Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదియాఱవ యథ్యాయము - పురుషకారము

రామః: దైవే పురుషకారే చ కిం జ్యాయ స్త ద్వదస్వ మే | అత్రమే సంశయో దేవ! సంశయ చ్ఛిద్బవాం స్థథా || 1

పుష్కరః : స్వమేవ కర్మ దైవాఖ్యం విద్ధి దేహాంతరార్జితమ్‌ | తస్మా త్పౌరుష మేవేహ శ్రేష్ఠ మాహు ర్మనీషిణః ||

ప్రతికూలం తథా దైవం పౌరుషేణ విహన్యతే | మంగళా చార యుక్తానాం నిత్య ముత్ఠాన శాలినామ్‌ ||

యేషాం పూర్వకృతం కర్మ సాత్వికం మనుజోత్తమ! పౌరుషేణ వినా తేషాం కేషాంచి ద్దృశ్యతే ఫలమ్‌ ||

కర్మణా ప్రాప్యతే లోకే రాజన్‌ ! సమ్య క్తథా ఫలమ్‌ | పౌరుషేణాప్యతే రామ! మార్గితవ్యం ఫలం నరైః ||

దైవ మేవ జానాతినరః పౌరుష వర్జితః | తస్మా త్సత్కార్య యుక్తస్య దైవంతు సషలం భ##వేత్‌ ||

పౌరుషం చైవ సంపత్త్యా కాలే ఫలతి భార్గప! దైవం పురుషకారశ్చ కాలశ్చ మనుజోత్తమ! ||

త్రయ మేత న్మనుష్యస్య పిండితం స్యా త్ఫలావహమ్‌ | కృషివృష్టి సమాయోగ ద్దృశ్యన్తే ఫల సిద్దయః |

తాస్తు కాలేన దృశ్యన్తే నైవాకాలే కథంచన | తస్మా త్స దైవ కర్తవ్యం సధర్మం పౌరుషం నృభిః ||

విపత్తా వపి యస్యేహ పరలోకే ఫలంధ్రువమ్‌ | నాలసాః ప్రాప్నువన్త్యర్థా న్నచ దైవ పరాయణాః || 10

తస్మా త్సర్వ ప్రయత్నేన పౌరుషే యత్న మాచరేత్‌ ||

త్యక్తాలసాన్‌ దైవపరాన్‌ మనుష్యాన్‌ | ఉత్థాన యుక్తాన్‌ వురుషాన్హి లక్ష్మీః |

అన్విష్య యత్నత్‌ వృణుతే ద్విజేంద్ర! | తస్మా త్సముత్థానవతా హి భావ్యమ్‌ || 11 1/2

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయు ఖండే-పురుషకారా7ధ్యాయో నామ షట్‌షష్టి తమో7ధా%్‌యః ||

పరశురాముడు దైవము పురుషకారము ననువానితో నేదియొక్కవదియను నా సందియమను వారింపుమన పుష్కరుండిట్లనియె. గడచిన శరీరములచే సంపాదించిన తన (చేసిన) కర్మయే దైవమనంబడునని యెరుంగుము. అందుచే బుద్ధిమంతులు పురుషకారమే శ్రేష్ఠమనిరి. శుభాచార సంపన్నులు నిత్యము కర్మాచారణమునందు మెళకువ స్వభావముగలవారి పౌరుషముచే (పురుష ప్రయత్నముచే) ప్రతికూలమయిన దైవము నిరోధింపబడును. (ఇక్కడ ప్రతికూలమనగా ప్రారబ్ధకర్మ రూపముగా మెదలయిన దుష్కర్మయొక్క ఫలము అదృష్టమనబడునది) పురుష ప్రయత్నముచే ''తచ్ఛాంతి రౌషధైర్దానైః జపహోమసురార్చనైః || ఔషధసేవనము దానములు సేయుట జపహోమాదులు చేయుటచే దేవతలనర్చించుటచే తరగిపోవునన్నమాట, క్రిందటి జన్మమందు జేసిన సాత్త్విక కర్మయిహ జన్మమందుగూడ దాని కనుకూలముగ పురుషకారము సేయనిచో ఫలము గనిపింపదు. కర్మము చేతనే లోకమందు ఫలము పొందరబడును, నరులు పురుషకారముచేతనే మార్గితము = వెదకినంగాని కానరాని కర్మఫలము నందగలరు. ఇక్కడ మార్గితవ్యమను పురుషకారము (పురుష ప్రయత్నము) సేయని మానవుడు దైవమునే యెరుంగడు. కావున శాస్త్రవిహిత కర్మాచరణము చేయు వానికి దైవము తనంత ఫలవంతమగును. భార్గవ రామ! పౌరుషము సమగ్ర సంపత్తిగొని కాలమువచ్చినపుడు ఫలించును. దైవము పురుషకారము కాలమునను నీమూడు నొండొంటినత్తుకొని మనుజునకు ఫలముంజేకూర్చును. కృషి (వ్యవసాయము) వృష్టి (సకాలవర్షము) రెండును కలిసినపుడే లోకమునందు పంటలు పండుట కానవచ్చుచున్నది, అవికూడ కాలమునందే (కాలముకలిసినపుడే) కనబడుచున్నవి. అకాలమందు పంట పండదుగదా! అందువలన నరులు ధర్మానుగుణముగ పౌరుషమెప్పుడు నవశ్య మాచరింపవలసినది. ఒకవేళ నాకర్మఫలమున కిక్కడ (ఇహమందు) విఘాతము గల్గినను పరలోకమందది ఫలించుట నిశ్చయము. కర్మప్రవృత్తి లేని సోమరులు కర్మప్రయోజనమునందరు. కేవలమన్నింటికి దైవమేయని కూర్చున్నవారును ఫలమందురు. అందుచే నెల్ల ప్రయత్నముచే పురుషకారమందు యత్న మాచరింపవలెను అలసత్వము విడిచి ఉత్థాన ఫరులయి నిలువబడిన (కర్మాచరణమునందు మెళకువగొని యున్నవాడై) దైవమును గూడ నమ్ముకొని యున్న వారిని లక్ష్మియత్నపడి వెదకి కొని వరించును. కావున మానవుడు నిత్యమును సముత్థానవంతుడు (విధి విహితకర్మాచరణ మునకు నడుమగట్టుకొని నిలువబడువాడు) గావలయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పురుషకారాధ్యాయమను నరువదియారవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters