Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదియైదవ యధ్యాయము - రాజధర్మ వర్ణనము

పుష్కరః- ఏవం కుర్యా త్సదా స్త్రీణాం రక్షణం పృథివీపతిః | న చేమాం విశ్వసే జ్ఞాతు పుత్ర మాత్రా విశేషతః || 1

న స్వపేత్‌ స్త్రీగృహే రాత్రౌ విశ్వాసం కృత్రమం భ##జేత్‌ | రాజపుత్రస్య దీక్షా చ కర్తవ్యా పృథివీక్షితా ||

ఆచర్యై శ్చాస్య కర్తవ్యం నిత్యం యుక్త్యైవ రక్షణమ్‌ | ధర్మార్థ కామమోక్షాణాం, ధనుర్వేదం చ శిక్షయేత్‌ ||

రథేశ్వే కుంజరే చైనం, వ్యాయామం కారయేత్‌ సదా| శిల్పాని శిక్షయే చ్చైవ మాపై#్త ర్మిథ్యా ప్రియం వదైః ||

శరీర రక్షా వ్యాజేన రక్షిణోస్య నియోజయేత్‌ | న చాస్య సంగో దాతవ్యః క్రుద్ధలుబ్ధ విమానితైః ||

తథా చ వినయే దేనం యథా ¸°వనగం సుఖే | విషయై ర్యైర్న కృష్యేత సతాంమార్గాత్‌ సుదుర్గమాత్‌ ||

గుణాధానం న శక్యం తు యస్య కర్తుం స్వభావతః | బంధనం తస్య కర్తవ్యం గుప్తదేశే సుఖాన్వితమ్‌ ||

అవినీత కుమారం హి కుల మాశు విశీర్యతే | అధికారేషు సర్వేషు వినీతం వినియోజయేత్‌ ||

పుష్కరుడనియె. అంతఃపురస్త్రీరక్షణము రాజీవిధముగా జేయవలెను. తల్లి కొడుకులనియేని నమ్మకము గొనరాదు. స్త్రీ గృహమందు రాత్రి పరుండరాదు. కపట విశ్వాసము చూపవలెను. రాజపుత్రుని యోడగూడ తగిర రక్ష యేర్పరుప వలెను. రాజ కుమరుని రక్షణ ఆచార్యుల మూలమున యుక్తితో నిర్వహింపవలెను. రాజపుత్రునకు ధర్మార్ధ కామమోక్షములందు ధనుర్వేదమునందు శిక్షణ యీయవలెను. గజాశ్వ రథారోహణములందు శిక్షణ నిప్పించి వ్యాయామము సేయింపవలెను. అసత్యములయిన బ్రియములను బలుకుచు ఆప్తుల ద్వారా (యథార్థము చెప్పువాడు ఆప్తుడు) రాజకుమానికి శిల్ప విద్యలయందు శిక్షణ యిప్పించవలెను. శరీరరక్షణ కొరకన్న నెపమున రాజసుతన కంగరక్షకుల నేర్పరుప వలెను. ఈతనితో కోపిష్ఠులు, లుబ్ధులు, రాజావమానితులు నగు వారిని జత గూడకుండ జూడవలెను. ¸°వనము వచ్చిన రాజకుమారుని సత్పురుషుల పరమ దుర్గమ మార్గము నుండి దప్పకుండ విషయాకృష్ణుడు (భోగలాలసుడు) గాకుండ నుండునట్లు తగురీతిని వినయింపవలెను. (శిక్షణయీయ వలెను) వాని యందుత్తమ గుణాధానమ శక్యమయ్యెనేని వానిని రహస్యప్రదేశమందు పరమ సుఖముగా నుండునట్లు కట్లుబాటు చేయవలెను. అవినీతుడైన రాజ కుమారుడుగల కులము త్వరలో నశించును. అన్ని అధికారములందును వినీతుడగు (సుశిక్షితుని) కుమారుని నియోగింపవలెను.

అదౌ స్వల్పే తతః పశ్చాత్‌ క్రమేణాథ మహత్స్వపి | మృగయా పాన మక్షాంశ్చ వర్జయేచ్చ మహీపతిః ||

ఏతాన్‌ సంసేవ్యమానాస్తు వినష్ఠాః పృథివీక్షితః | బహవో భృగు శార్దూల! యేషాం సంఖ్యా న విద్యతే || 10

దివాస్వాపం వృథావాదం విశేషేణ వివర్జయేత్‌ | వాక్పారుష్యం న కర్తవ్యం దండ పారుష్య మేవ చ ||

పరోక్షనిందా చ తథా వర్జనీయా మహీక్షితా | అర్థస్య దూషణం రామ! ద్విప్రకారం వివర్జయేత్‌ ||

అర్థానాం దూషణం చైకం తథా చార్థేన దూషణమ్‌ | ప్రాకారాణాం సముచ్ఛేదో దుర్గా దీనాం సమక్రియా ||

అర్థానాం దూషణం ప్రోక్త విప్రకీర్ణత్వ మేవ చ | ఆదేశ కాలే యద్దాన మపాత్రే దాన మేవ చ ||

అర్థైస్తు దూషణం ప్రోక్త మసత్కర్మ ప్రవర్తనమ్‌ | కామః క్రోధో మదో పానం లోభో హర్ష స్తథైవ చ

జేతవ్య మరిషడ్వర్గ మాహుస్తు పృధీవీక్షితామ్‌ | ఏతేషాం విజయం కృత్వా కార్యో భృత్య జయ స్తతః ||

కృత్వా భృత్య జయం రాజా పౌర జానపదాన్‌ జయేత్‌ | కృత్వా చ విజయం తేషాం శత్రూన్‌ బాహ్యాం స్తతోజయేత్‌ ||

బాహ్యాశ్చ త్రివిధా జ్జేయా స్తుల్యానన్తర కృత్రిమాః | గురువస్తే యథా పూర్వం తేషు యత్న స్సదా భ##వేత్‌ || 18

ముందు చిన్న చిన్న పనులందు తరువాత తరువాత మధ్యమోత్తమ కార్య నిర్వహణము నందు గ్రమముగా రాజపుత్రుని నియోగింపవలెను. రాజు వేటపానము అక్షక్రీడ (ద్యూతము) మానవలెను. వీనిని సేవించి రాజులు పెక్కురు నష్టముల పాలైరి. వారి లెక్క యింత యని లేదు. పగటి నిద్ర, వృథావాదము, వాక్పారుష్యము దండ పారుష్యము, చాటున నిందించుట, రాజునకు పరమ నింద్యములు. అర్థదూషణము రెండు రకములు. అర్థాపేక్షతో నిందించుటయు అర్థములనిందించుటయు ననునవి. వానిని రాజు వర్జింపవలెను. ప్రాకారములను గూల్చుట, దుర్గములను (కోటలను) నేలమట్టము సేయుటకు ననునది యర్థదూషణ మనుబడును. విప్రకీర్ణత ధనములను విచ్చలవిడిగా జిమ్మివేయుట (యనియు) దీని నందురు. దేశకాల పాత్రములరయ కుండ దానము సేయుట, అర్థముల దూషణమనబడును. అసత్కర్మ ప్రవర్తనముకూడ రెండవ రకమైన యర్థదూషణము. కామక్రోధ లోభ మోహమద హర్షములను నారుగుణములను రాజు నిగ్రహించు కొనవలెను. అరిషడ్వర్గముం జయించి యా మీద భృత్యజయము సేయవలెను. తానదుపులో నుండి తన సేవకులనదుపులో బెట్టవలెనన్నమాట. రాజు భృత్యజయము సేసి యామీద పౌరులను జానపదులను గ్రామ ప్రజలను జయింపవలెను. బాహ్య శత్రువులగు వారి జయించిన ప్రభువంతశ్శత్రువుల నవశ్యము జయించును.సర్వ విజయమగును. బాహ్య శత్రువులు తుల్యులు అనంతరులు కృత్రిములునను మూడురకములవారు. వారిలో నొకరి కంటె నొకరుగా ముందటి వారు ప్రబలులు వారియెడల సప్రయత్నముగ జాగరూకుడై యుండవలెను.

పితృ పైతామహం మిత్ర మాశ్రితం చా తథా రిపోః | కృత్రిమం చ మహాభాగ! మిత్రం త్రివిధ ముచ్యతే ||

తథాపి చ గురుః పూర్వం భ##వేత్త త్రాపి చ శ్రితమ్‌ | స్వామ్య మాత్య జనపదా బలం దుర్గం తథైవ చ || 20

కోశో మిత్రం చ ధర్మజ్ఞ! సప్తాంగం రాజ్యముచ్యతే| సప్తాంగ స్యాపిరాజ్యస్య మూలం స్వామి ప్రకీర్తితః ||

తన్మూలత్వా త్తథాంగానాం సతు రక్ష్యః ప్రయత్నతః | షడంగ రక్షా కర్తవ్యా తేన చాపి ప్రయత్నతః ||

అంగేభ్యో యస్త్వథైకస్య ద్రోహ మాచరతే ల్పధీః || వధ స్తస్య తు కర్తవ్యః శీఘ్ర మేవ మహీక్షితా ||

న రాజ్ఞా మృదునా భావ్యం మృదుర్హి పరిభూయతే | నభావ్యం దారుణనా పి తీక్ష్నాదు ద్విజతే జనః ||

కాలే మృదు ర్యో భవతి కాలే భవతి దారుణః | రాజా లోక ద్వయాపేక్షీ తస్య లోక ద్వయం భ##వేత్‌ ||

భృత్యై స్సహ మహీపాలః పరిహాసం వివర్జయేత్‌ | భృత్యాః పరిభవన్తీహ నృపం హర్ష లసత్కథమ్‌ ||

వ్యసనాని చ సర్వాణి భూపతిః పరివర్జయేత్‌ | లోక సంగ్రహణార్థాయ కృతక వ్యసనీ భ##వేత్‌ ||

అట్లే మిత్రులు పితృ పితామహులకు సంబంధించిన వారు, అశ్రితులు, కపటియను మూడు రకములుగా వుందురు. వారిలో ఆశ్రితుడైన మిత్రుడు గురు మిత్రుడు. అనగా నీ ముగ్గురిలో నతడు శ్రేష్ఠుడు. పితృపితామహ సంబంధులు జ్ఞాతిత్వము చేతను, కపటవృత్తిచే మూడవ వాడు రాజునకు మిత్ర కోటిలో జేరుదురన్న మాట. రాజు, మంత్రి, ప్రజలు, సేన, కోట, కోశము, మిత్రవర్గము, నను సప్తాంగములు గలది రాజ్యము, వానికి మూలము రాజుగావున రాజు రక్షణ యీయవలసినవాడు. రాజు కూడా ఈ సప్తాంగములను గాపడు కొనవలెను. ఈ రాజ్యాంగములకు రాజునకు ద్రోహము సేయు నీచునికి మరణదండనము కంటె దక్కువ శిక్షలేదు. రాజు మృదవయి (మెత్తనయి) యుండరాదు. మృదువయిన రాజు పరాభవింపబడును. ఆట్లని రాజు దారుణుడుం గాకూదుడరు. తీక్ష ప్రవృత్తి గల రాజునెడ జనులుణద్వేగమందుదురు. (బెదరి పోవుదురు) సమయానుకూలముగ మృదువు తీక్ష్నుడునయిన రాజిహ పరముల రెండింటిని జూరగొనగలడు. రాజు భృత్యులతో పరిహాసములాడరాదు. ఇచ్చకములాడు రాజును భృత్యులు పరాభవింతురు, రాజు సర్వవ్యసనములను విడువవలెను, లోక సంగ్రహము కొఱకు ప్రజల నున్ముఖులంజేసి కొనుటకు వ్యసవంతుడు వలె ప్రవర్తింపవలెను.

శౌండీర్యస్య నరేంద్రస్య నిత్య ముత్‌క్షిప్త చేతసః | జనో విరాగ మాయాతి సదా దుస్సేవ్య భావతః ||

స్మిత పూర్వాభి ఖాషీ స్యా త్సర్వసై#్యన మహీపతిః | మధ్యేష్వపి మహాభాగః భ్రకుటిం న సమాచరేత్‌ ||

జూదము వేట మొదలయిన వినోదముల యెడ రాజు ప్రవర్తించుట కేవలము సామాన్య ప్రజానీకమున కందుబాటులో నుండి వారినుల్లసింప జేయుటకే కాని దానిలో రాజు సక్తుడు గాకూడదన్నమాట. చిరునవ్వుతోనే నందరితో సంభాషింప వలెను. కనుబొమ్మలు మధ్యయందు చిట్లించ కూడదు.

భావ్యం ధర్మ భృతాం శ్రేష్ఠ! స్థూల లక్ష్యేణ భూభూజా! స్థూల లక్ష్యస్య వశగా సర్వా భవతి మేదినీ || 30

అదీర్ఘ సూత్రస్య భ##వేత్‌ సర్వకర్మసు పార్థివః | దీర్ఘసూత్రస్య నృపతేః కర్మహాని రవ్భేద్ధ్రువమ్‌ ||

రాగే దర్పే చ మానే చ ద్రోహే పాపే చ కర్మణి | అప్రియే చైవ వక్తవ్యే దీర్ఘ సూత్రః ప్రశస్యతే ||

రాజ్ఞా సంవృత మంత్రేణ సంభావ్యం ద్విజ సత్తమ | తస్యాసంవృత మంత్రస్య జ్ఞేయః సర్వాపదో ధ్రువాః ||

కృతాన్యేవ హి కర్మాణి జ్ఞయన్తో యస్య భూపతేః | నారబ్ధాని మహా భాగ! తస్య స్యా ద్వసుధా వశే ||

మంత్ర మూలం సదా రాజ్యం తస్మా న్మంత్రః సురక్షితః | కర్తవ్యః పృధివీ పాలై ర్మంత్ర భేద భయా త్సదా ||

మంత్ర విత్సాధితో మంత్రః సంయతానాం సుఖావహః మంత్ర భేదేన బహవో వినష్టాః పృధవీక్షితః ||

ఆకారై రింగితైర్గత్యా చేష్టయా భాషితేన చ | నేత్ర వక్త్ర వికారైశ్చ జ్ఞాయతేంతర్గతం మనః ||

భూపతి యెప్పుడును స్థూల లక్ష్యముతో ప్రవర్తించ వలెను. అట్టి వానికి సమస్త భూమియు వశమున నుండును, రాజు సర్వకర్మములయందు దీర్ఘసూత్రుడు కాగూడదు. దీర్ఘసూత్రుడగు రాజునకు తప్పక కార్యభంగమగును. రాగము, దర్పము, మానము, ద్రోహము, పాపమునగు కర్మయందును, అప్రియమును చెప్పటయందును. దీర్ఘసూత్రుడు (కాలయాపన చేయువాడు) ప్రశంసింపబడును. బ్రాహ్మణోత్తమా! రాజెప్పడును గుప్తమగు నాలోచన గలవాడుగ నుండవలెను. అట్లు కాని వానికి ఆపదలు తప్పవు కర్మలు చేయబడిన తరువాతనే వ్యక్తములు కావలెను గాని ప్రారంభింపక పూర్వము ఎవ్వరికిని తెలయకూడదు. అట్టి రాజునకు భూమి వశమగును. రాజు మెల్లప్పుడను మంత్రము (ఆలోచన) మిదనే ఆధారపడి యున్నది. కావున రాజులు మంత్రభేదము మెక్కడ కలుగునో యనుభయముతో మంత్రమును రక్షించవలెను. మంత్ర మెఱింగిన వానిచే సాధితమైన మంత్రము సుఖావహమగును. అనేక భూపాలురు మంత్రభేదము (ఆలోచన బయటపడుట) వలన నష్టపడిరి. ఆకారములచేతను, మాటలచేతను ప్రవర్తన (నడవడి) చేతను, చేష్టచేతను, మాటలచేతను, నేత్ర ముఖ వికారములచేతను మనోగత భావము తెలియనగును.

నయస్య కుశ##లై స్తస్య వశే సర్వా వసుంధరా | భవతీహ మహీభర్తుః సదా భార్గవ నందన! ||

నైకస్తు మంత్రయే న్మంత్రం నరాజా బహుభి స్సహ | బహుభి ర్మంత్రయే త్కామం రాజామంత్రాన్‌ పృథక్‌ పృథక్‌ ||

మంత్రిణా మపి నోకూర్యా న్మంత్రీ మంత్ర ప్రకాశనమ్‌ | క్వచిత్‌ కశ్చిచ్చ విశ్వాస్యో భవతీహ సదా నృణామ్‌ || 40

నిశ్చయశ్చ తథా మంత్రీ కార్య ఏకేన సూరిణా | భ##వేద్వా నిశ్చయావ్యాప్తిః పరబుద్ధ్యుప జీవనాత్‌ ||

ఏకసై#్యన మహీభర్తుః భూయః కార్యే సునిశ్చితే | బ్రాహ్మణాన్‌ పర్యుపాసీత త్రయ్యాం రామ! మునీంశ్చ తాన్‌ |

నాసచ్ఛాస్త్ర రతాన్‌ మూఢాన్‌ తేహి లోకస్య కంటకాః | వృద్ధాంశ్చ నిత్యం సేవేత విప్రాన్‌ వేదవిదః శుచీన్‌ ||

తేభ్యోహి శిక్షే ద్వినయం వినీతాత్మాహి నిత్యశః | సమగ్రాం వశగాం కుర్యాత్‌ పృధివీం నాత్ర సంశయః ||

బహవోవినయా న్నష్టాః రాజాన స్సపరిచ్ఛదాః | వనస్థాశ్చైవ రాజ్యాని వినాయాత్‌ ప్రతిపేదిరే ||

నీతికోవిదుల సలహాలననుసరించు భూపతి నీ సర్వ వసుంధరయు యుండును. రాజు తానొక్కడుగా కార్యాలోచన సేయరాదు. పెక్కుమందితోడ జేయనురాదు. ఒక్కొక్కరితో వేర్వేర దానొక్కడై కార్యాలోచనసేయ వలెను. మంత్రులకుగూడ మంత్రమును (ఆలోచనమును) వెల్లడింపరాదు. మానవులలో నెవ్వడో యెక్కడనో యొక్కడు విశ్వసింప దగినవాడు (నమ్మదగినవాడు) ఉండును. పెక్కుమందికంటె నొక్క పండితుని సలహాననుసరించి కార్య నిశ్చయము సేవలెను. ఇతరుల బుద్ధిమీదనే కేవలమాధారపడిన యెడల కార్యనిశ్చయము దొరకదు. కార్యముయొక్క పరమావధి నిశ్చయ మొక్క రాజుమీదనే యాధారపడి యుండవలెను. అందులకు రాజు మునులను వేదవిదుల నుపాసించవలెను. అంతియకాని అసచ్ఛాస్త్రా సక్తులను (బౌద్ధచార్వా కాది శాస్త్రములందభిరుచి గలవారిని) రాజుపాసింప రాదు. వాండ్రు లోక కంటకులు. (లోక స్థితిని దారుమారు చేయుదురన్నమాట.) ఆచారవంతులై ధర్మాధర్మములను దెలుపు త్రయీవిద్యను వేదములను సమగ్రముగ నెరిగిన విప్రులను, అందులోగూడ వృద్ధులను ప్రభు వుపచరింపవలెను, వారివలన తాను వినయము నలవరచునుకొను. ఆవిధమున నిత్యము వినయవంతుడైన తాను సమగ్ర భూమండమలమును స్వాధీనము సేసికొన గల్గును. ఇందు సందియము లేదు. అవినయమువలన నెందరో రాజులు సపరివారముగ నాశన మొందిరి. వినయ శీలు రడవులలో నుండియు రాజ్యములం బడసిరి.

త్రైవిద్యేభ్య స్త్రీయీం విద్యా ద్దండనీతిం చశాశ్వతీమ్‌ | ఆన్వీక్షికీం చాత్మవిద్యాం వార్తారంభం చ లోకతః ||

ఇంద్రియాణాం జయే యోగం సమాతిష్దేద్టివానిశమ్‌ | జితేంద్రియోహి శక్నోతి వశేష్థాపయితుం ప్రజాః ||

యజేత రాజా క్రతుభి ర్బహుభి శ్చాప్త దక్షిణౖః | ధర్మార్థం చైవ విప్రేఖ్యో దద్యా ద్భోగాన్‌ ధనాని చ ||

సాంవత్సరికై రాపై#్తశ్చ రాష్ట్రా దాహారయే ద్బలిమ్‌ | స్యాచ్చామ్నాయపరో లోకే వర్తేత పితృవన్నృషు ||

ఆవృతానాం గురుకులా ద్ద్విజానాం పూజనం భ##వేత్‌ | నృపాణా మక్షయో హ్యేషః నిధి ర్బ్రాహ్మో విధీయతే || 50

న తం స్తేనా నాప్యమిత్రాః హర న్తి న చ నశ్యతి | తస్యాద్రాజ్ఞా నిధాతవ్యో బ్రాహ్మణ ష్వక్షయో నిధిః ||

నమోత్తమాధమై రాజా హ్యాహుతాః పాలయన్‌ ప్రజాః || న నివర్తేత సంగ్రామాత్‌ క్షాత్ర వ్రత మనుస్మరన్‌ ||

సంగ్రామే ష్వనివర్తత్వం ప్రజానాం పరిపాలనమ్‌ | శుశ్రుషా బ్రాహ్మణానాం చ రాజ్ఞాం నిశ్శ్రేయసం పరమ్‌ ||

కృఫణా నాం చ వృద్దానాం విధవానాం చ యోషితామ్‌ | యోగం క్షేమం చ వృత్తిం చ తథైవ పరికల్పయేత్‌ ||

వర్ణాశ్రమ వ్యవస్థా తు తథా కార్యా విశేషతః | స్వధర్మ ప్రచ్యుతాన్‌ రాజా స్వధర్మే వినియోజయేత్‌ || 55

త్రైవిద్యులవలన (మూడు వేదములెరిగిన వారివలన) త్రయీ విద్యను (వేదజ్ఞానమును) శాశ్వతియైన దండనీతిని ఆన్వీక్షకి యను విద్యను (దండనీతిని) ఆత్మవిద్యను బ్రహ్మవిద్య వేదాంతమును) లోకమువలన వార్త అర్థానర్ధములందెలుపు శాస్త్ర మునను నెరుంగవలెను. ఇంద్రియ జయమున కవసరమైన యోగశాస్త్రమును రేయింబవళ్ళభ్యాసము సేయవలెను. ఇంద్రియుముల వశము సేసికోన్నరేడు ప్రజలను దన వశమును నల్పుకొనగలడు. సంపూర్ణ దక్షిణులతోరాజు పెక్కు క్రతువులు సేయవలెను. ధర్మనిమిత్తముగ విప్రులకు భోగములను ధనములనీయ వలెను. అప్తులచే దైవజ్ఞులచేత (జ్యోతిషికాదులవలన) రాష్ట్రమునుండి బలిని గైకొనవలెను. కేవలము వేదపరుండయి (వేదవిహిత కర్మానుష్ఠుడై) ప్రజల యెడల దండ్రియట్లు వర్తింపవలెను. గురుకుల మందుండి మరలివచ్చిన విద్యాస్నాతకులను బూజింపవలెను. ఈ విద్యాస్నాతకుల పూజ రాజులకు ఆక్షయ బ్రహ్మ్యనిధి = తరుగని బ్రహ్మసంపద. సమానులు ఉత్తములు అధములునగు వారిచే నాహ్వానింప బడిన రాజు సమోత్తమాధములయిన ప్రజలనందరను బాలించ వలెను. రాజు క్షత్రధర్మమును జ్ఞప్తిలో నుంచుకొని యుద్ధమునుండి వెనుదిరిగి పారిపోయి రాగూడదు, శశ్రూష రాజులకు పరమ శ్రేయస్సంపాదకము. దీనులు వృద్ధులు అనాధలయిన స్త్రీలకుయోగము = లబింపని వస్తువును లభింపజేయుట, క్షేమముకులభించిన వస్తువుల సంరక్షణమును జేయుచు వారివృత్తి కల్పనము (బ్రతుకుతెరువు) చూపవలెను అన్నిటికంటె విశేషముగ వర్ణవ్యవస్థ ఆశ్రమ వ్యవస్థయు చెడకుండ కట్టుదిట్టముగ గాపాడవలెను. స్వధర్మము (స్వమతము) నుండి భ్రష్టులయిన వాండ్రను స్వధర్మమునందు నడపింపవలెను.

ఆశ్రమేషు యథాకాలం తైల భోజనమ్‌ | స్వయ మేవ నయే ద్రాజా సత్కృతా న్నవమన్య చ ||

తాపసే సర్వకార్యాణి రాజ్య మాత్మాన మేవ చ | నివేదయే త్ప్రయత్నేన దేవ వచ్చైన మర్చయేత్‌ ||

ద్వేప్రజ్ఞే వేదితవ్యే చ ఋజ్వీ వక్రా చ మానవైః | శఠాన్‌ జ్ఞాత్వా న సేవేత ప్రతిబోధం తదా గతాన్‌ ||

నాస్య ఛిద్రం పరో విద్యాత్‌ విద్యా చ్ఛిద్రం పరస్య తు | గూహే త్కూర్మ ఇవాంగాని రక్షే ద్వివర మాత్మనః ||

న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్‌ | విశ్వాసా ద్భయ ముత్పన్నం మూలాన్యపి నికృంతతి || 60

విశ్వాసయే చ్చాపి పరం తత్త్వ బూతేన హేతునా | బక వచ్చింతయే దర్థాన్‌ సింహవచ్చ పరాక్రమేత్‌ ||

వృకప చ్చావలుంపేత శశవచ్చ వినిష్పతేత్‌ | దృఢ ప్రహారీ చ భ##వే త్తథా సూకరవ న్నృపః ||

చిత్రాకారశ్చ శిఖివ ద్దృఢ భక్త స్తథాన్ధవత్‌ | భ##వేచ్చ మథురాభాషీ శుక కోకిల వన్న్పపః ||

కాకశంకీ భ##వేన్నిత్య మజ్ఞాత వసతిం వసేత్‌ | నాపరీక్షిత పూర్వం చ భోజనం శయనం స్ప్పళేత్‌ || 64

ఋష్యాశ్రమములందు సమయముదప్పకుండ నూనె నెయ్యి వంటపాత్రలను భోజనములను దానేస్వయముగ పరిశీలించి సమకూర్చవలెను. సత్కారార్హులను లేదా తాను తానుసత్కరించువారిని నవమానింపరాదు. తేలికగా చూడరాదు. తపస్వికి సర్వకార్యములను రాజ్యమును తననుగూడ ప్రయత్న పూర్వకముగా (వారి సమయమునకనుగ్రహమునకు వేచియుండి సమయము కనిపెట్టి నివేదించుకొన వలెను. ఈయనను దైవము నట్లర్చించవలెను. రాజు తెలిసికొనవలసిన ప్రజ్ఞలు (తెలుపుట) రెండు. ఒకటి సూటియైనది రెండవది వక్రము (వంకర) అయినది. అందుచేరాజు అతితెలివిగల శఠ బుద్ధులను గమనించివారిని సేవింపరాదు. (శఠుడు = రహస్యము గాన ప్రియములు సేయువాడు) ఈరాజుయొక్క ఈతని ఛిద్రము = లోపము నితరు డెరుగగూడదు. ఇతడితరుని ఛిద్రము నెరుంగవలెను. తాబేలంగములను ముడిచి కొన్నట్లు తన గుట్టును దాను దాపరికము సేసికొనవలెను తన వివరమును (తనయిరుకును) దాను రక్షించు కొనవలెను. తనయెడ విశ్వాసపములేని వానిని విశ్వసింపరాదు (నమ్మరాదు) ఎవ్వనినైన మిక్కలిగ నమ్మరాదు. నమ్మగూడనివాని నమ్ముటవలన ఘోరమైన భయము పుట్టును. అది రాజును సమూలము పెల్లగించును. తత్త్వభూతమైన హేతువుతో యధార్థమయినకారణముతో ధర్మసమ్మతమైన హేతువాదము (తర్కము)చేసి యితరుని నమ్మింపవలెను. (కృత్రమ కారణములు చెప్పిప రుని నమ్మింపరాదు) కొంగవలెను. అర్థహులను (రాజ్యంగవిషయములను) చింతింపవలెను. కొంగచేప పట్టుపడుదాక కదలక మెదలకతదేక దృష్టితో ధ్యానము సేయుచు నిలిచినట్లు (కార్యము పట్టు దొరుకుదాక నిష్ఠతో దిలకించు చుండవలెనన్నమాట.) సింహమట్లు పరాక్రమింపవలెను. వృకమెట్లు (తోడేలుమేక పిల్లనట్లు) ఎదురి వానిని మ్రింగవలెను. శశమట్లు (కుందేలువలె) ఎదరిపై దూకవవలెను. సూరకమట్టు గట్టిక దెదీయవలెను. నెమలియట్లు చిత్రవిచిత్రాకారుడై మసలవలెను. గ్రుడ్డివాడట్టు ధృఢభక్తి గల్గియుండవలెను. చిలుక కోకిలవలె మధురభాషిగావలెను. కాకియట్లెల్లెడ శంకించు చుండవలెను. కాకి పరిసరమలు నుండ గంట నూరక మిలమిల జూచుచుండునట్లు జాగరూకుడై పరిస్థితులం గని పెట్టుచుండవలెనన్న మాట. తెలియనిచోట వసింపరాదు. మున్ముందు పరీక్షింపని భోజనమును యనమును దాకగూడదు. వస్త్రము పువ్వు అలంకారము మరియే వస్తువుగాని తొలుగ పరీక్షింపని దానిని స్వీకరింపరాదు. జనసమ్మర్దములో జొరబడరాదు. తెలియని నదిలో చెరువులో దిగరాదు.

వస్త్రం పుష్పమలంకారం యచ్చాన్య న్మనుజోత్తమ! | న గా హేజ్జన సంబాధం న చాజ్ఞాతం జలాశయమ్‌ ||

నాపరీక్షిత పూర్వైస్తు పురుషై రాప్తకారిభిః | నారోహే త్కుంజరం వ్యాళం చాదన్తం తురంగం తథా ||

నావిజ్ఞాతం స్త్రియం గచ్ఛే న్నైవ చాశుభ వాససమ్‌ | నారోహే ద్విషమాం నావం నా పరీక్షిత నావికామ్‌ ||

యే చాస్య భూమిం జయతో భ##వేయుః పరిపంథినః | తా నానయే ద్వశం సర్వాన్‌ సామాదిభి రుపక్రమైః ||

యథా న స్యా త్కృశీభావః ప్రజానా మనవేక్షయా | తథా రాజ్ఞా విధాతవ్యం స్వరాష్ట్ర పరిరక్షితా ||

మోహాద్రాజా స్వరాష్ట్రం యత్‌ కర్షయ త్యనవేక్షయా | సోచిరాద్భ్రంశ##తే రాజ్యా జ్జీవనాచ్చ సబాంధవః || 70

భృతో వత్సో జాతబలః కర్మయోగ్యో యథా భ##వేత్‌ | తథా రాష్ట్రం మహాభాగ! భృతం కర్మ మహా ద్భవేత్‌ ||

యో రాష్ట్ర మనుగృహ్ణాతి రాజా సుపరిరక్షతి | తం ప్రజా శ్చోప జీవన్తి విందతే సుమహత్‌ ఫలమ్‌ || 72

ఆప్తకారులగు మనుష్యులు మున్ను పరీక్షించని యేనుగు నెక్కరాదు. శిక్షింపబడని వ్యాళమును (క్రూరమృగమును) ఏనుగును నెక్కరాదు. ఎరుగని స్త్రీని పొందరాదు ఆశుభము (మలినము) అయిన చీరగట్టుకొన్న దానితో గలియరాదు. సరంగుగట్టివాడు సరియైనవాడు నగుతో తెలియనది, ఒడుదుడుకులైనదియునగు పడవ నెక్కరాదు. సకలభూవిజయము సేయు నీ రాజునకు శత్రువు లెందరో యుందురు. వారిని సామాదిచతుర్వి ధోపా యోప క్రమములచే స్వాధీనపరచుకోవలెను. తన రాష్ట్రమును జక్కగా పరిరక్షించుచు ప్రజలను సరిగా జూడలేదనుభావము రాకుండునట్లు రాజు సర్వము గావింపవలెను. రాజు మోహవశుడై స్వరాష్ట్రమును కర్షించునేని (పీడించునేని) యతడచిరకాలములో రాజ్యభ్రష్టుడగును. బంధువులతో జీవిత భ్రష్టుండనగును చక్కగా భరింపబడిన (పెంపబడిన దూడ మంచిబలము గొని యెట్లు దున్నుట మొదలయిన పనులకుపయోగపడునో యట్టు రాజుచే చక్కగా భరింపబడిన రాష్ట్రము (రాజ్యము) మహాకార్య సాధకమగును ఏ రేడు రాష్ట్రము ననుగ్రహించునో చక్కగా రక్షించునో ఆరాజును ప్రజలు బ్రతికింతురు. సేవింతురు. ఆ ప్రభువు మహాఫలము పొందును.

దుహ్యాద్ధిరణ్యం థాన్యం చ మహీరాజ్ఞా సురక్షితా | నిత్యం స్వేభ్యః పరేభ్యశ్చ యథా మాతా యథా పితా ||

గోపినో హి సదా కార్యః సంవిభాగః ప్రియాణి చ| అజస్ర ముపయోక్తవ్యం ఫలం తేభ్య స్తథైవ చ ||

సర్వం కర్మేద మాయత్తం విధానం చైవ పౌరుషమ్‌ | తయోర్దైవ మచింత్యం హి పౌరుషే విద్యతే క్రియా ||

ఏవం మహీం పాలయతోస్య భర్తుః లోకాను రాగః పరమో భ##వేత్తు ||

లోకానురాగ ప్రభవా హి లక్ష్మీః | లక్ష్మ్యా భ##వేచ్చైవ పరశ్చ లోకః || 76

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితియఖండే రజధర్మ వర్ణనం నామ పంచ షష్టితయోధ్యాయః.

రాజుచే జక్కగ రక్షింపబడిన మహి (భూమి) బంగారమును, ధాన్యమును గురియించును. (అవుపాలట్లు చేవును) ఆతల్లి తల్లియుం దండ్రి యున్నట్లు తన వారికి నితరులకును గూడ సర్వమును చేపును. రాజు కార్యశాఖా విభాగమును తన యిష్టముల నొరులెఱుగ కుండ నిత్యము గోప్యమొనరించుకొనవలెను. వాని వలని ఫలమును గూడ గోప్యముగనే తానుపయోగించు కొనవలెను. ఈ రాజ్య వ్యవహారము రాజ్యతంత్రము దైవము మీద పౌరుషము మీద నాధారపడియున్నది. అందు దైవమనునది ఊహకందనిది. పౌరుష మందే పని నడచును. కావున కేవల దైవపరుడేగాక క్రియాసాధన మందు రాజు పౌరుషమును ఆశ్రయించి తీరవలెను. ఈ రీతిగ నిమ్మహినేలు భర్తకు లోకానురాగమెంతేని లభించును. లక్ష్మి లోకానుగ్రహము వలన గల్గునది. లక్ష్మిచేతనే పరలోకముంగల్గును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమందు రాజధర్మవర్ణనమను నరువదియైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters