Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనబది ఆరవఅధ్యాయము - బ్రహ్మచర్యవర్ణనము

పుష్కరః- ఉపనీయ గురు శ్శిష్యం శిక్షయే చ్ఛౌచ మాదితః | ఆచార మగ్ని కార్యం చ సంధ్యో పాసన మేవ చ ||

ప్రయతః కల్య ముత్థాయ స్నాతో హుత హుతాశనః | భక్త్యా గురోస్తు కుర్వీత అభిగమ్యా భి వాదనమ్‌ ||

గురోస్తు వామం చరణం వామహస్తేన సంస్పృశేత్‌ | దక్షిణం దక్షిణనైవ స్వనామ పరి కీర్తయన్‌ ||

అనుజ్ఞాతస్తు గురుణా తతోధ్యయన మాచరేత్‌ |

కృత్వా బ్రహ్మాంజలిం పశ్యన్‌ గురో ర్వదన మానతః ||

బ్రహ్మావసానే ప్రారంభే ప్రణవం చైవ కీర్తయేత్‌ | అనధ్యాయే ష్వధ్యయనం వర్జయేత్తు ప్రయత్న తః ||

భైక్ష్యచర్యం తతఃకుర్యా ద్బ్రాహ్మణషు యధావిధి | గురోః కులే న భిక్షేత భుంజీత తదనుజ్ఞ యా ||

ఆయుష్యఁ ప్రాజ్ము ఖో భుంక్తే యశస్యం దక్షిణాముఖః | శ్రియః ప్రత్యజ్‌ ముఖో భుక్తే ఋతం భుంక్తే హ్యుదజ్‌ ముఖః ||

హితం ప్రియం గురోః కుర్యాత్‌ భక్త్వాహంకారవర్జితః | అన్వాస్య పశ్చిమాం సంధ్యాం పూజయిత్వా హుతాశనమ్‌ ||

అభివాద్య గురుం పశ్చాత్‌ గురో ర్వచనకృత్‌ భ##వేత్‌ | మధు మాంసాంజనం శ్రాద్ధం గీతం నృత్యం చ వర్జయేత్‌ ||

హింసాం పరాపవాదంచ అశ్లీలం చ విశేషతః | మేఖలా మజినం దండం ధారయేత్‌ ప్రయత స్సదా || 10

వినష్టా నప్సు విక్షిప్య తథాన్యాన్‌ ధారయే త్పునః | ఆదిష్టో నోదకం కుర్యా దావ్రతస్య సమాపనాత్‌ ||

సమాప్తే తు వ్రతం కుర్యాత్‌ త్రిరాత్రేణౖవ శుద్ధ్యతి | అథ శ్శాయీ భ##వేన్నిత్యం బ్రహ్మచారీ సమాహితః ||

ఏవం వ్రతం తు కుర్వీత వేదస్వీకరణం ద్విజః గురవే దక్షిణాం దత్వా స్నా యాచ్చ తదనస్తరమ్‌ ||

అశరీర వి మోక్షాద్వా వసే ద్గురు కులే సదా | నైష్ఠికో బ్రహ్మచారీ చ వాయుభూతః ఖ మూర్తిమాన్‌ ||

తత్పదం సమావాప్నోతి యత్ర గత్వా న శోచతి | స్నానే చైవ స గోదానే కాలః పూర్వో విధీయతే ||

పూజనం వాసుదేవస్యసర్వత్ర చ విధీయతే ||

సంపూజ్య దేవం గురవే చ దత్వా ధనం యధావ త్పరిపూర్ణ విద్యః |

గృహా శ్రమీ స్యా ద్విధివ న్నృ సింహ! యత్రాస్య లోక ద్వితయం ప్రదిష్టమ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే బ్రహచర్య వర్ణనం నామ షడశీతి తమోధ్యాయః. 86

పుష్కరుడనియె. గురువు శిష్యునుపనయనము గావించిన తరువాత మొట్ట మొదట శౌచమును ఆచారము - అగ్నికార్యము సంధ్యోపాసనము నేర్పవలెను. ప్రయతుడై (నియమమూని) కల్యముననే = (వేకువనే) లేచి స్నానముచేసి అగ్నికార్యము సేసి గురుని సన్నిధికేగి భక్తితో సాష్టాంగ ప్రణామము సేయవలెను. గురువుయొక్క యెడమకాలి నెడమచేతను కుడికాలిని కుడిచేతను స్పృశించి తనపేరు చెప్పికొని యభివాదనము గావింపవలెను. గురుననుమతిపోంది యామీద నధ్యయనము సేయవలెను. బ్రహ్మంజలిం (వేదాధ్యయనకాల కర్తవ్య నమస్కారము) చేసి గురువు మోము చూచుచు ఆనతుడై (వంగి) వేద ప్రారంభమందు ముగింపునకు ప్రణవమును గీర్తింపవలెను. అనధ్యాయములంద ధ్యయనము సప్రయత్నముగ మానవలెను. అవ్యల బ్రాహ్మణ గృహములందు యధావిధిగ భైక్షచర్యను జేయవలెను. గురుకులమందు (గురునింట) భిక్షాచరణము సేయరాదు. గురుననుమతిగొని భిక్షాన్నముం దినవలెను. అది తూర్పు మొగమై భుజించినచో అయిష్యము నందును. దక్షిణాదిజ్ముఖులై భుజించిన యసస్సుందఞ్మఖులై భుజించిన ఋతము పడమరముఖమైనచో సంపద ననుభవించును. గురునికి హితము ప్రియమునైన పనిని భక్తితో నహంకారము లేకుండ నొనరింపవలెను. సాంయ సంధ్య నుపాసించి యగ్నిని వేల్చి గురువునికి మ్రొక్కి ఆమీద గురువు చెప్పిన పనిని చేయవలెను. మద్యము మాంసము కాటుక శ్రాద్ధము పాట ఆటలను మానవలెను. హింసను, పరాపవాదమును అశ్లీల సంభాషణమును నెన్నడును జేయరాదు. మేఖల అజినము దండము నెపుడు ధరింపవలెను, అవి చెడిపోయినచో వానిని నీళ్లలో బడవేసి మఱి యొకటి గైకొనవలెను. బ్రహ్మ చర్య వ్రతసమాప్తిదాక గురునానతియు ననుసరించి స్నానపానాదికమాడవలెను. పూర్తికాగానే వ్రతముచేయవలెను, మూడు రాత్రులలో శుద్ధుడగును. నేలపై బరుండవలెను. ఇట్లు బ్రహ్మచర్య వ్రతముతో వేదస్వీకరణ మొనరింపవలెను. గురునకు దక్షణ సమర్పించి యామీద స్నానము సేయవలెను. స్నాతకము సేసికొనవలెనన్న మాట లేదా శరీరమిమోక్షముదాక గురుకులమందే నిత్యము వసింపవలెను. అట్టి బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి యనబడును. అతడు వాయువు మాషడ ఆకాశమూర్తి (బ్రహ్మ) స్వరూప మైనవాడు, ఆపర బ్రహ్మపదము నాత డందును అటు పూయి శోకింపడు. బ్రహ్మజ్నుడగునన్న మాట. స్వాణము - గోదానము సహితముగనుండవలెను. (స్నాతకము చేసికొని గోదానవ్రతముకావించుకొనుటకు) కాలము ముందుగా శాస్త్రము విధించినది (ముందుగా అనగా వివాహమున కంగముగా) ఏ వ్రతమందైన వాసుదేవ పూజన మన్ని యెడల విధి విహితమయినది. విష్ణదేవుంబూజించి మొనరింపవలెను. గురునకు దక్షిణ సమర్పించి యామీద యధావిధిగ విద్యా పరిపూర్ణత గావించికొని యామీద నిహవరలోకములు రెండును గలిగించు గృహశ్రవామ స్వీకరింపవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము దిత్యీయఖండమునందు బ్రహ్మచర్య వర్ణనము నెనుబదియారవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters