Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదితొమ్మిదవ అధ్యాయము - ద్రవ్యశుద్ధి

పుష్కరః- మృణ్మయం భాజనం సర్వం పునః పాకేన శుద్ధ్యతి | మద్యై ర్మూత్ర పురీషై ర్వా ష్ఠీవనైః వూయ శోణితైః

సంస్సృష్టం నైవ శుధ్యేత పునః పాకేన మృణ్మయం | ఏతై రేవ తధా స్పృష్టం తామ్ర సౌవర్ణ రాజతమ్‌ ||

శుధ్యత్యా తాపితం పశ్చా దన్యథా కేవలంభసా | అవ్లూె దకేన తామ్రస్య సీసస్య త్రపున స్తథా ||

క్షారేణ శుద్దిం కాంస్యస్య లోహస్య చ వినిర్దిశేత్‌ | ముక్తా మణి ప్రవాళానాం శుద్ధిః ప్రక్షాళ##నేన తు ||

అన్యేషాం చైవ భాండానాం పర్వస్యాశ్మ మయస్య చ | శాక రజ్జు మూల ఫల వైదళానాం తథైవ చ ||

మార్జనా ద్యజ్ఞ భాండానాం పాణినా చాగ్ని కర్మణి | ఉష్ణాంభసా తథా శుద్ధిః సస్నేహానాం వినిర్దిశేత్‌ ||

శయనా77సన యానానాం స్ఫ్య శూరప శకటస్య చ | శుద్ధి స్సంక్షేపణా జ్ఞేయా పలా తేం ధనయో స్తథా ||

మార్జనా ద్వేశ్మనాం శుద్ధిః క్షితౌ శోధనతః క్షణాత్‌ | సంమార్జితేన తోయేన వాససాం శుద్ధి రిష్యతే ||

బహూనాం ప్రేక్షణా చ్ఛుద్ధిః ధాన్యనాం చ వినిర్దిశేత్‌ | శుద్ది ర్ద్రుమాణాం విజ్ఞేయా నిత్య సత్పవనేనళు ||

ప్రోక్షణాత్‌ సంహతానాం తు దారవణాం చ తక్షణాత్‌ | సిద్ధార్థకాణాం కల్కేన శృంగ దంత మయస్య చ ||

గోవాలైః ఫల పత్రాణాం అస్థ్నాం స్యా చ్ఛ్రుంగవ త్తధా | నిర్యాసానాం గుడానాం చ లవణా నాం తధైవ చ ||

కుసుంభ కుంకుమానాం చ ఊర్ణా కార్పాసయో స్తథా | ప్రోక్షణాత్‌ కథితా శుద్ధి రిత్యాహ భగవాన్‌ హి సః ||

భూమిష్ఠ ముదకం శుద్ధం తథైవ వ శిలాగతమ్‌ | వర్ణ గంధ రసై ర్దుష్టై ర్వర్జితం యది తద్భవేత్‌ ||

శుద్దం నదీగతం తోయం సర్వ ఏవ తధా೭೭కరాః | శుద్ధం ప్రసారితం పణ్యం శుద్ధే యో ర్ముఖే ||

ముఖ వర్జం చ గౌ శ్శుద్ధా మార్జారః శ్వాచ నో శుచిః | శయ్యా భార్యా శిశు ర్వస్త్ర ముపనీతం కమండలుః ||

ఆత్మనః కధితం శుద్ధం న పరస్య కధంచ న | నారీణాం చైవ వత్సానాం శకునీనాం శునాం ముఖమ్‌ ||

రతౌ ప్రస్రవణ వృక్షే మృగయాయాం సదా శుచిః | శుద్ధా భర్తు శ్చతు ర్థేహ్ని స్నాత్వా నారి రజస్వలా ||

దేవై కర్మణి పిత్ర్యే చ పంచమేహని శుద్ధ్యతి | కృత్వా మూత్ర పురీషం వా స్నాత్వా భోక్తుమనా స్తథా ||

భుక్త్వా క్షుత్వా తథా సుప్త్వా పీత్వా చాంభోవ గాహ్య చ | రధ్యా మాక్రామ్య వా೭೭చామే ద్వాసో విపరిధాయ చ ||

కృత్వా మూత్ర పురీషం చ తేపగంథాప హం బుధః | ఉద్ధృతే నాంభసా శౌచం మృదా శౌచం సమాచరేత్‌ ||

మేహనే మృత్తికాః పంచ లింగే ద్వే పరి కీర్తితే | ఏకస్మిన్‌ వింశతి ర్హస్తే ద్వయోర్జేయా

శ్చతుర్దశ ||

తిస్రస్తు మృత్తికాః జ్ఞేయాః కృత్వా తు నఖ శోధనమ్‌ | తిస్రః తిస్రః పాదయో శ్చ శౌచ కామై స్తు నిత్యశః ||

శౌచమేతత్‌ గృహస్థానాం ద్విగుణం బ్రహ్మచారిణామ్‌ | త్రిగుణం తు వనస్థానాం యతీనాం చ చతుర్గుణమ్‌ ||

మృత్తికా చ వినిర్దిష్టా త్రి పూర్వం పూర్వతే యయా | శుద్ధి శ్చ కాచ భాండానాం కేవలేన తథాం భసా ||

శ్రీ ఫలై రంశు పట్టానాం క్షౌమాణాం గౌర సర్షపైః | శుద్ధిః పద్మాక్ష తోయేన మృగలోమ్నాం ప్రకీర్తి తా ||

పుష్పాణాం చం దనా నాం చ ప్రోక్షణా చ్ఛుద్ధి రిష్యతే ||

సిద్దార్థకై శ్శుద్ధి ముదా హరన్తి లోమ్నాం తథా భార్గవ వంశ ముఖ్య|

సర్వస్య జీవస్య విశుద్ధి రుక్తా మృదా చ తోయేన విగంధ లేపాత్‌ ||

ఇతీ శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ద్రవ్య శుద్ధిర్నామ ఏకోనా శీతి తమోధ్యాయః ||

పుష్కరుడనియె: మట్టి కుండలు తిఱిగి వంటకుపయోగించినచో శుద్ధములగును: కల్లమూత్ర ప్రరీషములు చీమిడి రక్తము చీము మొదలైనవాని స్పర్శగల్గిన కుండ కూడ తిరిగి పాకమునకుపయోగించిన శుద్ధియగును. వీనితో నంటుపడిన రాగి బంగారు వెండి పాత్రలు నిప్పుమీద కాచినను కేవలము నీటితో గడగినను శుద్ధములగును. చింతపండు రసముచేత రాగి సీసము త్రపుసము క్షారము= కారముచే కంచు శుద్ధియగును. ముత్యాలు పగడాలు మణులు ప్రక్షాళముచే స్వచ్ఛములగును. మఱి రాతి కడవలు ఆకుకూరలు త్రాళ్ళు దుంపలు పండ్లు విదళములనగా కంది పెసర మినుము సెనగ మొదలయిన పప్పులు నీటంగడిగిన శుద్దినందును. జిడ్డుతోనున్న యజ్ఞబాండములను చేతితో తుడిచినగాని నిప్పునం గాచినగాని వేడినీరుతో గడగినగాని స్వచ్ఛత జెందవు. మంచాలు పీటలు యానములు చేటలు బండ్లు మాంసము కట్టెలు సంక్షేపణము వలన = కడుగుట వలన పరిశుద్ధిచెందును. ఇండ్లూడ్చి కడుగుటవలన నేల అలుకుటవలన సంమార్జనముచే వస్త్రములు పెక్కు ధాన్యములు ప్రోక్షేణమువలన శుద్ధములగును.

చెట్లకు నిత్యం శుద్ధి గాలివీచుటవలన అతికిన కఱ్ఱసామాగ్రి సిద్ధార్థకముల ముద్దచే (ఆవాల ముద్దచే) కొమ్ముదంతములచేసిన వానిని ప్రోక్షిణముచే చెక్కుటచే శుద్ధములగును. ఆవు తోకతావించిన పండ్లు పువ్వులు దోషము వాయును. ఎముకల సామాగ్రి కొమ్మలట్ల ఆవాలముద్దచే మాలిన్యము వాయును, జిగురు పదార్థములు బెల్లము ఉప్పు కుసుంభము = కుంకుమము ఉన్ని దూది సామాగ్రి పోక్షణకము శుద్దములగునని భగవంతుడన్నాడు, నిండుగానున్న నీరు రాతిమీదినీరు రంగు వాసన రుచిలేనిదగునేని పరిశుద్దమే. నదీజలములు ఆరచేములు = గనులు, మడుగులు దుకాణములో పరచిన సరకాలు గుఱ్ఱము మేక యొక్కయు ముఖములు ముఖము తప్పించి ఆవంతయు శుచియే. పిల్లి కుక్కలయినను లత మంచము భార్య శిశువు వస్త్రము ఉపవీతము కమండలము తనవి తనకు శుద్ధములు, ఇతరులువి శుద్ధములుగావు. స్త్రీలు దూడలు ఆడపక్షులు కుక్కలు అనువానియొక్క ముఖములు వరుసగా రతియందు ప్రస్రవణమందు (చొంగ) చెట్టు మీద వేటయందును పవిత్రములు, వాకిటనున్న స్త్రీ నాల్గవ రోజు స్నానము చేసినది భర్తకు శుద్ధురాలు. ఆమె యైదవరోజు దేవపితృకార్యములకు శుద్ధురాలగును, మూత్రవరీష విసర్జనము చేసి స్నానము చేసి భోజనము చేయనెంచి భోజనము చేయనెంచి భోజనము చేసిన తర్వాతతుమ్మినపుడు పండుకొనిలేచినతర్వాత నీళ్ళు ద్రాగిన నీళ్ళలో స్నానమాడి రాచబాట యందు మసలిన మీదట వస్త్రములు ధరించి యాచమనము చేయవలెను. మూత్రవిసర్జన చేసినవాడావాసన పోవునట్లు ఉద్ధృత జలముతో మట్టితో శౌచము సేసికొనవలెను. ఒక చేతనిరువది రెండు చేతల పదునాల్గు పాదములందు మూడు మూడు, వొంటి యొడలు రాచికొని శుద్ధిసేసికోవలెను. ఈ శౌచము గృహస్థులకు బ్రహ్మచారులకు దానికి రెట్టింపు వాసక్ష్రసులము మూడు రెట్లు యత్తయే. నాల్గు రెట్లు మట్టి యుండలతో గానింపనగును, గాజుపాత్రలకు కేవలము నీటితో మారేడు రసముతో అంశువులకు = పట్టములకు క్షామవస్త్రములను పట్టు బట్టలను తెల్లావాల రసముతో మృగలోమములకు ద్రాక్ష జలముతో శుద్ది పువ్వులును చందనము జలప్రోక్షణముచే శుద్ధములగును. లోహములకు బట్టలకు ఆవాలరసముతో శుద్ధి, సర్వజీవ కోటికి మట్టితో నీటితో వాసనలేకుండ దోముటచే శుద్ధి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు ద్రవ్య శుద్ధియను డెబ్బది తొమ్మిదవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters