Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదిఎనిమిదవ అధ్యాయము - బాంధవ - సమాశ్వాసనము

పుష్కరః- బుధైరాశ్వసనీయాశ్చ బాంధవైః మృతబాంధవాః | వచనై ర్ధర్మ సంయుక్తైః తాని చాన్యాని మే శృణు ||

నిత్య మస్మి న్నిరాలంబే కాలే సతతయాయిని | న తద్భూతం ప్రపశ్యామి స్థితి ర్యస్య భ##వే ద్ధ్రువా ||

గంగాయా స్సికతా ధారా స్తథా వర్షతి వాసవే | శక్యా గణయి తుం లోకే న వ్యతీతాః పితామహాః ||

చతుర్దశ వినశ్యన్తి కల్పే కల్పే సురేర్వరాః | సర్వలోక ప్రధానా శ్చ మనవ శ్చ చతుర్దశ ||

బహూ నీంద్రసహస్రాణి దైత్యేంద్రనియుతాని చ | వినష్టా నీహా కాలేన మనుజే ష్వధ కా కధా ||

రాజర్షయ శ్చ బహవ స్సర్వే సముదితా గుణౖః | దేవా బ్రహ్మర్షయ శ్చైవ కాలేన నిధనం గతాః ||

యే సమర్థా జగత్య స్మిన్‌ సృష్టి సంహారకారణ | తేపి కాలేన నీయన్తే కాలోహి దురతి క్రమః ||

ఆక్రమ్య సర్వం కాలేన పరలోకాయ నీయతే | కర్మ పశ్యతి నోజం తు స్తత్ర కా పరిదేవ నా? ||

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | అస్మిన్‌ దుష్పరిహార్యేర్థే నాస్తి లోకే సహాయతా ||

శోచన్తో నో పకుర్వన్తి మృతస్య హి జనా యదా | అతో న శోచితవ్యం స్యాత్‌ క్రియా కార్యా సు యత్న తః ||

సుకృతం దుష్కృతం చోభౌ సహాయే యస్య గచ్ఛతః | బాంధవై స్తస్య కిం కార్యం శోచద్భి రథవా నవా ||

బాంధవానా మశౌచే తు స్థితిం ప్రేతో న విందతి | అత స్త్వభ్యేతి తా నేవ పిండతోయప్రదాయినః ||

అర్వాక్‌ స పిండీకరణాత్‌ ప్రేతో భవతి యో మృతః | ప్రేతలోక గతస్యా న్నం సోద కుంభం ప్రయచ్ఛతః ||

పితృలోక గతశ్చాన్నం శ్రాద్ధం భుంక్తే సుధాసమమ్‌ | పితృలోక గతస్యా7 స్య తస్మా చ్ర్ఛాద్ధం ప్రయత్నతః ||

దేవత్వే యాతనా స్థానే తిర్య గ్యోనౌ తధైప చ | మానుష్యే చ తథా೭೭ప్నోతి శ్రాధ్ధే దత్తే స్వ బాంధవైః ||

ప్రేతస్య శ్రాద్ధ కర్తు శ్చ పుష్టిః శ్రాద్ధే కృతే ధ్రువమ్‌ | తస్మా చ్ఛ్రాద్ధం సదా కార్యం శోకం త్యక్త్వా నిరర్థకమ్‌

ఏతా వదేవ కర్తవ్యం సదా ప్రేతస్య బంధుభిః | నోప కుర్యా న్నరః శోచన్‌ ప్రేతస్యా త్మన ఏవ చ ||

దృష్ట్వా లోక మనాక్రందం మ్రియ మాణాం శ్చ బాంధవాన్‌ | ధర్మ మేకం సహా యార్థే కారయ ధ్వం సదా నరాః ||

మృతోపి బాంధవ శ్శక్తో నా నుగంతుం నరై ర్యతః | జాయా వర్జం హి సర్వస్య యస్యా భర్తా విభిద్యతే ||

ధర్మ ఏకోను యా త్యేనం యత్ర కుత్ర చ గామినమ్‌ | నన్వసారే త్రిలోకేస్మిన్‌ ధర్మం కురుత ! మాచిరమ్‌ ||

శ్వః కార్య మద్య కుర్వీత! పూర్వాహ్ణే త్వాపరాహ్ణికమ్‌ | న హి ప్రతీక్షతే మృత్యుః కృత మస్య న వా కృతమ్‌ ||

క్షేత్రాపణ గృహా సప్త మన్యత్ర గత మానసమ్‌ | వృ కీవా రణ్య మాసాద్య మృత్యు రా దాయ గచ్ఛతి ||

న కాలస్య ప్రియః కశ్చిత్‌ ద్వేష్య శ్చాస్య న విద్యతే | ఆయుష్యే కర్మణి క్షీణ ప్రసహ్య హరతే జనమ్‌ ||

నాప్రాప్తకాలో మ్రియతే విద్ధః శర శ##తై రపి | కుశాగ్రేణా పి సంస్పృష్టః ప్రాప్తకాలో న జీవతి ||

నౌ షధాని న మంత్రా శ్చ న హోమా న పున ర్జపాః | త్రాయన్తే మృత్యు నో పేతం జరయా వాపి మానవమ్‌ ||

ఆగామిన మన ర్ధంతు ప్రతి ఘాత శ##తై రపి | న నివారయి తుం శక్తాః తత్రకా పరిదేవనా? ||

యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరమ్‌ | తథా పూర్వ కృతం కర్మ కర్తారం విందతే ధ్రువమ్‌ ||

అవ్యక్తా దీని భూతాని వ్యక్త మధ్యాని చా ప్యథ | అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా? ||

దేహినోస్మిన్‌ యధా దేహే కౌ మారం ¸°వనం జరా | తథా జన్మాంతర ప్రాప్తి ర్ధీర స్తత్రన ముహ్యతి ||

గృహ్ణా తీవ యధా వస్త్రం త్యక్త్వా పూర్వ ధృతం నరః | గృహ్ణా త్యేవం నవం దేమం దేహీ కర్మ నిబంధనః ||

నైనం ఛిందన్తి శస్త్రాణి నైనం దహతి పాపకః | న చైనం క్లేదయన్త్యా పో న శోషయతి మారుతః ||

అచ్ఛే ద్యోయ మదా హ్యో7యమక్లే ద్యోశోష్య ఏవ చ | నిత్య స్సర్వ గతః స్థాణు రచలో7యం సనాతనః ||

అవ్యక్తో7య మచిం త్యో7య మవి కార్యో7య మేవ చ తస్మ దేవం విది త్వై నం నానుశోచి తు మర్హథ ||

ఆశ్చర్య వ త్పరశ్యతి కశ్చిదేన మాశ్చర్య వ ద్వదతి తధై వ చాన్యః |

ఆశ్చర్య వచ్చైన మన్య శ్శృణోతి శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే బాంధవ సమాశ్వాసనల నామ అష్ట సప్తితి తమో7ధ్యాయః ||

పుష్కరండునియె: - జ్ఞానులు బంధువులు చనిపోయిన వాని చుట్టములను ధర్మవచనములు సెప్పి యోదార్చవలెను. అవచనములను వినుము. కాలము నిరాధారము. నిలుకడలేనిది నిత్యము నడచుచునే యుండునది. ఇందు చనిపోకుండ శాశ్వతముగ నిలిచియుండు జీవిని నేను గానను. గంగలో నిసుక రేణువలను ఇంద్రుడు గురియు వర్షధారలను లెక్కింపవచ్చును. కాని యీ లోక మందు గతించిన బ్రహ్మ లెక్కగట్టుట శక్యముగాదు. ప్రతి కల్పమందును బదునల్గురు దేవేశ్వరులు (దిక్పాలురు) సర్వోలోక ప్రధానులయిన పదునల్గురు మనువులు, వేలకొలది దేవేంద్రులు లక్షల కొలది దైత్యేంద్రులు నీలోకమున కాలవశులై పోయినారు. మానవుల విషయ మిక నేమి సెప్పవలెను? గుణవంతులు మహానుభావు లెందరో రాజుర్షులు దేవతలు బ్రహ్మర్షులును గాలము గతించిరి. ఈ జగమున పుట్టింపను జంపను సమర్థులైన బ్రహ్మాదులు గూడ కాలముచే గొంపోబడు చున్నారు. అట్టి కాలమేరికిం గడువరానిది, కాలము సర్వభూతజాలము పైబడి పరలోకమునను లాగికొని పోవును, జీవుడు కర్మగతిం జూడలేడు, అది అతి గహనము, దానికై యేడ్చు టెందులకు?

పుట్టినది పోవు నిక్కమ్మ గిట్టెనేని పుట్టుకయు నిక్కమేల యిట్ట ట్లు సేయ

రాని దిద్దాన తోడ్పాటు లేనె లేదు ఏరునుస్‌ వెంటరా రిందు నేడ్వనేల?

చచ్చినవాని చుట్టుము వేడ్చి వానికెట్లునుపకరింపరు. కావున నేడువ వలదు. వానికి కర్మ యథావిధి పూని చీయవలెను. చనిపోవువానికి తోడైపోవునవి పుణ్యము పాపమునను నవి రెండే. అట్టియెడ వానికై చుట్టము రాగాలు పెట్టియుం చెట్టకయుం గల్లించు ప్రయోజన మేమియునుంలేదు. చచ్చిన వారి చుట్టముల కాశౌచము (మైల) యున్నంత వరకు వారికా లోకమున నిలుకడ లభింపదు. కావున నా ప్రేతయే పిండోదక ప్రదాతల పిండోదకము కొరకు ననుసరించు చుండును. చనిపోయినవాడు సపిండీకరణమునకు ముందర ప్రేతముగా నుండును ప్రేతలోకమందున్న వానికి ఉదకకుంభముతో బాటుగ నన్నమును (పిండమును) బెట్టవలెను. పితృలోక గతుడైన పిమ్మట ఆజీవి శ్రద్ధతో పెట్టిన (శ్రాద్ధము) అన్నమును నాతడు పితృలోకమందుండి అమృత ప్రాయముగ నారగించును. అందుచే వానికి శ్రాద్ధమును శ్రద్ధగా పెట్టి తీరవలెను. బంధువులు పెట్టిన శ్రాద్ధమును చనిపోయినవాడా యాతనాస్థాన మందు (యాతనా శరీరమందు) గాని దేవత్వమునందు (దేవలోకములో) గాని పశుపక్ష్యాది జన్మము లేమేమి యెత్తిన నా యాజన్మములందున గాని మనుష్య జన్మమునగాని ననుభవించును. ఏ జన్మమెత్తినను దాని కనువైన యాహారముగ శ్రాధ్దాన్నము పరిణామ మెందెయందు నన్నమాట) శ్రాద్ధము బెట్టినవానికి చచ్చిన వానికిం గూడ పుష్టినిచ్చును. ఇది నిజము,కావున నూరక యేడ్వక శ్రాద్ధము తప్పక పెట్టవలెను. చచ్చినవారికి బంధువులు చేయదలసినదింతమాత్రమే. మానవు డేడ్చి చచ్చిన వాని కుపకరింపడు. తనకు దానుపకరింపడు. శోకింపక లోకమున మరణించు స్వభావముగల బంధువులను గమనించి మానవులు ధర్మ మొక్క దానిచే చచ్చిన వానికి తోడీయవలెను.

చనిపోయిన వానిని వానిభార్య తప్ప మిగిలిన బంధువులెవ్వరు చనిపోయినను చచ్చిన వాని వెంట బోలేరుపోరు భార్యతో నొక్కభర్తయే విడివడడు. భార్యా భర్తృ సంబంధము అనేక జన్మ సిద్ధమని శాస్త్రములనుచున్నవి. ఈ జివుడెందెందు బోయినను వీనిని! సారములేని యీ లోకములు మూడింటను వెంబడించునది ధర్మ మొక్కటియే. కావున వెంటనే ధర్మముం జేయుడు ఆలస్యమువలదు. రేపు చేయవసినపని నీ వేళ##నే; మలిజామునే సేయవలసిన దానిని తొలి జాముననే చేయవలెను, మానవుని చేతను జేయమని మృత్యు వెదురుచూడదు. క్షేత్ర విత్త గృహాదులందు దగులుపడి యొక్కడనో యే విషయమంతోమనసు వెట్టిన యీ జీవుని మృత్యువడలిలో జేరిన తోడేలువలె పైకొని లాగికొని పోవును. కాలమున కొక డిష్టుడులేడు. ఒక డనిష్టుడునులేడు ఆయువు దాని కూతయైన కర్మము క్షయించిన వెంటనే మృత్యువు పైబడి జనము నీడ్చికొని పోవును, వందలలుగులం బొడిచిన కాలము రాకుండ నెవ్వడుం జావడు, కాలము వచ్చెనా కుశాగ్రముచే తాకబడిన వాడుం జచ్చితీరును. ఔషధములు గావు మంత్రములు గావు హోమములు గావు జపములు గావు, మృత్యువశుని ముదిమి గ్రమ్మిన వానిని నివేవియు రక్షింపలేవు ఎందులకుంగొర గావు. రానున్న కీడు నెన్ని ప్రతిక్రియలనేని నివారింపవలను బడదు. అందల కేడ్చుటెందులకు? వేల ఆవులమందలో దూడ తల్లి దగ్గరకే యెట్లుపోవునో. అట్లే తొలి జన్మములం జేసిన కన్మ కర్తను చెందును. ఇది నిక్కము. జీవుల మొదలు తెలియదు. అంతునుం దెలియదు, నడిమి బ్రతుకు మాత్రము దెలియును. అట్టి తెలియరాని పుట్టుకం గూర్చి చావునుం గూర్చి యెడ్పెండులకు? దేహికీ దేహమందు కౌమారదశ ¸°వనదశ ముదిమియు నెట్లో యింకొక జన్మము వచ్చుటయు నట్లే. ధీరు డందుబొరవడడు, మునుగట్టుకొన్న బట్టను విడిచి యింకొక వస్త్రముం గట్టుకొన్నట్లే కర్మబంధమున మున్నొందిని మానువుడీ మేనువిడిచి యింకొక మేనుంబొందును. ఈ ఆత్మను (జీవసంజ్ఞదానిని) కత్తుల కోయలేవు. నిప్పు గాల్పలేదు. నీరు తడుపలేదు, వాయు వెండింప జాలదు. ఇది అచ్ఛేద్యము. (కోయరానిది) గాల్చరానిది తడుపరాదిని, ఎండింపరానిది. (నిలుకడగలది) ఇది నిత్యము సర్వగతము స్థాణువు. అచలము (కదలనిది) సనాతానము - అవ్యక్తము అచింత్యము. అవికార్యముం గావున దీనిం గూర్చి యేడువం దగదు, ఒకడీయాత్మను వింతగా జూచును. దీనిం గూర్చి యింకొకడు వింతగా మాట్లాడును. ఒకడు వింతగా దీనిని వినుము వినియునుందీని నెవ్వడుం దెలియనేరడు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు బాంధవనమాశ్వాసనమను డెబ్బది యెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters