Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదినాల్గవ అధ్యాయము - రహస్య ప్రాయశ్చిత్తం

పుష్కరః- ఇత్యేత దేనసా ముక్తం ప్రాయశ్చిత్తం యధావిధి | అత ఊర్థం రహస్యానాం ప్రా యశ్చిత్తం నిభోధమే ||

పౌరుషేణ తు సూక్తేన జప్య హోమైః ద్విజోత్తమాః | మాసేనై కేన ముచ్యతే పాతకైఃసంయతేంద్రియాః||

సవ్వాహృతీక ప్రణవాః ప్రాణాయామాస్తు షోడశ అపి భ్రూణ హనం మాసాత్‌ పున న్త్యహరహః కృతాః ||

కౌత్సం జప్త్వాప ఇత్యేత ద్వసిష్ఠం ప్రతి చ త్య్రుచమ్‌ | మహేశం శుద్ధ వత్య శ్చ సురాపో7పి విశుధ్యతి ||

సకృ జ్జ ప్త్వా7స్య వామీయం శివ సంకల్ప మేవ చ | అపహృత్య సువర్ణం తు క్షణా ద్భవతి నిర్మలః ||

హవి ష్ప్రతీయ మస్యేతి నత స్సంహా ఇతీతి చ | జస్త్వా చ పౌరుషం సూక్తం ముచ్యతే గురు తల్పగః ||

ఏనసాం స్థూల సూక్ష్మాణాం చికీర్ష న్నపనోదనమ్‌ | అవే త్య్రుచం జపే దబ్దం యత్కించి దపి తాని చేత్‌ ||

ప్రతి గృహ్యా7ప్రతి గ్రాహ్యంభుక్త్యా చాన్నం వి గర్హితమ్‌ |

జ పం స్తర త్సమందీయం ప్రయతో మానవ స్త్ర్య హమ్‌ ||

సోమా రౌద్రం తు వహ్నీ నాం జపన్‌ సత్యస్య శుధ్యతి | స్రవన్త్యా మాచరేత్‌ స్నానం పర్యస్య మితి వా త్య్రుచమ్‌ || 10

పుష్కరుడనియె. పాప ప్రాయశ్చిత్త మింతదాక యధావిధిగ జెప్పబడినది. ఈ పైని రహస్య పాపముల ప్రాయశ్చిత్త మెఱిగింతును వినుము. ద్విజోత్తములు పౌరుష సూక్తమును జపించి హోమములు సేసి యొక్క నెలలో నింద్రియని గ్రహమంది పాపముక్తు లగుదురు. పదునారు సారులు వ్యాహృతులు ప్రణవము నావృత్తమగునట్లు చేయు ప్రాణాయామము నెల రోజులు చేసిన భ్రూణహత్యా పాపము పోవును. (గర్భస్థ శిశువుంజంపుట భ్రూణహత్య) ఏ రోజు చేసిన పాపమారోజే హరించును. ''కౌత్సంయను ఋక్కులు మూడును శుద్ద వత్యః'' మహేశమును జపించిన వాడు సురాపానము సేసినను శుద్ధు డగును. అస్య వామీయమను మంత్రము శివ సంకల్పమును జపించిన సువర్ణము దొంగిలించిన వాడు పరి శుద్దుడగును. ''హవిష్ప్రతీయమస్య'' ''నతస్సంహ''అను మంత్రములను పురుష సూక్తమును జపించిన గురుదాగమన మహా పాపము పోవును. ''అవ '' అణుత్య్రుచము నొక యేడు జపించిన స్థూల సూక్ష్మ పాపములను బాయును. పట్టరాని దానములు పట్టి తినరాని యన్నములు తినిన వాడు ''తరత్సమందీయమ్‌'' అను మంత్రమును శుచియై మూడు రోజులు ''సో మారౌంద్రంతువహ్నేనామ్‌'' సత్యస్యయను మంత్రములను జపించి పరిశుద్దు డగును. వాగులోస్నానముచేసి ''పర్యస్యమ్‌'' ''అనుత్య్రుచను'' ''అద్వార సానమ్‌'' అను నేడు మంత్రములను జపించుచు భిన్నము దిరుచు నొక్క మాసమున్న రహస్య పాపములు చేసిన వాడు శుద్దు డగును.

అద్వా రసాన మిత్యే త దేవ స్వీ సప్తకం జపేత్‌ | అప్ర కౌశం తు కృత్వేవో మాస మాసీత బైక్ష్య భుక్‌ ||

మంత్రై శ్శా కల హొమీయై రబ్దం హుత్వా ఘృతం ద్విజః | సు గుర్వ ప్యపహన్త్యే నో జప్త్వా వామన ఇష్యతే ||

ద్రుపదా నామ సా దేవీ యజుర్వేదే ప్రతిష్ఠితా | అంతర్జలే త్రిరాకృత్య ముచ్యతే సర్వ కిల్బిషైః ||

అరణ్య వా త్రి రభ్యస్య ప్రయతో వేద సంహితామ్‌ | ముచ్యతే పాతకై స్సర్వైః పరాకైః శోధిత స్త్ర భిః ||

మహా పాతక సంయుక్తో న గచ్ఛేత్‌ గాః సమాహి తః | స్వభ్యస్య పావమానీ యం భైక్ష్యా హోధో వుశుధ్యతి ||

త్య్ర హం తూపవసే ద్యుక్త స్త్ర రహో7భ్యుపయ న్నపః | ముచ్యతే పాతకై స్సర్వైర్జప్త్వా త్రిరఘ మర్షణమ్‌ ||

యథా7శ్వమేధ స్సుతరాం సర్వ పాపాప నోదనః | తథా7ఘ మర్ష ణం సూక్తం సర్వ పాపాప నో దనమ్‌ ||

హత్వా లోకా నపీమాం స్త్రీ నశ్న న్నపి యత స్తతః | ఋగ్వేదం ధా రయన్‌ విప్రో నైనః ప్రా ప్నోతి కించన ||

ఋక్సం హితాం స మభ్యస్య యజుషాం వా సమాహితః | సామ్నాం వా సరహ స్యానాం సర్వ పాపైః ప్రముచ్యతే ||

యధా మహా హ్రదం ప్రాప్య క్షి ప్రంలో ష్ఠో వినశ్యతి | తథా దుశ్చరితం సర్వం వేదే త్రివృతి మజ్జతి||

ఋచో యజూం షి చాద్యాని సామాని విధాని చ | ఏష జ్ఞేయు స్త్రి వృ ద్వేదో యోవై వేద స వేద విత్‌ ||

ఆధ్యం వై త్ర్యక్షరం బ్రహ్మ త్రయీ యస్మిన్‌ ప్రతిష్టితా ||

స గుహ్యో7న్య స్త్రి వృ ద్వేదో యో వేదేనం స వేదవిత్‌ ||

వేదాభ్యా సో7న్వ హం శక్త్వా మహాయజ్ఞ క్రియా సమః | నాశయంత్యా శు పాపాని మహా పాతక జా న్యపి ||

యధై ధాంసి సమిద్ధో7 గ్నిః భస్మాసాత్కురుతే క్షణాత్‌ | తథా జ్ఞానాగ్ని నా పాపం క్షిప్రం దహతి వేదవిత్‌ ||

యే వాసుదేవం జగతా మధిశం భక్త్వా గతాః సర్వజగత్‌ ప్రధానమ్‌ |

తే పాతకా న్యాళు విధూయ లోకే భవన్తి చంద్రార్కస మ ప్రభావాః ||

ఇతి విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే రహస్య ప్రాయశ్యిత్తో నామ చతు స్సవ్తతి తమో7ధ్యాయః 24

శాకల హోమ మంత్రములతో నొకసంవత్సర మాజ్య హోమములను సేసి వామన ఇష్యతే అను మంత్రము జపించిన యెంత మహా పాపములయిన హరించు కొనును. ద్రుపదా నామ సాదేవీయజుర్వేదే ప్రతిష్ఠితా అను మంత్రమును నీళ్లలో నిలబడి మూడా వృత్తులు జపించిన సర్వ పాపములు వాయును. మహా పాతకి భైక్షాశనియై నియమముతో పావమానీయ మంత్రాభ్యాసము (ఆవృత్తి) చక్కగా జేసినచో శుద్దు డగును. వాడు గోవుల మందలోనికి పోరాదు. అరణ్యమందు వేద సంహితము మూడు మార్లు పారాయణ చేసి మూడు పరాక కృచ్ఛ్రములచే శోధితుడై పాపముక్తుడగును. మూడు రోజులు సమాహితుడై యూవసింప వలెను. మూడు రోజులు నీళ్ళ మాత్రము త్రాగి అఘమర్షణ ఋక్కును మూడు సార్లు జపించిన సర్వ పాతకముక్తుడగును. అశ్వమేధ యాగము సర్వ పాప నాశకకుయినట్లు అఘ మర్షణ సూత్తము సర్వపాపాపనోదకము. మూడు లోకములం జంపియు నెక్కడనో యేదేని తినియు ఋగ్వేదము ధారణ చేసిన వాడు (ఋగ్వేదావధాని) సర్వ పాపముల నుండి విడి వడును. ఋగ్వేదమును యజుర్వేదమును సరహస్యముగా సామవేదమును పారాయణ చేసిన పుణ్యుడు సర్వదురిత దూరుడగును. పెద్ద పెద్ద మడుపునం బడిన మట్టియుండ వెంటనే కఱగి పోవునట్లు త్రివృద్వేద పారాయణ మందు దుశ్యరితి మపహరించి పోవును. తొలి ఋక్కులు యజస్సులు వివిధ సామలు నను నపి త్రివృద్వేదమని యెఱుంగ నగును. ఇది తెలిసిన యాతడు వేద వేత్త, మొదటిదియు త్రక్షర మైనదియు (ప్రణవము) బ్రహ్మము పరబ్రహ్మ వస్తువు దానియందే ఋగ్యజుః సామ రూపమైన త్రయి ప్రతిష్ఠమైనది. అది వేద గుహ్యము, (రహస్యము) మఱి యితర మైన దెల్ల త్రివృద్వేదము దీనిం తెలిసిన యాతడు వేద వేత్త. ప్రతిదినము యధా శక్తి వేద పారా యణము సేయుట యజ్ఞము సేయుటతో సమానము. మహా పాపములను గూడ యది నశింప జేయును. పమిద్దుడైన (ప్రజ్వలితుడైన) అగ్ని కట్టెలను క్షణములో భస్మము సేయునట్లు వేదవేత్త జ్ఞానాగ్నిచే పాపములను వెను వెంటనే దహించుకొనును. జగదధీశుడయిన వాసుదేవుని సర్వ జగత్ర్పధానుని భక్తితో బొందుదురు. వారు సత్వరము పాపములం దూలించి చంద్రార్కసమ ప్రభావులయ్యెదరు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమందు రహస్య ప్రాయశ్చిత్తమను డెబ్బదినాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters