Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదియారవ యధ్యాయము - పురుషచికిత్స

పరుశురామః- భగవన్‌ ! శ్రోతుమిచ్ఛామి పురుషాణాం చికిత్సితమ్‌ | తన్మమా7చక్ష్వ దేవేశ! తత్రమే సంశయో మహాన్‌ ||

పుష్కరః- రక్షన్‌ బలం మహాభాగ! లంఘయేత్‌ జ్వరితం నరమ్‌ |

సవిశ్వం లాజమండం తు లంఘితం తత్తు భోజయేత్‌ ||

ముస్త పర్పట కోశీర చందనోద్దీప్య నాగరైః | ఘృతం శీతం పయ శ్చాత్ర దాతవ్యం తృట్‌ ప్రశాన్తయే ||

షడహే చ వ్యతిక్రాన్తే తిక్తకం పాయయే ద్రసమ్‌ | స్నేహయే త్పాకదోషం చ తత స్తం చ విరేచయేత్‌ ||

జీర్ణషష్టిక నీవార రక్త శాలి ప్రమోదకాః | తద్విధాశ్చతుర శ్శ్రేష్ఠాః యవానాం వికృతి స్తథా ||

ముద్గా మసూరా శ్చణకాః కులుత్థాః సమకుంఠకాః | ఆఢకీ చ ఫలం మూలే యూషార్థం జ్వరిణాం హితమ్‌ ||

కృష్ణశుక్ల కవన్తీర్క తిత్తిరైణ కపింజలాః | లావా7ద్యా జాంగలాః శ్రేష్టాః జ్విరిణాం తద్విధాశ్చయే ||

పటోలం సఫలం నింబం కర్కోటక కటిల్లకమ్‌ | శాకం పర్పటకం చా7ద్యా దవ్లూ7ర్థే దాడిమం హితమ్‌ ||

అయోగే వమనం శస్త మూర్ధ్వా7ంగే చ విరేచనమ్‌ | రక్తపిత్తే తథా పానే షడంగం శుంఠివర్జితమ్‌ ||

లాజా సించతి కా మంతు యవ గోధూమ శాలయః | మసూర ముద్గ చణకాః ఖండితా స్సమకుష్ఠికాః || 10

హృద్యా గోధూమికా భక్ష్యాః ఘృతక్షీరోపసాధితాః | సక్షౌద్రశర్కరోపేతా స్తథా వృషరసో హితః ||

పరుశురాముడు పురుషచికిత్స వినగోరెదనన పుష్కరుండిట్లనియె. మహాభాగా! బలహీనుడు కాకుండ కాపాడుచు జ్వరము వచ్చిన వానిని లంఘనము చేయింప వలయును విశ్వముతో (శొంఠితో) పేలాల గంజిని త్రాగింప వలెను. ముస్త పర్పాటకము, వట్టివేరు చందనము, ఉశీర = కురువేరు, నాగర = తుంగముస్తలతో నెయ్యి చల్లనిపాలు కలిపి యీయవలెను. అందు వలన దాహము తగ్గును. ఆరు రోజుల కవ్వము తిక్తక రసము (నేలవేము) త్రావింప నగును. పాక దోషమును చక్కబఱచి విరేచన సాధన చేయవలెను. పాత షష్టిక (60రో. పంట) నెవ్వరి, రక్తశాలి, ప్రమోదక ధాన్యములు, యవలు శ్రేష్ఠములు. పెసర, అలచందలు, సెనగలు, ఉలవలు, సంకుఠకములు. జాజిపళ్ళు మూలము = పుష్కరమూలము ఆఢకీజావయు, జరితులకుహితములు, నలుపు తెలుపు కవన్తీర్కము, తిత్తిరిపక్షి, లేడి, కౌజు, లావాక్షి= నల్లవ్రీహిధాన్యము, జాంగల = (గాలి యెక్కువగల చోటు) పండు ధాన్యములు కూడ హితములు. పొట్ల, వేపపండు, గలిజేరు వటల్లము = కాకర, పర్పాటక శృంగియు తిననగును. పులుపు కొఱకు పుల్లదానిమ్మ తినవచ్చును. అయోగము= కోశశుద్ధి లేకపోవట నందు శరీర పైభాగము శుద్ధియగుటకు వాంతి చేయింపవలెను. శరీరపు క్రిందిభాగము శుద్ధియగుటకు విరేచన సాధనము చేయవలెను. రక్తపిత్తము=నెత్తురుగ్రక్కుకొనునప్పుడు నందు శొంఠి లేకుండ షడంగ పానము చేయింప వలెను. (షడంగములు = 1. తుంగముస్తలు 2. పర్పాటకము 3. వట్టివేరు 4. శొంఠి మొదలగునవి) పేలాలు సించితిగ = గంగారేగు యవలు, గోధుమలు. వరిబియ్యము అలచందలు, పెసలు సెనగలు, వీని పప్పులు, దర్భాగ్రములు గోధుమలు భక్ష్యములు, నెయ్యి. పాలతో చేసినవి హృద్యములు. వృషరసము = అడ్డసరపాకు స్వరసము కూడ హితము.

అతీసారే పురాణానాం శాలీనాం భక్షణం హితమ్‌ | అనభిష్యంది వా చా7న్య ద్రౌద్రవత్సక సంయుతమ్‌ ||

మారుతానాం జయే యత్నః కార్యో గుల్మేషు సర్వథా ! వాట్యాక్షీరేణ చా7శ్నీయ ద్వాస్తుకం ఘృత సాధితమ్‌ ||

కుక్కుటా బర్హిణ శ్శ్రేష్ఠా స్తిక్తా గోధూమ శాలయః | హితా జఠరిణాం భోజ్యే యవ గోధూమ శాలయః ||

ముద్గాః కులత్థాః కౌలాని జాంగలా మృగ పక్షిణః | పటోల నింబ ధన్యా7ంబు శుష్య మూలక సైంధవైః ||

మాతులుంగ రసా జాతి హింగు వృక్షా7వ్లు వేతసైః | ఆహారం జఠరే యుక్త్వా యథాదోషం ప్రకల్పయేత్‌ ||

కుష్ఠినాం చ తథా శస్తం పానా7ర్థే శదిరోదకమ్‌ | మసూరముద్గౌ యూషా7ర్థే భోజ్యే జీర్ణాశ్చ శాలయః ||

నింబ పర్సటకౌ శాకౌ ఛాగలానాం తథా రసః | విడంగం మరిచం శుంఠీ కుష్ఠం రోధ్రం ససర్జికమ్‌ ||

మనశ్శిలైః కృతో లేపః కుష్ఠహా మూత్రపేషితః | అపూప సక్తు కుల్మాష వాజ్యాద్యా మేహినాం హితాః |

యవాన్న వికృతి ర్ముద్గాః కులత్థాః జీర్ణశాలయః | తిక్త రూక్షాణి శాకాని తిక్తాని హరితాని చ || 20

తిలాని తిల శిగ్రుర్వా విభీతేంగుదజాని తు | అనభిష్యంది యచ్చా7న్య ద్భోజనే తత్‌ ప్రశస్యతే ||

ముద్గా స్సయవ గోధూమాః థాన్యం వర్షస్థితం చ యత్‌ | జాంగాల స్వరసః ప్రోక్తో భోజనే రాజయక్ష్మిణామ్‌ ||

కులత్థ ముద్గకా7లాబు శుష్కమూలక జాంగలైః | యూషైర్వా వాష్కిరై స్ప్నిగ్ధైర్ధధి దాడిమ సాధితైః ||

మాతులుంగ రసక్షౌద్ర ద్రాక్షా సంస్కృతైః | యవగోధూమ శాల్యన్నై ర్భోజయే చ్ఛావసం పరమ్‌ ||

దశమూల ఫలారాస్నా కులత్థై రుపసాధితైః | పయోవ్యూష రసక్వాథః శ్వాస హిక్కా నివారణః ||

అతిసారము నందు పాతబియ్యమును మరి యితర మైనదేదియైనను అనభిష్యంది = పల్చని గానిది రౌద్రవత్సకము (రుద్రజడ) కొడిసెపాకులతో గూడియున్నది తినుటయు మంచిదే. గుల్మము (కడుపులో పైత్యమున బుట్టిన మాంసగ్రంధుల)లో వాతము చేరకుండ చూడవలయును. నేతితో వండిన వాస్తుకము = గలిజేరు, లేత చక్రవర్తి కూర వాట్యాక్షీరము ముక్తచేలకం పాల)తోను తినవలెను. తోళ్లు, నెమళ్లు, తిక్తకములు, గోధుమలు, బియ్యము ఆకలిగల వారికి హితములు, యవలు గోధుమలు, బియ్యము, పెసలు, ఉలవలు, కౌలములు, జాంగలములు, మృగపక్షులు పొట్ల, వేప, ధాన్యంబువు యెండు ముల్లంగి, సైంధవ లవణము, మాదీఫలము రసకాకోలి, జాజి, ఇంగువ, కొఱ్ఱలు, వృక్షావ్లుము=చింత. ప్రబ్బలి అనునవి జఠరాగ్ని సరిగనున్నదో లేదో చూచి యీయవలెను. కుష్ఠురోగులకు చండ్రకషాయము, అలచందలు, పెసరకట్టు పాతబియ్యము, వేపాకు, పర్పాటకము ఆకురసము వాయువిడంగములు, మిరియము, శొంఠి చంగల్వకోష్టు, లొద్దగు సర్జకము = జాజికాయ మణిశిల, అను వానితో తయారైన లేపము గోమూత్రముతో నూరినది కుష్టురోగ నివారణములు, కుల్మాషము అడ్డసరము వ్యా ఘ్యాదులు = వాకుడు మొదలగునవి మేహరోగములకు ననువైనవి. యవాన్న వికృతులు పెసలు, ఉలవలు. పాత బియ్యము కారము, కారుములగ, నువ్వులు, తెలగపిండి, గారకాయలు, ములగ, తాండ్రకాయలతో తయారై చక్కని పదార్థము భోజనమునకు పథ్యమైనవి. పెసలు. యపలు ఒకయేటి పాత ధాన్యము, జాంగలధాన్యము రాజ యక్ష్మరోగులకు పథ్యములు. ఉలవలు పెసలు, ఆనప, ఎండు ముల్లంగి. జాంగల ధాన్యపు జావ, స్నిగ్ధములైన పానీయములు. మాదీఫల రసము, ద్రాక్షారసము సంస్కృతమైన యవ గోభూమ శాల్యన్నములు, పెట్టనగును. దశమూలములు. 1 శాలపర్ణి = ముయ్యాకు పొన్న 2. గణకారిక = చిన్ననెల్లి 3. పాటల = కలిగొట్టు, ఎఱ్ఱలొద్దుగ 4. గంభారి = చల్లగుమ్ముడు 5. పృశ్నిపర్ణి = కోలపొన్న 6.బృహతీ ద్వయము = పెద్దములగ, చిన్నములగ 7.గోక్షుర = పల్లేరు 8.శోణావ = ఎఱ్ఱగలిజేరు 9.జిల్లేడు 10 వాకుడు రాస్న = తెల్లములక ఉలవలు అనువానితో సాధితమైన పాలు వీనితో జేసిన కట్టు, జావ, క్వాధము = కషాయము ఎక్కిళ్లను నివారించును.

శుష్కమూలక కౌలత్థ మౌద్గ జాంగలజై రసైః | యవగోధూమ శాల్యన్నం జీర్ణాం7శోం7శం సమాచరేత్‌ ||

జీర్ణ పక్వరసం శీధు మార్ద్వీకాన్‌ స్త్వథవా పిబేత్‌ | శోథవాన్‌ సగుడాం పథ్యాం ఖాదేద్వా గుడలవానమ్‌ ||

చిత్ర విచిత్రకం చోభౌ గ్రహణీ రోగనాశనౌ | పురాణ యవ గోధూమా శాలయో జాంగలం రసమ్‌ ||

ముద్గా7మలక ఖర్జూర మలద్వీకా బదరాణి చ | మధు సర్పిః పయస్తక్రం నింబ పర్పటకౌ వృషమ్‌ ||

తక్ర వృద్ధ్యా7ను శస్యన్తై సతతం వాతరోగిణామ్‌ | హృద్రోగిణ ప్రదాతవ్యం ప్రయత్నేన విరేచనమ్‌ || 30

శుష్క మూలకము = ఎండుముల్లంగి ఉలవలు, పెసర, జాంగలధాన్యము (గరువు పంటల) రసములతోను, యవ గోధుమ, శాల్యన్నము జీర్ణకారియగును. జీర్ణమైన పక్వరసమునైన కట్టును బెల్లముతో త్రాగవలెను. వాపు గలవాడు గుడలావకమను తిన్నను మంచిదే. చిత్రమూలము విచిత్రకముగూడ గ్రహణికి మందులు. పాతగోధుమలు వరిబియ్యము, జాంగలరసము, పెసర, ఉసిరి, ఖర్జూర, ద్రాక్ష, తేనె, నెయ్యి పాలు, మజ్జిగ యెక్కువగా సేవించిన యెడల వాతరోగులకు గుణమిచ్చును. గుండెజబ్బువారికి విరేచన సాధన తప్పక చేయవలెను.

పిప్పలీనాం ప్రయోగశ్ఛ ప్రమృతే ధర్మిణ స్తథా | చకార నాడీ శీధూని యుక్తా చ శిశిరాంభసా ||

యుక్త సౌవర్చ లాజాక్షి మథశస్తం మాదా7త్యయే | సక్షౌద్ర పయసా లాక్షాం పిబేత! క్షతవాన్నరః ||

క్షయం మాంస రసాహారో వహ్నిసంరక్షణా జ్జయేత్‌ | శాలయో భోజనే శక్తాః నీవార కలమాదయః ||

యవన్న వికృతి ర్మాంసం శాకం సౌవర్చలం సుధీః | పథ్యం తథైవ తాసాం చ మండం తక్రం చ వారుణీ ||

ముస్తా భ్యాస స్తథా లేపః చిత్రకేణ హరిద్రయా | యవా7న్న వికృతి శ్శాలి ర్వాస్తుకీ చ సువర్చలమ్‌ ||

త్రవుసీ చారు గోధూమాః క్షీరేక్షు ఘృత సంయుతాః | మూత్ర కృచ్ఛే చ శాన్తా స్స్యుః పానే మండ సురాదయః ||

లాజా సక్తు తథా క్షౌద్రం శాల్యం మాంస పరూషకమ్‌ | వృక్తానా7లాబు శిఖిన శ్చర్దిఘ్నాః పావకాని చ ||

శాల్యన్నం తోయ పయసీ కేవలోష్ణ శ్రితే7పి వా | తృష్ణాఘ్నా ముస్తగుడయో ర్గులికా వా ముఖే ధృతా ||

పిప్పలీ ప్రయోగము = పిప్పలిని వాడుట ప్రమృత ధర్మకి = వ్యవసాయముచే శ్రమించు వానికి ప్రశస్తము. మాంస రసాహారియై జఠరాగ్నిని కాపాడు కొనుచు శాల్యన్నము నెవ్వరి వలమ బియ్యము చల్లని నీటితో కలసిన నెవ్వరి బియ్యము మద్యములు యుక్తములు. మదము అతదిశయించినపుడు దింటెన సౌవర్చలవణ అజాక్షి= బ్రహ్మమేడులు ప్రశస్తములు, గాయపడిన వాడు తేనె, పాలతో గూడిన లాక్షి= సర్జరసమును త్రాగవలెను క్షయరోగమును మాంసరసాహారియై జఠరాగ్ని సంరక్షణమున జయింపవలెను. వానికి శాలిధ్యానము నెవ్వరి కలమ ధాన్యములు భోజనమునకు ప్రశస్తములు. యవాన్న వికృతి మాంసము శాకము, సౌవర్చ లవణము వాని జవా, మజ్జిగ, కల్లు పథ్యములు. చిత్రమూలము పసుపుతో గూడిన తుంగముస్తల వాడకము, లేవము కూడ మంచిది దేయవాన్న వికృతి, శాలిధాన్యము వాస్తుకి = చక్రవర్తి కూర సౌవర్చలవణము త్రవుసి = చేదు దోస, మంచి గోధుమలు, పాలు, పెరుగు, చురకు నేతితో గలిపిన పదార్ధములు మండము మూత్రకృచ్ఛమునక్రు ప్రశస్తములు. పేలాలు, పేలపిండి తేనె శాల్యన్నము మాంసము, అడ్డరసము, వంకాయ, ఆనస, శిఖి = మెంతికూర, పానకములు చర్ది నివారకములు. శాల్యన్నము కాచిననీరు, పాలు, నోటిలో వేసుకున్న తుంగముస్తలు బెల్లముతో చేసిన మాత్రయు దప్పికను హరించును.

యవాన్న వికృతి ర్యూషం శుష్కమూలకజం తథా | శాకం పటోల వేత్రాశ్ర మూరు స్తంభ వినాశనమ్‌ ||

ముక్తా7ఢక మసూరాణా మతీరై ర్జాంగలై స్తథా | స సైంధవ ఘృత ద్రాక్షౌ శుంఠ్యా మలక కోలజైః || 40

యూషైః పురాణగోధూమ యవశాల్యన్న మభ్యసేత్‌ | వి సర్షం ససితాక్షౌద్ర మృద్వీకా దాడిమోదరః ||

రక్తషష్టిక గోధూమ యవము7ద్గాది వల్లఘు | కాచమాచీ చ వేత్రాశ్రం వాస్తుకం చ సువర్చలా ||

వాత శోషిత నాశాయ తోయం శస్తం సితా మధు | నాసారోగే చ సహితం ఘృత దూర్వా ప్రసాధితమ్‌ ||

భృంగరాజర సే సిద్ధే తైలం ధాత్రీరసో7పి వా | నస్యా త్సర్వా మయే ష్విష్టం మూర్ధజత్రూ ద్భవేష్వథ ||

తొడలు పట్టినప్పుడు యవధాన్యాన్నపు వికృతులు ఎండు ములగతో కాచిన కషాయము, పటోల శాకము వేప చిగుళు సేవించవలెను. ముక్త = తెల్లములగ అఢక = కంది, మసూర = చిరి సెనగలు, జాంగలధాన్యము జావ, సైంధవ లవణము, నెయ్యి, ద్రాక్ష, శొంఠి, ఉసిరి, రేగిపండ్లతో కలసినదిగా సేవించవలెను. పాతగోధుమ యవశాల్యన్నములను అలవాటు చేయనగును. ఆవాలు, చక్కెర, తేనె, ద్రాక్ష, దానిమ్మ, రక్తఠాజనాలు షష్టిక (60 రోజులలో పండు) ధాన్యము గోధుమలు, యవలు, పెసర మొదలగునవి కాచమాచి వేతాశ్రము వాస్తుకము (చక్రవర్తి కూర) సౌవర్చలవణము, నీరు వాతమునే నేర్పడిన చచ్చుతనమును (చచ్చువాతమును) పోగొట్టును. నాసికా రోగము నందు నెయ్యి గరికెలతోను గుంటగర ఆకు రసముతోను గాచిన నువ్వుల నూనెగాని, ఉసిరిక రసముగాని ఔషధము ఆ రసమే మూపుల నొప్పులను మాన్పును.

శీతతోయాన్వ పతనం తిలనాం రామ! భక్షణమ్‌ | ద్విజదార్డ్యకరం ప్రోక్తం తధా పుష్టికరం శుభమ్‌ ||

గండూష స్తిలతైలేన ద్విజ దార్డ్యవరః పరః | విడంగ చూర్ణం గోమూత్రం సర్వత్ర కృమి నాశనమ్‌ ||

ధాత్రీఫలా న్యథా7జ్యం చ శిరోలేపన ముత్తమమ్‌ | శిరోరోగ వినాశాయ స్నిగ్ధ శీతం చ భోజనమ్‌ ||

తైలం వా వస్తిమూత్రం వా కర్ణ పూరణ ముత్తమమ్‌ | కర్ణశూల వినాశాయ శుద్ధం తైలం నిషేచయేత్‌ ||

గిరిభ్రిచ్చందనం మాల్యం మాలతీ కాలికాస్తథా | సంయోజ్యవా కృతా వర్తిః క్షతచక్రహరీ తు సా ||

వ్యూషం త్రిఫలయా యుక్తం సురూకం చ రసా7ంజనమ్‌ | సర్వా7క్షి రోగశమనం తథా చైవ రసా7ంజనమ్‌ || 50

చల్లని నీరు ధారగాపోయిట నువ్వులను నములుటవలన దంతములు గట్టిపడును. పుష్టిచెందును. నువ్వులనూనె పుక్కిలించుటయు దంతముల గట్టిపరచును. వాయువిడంగముల చూర్ణము గోమూత్రము నన్నియెడల కృమిహరము. ఉసిరిపండ్లు, ఆజ్యము, సిరసునకు పూసిను, స్నిగ్ధము ఇంపైన చల్లని భోజనము చేసినను శిరోవ్యాధులు పోవును. చెవిపోటునకు శుద్ధమైన నూనెపోయుట, వస్తితో తీసి శుభ్రముచేయుట, గోమూత్రమును నుత్తమములు. గిరిభిచ్ఛందనము, పూలమాల, మాలతి, జాజి, తేలుకొండి కాలిక, జటమాంసి, పొట్ల కలపిచేసినవర్తి, గాయములను, పుండ్లను మాడ్చును. త్రిఫల కషాయము (శైష్యము - యూషము నూరకము రసాంచనము) నేత్రరోగశమనము.

ఆజ్యభృష్టం శిలాపిష్టం రోధ్రం కాంజిక సైంధవైః | ఆశ్చ్యోతన వినాశాయ సర్వరోగా7మయేషు చ ||

గిరిభిచ్చందనై ర్లేపో బహిర్లేపస్య శస్యతే | నేత్రామ7య విఘాతా7ర్థం త్రిఫలా శీలయేత్సదా ||

రాత్రౌ తు మధు సర్పిర్భ్యాం దీర్ఘమాయు ర్జిజీవిషుః | శతావరే రసే సిద్ధౌ వృష్యౌ క్షీర ఘృతౌ స్మృతౌ ||

కలవింకాని మాషాశ్చ వృష్యౌ క్షీరం ఘృతం తథా | ఆయుష్యా త్రిఫలా చైవ పూర్వవన్మధు కాన్వితా ||

మధుకాయోరజో పేతా వలీ పలిత నాశినీ | వచాసిద్ధం ఘృతం రామ! తథా భూత వినాశనమ్‌ ||

నేతిలో వేయించిన వురాపిష్టము లొద్దుగ, పులిగడుగు, సైంధవలవణము, అశ్చ్యోతనమను మాన్చును. సర్వరోగములకు మందు. గిరిభిచ్చందనములతో కొండపిండి కంటిలోపల వెలుపల పూసిన నేత్రవ్యాధి పోవును. త్రిఫల చూర్ణముతో నిత్యము శోధన చేయుట నేత్రరోగ నివారకము (శోధన చేయుట యనగా నిక్కడ కంటిగుడ్డుమీద సన్నని గుడ్డవేసి త్రిఫల చూర్ణము నానవేసిన నీరుపోయుట.) రాత్రివేళ తేనె నెయ్యి సేవించిన దీర్ఘాయువు గల్గును. పిల్లితేగ (శతావరి) రసము పాలు, నెయ్యితో సేవించిన వీర్యవృద్ధి (వృష్యయోగము). కలవింకములు కళింగము, మినుములు, వృష్యములు. 1 అడ్డరసము 2 కన్నె (అనునొక మూలిక) పాచు నెయ్యి తేనెతో గూడిన త్రిఫలములున్నూ ఆయుష్యాభి వృద్ధికరములు.

కంఠే బుద్ధిప్రదం చైవ తథా సర్వార్థ సాధకమ్‌ | పల్గకల్క కషాయేణ సిద్ధ మభ్యంజనం హితమ్‌ ||

రాస్నా సహచరై ర్వాపి తైలం వాత వికారిణామ్‌ | అనభిష్యన్ది యచ్చాన్య త్తద్ర్వణషు ప్రశస్యతే ||

పక్వస్య చ తథా భేదం నింబతైలం చ రోపణ | తథా తస్యోపచారశ్చ బలి కర్మార్థి శేషతః ||

సూతికా చ తథా రక్షా వ్రణినాం తు సదాహితా |

వసతో కాచిన నెయ్యి భూత వినాశము. అది కంఠమందు (తిన్న) బుద్ది పెంపొందును. సర్వార్థసాఖకమును. వల్గకల్క కషాయముతో చేసిన కాటు రాస్నా = సర్పాక్షితో (నానార్థాలు) 2 పిన్న రాష్ట్రము కాలేల 3 ఫిరంగిచెక్క కలిపినతైలము వాత రోగులకు వ్రణమందు ప్రశస్తమగును. పక్వమైన దానిని భేదించి వేపనూనెపూసి మాన్పవలెను. వ్రణరోగములకు బాలింతల్కవలె జాగ్రత్త తీసుకొనవలెను.

విషచికిత్సా

జంగమే విషదంశేతు దాతవ్యం స్థావరం విషమ్‌ ||

స్థావరే సర్ప దష్టస్య హితం మాంసస్య భక్షణమ్‌ | భక్షణం నింబపత్రాణాం సర్పదష్టస్య భేషజమ్‌ || 60

వంధ్యా కార్కోటకం మూలం ఛాగమూత్రా7భి భావితమ్‌ | నస్యం కాంచిక సంపిష్టం విషవేగ వినాశనమ్‌ ||

బంధనా ద్దూషణం ఛేద దాహ స్రావాః ప్రకీర్తితాః | పూర్వదష్టస్య పానే చ హృదయా7 వరణం ఘృతమ్‌ ||

తాల నింబదళం కేశా జీర్ణచేలం యవా ఘృతమ్‌ | ధూపో వృశ్చిక విద్ధస్య శిఖిపత్రం ఘృతేన వా ||

ఆర్కక్షీరేణ సంపిష్టం లేప బీజం పలాశజమ్‌ | వృశ్చికార్తస్య కృష్ణా వా శిరీషఫల సంయుతా ||

తిలకా7స్ఫోటయో ర్దూనం గిరికర్ణ్యా స్తిలస్యచ | శర్కరా మధు సర్పీంషి పాన మాఖు విషాపహమ్‌ ||

ఆర్కక్షీరం తిలా సై#్తలం పలలంచ గురు స్యమమ్‌ | పానాజ్జయతి దుర్వార మవిషం శీఘ్రమేవచ ||

పీత్వా మూలం త్రివృత్‌ తుల్యం తండులీయస్య సర్పిషా | సర్పకీట విషా7ణ్యాశు జయత్యతి బలాన్యపి ||

చందనం పద్మకం కుష్ఠం నతాంబూశీర పాటలాః | నిర్గుండీ శాఖి శైలూష లూతా విషహరో7 గదః ||

శిరోవిరేచనం శస్తం గుడనాగరకం ద్విజః | నస్య కర్మణి వస్తౌ చ తథా భృంగే చ భార్గవ ||

తైలమేవ పరం విద్యాత్‌ స్నేహపానే తథా ఘృతమ్‌ | స్వేదనీయః పరోపహ్నిః సితామ్భః స్తంభనం పరమ్‌ || 70

తోటలలో జంగమములందని పుట్టలలో సంచరించే స్థావరకొండలలో గుట్టలలోనుండెడి పాముల విషయమునీయవలెను. స్థావర మందలి పాము కాటునకు మాంసభక్షణము మందు. పాముకరచిన వానికి వేపాకు తినుట మందు. గొడ్డు ఆగాకార ఆగాకర దుంప, సమభాగములు చేసికొని మేక మూత్రముతో భావనచేసి గంజితో ముక్కులో పోసిన విషవేగము హరించును. పాము కరవగానే విషమెక్కకుండ కట్టుకట్టుట కరచినచోట కాల్చుట విషము వెలికి స్రవింప చేయుట కరువగానే చేయవలసిన చికిత్సలు. తాటియాకులు, వేపాకులు, వెంట్రుకలు, పాతగుడ్డ, యవలు, నేతితో కలిపి జటమాంసి ధూపము వేసిన తేలు విషము విరుగును. జిల్లేడు పాలతో (నూరిన సింహ్లాకము (వేప బీజము) గాని మోదుగగాని, నల్లగన్నేరుగాని, దింటిన పండు మరువకము. మొగలి, తిప్పతీగ, కాకరతీగె ఇందిక్కడనేది తీసుకొన వలెనో గమనించ వలసి యున్నది.) నల్లజీడి వీటితో కాపటము పెట్టుట, గిరికర్లి తిలము (అనేకార్థాలు, గలవు) తిలపర్ణీ రక్తచందనము, పంచదార, తేనె ఆవునెయ్యి యనువానితో వానిం ద్రావిన ఎలుకయొక్క విషము విరుగును. జిల్లేడుపాలు నువ్వులు నువ్వుల నూనె మాంసి యెంత ఘోరమైన విషమునైన విరుచును. త్వరలో నిర్విషము నొనర్చును. తెగడ తండులీయముతో ఘోరవిషము హరించును. చందనము పద్మకము = పద్మకాష్టము (పత్రాంగమనియు దీనికి పేరు) చెంగల్వకోష్ఠునత = గ్రంధి తగరము ప్రియంగువు= ప్రేంణము అంబు = మరువేరు శర = నారంజి, పాటల = పొన్న కలికొట్టు (ఇందేదో విమర్శింపవలెను) నిర్గుండి = వావిలి, (ఇది నల్లతెల్లరకాలు రెండు) శాఖి = గులుగు శైలూష = మారేడు ఇవి లూతా విషమును (లూతా = సాలెపురుగు) హరించును. నస్యకర్మమందు (ముక్కులో రసము వేయుపని) భృంగి = అతివస (నానార్థాలు గంజాయి ఏటిమట్టి) ఉపయోగింపవలెను. స్నేహపానమందు = సూనెత్రావుటలో ఆవునెయ్యి స్వేదకర్మమందు = చెమటపట్టించు చికిత్సలో నిప్పు మొద్దువారించుటలో (స్తంభన కర్మమందు) చన్నీళ్ళు చాలా యుపయుక్త పదార్థములగు. ఔషధములు.

త్రివృద్ధి రేచనే శ్రేష్ఠా వమనే మదనం తథా | వస్తి ర్విరేకో వమనం తైలం సర్పి స్తథా మధు ||

రక్తపిత్తే బలా రాస్నా క్రమేణ పరమౌషధమ్‌ | శారీర మానసా7గంతు సహజా వ్యాధయో మతాః ||

శారీరజ్వర కుష్ఠా7ద్యాః క్రోధా7ద్యా మానసా మతాః | ఆగంతవో7 భిఘాతోత్థాః సహజాః క్షుత్తృషా7దయః ||

శారీరా7గంతు నాశాయ సతతం సూర్యవాసరే | గుడా7జ్య లవణోపేతం సహిరణ్యం ద్విజాతయే ||

దద్యాచ్చ ధూపం ధర్మజ్ఞః ప్రీణయేచ్చ దివాకరమ్‌ | ఆరోగ్య మేతే నా7ప్నోతి కామాంశ్చ వనసేప్పితాన్‌ ||

సతతం దివసే చాంద్రే స్నాన మభ్యంగ పూర్వకమ్‌ | యః ప్రయచ్ఛతి విప్రాయ సో7పి రోగై ర్విముచ్యతే ||

శ##నైశ్చర దినే దత్వా తైలం విప్రేషు శక్తితః | నిత్యమేవ మహాభాగ! రోగ నాశన మాప్నుయాత్‌ ||

ఆశ్వినం సకలం మాసం ప్రత్యహం గోరసైద్ద్విజాన్‌ | భోజయిత్వా మహాభాగ! రోగ నాశన మాప్నుయాత్‌||

స్నాపయిత్వా తధా లింగం దేవ దేవస్య శూలినః | ఘృతేన పయసాచైవ సర్వరోగై ర్విముచ్యతే || 79

రేచనమందు త్రివృద్ధి (తెగడ) శ్రేష్ఠము. వమనమందు (డోకించుట) మదనము (ఉమ్మెత్త) ఆశ్చర్యము రక్తపిత్తమందు బలముత్తవరాస్నా 1. రేల సన్న రాష్ట్రము 2. సర్పాక్షియు పరమేషధులు శారీరములు, మానసములు, ఆగంతుకములు, సహజములునని వ్యాధులు నాల్గు విధములు. జ్వరము, కుష్ఠు మొదలయినవి శారీరములు. క్రోధాధులు మానసికములు ఒడలునొప్పి చెమట పలువరింతలు గగుర్పాటును అభిఘాత జ్వరము వలన పుట్టువ్యాధులు ఆగంతుకములు. ఆకలిదప్పి మెదలయినవి సహజరోగుముల. శారీరాగంతుక రోగనాశనమున కెల్లప్పుడు నాదివారము బెల్లము నెయ్యి ఉప్పు బంగారముతో బ్రాహ్మణునికి దానమిచ్చుట సూర్యునికి ధూపమిచ్చి సంప్రీతుని జేసిన మనసైన కోరికలన్నియు సఫలమగును. ఆరోగ్యము గల్గును. సోమవారమందు విప్రుని కభ్యంగ స్నానము సేయించినచో రోగముక్తిగల్గును. శనివారమందు యిథాశక్తి విప్రులకు నువ్వులనూనె నిత్యము నిచ్చిన రోగవిముక్తి గల్గును. ఆశ్వయుజమాసములో ప్రతిదినము గోరసములతో (ఆవుపాలు పెరుగు వెన్న నేతులతో) భోజనము వెట్టిన రోగహరమగును. శివలింగమున కభిషేకము పాలతో నేతితో జేసిన మనోవ్యాధులుగూడపోవును.

గాయత్ర్యా77వాహయే ద్విద్వాన్‌ దూర్వాం త్రిమధునా7ప్లుతామ్‌ | పూతశ్చ బ్రాహ్మణాశీర్భిః సర్వరోగై ర్విముచ్యతే ||

యస్మిన్‌ భే వ్యాధి మాప్నోతి కృత్వా తస్య బలిక్రియామ్‌ | భపూజా విధినా రామ! తస్మా ద్రోగా ద్విముచ్యతే ||

కర్తవ్య మథవాస్నానం తథా7రోగ్య వివర్ధనమ్‌ | ఆరోగ్యదాం ద్వితాయాం వా ప్రతిపద్యాం భృగూత్తమ! ||

కర్తవ్యం వైష్ణవం వాపి వ్రత మారోగ్య కారకమ్‌ | మానసానాం నిజానాం చ తథా చైవా7విపత్తయే ||

శరణం దేవదేవేశం ప్రజేత మధుసూదనమ్‌ | సర్వంగం తం జగన్నాథ మజయ్యం పురుషోత్తమమ్‌ ||

స్తువ న్నామ సహస్రేణ వ్యాధీ న్సర్వాన్‌ వ్యపోహతి | దోషధాతు మలా7ధారం శరీరం ప్రాణినాం ద్విజ! ||

వాతపిత్త కఫా దోషా ధాతవశ్చ తథా శృణు! | భక్తం పక్వాశయా దన్నం ద్విథా యాతి భృగూత్తమ! ||

అంశేనైకేన కిట్టత్వం రసతాం చా7పరేణ చ | కిట్టభాగో మలస్తత్ర విణ్మూత్ర స్వేద దూషకః |

నాసామలం దేహమలం తథా కర్ణమలం చ యత్‌ | రసభాగే రసం తత్ర సమ్యక్‌ శోణితతాం వ్రజేత్‌ ||

మాంసం రక్తం తతో మేదో మేదసో7స్థ్నాం చ సంభవః | అస్థ్నో మజ్జా తత శ్శుక్రం శుక్రా ద్రామ! తతో రసః ||

సర్వేషా మేవ ధాతూనాం సార మోజః ప్రకీర్తితమ్‌ | దేశం సాత్మ్యం చ యాం శక్తిం కాలం ప్రకృతి మేవ చ || 90

జ్ఞాత్వా చికిత్సితం కుర్యా ద్భేషజస్య తథా బలమ్‌ |

గాయత్రీ మంత్రముతో త్రిమధు = తేనే, నెయ్యి, పంచదారతో గలిపి గరికను ఆవాహనము చేసి బ్రాహ్మణాశీర్వాదములచే పవిత్రుడై సేవించిన, సర్వరోగవిముక్తుడగును ఏ నక్షత్రమందు రోగమారంభ##మైనదో ఆ నక్షత్రాధి దేవతకు బలిక్రియను, నక్షత్ర పూజావిధానమున చేసిన నారోగముం బాయును. లేదా ఆరోగ్యస్నానము ప్రతిపర్యమునగాని విదియనాడు కావించినను వైష్ణవ వ్రతము చేసినను ఆరోగ్య వర్ధన మగును. దేవడేవుడగు మధువైరిని శరణొందుట మనోవ్యాధికి మందు. విష్ణునామ సహస్రముతో నా సర్వాంతర్యామిని ఇగన్నాధుని అజుని పురుషోత్తముని స్తుతిచేసిన సర్వరోగాపహమగును. వ్రణుల శరీరము దోషధాతు మలములకు నిలయము. దోషములనగా వాత, పిత్త శ్లేషములు. ధాతువులు, పక్వాశయము నుండి జీర్ణమయిన అన్నము రెండు రకములగును. ఒక భాగము కిట్టము రెండవభాగము రసము నగును. కిట్టభాగము మల మూత్ర స్వేదరూపము. నాసామలము (చీమిడి) దేహమలము, చెవిలో మలము (గులివి) మలభాగములే. రసభాగమందా రసము రక్తమగును. ఆమీద మాంసము రక్తము మేదస్సునగును. మేదస్సు నుండి యెముకలు, దానినుండి మజ్జ దానినుండి శుక్రము, దానినుండి ఓజశ్శక్తి యేర్పడును. సాత్మ్యము శక్తి, ప్రకృతిని నెరింగి చికిత్స చేయవలెను. ఔషధముయొక్క బలము గూడ దానిలో గమనింపవలెను.

తిధిం రిక్తాం దినేశం చ తథైవ చ కుజా7ర్కజౌ || 91

దారుణోగ్రాణి చర్‌క్షాణి వర్జయే ద్భేషజే సదా | హరి గో ద్విజ చంద్రా7ర్క సురా7గ్నీన్‌ ప్రతిపూజ్య చ ||

శ్రుత్వా మంత్రమిమం విద్వాన్‌ భేషజా7రంభ మాచరేత్‌ | బ్రహ్మ త్ర్యక్షా7శ్విరుద్రేంద్రభూ చంద్రార్కా7నలా7నిలాః ||

ఋషయ ఓషధి గోమాతృభూత సర్గాశ్చ పాస్తు మే | రసాయన మివర్షీణాం దేవానా మమృతం యథా ||

స్వధాపితౄణాం నాగానాం భైషజ్య మిదమశ్నుతే | వాత శ్లేషాత్మకో దేశో బహు వృక్షో బహూదకః ||

అనూప ఇతి విఖ్యాతో జాంగల స్తద్వివర్జితః | కించి ద్వృక్షా7ధికోదేశ స్తథా సాధారణ స్మ్సృతః ||

జాంగలః పిత్త బహులో మధ్య స్సాధారణో మతః | రూక్షశీత7శ్చలో వాతః పిత్తముష్ణకటు ద్రవమ్‌ ||

స్థిరా7వ్లు స్నిగ్ధ మధురం బలాసం చ ప్రచక్షతే | వృద్ధిస్సమానై స్సర్వేషాం విపరీతై ర్విపర్యయః ||

సమాః స్వాద్వవ్లు లవణాః శ్లేష్మలాః వాయు నాశనాః | కటుతిక్త కషాయాశ్చ వాతలాః శ్లేష్మనాశనాః ||

కట్వవ్లు లవణాజ్ఞేయా స్తథా పిత్త వివర్ధనాః | తిక్తాః స్వాదు కషాయాశ్చ తథా పిత్త వినాశనాః || 100

ఈ రసపరిణామమైన ఓజస్సు జీవుల శరీరమందలి సర్వధాతువులయొక్క పరమసారము. వైద్యుడు దేశకాములు వైద్య మందు రిక్తతిథి ఆది మంగళ శనివారములు దారుణములు. ఉగ్రములైన నక్షత్రములను వదలిపెట్టవలెను. విష్ణువును బ్రాహ్మణసూర్య చంద్రాగ్ని దేవతలను బూజించి యీచెప్పబోవు బంత్రము విని వైద్యారంభము చేయవలెను. బ్రహ్మ త్రిలోచనుడు (శివుడు) అశ్వినీ దేవతలు ఏకాదశ రుద్రులు భూమి చంద్రార్కులు అగ్ని వాయువులు ఋషులు ఓషధులు గోవులు మాతృదేవతలు భూతసర్గమును నన్ను రక్షింతురుకాక. ఋషులు రసాయనమును దేవతలు అమృతము పితృనాగులకు స్వధాకరమునట్లీ మందును నేను బ్రాశనము చేయుచున్నారు. వాత శ్లేష్మగుణ ప్రకోపము చేయునది చాలా చెట్లు నీరు గలదియు నగు దేశమమనూపమన బడును. (మన్యము) దీనికి భిన్నమైనట్టి దేశము జాంగలము. (చెట్లు కొలదియుగానే యున్న సాధారణ ప్రదేశము) పిత్తాధికము మధ్యయము. సాధారణ మనబడును. వాతము రూక్షము, శీతము బలమునై యుండును. పిత్తము ఉష్ణము కటువు (కారము) ద్రవరూపమున స్థిరము ఆవ్లుము. (పులుపు) స్నిగ్థము మధురము నను వాని బలము సమముగా నున్న వృద్ధి. విపరీతములుగా నున్న విపర్యయము అనగా క్షయము సమములు తీపి, పులుపు. ఉప్పు శ్లేష్మములు. వాత హరములు, కటు = కారము, త్తిక = చేదు కషాయము = వగరు నను రసములు. కటులవణములు పిత్త వివర్ధనములు. చేతు తీపి కషాయములు పిత్తహరములు.

స్వభావత స్తథా కర్మ కుర్వ తే చ కుర్వన్తి భార్గవ! | శిశిరే చ వస న్తేచ నిదాఘే చ తథా క్రమాత్‌ ||

చయ ప్రకోప ప్రశమా స్తథా పిత్తస్య కీర్తితాః | నిదాఘే వారిదా రాత్రే తథా శరది భార్గవ! ||

చయ ప్రకోప ప్రశమా స్తథా వాతస్య కీర్తితాః | చయ ప్రకోప ప్రశమాః శ్లేష్మణశ్చ ప్రకీర్తితాః ||

సంవత్సరో ద్వాదశాంగో మాసభేదేన కీర్తితః ద్విధా తు మత భేదేన భూయ ఏవ ప్రకీర్తితః ||

ఆదానశ్చ విసర్గశ్చ తత్రాపి పరికీర్తితౌ | వర్షాదయో విసర్గాశ్చ హేమన్తాద్యాః స్మృతా స్త్రయః ||

మేఘ కాలే చ శరది హేమన్తే చ యథా క్రమాత్‌ | చచ ప్రకోప ప్రశమ స్తథా పిత్తస్య కీర్తితః ||

శిశిరాద్యా స్తథా೭೭దానం గ్రీష్మాన్త ఋతువస్త్రాయః | సౌమ్యో విసర్గ స్త్వాదానం చాగ్నేయం పరికీర్తితమ్‌ ||

వర్షాదీన్‌స్త్రీ నృతూ న్రామ ! చతుః పర్యాయ గోరసాన్‌ | వివర్ధయే త్తథా తిక్త కషాయ కటుకాన్‌ క్రమాత్‌ ||

యథా రజన్యో వర్ధన్తే బలమేవం వివర్ధతే | క్రమశోథ మనుష్యాణాం హీయమానాసు హీయతే ||

రాత్రిభుక్తం దినాన్తేతు దివ సస్య తథైవ చ | ఆది మధ్యావసానేషు కఫ పిత్త సమీరణాః || 110

ప్రకోపం యాన్తి కోపాదౌ కాలే యేషాం చయ స్యృతః | ప్రకోపాన్తరజే కాలే శమ స్తేషాం ప్రకీర్తితః ||

ఆయా గుణములు మూడును స్వభావముగ నిట్లు పనిచేయు చుండును. పిత్తగుణ ప్రకోపము శిశిరవసస్త గ్రీష్మములందు క్రమముగా పిత్తమునకు చయము = సంకోచము ప్రకోపము పెరుగుదల ప్రశమము తగ్గుదల వరుగును. గ్రీష్మమందు వర్ష రాత్రులందు వాతమునకు చయ ప్రకోప శమములు. శరదృతువునందు శ్లేష్మమునకు చయ ప్రకోప శమములు. సంవత్సరము నెలలంబట్టి పండ్రెండు విభాగము లయినది. మతభేదము ననుసరించి యవి రెండేరకము లయునవి. ఒకటి ఆదాన కాలము రెండవది విసర్గ కాలము. వర్షర్తువు మొదలారుమాసములు విసర్గకాలము. హేమంత ఋతువు నుంచి యారు నెలలు ఆదాన కాలము. వర్షశరద్ధేమంతము లందు వరుసగా పిత్తమునకు చయము ప్రకోపము ప్రశమము జరుగును. శిశిర్తువు నుంచి గ్రీష్మము దాక మూడు ఋతువులాదాన కాలము. ఈ విసర్గము, సౌమ్యము, ఆదానమునూ ఆగ్నేయ మనియుం చెప్పబడినది. వర్షర్తువు మొదలు మూడు ఋతువులందు ఆవుపాలు మొదలైన వానిని నాల్గుమార్లు తీసికొనవలెను. తిక్త కషాయ కటురసములను బెంచుకొనవలెను. రాత్రి ప్రొద్దెక్కు వైనట్లే బలముకూడ యిందు బెరుగును. రాత్రిప్రొద్దు తక్కువైన కొలది మానవులకు బలముకూడ తగ్గును. రాత్రి తిన్నది దినాంతమందు పగలు తిన్నది ఆప్రకారముగానే జీర్ణమగును. ఏ ప్రకోపమున దేని కుపచయమో దానికి ప్రకోపమని చెప్పబడినది. ప్రకోపాంతర కాలమున వాటికి శమము చెప్పబడినది.

అతిభోజనతో రామ! తథా చాభోజ నేన చ | సర్వేపి రోగా జాయన్తే వేగోదీరణధారణౖః || 112

అన్నేన కుక్షేర్ద్వాం శౌ పానేనైకం ప్రపూరయేత్‌ | ఆశ్రయం పవనాదీనాం తథైవ మవశేషయేత్‌ ||

వ్యాధే ర్నిదానస్య తథా విపరీత మథౌషధమ్‌ | కర్తవ్య మేత దేవాత్ర మయా సార్ధం ప్రకీర్తితమ్‌ ||

నాభే రూర్ధ్వ మథ శ్చైవ గుద శ్రోణ్యో స్తథైవచ | బలాస పిత్త వాతానం దేహే స్థానం ప్రకీర్తితమ్‌ ||

తథా పి సర్వగా ఏతే దేహే వాయు ర్విశేషతః | దేహస్య మధ్యే హృధయం స్థానం తు మనసః స్మృతమ్‌ ||

కృశోల్పకేశ శ్చపలో బహువా గ్విషమానలః | వ్యోమగశ్చ తథా స్వప్నే వాత ప్రకృతి రుచ్యతే ||

అకాల పలితః క్రోధీ ప్రస్వేదీ మధుర ప్రియః | స్నప్నేచ దీప్తిమత్‌ ప్రేక్షీ పిత్త ప్రకృతి రుచ్యతే ||

దృఢాంగః స్థిర చిత్తశ్చ సుప్రజః స్థిరమూర్థజః | శుక్లాంబు దర్శీ స్వప్నే చ కఫ ప్రకృతికో నరః || 119

అతిభోజనముచే అభోజనమువలనను మలమూత్రాది (వేగ) ధారణముచేతను సర్వరోగములు గల్గును. అన్నముతో కడుపు రెండు భాగములను పానముతో (మంచినీళ్ళతో) నొక భాగము నింపవలెను. వాతాదుల కాశ్రయముగా కడుపును కాళీగానుంచవలెను. వ్యాధి నిదానము వ్యాధి వైపరీత్యము అక్కడ వాడవలసిన మందును నేనిప్పుడు చెప్పబోవు విధానమున నొనరింపవలెను. దేహమందు నాభికి మీద దిగవను గుదము పిఱుదు శ్లేష పిత్తవాతములుండు స్థానములు అయినా ఈ గుణములు దేహమంతా వ్యాపించి యుండును. అందులో వాయువు సర్వవ్యాపకము, దేహమునడుమ హృదయము మనస్సుండుచోటు. చిక్కినవాడు జుట్టు తక్కువ గలవాడు, చపలుడు, వదరుబోతు. జఠరాగ్ని విషమమున నుండువాడు కలలో నాకాశమున దిరుగుచున్నట్లుండు వాడు. వాతప్రకృతికుడు ఆకాలమున తలనెరసిన వాడు కోపి. చెమట హెచ్చుగ గలవాడు తీపి ఎక్కువ ఇష్టపఢు వాడు కలలో కాంతికల వస్తువులమ చూచువాడు పిత్త (పైత్య) ప్రకృతి వాడు. దృఢశరీరి స్థిరచిత్తుడు మంచి సంతానవంతుడు జుట్లు నిలకడగా నుండువాడు కలలో తెల్లని నీళ్ళు చూచువాడు కఫ (శ్లేష) ప్రకృతివాడు.

తామసా రాజసా శ్చైవ సాత్త్వికాశ్చ తథా స్మృతాః | మానుషా భృగు శార్దూలః వాత పిత్త కఫాధికాః || 120

రూక్షశీత వ్యవాయాధ్వగురు కర్మ ప్రవర్తతే | కదన్నభోజనా ద్వాయు ర్దేహే శోకాచ్చ కుప్యతి ||

విదాహినాం తథోష్ణానా ముచ్చై రధ్వనిషేవిణామ్‌ | పిత్తం ప్రకోప మాయాతి భ##యేన చ తథా ద్విజ! ||

అత్యంబు పాన విషమ భోజినాం భువి శాయినామ్‌ | శ్లేష్మాః ప్రకోప మాయాంతి తథా యే చాల్ప భోజనాః ||

వాతపిత్తకఫోత్థాని సర్వరోగాణి దేహినామ్‌ | లక్షయే ల్లక్షణం విద్వాన్‌ శమయే త్తదనన్తరమ్‌ ||

అస్థి భంగః కషాయత్వ మాస్యే శుష్కాస్యతా తథా | జృంభణం లోమ హర్షశ్చ వాతిక వ్యాధి లక్షణమ్‌ ||

నఖ నేత్ర శిరాణాం గ పీతతా కటుతా ముఖే | తృష్ణా దాహోవ్లుతా చైవ పిత్త వ్యాధి నిదర్శనమ్‌ ||

ఆలస్యం చ ప్రసేకశ్చ గురుతా మథురాస్యతా | ఉష్ణాభిలషితా చేతి శ్లైష్మికం వ్యాధి లక్షణమ్‌ ||

స్నిగ్ధోష్ణ మన్నం ససుఖా చ శయ్యా | మనోనుకూలా స్సుహృదః కథాశ్చ |

అభ్యంజనం చాప్యతి తైలపానమ్‌ | వాత ప్రకోప ప్రశయామ్‌ దృష్టమ్‌ ||

సరాంసి వాప్యః సరిత స్సుశీతాః | చందాంశవః చందన పంకలేపాః |

సంసేవితేనాశు సమం ప్రయాతి | విలాస మగ్ర్యం మనసః ప్రహర్షాత్‌ ||

సర్వామయార్తి ప్రశమార్థమేకామ్‌ | త్వమౌషధీం రామ! నిబోధ గుహ్యామ్‌ ||

భక్తిః ప్రభో ర్దేవ వరస్య విష్ణోః | యా సర్వకామైః పురుషం యునక్తి ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పురుష చికిత్సానామ షట్పంచాశత్తమోధ్యాయః.

తామసరాజస సాత్త్వికులని వరుసగా వాతపిత్తకఫాధిక ప్రకృతులు చెప్పబడుదురు. శరీరమందు వాతము ప్రకోపించుటకు కారణములు మిక్కిలివేడి చేయుట శైత్యము, మైధునము, మార్గాయాసము, బరువైనపనులు, పాడుతిండి, శోకమువిదాహులు శరీరమెక్కువ వేడిగానుండువారు, ఎక్కువ ప్రయాణము సేయువారు, భణస్వభావులు పిత్తాధికులు, నీరు ఎక్కువగా త్రావుట విషమ భోజనము నేలపై బరుండుట అల్పభోజనము సేయిట శ్లేష్మప కోప స్వభావము. మొత్తము దేహుల రోగములీ మూడు గుణముల వలననే జనించునని లక్షణమెరిగి (నిదానముతెలిసి) చికిత్స చేయవలెను. ఎముకలనొప్పులు. నోరు వగరు చేదు నోరెండుట ఆవులింతలు మేని గగుర్పాటుననునవి వాతరోగ లక్షణములు. గోళ్ళుకండ్లు నరాలు పసుపుపచ్చగానుండుట నోటినుకటుత్వము దుర్వాసన దాహము పులుపు (పులిత్రేణువులువచ్చుట) పిత్తవ్యాధి లక్షణము. అలసత్వము (సోమరితనము) ఒడలు చెమటపట్టుట బరువెక్కుట నోరు తీపెక్కుట, ఉష్ణాభిలాష (వెచ్చనగోరుట) శ్లేష్మవ్యాధి లక్షణములు. స్నిగ్ధము ఉష్ణము చమురుగలదినైనయన్నము సుఖమైన శయ్య మనసుకనుకూలురైన స్నేహితులు వారుచెప్పు కథలు అభ్యంగము నూనె విశేషముగా త్రాగుట ననునవి వాత ప్రశమనసాధనములు. మిక్కిలి చల్లని నూతులు సరస్సులు నదులు వెన్నెలలు మంచిగంధపుపూతలు మనస్సునకు పరమావధి ప్రహర్షముగూర్చు విలాసము. సర్వవ్యాధి ప్రశమనములు గడురహస్యమై అంతకంటె నది వెరింగికొనుము. అది దేవ దేవోత్తముడు ప్రభువునగు విష్ణవుపై భక్తియే మూలికే. అది పురుషుని సర్వాభీష్టసంపన్నుని జేయును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పురుష చికిత్సయను నేబదియారవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters