Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదిమూడవ యధ్యాయము - భోజ్యకల్పనము

రామః: కల్పనా భోజనీయానాం గంధానాం యా చ కల్పనా| తామహం శ్రోతు మిచ్ఛామి త్వత్తో ధర్మ భృతాం వర: ||

పుష్కరః: భోజ్యం భోక్ష్యం తథా లేహ్యం చోష్యం పానం తథైవ చ | కల్పనా పంచథా రామ! భోజ్యసై#్యషా ప్రకీర్తితా ||

అభ్యాసగమ్యా చా7ప్యేషా వక్తవ్యం తత్ర మే శృణు! || కటు తోయోదకం క్వాధం శోధితానా మసంశయమ్‌ ||

పురాణ ధాన్యం జాతీనాం గంధ మాశు వినశ్యతి | శ్రేష్ఠం సార్షపకం తైలం శాకానాం పరిశోధనే ||

మాంసం కాఠిన్య మయాతి కౌమల్యం చార్ద్రకా7ంబునా | వరుణ క్షార సంయోగా న్మత్స్యస్యా7స్థి విలీయతే ||

గండికాభిః పలాశస్య క్షీర మాయాతి పక్వతామ్‌ | కపిత్థ చూర్ణ యోగేన తథా చైవ సుజాత కైః ||

ఘృతై స్సుగంధీ భవతి దగ్ధైః క్షిప్తెః తథా యవైః | పద్మ వారిణి యోగేన కాంజికస్యా7వ్లుతా భ##వేత్‌ ||

గుడాద్యం శుద్ధి మాప్నోతి క్షీరేణ చ తథా యుతమ్‌ | పద్మ రాగ సమం వర్ణం చా7

ంశుమత్యాః ప్రజాయతే ||

పానకానాం మహాభాగ! యస్యా7ప్యన్యస్య చేచ్ఛతి | క్షార యోగేన చావ్లుస్య తథా7వ్లుత్వం వినశ్యతి ||

లవణాధిక విక్షేపం సంజాత విరసం ధ్రువమ్‌ | సికతా పిండికాక్షేపై స్సురసత్వ మవాప్నుయాత్‌ || 10

చణక క్షార యోగేన పుష్పాణి చ ఫలాని చ | సర్వాణి ద్రుతి మాయాన్తి ద్రుతానాం కల్పనా భ##వేత్‌ ||

గంధ వర్ణ రసా7ధానం పానకా7దిషు సర్వతః | యథాకాలం యథాదేశం యథా సాత్మ్యం చ కారయేత్‌ ||

నా7త్యర్ధ దీప్తేన హుతాశ##నేన | నాత్యంత మందేన చ సాధ్య మన్నమ్‌ |

రసం న చా7ప్యత్ర భ##వేత్ర్పభూతమ్‌ | నా7త్యల్ప మేత త్కధితం మయా తే || 13

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయ ఖండే భోజ్య కల్పనా నామ త్రిషష్టితమో7 ధ్యాయః ||

రాముడు రాజుల భోజ్యవస్తు కల్పనము గంధకల్పనమును వినగోరెదనన పుష్కరుడిట్లనియె. భుజింపదగు పదార్థములైదురకములు. భోజ్యము = తినునది పాలు మొ|| భక్ష్యము అన్నము మొ|| లేహ్యము = నాకునది పచ్చడి మొ|| చోష్యము = జుఱ్ఱునది పులుసు మొ|| పానము త్రావునది పానకము మొ|| ఇది అలవాటు ననుసరించి చేసికొనవలసినది. పాతధాన్యజాతుల అన్నముయొక్క వాసనను కారముతో పలచగా దయారైన క్వాథము పరిహరించును. శ్రేష్ఠమైన ఆవనూనె కూరల పరిశోధనమునకు మంచిది. వీనివలన మాంసము గట్టిపడును. ఆర్ద్రజలముచే = మృదువగును (మెత్తనగునున) నీటివుప్పు సంయోగముచే చాప ఎముక మెత్తబడును. పాలు చక్కగ పక్వమగును. వెలగచూర్ణము కలిపిన సుజాతకములైన = చక్కగ తయారుచేసిన నేతులతో వేయించివేసిన యవలచే పద్మోదక సంపర్కమున పులుపెక్కును. బెల్లము మొదలయినది పాలుతో గలిపిన శుద్ధినంది అంశుమతి పద్మరాగమట్లెర్ర బడును. పానకములకు మరితేనికైన కారముతో నుప్పుగలిపిన పులుపుహరించును. ఉప్పు అధిక విక్షేపమువలన రుచితప్పిన యేవస్తువైన పంచదార పిండిక వేసిన సురసమగును. చణకక్షారయోగముచే పువ్వులు పండ్లన్నియు ద్రుతిని (మెత్తదనమును) బొందును. అవి భోజనార్హములగును. సువాసన రుచిరంగును పానకాదులకు గల్గుటకు చేయుపని దేశకాలములననుసరించి సాత్మ్యము ననుసరించి చేయవలెను. (సాత్మ్యమనగా నిక్కడ ఆయా ఋతువుల ననుసరించి అవి శరీరములోని ధాతువులతోనైక్యము పొందుట) అగ్ని మిక్కిలి దీప్తముగా లేకుండ మిక్కిలి మందముగా కుండునట్లుగాక హెచ్చునుదగ్గును గాకుండ నాహారకల్పనము సేయవలెనని చెప్పబడినది. అట్లు చేసిన రుచి సమముగా నుండును. అని నాచే చెప్పబడినది.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున భోజ్యకల్పనమను నరువది మూడవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters