Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనబది యెకటవ అధ్యాయము - సంకరధర్మము

పుష్కరః- ఆనులోమ్యేన వర్ణానాం జాతి ర్మాతృసమా స్మృతా | చండాలో బ్రాహ్మణీ పుత్రః శూద్రః స్యా త్ప్రతిలోమజః ||

మాగధ శ్చ తథా వైశ్యా చ్ఛూద్రా దాయోగవో భ##వేత్‌ | వైశ్యాయాః ప్రాతిలోమ్యేన ప్రతిలోమాత్‌ సహస్రశః ||

వివాహః సదృశై స్తేషాం నోత్తమై ర్నాధమై స్తథౄ | చండాల కర్మ నిర్దిష్టం వధ్యానాం ఘాతనం తథా ||

స్త్రీ జీవనం చ తద్రక్షా ప్రోక్తం వైదేహకస్య చ | సూతానా మశ్వసారథ్యం పుల్కసానాం చ వ్యాధతా ||

స్తుతి క్రియా మాగధానం తధా చాయోగవస్య చ | రంగా వతరణం ప్రోక్తం తధా శిల్పై శ్చ జీవనమ్‌ ||

నూతానా మస్తి సంస్కార స్తధా వై యాజన క్రియా || బహిర్గ్రామ నివాస శ్చ మృత చైలస్య ధారణమ్‌ ||

అసంస్పర్శ స్తధైవన్యై శ్చండాలస్య విధీయతే | బ్రాహ్మణార్థే గావర్థే వా దేహ త్యాగా నుప స్కృతః ||

స్త్రీ బాలా ద్యుప పత్తౌ చ బాహ్యానాం శుద్ధి కారణమ్‌ | సంకరే జాతయ సై#్వతాః పితృ మాతృ ప్రదర్శితాః ||

ప్రచ్ఛన్నా వా ప్రకాశా వా వేదితవ్యాః స్వ కర్మభిః | అనార్యతా నిష్ఠురతా పురతో నిష్క్రియాత్మతా ||

పురుషం వ్యంజయన్తీహ లోకే కలుష యోనిజమ్‌ | పితు ర్వా భజతే శీలం మాతు ర్వోభయ మేవ వా ||

న కథంచ న దుర్యోనిః ప్రకృతి స్వాం న గచ్ఛతి | కులే ముఖ్యేపి జాతస్య యస్య స్యా ద్యోని సంకరః ||

న శ్రయత్యేవ తచ్ఛీలం నరోల్ప మపి వా బహు | యత్ర త్వేతే పరిధ్వంసా జాయన్తే వర్ణ సంకరాః ||

రాష్ట్రియై స్సహ తద్రాష్ట్రం క్షిప్రమేవ వినశ్యతి | శూద్రాయాం బ్రాహ్మణా జ్ఞాతః శ్రేయసా చేత్ప్ర జాయతే ||

అశ్రేయాన్‌ శ్రేయసీం జాతిం గచ్ఛ త్యా సప్తమా ద్యుగాత్‌ |

రాజ్ఞా స్వకాలం పరిరక్షణీయం ఘోరం నృణాం సంకర మేత దేవ |

అసాద్య ఘోరాణి హి సంకరాణి నశ్యన్తి రాష్ట్రాణి సరాజకాని ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే సంకర ధర్మో నామ ఏకాశీతి తమోధ్యాయః ||

పుష్కరుడనియె. వర్ణముల యొక్క యానులోమ్యము వలన పుట్టినవాడు తల్లి జాతికి జెందినవాడగును. బ్రాహ్మణస్త్రీకి శూద్రునివలన బుట్టినవాడు చండాలుడగును, (క్రిందిజాతివానిని పైజాతి స్త్రీ పొందుట ఆనులోమ్యమన్నమాట) వైశ్యుని వలన బుట్టిన వాడు మాగధుడు శూద్రునివలన గల్గినవాడు ఆయోగవుడనంబడును. వైశ్యస్తీకి విలోముని వలన విలోమ సంపర్కము వలన వేల రకాలు జనింతురు. వారిలో వివాహము సమానులతోనేగాని ఉత్త మాధములతో కూడదు.

వధ్యులయినవాండ్రను జంపుట చండాలునిపని. మాగధులను స్తుతిచేయుట వైదేహకుని పని స్త్రీలమూలమున జీవనము సేయుట. వాండ్రనుర క్షించుట సూతుల కశ్వసారథ్యము పుల్కసులకు వ్యాధత్వము వివాహము సమానులతోనే గాని ఆయోగవునికి రంగావతరణము నాటకములో తెరవెత్తుట దంపుట శిల్పజీవనము, సూతులకు బాతకర్మాది సంస్కారము యాజనమును గలవు, చండాలుకిని గ్రామము వెలుపల నివసించు శవముమీది బట్టను ధరించుట అస్పృశ్యతయు విధింపబడినవి. గో బ్రహ్మణులతకొఱకు స్త్రీబాలాదుల కారణమునను దేహత్యాగము చేయుట వెలివేయ బడినవారి శుద్దికి కారణమగును తల్లి దండ్రులవలన వ్యక్తము చేయబడిన చాటుమాటైన వెల్లడియైన యీ సంకర జాతులను వారి వారి చేతలనుబట్టి గుర్తింపవలయును ఆచేష్టతీరున పెద్దమనిషిగా నుండక పోవుట నిష్మరత్వము ముందు ఏ పనియు చేయకుండుట (ఎవరైన చెప్పిన మీదటనే యెదైన పనిచేయుటగాని తమంతట దామెకపని చక్కబెట్టరన్నమాట) ఈలక్షణములు పాప యెనియందు బుట్టిన వానిని గుర్తింపజేయును. వాడు తండ్రియొక్క లేక తల్లియొక్క యిద్దరియొక్క గాని నడవది నాశ్రయించి యుండును. దుర్యోనియైనవాడు తన నైజము నేవిధముచే నైనను విడువడు. ఈజాతి వరిధ్యంసు లేరాష్ట్రమందు బుట్టుదురో యారాష్ట్రము రాష్ట్రప్రజలతో గూడ త్వరగా సర్వనాశనమగును. శూద్రయందు బ్రాహ్మణునివలన బుట్టినవాడు శ్రేయిస్సంపన్నుడై పుట్టిన యెడల శ్రేయశ్శూన్యుడు ఏడవ యుగమ నుండి శ్రేయోవంతమైన జాతినే పొందును, శ్రేయోవంతముగా పుట్టునన్నమాట.

రాజు తన పరిపాలన కాలమును సంకరముగాకుండ సంరక్షించుకొనవలెను. ఈ సంకరస్థితి మానవులకతి ఘోరమైనది. ఇట్టి ఘోర సంకరములను బొందిన ర్రాష్ట్రములు రాజులతో గూడ నశించును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు సంకరధర్మమను ఎనుబది యొకటవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters