Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదిఆరవ అధ్యాయము - ప్రేతనర్హరణమ్‌

పుష్కరః- ద్విజం న నిర్హరేత్‌ ప్రేతం శూద్రేణ తు కధంచ న | న చ శూద్రం ద్విజేనాపి తయో ర్దోషోభిజాయతే

అనాధం బ్రాహ్మణప్రేతం యే వహ న్తి ద్విజాతయః | పదే పదే క్ర తు ఫలం చానుపూర్వాల్లభన్తి తే ||

సంస్కారార్థ మనాధస్య య స్తు కాష్ఠం ప్రయచ్ఛతి | కాష్ఠాగ్నిధాతా ప్రా కాశ్యం సంగ్రామే లభ##తే జయమ్‌ ||

సంజ్వాల్య బ్రాహ్మణం ప్రేత మపసవ్యేన తాంచితిమ్‌ | పరి క్రమ్య తతః స్నానం కుర్యు స్సర్వే స్వబాంధవాః ||

ప్రేతాయ చ తథా దద్యు స్తిస్రోవై చోదకాంజలీః | ద్యార్యశ్మని పదం దత్వా ప్రవిశేయు స్తథా గృహమ్‌ ||

అక్షతా నిక్షిపేయుశ్చ తథా వహ్నౌ సమాహితాః విదశ్య నింబ పత్రాణి శయీరంశ్చ పృథక్‌ క్షి తౌ ||

క్రీత లబ్ధాశనా శ్చైవ భ##వేయు స్సు సమాహితాః న చైవ మాంస మశ్నీయుర్వ్రజేయుర్న చ యోషితమ్‌ ||

నివర్తయేయు స్తధై వైకం పిండం ప్రేతస్య నిత్యదా | అశౌచం యాపదేప స్యా త్తస్మిన్‌ వ్య పగతేపునః ||

శ్మశ్రు కర్మ తథా కృత్యా స్నాతాః సిద్ధార్థకై స్తిలైః | పూజయే యు ర్ద్విజా న్రామ! పరి వర్తిత వా ససః ||

అదన్త జాతే తనయే శిశౌ గర్భ చ్యుతే తథా | కార్యో నై వాగ్ని సంస్కారో నైవ చా స్యోదక క్రియా ||

చతుర్ధే చ దినే కార్య శ్చైవా స్థ్నాం రామ ! సంచయః | అస్థి సంచయ నా దూర్థ్వం కులస్పర్శో విధీయతే ||

మృతస్య బాంధవై స్సార్థం కృత్వా శ్రు పతనం నరః | అస్థి సంచయ నా దర్వాక్‌ స చైలం స్నాన మాచరేత్‌ ||

స్నాత శ్చ శుద్ధి మాప్నోతి తతః పర మితి శ్రుతిః | అస్థ్నాం గంగాంభసి క్షేపాత్‌ ప్రేతస్యాభ్యుదయో భ##వేత్‌ ||

అస్థ్నాం హి ప్లావనార్థాయ సాగరాణాం మహాత్మ నామ్‌ | గగనా ద్భువ మానీతా గంగా గగన మేఖ లా ||

భగీరధేన ధర్మజ్ఞ ! తపసా మహతాపురా | సగరస్య సుతా స్స ర్వే నరక స్థా భృగూత్తమ! ||

గంగా తోయా ప్లుతా రామ ! దివ మక్షయ్య మాగతాః | గంగా తోయేన యస్యా స్థి యీవ త్సంఖ్యం ని మజ్జతి ||

తావ ద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే | ఆత్మన స్త్యాగినాం నాస్తి పతితానాం తథా క్రియా ||

తేషా మపి తథా గంగా తోయే స్యా త్పతనం హితమ్‌ | పతితానాం తు యద్దత్తం శ్రాద్ధం చాధ జలాంజలిః ||

న తత్‌ ప్రేత స్సమాప్నోతి గగనే ప్రవిలీయతే | ఆనుగ్రహేణ సహితా ప్రేతస్య పతితస్య తు ||

నారాయాణ బలిః కార్య స్తేనా నుగ్ర హ మశ్నుతే | అనాది నిధనో దేవః శంఖ చక్ర గదా ధరః ||

అక్షయః పుండరీ కాక్ష స్తత్ర దత్తం న నశ్యతి | యథా కథం చి ద్యద్దత్తం దేవ దేవే జనార్దనే ||

అవినాశి తు తద్విద్ధి పాత్ర మేకో జనార్దనః | పరస్మా త్త్రాయతే యస్మా త్పాత్రం తస్మాత్‌ ప్రకీర్తితమ్‌ ||

పతతాం త్రాణ దస్త్వేకో దేవో మధు నిషూదనః ||

అమిత బల పరాక్ర మో మహౌజాః దురిత భయాపహరో |

హరి ర్మహాత్మా అఘ శత మలినై శ్చ సే వ్యమానో భవతి నృణాం త్రిదివాయ వా సుదేవః ||

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ప్రేత నిర్హరణం నామ షట్‌ సప్తతి తమో7ధ్యాయః ||

పుష్కరుడనియె. చనిపోయిన ద్విజుని శూద్రునితో గూడ దహనము చేయరాదు. శూద్రుని ద్విజునితో దహనము చేయరాదు. అది యిద్దరికిని మహాదోషము. అనాధుడైన (దిక్కులేని) బ్రాహ్మణుని మోసినవారడు గడుగునను యజ్ఞముచేసిన ఫలమందుదురు. ప్రేతసంస్కారమునకు కాష్ఠమిచ్చినవాడు కాష్టమునకు నిప్పంటించిన వాడు మహాప్రసిద్ధిని యుద్ధజయము నందుదురు. బ్రాహ్మణ సంస్కారమున చితి నంటించిన తరువాత బంధువులా చితికి నపసవ్యముగ జుట్టు తిరిగి స్నానముచేయవలెను. ప్రేతకు మూడు దోసిళ్ళు ఉదకము వదలవలెను, ఇంటి గుమ్మము నందుండు, రాతిపై నడుగు పెట్టి యింట ప్రవేశింప వలెను నియమముతో నగ్నియం దక్షింతలు చల్లవలెను. వేపాకును కొఱికి నేలపై పరుండ వలెను- కొనుక్కొన్నయన్నము తినవలెను. మాంసము ముట్టవాదు స్త్రీ సంగమము కూడదు- ఆశౌచము నంతదాక వారసులు నిత్యవిధిలో ప్రేతమునకు నొకపిండము వేయవలెను. మైల విడిచిన తరువాత శ్మశ్రుకర్మము చేయించుకొని తెల్ల ఆవాల పిండితో స్నానము చేయవలెను- బట్టలను మార్చుకొని బ్రాహ్మణులను బూజింప వలెను. పండ్లురాని కొడుకునకు, గర్భస్రావమైన శిశువునకు, అగ్ని సంస్కారము చేయరాదు-ఉదక తర్పణాదులు చేయ నక్కరలేదు- నాల్గవరోజు అగ్ని సంచయనము చేయనగును- అది యైన తరువాత ''కులస్పర్స'' చేయనగును. చనిపోయిన వానికి బంధువులతో గూడ అశ్రుపతన మొనరించి (కంటి నీళ్ళు గార్చి) అగ్ని సంచయనము ముందు సచేల స్నానము చేయవలెను. అవ్వల స్నానముచేసినవాడు శుద్ధుడగునని శ్రుతి తెలిపినది - అస్థులు గంగా జలమందు క్షేవించిన (పడవేసిసిన) ప్రేత కభ్యుదయము గల్గును. మహాను భావులు సగరుల యస్థి నిమజ్జనము కొఱకే గగనమేఖల (ఆకాశము ఒడ్డాణముగా గల) గంగ ఆకాశమునుండి యవనికి భగీరధునిచే గొని రాబడినది. అందులకత డెంతేని తీవ్ర తపస్సు చేసినాడు. ఓ భార్గవ! నరక మందవి సాగరులు (సగర కుమారులందరు) గంగాతోయములందు మునికి అక్షయ్యస్వర్గము నందిరి. గంగాజలములం దెన్ని యెముక లెవ్వానివి మునుగనో యన్ని యేం డ్లాజీవుడు స్వర్గలోకమందు బూజలందును. ఆత్మ త్యాగులకు పతితులకు (కులభ్రష్టులకు) ప్రేత క్రియలేదు. వారు గూడ గంగానీరమందు పడుట మంచిది. పతితులకీయబడిన శ్రాద్ధము జలాంజలి (తర్పణము) ఆప్రేతమునకు జెందదు. ఆకాశమందు లీనమై పోవును. ప్రేతయగు పతితునకు అనుగ్రహసహితమైన నారాయణబలి సేయనగును దానిచే నాజీవుడును గ్రహమనుభవించును. అనాదినిధనుడు శంఖచక్రగదాధరుడు అ క్ష యు డు, పుండరీకాక్షుడునగు నారాయణు నుద్దుశించి యీయబడినది నశింపదు. ఏ దోవిధముగా దేవదేవుని జనార్దను నుద్దేశించి యీయబడినది నశింపదు. జనార్దనరూపమగు పాత్ర యొక్కటియే యెన్నటికినీ నశింపదని యెరుంగుము. జనార్దనుడొక్కడే పరస్మాత్‌ పరమునుండి త్ర= త్రాయతే, రక్షించును గాన పాత్రమని నిర్వచింపబడినది. పతితులగు వారికి త్రాణ యిచ్చువాడు ఒక్క దేవుడు మధుసూదనుడు. అమిత బలపరాక్రముడు, మధుసూదనుడు గొప్ప తేజశ్శక్తులు గలవాడు, పాపచాయా పహారి, వందలువేలు పాపము చేసినవాడు సేవించినను నా శ్రీహరి మహాత్ముడు వాసుదేవుడు వారికి స్వర్గము గ్రహించగలడు

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు ప్రేతనిర్హరణమను డెబ్బదియారవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters