Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదితొమ్మిదవ అధ్యాయము - దానవిధి

పుష్కరః- సర్వేషా మప్యుపాయానాం దానం శ్రేష్ఠతమం మతమ్‌ | సుదత్తేనైవ భవతి దానేనో భయలోకజిత్‌ || 1

స నాస్తి రామ! దానేన వశగో యో న జాయతే | దానవాన్‌ గోచరం నైతి తథా రామాపదాం క్వచిత్‌ ||

దానవానేన శక్నోతి సంహతాన్‌ భేదితుం పరాన్‌ | యద్యప్యలుబ్ధా గంభీరకాః పురుషా స్సాగరోపమాః |

నగృహ్ణన్తి తధాప్యేతే జాయన్తే పక్షపాతినః | అన్యత్రాపి కృతందానం కరోత్యన్న్యాం స్తథా పరైః ||

ఉపాయేభ్యః ప్రయచ్ఛన్తి దానం శ్రేష్ఠతరం నరాః | దానం సర్వధనం శ్రేష్ఠం దానం శ్రేయస్కరం పరమ్‌ ||

దానవానేవ లోకేషు పుత్రవ త్ప్రీయతే సదా | నకేవలం దానపరా జయన్తి భూలోక మేనం పురుష ప్రవీర!

జయన్తితే రామ! సురేంద్రలోకం | సుదుర్జయం యద్విబుధాధివాసమ్‌ ||

ఇది శ్రీ విష్ణుధర్మో త్తరే ద్వితీయఖండే దానవిధిర్నామ ఏకోన సప్తతి తమో ధ్యాయః || 7

పుష్కరుడిట్లనియె:- పరశురామా! ఉపాయములలోకెల్ల దానము శ్రేష్ఠతమమైనది. చక్కగా నీయబడిన దానము చేతనే మానవుడు ఇహ పరలోకములను జయించును. దానమునకు వశముగాని వాడుండడు. దానగుణవంతుడు ఆపదల కెప్పుడును గుఱికాడు. కలసియున్న శత్రువులను భేదించుటకు దానవంతుడే సమర్థుడగును. సముద్రమువలె గంభీరులైన పురుషలు లౌభ్యము లేనివారై యుందురు. ధనము స్వీకరించరు. కాని దానవంతుని యందు పక్షపాతము గలవారగుదురు. పరులచేత నితరత్ర ఈయుబడిన దానము ఇతరులను గూడ పక్షపాతులనుగ జేయగలదు. జనులు ఆనేకోపాయముల మూలమున శ్రేష్ఠతరమైన దానము నిత్తురు. దానము శ్రేష్ఠమగు ధనము. దానము

మిక్కిలి శ్రేయోదాయకము. లోకమునందు దానవంతుడు మాత్రమే పుత్రునివలె సంతోషపెట్టును. ఓ పురుషోత్తమా! దానపరులు భూలోకమును మాత్రమే గాదు. దేవతానిలయమును నితరులకు జయింపనలవిగానిదియునగు దేవేంద్ర లోకము (స్వర్గము)ను గూడ జయింపగలదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ద్వితీయ ఖండమునందు దానవిధియను నరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters