Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏడవ యధ్యాయము - అగ్ర్యమహిషీలక్షణము

పుష్కరః- రాజ్ఞా7గ్ర్య మహిషీ కార్యా సర్వలక్షణ లక్షితా | వినీతా గురుభక్తాచ ఈర్ష్యా క్రోధ వివర్జితా || 1

రాజ్ఞః ప్రియహితా77 సక్తా చారువేశా ప్రియంవదా | భృతా7 భృత జనజ్ఞాచ భృతానా మనువేక్షిణీ || 2

అభృతానాం జనానాంచ భృతికర్మ ప్రవర్తినీ | రాగద్వేష వియుక్తా చ సపత్నీ నాం సదైవ యా || 3

భోజనాసన పానేన పరేషా మను వేక్షిణీ | సపత్ని పుత్రేష్వపి వా పుత్ర వత్పరివర్తతే || 4

మంత్రి సంవ్సరామాత్యా న్యా చ పూజయతే సదా | బ్రహ్మణ్యా చ దయా యుక్తా సర్వభూతా 7ను కంపినీ || 5

కృత్యా7 కృతజ్ఞా రాజ్ఞశ్చ విదితా మండలే ష్వపి | పరరాజ కలత్రేషు ప్రీయమాణా ముదాయుతా || 6

దూతాది ప్రేషణ కరీ రాజద్వారేషు సర్వదా | తద్ద్వారేణ నరేంద్రాణాం కార్యజ్ఞాచ విశేషతః || 7

ఏవం గుణగణోపేతా నరేంద్రేణ సహా7 నఘ | అభిషేచ్యా భ##వే ద్రాజ్యే రాజ్యస్థేన నృపేణ వా || 8

ఏవం యదా యస్య భ##వేచ్చ పత్నీ | నరేంద్ర చంద్రస్య మహానుభావా |

వృద్ధిం వ్రజేత్తస్య నృపస్య రాష్ట్రం సచారకం నాత్రవిచారణా7 స్తి || 9

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర ఖండే అగ్ర్య మహిషీలక్షణం నామ సప్తమో7ధ్యాయః.

పుష్కరుడనియె : సర్వలక్షణములచే బూజ్యురాలగు దేవి రాజున కగ్రమహిషిగా గావింపదగినది. ఆమె వినీత (వినయశీల) గురుభక్తురాలు ఈర్ష్య కోపము లేనిది రాజుకు ప్రియమునెడ హితవు సేయుటయందు నిమగ్నురాలు సుందరవేశధారిణి భృత్యా భృత్యవిచక్షణ బాగుగ తెలిసినది. అభృతులయిన జనమునుగూడ భ్భతికర్మయందు ప్రవర్తింపజేయునది (ఉద్యోగము లేనివారికుద్యోగ కల్పన సేయగలదన్న మాట) సవతులయెడ రాగద్వేషములులేనిది భోజనాపసన పానాదులయం దందరి పర్యవేక్షణమందు సవతి కొడుకులయెడ గూడ కొడుకులయందట్లు ప్రవర్తించునది. మంత్రుల సాంవత్సరుల (జ్యోతిశాస్త్ర పండితుల) అమాత్యులను బూజించునది. బ్రహ్మణ్యురాలు (సర్వము బ్రహ్మమయమను భావము గలది ) దయగలది సర్వ భూత దయావతి రోజుయొక్క కృతము (జరిగినపని) అకృతము( జరుగని కార్యము) బాగుగా తెలిసినది, మండలములందును జరుగు జరగని రాజకార్యములను దెలిసికొనునది, పర రాజుల భార్యలయెడ ప్రీతిగలది (ఆనందము పొందునది.) రాజద్వారములందు దూతలను మొదలయినవారిని బంపునది. ఆ దూతల ద్వారమున సర్వరాజుల కార్యజ్ఞానము విశేషించి తెలిసికొనునదియు నను నీ లక్షణములతోగూడిన అగ్ర్యమహిషి (మహారాజ్ఞి) రాజుతో పాటు రాజ్యపట్టాబిషేకము గావింపనైనది. నరేంద్రచంద్రుని కీలాటిది మహానుభావురాలు జ్యేష్ఠపత్నియగుచో ఆ రాజు యొక్క రాష్ట్రము చారులతోగూడి పెంపొందును. సందేహము లేదు.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున అగ్ర్య మహిషీలక్షణమను సప్తమాధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters