Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదినాలుగవ యధ్యాయము - పుత్రీయ సప్తమీ వ్రతము

పుష్కరః :మారశీర్షే శుఖే మాసి శుక్లపక్షే ద్విజోతమ! | పుత్రీయాం సప్తమీం రామ! గృహ్ణీయాత్ప్రయతశ్శుచిః ||

అథవా పుత్రకామా స్త్రీ విధినా యేన తచ్ఛృణుః | హవిష్యా7శీ శిరస్స్నాతః కృత్వా బ్రాహ్మణ పూజనమ్‌ ||

అథశ్శాయీ ద్వితీయే7హ్ని గోవిషాణోదకేన చ | స్నాత్వోపవిశ్య చ తథా శుభే దేశేతు మండలమ్‌ ||

తత్రా7ష్ట వ్రతం కమలం విన్యసే ద్వర్ణకైశ్శుభైః | తసై#్యవ కర్ణికా మధ్యే భాస్కరం చందనేన తు ||

రక్తేన పూజయే ద్దేవం గంధమాల్యాను లేపనైః | భ##క్ష్యైర్భోజ్యై స్తథాపేయై ర్దూపై రీపై స్థథైవ చ ||

ఏవం సంపూజనం కృత్వా సర్వకామ ప్రదస్యత తు | నక్తం భుంజీత ధర్మజ్ఞ! సర్వకర్మ వివర్జితః ||

దంతోలూఖలతో భూత్వా కృత్వా సంవత్సర వ్రమ్‌ | వ్రతా7వసానే దాతవ్యా శక్త్యా బ్రాహ్ణ దక్షిణా ||

తథా త్రి మధురప్రాయం కవ్యం ద్విజభోజనమ్‌ | అధశ్శాయ్య నిశం తాం చ భూయ ఏవ తథా భ##లేత్‌ |

పుత్రీయ మేతద్ర్వత ముత్తమం తే | మయోదితం కల్మష నాశకారి |

ఆరాధనం దేవవరస్య రామ! | సర్వా7మయఘ్నంచ తథైతదుక్తమ్‌ || 9

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పుత్రీయ సప్తమీ వ్రతం నామ చతుష్పంచాశత్తమో7ధ్యాయః

పుష్కరుడనియె : శుభకరమయిన మార్గశిరమాస శుక్లపక్షమునందు పుత్రీయ సప్తమీవ్రతమును పురుషుడు శుచియై పట్టవలెను. పుత్రకామియైన స్త్రీయైనను సరియే. హవిష్యము నారగించి శిరఃస్నానము చేసి, బ్రాహ్మణుని బూజింపవలెను. క్రింద పరుండి, రెండవరోజున ఆవుకొమ్మునందలి యుదకముతో స్నానముచేసి, శుభప్రదేశమందు గూర్చుండి, మండలము సేసి, యందష్ట దళ పద్మమును పలు రంగులతో జిత్రించి, దాని కర్ణికయందు రక్తచందనముతో, సూర్యునికి షోడశోపచారపూజ చేయవలెను. సర్వకామప్రదుడగు సూర్యు నట్లు పూజించి సర్వకర్మ వర్జితుడై నొక భోజనము సేయవలెను. దంతములే యులూఖములుగా గలవాడై (అపక్వాహారము సేవించయువాడై) సంవత్సర మీ వ్రతము సేసి ఉద్యాపనమందు బ్రాహ్మణునికి యథాశక్తి దక్షిణ యీయవలెను. ద్విజులకు త్రిమధురముగ బెల్లము పంచదార తేనెలతోడి పిండి వంటలతో భోజనము పెట్టవలెను. రాత్రి క్రిందనే పరుండవలెను. పాపహారియగు పుత్రీయ వ్రతమిది. నీకు దెల్పితిని. దేవరుడైన భాస్కరు నారాధన మిది సర్వామయహరము.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పుత్రీయ సప్తమీవ్రత మను నేబదినాల్గవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters