Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదియొకటవ యధ్యాయము - రాజధర్మము

పుష్కరః రాజధర్మవ్రతం శ్రేష్ఠ కృత్వా పురుషవిగ్రహమ్‌ | పురుషా న్వినియుంత చోత్తమా 7ధమ కర్మసు || 1

గ్రామస్యా7ధిపతిం కుర్యా ద్దశ గ్రామాధిపం తథా | శతగ్రా7మాధిపంచా7పి తథైవ విషయేశ్వరమ్‌ ||

తేషాం భాగ విభాగశ్చ భ##వే త్కర్మా7నురూపతః | నిత్యమేవ తథా కార్యం తేషాం చారైః పరీక్షయేత్‌ ||

గ్రామ దోషాన్‌ సముత్బన్నాన్‌ గ్రామేశః ప్రశమం నయేత్‌ | అశక్తౌ దేశపాలాయ స తు గత్వా నివేదయేత్‌ ||

శ్రుత్వాతు దేశపాలో7పి తత్ర యుక్తి ముపాచర్తైత్‌ | సో7ప్యశక్తః శ##తేశాయ యథావ ద్వినివేదయేత్‌ ||

శ##తేశో విషయేశాయ సో7పి రాజ్ఞే నివేదయేత్‌ | అశక్తౌ శక్తిమాన్‌ రామ! స్వయం యుక్తి ముపాచరేత్‌ ||

రాజా సర్వా 7త్మనా కుర్యా ద్విషయే రామః రక్షణమ్‌ | విత్త మాప్నోతి ధర్మజ్ఞః విషయాచ్చ సురక్షితాత్‌ ||

రిపుఘాతసమర్థః స్యా ద్విత్తవానేవ పార్థివ | పరచక్రోమర్దేషు విత్తవానేవ ముచ్యతే ||

విత్తవానేవ సహతి సుదీర్ఘమపి విగ్రహమ్‌ | బహుచండానపి పరాం స్తథా ఛింద్యాద్ధనా 7ధిపః ||

అన్నేప్రాణాః ప్రజాః సర్వా ధనే తచ్చ ప్రతిష్ఠితమ్‌ | ధనవాన్‌ ధర్మ మాప్నాతి ధనవాన్‌ కామ మశ్నుతే || 10

పుష్కరుడనియె. రాజధర్మవ్రతము పురుష స్వరూప మగు నొక విగ్రమును రాజొనరించి ఉత్తమ- అధమ కార్యములం దనువైన పురుషులను నియోగింపవలెను. ఏక గ్రామాధిపతి, దశగ్రామాధిపతిని శతగ్రామముల కధిపతిని, అనేక గ్రామముల సమూహమయిన దేశమునకు అధిపతిని నియోగింపనగును. వారి వారి భాగ విభాగము వారు జరుపవలసిన పనుల ననుసరించి యుండును. వారు చేయు పనిని నిత్యమును చారుల చేత బరీక్షింపవలెను. గ్రామము లందలి దోషమును గ్రామాధిపతి నివారించ వలెను. అది శక్యముగానప్పుడాతడు శత గ్రామాధిపతి దగ్గర కేగి నివేదింపవలెను. అతడు విని యక్కడ చేయవలసిన యుక్తిని (జుయమును) జేయును. అతడు గూడ యేమియు చేయలేనితరి శతగ్రామాధిపతికి నివేదింపలెను. అతడు విషయాదిపతికి (దేశపాలునికి) నివేదింపవలెను. అతని కశ్యక్యమైనపు డాతడు రాజునకు విన్నవింపవలెను. రాజందురు నశక్తులై నతరి తానే స్వయముగా నుపాయమును నర్వహింప నగును. సర్వవిధముల స్వయముగ రాజ్యమందు రక్షణ సేయవలసినవాడు రాజు. సురక్షితమైన దేశమునుండి ప్రభువు ధనముండబడయును. ధనవంతుడైన రాజే శత్రుఘాతచేయ సమర్ధుడగును శత్రురాజచక్రమెత్తి వచ్చినపుడు విత్తవంతుడగు ప్రభువే తప్పించు కొనగలడు. విత్తవంతుడే సుదీర్ఘమైన పోరాటమును దట్టుకొనగలడు. ధనేశుడైన భూమీశుడే యనేక దండోపాయులయిన శత్రవులను ఛేదింపగలడు. భేదోపాయ ప్రయోగ మట్టి వానికే సుకరమగును. ప్రాణములు ప్రజలు నన్నము మీద ప్రతిష్ఠితములు. ఆ యన్నము ధనముపై నాధారపడియున్నది. ధనవంతుడు ధర్మముం బడయును. ధనవంతుడు కామపురుషార్థముంబడయును.

అర్థపురుషార్థ ప్రశంస

యస్యా7ర్థ స్తస్య మిత్రాణి యస్యా7ర్థ స్తస్య బాంధవాః | యస్యా7ర్థస్సపుమా నోక్లే యస్యా7ర్థః సో 7పి పండితః ||

అర్థేన హి విహీనస్య పురషస్యా7ల్ప మేధసః | విచ్ఛిద్యనే క్రియా స్సర్వా గ్రీష్మే కుసరితో యథా ||

విశేషో నాస్తి లోకేషు పతితస్యా7 ధనస్య చ | పతితానాం గృహన్తి దరిద్రోన ప్రయచ్ఛతి ||

ధనహీనస్య భార్యా7 పి నైవ స్యా ద్వశవర్తినీ | గుణౌషు మపి చైవా 7స్యనైవ కశ్చి త్ర్పకాశ##యేత్‌ ||

బాంధవా వినివర్తన్తి ధనహీనా త్తథా నరాత్‌ | యథా పుష్పఫలై ర్హీనా చ్ఛకునా ద్విజ! పాదపాత్‌ ||

దాదిద్ర్య మరణ చోభే కేషాం చిత్సదృశే మతే | సత్యం హోసా ద్దరి ద్రస్య మృతః శ్శ్రేయన్‌ మవా మమ ||

కోశం రాజ్యతరో ర్మూలం తస్మాద్యత్నం తదర్జనే | ధర్మేణౖవ తతః కుర్యాత్‌ నాధర్మేణ కధంచన ||

ధనైరధర్మ సంప్రాపై#్తః యద్దృఢం హి విధీయతే | తదేవ యాతి విస్తారం వినాశాయ దురాత్మనామ్‌ ||

సుకృతస్య పురాణస్య బలేన బలినాం వర | యద్యధర్మాత్ఫలం శీఘ్రం నాప్ను వన్తి దురాత్మనః ||

తధాపి పూర్వ కర్మాన్తే తేన పాపేన కర్మణా | వినశ్యన్తి సమూలాస్తే సపుత్ర ధన బాంధవాః ||

నరకేషు తధా తేషాం యాతనా వివిధాః స్మృతాః | బహూన్యబ్ద సహస్రాణి యే నృపా రాష్ట్ర పీడకాః ||

నిత్యం రాజ్ఞా తథాభావ్యం గర్భిణీ సహధర్మిణా | యథా స్వం సుఖ ముత్సృజ్య గర్భస్య సుఖ మావహేత్‌ ||

గర్భిణీ తద్వదేవేహ భావ్యం ధూపతినా సదా | ప్రజాసుఖంతు కర్తవ్యం సుఖ ముద్దిశ్య చా త్మనః |

కిం యజ్ఞై స్తపసా తస్య ప్రజా యస్య సురక్షితాః | సురక్షితాః ప్రజాయస్య స్వర్గ స్తస్య గృహోపమః ||

అరక్షితాః ప్రజాయస్య నరకం తస్య మందిరమ్‌ | రాజా షడ్భాగ మాదత్తే సుకృతా ద్దుష్క్పతా దపి ||

ధర్మో నామ మహాభాగ! సంప్రదక్షణ తత్పరః | అరక్షిత స్తథా సర్వం పాప మాప్నోతి భార్గవ! || 26

ఎవనికి ధనము వానికి మిత్రులు. ఎవనికి ధనము వానికి బంధువులు. ఎవనికి ధన మున్నదో లోక మందు వాడు మగవాడు. ఎవనికి ధన మున్న ననతడు పండితుడు. అర్థహీనుడైన అల్పమేధావి యొక్క పనులన్నియు గ్రీష్మర్తువును చిన్న చిన్న యేళ్లింకిలట్లు విచ్ఛిన్నములగును. ధనహీనునికి పతితునికి కులభ్రష్టునికి లోకమందు తేడా లేదు. పరితులొరుల కేదేని నిచ్చిన నది వారు బుచ్చికొనరు. దరిద్రుడేరికి నేదయు నీయనేలేడు. ధనహీనుని భార్యకూడ లొంగి యుండదు. వీని గుణజాలము నెవ్వడే నొకడు కొనయాడనే యాడడు. ఎట్లు పూలు పండ్లు లేనిచెట్టు నుండి పక్షులిగిరిపోవునో ధన శూన్యుడినుండి చుట్టాలట్లు దూరమైపోవుదురు. దారిద్ర్యము మరణము నీరెండు గొందరికి నొకటిగానే తోచును. దరిద్రుడుగా బ్రతుకుటకంటె మృత్యుడగుట మేలని నాతలంపు. కోశము రాజ్యమనుతరువునకు మూలము. కావున దానికై ప్రయత్నము ధర్మముతోనే చేయవలెను. ఎన్నడుగాని యధర్మము గూడదు. ఆధర్మప్రాప్తములైన ధనములచే పెంపబడిన యదే ధనమా దురాత్మల వినాశమునకు దారితీయును.

ఓ బలశాలుర కెల్ల మేటీ! దురాత్ములు తొల్లిదానము చేసిన పుణ్యముయొక్క బలముచే నధర్మము వలన ఫలమునంత త్వరగా పొందకున్నను పూర్వపుణ్యము క్షయమైన వెంటనే యాపాపకర్మముచే సమూలము సపుత్రధనబాంధమువగ నశింతురు. నరకములందనేక యాతనలు రాష్ట్రపీడకులైన రాజులనేకాబ్దసహస్రములను భరింపవలసినవి స్మృతులందు జెప్పబడినవి. రాజు నిత్యము గర్భవతియైన స్త్రీ యట్లు తనసుఖము విడిచి గర్భముయొక్క సుఖమునట్లు ప్రజలయొక్క సుఖమును చూచుచుండవలెను. అట్లు ప్రజాసుఖము చూచుట తన సుఖమునుద్దేశించియే. యజ్ఞములేల? తపమేల? ఎవనిచే బ్రజలు సురక్షితులో వానికి స్వర్గము స్వగృహము వంటిది. ఎవని ప్రజలు అరక్షితులు వానికివాని మందిరము యమమందిరము. రాజుప్రజల సుకృతమునుండి దుష్కృతమునుండిను నారవపాలు (పన్ను) గైకొనును. ధర్మమనునది సంపద్రక్షణమున కధనమైనది. అట్టిధర్మ మరక్షితమగునేని యాపాపమంతయు రాజు పొందును.

నైవ కించి దవాప్నోతి పుణ్యభాక్‌ పృధివీ పతిః | ఆపన్న మపి ధర్మిష్ఠం ప్రజా రక్ష త్యథా ೭೭పది || 27

తస్మాద్ధర్మార్దకామేన ప్రజా రక్ష్యా మహీక్షితా | సుభ##గై శ్చాథ దురృత్త రాజవల్లభ తస్కరైః ||

ణక్ష్యమాణాః ప్రజా రక్ష్యా కాయస్థెశ్చ విశేషతః | రక్షితా స్తద్భయే భ్యస్తు ప్రజా రాజ్ఞాం భవన్తి తాః ||

అరక్షితా సా భవతి తేషా మేవేహ భోజనమ్‌ | సాధు సంరక్షణార్థాయ రాజా దుష్టనిబర్హణమ్‌ || 30

ధర్మనిష్ఠుడైన వాని పుణ్యాత్ముడైన రాజు ఏకొంచెమేని పాపముపొందడు. ఆపదలోను ఆపదయ మందు ప్రజ రక్షించును. పుణ్యాత్మకాముడగును. కావున ధర్మార్థకాముడగును. రాజు ప్రజలు రక్షించ తగినవారు. సుభమగులు సుందరులు (వేషభాషలలో నదరుగా గనబడు వారు చెడ్డనడవడిగల రాజునకు మిక్కిలి యిష్టులుగా నుండు దొంగలు కాయస్థులు=నౌకయుతినివేయబడు ప్రజలు రాజుచే విశేషముగా రక్షింపబడవలసి యుందురు. ఆనౌకర్ల భయమునుండి రక్షింపబడిన ప్రజలు రాజుపక్షము వహించిన ప్రజలయ్యెదరు కన్నబిడ్డలట్లగుదురు.

తృణానా మివ నిర్మాతా సదా కుర్యాజ్జితేంద్రియః | శాస్త్రోక్తం బలి మాదద్యా ద్ధర్యం త త్తస్య జీవితమ్‌ || 31

తస్య సంత్యజనం రాజా న సమృద్ధో7పి కారయేత్‌ | ఆకారాణి చ సర్వాణి శుల్కం శాస్త్రోదితో బలిః ||

దండం వినయనా ద్రోజ్ఞో ధర్మ్యం తత్తస్య జీవితమ్‌ | ధర్తా కరాణాం సర్వేషాం ప్రభు రుక్తో మహీపతిః ||

నిధిం పురాణం సంప్రాప్య కేశవంతు ప్రవేశ##యేత్‌ | అర్థం బ్రాహ్మణ సా త్కుర్యాత్‌ ధర్మకామో మహీపతిః ||

నిధిం ద్విజోత్తమః ప్రాప్య గృహ్ణీయాత్‌ సకలం తథా | జగతో7స్య సమగ్రస్య ప్రభు రక్తో ద్విజోత్తమః ||

చతుర్థ మష్టమం చా7ంశం తథా షోడశమం ద్విజ! | వర్ణక్రమేణ విసృజే దాఖ్యాతం ధర్మకారణమ్‌ ||

తే7పిలబ్ధ్వా తదా తేన సంవిభజ్య ద్విజోత్తమాన్‌ | శేషేణ కుర్యుః కామా7ర్థౌ విదితా పృథివీ పతేః || 38

రక్షింపబడని ప్రజల రాజును నౌకర్లు తినివేయుదురు. పూరిల్లుగట్టుకొను యజమానియట్లు జితేంద్రియుడైనరాజు సాధుసంరక్షణకొరకు దుష్టసంహారము చేసి తీరవలెను. మరియు శాస్తోకమైనరీతిని బలిని = పన్నునురాజు గైకొనవలెను. ఆ ధర్మ అట్లుచేయుట ఆరాజునకు ధర్మసమ్మతమగు జీవితము మాతని ప్రాణము. రాజెంత సమృద్ధుడైయున్నను. దానిని వదలరాదు, సర్వాకారములు సమస్త అకార్యములకు శుల్క మేశాస్తోకమైన పన్ను యథాప రాధముగ శిక్ష = విధించుట వలన రాజుయొక్క జీవితము ధర్మనుగుణమగును. (ధర్మము తప్పనిదగు) అన్ని రకాల పన్నులకు (కప్పములకు) రాజు ధారకుడని చెప్పబడుచున్నది. తాత ముత్తాతలనాటి నిధి (గని) యేదైన దొరికిన యెడల నందు విష్ణువును బ్రవేశ##పెట్టవలెను. ధర్మకాముడగు రాజు ఆథనమును బ్రాహ్మణుని పరము చేయవలెను. ఆ నిధి నంతు బ్రాహ్మణుడు గైకొనివలెను. ఈ సమస్త జగత్తునకు ద్విజశ్రేష్ఠుడే శాస్త్రనిర్ధిష్ఠమయిన ప్రభువు ఎక్కడైన నిధులున్నవని తెలిసిన క్షత్రియ వైశ్య శూద్రులా యంశమును రాజునకు దెలుపవలెను. రాజు ఆ నిధిని గైకొనియు అందు నాల్గవ ఎనిమిదవ పదునారవ భాగములను వర్ణక్రమముగా క్షత్రియ శ్యశూద్రజాతులకు నిచ్చివేయవలెను. అది ధర్మకారణమని చెప్పబడియున్నది. వారును నానిధిని బడసి వారును నది ద్విజోత్తములకు కొంత పంచియిచ్చి మిగత ధనముతో పృధివీపతి కెరుక పరచి కామార్ధములకు వాడుకోవలెను.

ప్రకాశవిభవో లేకే యస్య రాజ్ఞః సభా పతిః | ఆ ప్రకాశధనో యస్తు నరకం తస్య మందిరమ్‌ || 39

మమేద మితి యోబ్రూయ న్నిధిం సత్యేన మానవః | తస్యా7దదీత నృపతి ర్భాగ మబ్రాహ్మణస్యతు || 40

చతుర్వింశతికం రామ! ద్వాదశం షష్ఠమేవ చ | క్షత్రియాశ్చ తథా వైశ్యా శ్శూద్రాశ్చ భ్భగు నందన: ||

అనృతం చ వదన్‌ దండ్యః స్వవిత్త స్యాం7శమష్టమమ్‌ | ప్రణష్ట స్వామికం రిక్థం రాజా త్ర్యబ్దం నిధాపయేత్‌ ||

అర్వాక్‌ త్ర్యబా ద్ధరేత్‌ స్వామీ పరేణ నృపతి ర్హరేత్‌ | మమేద మితి యో బ్రూయా దనుయుక్తో యథావిధి |

సంపాద్య రూపం ద్రవ్యాదీన్‌ స్వామీ తద్ద్రవ్య మర్హతి | అవేదయానో నష్టస్య దేశం కాలం చ తత్త్వతః ||

వర్ణరూపం ప్రమాణంచ తత్సమం దండ మర్హతి | నిధి వద్బాగ మాదద్యాత్‌ ప్రణష్టాధి గతా నృపః ||

బాలదాయా దికం రిక్థం తావ ద్రాజా తు సాలయేత్‌ | యావ త్స స్యా త్సమా వృత్తో యా వద్వా7తీత శైశవః ||

చీబంలపుత్రేషు చైవం స్యాత్‌ రక్షణం నిష్కులాసు చ |పతివ్రతాసు చ స్త్రీషు విధవా స్వాతురాసు చ ||

జీవన్తీనాం తు తాసాం యే ధరాయేయుః స్వబాంధవాః | తాన్‌ శిష్యా చ్చౌర దండేన ధార్మికః పృథివీ పతిః || 48

లోకమందు ఏరాజు కీర్తిధనుడో అతడే భూపతి. అపకీర్తి ధనునియిల్లు నరకమందిరము. ఎవ్వడేని యీ నిధి (పాతు) నాదియనునో బ్రాహ్మణుడు కాడేని వాని నిధి నుండి భాగమును రాజు గైకొనవలెను. ఆ భాగమున క్షత్రియులు యిరువదినాల్గవవంతు, వైశ్యులు పండ్రెండవవంతు, శూద్రులు యారవభాగముం దీసికొనవలెను. ఎవడైన ననృతమాడేనా వాని భాగములో నెనిమిదవభాగము దండనముగా గైకొనవలెను. నస్టస్వామిక ధనమును (యాస్తిని) రాజు మూడేండ్లు భద్రపరుపవలెను. మూడేండ్ల లోపున దానిని దాని యజమాని గైకొనును. ఆ మీదట రాజు గైకొనవలెను. యధావిధిగ ప్రశ్నింపబడిన యెవడిది నా సొత్తే యనునో, వాని వలన వాని రూపము పరిమాణము మొదలయినవి తెలసికొని యా సొత్తు నా యజమానుని కీయవలెను. ఆ మనుజు డాసొత్తుపోయిన దేశము కాలము వర్ణము రూపము ప్రమాణము సరిగ జెప్ప లేకున్నచో నాసొత్తుతో సమానమయిన సొత్తు దండనగా (జరిమానాగా) ఇవ్వవలసి యుండును. అటుగాక యా సొమ్ము వానిదే యని ఋజువైనయెడల దాని నా యజమాని కిచ్చివేయుచు దాని నుండి మీద జెప్పిన యాయా భాగమును మాత్రము రాజు తీసికొనవలెను. పిల్లలకు జెందిన దాయభాగ ధనమును ఆ బాలుడు వచ్చువరకుగాని బాల్యము దాటువరకుగాని రాజు పాలించ వలెను. బాలపుత్రులు, కులహీన స్త్రీలు, పతివ్రతలు, విధవలు, ఆతుర స్త్రీలునను బ్రతికియున్న వారియొక్క ధనమును గైకొనిన బంధువులను ధార్మిక ప్రభువు చోరదండన విధింపవలెను.

సర్వేషా మేప వర్ణానాం చోరై రపహృతం ధనమ్‌ || తత్ప్రమాణం స్వకాత్కోశా ద్దాతవ్యమవిధారయన్‌ || 49

తతస్తు పశ్చా త్కర్తవ్యం చౌరా7న్వేషణ మంజసా | చౌర రక్షా7ధికారిభ్యో రాజా7పి తదవాప్నుయాత్‌ || 50

అహృతే చ తథా విత్తే హృత మిత్యేవ వాదినమ్‌ | నిర్ధనం పార్థివః కృత్వా విషయాత్‌ స్వా ద్వివాసయేత్‌ ||

న తద్రాజ్ఞా ప్రదాతవ్యం గృహే యత్పరిచారకైః | ప్రచరద్భి ర్హృతం ద్రప్యం కార్యం తత్రా 7న్వవేక్షణమ్‌ ||

స్వరాష్ట్రపణ్యా దాదద్యా ద్రాజా వింశతిమం ద్విజ! శుల్కా7ంశం పరదేశాచ్చ నిబోధ గదతో మమ ||

క్షయవ్యయ ప్రవాసాంశ్చ యథా యామం ద్విజోత్తమ! | జ్ఞాత్వా7తు కల్పయే త్తత్ర శుల్కా7ంశం పృథివీపతిః ||

తథా కార్యం యథాలాభం వణిజ స్సమవాప్నుయుః | పుణ్య ఛ్ఛేదశ్చ నైవ స్యా త్స్వదేశే పృథివీపతేః ||

వ్యయం శుల్క ప్రవాసాది లంఘయిత్వా తథా ద్విజ ! | వింశా7ంశ భాగ మాదద్యు ర్దండనీయ అతో7న్యథా || 56

దిశిదిశ్యేక మేవ స్యా చ్ఛుల్క స్థానం నృపస్య తు | తదతిక్రమతో ద్రవ్యం రాజగామి విధీయతే || 57

సర్వ వర్ణములవారి సొత్తు దొంగలచే నపహరింపబడెనేని, వెంటనే రాజు ఆ మొత్తమును తన కోశము నుండి యీయవలెను. పిమ్మట చోరాన్వేషణము గావింపవలెను. చౌరరక్షాధికారుల వలన కూడా రాజాధనమును పొందవచ్చును. ధన మపహరింపబడనిదే అపహరింపబడినదని చెప్పువానిని ధనరహితునిగాచేసి రాజు స్వదేశమునుండి వెళ్ళగొట్టవలెను. ఇంటియందు తిరుగుచున్న పరిచారకులచే నపహరింపబడిన సొత్తును రాజు మున్నీయక అన్వేషింపవలయును. బ్రాహ్మణుడా! రాజు శుల్కాంశమును నిరువదవ యంశమును స్వరాష్ట్రపణ్యము నుండియు పరదేశము నుండియు తీసుకొనవలెను. ఓ ద్విజోత్తమా! క్షయ వ్యయ ప్రవాసములను పరిశీలించి రాజు శుల్కాంశము నేర్పాటుచేయవలెను. వర్తకులు లాభము పొందునట్లు చేయవలెను. రాజునకు స్వదేశమునందు పుణ్యభంగము కూడ నుండదు. శుల్క వ్యయ ప్రవాసాదిక మెరిగి ఆదాయమరసి యిరువదవ అంశమును స్వీకరించవలెను. దానికి భిన్నముగ ప్రవర్తించువారు దండనీయులు. ప్రతిదిక్కునందు శుల్కస్థానముండును. దానిని అతిక్రమించినవాడు దండార్హుడు.

దూతానాం బ్రాహ్మణానాం చ రాజాజ్ఞాగామినాం తథా | స్త్రీణాం ప్రవ్రజితానాం చ తారశుల్కం వివర్జయేత్‌ ||

భిన్న కర్షాపణం శుల్కం న గ్రాహ్యం పృథివీక్షితా | తారేషు దాశ దోషేణ నష్టం దాశా త్ప్రదాపయేత్‌ ||

దైవదోషవినష్టం చ నష్టం యసై#్యన తస్య తత్‌ | శూక ధాన్యేషు షడ్భాగం శింబిధాన్యేష్వ థా7ష్టకమ్‌ || 60

రాజా బల్యర్థ మాదద్యాత్‌ దేశకాలా7నురూపకమ్‌ | రాజా7ంశభాగ మాద7ద్యా ద్రాజా పశుహిరణ్యయోః ||

గంధౌషధి రసానాం చ పుష్పమూల ఫలస్య చ | పత్రశాక తృణానాం చ వత్సరేణ చ చర్మణామ్‌ ||

వైదలానాం భాండానాం సర్వస్యా7శ్మమయస్య చ | షడ్భాగమేవ చా7దద్యా ద్బ్రాహ్మణభ్య స్తథా కరమ్‌ ||

తేభ్య స్తద్ధర్మ లాభేన రాజ్ఞో లాభః వరం భ##వేత్‌ | న చ క్షుధా7వసీదేత శ్రోత్రియో విషయే వసన్‌ ||

యస్య రాజ్ఞస్తు విషయే శ్రోత్రియ స్సీదతి క్షుధా | తస్య సీదతి తద్రాష్ట్రం దుర్భిక్ష వ్యాధి తస్కరైః ||

శ్రుతవిత్తే తు విజ్ఞాయ వృత్తిం తస్య ప్రకల్పయేత్‌ | రక్షేచ్చ సర్వత స్త్వేనం పితా పుత్ర మివౌరసమ్‌ ||

సంరక్ష్యమాణో రాజ్ఞా యః కురుతే ధర్మసంగ్రహమ్‌ | తేనా7యు ర్వర్ధతే రాజ్ఞో ద్రవిణం రాష్ట్ర మేవ చ ||

కర్మ కుర్యు ర్నరేంద్రస్య మాసే నైకం చ శిల్పినః | భక్త మాత్రేణ యే చాన్యే స్వశరీరోపజీవినః ||

స్నాతా7నులిప్తాశ్చ విభూషితాశ్చ | వేశ్యాంగనా వార వివర్తితేన |

సంవీతగా త్రాః పృథివీశ్వరస్య | సదా7భ్యుపాసాం పరిత స్త్రి కుర్యుః ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే రాజధర్మవర్ణనం నామ ఏక షష్టితమో7ధ్యాయః.

దూతలకును బ్రాహ్మణులకు రాజాజ్ఞా నిర్వాహకులకు స్త్రీలకు సన్యాసులకు తారశుల్కమును వదలివేయవలెను రాజ భిన్న కర్షావణమైన శుల్కము = రుసుము తీసికొనరాదు. భృత్యుని దోషముచే వచ్చిన నష్టమును భత్యునిచే నిప్పించవలెను. దైవిక దోషములచే వచ్చిన నష్టమది యంతయు యజమానిదే. శూకధాన్య మందారవంతు, శింబి ధాన్యములం దెనిమిదవ వంతు. రాజు (బలినిమిత్తముగా) పన్నుగా గ్రహింపవలెను. ఆ గ్రహించుటలో గూడ దేశ కాలాదులను గమనింపవలెను. రాజు పశువులలో బంగారములో గంధ - ఓషధిరసములలో పుష్ప ఫలాదులలో ఆకులలో కూరలలో, తృణజాతులలో చర్మములలో వైదలములలో (విదళములైన ధాన్యాలు) రాతి వికారములతో జేసిన భాండములలో ఆరవ భాగమునే రాజు గైకొనవలెను. బ్రాహ్మణుల వలన నారవయంశ##మే పన్నుదీసి కొనవలెను. వారి ధర్మాచరణమువలన ధర్మలాభము రాజునకును గల్గును. రాజ్యమందు వసించు శ్రోత్రియు డెవ్వడేని యాకలిం గుముల గూడదు. ఎవ్వని దేశమున శ్రోత్రియుడు వైదిక కర్మానుష్ఠాన పరుడాకలికి గుములునో యారేని రాష్ట్రము దుర్భిక్షములచే వ్యాధులచే దొంగలచే గుములును. ఒకనిశ్రుతము (పాండిత్యము) విత్తము = సొమ్మును రాజెరింగి వానికి వృత్తిని కల్పింపవలెను. తండ్రి తనకు బుట్టిన కొడుకునట్లు రాజు శ్రుత సంపన్నుని రక్షింపవలెను. రాజుచే రక్షింపబడుచు నెవ్వడు ధర్మ సంగ్రహము సేయునో ఆ ధర్మ సంపాదనచే రాజున కాయువు ధనము రాష్ట్రము గూడ పెంపొందును. శిల్పులు భక్తమాత్రమును (తిండినిమాత్రమే) రాజుయొక్క (కర్మ) పనినొక్క నెల చేయనగుదురు. తమ కాయకష్టము సేసి బ్రతుకు వారందరు నిట్లే యొకనెల కష్టమును రాజునకు అన్నమాత్రము గైకొని చేయవలయును. స్నానముసేసి. గంధములు పూసికొని యాభరణములు తొడిగికొని వేశ్యాంగనలు వంతులువేసికొని సంవీతగాత్రలై బురకా వేసికొని చక్కగ మేనులలంకరించుకొని నిత్యము రాజును సేవింపవలయును. కర్షము =16 మాషముల యెత్తు కర్షాపణము వెండినాణము తారము అన్నమాట:

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున రాజధర్మాధ్యాయమను యరువది యొకటవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters