Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువది రెండవ యథ్యాయము - అంతఃపుర చింత

పుష్కరః- ధర్మాశ్చా7ర్థశ్చ కామశ్చ పురుషా7ర్థః పరః స్మృతః | అన్యోన్న రక్షణా త్తేషాం సేవా కార్యా మహీక్షితా ||

ధర్మమూలో7ర్థ విటప స్తథా కామఫలో మహాన్‌ | త్రివర్గ పాదప స్తస్య రక్షణాత్ఫల భాగ్భవేత్‌ ||

ధర్మా7విరోధినీ కార్యా కామసేవా సదైవ తు | మూలచ్ఛేదే భ##వేన్నాశో విటపస్య ఫలస్య చ ||

కామసేవా విహీనస్య ధర్మా7ర్థావపి నిష్ఫలౌ | ఓషధీనాం ఫలార్థాయ కీనాశో యత్నవాం స్తథా ||

కామా7ర్థీ యత్నవా నేవం లోకో ధర్మా7ర్థయో ర్ద్విజ: | కామస్యా7పి పరం నార్యో ధర్మరాగ మదోత్కటాః ||

తదర్థం రత్ననిధయో విభవాశ్చ తథా పరే | గీతం వాద్యం సుమధురం భోజ్యం పానం స్రజ స్తథా ||

భూషణాని సుంగంధీని తదర్థం సర్వమేవ హి | తపశ్చాపి తపస్యన్తి దుఃఖం వర ముపాశ్రితాః ||

దుర్గమాణి చ తీర్థాని వ్రజన్తి పురుషా స్తథా | త్యజన్తి సమరే ప్రాణాన్‌ ప్రాణభో7ప్యధికం ధనమ్‌ ||

త్యజన్తి బ్రాహ్మణాధిభ్య స్తథా స్వర్గేప్సవో జనాః | స్వర్గస్యా7పి ధనం రామ! కారణం విద్ధి భార్గవ! |

తా ఏవ చపలాపాంగ విక్షేప విజితాః ప్రజాః | క్షయ మేవ క్షయం తస్య యస్య నా7ధ్యసితం సదా || 10

పుష్కరుడనియె : ధర్మార్థకామములు పురుషార్థములు మనుజుడై పుట్టినందులకు సాధింపవలసిన ప్రయోజనములు.రాజివి యొక్కదాని కొకటి సంఘర్షణము పొందకుండ సేవింప వలయును. అర్థమను వృక్షమునకు ధర్మము మూలము. దాని ఫలము కామము. (భోగము) ధర్మమునకు విరోధికాకుండ కామమును సేవింపవలెను. మూలచ్ఛేదము సేసిన జెట్టుగూలును. పండురాలును. కామపురుషార్థమును సేవింపనివానికి ధర్మార్థములు వ్యర్థములు. ఓషధుల ఫలముకొరకు కృషీవలుడు ప్రయత్నవంతుడైన్నట్లు ధర్మార్థముల కొరకు కామ పురుషార్ధియైన లోకము ప్రయత్నవంతమై యుండును. కామ పురుషార్థమునకు యోగ్యులైన స్త్రీలు ముఖ్యులు.

వారికొరకు రత్ననిధులు మరియుంగల సర్వ విభవములు (విలాసములు) ఆటబాటలు మేళాలు, మధురాతి మధురమైన భోజన సామాగ్రి పానము పూలమాలలు, భూషణములు, సువాసనలు వారి కొరకే యీ సర్వమునుంగదా! పరమదుఃఖములకు గురియై తపస్సు సేయుదురు. దుర్గమములయిన తీర్థములవెంట దిరుగుదురు. యుద్ధమందు ప్రాణములను ప్రాణములకంటె నధికమైన ధనమును ద్యజింతురు. స్వర్గ కాములైన జనులు బ్రాహ్మణులకు ధనములను విడుతురు. పరశురామా! స్వర్గమునకు గూడ ధనము కారణమని యెరుంగుము. చంచలాక్షుల కవాక్ష విక్షేపముల కోడిన (బిత్తరుల బెదరు వాల్చూపుల మిడిసిపాటునకు లోబడిన) జనులు వారే జనులు. అట్టి సుందరజనము మసలవి క్షయము = గృహము అది క్షయమే.

అధః కృత్యేన్దు బింబా7గ్ర వదనాభిః పురంధ్రిభిః | తసై#్యకం సఫలం జన్మ సంపదశ్చ మనోరథాః ||

యసై#్యతా శ్చంచలా7పాంగ్య స్తరుణ్యో వశ మాగతాః | సేవ్యా స్తా నా7తిసేవ్యాశ్ప భూభుజా విజిగీషుణా ||

అసేవనా ద్వృథా జన్మ దోషగ్రామో7తి సేవనాత్‌ | ఊరు స్తంభ త్రయం ప్రోక్తం శరీరేషు శరీరిణామ్‌ ||

ఆహారం మైథునం నిద్రా యైర్వృతం సకలం జగత్‌ | అసేవనా దథైతస్య తథైవా7త్యంత సేవనాత్‌ ||

రోగగ్రామో నృణాం దేహే సంభవ త్యతిదారుణః | విశ్వాస మతిసక్తిం చ తీక్ష్నతాం స్త్రీషు వర్జయేత్‌ ||

న చా7ధికారే కర్తవ్యా భూషణా7చ్ఛాద నా7శ##నైః | సువిభక్తాశ్చ కర్తవ్యాః లాలనీయా స్తథైవ చ ||

జ్ఞే¸°రాగా7పరాగౌ చ తథా తాసాం విశేషతః | నారీ రాగవతే లోకే నా7నృతేన విశిష్యతే ||

విరక్తాభి ర్మహీపాల! ఛద్మనా బహవో హతాః | ద్విష్టా న్యాచరతే యాతు నా7భినందతి తత్కథామ్‌ ||

ఐక్యం ద్విషద్భిర్ర్వజతి గర్వం వహతి చోద్ధతా | చుంబితా మార్షి వదనం దత్తం న బహుమన్యతే ||

స్వపిత్యాదౌ ప్రసుప్తా7పి తథా పశ్చా ద్విబుద్ధ్యతి | స్పృష్టా ధునోతి గాత్రాణి కాన్తం చైవ రుణద్ధి యా || 20

ఇందు బింబాననలగు పురంధ్రులచే (పతివ్రతలచే) క్రిందుసేయబడిన (వశము సేసికొనబడిన) వాని జన్మమది యొకటే సఫలము. వాని సంపదలు సఫలములు. వాని మనోరథములు సఫలములు. ఏ రాజునకు చంచలా పాంగ లంగనలు వయసులో నున్న వారు వశమౌదురో, వారే దిగ్విజయము చేసిన రాజునకు ప భోగింపదగినవారు సేవింపకున్న జన్మము వ్యర్థము. అతిగ సేవించిననది దోషముల పుట్ట. శరీరధారుల శరీరములందు, ఊరు స్తంభములు (శరీరములునిలువబడ నాధారములైనవి మూడు స్తంభములు.) ఒకటి ఆహారము, రెండవది మైధునము' మూడవది నిద్ర. జగమెల్ల వీనంగ్రమ్ము కొన్నది ఈ త్రయమును (మూడింటిని) అసలే సేవింపకున్నను అధికముగా సేవించినను మానవులకతి దారుణ రోగజాల మీ శరీరమందు పుట్టును. స్త్రీలయెడ విశ్వాసము (నమ్మకము) అత్యంత ఆసక్తిని తీక్ష్నతను (దురుసుదనము పెళుసుదనమును) వదలవలెను. వారిననధికారమందుంచరాదు. వస్త్రభూషణాశనాదులను వారికి చక్కగ విభాగించి యీయవలెను. లాలింపవలెను. విశేషించివారి రాగము = అనురాగము అపరాగము = పెడమొగమూనుటయు నెరిగికొనవలెను. రాగవతియైన యువతి అనృతముచే నతిశయింపదు. (అనగా అనృతములాడదు) విరాగవతులైన విలాసినులచే మోసగింపబడి యెందరో నాశనమైరి అనురక్తమైన యాడుదాని లక్షణములు యిట్లుండును: ఇష్టములేనిపనులేచేయును భర్తపేరెత్తిన నభినందింపదు. శత్రువులతో గలియును. మిడిసిపడును. గర్వించును. భర్తముద్దిడ మొగము దుడుచుకొనును. ఏమిచ్చుగాక మెచ్చదు. ముందే నిదురపోవును. పోవుగాక భర్త లేచిన తర్వాత లేచును. మేనుదాకిన దులుపుకొనును. కాంతుని నిర్బంధపెట్టును. (ఇరుకున్నపెట్టును)

ఈషత్స్మి తేన వాక్యాని ప్రియాణ్యపి పరాజ్ముఖి | నయ త్యశ్రుతవ ద్యాతు జఘనం చ విగూహతి ||

దృష్టే వివర్ణ వదనా మిత్రేష్వపి పరాజ్ముఖీ | తత్కామితాసు చ స్త్రీషు మధ్యస్థైవ చ లక్ష్యతే ||

జ్ఞాత మంగళ కాలా7పి న కరోతి చ మండనమ్‌ | యా సా విరక్తా, రక్తా చ నిబోధ గదతో మమ ||

ఎంతో ప్రియమైన మాటలను గూడ పెడమొగమువెట్టి అలతి నవ్వున విననియట్లు సేయును. జఘనముం గుట్టుపరచును. ప్రియుడు కనబడిన మొగము వన్నె చెడును. కాంతుని మిత్రులయెడగూడ పెడమొగమగును. ఆతడు కామించు కామినులయొడ తటస్థురాలట్లు గనిపించును. మంగళసమయ మెరిగియు మండనము (ముస్తాబు) సేసికొనదు. ఇది విరక్తయైనదాని లక్షణము. ఇక అనురక్తనుగూర్తి తెల్పెదం దెలిసికొనుము.

దృష్ట్వైవ హృష్టా భవతి వీక్షతే చ పరాజ్ముఖమ్‌ | దృశ్యమానా తథా7న్యత్ర దృష్టిం క్షిపతి చంచలామ్‌ ||

తథా7ప్యపావర్తయతి నైవ శక్నోత్యశేషతః | వివృణోతి తథా7ంగాని సుగుహ్యాన్యపి భార్గవ! ||

గర్హితం చ తథైవా7ంగం ప్రయత్నేనా విగూహతే | తద్దర్శనేన కురుతే బాలా7లింగన చుంబనమ్‌ ||

ఆభాష్యమాణా భవతి సన్నవాక్యా తధైవ చ | స్పృష్ట్వా పులకితై రంగై స్సఖేదై ర్వాపి భజ్యతే ||

కరోతి చ తథా రామ! సులభద్రవ్య యాచనమ్‌ | తత స్స్వల్ప మపి ప్రాప్య ప్రయాతి పరమాం ముదమ్‌ ||

నామ సంకీర్తనా దేవ ముదితా బహు మన్యతే | కరజా7ంకా7ంకితా న్యస్య ఫలాని ష్రేషయ త్యపి ||

తత్ప్రేషితాని హృదయే విన్యస్య త్యపి చా7దరాత్‌ | ఆలింగనైశ్చ గాత్రాణి లింపతీవా 7మృతేన చ || 30

వల్లభుని చూడగానే యానందభరితురాలగును. అతడు పరాజ్ముఖుడైన నావంకనే చూచును. అతను తనవంక గనుగొన తన బెదరు చూపు నింకొకవంక విసరును. (ఇది లజ్జానుభావము) అయినను నావంక చూపు మరలింపదు. మరలింపజాలదు. మిక్కిలి గుహ్యములయిన యంగములుగూడ వెలువరించును. యెడెలేమయిన మాసినం దానిని మాటువరచును. ప్రియుని జూచి పిల్లలం గౌగలించుకొనును. ముద్దువెట్టుకొనును. అల్లల్లన పలుకరించును. ప్రియుడు దాకినంత మేను పులకరింప తనువెంత నొచ్చి యున్నను ననుభవనీయ యగును. సులభ##మైన వస్తువులనే కావలయునని కోరును. ఏకొంచెము వస్తువైనకొని పరమానందపడును. రమణుని పేరెత్తినంతనే యుప్పొంగును. భాగ్యమనుకొనును. అతనికి తన నఖక్షతములం గుర్తువడిన పండ్లనే పంపును. ఆతడంపిన వాని నాదరముతో హృదయమందునుకొనును. తనకుతాన గౌగలించి కాంతునిమేన నమృతము చిలకరించునట్లుండును.

సుప్తే స్వపి త్యథా7దౌ తు తథా తస్య విబుధ్యతే | ఊరూ స్పృశతి చా7త్యర్థం సుప్తం చైనం విచుంబతే || 31

ఏవం రక్తాం తు విజ్ఞాయ కామయే తాత్మవా న్నరః | కామం చ భోజనం సఖ్యం జ్ఞేయాః కృత్రిమ పుత్రికాః ||

స్వీకర్తు మిచ్ఛన్‌ బాలాయాః క్రీడనాది స్తథైవ చ | గంధమాల్య ప్రదానేన ¸°వనస్థాం వశం నయేత్‌ ||

వస్త్రభూషణ దానేన తథా ¸°వన విచ్యుతామ్‌ | క్రీడా సాధు ప్రియా బాలా తథా ¸°వన విచ్యుతా ||

రతి ప్రియా తు విజ్ఞేయా తరుణీ చోభయ ప్రియా | ఆత్మసంభావనా స్త్రీషు న కర్తవ్యా కథం చ న ||

అసూయా జాయతే7త్యర్థ మాత్మసంభావితే నరే | న చా7సాం దర్శనం దేయం న చా 7త్యంత మదర్శనమ్‌ ||

ఉభ##యేనా7ప్యథై తాసా ముత్కంఠా తు విహన్యతే | హృద్యై స్సువిహితై ర్భాగై ర్గంధయుక్తైశ్చ కౌశ##లైః ||

కార్య మారాధనం స్త్రీణాం రతికామై స్సదైవ తు |

ఏవం సదా యస్తు కరోతి రామ! | స్త్రీచేతసాం స్వీకరణం మనుష్యః |

తస్యా7న్తరాయా న భవన్తి కించిత్‌ | స్త్రీద్వార మాసాద్య సదా సపత్నః || 38 1/2

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే అంతఃపుర చింతానామ ద్విషష్టితమో7ధ్యాయః.

ఆతడు నిదురింప తాను నిద్రించును. మేల్కొనుముందే మేల్కొనును. ఎడనెడ తొడలం దాకును. నిదురించిననేని వీని ముద్దువెట్టుకొనును. ఆత్మవంతుడు (హృదయముగలవాడు సహృదయుడు) ఈవిధముగ ననురక్తురాలిగ నెరింగి కామింపవలెను. ముగ్ధయైన దాని (బాల) యొక్క కామము (వలపు) భోజనము చెలివియుం దెలిసి యామె యెడ వర్తింపవలెను. ఆటబొమ్మలు ఆమె యాట వస్తువులను గైకొని కోరుచు నాకిదియిమ్మని యుబలాటము చూపి యామె నన్ముఖురాలిం జేసికొనవలెను. జవ్వనిని (¸°వనమందున్న దానిని) గంధములు పూలమాలలిచ్చి అత్తరువు రాసి వశపరచుకొనవలెను. ¸°వనము గడచిన ప్రౌఢను చదరంగము మొదలయిన యాటలచే సాధుప్రియభాషణములచే లోబరచుకొనవలెను. వయసులో నున్న తరుణి రతిప్రియురాలై యుండును. ఉభయరతికిని వేడుకవడును. స్త్రీ దగ్గర దనను దా నెక్కువవాడనని యెన్నడుం గొప్ప సెప్పికొనగూడదు. అట్లు తననుదామెచ్చు కొను వానియెడ నంగనల కసూయగల్గుట నైజము. వీరికి నిరంతరము కనబడరాదు. మిక్కిలి కనబడకుండ నుండరాదు. ఈ రెండువిధాల నింతల కుత్కంఠ (ఉబలాటము) తగ్గిపోవును. హృదయంగమములు సువిహితములు (చక్కగా పొందుపరుపబడినవి) పరిమళములు చిమ్మునవియునగు వస్తువులతో కౌశలములతో రతికాములైన రమణులు రమణీమణులను సేవింపవలెను. ఈవిధముగా నెవ్వడు నిరంతరము కాంతల మనసు గైకొను నాతని కంతరాయములు (ఆటంకములు) కొంచెమేని యెన్నడుం గలుగవు. స్త్రీ యను ద్వారమును పొందిన ప్రభువు నిస్సపత్నుండగును. (శత్రురహితుడగును).

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున అంతఃపురచింత యను నరువదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters