్నా స్సర్వా స్త్వవిధవాః స్త్రియః ||

కౌసుంభరక్త వసనాః సర్వాః స్యుః శస్త్రపాణయః | మాల్యానులేపనైః భ##క్ష్యైః దీపై ర్థూపై స్తధైవ చ ||

కౌసుంభరక్తైర్వసై#్త్రళ్చ భూషణౖ శ్చైవ శక్తితః | తత శ్శూర్పేణ తాః సాధ్వ్యో దిక్షు దత్వా బలిం శుభమ్‌ ||

సంయమ్య కేశాన్‌ ప్రయతా గృహీత్వాచ తథా శచీమ్‌ | వాద్యగీతేన మహతా ద్విజవాచనకేన చ ||

గృహే ప్రవేశ##యేత్‌ పుంసాం శక్రపత్నీ మనిందితామ్‌ | త్రి సంధ్యం తత్ర సా పూజ్యా గంధ మాల్యాన్న

సంపదా ||

వందనీయోద్వాహ సమయే తత్ర కాలం నిబోధ మే | ప్రసుప్తే కేశ##వే రామ! నతు కార్య కథంచ న ||

నపౌషే న తధా చేత్రే న చార్క కుజవాసరే | కృష్ణ తిభాగే నైవాన్త్యే వాద్యే శుక్లస్య భార్గవ! ||

తధా రిక్తతిథౌ నైవ విష్టౌ కరణ తథా | న శుక్రేస్తమనం ప్రాప్తే తధా చాస్తే బృహస్ప తౌ || 30

శశాంకేన్య గ్రహే చైవ వివాహోన ప్రశస్యతే | అర్కార్కి భౌమయుక్తే భే వ్యతీపాతహతే తథా ||

దివ్యాన్తరిక్షభౌమేన తధోత్పాతేన ఘాతితే | తథా శిఖి ధ్వస్తే సైంహికేయయుతే తథా ||

ప్రాజూపత్యము బ్రాహ్మము సవర్ణులే చేసికొనివలెను. అది పూజినీయమగును. దైవ వివాహ మొక్క బ్రాహ్మణునికే విహితము. గాంధర్వరాక్షసములు క్షత్రియునికి మంచివి. వివాహమునకుముందు శచీయాగముసేయవలెను. వివాహముహూర్తమున చంద్రోదయమపుడు నేర్పరియగు కుమ్మరి మట్టితో సర్వలక్షణసంయుక్తముగ శచీదేవి బొమ్మను జేయవలెను - దానిని సరస్తితరమునకో నదీతీరమునకో గొనిపోయి సర్వాభరణ భూషితలు పుణ్యస్త్రీలు కౌసుంభవర్ణము = కుసుంభపువ్వు రంగుల ఎఱ్ఱని వస్త్రములు దాల్చి యధాశక్తి మాల్యానులేవనముల పిండివంటలు ధూపదీపములు కుసుంభర క్తములయినవస్త్రములు భూషణములు గొని యేగి సాధ్వులు సర్వదిశలందు చేటలతో బలులిచ్చి కొపులుముడిచికొని నియమవతువై శచీదేవింజేకొని గీతవాద్యములతో బ్రాహ్మణస్వస్తివాచనములతో గృహమునందు దేవిని ప్రవేశ##పెట్టవలెను. ఆమెను త్రిసంధ్యము గంధమాల్యాన్న సంపందలతో బూజించి వివాహసమయమున నమస్కరింపవలెను.

వివాహ శుభసమయ నిరూపణము.

వివాహలగ్నము పూజనీయముగా నుండవలెను. విష్ణవు నిదురించినతఱి (చాతుర్మాస్యకాలమున)వివాహము సేయరాదు. పౌషము చైత్రము నిపిద్ధములు, ఆదిమంగశవారములు కూడదు. కృష్ణపక్షము పంచమీదాక ఏకాదశిమొదలు అమావాస్యదాక శుక్లపక్షము పంచమిదాక రిక్తతిధియందువిష్టికరణమందు గురుశుక్రా స్తమయముంలదు (గురు శుక్ర మౌథ్యమందన్నమాట) చంద్రుని ఇతర గ్రహముల అస్తమయముందువివాహము ప్రశస్తముగాదు. శని సూర్యుడు, కుజుడు కలసిన నక్షత్రము వ్యతీపాతయోగ మపుడు దివ్యాస్తరిక్షభౌ మోత్పాతమునపుడు శిఖి శిఖాధ్వ స్తమయిన వేళ అనగా దిక్కులందు కొఱవులు పడునపుడు రాహువున్నపుడు వివాహము కూడదు.

వైవాహికాన్యతో వక్ష్యే నక్షత్రాణి భృగూత్తమ | సౌమ్యం పిత్య్రం చ వాయువ్యం సావిత్రం రౌహిణం తథా ||

ఉత్తరా త్రితయం మూలం మైత్రం పౌష్టం తధైవచ | ముహూర్తాశ్చ తధైతేషాం శుభా అభిజితాసహ ||

మానుష్యాఖ్య స్తథా లగ్నో మానుష్యాఖ్య స్తథాంశకః | అమానుష్య ఖ్యే లగ్నేపి మానుష్యాఖ్యో7ంశకో హితః ||

తృతీయే చ తథా షష్ఠే దశ##మైకాదశాష్టమే | అర్కార్కి భూమితనయాః ప్రశస్తాన కుజోష్టమః ||

సప్తాన్త్యాష్టమ వర్జ్యేషు శేషాః శస్తాః గ్రహోత్తమాః | తేషా మపి తథా సూర్య శ్చంద్రః షష్ఠో న శస్యతే ||

సంకల్ప విధినా కార్యోవి వాహ స్తదనంతరమ్‌ | వివైవాహికేహ్ని కర్తవ్యా స్తధైవ చ చతుర్థికే || 38

న దాతవ్యః గ్రహా స్తత్ర చతురాద్యా స్తధైకగాః | అతః పరం గృహే గచ్ఛే దృతుకాలే సర స్త్రియమ్‌ ||

పర్వవర్జ్యం సదా గచ్ఛేత్‌ స్త్రీణాం వా సంస్మరన్‌ వరమ్‌ | సర్వకాలం రతి ర్ధత్తా తాసాం సత్యం భృగూత్తమః || 40

పరస్పరాతిక్రమణం దంపత్యోః పరివర్జయేత్‌ | నిష్కారణం తథా రమ! న కార్య మధివేదనమ్‌ ||

అప్రజా రోగిణీ మూఢా తథా చ కలహ ప్రియా | కన్యా ప్రజా తథాయాచ యాచైవా ప్రియవాదినీ ||

ఏతాః ఖల్వధివేత్తవ్యాః గృహకార్యపరాజ్ముఖాః | అధివిన్నా విశేషేణ పాలనీయా చసా భ##వేత్‌ ||

ధర్మకార్యేషు సర్వేషు తథా జ్యేష్ఠాం నియోజయేత్‌ | ధర్మాఖధర్మౌ సమౌ రామః దంపత్యోరుభ యాత్మకౌ ||

పోష్యాచ నిత్యం పరిపాలనీయా భార్యా భ##వే ద్దర్మ పరాయణస్య |

ధర్మార్థ కామాన్‌ సతతం ద్విజేంద్ర! తాన్రక్షయే త్సమ్య గధానయా స్వాన్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ధర్మవర్ణనం నామ సప్తాశీతి తమోధ్యాయః ||

ఇక వివాహ శుభనక్షత్రములం దెల్పెద, సౌమ్యము = మృగశిర పిత్ర్యాము = మఘ వాయవ్యము = స్వాతి సావిత్రము = హస్తరౌహిణము = ఉత్తరలుమూడు మూల మైత్రము= హస్తపౌష్ణము = రేవతి వీని శుభముహూర్తములు పదునొకండింట, ఎనిమిదియుముహూర్తములు అభిచిత్తును మంచివి మానుష్యలగ్నము. మానుష్యాంశము అమానుష్యమగు లగ్నమందుకూడ మానుష్యాం శకము హితమైనది. మూడింట ఆరింట పదింట, పదునొకండవ యింట, ఎనిమిదింట సూర్యశని కుజులు ప్రశస్తులు. అష్టమ కుజుడు ప్రశస్తుడుకాడు. ఏడు, ఎనిమిది, తొమ్మిది గ్రహములు తప్పి మిగిలిన గ్రహములు మంచివి. వానిలోకూడ షష్ఠ సూర్యచంద్రులు ప్రశస్తులు కారు. సూర్యచంద్రులు షష్టమందుండరాదు), ఆమీద వివాహముసంకల్ప విధితో జేయ వలెను. వివాహమునాడు నాల్గవ రోజునలుగు మొదలు గ్రహములు కలిసి యొకేరాశిలో నున్నపుడు కన్యాదానము చేయకూడదు. వివాహమైన తర్వాత ఋతుకాలమందు స్త్రీని గృహమందు బొందవలెను. పర్వములందు గూడ రాదు. పర్వములందప్పించి యెల్లకాలము స్త్రీలకు రతిని వరముగా నిచ్చిన విషయము జ్ఞాపకముంచి కొనవలెను. కారణములేకుండా దంపతులోండొరులతిక్రమింప రాదు. - అకారణముగా వారధివేదనమును జేయరాదు (అధి వేదనము = భార్య యుండగా వేఱొక్కతను భర్త పెండ్లాడుట, భార్య యింకొకరిని పెండ్లాడుట) గొడ్రాలు రోగిణి మూడురాలు కలహమాడునది ఆడసంతానముకలది అప్రియ భాషిణి గృహకార్యమును చేయనిది అదివేత్తవ్యలు - అనగా వారిని వదలిపెట్టి భర్త యింకొకరిని జేసికొనవచ్చును. అధివిన్న = సవతి పోరుగలది మొదటిభార్యను మిక్కిలి సంరక్షించుకొనుచు నుండవలెను. ధర్మకార్యములందన్నిటను జేష్ఠ్యభార్యనే నియోగింపవలెను. ధర్మాధర్మములు దంపతు లిద్దరకు సమానములు. ధర్మపరాయణునకు భార్య భరింపదగినది. నిత్య హరిపాలింప దగినది, గృహస్థు ఆమెతో గూడి తన పురుషార్థములను = ధర్మార్థ కామములను జక్కగా సంరక్షించు కొనవలయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు ధర్మవర్ణనమను నెనుబదియేడవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters