Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదియెనిమిదవ యధ్యాయము - ఆరోగ్యద్వితీయావ్రతము

పుష్కరః- పౌష శుక్ల ద్వితీయాయాం గవాం శృంగోదకేన తు | స్నాత్వా శుక్లాంబరో భూత్వా సూర్యే7స్తం సముపాగతే

బాలేందోః పూజనం కృత్వా గంధమాల్యా7ను లేపనైః | ధూపదీప నమస్కారైః తథా చైవా7న్న సంపదా ||

దధ్నా చ పరమా7న్నేన గుడేన లవణన చ పూజనైః బ్రాహ్మణానాం చ | పూజయిత్వా నిశాకరమ్‌ ||

యావ దస్తం నయా7తీందుః తావ దేవ సమాచరేత్‌ | ఆహారం గోరసప్రాయ మథశ్శాయీ నిశాం నయేత్‌ ||

తత స్సంవత్సరే పూర్ణే సౌమ్యమాసే ద్విజోత్తమ! బాలేందోః పూజనం కృత్వా బ్రాహ్మణానాం చ పూజనమ్‌ ||

వాససీ రసకుంభం చ కాంచనం చ ద్విజాతయే | దత్వా చ పూజయిత్వా చ వ్రతపారంగతో || భ##వేత్‌

వ్రతేనా7నేన ధర్మజ్ఞ! రోగమేవం వ్యపోహతి | సర్వసౌఖ్యం తథా ద్రవ్యం పుష్టించ మనుజోత్తమ! |

కామం సమాప్నోత్యథ వైక మిష్టమ్‌ యేన ప్రతే నా7థ సమస్త ధర్మమ్‌ |

అభ్యాసత స్తస్య సమస్త కామాన్‌ న్నర స్స మాప్నోతి కిమత్ర చిత్రమ్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే - ఆరోగ్య ద్వితీయా నామ అష్టపంచా శత్తమో7 ధ్యాయః.

పుష్కరుడనియె. పుష్యశుక్లద్వితీయ యందు గోశృంగోదకములతో స్నానముసేసి శుక్లాంబరధారియై సూర్యాస్తమయము కాగానే బాలచంద్రునికి షోడశోపచారపూజగావించి అన్న సమృద్ధిగ పెరుగు పరమాన్నము బెల్లము ఉప్పునుగూర్చి నివేదింపవలెను. బ్రాహ్మణులను గూడ ఈ పదార్థములతో నర్చించవలెను. చంద్రుడస్తమించకుండగనే యీ వ్రతము సేయవలెను. గోరసప్రాయమైన యాహారము అధశ్శయనముచేసి యారేయి గడుపవలెను. అవ్వలనొకయేడు పూర్తికాగానే శుభమాసమందు బాలేందునికి బ్రాహ్మణులకుం బూజగావించి నూతనవసనములు రసకుంభము కాంచనమును ద్విజునికీయవలెను ఈ విధమునం జేసి వ్రతపారంగతుడగును. ఈవ్రతము చేసినతడు రోగముంబాయును. సర్వసౌఖ్యము సర్వద్రవ్యమును పుష్టినింబొందును. ఇన్నియుగాక తనకేది యిష్టమదియును సర్వధర్మమును బొందును. ఇందు వింతయేమున్నది?

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున ఆరోగ్యద్వితీయావ్రతమను నేబది యెనిమిదవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters