Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదియొకటవ అధ్యాయము - దండప్రస్తుతి

రామః- దండ ప్రణయానా7ర్థాయ రాజా సృష్ఠస్స్వయంభువా | దేవభాగా నుపాదాయ సర్వభూతా7భిగుప్తయే 1

తేజసా యదయం కశ్చిన్నైవ శక్నోతి వీక్షితుమ్‌ | తదా భవతి లోకేషు రాజా భాస్కరవత్‌ ప్రభుః ||

యదస్య ధర్వనే లోకః ప్రసాద ముపగచ్ఛతి | నయనా7నందకారిత్వా త్తదా భవతి చంద్రమాః ||

చారైర్యదా7యం వ్యాప్నోతి సర్వలోకం యదృచ్ఛయా | తదా భవతి లోకేషు రాజా వైవస్వత స్సదా ||

యదా పరాధినాం చైవ విధత్తే నిగ్రహం నృపః | తదా భవతి లోకేషు రాజా వైవస్వతస్సదా ||

యదా దహతి మాహాత్మ్యాత్‌ క్రుద్ధబుద్దీన్‌ నరా న్నృపః | అనిచ్ఛన్నపి లోకేషు తదా భవతి పావకః ||

కరోతి చయదా దానం ధనానాం సర్వతో నృపః | విసర్గార్థం సురశ్రేష్ఠః తదా భవతి విత్తదః ||

యదా చ ధనధారాభి ర్వర్షన్‌ ప్లావయతే జగత్‌ | తదా స వరుణః ప్రోక్తో రాజా నయవిశారదైః

క్షమాబలేన మనసా ధారయన్‌ సకలాః ప్రజాః | అవిశేషేణ ధర్మజ్ఞ! పార్థివః పార్థివో భ##వేత్‌ ||

యదా77ధిపత్యేన జనాన్‌ సమగ్రాన్‌ పరిరక్షతి | తదా భవతి దేవేంద్రః సర్వభూతానుకంపితా || 10

ఉత్సాహ మంత్ర శక్తిర్యా ప్రభుశక్తిశ్చ దైవికీ | చతస్ర శ్శక్తయ స్తత్ర వైష్ణవ్యః పరికీర్తితాః ||

కస్సమర్థః ప్రజాః పాతుం వినా వైష్ణవతేజసా | తిస్రస్తు శక్తయ స్తస్య వైష్ణవ్యః పృథివీపతేః ||

దండ ప్రణయనం సమ్యక్‌ శ్రోతు మిచ్చామి తత్త్వతః | కధం స్వవిషయే తస్య దండనీతి ర్భవేద్ధ్రువా ||

కథంచ దండం ప్రణయన్‌ నరేంద్రో | ధర్మేణ యుజ్యే ద్యశసాచ వీర! ||

అర్థేన కామేన చ సర్వమేతత్‌ | బ్రవీహి యాదో గణనాథపుత్ర! || 14

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయ ఖండే - దండ ప్రస్తుతిర్నామ ఏక సప్తతి తమో7ధ్యాయః ||

పరశురామునియె:- రాజు దండ ప్రణయనము కొఱకే బ్రహ్మచే సృష్టించబడినాడు. ఇతడు తేజస్సుచే (ప్రతాపముచే భాస్కరుడట్లు లోకములందేరికి జూడ శక్యముగాకుండును. ఈ ప్రభువుం దర్శించి లోకము ప్రసన్నతను బొందును. అట్లు నేత్రానందమొనరించుటచే రాజు (చంద్రుడు) అగును. చారుల మూలమున నితడు స్వేచ్ఛగా సర్వలోకమును వ్యాపించును. గావున వైవస్వతుండు (కాలుండు) నగును. అపరాధులను దండించు గావునను నితడు దండధరుడు (యముడు) నగును. క్రోధబుద్ధులను తన మహిమచే తనకు దాగోరకుండగనే దహించుం గావున పావకుండు (పవిత్రముచేయు) వాడగు అగ్నియునగును. నృపుడన్నియెడల విసర్గము కొఱకు (తిరిగియిచ్చుటకొఱకు) ధనాదానమును (పన్నులరూపమున) జేయును. గాన ధనదుడగును. ధనధారల వర్షించి లోకము నాప్లావించుం గావున నయకోవిదులు రాజును వరుణడనిరి. క్షమాబలముగల మనస్సుచే సర్వప్రజల నొకేవిధముగా ధరించుటచే పార్థివుడు పార్థివుడగును. పృథివి ఓరిమిచే సర్వముంభరించుం గావున పృథివీ భావముగలవాడగును. ఆధిపత్యముచే నెల్ల జనులను పరిరక్షించుటచే సర్వభూతాను గ్రహ మొనరించు దేవేంద్రు డగును. ఉత్సాహ ప్రభుమంత్ర శక్తులు బూడును గూడ విష్ణుశక్తులే, దైవశక్తి నాలుగవది. అట్టి వైష్ణవశక్తి లేకుండ నెవ్వడు ప్రజలను రక్షింపగలడు? దండ ప్రణయనమును గురించి లెస్సగా వినగోరుచున్నాను. రాజు తన దేశములో దాను విధించు దండనీతి యచంచలమై యెట్లుండును? ఓ వీరాగ్రేసరా! నరేంద్రుడేరీతిగ దండమును ప్రణయించి (విధించి) ధర్మముతో గీర్తితో అర్థ కామపురుషార్ధములతో గూడుకొనునో యదెల్ల నాకానతిమ్ము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు దండ ప్రస్తుతియను డెబ్బది యొకటవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters