Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదిరెండవ అధ్యాయము - దండప్రణయనవిధి (శిక్షాస్మృతి)

పుష్కరః- దండ ప్రణయనం రామ! స్వదేశే శృణు భూభుజామ్‌ | యస్య సమ్యక్‌ ప్రణయనాత్‌ స్వర్గ భాక్‌ పార్థివో భ##వేత్‌ ||

త్రియవం కృష్ణలం విద్ధి మాష స్తత్పంచకం భ##వేత్‌ | కృష్ణలానాం తథా షష్ట్యా కర్షార్ధం రామ! కీర్తితమ్‌ ||

సువర్ణశ్చ వినిర్దిష్టో రామ! షోడశమాషకః | నిష్కం సువర్ణాః చత్వారో ధరణం దశభిస్తులైః ||

తామ్ర రూపసువర్ణానాం మానమేత త్ప్రకీర్తితమ్‌ | తామ్ర కర్షాపకో రామ! ప్రోక్తః కార్షాపణో బుధైః ||

పణానాం ద్వేశ##తే సార్థే ప్రథమః సాహసః స్మృతః | మధ్యమః పంచ విజ్ఞేయః సహస్రమపి చోత్తమః ||

బాల దాయాదకం రిక్థం తావ ర్రాజా7ను పాలయేత్‌ | యావత్సస్యాత్‌ సమావృత్తో యావద్వా7 తీతశైశవః ||

వేశ్యాపుత్రాసు చైవం స్యాద్రక్షణం నిష్కులాసు చ | పతివ్రతాసు చ స్త్రీషు విధవా స్వాతురాసు చ ||

జీవ న్తీనాం తు తాసాం యే తద్దరేయుః స్వబాంధవాః | తాన్‌ శిష్యా చ్చౌరదండేన ధార్మికః పృధివీపతిః ||

ప్రణష్ట స్వామికం రిక్థం రాజా త్ర్యబ్దం నిధాపయేత్‌ | అర్వాక్‌ త్ర్యబ్దాత్‌ హరేత్‌ స్వామీ పరేణ నృపతి ర్హరేత్‌ ||

మమేదమతి యో బ్రూయాత్‌ సో7నుయుక్తో యథావిధి | సంపాద్య రూప సంఖ్యాదీన్‌ స్వామీతద్ద్రవ్య మర్హతి || 10

పుష్కరుడనియె:- పరుశురామ! స్వదేశము నందు దండప్రణయన విధానము దెల్పెద. దానిని లెస్సగ నాచరణలో బెట్టిన పార్థవుడు స్వర్గమునందును. మూడు యవలు కృష్ణలము., అయిదు కృష్ణలములు = మాషము. 60 కృష్ణలములు = అర్థ కర్షము. 16 మాషములు = సువర్ణము. 4. సువర్ణములు = నిష్కము. పది నిష్కములు = ధరణము. (రాగినాణముగ రూపొందిన సువర్ణముల మానమిది) రాగి కర్షాపకము కార్షాపణ మన బడును. 250 పణములు = ప్రథమ సాహసము. 500 పణములు = మధ్యమ సాహసము.

1000 పణములు ఉత్తమ సాహసము. బాలుర దాయాదక (పిత్రార్జిత) మైన ధనమును రాజు రక్షణ సేయవలెను. (ఆరక్షణ యాపిల్లవాడు శైశవదశదాటి తన యాస్తి విషయము చూచుకొనగల వాడగు నంతదాక) వేశ్యాపుత్రులు, వంశము లేనివారు, పతివ్రతలు, విధవలు, రోగాద్యాతురలైన స్త్రీలు నను వారి యాస్తి రక్షణభారము రాజుదే. వారు జీవించియుండగా వారి సొత్తు బాంధవులు హరింతురేని, భూపతి వారికి దొంగలకు విధించు దండనవిధింప వలెను. యజమాని సొత్తును రాజు మూడేండ్లు నిలువచేసి యామీద దాను దానిం గైకొనవలెను. ఈ ద్రవ్యమునకు నేను వారసుడనని యెవడేని వచ్చినచో వానిని యథావిధిగ ప్రశ్నించి యా ద్రవ్యము యొక్క రూపము, సంఖ్య మొదలైన వడిగిన మీదట దానిని దాని యజమాని పొంద నర్హుడగును.

ఆవేదయానో నష్టస్య దేశం కాలంచ తత్త్వతః | వర్ణరూవం ప్రమాణంచ తత్సమం దండ మర్హతి ||

ప్రణష్టాధి గతం రిక్థం తిష్ఠే దర్థైరధి ష్ఠితమ్‌ | యాంస్తత్ర చౌరాన్‌ గృహ్ణీయాద్‌ ఘాతయేత్‌ కుంజరేణ తాన్‌||

మమేదమితి యో బ్రూయా దసత్యేన తథా నిధిమ్‌ | తస్య దండం హరే ద్రాజా స్వవిత్త స్యాష్టమాంశకమ్‌ ||

చోరై రముషితో యస్తుముషితోస్మీతి భాషతే | తత్ప్రదాతరి భూపాలే సదండ్య స్తావదేవ తు ||

యోయావ న్నిహ్ను వీతార్ఠం మిధ్యాం యోవా వదే త్తతః | తౌనృపేణ హ్యధర్మజ్ఞౌ దాప్యౌ తద్ద్వి గుణం ధనమ్‌ ||

కూట సాక్ష్యం తు కుర్వాణాన్‌ త్రీన్‌వర్ణాన్‌ ధార్మికో నృపః | ప్రమాపయే న్మహాభాగః బ్రాహ్మణం తు వివాసయేత్‌ ||

యత్‌ స్వామినానను జ్ఞాత మాధిం భుంకైవిచక్షణః అవధ్య మూలం కర్తవ్యం తస్య దండం మహీక్షితా ||

వసా ... ... ... ... ధర్మో న హీనయతే |

యో నిక్షేపం యాచయతి యశ్చ నిక్షిప్య యాచతే | తా వుభౌ చోరవ చ్ఛాశ్చౌ దాప్యౌ వాద్విగుణం ధనమ్‌ ||

ఉపదాభి శ్చ యః కశ్చిత్‌ పరద్రవ్యం హరేన్నరః | స సహాయః సహన్తవ్యః ప్రకాశం వివిధై ర్వధైః ||

యో యాచితక మాదాయ న తద్దద్యా ద్యథాక్రమమ్‌ | స నిగృహ్య బలా ద్దాప్యో దండో వై పూర్వసాహసమ్‌ || 20

నష్టద్రవ్యము యొక్క దేశకాలములు రంగు రూపము కొలతయు నతడు సరిగ దెలుప లేనపుడాద్రవ్యము విలువయెంతో యంత జరిమానా విధింపదగును. దిక్కు మొక్కు లేని ద్రవ్య మెవరికడ నుండునో యా దొంగలం బట్టుకొని యేనుగుచే ద్రొక్కింపవలెను. తనది గాని ద్రవ్యము తనదని యసత్య మాడిన వాని సొత్తులో నెనిమిదవ వంతు దండనగా రాజు గైకొనవలెను. దొంగలు హరింపకుండ హరింప బడినదని యబద్ధమాడిన వానిసొత్తు వానికిచ్చి యందులో నెనమిదవ వంతు దండనగా రాజు గైకొనవలె. ఇతరుని ద్రవ్యము దాచినవాడు, దానిం గూర్చి యబద్ధమాడినవాడు యా ద్రవ్యమునకు రెట్టింపు జరిమానా విధింప నర్హులు. మూడు వర్ణముల వారిలో నెవడేని కూట సాక్ష్యమిచ్చెనేని యందు క్షత్రియ వైశ్య శూద్రులను చంపవలెను. బ్రాహ్మణుని ప్రవాస మంపవలెను. యజమాని యనుమతి లేకుండ తాకట్టు పెట్టిన సొత్తు ననుభవించిన వానికి మరణతరమయిన దండనము విధింపవలెను. ... ... అట్లైన ధర్మలోపము లేదు. ఎవడొక పాతు గనిపెట్టి దానిని దనకిమ్మని యాచించునో, తన ద్రవ్యమే పాతిబెట్టి తనకిమ్మని యాచించునో నీయిద్దరి సోమ్మునకు రెండింతల జరిమానా విధింపవలయును, ఎవ్వడు ఉపదా (బహుమాన) రూపమున (లంచముగా) పరద్రవ్యము హరించునో, వానిని, సహాయపడిన వానిని, నల్గురిలో నిలువబెట్టి చిత్రవధ సేయవలెను. వాని కరదండాలు వేసి మొదటి సాహస పరిమాణమైన యపరాధము విధింపవలెను. పూర్వ సాహసము 250, 500, 1000 కార్షాపణములతో వాని తాహతునకను వైన జరిమానా విధింపవలెను.

అజ్ఞానా ద్యః పుమాన్‌ దర్యాత్‌ పరద్రవ్యస్య విక్రయమ్‌ | నిర్దోషో జ్ఞాన పర్యంతం చౌరవ ద్వధ మర్హతి || 21

మూల్య మాదాయ యో విద్యాం శిల్పం వాన ప్రయచ్ఛతి | దండ్య స్సమూలం సంకలం ధర్మజ్ఞేన మహీక్షతా ||

ద్విజ భోజ్యే తు సంప్రాప్తే ప్రాతివేశ్య మభోజనమ్‌ | హిరణ్య మాషకం దండ్యః పాపే నాస్తి హ్యతిక్రమః ||

ఆమంత్రితో ద్విజో యస్తు వర్తమానః ప్రతిగ్రహే | నిష్కారణం న గచ్ఛేద్యః సదాప్యో ష్టశతం దమమ్‌ ||

ప్రతి శ్రుత్యా ప్రదాతారం సువర్ణం దండయే న్నృపః ||

భృతోనార్తో న కుర్యాద్యో దర్పా త్కర్మ యధోదితమ్‌ | స దండ్యః కృష్ణలా న్యష్టౌ న దేయం చాస్యవేతనమ్‌ ||

అకాలే యస్త్యజేత్‌ భృత్యం దండ్యః స్యాత్తావదేవ తు | యో గ్రామ దేశ సంఘానాం కృత్వా సత్యేన సంవిదమ్‌ ||

విసంవదే న్నరో లోభాత్తం రాష్ట్రా ద్విప్రవాసయేత్‌ ||

క్రీత్వా విక్రీయ వా కించి ద్యస్యేహానుశయో భ##వేత్‌ | సో న్తర్దశాహా త్తత్సామ్యా ద్ద ద్యాచ్చైవా ೭೭దదీత చ ||

పరేణ తు దశాహస్య న దద్యాన్నైవ దాపయేత్‌ | ఆదదద్‌ విదద చ్చైవ రాజ్ఞా దండ్యః శతాని షట్‌ |

యస్తు దోషవతీం కన్యా త్వనాఖ్యాయ ప్రయచ్ఛతి | తస్య కుర్యా న్నృపో దండం స్వయం షణ్ణవతిః పణాన్‌ || 30

పరద్రవ్యము తెలియక యమ్మినవాడు తెలియునంత వరకు నిర్దోషియే. తెలిసిన మీద దొంగ కుచితమైనశిక్ష కర్హుడగును. మూల్యము గొనియు నెవ్వడు విద్యను, శిల్పమును నేర్పడో వాని సమూలము ద్రవ్యము రాజు గైకొనవలెను. బ్రాహ్మణుని యింట విందు భోజనాలు జరుగుచుండి ఇరుగు పొరుగు వారు భోజనము చేయక ఉపవాసమున్నయడల, పొరుగింట భుజింపతగిన నిమిత్తమున్నప్పుడు భోజనము మానిన యడల మినపగింజయెత్తు బంగారము శిక్ష. పాపము నుల్లంఘింప వీలులేదు. ప్రతి గ్రహమందున్న (దానము పట్టు) ద్విజు డెవ్వరేని పిలిచినచో నిష్కారణముగ వెళ్ళకుండెనేని వాని కెనిమిది వందల పణములు దండనము విధింపవలెను, ఇత్తునని యివ్వనివాని కొక సువర్ణము దండనము, ఏ బాధయు లేకుండియు నౌకరు పొగరుగొని యజమాని చెప్పినపని జేయడేని వాని కెనిమిది కృష్ణలములు జరిమానాగా విధింపవలెను. వానికి వేతనము నీయగూడదు. ఏ యజమాని యా సమయములో భృత్యుని వదలివేసినచో వానికి నదే దండనము. గ్రామ సంఘములలో దేశ సంఘములలో నిజము చెప్పి లోభుముచే నా తరువాత మాట తిరిగెనేని వానిని రాష్ట్రము నుండి వెడలగొట్టవలెను. అమ్మి లేక కొని పశ్చాత్తాపము కలిగినయడల తత్సామ్యము ననుసరించి ఇచ్చుటగాని తీసుకొనుట గాని చేయవలెను. పదిరోజుల తరువాత యా వస్తువును యీయరాదు. మరియు దీసికొనరాదు. అట్లుచేసెనేని రాజు వాని కారు వందల నిష్కాపణములు జరిమానా విధింపవలెను. దోషమున్న కన్యను జెప్పకుండ నిచ్చెనేని తొంబదియారు పణములు దండనము.

అకన్యేతి తు యః కన్యాం బ్రూయా ద్వేషేణ మానవః | స శతం ప్రాప్నుయా ద్దండం కన్యా దోష మదర్శయన్‌ || 31

యస్త్వన్యాం దర్శయిత్వా న్యాం వోఢుః కన్యాం ప్రయచ్ఛతి | ఉత్తమం తస్య కుర్వీత రాజా దండం తు సాహసమ్‌ ||

వరో దోషా నభిఖ్యాప్య యః కన్యాం వరయే దిహ | దత్తా ప్యదత్తా సా తస్య రాజ్ఞా దండ్య శ్శత ద్వయమ్‌ ||

ప్రదాయ కన్యాం యోన్యసై#్మ పునస్తాం సం ప్రయచ్ఛతి | దండః కార్యో నరేంద్రేణ తస్యా ప్యుత్తమసాహసామ్‌ ||

సత్యంకారేణ వాచా చ యుక్తం పర్యాసమం శయమ్‌ | లుబ్ధో న్యత్ర తు విక్రేతా షట్‌ శతం దండ మర్హతి ||

వహేచ్ఛుల్కంతు విక్రేతా సత్యం కారం తు సంత్యజేత్‌ | ద్విగుణం దండయే దేనమితి ధర్మో వ్యవస్థితః ||

శుల్కైక దేశం దత్వాతు యదిక్రేతా ధనం త్యజేత్‌ | దండ్యస్స మధ్యమం దండం తస్యదండస్య మోక్షణాత్‌ ||

ద్రుహ్యాత్‌ భృత్యస్తు యః పాలం గృహీత్వా భక్తవేతనమ్‌ | స తు దండ్యః శతం రాజ్ఞా సువర్ణం స్వామ్యరక్షిణా ||

దండం తద్వా న విరమేత్‌ స్వామిభిః కృలక్షణః | బద్ధః కృత్వా೭೭యసైః పాశైస్తస్య కర్మకరో భ##వేత్‌ ||

ధనుశ్చతుః పరీమాణం గ్రామస్య తు సమంతతః | ద్విగుణం త్రిగుణం వాపి నగరస్య తు కల్పయేత్‌ || 40

కన్యను కన్య గాదని ద్వేషము గొని యబద్ధమాడి కన్యాదోషము బుజువు చేయని వానికి నూరు పణములు శిక్ష నీయవలెను. ఒక కన్యను చూపించి మరియొక దానిని వరునకిచ్చిన వానికి ప్రభువు ఉత్తమ సాహసము (వెయ్యిపణములు) శిక్ష వేయవలెను. తన యెడగల దోషములు చెప్పకుండ కన్యను వరించిన వరుని కా కన్య నీయబడినను ఈ యనట్లే, ఆమెకు వివాహము జరుగనట్లే (ఆమె నింకొకని కీయవచ్చు నన్నమాట.) ఆయబద్ధమాడిన వరునికి రాజు రెండువందల పణములు శిక్ష విధింపవలెను. ఒకనికిచ్చి యా కన్య నింకొకని కిచ్చిన వాని కుత్తమ సాహస శిక్షను రాజు విధింపవలెను (ఉత్తమ సాహసమనగా వెయ్యి పణములు). గట్టిమాటగా (బయానాతో) మాటయిచ్చి లోభముచో వస్తువు నింకొకనికి యమ్మిన వాని కారువందల పణములు దండనము, అమ్మినవాడు వస్తువు విలువతీసుకుని ఖరారును (బయానాను) విధించెనేని వానికి మునుపు చెప్పిన దానికి రెట్టంపు దండనము విధింపవలెను. ధరలో కొంత మాత్ర మిచ్చి యాకొన్నవాడు బేరమువదలి మిగిలిన ధనము నెగగొట్టిన వానికి మధ్యమ దండనము (500 పణములు) విధింపవలెను నౌకరు యజమాని కూడు దిని వేతనము గొని వానికి ద్రోహము సేయునేని వానికి నూరు సువర్ణములు శిక్ష విధింపవలెను. ఆది స్వామ్య దక్షిణగా యజమానికి చెల్లింపవలసిన దగును. అది చెల్లించియు నా యజమాని సేవనుండి తప్పికొనరాదు. ఆ యజమానిచే గుర్తింపబడి (వాతలు పెట్టబడి) ఇనుపసంకెళ్ళు వేయబడియు పని చేయవలెను. గ్రామము పొలిమేర నాల్గు ధనస్సులు మేర పట్టణము పొలిమేరలం దెనిమిది ధనుస్సలు పండెండ్రు ధనుస్సులు మేర బంజరు భూమి వదలవలెను.

వృత్తిం తత్ర ప్రకుర్వీత యాముష్ట్రో నావలోకయేత్‌ | ఛిద్రం నివారయేత్‌ సర్వం శ్వసూకరముఖానుగమ్‌ || 41

తత్రాపరధృతం ధాన్యం మహిష్యః పశవో యది | నతత్ర కారయే ద్దండం నృపతిః పశురక్షణమ్‌ ||

అనిర్దశాహాం గాం సూతాం వృషా న్దేవ పశూంస్తథా | సపాలాన్వా విపాలాన్వా స దండ్మాన్యను రబ్రవీత్‌ ||

అతోన్యథా వినష్టస్య దశాంశం దండమర్హతి ||

పాలస్త్వ పాలక స్స్యామీ వినాశే క్ష త్రియస్సతు | భక్షయి త్వోపవిష్టాసు ద్విగుణం దండ మర్హతి ||

వైరాద్దశగుణం దండం వినాశాత్‌ క్షత్రియస్యతు | గృహం తడాగ మారామం క్షేత్రం బుద్ధ్వా హ్యపా హరన్‌ ||

శతాని పంచ దండ్యః స్యా దజ్ఞానా ద్ద్విశతో దమః ||

సీమాబంధన కాలేతు సీమాబంధన కారిణామ్‌ | తేషాం సంజ్ఞాం దధానస్తు జిహ్వాచ్ఛేదన మాప్నుయాత్‌ ||

అర్ధేనాపిచయో విద్యాత్‌ సంవిదం వాపి గచ్చతి | ఉత్తమం సాహసం దండ్యః ఇతి స్వాయం భువోబ్రవీత్‌ ||

స్థాపితాం చాపి మర్యాదాం యేభింద్యుః పాపకారిణః |

సర్వే పృథక్‌ పృథక్‌ దండ్యాః రాజ్ఞా ప్రథమసాహసమ్‌ | శతంబ్రాహ్మణ మాక్రుశ్య క్షత్రియో దండ మర్హతి || 50

అచ్చట ఒంటెగూడ సూడనంత ఎత్తైన ఆవరణలో అక్కడ ఇతరులకు సంబంధించని ధాన్యమును గేదెలు పశువులు తిన్న యడల వానిని శిక్షింపరాదు. ఆవిధముగా రాజు పశు సంరక్షణము సేయవలెను. ఉత్సర్జనము చేసిన ఆబోతును, వానికి కాపరులున్నను లేకున్నను, వానిని దండింపరాదు. ఇది మనువువచనము. ఈని పదిరోజులయినగాని గోవును కాపరులున్నను లేకున్నను దండింపరాదు. ఇట్లుగాక మరియొక తీరున నా ధాన్యము నష్టమయినచో దానిలో పదియవవంతు జరిమానా విధించవలెను. క్షత్రియుడు గోవులను గాచువాడు గాయకుండా యున్నపుడు నా గోవులు పొలములో బడి మేసెనేని, యాపశువుల యజమానికి అవి తిన్న మేతకు రెట్టింపు ఖరీదు దండన విధింపవలెను. ఇట్లు చెఱువు, దొడ్డి, తోట, పొలము శతృత్వముతో బుద్దిపూర్వకముగా నపహరించిన, వాని ఆ సొత్తుకు పదిరెట్లు సొమ్ము దండన విధింపవలెను. తెలియకచేసినచో నైదువందల నిష్కముల దండన విధింప వలెను. పొలిమేరలలో దారులు మూసివేసిన వానికి వారిని అక్రమముగా చెప్పిన వానికి నాలుక రాజు కోసివేయవలెను. ఏర్పరచిన హద్దులను జెరపిన పాపాత్ముని డబ్బు తీసుకొని వంతపాడిన వానిని ప్రధమ సాహసదండము (జరిమానా) విధింపవలెను. ప్రధమ సాహసమనగా 250 పణములు) బ్రాహ్మణునేడ్పించిన క్షత్రియుడు నూరుపణముల జరిమానాకర్హుడు.

వైశ్యశ్చ ద్విశతం రామ! శూద్రశ్చ వధ మర్హతి | పంచాశ ద్బ్రాహ్మణో దండ్యః క్షత్రియస్యాపి శాసనే || 51

వైశ్యే చాప్యర్ధ పంచాశత్‌ శూద్రో ద్వాదశకో దమః | క్షత్రియస్యాప్నుయా ద్వైశ్యః సాహసం పూర్వమేవ తు ||

శూద్రః క్షత్రియ మాత్రస్య జిహ్వాచ్ఛేదన మాప్నుయాత్‌ | పంచాశత్‌ క్షత్రియో దండ్యః తథా వైశ్యాభిశాసనే ||

శూద్రే చైవార్ధపంచాశత్తథా ధర్మో న హీయతే | వైశ్యస్సా క్రోశ##నే దండ్య శ్శూద్ర శ్చోత్తమ సాహసమ్‌ ||

శూద్రా క్రోశే తథా వైశ్యః శతార్ధం దండ మర్హతి | సవర్ణాక్రోశ##నే దండ స్తథా ద్వాదశికః స్మృతః ||

వాదేషు వచనీయేషు తదేవ ద్విగుణం భ##వేత్‌ | ఏకజాతి ర్ద్విజాతిం తు వాచా దారుణయా క్షిపన్‌ |

జిహ్వాయాః ప్రాప్నుయా చ్ఛేదం జఘన్య ప్రభవో హి సః ||

నామజాతి గ్రహం తేషా మభిద్రోహేణ కుర్వతః | నిఖన్యోయోమయః శంకు ర్జ్వల న్నాస్యే దశాంగుళః ||

ధర్మోపదేశం ధర్మేణ ద్విజానా మస్య కుర్వతః | తప్త మాసించయే త్తైలం వక్త్రే శ్రోత్రే చ పార్థివః ||

శ్రుతం దేశం చ జాతిం చ కర్మ శారిర మేవ చ | వితథం తు బ్రువన్‌ దండ్యో రాజ్ఞా ద్విగుణ సాహసమ్‌ ||

యస్తు పాతక సంయుక్తైః క్షిపే ద్వర్ణాంతరౌ విశః | ఉత్తమం సాహసం తస్మిన్‌ దండః పాత్యో యథాక్రమమ్‌ || 60

వైశ్యుడు రెండువందల జరిమానా కర్హుడు. శూద్రుడు వధార్హుడు. క్షత్రియుని మీద నధికారము (శాసనము) చేసిన బ్రాహ్మణు డేబది పణములు, క్షత్రియు డిరువదియైదు, వైశ్యుడిరువదియైదు, శూద్రుడు పండ్రెండు పణముల జరిమానా కర్హులు. శూద్రుడు క్షత్రియు నేడ్పించినేని, నాలుక గోయ నర్హుడు. క్షత్రియుడు వైశ్యు నేడ్పించిన, నేబది పణముల శిక్ష వేయనగును. క్షత్రియుడు శూద్రు నేడ్పించిన, నిరువదియైదు పణములు జరిమానా విధింపనగును. ఆవిధమయిన దండము వలన ధర్మము చెడదు. శూద్రుడు వైశ్యుని బాధించినచో ఉత్తమ సాహస (వెయ్యిపణముల)మునకు శిక్ష కర్హుడగును. శూద్రు నేడ్పించిన, శూద్రు డేబది పణముల దండమున కర్హుడగును. సవర్ణులనగా ఒకే వర్ణము వారొండొరులం బాధించికొన్నచో బండ్రెండు పణముల శిక్ష విధింప నగుదురు. పరస్పర వివాదబడిన ప్రజ తిట్టుకొన్నపుడు రెండింతల జరిమానా విధింపనగును. ఏకజాతిని గాని, ద్విజాతికి చెందిన వారిని గాని దారుణముగ దూషించిన శూద్రుని నాలుక కోసివేయ నగును శూద్రుడు పైజాతులను బేర్పెట్టి పిలిచినను, కులము పేరెత్తి పిలచినను, వారికి ద్రోహము చేసినను పండ్రెండంగుళముల కాలుచుండెడి యినుపశంకువ నోట గ్రుచ్చ నగును. ద్విజులకు ధర్మోపదేశము జేయు శూద్రుని నోటను, చెవులందును, రాజు మఱుగగాచిన నూనె పోయవలెను. పాండిత్యమును, దేశమును, జాతిని, శారీరకమైన కర్మమును, వృధాగా దప్ప పలుకు వానిని (నిందించువానికి) రెండు రెట్లు సాహసము (250నాణములు) జరిమానా విధింపవలెను. ఎవడు వైశ్యులను పాపాత్ములతోగూడ యితర వర్ణములోనికి వెలివేయునో వానికి వెయ్యి నణముల జరిమానా వేయవలెను.

రాజ్ఞో నివేశ్య నియమం ప్రథమం యా న్తి యే మిథః ||

సర్వే ద్విగుణదండ్యా స్తే విప్రలంభాత్‌ నృపస్య తు | ప్రీత్యా మయాస్వాభిహితం ప్రమాదేనాథవా వదేత్‌ ||

భూయో న చైవం వక్ష్యామి స తు దండార్ధభాగ్భవేత్‌ ||

కాణం వాప్యథవా ఖంజ మంధం వాపి తథావిధమ్‌ | తథ్యేనాపి బ్రువన్‌ దాప్యో దండః కార్షాపణాపరమ్‌ ||

మాతరం పితరం జ్యేష్ఠం భ్రాతరం శ్వశురం గురుమ్‌ | అక్షారయచ్ఛతం దండ్యః పంథానం చాదద ద్గురోః ||

గురు వర్జ్యం తు మార్గార్హే యో మార్గం న ప్రయచ్ఛతి | స రాజ్ఞా కృష్ణలం దండ్య స్తస్య పాపస్య శాంతయే ||

ఏకజాతి ర్ద్విజాతిం తు యోనాంగేనా పరాధ్నుయాత్‌ | తదేవ భేదయే త్తస్య క్షిప్రమే వావిచారయన్‌ ||

అవనిష్ఠీవితో దర్పా ద్ద్వా వోష్ఠౌ భేదయే న్నృపః | అవసేచయతో మేఢ్ర మపశబ్దయతో గుదమ్‌ ||

మహాసన మభిప్రేప్సు రుత్కృష్టస్యావకృష్టజః ||

* వి.ధ.పు - 93

కృతాంకః వినిర్వాస్యో హ్యంగం వాస్య వికర్తయేత్‌ | కేశేషు గృహ్ణతో హస్తౌ ఛేదయే దవిచారయన్‌ |

పాదయో ర్దండికాయాం తు గ్రీవాయం వృషణషు వా ||

త్వగ్భేదకః శతం దండ్యో లోహిత స్స చ దర్శకః || 70

రాజుయొక్క కట్టుబాట్ల యందు ప్రవేశించి యా మీద నా రాజునకు భిన్నముల నడచు రాజద్రోహులు ముందటి దండమునకు రెట్టింపు దండన కర్హులగుదురు. నేను నీ యెడల బ్రీతిచే బలికితిని. ఇంకెన్నడు నిట్లు చెప్పనను నపరాధిని దండనలో సగము శిక్షింపనగును. మెల్ల, క్రుంటి, గ్రుడ్డి యైన వానిని, నిజముగా మెల్లకంటి వాడని నిజమే పలికి పిలచిన నా పిలిచిన వాడు కార్పాపణములోపు జరిమానా విధింపనైనవాడు. తల్లిని, దండ్రిని, పెద్దన్నను, మామగారిని, గురువులను దెప్పిపొడిచిన వాడు, గురువుల కీయవలసిన దారిలో గువురుల దప్పించి యితరులకు యిచ్చినవాడు. దారి యీచ్చినవాడు దారి యీయనివాని నాపాపశాంతికి, కృష్ణల ప్రమాణమైన జరిమానా విధింపవలసినవాడు (కృష్ణలమనగా మూడు యవల తూకము బంగారము) ఏకజాతివాడు ద్విజాతికి చెందిన వారి నే యవయముతో నపరాధించునో (పరాభవించునో) వాని యాయవయమును రాజేమాత్ర మాలోచింపక యాలసింపక నరకి వేయవలెను. పొగరెక్కి ఉమిసినవాని, చీదినవానిని, రెండు పెదవులు కత్తిరింపవలెను మూత్రించి నను గుదాపశబ్దము చేసినినను (అపానవాయువు విడిచినను) అవ కృష్ణుడైయుండి యుత్కృష్టు లెక్క దగిన య గ్రాస నమెక్కి కూర్చున్నను నాదుష్టున కచ్చువోసి (వాతలుబెట్టి) ప్రవాస మంపవలెను. లేదా యంగములం గత్తిరించవలెను. నీచుడు మహానుభావుల జుట్టు పట్టుకొన్నచో వాని చేతులు నరికి వేయవలెను. పాదములందు, వెను దండిక యందు, మెడయందు, వృషములందు, జర్మము నొలిచినను, రక్తము రప్పించినను, నూరు నిష్కముల దండన కర్హుడగును.

అ స్థి భేత్తా చ షణ్ణిష్కాన్‌ ప్రమాప్యశ్చ ప్రమాపకః | అంగ భంగ కరస్యాంగం తదే వా7పహరే న్నృపః || 71

దండపారుష్య కృద్దద్యా త్సముత్థాన వ్యం తథా | అర్ధ పాదకరాః కార్యాః గోగజాశ్వాష్ట్ర ఘాతకాః ||

పశుక్షుద్ర మృగాణాం చ హింసాయాం ద్విగుణో దమః | పంచాశత్తు భ##వే ద్దండ స్తథైవ మృఘపక్షిషు ||

కృమికీటేషు దండ స్స్యా ద్రజతస్య తు మాపకమ్‌ | తస్యానురూపం మూల్యం చ ప్రదద్యాత్‌ స్వామినే తథా ||

సస్వామికానాం మరకే శేషాణాం దండమేప తు | వృక్షం తు సఫలం ఛిత్వా సుపర్ణం దండ మర్హతి ||

ద్విగుణం దండయే చ్చైత్యే పథి సీమ్ని జలాశ##యే | ఛేదనా దఫలస్యాపి మధ్యమః సాహసః స్మృతః |

గుల్మవల్లీ లతానాం తు సువర్ణస్యచ మాపకమ్‌ | వృథా ఛేదే తృణస్యాపి దండః కార్షాపణం భ##వేత్‌ ||

త్రిభాగం కృష్ణలాన్‌ దండ్యః ప్రాణిన స్తాడనే తథా | దేశకాలాను రూపేణ మూల్యం రామ! ద్రుమాదిషు ||

తత్స్వామిని తథా దద్యా ద్దండ ముక్తం చ పార్థివే | యత్రా తివర్తతే యుగ్యం వైగుణ్యాద్రజకస్య తు ||

తత్ర స్వామి భ##వేద్దండ్యో నాప్తశ్చే ద్వ్యాజకో భ##వేత్‌ | ప్రాణకశ్చ భ##వేదాప్తః ప్రాణకో డ మర్హతి || 80

ఎముకల విరచిన వాడారు వందల నిష్కముల జరిమానా కర్హుడగును. హత్యచేసినవాడు, హతమార్చ వలసినవాడు, ఏయంగమునకు భంగము గల్పించెనో వాని యాయంగమును నఱికి వేయవలెను. దండపారుష్యము చేసిన వాని సముత్థానమునకై (వాని వూద్యమునకయిన) ఖర్చునిచ్చి వేయవలెను. గోవులకు, ఏనుగులకు, ఒంటెకు ఘాతచేసినవారి కాళ్ళు చేతులు సగము నఱికి వేయవలెను. పశువులను చంపినవానికి దండనము రెట్టింపు. మృగములను, పక్షులను, హింసించిన వాని కేబది నిష్కములు.కృమి కీటములు జంపినందులకు, వెండి నాణముల పరిమితలో జరిమానా విధింబనగును. వాని యజమాని కలవానికి వాని కనురూపమైన విలువ నిప్పించవలెను. యాజమానులున్నఅవి యెవ్వరివి గానప్పుడు జరిమానా మాత్రముతో సరిపోవును. పండ్లతోడి చెట్టులను నరికినవాడు సవుర్ణదండార్హుడు. (16 మాషముల యెత్తు బంగారమన్నమాట) చైత్యమందు, దారిలో, సరిహద్ధులో నీటిపట్టున నున్న పండ్ల చెట్టు గూర్చిన వానికి రెండు సువర్ణముల దండనము విధించవలెను. పండ్లులేని తరువుదుగూల్చిన మధ్యమ సాహసము. (500 పణములు శిక్ష) తీగెలు పొదలు నరికినవానికి సువర్ణ ప్రమాణము దండనము. ప్రాణులను గొట్టిన యడల కృష్టల త్రిభాగశిక్ష. (యవ ప్రమాణము) చెట్లు మొదలైన వానిం గూల్చిన వానిని దేశకాలానురూపముగ వాని విలువ యజమాని కిప్పించవలెను. రాజునకు నేచెప్పిన జరిమానాగూడ చెల్లింపవలెను. కాడెద్దు లోపము వలన పనిని అతిక్రమించిన యడల జయమానికే శిక్ష వేయనగును యజమాని లభ్యముగాని నాడు పశుపాలుని శిక్షింపవలెను. ఇద్దరు లభ్యమైనపుడు యజమానికే వేయవలెను.

నాస్తి దండం చ తస్యాపి తథా త్రాహీతి జల్పతః || 81

ద్రవ్యాని యోహరే ద్యస్స జానతో7జానతో పివా | స తస్యోత్పాదయే త్తుష్టిం రాజ్ఞో దద్యా త్తతో దమమ్‌ ||

యస్తు రజ్జుం ఘటం కుపాద్ధరే ద్భింద్యాచ్చ తాం ప్రపామ్‌ | సదండం ప్రాప్నుయా న్మాషం తచ్చ సంప్రతిపాదయేత్‌ ||

ధాన్యం దశభ్యః కుంభేభ్యో హరతో7భ్యధికం బుధం | ళేషే7ప్యేకాదశగుణం దండం తస్య ప్రకల్పయేత్‌ ||

సువర్ణ రజతాదీనాం చోత్తమానాం చ వాససాం | పురుషాణాం కులీనానాం నారీణాం చ విశేషతః ||

ముఖ్యానాం చైవ రత్నానాం హరణ వధ మర్హతి ||

మహా పశూనాం హరణ వస్త్రాణా మౌషధస్య చ | కాల మాసాద్య కార్యం చ రాజా దండం ప్రకల్పయేత్‌ ||

గోషు బ్రాహ్మణ సంస్థాసు స్థూలాకారా విభేదనే | అశ్వాపహారక్త శ్చెవ సద్యః కార్యార్థ పాదికః ||

సూత్రకార్పాస కిల్వానాం గోమయస్య గుడస్య చ | దధ్నః క్షీరస్య తక్రస్య పానీయస్య ఫలస్య చ ||

వేణు వైదల భాండానాం లవణానాం తథైవ చ | మృణ్మయానాం చ సర్వేషాం మృదో భస్మన ఏవ చ ||

మద్యానాం పక్షిణాం చైవ తైలస్య చ ఘృతస్య చ | మాంసస్య మదున శ్చైవ యచ్చాన్యత్‌ పశు సంభవమ్‌ || 90

ఎజిగి యె ఱగకయు ద్రివ్యములను హరించువాని రక్షింపుమన్నచో దండము లేదు-

అప్పుడు యజమానుని తృప్తిపరచి రాజునకు దండనము చెల్లింపవలెను. త్రాటిని పాత్రను నూతినుండి దొంగిలించిన వానికి, వానిం ద్రెంచి పగుల గొట్టిన, వానికి చలివెందలి గూల్చినవానికి మాష ప్రమాణమైన జరిమానా వేయవలెను. మాషము (5కృష్ణలములు)., పదికడవలకు మించి ధాన్యము అపహరించిన వానికి. పదునొక్కండు రెట్లు ధాద్యమును శిక్ష విధింపవలెను. బంగారము, వెండి, విలువైన బట్టలు, మంచి కులముల పురుషస్త్రీల ముఖ్యమయిన రత్నములు శ్రేష్ఠవస్తువులు హరించిన వానికి వధయే తగిన శిక్ష. మహాపశువులు అమూల్య వస్త్రములు. ఔషధములు దొంగతనమందు, గోవులను బ్రాహ్మణుల సంపదల యందు, పుష్టిగలవాడు, బక్క చిక్కన్నవాడు నన్న భేదము లేకుండ చేయు దొంగతనముల యందు, ప్రభువు కాలము, కర్తవ్యము ననుసరించి దండనము విధింపవలెను. గుఱ్ఱపు దొంగను సగము కాలిన వానిం గాలింపవలెను కాలు తెగ గోట్టవలెను. తాళ్లు, ప్రత్తి,గుఱ్ఱము, ఆవుపేడ, బెల్లము, పెరుగు, పాలు, మజ్జిగ, పానీయములు, పండ్లు, వెదుళ్ళు, మినుములు, పెసలు, శనగలు, కందులు, మొదలుగాగల ధాన్యములు (పప్పు సరకులు) భాండములు, ఉప్పులు, మృణ్మయములయిన మట్టి, బూడిద, మద్యములు, పక్షులు, తైలము, (నూనె) నెయ్యి, మాంసము, తేనె మఱియుంగల పశువుల వలన వస్తువులు, చేపలు, అన్నము, సర్వపక్వాన్నములు, దొంగిలించిన వానికి వాని విలువకు రెట్టింపు ధనమును శిక్ష విధింపవలెను.

అన్యేషా మేవమాదీనాం మత్స్యానా మోదనస్య చ | పక్వాన్నాం నాం చ సుర్వేషాం తన్మూల్యా ద్ద్విగుణో దమః || 91

పుష్పేషు హరితే ధాన్యే గుల్మవల్లీ లతాసు చ! అల్పేషు పరిపూర్ణేషు దండ స్స్యాత్పంచ మాషకః ||

పరిపూర్ణేషు ధాన్యేషు శాకమూల ఫలేషు చ | నిరన్వయే శతం దండ్యః సాన్వయే చశతం దమః ||

యేన యేన యథాంగేన స్తేనో నృషు విచేష్టతే | తత్తదేప హరేదస్య ప్రత్యాదేశాయ పార్థివః ||

ద్విజో7ధ్వగః క్షీణ వృత్తి ర్ద్వా విక్షూ ద్వే చ మూలకే | త్రపుసోర్వారుకౌ ద్వౌద్వౌ తావన్మానం ఫలేషు చ ||

తథాచ సర్వధాన్యానాం ముష్టిగ్రాహేణ భారవ! | శాతం శాత ప్రమాణన గృహ్యమాణోన దుష్యతి ||

వానస్పత్యం మూలఫలం గుర్వగ్న్యర్ధం తధైవ చ | తృణం చ గోభ్యో దానార్ధ మస్తేయం మనురబ్రవీత్‌ ||

అదేశ వాటజం పుష్పం దేవతార్థం తథైవ చ | ఆదదానః పరక్షేత్రాన్న దండం దాతు మర్హతి ||

శృంగిణం నఖినం చాపి దంష్ట్రిణం వా వధోద్యమతమ్‌ | యో హన్యా న్న స పాపేన లిప్యతే మనుజః క్వచిత్‌ ||

గురుం వా బాల వృద్ధౌ వా బ్రహ్మణం వా బహు శుతమ్‌| ఆతతాయిన మాయాన్తం హన్యాదేవా విచారయన్‌ || 100

పువ్వులు,పసుపు, తీగలు, తీగపొదలు, అల్పములయిన పరిపూర్ణములయిన వేవియైన, దొంగిలించిన, వాని పంచమాషములు శిక్ష. (కృష్ణలములు వొక మాషము. మూడు యవలోక కృష్ణలము) పంటకువచ్చిన ధాన్యములు, దుంపలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు దొంగిలించిన వాడేకాకియైనను వానికి నూరు పణములు శిక్ష విధించవచ్చును. ఏ శరీరావయవముచే దొంగ దొంగతనము చేయునో యా యంగమును ప్రత్యాదేశము కొఱకు (నిరాకరణము) నరకవలెను. దారిం బోవుచు ద్విజుడు వృత్తిలేనివాడు రెండు చెఱకు గడలు రెండు దుంపలు (త్రవుసము తగరము) ఉర్వారుకము, కరుబూజ (దోసలోరకము) రెండు రెండు అంతే పరిమాణములో పండ్లు, అదే విధముగ ధాన్యము గుప్పెడు గుప్పెడుగా కూరకు సరిపోయినంత తీసుకున్నచో చోరత్వదోషముం బొందడు. వనస్పతులకు సంబంధించిన పండ్లు మొదలైనవి, దుంపలు, పండ్లు గురువుకొఱకు, అగ్నుల కొఱకు, ఆవుల మేతకు గడ్డియు, దీసికొనుట దొంగతనము గాదని మనువు పల్కెను. దేవాలయావరణలోని గాని, పువ్వులను, దేవతార్చన కొఱకితరుల భూమినుండి గైకొన్న యెడల నతడు దండిపదగడు. గోళ్ళు, కోరలు గల దానిని, తనను జంపనున్న దానిని, జంపిన యా మనుజుడెన్నడు పాపమును బూయబడడు పైనివచ్చిపడు నాతతాయియైన గురుని, బాలుని, వృద్ధుని, బహుశ్రతుడైనను (పండితుడైన) ఆలోచించకుండ జంపవలసినదే.

నా77తతాయి వధే దోషః కర్తుర్భవతి కశ్చన | ప్రకాశం వా7ప్రకాశం వా మన్యుస్తం హంతు మర్హతి || 101

గృహక్షేత్రాది హర్తారం తథా పత్న్యభిగామినమ్‌ | అగ్నిదం గరదంచైవ తథా హస్తోద్యతాయుదమ్‌ ||

అభిచారం చ కుర్వాణం రాజగామి చ పైశునమ్‌ | ఏతే హి కథితా లోకే ధర్మజ్ఞై రాతతాయినః ||

పరస్త్రియం న సంభాషే త్తీర్థే7రణ్య గృహే7పివా | నదీనాం చైవ సంభేదే నసంగ్రహణ మాప్నుయాత్‌ ||

న సంభాషం సహ స్త్రీభిః ప్రతిషిద్ధం సమాచరేత్‌ | ప్రతిషిద్ధస్తు సంభాషః సువర్ణం దండ మర్హతి ||

నైష చారేషు దారేషు విధి ర్నీత్మోపజీవిషు | సజ్జయన్తి మనుషై#్య స్తే నిగూఢం విచరన్త్యుత ||

కించిదేవ తు సామ్యం స్యా త్సంభాషేతా7భిచారయన్‌ | ప్రేష్యాసు చైవ సర్వాఖి రహః ప్రవ్రజితాసు చ ||

యో7కామాం దూషయే త్కన్యాం స సద్యో వధ మర్హతి | కామాం దూషయమాణస్తు ప్రాప్యః ప్రథమ సాహసమ్‌ ||

భిక్షుకో7ప్యథవా నారీ యో7పి చ స్యా త్కుశీలవః | ప్రవిశే త్ప్రతిషిద్ధస్తు ప్రాప్నుయా ద్ద్విశతం దమమ్‌ ||

యశ్చ సంచారక స్తత్ర పురుషః స తథా భ##వేత్‌ | పారదారిక వద్దండ్యో యశ్చ స్యా దవకాశదః || 110

ఆతతాయి వధవలన కర్తకుదోషము రాదు. వెల్లడిగా గాని రహస్యముగా గాని క్రోధగుణము క్రోధగుణమును ఎదిరింపనగును. గృహక్షేత్రాదులం గాజేసినవాడు,పరదా రాభిగామి, కొంపలంటించువాడు, విషము పెట్టువాడు, ఆయుధము పట్టుకొని కొట్టిచంపువాడు, అభిచారము (చేతబడులు మొదలయినవి) చేయువాడు, రాజు వద్దనుండి కొండెములు చెప్పువాడును వీరాతతతాయులని ధర్మవిదు లందురు. తీర్థమందు, అరణ్యములో, ఇంటను, నదీ సంగమమందును. పరస్త్రీలతో మాటలాడరాదు. అట్లుచేసిన దోషిగ పట్టు బడును. స్త్రీలతో నిషిద్ధ సంభాషణము సేయరాదు. అట్లు సేసినవాడు సువర్ణపరిమిత దండనమున కర్హుడు. ఈ శిక్ష గూఢచారుల యెడలను, భార్యల యెడల పనికిరాదు. తన దగ్గరనున్న యుద్యోగుల యెడలను పనికిరాదు. వీరు ఆయామనుజులతో సంభాషించుట, సంచరించుట అవసరమై యుండును. కోరని కన్య (అవివాహిత) నెవ్వడు చెఱచు వాడప్పటి కప్పడు వధార్హుడు. కోరిన స్త్రీని జెఱచినవాడు, ప్రథమ సాహసము (25 పణములు) జరిమానా వేయవలసినవాడు. బిక్షకుడు (సన్యాసి) స్త్రీ గాయకుడు నిషిద్ధ స్థలముల బ్రవేశించునేని రెండువందల పణములు దండన విధింప దగియుండును. అంతఃపురచారకు డీమీద జెప్పిన లక్షణములు గల్గియుండె నేని లోని కేగుట కవకాశమిచ్చెనేని పరస్త్రీ గమనము సేసిన వానివలెనె దండ్యుడగును. -

బలా త్సందూషయన్‌ యస్తు పరభార్యం నరః క్వచిత్‌ | వధ దండో భ##వేత్తస్య నాపరాధో భ##వేత్‌ స్త్రియాః || 111

రజ స్త్రతీయం యా కన్యా స్వగృహే ప్రతిపద్యతే | అదండ్యా సా భ##వే ద్రాజ్ఞా వరయన్తీ పతిం స్వయమ్‌ ||

స్వదేశే కన్యకాం దత్వా తా మాదాయ తథా వ్రజన్‌ | పరదేశే భ##వే ద్వధ్యః స్త్రీ చౌరస్య తథా భ##వేత్‌ ||

అద్రవ్యాం మృతపత్నీం తు సంగృహ్ణన్నాపరాధ్యతి | సార్థాం వై తాం చ గృహ్ణానో దండ ముత్తమ మర్హతి ||

ఉత్కృష్టం వా భ జేత్కన్యా దేయా తసై#్యవ సా భ##వేత్‌ | జఘన్యం సేవమానాం చ సంయతాం వాసయేత్‌ గృహే ||

ఉత్తమాం సేవ మానస్తు జఘన్యో వధ మర్హతి | జఘన్య ముత్తమా నారీ సేవమానా తథైవచ |

భర్తారం లంఘయే ద్యా తు స్త్రీ జ్ఞాతి బలదర్పితా | తాం శ్వభిః ఖాదయే ద్రాజా సంస్థానే బహుసంస్థితే ||

హృతాధికారం మలినాం పిండమాత్రోపజీవినీమ్‌ | వాసయేత్‌ సై#్వరిణీం నిత్యం సవర్ణే నాభిదూషితామ్‌ ||

జ్యాయసా దూషితా నారీ ముండనం సమవాప్నుయాత్‌ | మాసం చ మలినా నిత్యం సాగ్రాసాన్‌ ప్రాప్నుయా ద్దశ ||

బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః క్షత్రివిట్‌శూద్రయోనయః | వ్రజన్‌ దాప్యో భ##వే ద్రామ! దండముత్తమ సాహసమ్‌ || 120

పరభార్యను బలాత్కారముగా చెఱచిన వానికీ మరణ దండనము విహితము. స్త్రీ యెడమాత్రము నేరము లేదు. తన యింట మూడవసారి రజస్వలయైన కన్య స్వయముగా భర్తను వరించునేని యామె దండింప వలసినది గాదు. తన దేశమందు కన్యా దానము సేసి యామెను దీసికొని పరదేశ##మేగినవాడు స్త్రీని దొంగిలించిన వాడుగా మరణదండన కర్హు డగును. భర్త చనిపోగా దరిద్రురాలయిన స్త్రీని సంగ్రహించు నాతడపరాధిగాడు. ఆ స్త్రీ ధనవంతురాలయినచో నామెను గ్రహించినవాడు ఉత్తమ దండనము (వేయి పణముల) దండనమున కర్హుడు. ఒక కన్య ఉత్కృష్టు (గొప్పవాని) బొందెనేని మరణదండన కర్హుడు. అట్లే యుత్తమ స్త్రీ నీచుని బొందెచేని యిదే శిక్ష కర్హురాలు. పుట్టింటివారి బలముంబట్టి గర్వించి భర్త నుల్లంఘించినస్త్రీని బహుజనము గూడిన సంస్థాన మందు కుక్కలచే దినిపింపవలెను. సవర్ణుడయిన పురుషునిచే జెరచబడిన జారిణిని అధికారమెల్ల లాగికొని మాసినదాని నొనరించి సిండమాత్ర జీవితం గావించి ఇలు వెళ్ళ గొటకటవలచేపేజ పైయెత్తు వానిచే జెరచబడిన స్త్రీకితలబోడి గావింప వలెను. మలినయై నెలరోజులు ప్రతి ప్రతిదినము పది ముద్దలు మాత్రమే దినవలెను. బ్రాహ్మణుడు క్షత్రియస్త్రీని, క్షయుత్రిడు వైశ్యస్త్రీని, వైశ్యుడు శూద్రస్త్రీని వ్యభిచరించెనేని, ఉత్తమ సాహస దండనమున (వేయి పణముల దండనమున) కర్హుడగును.

వైశ్యాగమే తు విప్రస్య క్షత్రియస్యా న్త్యజాగమే | మధ్యమం ప్రథమం వైశ్యో దండ్యః శూద్రాగమే భ##వేత్‌ || 121

శూద్ర స్సవర్ణా ೭೭గమనే శతం దండ్యో మహీభూజా | వైశ్యశ్చ ద్విగుణం రామః క్షత్రియ స్త్రిగుణం తథా ||

బ్రాహ్మణశ్చ భ##వేద్దండ్య స్తథా రామ! చతుర్గుణమ్‌ | గుప్తాస్వేవ భ##వేద్దండ మగుప్తాస్వపి తత్‌ స్మ్రుతమ్‌ ||

మాతా మాతృష్వసా శ్వశ్రూ ర్మాతులానీ పితృష్వసా | పితృవ్య సఖి శిష్యస్త్రీ భగినీ తత్సఖీ తథా ||

భాగినేయీ తథాచైవ పత్నీ తథైవ చ | ఇత్యగమ్యాస్తు నిర్దిష్టా తాసాం తు గమనే నరః ||

శిశ్న స్యోత్కర్తనం కృత్వా తతస్తు వధ మర్హతి | భ్రాతృ భార్యగమే పూర్వా ద్దండస్తువధ మర్హతి ||

చండాలీం వా శ్వపాకీం వా గచ్ఛన్‌ వధ మవాప్నుయాత్‌ | తిర్యగ్యోనౌ తు గోవర్జ్యం మైధునం యో నిషేవతే ||

సపణం ప్రాప్నుయా ద్దండం తస్యాశ్చ యవసోదకమ్‌ | సువర్ణం చ భ##వేద్దండ్యో గాం వ్రజన్‌ మనుజోత్తమ! ||

వేశ్యాగామీ భ##వేద్దండ్యో వేశ్యా శుల్కసమం పణమ్‌ | గృహీత్వా వేతనం వేశ్యా లోభా దన్యత్ర గచ్ఛతి ||

వేతనం ద్విగుణం దద్యా ద్దండం చ త్రిగుణం తథా | అన్య ముద్దిశ్య వేశ్యాం యేనయే దన్యస్య కారణాత్‌ || 130

విప్రుడు వైశ్య స్త్రీని, క్షత్రియు డంత్య (శూద్ర) కులము దానిని, బొందిన మధ్యమ సాహసము, వైశ్యడు శూద్ర స్త్రీని బొందెనేని, ప్రథమ సాహస దండనమునకును అర్హులగుదురు. శూద్రు డసవర్ణ స్త్రీని బొందెనేని, రాజుచే నూరు పణములు శిక్షింప నర్హుడు. వైశ్యుడు దానికి రెట్టింపు, క్షత్రియుడు మూడురెట్లు అపరాధమునకు బాత్రుడగును. బ్రాహ్మణుడు నాల్లు రెట్లపరాధము చెల్లించవలసి యుండును. ఈ యపరాధము రహస్యముగా జేసినను బహిరంగముగా జేసినను నీ శిక్ష యొక్కటియే. తల్లి, తల్లిసోదరి, అత్తగారు, మేనమామ భార్య, తన తండ్రితోబుట్టువు, పితృ భ్రాతృ భార్య, స్నేహితుని భార్య, శిష్యురాలు, చెల్లెలు, ఆమె స్నేహితురాలు, మేనగోడలు, రాజుభార్య, అనువారు అగమ్యలని చెప్పబడిరి. వారిం బొందిన వాని యంగము నరికి యాపై వానిని వధింపవలెను. భ్రాతృభార్యా గమనమందు గూడ యిదే శిక్ష, చండాలిని శ్వపాకిని, బొందినవాడు మరణ దండనకు బాత్రుడు. గోవు తప్ప మిగిలిన పశువులతో గూడిన వాడు ఆజంతువు తినుగడ్డి నానవేసిన నీరు త్రాగుటతో బాటు పణము జరిమానాకు బాత్రుడగును. గోవుతో సంగమిచినవాడు సువర్ణదండనమునగు గురియగును. వేశ్యను సంగమించిన దాని కావెలయాలి కిచ్చిన వెల యంతో అంత జరిమానా విధింపనగును. ఒక వెలయాలొకనిదగ్గర వేతనము దీసికొని యింకొకని గూడినచో వానికా వేతనమునకు రెట్టింపీయవలెను. దానికి మూడు రెట్లు వేతనమునకు రెట్టింపీయవలెను. దానికి మూడు రెట్లు జరిమానాయు నిచ్చుకోవలెను. ఒకని వేశ్య నింకొకనికి దార్చినవాడు మాష ప్రమాణము కల సువర్ణము చెల్లింపవలసి యుండును.

తస్య దండో భ##వేద్రామః సువర్ణస్య చ మాషకమ్‌ | నీత్వా భోగం న యో దద్యా ద్దాప్యో ద్విగుణ వేతనమ్‌ || 131

రాజ్ఞా చ ద్విగుణం దండ్య స్థథా ధర్మోన హీయతే | బహూనాం వ్రజతా మేకాం సర్వే తద్ద్విగుణం దమమ్‌ ||

సర్వే పృథక్‌ పృథ గ్రామ! దండం చ ద్విగుణం పణాత్‌ | న మాతా న పితా న స్త్రీ ఋత్వి గ్యాజ్యస్య సూనవః ||

ఆన్యానః పతితా స్త్యాజ్యా స్త్యాగే దండ్యః శతాని షట్‌ | పతితా గురవ స్త్యాజ్యా న తు మాతా కదాచన ||

గర్భధారణ పోషాభ్యాం తేన మాతా గరీయసీ | సందంశహీనౌ కర్తవ్యౌ కూటక్షోపధి దేవినౌ ! ||

అధీయాన మనధ్యాయే దండః కార్షాపణ త్రయమ్‌ | అథ్యాపక శ్చద్విగుణం తథా೭೭చారస్య లంఘనే |

అన్తం తస్య భ##వే ద్దండః సువర్ణస్య చ కృష్ణలమ్‌| భార్యా పుత్రశ్య దాసశ్చ శిష్యో భ్రాతా చ సోదరః ||

ప్రాప్తాపరాధాస్తే దండ్యా రజ్వా వేణు దళేన వా | పృష్ఠతస్తు శరీరస్య నోత్తమాంగే కథంచన ||

అతోన్యథా యత్‌ ప్రహరేత్‌ ప్రాప్త స్స్యా చ్చౌరకిల్బిషమ్‌ | ద్యూతం సమాహ్వయం చైవ యో నిషిద్ధం సమాచరేత్‌ ||

ప్రచ్ఛన్నం వా ప్రకాశం వా సద దండ్యః పార్ధివేచ్ఛయా | వాసాంసి ఫలకే శ్లక్ష్మే నేనిజ్యా ద్రజకఃశ##నైః || 140

దాని గొనిపోయి భోగద్రవ్య మీయనివానికి రెట్టింపు వేతనము శిక్ష విధింపవలెను. తల్లి, దండ్రిస్త్రీ, ఋత్విక్కు, యజ్ఞకర్త, కొడుకు లొండురులు కలిసి పతితు లైనచో నందఱిని వెలి వెట్టవలెను - ఒకతె ననేక ముందిగూడిన నయ్యందరకు వేర్వేర రెట్టింపు వేతనము దండన విధింపవలెను. - మరియు నూరు మార్లు జరిమానాకు పాత్రులు. భ్రష్టులయినచో గురువులను గూడ వెలివేయ వలసినదే. కాని తల్లిని మాత్రము వెలి వేయ రాదు, గర్భము దాల్చి బోషించిన కారణముచే దల్లి యందరిలో గొప్పది. కూటసాక్షి, జూదరుల పండ్లు రాలగొట్టవలెను, అనధ్యయనమున వేదాధ్యయనము చేసిన వానికి మూడు కల్షాపణములు జరిమానా విధింపవలెను = ఆచారోల్లంఘనము చేసిన వాని యథ్యాపకునికి దాని రెట్టింపు విధింపవలెను. భార్య, పుత్రుడు, నౌకరు, శిష్యుడు, తమ్ముడు, అన్న అనువారలు అపరాధము సేసినచో త్రాటితో వెదురు రెమ్మతో గొట్టింపవలెను. ఆకొట్టుట పిరుదు వైపుననే. తలకూడ బాదరాదు. ఇందులకు వ్యతిరేకముగా గొట్టిన వానికి దొంగకు వేసిన శిక్ష వేయవలెను. చాటు వెల్లడిగ నిషేధింపబడిన జూదము, సమాహ్వయము, గుఱ్ఱము, గొఱ్ఱ, కోడి, మొదలగు ప్రాణుల పందెము వేసిన వానిని రాజాజ్ఞచే దండించి తీరవలెను. చాకలి నునుపైన రాతిమీద మె ల మెల్లగ నుతుకవలయును. అట్లుగాక గరుకు రాతిపై వైచి బాదినచో వానికి కృష్ణల ప్రమాణమై బంగారము దండనము విధింపవలెను -

అతో7న్యథా తు కుర్వీత దండస్స్యా ద్రుక్మ కృష్ణలమ్‌ | రక్షాంస్యధికృతా రామ! ప్రజేయం యైర్విలుప్యతే || 141

కార్వికేభ్యో7ర్థ మాదాయ హన్యుః కార్యాణి కార్యిణామ్‌ | తేషాం సర్వస్య మాదాయ రాజా కుర్యాత్‌ ప్రవాసనమ్‌ ||

యే నియుక్తాః స్వకార్యేషఫు హన్యుః కార్యాణి కార్యిణామ్‌ | నిర్ఘృణాః క్రూరమనసః సర్వకార్యోపరోధినః ||

ధనోష్మణా పచ్యమానాం స్తాన్నిస్వాన్‌ కారయే న్నృపః | కూట శాసన కర్తౄంశ్చ ప్రకృతీనాంచ దూషకాన్‌ ||

స్త్రీ బాల బ్రాహ్మణఘ్నాంశ్చ వంధ్యా శ్చాసేవిన స్తథా | అమాత్యః ప్రాడ్వివాకో వా యః కుర్యాత్‌ కార్య మన్యథా ||

తస్య సర్వస్వ పృథక్‌ విద్యా న్మహాపాతకినో నరాన్‌ | మహాపాతకినో వధ్యాః బ్రాహ్మణం తు వివాసయేత్‌ ||

కృతచిహ్నం స్వకాద్దేశాచ్ఛృణు! చిహ్నక్రమం తథా | గురుతల్పే భగః కార్యః సురాపానే సురాధ్వజః ||

స్తేయే తు శ్వపదం విద్యాత్‌ బ్రామ్మహణ్య శిరాః పుమాన్‌ | అసంభాష్యా హ్యసం లాప్యాః అసంపాద్యా విశేషతః ||

త్యక్తవ్యాశ్చ తథా రామ! జ్ఞాతి సంబంధి బాంధవైః | మహపాతికినో విత్త మాదాయ నృపతిః స్వయమ్‌ || 150

రాక్షసు లధికారులై ప్రజలను కాల రాచివైతురు-కర్షకు లవద్దధనము గుంజికొని కర్షకుల పనులను జెరతురు-అట్టి దురధికారుల సర్వస్వము ( సర్వధనమును) లాగికొని రాజు వారిని ప్రవాస మంపవలెను. నిర్దయులు, కౄరమనస్కులు, సర్వకార్య నిరోధ కులునై ధనోష్మముచే పాకము సెందిన (ధనాతి శయమనెది యావరికి తెగనుడికిన) యా రాజోద్యోగులను లంచగొండులను కూట శాసనముల (కపట శాసనముల)ను జేయువారిని, రాజ్యాంగములు జెఱచు వారిని, స్త్రీ, బాల, వృద్ద, బ్రాహ్మణ ఘాతకులను, గొడ్డుమోతులను, కుక్కలను సంగమించు వాండ్రను, మంత్రి, ప్రాడ్వివాకుడు, న్యాయాధికారి, న్యాయమునకు వ్యతిలేక మొన్నర్చునేని వాని సర్వధనముల లాగికొని వానిని ప్రవాసమంపవలెను. బ్రహ్మఝ్నుడు, సురావుడు, ( తాగుబోతు) దొంగ గురుతల్పగుడు. వీరు వేర్వేర మహాపాతకులు. వీరిని జంపివేయవలెను. బ్రాహ్మణుడైన యెడల రాష్ట్రమునుండి వెడల గొట్టవలెను. ఆతరుము నపుడు వీండ్రకు కొన్ని గుర్తులు, (వాతలు) బెట్టవలెను. ఆ వాతల తీరు వినుము. గురుతల్పగుని యొంటిమీద భగముద్ర, త్రాగుబోతునకు సురాధ్వజము గుర్తు, దొంగకు కుక్కకాలి చిహ్నము, బ్రహ్మఘ్నుని పైతలలోని మనుజుని మొండెము, గుర్తు వేయవలెను. అట్టి మహాపాపులసంభాష్యులు. (పేర్కొనదగినవారు) వారిపేరు చెప్పగూడదన్నమాట. విశేషించిదరి జేర నీదగని వారు. జ్ఞాతి సంబంధ బాంధవులకు వెలియవేయవలసిన వారు.

అప్సు ప్రవేశ##యే ద్దండం వరుణాయోపపాదయేత్‌ | సహోఢం నవినా చౌరం ఘాతయే ద్ధార్మికో నృపః || 151

సహోఢం సోపకరణం ఘాతయే దవినా రయన్‌ | గ్రామేష్వపిచ యేకేచి చ్చౌరాణాం భక్తదాయకః ||

భాండావకాశదా శ్చైవ సర్వాం స్తానపి ఘాతయేత్‌ | రాష్ట్రేషు రాష్ట్రాధిపతేః సమంతా చ్చైవ దూషకాన్‌ ||

అభ్యాఘాతేషు మధ్యస్థాః క్షిప్రం శాస్యాస్తు చోరవత్‌ || దస్యుప్రపీడితానాం హి పథి మోహాది దర్శనే |

శక్తితో నాభిధావంతో నిర్మాస్యాః సపరిచ్ఛదాః | రాజ్ఞః కోపాపహర్తౄంశ్చ ప్రతికూలేషు చ స్థితాన్‌ ||

అరీణా మపజప్తౄంశ్చ ఘాతయే ద్వివిధైర్వధైః || సంధిం భిత్వా తు యే చౌర్యం రాజ్ఞః కుర్వంతి తస్కరాః ||

తేషాం ఛిత్వా నృపోహస్తౌ తీక్షణ శూలే నివేశ##యేత్‌ | తడాక భేదకం హన్యాదప్సు శుద్ధవధేన తు ||

యస్తు పూర్వం నివృత్తస్య తడాక స్యోదకం హరేత్‌ | ఆగమం వా ప్యపాం కుర్యాత్‌ స దాప్యః పూర్వ సాహసమ్‌ ||

కోష్ఠాగారయుధాగార దేవతాగార భేదకాన్‌ | పాపాన్‌ పాప సమాచారాన్‌ ఘాతయే చ్ఛీఘ్రమేవ తాన్‌ ||

సముత్సృజే ద్రాజమార్గే యస్త్వమేధ్యమనాపది | స హి కార్షాపణం దండ్య స్త మమేధ్యం చ శోభ##యేత్‌ || 160

ఆ మహాపాపుల విత్తము రాజు గైకొని వారిని నీళ్ళలో ముంచి వేయవలెను. గొన్న దండమును వరుణదేవున (జలాధిదేవత)కు సమర్పింపవలెను. సకుటుంబముగ వానిని చోరద్రవ్యముతో గూడ నాశనము చేయవలెను. వాని సామాగ్రిని కూడ నాలోచింపక పాడుపెట్టవలెను. గ్రామములందు దొంగల కన్నము పెట్టువాండ్రు, కుంటమంట యిచ్చువారు, నిలువనీడ నిచ్చువారెవరు గాని వారి నందరిని గూడ జంపింపవలెను. రాష్ట్రములందు. రాష్ట్రపతులను దూషించు వాండ్రను, నీయా ఘాతములందు మధ్యస్థులుగ ( తటస్థులుగ) నున్న వాండ్రను, దొంగలనట్లు శిక్షింపవలెను. దారులుగాచి దారులు మళ్ళించి దోచుకును బందిపోటుల బారిం బడినవారిని. శక్తి యుండియు బరువెత్తి వెంబడించి సహాయబడని వాండ్రను. సపరికరముగా రాష్ట్రమునుండి వెడల గొట్టయువను. ప్రభువుయొక్క కోపమున కుపశాంతి కల్పించు రాజునకు ప్రతికూలురైన వారితో నిలిచిన శత్రువులను జాటుగా శేవించు వాండ్రను, చిత్రవధచేసి చంపవలెను. రాజుతోడి బొత్తుబెడిసి పోజేసి యే దొంగలు చోరవృత్తికి దిగుదురట్టి దొంగల చేతులు నరికి పదునైన శూలమెక్కింప వలను- చెరువు గండ్లు కొట్టినవానిని నీటిలోదింపి శుద్ధ వధ? చేయవలెను. ఎవ్వడామున్ను తన పొలము దారి మరలిన నీటిని మరలించునో, వానికి పూర్వసాహిస దండనము ( 250 పణములు) విధింపవలెను. కోష్టాగారము, (సామానుగదులు) ఆయుధాగారములు' దేవాలయములను బ్రద్దలు గొట్టు పాపులను పాప సమాచార మిచ్చువారిని వెంటనే చంపివేయవలెను. అపత్సమయుము గానప్పుడు గూడ రాచబాటలో, నమేధ్యమును విడిచినవాని కేడు కార్షాపణములు జరిమానా విధింపవలెను. వాని చేతనే యదారి శుద్ధము చేయింప వలెను.

ఆపద్గతో7థవా వృద్ధో గర్భిణీ బాల ఏవవా | పరిభాషణ మర్హన్తి తచ్చ శోధ్యమితి స్థితిః || 161

ప్రథమం సాహసం దండ్యః యశ్చ మిధ్యాచికిత్సకః | పురుషే మధ్యమం దండ న్తూత్తమే చ తథోత్తమమ్‌ ||

సంక్రమధ్వజ యష్టీనాం ప్రతిమానాంచ భేదకాన్‌ | ప్రతికుర్యుశ్చ తత్సర్యం దద్యుః పంచశతాని చ ||

అదూషితానాం ద్రవ్యాణాం దూషణ భేదనే తథా | మణినా మపి భేదస్య దండః ప్రథమ సాహసః ||

సమైశ్చ విషమం యోవై కురుతే మూల్యతో7పివా | సమాప్నుయాన్నరః పూర్వం సమం వా 7ధమమేవ వా ||

బంధనాని చ సర్వాణి రాజమార్గే నివేశ##యేత్‌ | క్లిశ్యన్తో యత్ర దృశ్యన్తే వికృతాః పాపచారిణః ||

ప్రాకారస్య తు భేత్తారం పరిఖానాం చ భేదకమ్‌ | ద్వారాణాం చాపి భేత్తారం క్షిప్రం నిర్వాసయే త్పురాత్‌ ||

మూలకర్మాభిచారేషు కర్తవ్యో ద్విగుణో దమః | అబీజ విక్రయీ చైవ బీజోత్కృష్ట స్తథైవ చ ||

మర్యాద భేదక శ్చైవ వికృతం వధ మాప్నుయాత్‌ | నర్వ సంకర పాపిష్ఠం హేమకారం నరాధిపః ||

అన్యాయే వర్తమానం తు లవశః ఛేదయే చ్ఛరైః | ద్రవ్యమాదాయ వణిజా మనర్ఘేణా వరుంధతామ్‌ || 170

కష్టస్థితి నుండి లేక వృద్ధుడై, గర్భవతియై, బాలుడై, రాజమార్గము శుద్ధము జేసినచో పరిభాషింప నర్హులగుదురు, పరి భాషణము = కూడని పని చేసిన వానిని మందలించుట వారిచేనది శోధన చేయించుటయు కార్యస్థితి. అంతకు మించి దండిపరాదు- తప్పుడు వైద్యము చేసినవానికి ప్రథమసాహసము శిక్ష. (250 పణములన్నమాట) పురుషుడైన మధ్యమసాహసము (50 పణములు). ఉత్తమ వైద్యుడే యిది చేసిన నుత్తమ సాహసము ( 1000 పణములు) జరిమానా. సంక్రమణ నీటి కట్ట, జెండాకర్ర విగ్రహములను పగలగొట్టినవాడవి బాగుజేసి యటుపై అయిదు వందలపణము లపరాధ మీయవలెను. చెడని వస్తువులను చెరిపినను, పగులగొట్టినను, శ్రేష్ఠవస్తువుల (మణుల) బదులగొట్టినను, ప్రధమసాహసశిక్ష విధింపనగును. అన్నిరకముల దండనవిధానములను (బంధనములను) రాజ మార్గమందే చేయించవలెను - పాపము జేసినవారు వికృతి ప్రవర్తనములవలన నేలాటి శిక్షలనను భవించుచున్నారో నలుగురకుం దెలియుచుండ వలయును, (అందువలన ప్రజలకు నపరాధ దృష్టి లేకుండా పోవునన్నమాట) ప్రాకారములను, కందకములను (అగడ్తలను) ద్వారములను పగులగొట్టువానిని వెంటనే పురమునుండి వెడలగొట్టవలెను. మూలకర్మములందు వేరులు తాయత్తులు కట్టుట అభిచారములు (చేతబడులు) చేయుట మొదలగు ఘాతుకకృత్యములందు రెట్టింపు దండనము విధింపవలెను. ఆబీజవిక్రయి (పొల్లునమ్మువాడు) బీజోత్కృష్ణుడును (అధికధాన్యము గలవాడు) వికృతమైన మరణదండదమున కర్హులు. స్వర్ణ సంకరములచే పరమ పాపియైన స్వర్ణకారుని బంగారము కల్తీచేయువానిని అన్యాయవర్తిని తేశ##లేశముగా నరకవలయును, వర్తకుని దగ్గర సామగ్రిని కొని మూల్యమెగబెట్టిబాధించువాండ్రకు ప్రభువుత్తమసాహసదండనమును వేర్వేరవిధింపవలెను.

రాజా పృధక్‌ పృధక్కుర్యా ద్దండ ముత్తమసాహసమ్‌ | ద్రవ్యావదూషకో యశ్చ ప్రతిచ్ఛందకవిక్రయీ || 171

మధ్యమం ప్రాప్నుయా ద్దండం కూటకర్తా తథోత్తమమ్‌ || శాస్త్రాణాం యజ్ఞతపసాం దేవానాం క్షేపకో నరః ||

దేవతానాం సతీనాంవై తూత్తమం దండ మర్హతి | ఏకస్య దండపారుష్యే బమూనాం ద్విగుణో దమః ||

కలహాపహృతం దేయం దండశ్చ ద్విగుణ స్తతః | మధ్యమమం బ్రాహ్మణం రాజా విషయా ద్విప్రవాసయేత్‌ ||

లశునం చ పలాండుంచ సూకరం గ్రామకుక్కుటమ్‌ | తధా పంచనఖం సర్వం భక్ష్యాదన్యత్ర భక్షిణమ్‌ ||

వివాసయేత్‌ క్షిప్రమేవ బ్రాహ్మణం విషయాత్‌ స్వకాత్‌ | అభక్ష్యభక్షణ దండ్యః శూద్రో భవతి కృష్ణలమ్‌ ||

బ్రాహ్మణక్షత్రియవిశాం చతుస్త్రిద్విగుణం హితమ్‌ | య స్సాహసం కారయతి సదద్యా ద్దిగుణం దమమ్‌ ||

యశ్ఛేద ముక్త్వాహందాతా కారయే త్స చతుర్గుణమ్‌ | సందిష్టస్యా7ప్రదాతారం సముద్ర గృహభేదకమ్‌ ||

పంచాశత్పణికో దండస్తయోః కార్యో మహీక్షితా | ఈస్పృశ్యేషు శతార్థంతు మధ్యో7థోయోగకర్మకృత్‌ ||

పుంన్త్వహర్తా పశూనాంచ దాసీగర్భవినాశ కృత్‌ | శూద్రప్రవృజితానాం చ దైవే పిత్ర్యేచ భోజకః || 180

అవ్రజన్‌ బాఢముక్త్వా చ తధైవ చ నిమంత్రణాత్‌ | ఏతె కార్షాపణ శతం సర్వే దండా మహీక్షితా ||

వస్తువులను కల్తీజేసి పాడుజేసినవాడు, ప్రతిచ్ఛందకవిక్రయి (నకిలీవస్తువుల నమ్మువాడు) మధ్వమదండార్హుడు. కూటకారి (మోసము జేయువాడు) ఉత్తమ సాహస దండార్హుడు. శాస్త్రములను యజ్ఞములను తపస్సులను దూషించువాడు దేవతలను పతివ్రతలను జెరచువాడు ఆక్షేపించువాడును ఉత్తమ సాహసదండ్యులు. వంటరిగా నేరము చేసినవాని కిచ్చుదండమునకు రెట్టింపు శిక్ష గుంపగూడి చేసిన వాండ్రకు విధింపవలెను. కలహించి యపమరించిన ద్రవ్యములను యజమాని కిప్పించవలెను. రెట్టింపు దండనమును విధింపవలెను. వెల్లుల్లిని, నీరుల్లిని, పందిని, గ్రామములోని కోడిని పంచనఖభిన్కనమగు (1 కుందేలు 2 తాబేలు, 2 ఏదుబంది 4 ఖడ్గమృగము 5 ఉడుము. ఈ అయిదిటిని పంఛనఖములని యందురు) తినగూడనిదెల్లతిన్న బ్రాహ్మణుని తన రాష్ట్రమునుండి వెంటనే వెడలగొట్టవలెను. అభక్ష్యభక్షణముజేసిన శూద్రునికి కృష్ణల ప్రమాణమైన శిక్ష విధించవలెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలుకు ఏయధికారి వరుసగా నాల్గు మూడు రెండు రెట్లదమమును విధించుటలో సపాసించునో యా న్యాయాధికారికి రెట్టింపు జరిమానా విధింపవలెను. ఇత్తునన్నదాని నీయనివానికి సముద్రగృహమును బ్రద్దలు గొట్టిన వానికి ( రా జేకాంత వాసమునకై యేర్పరచుకొన్న గృహము జాడ వెల్లడించిన వానికి) ఏబది పణముల శిక్ష విధింపవలెను. అస్పృశ్యులకు నేబది పణములు శిక్ష. పశువుల పుంస్త్వము హరించినవాడు, దాసీ స్త్రీగర్భభంగము జేసినవాడు శూద్రసన్యాసులకు దేవపితృకార్యములందు తిండిపెట్టినవాడు, తద్దినము మొదలయిన దానియందు నియంత్రింపబడి (పిలువబడి) సరే వత్తునిని రానివాడు, రాజుచే నూరు కార్షా పణములుజరిమానా విధింప నర్హులు.

దుఃఖోత్పాది గృహేద్రవ్యం క్షిపన్‌ దండ్యస్తుకృష్ణలమ్‌ | పితాపుత్ర విరోధేతు సాక్షిణాం ద్విశతో దమః ||

తులాశాసన మానానాం కూట కృన్నాణకస్య చ | ఏభిశ్చ వ్యవహర్తా యః సదాప్యో దండ ముత్తమమ్‌ ||

విషాగ్నిదాం పలిగురునిజాపత్యా ప్రమాపణీమ్‌ | వికర్ణకర నాసౌష్ఠీం కృత్వా గోభిః ప్రమాపయేత్‌ ||

క్షేత్రవేశ్మగ్రామనవన నివీతఖల దాహకాః | రాజపత్న్యభిగామీ చ దగ్ధవ్యాశ్చ కటాగ్ని నా ||

ఊనం 7వా ప్యధికం వాపి లిఖేద్యో రాజశాసనమ్‌| పారదారికచౌరౌ చ ముంచతో దండ ముత్తమమ్‌ ||

అభ##క్ష్యేణ ద్విజం దూష్య దండ ముత్తమ సాహసమ్‌ | క్షత్రియో మధ్యమం వైశ్యః ప్రథమం శూద్రమర్ధికమ్‌ ||

మృతాంగలగ్న విక్రేతు ర్గురో స్తాడయితు స్తథా| రాజయానాసనారోఢు ర్దండ ఉత్తమసాహసమ్‌ ||

యో మన్యేతా7 జితో7 స్మీతి న్యాయేనాపి పరాజితః | తమాయాతం పునర్జిత్వా దండయే ద్ద్విగుణం దమమ్‌ ||

ఆహ్వానకారీ వధ్య స్స్యాత్‌ అనాహూత మథాహ్వయన్‌ | దండకస్య చ యోహస్తా దభియుక్తః పలాయతే |

హీనః పురుషణకారేణ తద్దద్యా ద్దాండికో ధనమ్‌ |ప్రేష్యాపరాధా త్ప్రేష్యస్య స దండం దాతు మర్హతి ||

దుఃఖము పుట్టించు వస్తువేదేని ఇంటిలో పడవేసిన వానికి కృష్ణలప్రమాణ దండనము విధింపవలెను. తండ్రి కొడుకుల విరోధమందు సాక్ష్యమిచ్చన వానికి రెండువందల పణముల శిక్ష, త్రాసులు, కాటాలు, శాసనములు, తూనికల దగాలు, నాణముల మోసము (చెల్లని నాణముల మోసము) మొదలగు వానితో వ్యవహరించువా రుత్తమ దండనమున కర్హులు. విషముబెట్టిన దానిని, భర్తను, గురువులను, (తల్లి దండ్రి మామ) మొదలయినవారిని జంపిన దానిని చెవులుత్రెంచి చేతులు నరికి ముక్కుగోసి పెదవులు కత్తిరించి ఆవులచే నెడ్లచే త్రొక్కించి చంపింపవలెను. కుప్పలు, కొంపలు, గ్రామములు, అడవులు, పైఖండువాను, కళ్ళమును, కాల్చిన వాండ్రు, రాజభార్యా గామియు, కటాగ్నిచే = అనగా చాపచుట్టి నిప్పంటించి కాల్చివేయదగుదురు. రాజశాసనమును హెచ్చుతగ్గుగా వ్రాసినవాడు పరదార గామి దొంగ, కారదాగారమునుండి వదలినవాడును నుత్తమ సాహసదండార్హులు, తినరానిది తిన్న ద్విజుని కుత్తమ సాహసనదండనము, క్షత్రియునికి మధ్యమము వైశ్యునికి ప్రధమము శూద్రని కందులో సగము విధింపవలెను. శవముమీది వస్త్రము మొదలయినవాని నమ్మినవానికి గురువును గొట్టినవానికి, రాజెక్కు వాహనమును ఆసననమును నెక్కిన వానికి నుత్తమ సాహస శిక్ష వేయవలెను. న్యాయముగా నోడి పోయియు నేనోడిపోలేదని యనుకొని తిరిగి వచ్చనవానినోడించి రెట్టింపు దండనము విధింపవలెను. పిలువరాని వానిం బిలచినపుడు మరణ దండనమున కర్హుడు, దండికుని చేతినుండి (దండికుడనగా శిక్షను జరుపు పోలీసు)నేరము జేసినవాడు పారిపోయినచో పురుషకార హీనుడా దండోద్యోగి జరిమానా చెల్లింపవలెను. తనక్రింది నౌకరు లపరాధము జేసెరేని వారా చెల్లింపవలసిన జరిమానాను దండనాధికారియే కట్టవలెను.

దండార్థం నియమార్థం చ నీయమాసస్తు బంధనమ్‌ | పథి కశ్చిత్‌ పలాయేత దండమష్టగుణం భ##వేత్‌ || 192

అనిష్టిత వివాదే తు నఖరోమావతారణమ్‌ | కారయే ధ్యః స పురుషో మధ్యమం బండ మర్హతి ||

బంధనం వా7 థవా వధ్యం బలాన్యోచయతో భ##వేత్‌ | వధ్యే విమోచితే వధ్యో దండ్యే ద్విగుణ దండభాక్‌ |

దుర్మృష్ట వ్యవహారాణాం సభ్యానాం ద్విగుణో దమః | జ్ఞాత్వా త్రింశద్గుణం దండం ప్రక్షేప్య ముదకే భ##వేత్‌ ||

అల్పే దండే 7ధికం కృత్వా విపులే చాల్పమేవ చ | ఊనా 7ధికంతు తద్దండం సద్యో దద్యాత్స్వకాద్గృహాత్‌ ||

యావద్వధ్యః సవధ్యేత తావ ద్వధ్యస్య మోక్షణాత్‌ | నజాతు బ్రాహ్మణం హన్యా త్సర్వపాపే ష్వవస్థితమ్‌ ||

వధ్యే వివాసయే ద్రాష్ట్రాత్‌ సమగ్రధన మక్షతమ్‌ | న జాతు బ్రాహ్మణవధా త్పాప మవ్యధికం క్వచిత్‌ ||

యస్మాత్తస్మా త్ప్రయత్నేన బ్రహ్మహత్యాం వివర్జయేత్‌ | అదండ్యాన్‌ దండయన్‌ రాజా దండ్యాం శ్చైవా7 వ్యదండయన్‌ ||

అయశో మహ దాప్నోతి నరకం చైవ గచ్ఛతి ||

జ్ఞాత్వా7 పరాధం పురుషం చ రాజా కాలం తథా చ చానుమతే ద్విజానమ్‌ |

దండ్యేషు దండం పరికల్పయేత, పాపస్యయే తచ్ఛమనం న కుర్యుః ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పరుశురామం ప్రతి పుష్కరోపాఖ్యానే

దండప్రణయనం నామద్విసప్తతితమోధ్యాయః | 200

శిక్షలకొఱకు లేదా నియమము కొఱకు కారాగారములో బంధించుటకు కొనిపోబడు నేరగాడు త్రోవలో బారిపోవు నేని, యెనిమిదిరెట్లు దండనము విధింపనర్హుడు. నిర్ణయము తేలని తగవులో నేరము చేసినవాని గోళ్లు రోమములు గొరిగించిన దండనోధ్యోగి మధ్యమ సాహసదండార్హుడు, కారాకాగార బంధనమునుగాని, వధ్యునిగాని బలాత్కారముగ దప్పించిన వాడు బంధన దండమున కర్హుడు. వధ్యుడు రెట్టింపు దండనకర్హుడు, తప్పుడువిచారణ జరిపిన న్యాయస్థాన సభ్యులకు అపరాధికంటె రెట్టింపపుశిక్ష వేయవలెను. తెలిసియే తప్పుతీర్పు చెప్పిన వానికి ముప్పది రెట్లెక్కువ జరిమానా విధించి దానిని నీటిలో పారవేయవలెను- అల్ప మందధికగము అధికమైన నేరమం డల్పము జరిమానా విధించిన న్యాయాధికారి యారెంగు విధములగు జరిమానానలను తన యింటి నుండి తెచ్చి జమ కట్టవలెను. ఎంతవరకు వధ్యుడో అంతదాక నేరగానిని తప్పక వధింపవలసినదే. అట్లుగాక యా వధ్యుని వదలి పెట్టి వాడు బ్రాహ్మణుడైననచో నెల్ల పాపములకు స్ధానమైనను వాని నెన్నడు, జంపగూడదు. వానిని రాష్ట్రమునుండి వానిసొత్తులో నేలాటి బాధ కలుగకుండ దరిమి వేయవలెను. బ్రాహ్మణ వధకంటె మించిన పాపము మఱి యెన్నడును యెక్కడను లేదు. గావున సర్వ ప్రయత్నములచే బ్రహ్మ హత్యను రాజు వదిలివేయవలెను. దండ్యులు గాని వారిని దండించి దండ్యులను దండిపకున్న రాజు ఘోర మైన యపకీర్తి పాలగును. నరకమునుకు బోవును , చేసిన పాపమున కుపశాంతి చేసికొనని వారికి రుజునేరమును నేరము జేసిన వారిందెలిసికొని కాలము గమనించి ద్విజుల యనుమతియుంగొని దండ్యులందు దండమును విధింపవలెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున దండప్రణయనమను డెబ్బదిరెండవ వధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters