Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదియవ ఆధ్యాయము - దండోపాయప్రశంసా

పుష్కరః- నశక్యాయే స్వయంకర్తుం చోపాయ త్రితయేనతు | దండేన తాన్‌ వశీకుర్యాత్‌ దండోహి వశకృత్పరః || 1

సమ్యక్‌ ప్రణయనం తస్య సదా కార్యం మహీక్షితా | ధర్మశాస్త్రానుసారేణ సుసహాయేన ధీమతా ||

సమ్యక్‌ ప్రణయనం తస్యత్రిదశా నపి పీడయేత్‌ | వానప్రస్థాంశ్చ ధర్మజ్ఞః నిర్దేశా

న్నిష్పరిగ్రహాన్‌ ||

స్వదేశే పరదేశేచ ధర్మశాస్త్ర విశారదాః | సమీక్ష్య ప్రణయే ద్దండం సర్వం దండే ప్రతిష్ఠితమ్‌ ||

ఆశ్రమీ యది వా వర్ణీ పూజ్యోవాథ గురుర్మహాన్‌ | నాదండ్యోరామ! రాజ్ఞాతు యస్స్వంధర్మే నతిష్ఠతి ||

అదండ్యాన్‌ దండయన్‌ రాజా దండ్యాంశ్చైవాప్యదండయన్‌ | ఇహ రాజ్యపరిభ్రష్టో నరకం ప్రతి పద్యతే ||

తస్మాద్రాజ్ఞా వినీతేన ధర్మశాస్త్రనుసారతః | దండ ప్రణయనం కార్యం లోకానుగ్రహ కామ్యయా ||

యత్ర శ్యామో లోహితాక్షో దండ శ్చరతి నిర్భయః | ప్రజాస్తత్ర న ముహ్యన్తి నేతా చేత్సాధు పశ్యతి || 8

పుష్కరుండనియె:- సామదానభేదములను నుపాయ త్రితయముచేత లొంగనివారిని దండోపాయముచే లోపరచుకొనవలెను. దండము పరమవశీకరణోపాయము. భూపతి బుద్ధిశాలయై ధర్మ శాస్త్రముల ననుసరించి మంచి సహాయ సంపత్తి గలవాడై దండో పాయమును జక్కగ ప్రయోగింపవలెను. దాని సముచిత ప్రయోగము దేవతలను, వానప్రస్థులను, నిర్దేశులను, (ఇల్లువాకిలిలేనివారిని), నిష్పరిగ్రహులను, (భార్యపుత్రాదులు లేనివారిని) పరివ్రాజకులను (సన్న్యాసులను) అదుపులోకి తేగలదు. తనదేశమందు పరదేశమందు ధర్మశాస్త్రనిపుణలయినవారు చక్కగా సమీక్షించి (పరిశీలించి) దండము నుపయోగింపవలెను. రాజకార్యమెల్ల దండమునందు ప్రతిష్ఠితమయినది. ఆశ్రమి గాని (సన్యాసి) వర్ణీ (బ్రహ్మచారి) గాని, గృహస్థవాన ప్రస్థధర్మిగాని, పరమపూజ్యుడైన మహాగురువుగాని, స్వధర్మనిష్ఠుడుగాడేని, యతడు రాజుచే దండింప నర్హుడు. దండింప తగనివారిని దండించి దండ్యుల దండింపకయున్న రాజిహమందు రాజ్యభ్రష్ఠుడగును. పరమందు నరక మందును. కావున ధర్మశాస్త్రములకు విధేయుడై లోకానుగ్రహముకోరి రాజు దండ ప్రయోగ మొనంరింపవలెను. ఏదేశమందు దండుడు (దండాధిదేవత) శ్యాముడై (చామనచాయమేనివాడై) ఎఱ్ఱని కన్నులు కలిగి నిర్భయుడై సంచరించునో ఆదేశమందలి ప్రజలను నేత (అనగా నాయకుడు = రాజు) సరగి చూచునేని (చూచి దండప్రయోగము చేయునేని) ప్రజలు మోహము పొందరు. ధర్మమునుండి పొరబడరు.

బాల వృద్ధా7తురయతి ద్విజాతి వికలా7బలాః | మత్స్యన్యాయేన భ##క్షేరన్‌ యది దండో నపాలయేత్‌ || 9

దేవదైత్యోరగనరాః సిద్ధభూత పతత్రిణః | ఉత్క్రామేయుః స్వమర్యాదాం, యదిదండో న పాలయేత్‌ ||

ఏష బ్రహ్మాభిశాపేషు సర్వ ప్రహరణషు చ | సర్వ విక్రమకోపేషు వ్యవసాయే చ తిష్ఠతి ||

పూజ్యన్తే దండినో దేవాః న పూజ్యన్తే త్వదండినః | న బ్రహ్మాణం న ధాతారం న పూషా7ర్యమణా వపి ||

యజన్తే మానవాః కేచిత్‌ ప్రశాన్తాః సర్వకర్మసు | రుద్రమగ్నించ శక్రంచ సూర్యాచంద్రమాసౌ తథా ||

వివ్ణుం దేవ గణాంశ్చా7న్యే దండినః పూజయన్తిహి | దండః శాస్తి ప్రజాః సర్వాః దండ ఏవా7భిరక్షతి ||

దండ స్సుప్తేషు జాగర్తి దండం ధర్మం విదు ర్బుథాః | రాజదండ భయాదేవ పాపాః పాపం న కుర్వతే ||

యమదండభయా దన్యే పరస్పర భయాదపి | ఏవం సాంసిద్ధికే లోకే సర్వం దండే ప్రతిష్ఠితమ్‌ ||

అంధే తమసి మజ్జేయుః యదిదండో న పాలయేత్‌ | తస్మాద్దమ్యాన్‌ దమయతి ఉద్దండాన్‌ దండయత్యపి || 19

దమనా ద్దండనా చ్చైవ తస్మా ద్దండం విదుర్బుధాః ||

దండస్య భీతై స్త్రిదశై స్సమసై#్తః భాగో ధృతః శూలధరస్య యజ్ఞే | చక్రుః కుమారం ధ్వజనీపతించ | వరంశిశూనాంచ భయాద్బలస్థమ్‌ ||

ఇతి దండోపాప్రశంసానామ సప్తతితమో7ధ్యాయః.

రాజు దండమును సరిగా పాలింపడేని రాజ్యములోని బాలురు, వృద్ధులు, ఆతురులు (రోగాదిబాధలకు గురియైనవారు) యతులు, ద్విజులు, అంగవికలులు, దుర్బలులుంగూడ మత్స్యన్యాయమున (చిన్న చాపలను బెద్దచాపలు తినివేయునట్లు) ఒకరి నొకరు తినివేయుదురు. దేవదైత్యనాగ నర వర్గము, సిద్ధులు, భూతములు, పక్షులు, దండోపాయమును చక్కగా పాలించని రాజురాజ్యమందు తమ తమ మర్యాదను (హద్దును) అతిక్రమింతురు. ఈదండము నుపాయము బ్రహ్మనిందలందు, సర్వప్రహరణములందు (ఆయుధములందు) సర్వవిక్రమములందు, కోపావస్థలందు, వ్యవసాయమునందు (సర్వకార్యప్రయత్నములందు) రూపుగొనియున్నది. దండవంతులయిన దేవతలు పూజలనందుదురు. దండ రహితులు పూజింపబడరు. బ్రాహ్మణుని, ధాతను, పూషను, అర్యముని మానవులు కొందరు పూజింపరు. సర్వ కర్మములందును ప్రశాంతులయి యుండుటయే దానికి కారణము. రుద్రుని, అగ్నిని, శుక్రుని (ఇంద్రుని సూర్యుని, చంద్రుని, విష్ణుని, దేవగణములను, (దండాధికారులుగాన) వారిని పూజింతురు. దండమే సర్వప్రజలను శాసించును. దండమే సంరక్షించును. నిద్రవోయినవారి (అజ్ఞానుల) యెడల దండము మేలుకొని యుండును. బుధులు దండమునే ధర్మమని యెఱుగుదురు. రాజ దండమునకు జడిసియే పాపులు పాపము చేయరు. మఱియుంగొందరు యమదండమునకు వెఱచియు, ఒండొరులకు వెఱచియు తప్పిదములు సేయరు. ఈవిధముగ లోకమందు సర్వ సంసిద్ధమైన దండమునందు సర్వము ప్రతిష్ఠితమై యున్నది. (లోకస్థితికి దండమాధారమన్నమాట) దండము పాలింపదేని సర్వజీవులు గాఢాంధకారమందు మునిగి పోవుదురు. అందువలన దండ నీతి అణచవలసిన వారిని దమించును (అణచును) ఉద్ధతులను శిక్షించును. దమనమువలనను, దండమువలనను నది దండమనబడిన దని పండితులు యెఱుంగుదురు. సర్వదేవతలు దండమునకు హడలి దక్షయజ్ఞమందు శివునికి యజ్ఞభాగమిచ్చిరి. మఱియు శిశువరుడయిన కుమారుని (చంటిపిల్లవానిని) దండమునకు వెఱచియే బలమందున్న వానిని దమసేనాధిపతి గావించికొనిరి.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు దండోపాయ ప్రశంసయను డెబ్బదియవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters