Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనుబదిఐదవ అధ్యాయము - సంస్కారవర్ణనము

రామః - ధర్మమార్గ మహం త్వత్తః శ్రోతు మిచ్ఛామి మే వ ద | త్వంహి వేర్థ మహాభాగ! సర్వధర్మాన్‌ యథావిధి ||

పుష్కరః - షోడశర్తునిశాః స్త్రీణా మాద్యా స్తిస్రస్తు గర్హితాః | వ్రజే ద్యు గ్మాసు పుత్రార్థీ తతః పర మితి శ్రుతిః ||

అయుగ్మాసు తధా రామ! దుహిత్రర్థీ స్త్రియం వ్రజేత్‌ | విప్రకృష్టాసుయుగ్మా సుత ప్రశస్తాః ప్రియదర్శనాః ||

దీర్ఘాయుషో ధర్మ పరాః భవన్తీహ ధనాన్వితాః | గర్భస్య స్పష్టతా೭೭ధానే గర్భాధానిక మిష్యతే ||

పురాతు స్పర్శనం కార్యం సేవనం తు విచక్షణౖః | షష్ఠేష్టమే వా సీమన్త కర్మ స్వేతుఘ చ త్రిషు ||

పున్నా మధేయం నక్షత్రం పుత్ర కా మస్య శస్యతే | ఆదిత్య పుష్య సావిత్ర సౌమ్య మూలాః సవైష్ణవాః ||

అచ్ఛిన్న నాభ్యాం కర్తవ్యం జాతకర్మ విచక్ష ణౖః | అశౌచే తు వ్యతిక్రాన్తే నామ కర్మ విధీయతే ||

అథవా భార్గవ శ్రేష్ఠ! దినే పూజితలక్షణ | మృదుధ్రువేషు ఋక్షేషు నామకర్మ విధీయతే ||

తత్రా ప్యంగారకదినం తిథిం రిక్తాం చ వర్జయేత్‌ | నామధేయం తు వర్ణానాం కర్తవ్యం తు సమాక్షరమ్‌ || 10

మాంగళ్యం బ్రాహ్మణ స్యోక్తం క్షత్రియస్య బలాన్వితమ్‌ | వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్యతు జుగుప్సితమ్‌ ||

శర్మ వర్మ ధనార్థంతు దాసాన్తం చానుపూర్వళః | నామధేయం తు కర్తవ్యం స్వకులాను గమేన వా ||

స్త్రీణాం సుఖోద్య మక్రూరం విస్పష్టార్థం మనోహరమ్‌ | నామ కార్యం మహాభాగ! న కార్యం విషమాక్షరమ్‌ ||

బాలం తు కృతనామానం పూజితస్య గదాభృతః | నివేదయే న్మహాభాగ! తవ పుత్రోయ మిత్యుత ||

శిష్యః ప్రేష్య శ్చ దాస శ్చ సంవిభాజ్య శ్చ కేశపః | నిత్యం సన్తి విభాగేన శుభేన మధు సూదనః ||

తతస్తు పూజనం కార్యం బ్రాహ్మణానాం యధావిధి | భోజయే ద్ర్బాహ్మణాం శ్చాత్ర పరమాన్నం సదక్షిణమ్‌ ||

చూడాకర్మ తతః కార్యం భృగుపుత్ర! యధాకులమ్‌ | నక్షత్రాణ్యత్ర శస్యన్తే మృదుక్షిప్రచరాణి చ || 17

పరశురాముడు నీవలన ధర్మమార్గము వినగోరెదను. మహానుభావ నీవు సర్వ ధర్మముల నెఱుంగుదువుగదా! ఆనతిమ్మన పుష్కరుండిట్లనియె, స్త్రీలకు ఋతురాత్రులు పదునారు. అందు మొదటి మూడును గర్హితములు. ఆరాత్రులు గడచిన తర్వాత సరి రాత్రులందు పుత్రార్థియైనవాడు పుత్రిక కావలయుననువాడు బేసిరాత్రులందు స్త్రీని గూడవలెను. దూరములగు సరి రాత్రులం గలియుట వలన బుట్టిన మగపిల్లలు దీర్ఘాయుష్కులు ధర్మపరులు ధనవంతులు నగుదురు. గర్భాధానమందు (రేతస్సేకముచే) గర్భము యొక్క సృష్టించుట కలుగుటచే గర్భాధానమనబడును. విచక్షణులు (తెలిసినవారు) అందు మొట్ట మొదట స్పర్శనము (తాకుటయు) ఆమీద సేవనము (కలియుటయు) చేయవలెను. ఆరవనెలలో గాని యెనిమిదవనెలలో గాని సీమంతము సేయవలెను. స్మర్శన గర్భాదాన సీమంతములను నీమూడు సంస్కారములందును పత్రకాముడైన వానికి పున్నామనక్షత్రము ప్రశస్తము. ఆదిత్యము = అదితి దేవతాకము పుష్య మిసావిత్రము = సవితృదేవతాకము సౌమ్యము = సోమదేవతాకము మూల విష్ణుదేవతాకము = శ్రవణ యను నీయేడును పున్నామ నక్షత్రములు. మంగళవారమును రిక్తతిధిని వర్జింపవలెను.

బొడ్డు కోయకుండ జాతకర్మము సేయవలెను. పురుడువెళ్ళిన తరువాత నామకరణము, లేదా నేదేని శుభరక్షణయైన నాడు చేయవచ్చును, దానికి మృదు ధ్రువనక్షత్రములు త్తమములు, అందుగూడ మంగళవారము రిక్తతిధిము మానవలెను, నామము సరియక్షరములుగా నొనరింపవలెను, బ్రాహ్మణునకు మంగశార్థకమైనది క్షత్రియునకు బలసంన్నముగా నుండునది వైశ్యునికిధన సంయుక్తమై యుండు నది శూద్రునకు జగుప్సితమగు పేరులు పెట్టవలెను. అనుపూర్విగ (వరుసగ) బ్రాహ్మణునికి పేరుచివర శర్మ క్షత్రియునికి వర్మ వైశ్యునికి ధనమర్థమిచ్చు పసుపు మొదలయినది శూద్రునికి దాస అను పదము చివర నుండునట్లు పెట్టువలెను లేదా తన కులాను సారము తండ్రి తాత ముత్తాతల పేర్లు ఇష్ట దేవతల పేర్లు మొదలయిదవి పెట్టవచ్చును. స్త్రీలకు సుకోచ్చార్యము అక్రూరము అర్థస్పష్టతగల మనోహరమైన పేరుంచవలెను. అది విషమాక్షరము (బేసి అనక్షరములుగలది) గాగూడదు. పేరు పెట్టిన తర్వాత నాబాలుని పూజింపబడిన విష్ణువునకు ఈబాలుడు నీవాడని నివేదింప వలెను. హరి శిష్యుడుగా ప్రేష్యుడుగా ఈపనిచేయమని పంపవలసిన అనుచుడుగా = దాసుడుగా తన తోడివాటా దారుగ శుభ విభాగముగ విష్ణవేయయి యందఱునున్నారు, అనగా వారందఱును విష్ణవులుగా భావింపవలెనన్న మాట, అటుపై బ్రాహ్మణులను యధావిధిం బూజించి పరమాన్నముభోజనముపెట్టినక్షిణలీయ వలెను. ఆమీద కులమర్యాదతో చూడాకర్మ (పుట్టువెంట్రుకలు తీయుట) జరుపవలెను. ఇందు మృదు క్షిపచర నక్షత్రములు శుభములు.

తిథిం వివర్జయే ద్రిక్తాం సూర్యారార్కి దినాన్య పి| తత్రాపి వాసుదేవస్య పూజం కృత్వా విశేషతః ||

గర్భాష్టమేబ్దే కర్తవ్యం బ్రాహ్మణస్యోప నాయనమ్‌ | గర్భాదేకాదశే రాజ్ఞం గర్బా చ్చ ద్వాదశే విశః ||

చూడా కర్మణి యః ప్రోక్తః కాల స్సోత్రాపి శస్యతే | నక్షత్రాణాం యధోక్తానాం మహూర్తా శ్చ శుభ ప్రదాః ||

షోడశాబ్దే హి విప్రస్య రాజన్యస్య ద్వి నింశతిః | వింశతి శ్చ నతుష్కంతు వైశ్యస్య పరి కీర్తి తమ్‌ ||

సావిత్రీ నాతి వర్తేత అత ఊర్ధ్వం నివర్తతే | విజ్ఞాతవ్యా స్త్రయోప్యేతే యధా కాల మసంస్కృతాః ||

సావిత్రీపతితా వ్రాత్యా, వ్రాత్య స్తోమ క్రమా దృతే | ముంజస్య బిల్వజానాం చ క్రమా న్ముంజః ప్రకీర్తితః ||

మార్గ వైయాఘ్ర చర్మాణి వస్త్రాణి వ్రతచారిణామ్‌ | పర్ణ పిప్పల బిల్వానాం క్రమా ద్దండాః ప్రకీర్తితాః ||

కచదేశ లలాటాంస తుల్యాః పోక్తాః క్రమేణ తు | అవక్రాః సత్వచః సర్వే నాగ్ని శుష్కా స్తధైవ చ ||

వాసో పవీత కార్పాస క్షౌమో ర్ణానాం యధా క్రమమ్‌ | ఆది మధ్యా వ సావేషు భవచ్చబ్ధోప లక్షితమ్‌ ||

ప్రథమం తత్ర భిక్షేత యత్ర భిక్షా ధృవం భ##వేత్‌ | పూజయే ద్వాసుదేవం చ తత్ర దేవం విశేషతః ||

హృషీకేశజ వ్రతేశం చ సర్వ విఘ్నేశ్వరం ప||భుమ్‌ | యధోక్తేషు చ ఋక్షేషు త్రైవిద్యాం కారయే ద్గురుః ||

నైవాథి కారీ వేదే స్యా ద్వినా త్రై విద్యకేన తు | స్త్రీణాం సంస్కార మత్రోక్తం సకృత్కార్యం విజానతా ||

క్షేత్ర సంస్కార మేతద్ధి సకృదేవ విజాయతే | సంస్కారాణి పితా మర్యాత్‌ మేఖలా బంధనాత్మనః ||

మేఖలా బంధనా ద్యాని కార్యాణి గురుణా తథా || 30

సర్వాణి కార్యాణి హి లౌకి కాగ్నౌ స్వకల్ప మాలోక్య భృగు ప్రధాన |

సర్వేషు పూజా చ తథా విధేయ తస్యాప్రమేయస్య జనార్దన స్య ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే సంస్కార వర్ణనం నామ పంచాశీతి తమో ధ్యాయః || 85

రిక్తతిధిని ఆదివారము శనివారము మానవలెను. అందగూడ వాసుదేవుని బూజింపవలెను. బ్రాహ్మణునికి గర్భాష్టమమందు (తల్లి గర్భమునందు ప్రవేశించినప్పటినుండి లెక్కించి యెనిమిదవయేట) క్షత్రియునికి పదునొకండవ యేట వైశ్యునికి గర్భ ద్వాదశమందు (పండ్రెడవయేటను) నుపనయనము గావింపవలెను. చూడాకర్మ కొఱకు జెప్పబడిన వారములు నక్షత్రములు ముహూర్తములు దీనికిని శుభప్రదములు, విప్రునికి పదునాఱు సం||లకు రాజులకు నిరువదిరెండు. వైశ్యునికిరువదినాల్గు సంవత్సరములలో సావిత్రి యుపదేశమయి తీరవలెను. ఆమీద స్రావిత్రి నివృత్తయగును. అపుడు సావిత్రి యుపదేశము ప్రయోజన మీయదన్నమాట. ఈ మూడు వర్ణముల వారు సావిత్ర్యతివర్తనముచే యధాకాలముగ నుపనయన సంస్కారముసేయ బడరేని సావిత్రీపతితులువ్రాత్యులు నగుదురు. బ్రాహ్మణాదులకు వరుసగా ముంజి గడ్డితోపేనినది బిల్వముతోచేసినదిమేఖల(మేంజి)యుండవలెను. లేడి చర్మము పులిచర్మము బ్రాహ్మచారులకు వస్త్రములు పాలాశము (మోదుగ) పిప్పలము (రాలి) బిల్వము = (మారెడు) దండములు వరుసగా ముగ్గురికిని బ్రాహ్మణుని జుట్టుదాగ క్షత్రియునికి నుదుటిదాక వైశ్యునికి భుజముదాక దండములుండవలెను. అవి వంకరలేక త్వక్కుతోగూడి యగ్నిచే కాచినవి కాకుండ నుండవలెను. వస్త్రము ఉపనీతము (జందెము) బ్రాహ్మణ బ్రహ్మచారికి ప్రత్తిది, క్షత్రియున కవిక్షౌమములు = తెల్లపట్టువి వైశ్యునికి ఊర్ణములు = గొఱ్ఱ (ఉన్ని) రోమములతో నేసినవియునై యుండవలెను. భిక్షాచర్యము నందు బ్రాహ్మణవటువు భమఛ్చబ్దమును మొదటను క్షత్రియుడు నడుమను వైశ్యుడు చివరను జేర్చవలెను. భవాస్‌ బిక్షాందదాకుబిక్షాంభవతిదేహి! బిక్షాం భవాన్‌దదాత్‌ అనవలెనన్నమాట. తప్పక భిక్షదొరుకుచోటమందడుగవలెను. ఆ భిక్షాచరణమందుతడువాసుదేవుం బూజింపవలెను. బ్రహ్మచర్య వ్రతాధీశ్వరునిగా హృషేకేశుని (ఇంద్రియాధిపతిని) సర్వ విఘ్నేశ్వరుని పూజింపవలెను. గురుమత్రెవిద్యను, (వేదత్రయిని) శాస్తోక్తన్రక్షత్రములందుదధ్యయనము సేయింపవలెను. త్రై విద్యకులు బ్రాహ్మణక్షత్రయి వైశ్యులు ముగ్గురే. మిగిలినవారు వేదాధికారులు గారు, ఈ ఉపనయన సంస్కారము స్త్రీలకు సకృత్తుగా ఒకేసారి వివాహమాపముగానే జరుగవలసినది, క్షేత్ర సంస్కారమిద (స్త్రీ = క్షేత్రమును) ఆమెకొక్కసారే విహితమయినది. సంస్కారములన్ని యుందండ్రి చేయవలెను. మేఖలాబంధనాది సంస్కారములు గురువు చేయవలెను. ఓభృగు వంశప్రదానా! సర్వ సంస్కారములు తన కల్పముననుసరించి తాకికాగ్నియందే జరుపవలసినది అన్నిటి యందు, అప్రమేయడగు జనార్దనుని పూజ జరుపవలసినదే!

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు సంస్కార వర్ణనమను నెనుబదియైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters